chodavaram
-
బరిలో ఉరకలు వేసే ఉత్సాహం
చోడవరం: ధాన్య, ధన రాశులతో తులతూగుతూ రైతులు ఆనందంగా ఉన్న రోజుల్లో వచ్చే సంక్రాంతి పండగ ఎన్నో సంప్రదాయ, సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటలకు నెలవుగా ఉంటుంది. ఎన్నో పల్లె సంప్రదాయాలు కనుమరుగవుతున్నప్పటికీ ఇప్పటికీ పల్లె క్రీడలు కొన్ని జనాన్ని అలరిస్తూనే ఉన్నాయి. వీటిలో ప్రధానంగా ఎడ్లబళ్ల పోటీఉ, కోడిపందాలు, గుర్రాల పరుగు పోటీలు పల్లెల్లో సంక్రాంతి శోభను ఇనుమడింపజేస్తాయి. కోడిపందాలపై నిషేధం విధించడంతో సంక్రాంతి పండగంతా ఎడ్ల బళ్ల పరుగు పోటీల వైపే ఆసక్తిగా చూస్తుంది. కనుమ పండగ నుంచి ప్రారంభమయ్యే ఈ ఎడ్ల బళ్ల పోటీలు తీర్ధాలు, గ్రామదేవల పండగల సందర్భంగా కూడా నిర్వహిస్తారు. పెద్దపండగ వచ్చిందంటే ఎడ్లబళ్ల పోటీల కోసం జనం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తుంటారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎడ్లబళ్ల పోటీలు ప్రధానంగా చోడవరం, మాడుగుల పరిసర మండలాలైన దేవరాపల్లి, కె.కోటపాడు, చీడికాడ, వూడుగుల, సబ్బవరం, చోడవరం, బుచ్చెయ్యపేట, రోలుగుంట, రావికమతం మండలాల్లో జరిగేవి. క్రమేణా రాంబిల్లి, అచ్యుతాపురం, యలమంచిలి, నక్కపల్లి, కశింకోట, అనకాపల్లి, నర్సీపట్నం, పాయకరావుపేట, కోటవురట్ల తదితర మండలాలకు విస్తరించాయి.కొందరైతే ప్రత్యేకంగా ఈ సంక్రాంతిలో ఎడ్ల బళ్ల పోటీల కోసమే ఒంగోలు, మైసూర్‌తో పలు మేలుజాతి ఎడ్లను లక్షలాది రూపాయలు ఖర్చుచేసి మరీ కొనుగోలు చేసి వాటికి శిక్షణ ఇస్తారు. హింస, జూదానికి తావు లేకుండా కేవలం ఆటవిడుపుగా ఉల్లాసంగా ప్రతి ఒక్కరిలోనూ ఆనందాన్ని నింపే విధంగా గెలుపే లక్ష్యంగా పోటీ ప్రతిష్టతో నిర్వహించే ఈ ఎడ్ల బళ్ల పరుగుల పోటీలు క్రీడాస్ఫూర్తితో జరుగుతాయి. అందుకే ఈ పోటీలకు ప్రజల నుంచి విశేష స్పందన ఉంటుంది. సుదూర ప్రాంతాల నుంచి కూడా ఈ పోటీల సమయానికి సందర్శకులు చేరుకుని ఉత్సాహంగా పోటీలను తిలకిస్తారు. పోటీలు ఇలా... పందెంలో పాల్గొనే ఎడ్ల (జత)ను ఎంట్రీల ప్రకారం వరుస నంబర్లు వేసి తేలికపాటి ఎడ్లబళ్లకు ఎద్దులను బూసి పరుగెత్తిస్తారు. ఒక్కో బండి నిర్వహణకు ఇద్దరు వునుషులు ఉంటారు. ఏ ఎడ్లబండి తక్కువ సమయంలో నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకొని తిరిగి వస్తుందో ఆ ఎద్దులు విజయం సాధించినట్టుగా పరిగణిస్తారు. కొన్ని ప్రదేశాల్లో నాలుగైదు ఎడ్లబళ్లను ఒకేసారి మైదానంలో ఉంచి పరుగుల పోటీ నిర్వహిస్తారు. ఈ తరహా పోటీలు తక్కువగా ఉండగా ఒక్కో బండి పరుగుతీసే పోటీలే ఎక్కువగా జరుగుతుంటాయి. పోటీలో గెలుపొందిన ఎద్దులకు ముందుగా నిర్ధేశించిన పారితోషకాన్ని బహుమతిగా ఇస్తారు. పోటీలో పాల్గొనే ఎడ్లబళ్లు వుంచి వయస్సులో మేలుజాతి హుషారైన ఎద్దులను ఈ పోటీలకు దించుతారు. పందెం సమయంలో బండి బోల్తా పడినా ఎద్దులకు గానీ ఎవరికీ పెద్దగా ప్రమాదం కలగజేయకుండా ఉండే తేలికపాటి బళ్లను ఉపాయోగిస్తారు. ఈ పోటీల కోసం తేలికగా ఉండి ప్రత్యేకంగా బేరింగ్లు వేసిన చక్రాలను ఈ బళ్లకు ఏర్పాటు చేస్తారు. ఒక వేళ పోటీల్లో బండి బోల్తా పడినా వెంటనే నిర్వాహకుడు బండి తిరిగి లేపి పరుగు తీసే విధంగా అత్యంత తేలిగ్గా బండి తయారు చేస్తారు. పోటీలకు ఆటస్థలం రైతుతో ముడిపడి నిత్యం రైతుతోనే కలిసి ఉండే ఎడ్లబండితోఎద్దులు పరుగెత్తే ఈ పోటీలో పాఠశాలల్లోను, ఆట స్థలాల్లోను నిర్వహించరు. ఎద్దులు, రైతులు నిత్యం కలియతిరిగే పంట పొలాల్లోనే ఈ పోటీలు నిర్వహిస్తారు. జనవరి నెల ప్రారంభానికి ఖరీఫ్ వరిపంట కోతలు పూర్తవ్వడంతో చాలా పొలాల్లో సంక్రాంతి పండగ జరిగే వరకు ఏ పంట వేయరు. దీంతో కోతలు జరిగిపోయి ఖాళీగా ఉన్న పొలాలను నిర్దేశించిన లక్ష్యం మేర పొలాల మడుల మధ్య ఉన్న గట్లను తొలగించి ఎడ్లపందాలు నిర్వహిస్తారు. కొన్ని గ్రామాల్లో సమీపంలో నీరులేని సాగునీటి చెరువుల్లో కూడా నిర్వహిస్తారు. రైతులంతా పిల్లా పాపలతో ఉరకలెత్తుతున్న ఎడ్లను తిలకించి వాటికి మరింత ప్రోత్సాహం ఇస్తూ చప్పట్లు కొడుతూ ప్రదర్వనను ఆస్వాదిస్తారు. పోటీలు నిర్వహించే టప్పుడు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందుగా అన్ని ఏర్పాట్లు నిర్వాహకులు చేస్తారు. ఎన్నో బహుమతులు గెలుచుకున్నా... నేను పొలం పనులతో పాటు ఎడ్ల బళ్ల పోటీలపై ప్రధానంగా దృష్టి పెట్టి మేలు జాతి ఎద్దులను పెంచుతున్నాను. నా దగ్గర రెండు జతల మేలు జాతి ఎద్దులు ఉన్నాయి. వీటి పెంపకానికి రోజూ భారీగానే ఖర్చవుతుంది. ఏటా జరిగే పందాల్లో 80 నుంచి 110 వరకు పోటీల్లో నా ఎద్దులు ఎక్కువసార్లు మొదటి బహుమతులు తెచ్చాయి. జిల్లా, ఉత్తరాంధ్ర, ఉభయగోదావరితోపాటు రాష్ట్ర స్థాయి పోటీల్లో సైతం నా ఎద్దులు బహుమతులు గెలుచుకున్నాయి. గతేడాది తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీలో వరుసగా మొదటి, రెండో బహుమతులు గెలుచుకున్నాయి. –లెక్కల సత్తిబాబు, లెక్కలవానిపాలెం, చోడవరంపెంపకంలో జాగ్రత్తలు వ్యవసాయంలో నాతో కలిసి జీవించే ఎద్దులు పోటీల్లో పరుగులు తీస్తుంటే ఆ ఆనందం చెప్పలేను. రూ.లక్షా 60వేలుపెట్టి ఎద్దులు కొన్నాను. వీటి పెంపకంలో చాలా జాగ్రత్తలు తీసుకొంటాను. మంచి పోషాకాహారంతోపాటు పరిసరాల పరిశుభ్రత కూడా చాలా అవసరం. ఇప్పటి వరకు అనేక పందాల్లో బహుమతులు సాధించాను. ఈ ఏడాది మరిన్ని పోటీలు గెలవాలని ఉత్సాహంగా ఉన్నాను. –ముమ్మిన రామకృష్ణ, ఎడ్లపెంపకందారుడు, నర్సయ్యపేట -
సీఎం జగన్ చోడవరం సభకు హాజరైన జనప్రవాహం (ఫొటోలు)
-
చంద్రబాబుపై సిఎం జగన్ నాన్ స్టాప్ పంచులు
-
చోడవరంలో సింహగర్జన.. దద్దరిల్లిన సీఎం జగన్ స్పీచ్
-
వీళ్ళే మన అభ్యర్థులు.. గెలిపించాల్సిన బాధ్యత మీదే
-
సీఎం జగన్ హెలికాప్టర్ ల్యాండింగ్ విజువల్స్
-
మళ్ళీ మీ జగన్ కే అధికారం ఎందుకు ఇవ్వాలో చెబుతాను..!
-
చంద్రబాబుని నమ్మితే గోవిందా.. గోవిందా!: సీఎం జగన్
అనకాపల్లి, సాక్షి: చంద్రబాబుని నమ్మడం అంటే కొండచిలువ నోట్లో తల పెట్టినట్లేనని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. జరగబోయే ఎన్నికలు ప్రజాప్రతినిధుల్ని ఎన్నుకునేవి మాత్రమే కాదు.. ఇంటింటి అభివృద్ధి, పేదల తలరాతల్ని నిర్ణయించబోయే ఎన్నికలని ప్రతీ ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు.ఎన్నికల ప్రచార భేరీలో భాగంగా రెండో రోజు సోమవారం ఉత్తరాంధ్ర అనకాపల్లి జిల్లా చోడవరం కొత్తూరు జంక్షన్లో నిర్వహించిన ప్రచార సభలో సీఎం జగన్ మాట్లాడారు.‘‘జగన్‌కు ఓటేస్తే పథకాలన్నీ కొనసాగుతాయి. పొరపాటున చంద్రబాబుకి ఓటేస్తే పథకాలన్నీ ఆగిపోతాయి. అంటే.. మళ్లీ మోసపోవడమే. చంద్రబాబు గత చరిత్ర చెబుతున్న సత్యం ఇది. పేదల వ్యతిరేకుల్ని ఓడించేందుకు చోడవరం సిద్ధమా? అని పార్టీ శ్రేణుల్ని, అభిమాన గణాన్ని ఉద్దేశించి గర్జించారు సీఎం జగన్.(అందుకు సిద్ధం అని సమాధానం వచ్చింది)మళ్లీ మోసం చేసేందుకు చంద్రబాబు సాధ్యం కాని హామీలు ఇస్తున్నారు. ఒక బిందెడు పన్నీరు తీసుకెళ్లి బూడిదలో పోస్తే ఏమవుతుంది?.. గోవిందా.. గోవిందా.. ఇది ఆ తిరుపతిలో స్వామివారికి చెప్పే గోవిందా.. గోవిందా కాదు. చంద్రబాబు మోసానికి ప్రజలు ఎంతలా అతలాకుతలం అయ్యారో చెప్పే గోవిందా.. గోవిందా.రుణమాఫీ అంటూ రైతుల్ని మోసం చేశారు. డ్వాక్రా రుణమాఫీల పేరుతో మోసం చేశారు. 2014 ఎన్నికలకు ముందు జాబ్ రావాలంటే బాబు రావాలంటూ మోసం చేశారు. తన పాలనలో చంద్రబాబు కనీసం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. గోవిందా.. గోవిందా. 2014 టైంలో ఇదే కూటమి మన ముందుకు వచ్చింది. హామీల పేరుతో పెద్ద మోసం చేసింది. ఇప్పుడు ఇంటింటికీ కేజీ బంగారం, బెంజ్ కారు అంటున్న చంద్రబాబును నమ్మొచ్చా?.బాబు అధికారంలో ఉంటే వర్షాలు గోవిందా.. రిజర్వాయర్లలో నీళ్లు గోవిందా. ఓటుకు నోటుకేసులో అడ్డంగా దొరికిపోయి.. మన రాజధాని గోవిందా. గ్రాఫిక్స్ రాజధాని కూడా గోవిందా.. గోవిందా. సింగపూర్‌ను మించిన రాజధాని అంటూ విశాఖను వదిలేశారు. కేంద్రంతో రాజీ పడి.. ప్రత్యేక హోదా గోవిందా.. గోవిందా. 14 ఏళ్లు సీఎంగా పని చేసిన చంద్రబాబు పేరు చెబితే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకు వస్తుందా?. ఈ ఎన్నికలు వచ్చే ఐదేళ్ల భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలని, అభివృద్ధి-సంక్షేమాల విషయంలో గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి తేడా గమనించి జాగ్రత్తగా ఓటేయాలని, ఎవరు అధికారంలో ఉంటే మంచి జరిగిందో ఆలోచన చేయండని సీఎం జగన్, చోడవరం వేదికగా ప్రజలకు పిలుపు ఇచ్చారు. -
చోడవరం చేరుకున్న సీఎం వైఎస్ జగన్
-
Watch Live: చోడవరంలో సీఎం జగన్ ప్రచార సభ
-
బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ పై కేసు నమోదు
-
అనకాపల్లి చోడవరంలో కూటమి అభ్యర్థి సీఎం రమేష్ దాదాగిరి
-
రెచ్చిపోయిన సీఎం రమేష్...ప్రభుత్వ అధికారులపై రౌడీయిజం
-
చంద్రబాబుకు చోడవరం టీడీపీ నేతలు వార్నింగ్
-
చోడవరం చక్కెర కర్మాగారం రైతులకు ఏపీ సర్కార్ శుభవార్త
సాక్షి, అనకాపల్లి జిల్లా: చోడవరం చక్కెర కర్మాగారం రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. షుగర్ ఫ్యాక్టరీకి గ్రాంట్ రూపంలో రూ.12 కోట్ల 30 లక్షల రూపాయల నిధులు ప్రభుత్వం విడుదల చేసింది. చెరుకు రైతుల బాకీల నిమిత్తం రూ.9 కోట్ల 30 లక్షల రూపాయలు, కార్మికుల జీతాల పెండింగ్ బిల్లుల కోసం మూడు కోట్ల రూపాయలు గ్రాండ్ రూపంలో ప్రభుత్వం విడుదల చేసింది. నిధులు విడుదల పట్ల రైతులు, కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌కు చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ధన్యవాదాలు తెలిపారు. -
చోడవరంలో సాధికార స్వరం
సాక్షి, అనకాపల్లి: అనకాపలి జిల్లా చోడవరంలో మంగళవారం సాధికార నినాదం హోరెత్తింది. వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఆర్థికంగా, సామాజికంగా సాధికారత సాధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు నియోజకవర్గంలో కదం తొక్కాయి. వైఎస్సార్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్రను విజయవంతం చేశాయి. ఇది బడుగు, బలహీన వర్గాల విజయయాత్రలా సాగింది. యువత బైక్ ర్యాలీతో సందడి చేశారు. వందలాది బైక్‌లు, కార్లు, ఆటోలతో ప్రారంభమైన బస్సు యాత్రలో నియోజకవర్గంలో చేపట్టిన సంక్షేమం, అభివృద్ధిని వివరించారు. కొత్తకోట జెడ్పీ హైస్కూల్లో నాడు–నేడు ద్వారా జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. బుచ్చెయ్యపేటలో జల్‌జీవన్ మిషన్‌ను ప్రారంభించారు. అనంతరం వేలాదిమందితో వడ్డాదిలో భారీ బహిరంగ సభ జరిగింది. జయహో జగన్ అంటూ పెద్ద సంఖ్యలో ప్రజలు నినదించారు. పేదల స్థితిగతులు మార్చిన సీఎం జగన్: మంత్రి ధర్మాన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అనేక సంక్షేమ పథకాలతో రాష్ట్రంలో పేదల స్థితిగతులను మార్చారని, ఆర్థికంగా బలోపేతం చేసి సంఘంలో గౌరవాన్ని పెంచారని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాల రూపంలో రూ.2.60 లక్షల కోట్లు పేదల ఖాతాల్లో సీఎం జమ చేశారని తెలిపారు. అవినీతికి తావు లేకుండా పాలన అందిస్తున్నారన్నారు. టీడీపీ హయాంలో రాష్ట్రంలో వ్యవసాయం దయనీయంగా ఉండేదని, వ్యవసాయ వృద్ధి రేట్లో 16వ స్థానంలో ఉండేదని తెలిపారు. సీఎం జగన్ వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి, రైతులకు అండదండలందించారని, దాంతో వ్యవసాయ రంగంలో ఏపీ 4వ స్థానానికి ఎదిగిందని వివరించారు. కోట్లాది రైతులు, పేదల కుటుంబాలలో వెలుగులు నింపిన వైఎస్ జగన్‌ను మళ్లీ సీఎంను చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వేదికపై ప్రసంగిస్తున్న మంత్రి కారుమూరి జగన్ పథకాలతో పేదరికం తగ్గింది : ఎంపీ నందిగం సురేష్ వైఎస్ జగన్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలతో రాష్ట్రంలో పేదరికం తగ్గిందని ఎంపీ నందిగం సురేష్ చెప్పారు. అమెరికా అధ్యక్షుడు వస్తే అప్పటి సీఎం చంద్రబాబు బిచ్చగాళ్లను దాచిపెట్టారని, ఇలా పేదరికాన్ని దాచకూడదని, తగ్గించాలని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను అందించడం ద్వారా సీఎం జగన్ పేదరికాన్ని రూపుమాపుతున్నారని అన్నారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను సీఎం జగన్ అభివృద్ధి పథంలో నడిపిస్తున్న తీరు అద్భుతమని చెప్పారు. దళిత రైతు బిడ్డనైన తనను సీఎం జగన్ ఢిల్లీలో ప్రధానమంత్రి పక్కన కూర్చోబెట్టారన్నారు. ఒకప్పుడు ఏ ప్రధానిని చూడాలనుకున్నానో.. అదే ప్రధాని పక్కన కూర్చున్నానంటే ఇది కాదా సామాజిక సాధికారత అని అన్నారు. ఒంటరిగా పోరాటం చేసిన దళిత బిడ్డ బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా పవన్‌కు తెలంగాణలో రాలేదని, వారు వచ్చే ఎన్నికల్లో ఏమి సాధిస్తారని ప్రశ్నించారు. అందరి సంక్షేమమే సీఎం జగన్ ధ్యేయం: మంత్రి కారుమూరి రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ధ్యేయమని పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు చెప్పారు. సీఎం జగన్ సంక్షేమాన్ని అందించడంలో కుల, మత, పార్టీ, ప్రాంతీయ భేదాలు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ పైసా అవినీతికి తావు లేకుండా సంక్షేమాన్ని అందిస్తున్నారన్నారు. డిప్యూటీ సీఎం రాజన్న దొర మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లోని ప్రతి ఒక్కరూ సైనికుల్లా ముందుకు కదిలి మరోసారి జగన్‌ను సీఎంగా ఎన్నుకోవాలన్నారు. చోడవరంలో రూ.1,900 కోట్లతో సంక్షేమం, అభివృద్ధి : కరణం ధర్మశ్రీ ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ.. సీఎం జగన్ చోడవరం నియోజకవర్గంలో 90 శాతం రాజకీయ, నామినేటెడ్ పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకే అందించారన్నారు. నియోజకవర్గంలో సంక్షేమం, అభివృద్ధికి రూ.1,900 కోట్లు ఖర్చు చేశారన్నారు. ప్రధానంగా రూ.80 కోట్లతో రోడ్లు, నాడు – నేడు ద్వారా రూ.87 కోట్లు విద్యా రంగంలో ఖర్చు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, అనకాపల్లి ఎంపీ భీశెట్టి వెంకట సత్యవతి, ఎమ్మెల్యేలు పెట్ల ఉమాశంకర్ గణేష్, గొల్ల బాబురావు, తిప్పల నాగిరెడ్డి, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి పాల్గొన్నారు. -
చంద్రబాబుకు తెలిసింది వెన్నుపోటు రాజకీయం మాత్రమే
-
‘చోడవరం’లో గ్రీన్ ఫీల్డ్ ఇథనాల్ ప్లాంట్
సాక్షి, అమరావతి: ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సహకార చక్కెర కర్మాగారాలను తిరిగి బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందులో భాగంగా పంచదార ఉత్పత్తికంటే అధికాదాయాన్నిచ్చే బయో ఇథనాల్ ఉత్పత్తిని పెద్ద ఎత్తున ప్రోత్సహించేలా చర్యలు తీసుకుంటోంది. తద్వారా చెరకు రైతులను అన్ని విధాలా ఆదుకోనుంది. తొలి దశలో అనకాపల్లి జిల్లా చోడవరంలోని చోడవరం సహకార సంఘ చక్కెర కర్మాగారంలో గ్రీన్ ఫీల్డ్ బయో ఇథనాల్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రోజుకు 60 కిలోలీటర్ల ఇథనాల్‌ను ఉత్పత్తి చేసేలా ఈ యూనిట్ ఏర్పాటుకానుంది. చోడవరం చక్కెర కర్మాగారంలో బయో ఇథనాల్ యూనిట్ ఏర్పాటుకు సంబంధించి కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి కోసం దరఖాస్తు చేయగా.. జూలై 10న అనుమతులు మంజూరు చేసి పూర్తిస్థాయి ప్రాజెక్టు నివేదికను పంపాల్సిందిగా కేంద్రం కోరింది. ఈ మేరకు రాష్ట్ర పరిశ్రమల శాఖ పూర్తిస్థాయి ప్రాజెక్టు నివేదిక కోసం కన్సల్టెన్సీ సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానించింది. ప్రాజెక్టు ఎంత వ్యయం అవుతుంది.. ముడిపదార్థాలు ఎంత అవసరం.. ఆదాయం.. రుణం ఎంత కాలంలో తీర్చగలం? వంటి అన్ని అంశాలతో ఈ నివేదికను తయారు చేయాల్సిందిగా కోరింది. ఆసక్తి గల సంస్థలు ఆగస్టు 28లోగా దాఖలు చేయాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం ముడి చమురు దిగుమతులను తగ్గించుకోవడానికి పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమాన్ని కలిపి వినియోగించుకోవాలని నిర్ణయించింది. ఇప్పటికే లీటరు పెట్రోలో 10 శాతం ఇథనాల్ కలుపుతుండగా, ఈ మొత్తాన్ని 2025–26 నాటికి 20 శాతానికి పెంచాలని లక్ష్యంగా నిర్దేశించుకుని ఆ మేరకు మిగులు ధాన్యాల నుంచి ఇథనాల్ ఉత్పత్తిని ప్రోత్సహించేలా ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్(ఈబీపీ) పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం బయో ఇథనాల్‌లో పెద్ద ఎత్తున పరిశ్రమలను ఆకర్షించేలా ప్రత్యేకంగా ఓ పాలసీనే తీసుకొచ్చింది. ఇప్పుడు సహకార చక్కెర కర్మాగారాల్లో కూడా బయో ఇథనాల్ యూనిట్లను ఏర్పాటు చేయడం ద్వారా వాటిని ఆర్థికంగా పరిపుష్టి చేయనుంది. -
విశాఖ రాజధాని కోసం విద్యార్థుల గర్జన
చోడవరం: వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతానికి విశాఖ రాజధాని ఎంత అవసరమో విద్యార్థి భేరి ఎలుగెత్తి చాటిందని, మూడు రాజధానులు ఏర్పాటుచేసే వరకూ ఉద్యమం ఆగదని ఉత్తరాంధ్ర జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ ఎం.లజపతిరాయ్ స్పష్టంచేశారు. వలస బతుకుల కష్టాల నుంచి విముక్తి కలగాలన్నా, విద్యార్థులకు మంచి భవిష్యత్తు లభించాలన్నా వికేంద్రీకరణ ఒక్కటే మార్గమన్నారు. అనకాపల్లి జిల్లా చోడవరంలో సోమవారం జరిగిన ‘విద్యార్థి భేరి’ రాజధాని నినాదాలతో హోరెత్తింది. వేలాదిమంది విద్యార్థులు తరలిరావడంతో పట్టణంలో ప్రధాన వీధులు కిటకిటలాడాయి. స్థానిక శివాలయం జంక్షన్ నుంచి ప్రభుత్వ జూనియర్ కాలేజీ వరకు సుమారు కిలోమీటరున్నర మేర భారీ ర్యాలీ జరిగింది. ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ, ఎంపీ సత్యవతి, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు పాల్గొన్నారు. విద్యార్థి సంఘాల నాయకులు, న్యాయవాదులు, డాక్టర్లు ర్యాలీని ముందుండి నడిపించారు. ర్యాలీ అనంతరం కాలేజీ గ్రౌండ్ వద్ద జరిగిన సభకు చోడవరం జేఏసీ కన్వీనర్ కాండ్రేగుల డేవిడ్ అధ్యక్షత వహించారు. ఈ సభలో ప్రొఫెసర్ లజపతిరాయ్ మాట్లాడుతూ ఈ ఉద్యమం ఇక్కడితో ఆగదని, మరింత ఉధృతం చేస్తామన్నారు. మూడు రాజధానుల కోసం ఇప్పటికే చిత్తూరు, కర్నూలు, ఉభయ గోదావరి జిల్లాల్లో ఉద్యమాలు ఉధృతమయ్యాయన్నారు. అడ్డుకునే వారి ఆటలు సాగవు కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ ఉత్తరాంధ్ర అభివృద్ధిని కొన్ని శక్తులు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని, వాటి ఆటలు సాగవని హెచ్చరించారు. విద్యార్థులు మూడు రాజధానులకు తమ మద్దతు ప్రకటించడం అభినందనీయమన్నారు. ఎంపీ బీవీ సత్యవతి మాట్లాడుతూ ఊరే లేనిచోట పూర్తిస్థాయి రాజధాని నిర్మించడం ఎంత కష్టమో అందరికీ తెలుసునని, మూడుచోట్ల రాజధానులు ఏర్పాటుచేస్తే మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు. ఉత్తరాంధ్ర ఓట్లు కావాలి గానీ ఈ ప్రాంత అభివృద్ధి మాత్రం కొన్ని పార్టీలకు అవసరంలేదని మాజీ మంత్రి దాడి వీరభద్రరావు ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వంలో సాధించుకోలేకపోతే విశాఖ రాజ ధాని ఎప్పటికీ కాదన్నారు. విశాఖ–కాకినాడ పెట్రో కెమికల్ అండ్ పెట్రోలియం కారిడార్ చైర్పర్సన్ చొక్కాకుల లక్ష్మి, వైఎస్సార్సీపీ నేత చొక్కాకుల వెంకట్రావు, ఉత్తరాంధ్ర జేఏసీ వైస్ కన్వీనర్ దేముడు మాస్టారు తదితరులు పాల్గొన్నారు. -
వికేంద్రీకరణకు మద్దతుగా చోడవరంలో ‘విద్యార్థి గర్జన’
చోడవరం(అనకాపల్లి జిల్లా): మూడు రాజధానులు కావాలంటూ విద్యార్థులు గర్జించారు. వికేంద్రీకరణకు మద్దతుగా భేరి మోగించారు. తమ బంగారు భవిష్యత్ కోసం విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటు చేయాలని విద్యార్థులంతా చోడవరం వేదికగా గళమెత్తారు. మూడు రాజధానుల సాధన పోరాట సమితి (జేఏసీ) ఆధ్వర్యంలో చోడవరంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జేఏసీ నేతలుత లజపతిరాయ్, దేవుడు, వేలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. చదవండి: సీఎం జగన్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్.. ఆ నిర్మాణంలో ప్రత్యేకతలెన్నో.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ, మూడు రాజధానులతో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు. టీడీపీ, తోక పార్టీలు పరిపాలన రాజధానిని అడ్డుకుంటున్నాయన్నారు. విశాఖ పరిపాలన రాజధాని అయితే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయన్నారు. -
చోడవరంలో ఉద్రిక్తత.. జై విశాఖ అంటూ యువకుడు ఆత్మహత్యాయత్నం!
సాక్షి, విశాఖపట్నం: చోడవరంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వికేంద్రీకరణకు మద్దతుగా శ్రీనివాసరావు అనే యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. కాగా, గంధవరం నుంచి చోడవరానికి యువకులు భారీ ర్యాలీగా బయలుదేరారు. మార్గమధ్యంలో జై విశాఖ అంటూ శ్రీనివాస్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు శ్రీనివాసరావును కాపాడి ఆసుపత్రికి తరలించారు. ఇక, ఆసుప్రతిలో చికిత్స పొందుతున్న శ్రీనివాస్‌ను ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ పరామర్శించారు. -
ధర్మశ్రీకి అందలం.. అభిమానుల ఆనందం
చోడవరం(అనకాపల్లి జిల్లా): అనుభవజ్ఞుడికి సముచిత స్థానం లభించింది. ఆయన సేవలకు తగిన గుర్తింపు దక్కింది. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీని ప్రభుత్వ విప్‌గా నియమించడంతో పార్టీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. చోడవరం నియోజకవర్గంతోపాటు అనకాపల్లి జిల్లాలో అభిమానులు, వైఎస్సార్సీపీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. బీఈడీ బీఎల్ చదవిన ధర్మశ్రీ రాజకీయాల ద్వారా ప్రజలకు సేవ చేయాలని భావించి యువజన కాంగ్రెస్ నాయకుడిగా రాజకీయాల్లో అడుగుపెట్టారు. 2004లో వైఎస్సార్ హయాంలో మాడుగుల ఎమ్మెల్యేగా, డీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన ధర్మశ్రీ వైఎస్సార్సీపీలో రాష్ట్ర కార్యదర్శిగా పదవి నిర్వహించారు. 2019లో చోడవరం ఎమ్మెల్యేగా 30 వేల ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందిన ఆ యనను ఈ ఏడాది ప్రారంభంలో కొత్తగా ఏర్పడిన అనకాపల్లి జిల్లాకు పార్టీ అధ్యక్షుడిగా నియమించారు. పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటూ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులతో కలిసి పార్టీని బలోపేతంగా చేస్తూ నియోజకవర్గాల పార్టీ ప్లీనరీ సమావేశాలను విజయవంతం చేయడంలో తన వంతు పాత్ర పోషించారు. ఈ పరిస్థితుల్లో తాజాగా రాష్ట్రప్రభుత్వంలో కీలకమైన ప్రభుత్వ విప్ పదవికి ధర్మశ్రీని నియమించడంపై సర్వత్రా ఆనందం వ్యక్తమైంది. చోడవరం పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచి, బాణసంచాలు కాల్చి సంబరాలు జరిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏడువాక సత్యారావు, జెడ్పీటీసీ మారిశెట్టి విజయశ్రీకాంత్, ఎంపీపీ గాడి కాసు అప్పారావు, మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు నాగులాపల్లి రాంబాబు, వైఎస్ ఎంపీపీలు బైన ఈశ్వరరావు, బుద్ద గంగరాజు, ఎంపీటీసీల ఫ్లోర్‌లీడర్ పల్లా రమణ, మార్కెట్ కమిటీ చైర్మన్ గూనూరు శంకరరావు, మండల ప్రతినిధి దొడ్డి వెంకట్రావు(డీవీఆర్), పట్టణ ప్రతినిధి దేవరపల్లి సత్య పాల్గొన్నారు. -
చంద్రబాబు చోడవరం మినీ మహానాడు సభకు స్పందన కరువు
-
మహిళా ఉద్యోగికి ఏఈ లైంగిక వేధింపులు.. బుద్ధి చెప్పిన కుటుంబ సభ్యులు
విశాఖపట్నం/చోడవరం టౌన్: మహిళా ఉద్యోగిని లైంగికంగా వేధించడంతో ఆమె కుటుంబ సభ్యులు వచ్చి బాధిస్తున్న ఎలక్ట్రికల్ ఏఈకి బుద్ధి చెప్పారు. విశాఖ జిల్లా చోడవరం ఎలక్ట్రికల్ కార్యాలయంలో సబ్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న ఒక దళిత మహిళను రెండు నెలలుగా అదే కార్యాలయంలో ఏఈగా విధులు నిర్వహిస్తున్న రామలింగేశ్వరరావు లైంగికంగా వేధిస్తున్నాడు. ఇది పద్ధతి కాదని నచ్చచెప్పినా ఇటీవల కాలంలో వేధింపులు ఎక్కువ కావడంతో ఆమె భర్తతో పాటు కుటుంబ సభ్యులకు సమస్యను తెలిపింది. దీంతో మంగళవారం మహిళా ఉద్యోగి భర్త, కుటుంబ సభ్యులు, దళిత సంఘాల నాయకులు చీడికాడ రోడ్డులోవున్న ఎలక్ట్రికల్ కార్యాలయానికి వచ్చి ఏఈ రామలింగేశ్వరరావుతో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా ఏఈ వారికి క్షమాపణలు చెప్పారు. అనంతరం బాధిత ఉద్యోగి బంధువులు చోడవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే విద్యుత్ శాఖలో ఉన్నతాధికారులు రంగంలోకి దిగి మహిళా ఉద్యోగి కుటుంబ సభ్యులు, దళిత సంఘాల నాయకులతో చర్చలు జరిపి కేసును రాజీ చేశారు. దీనిపై ఎస్సై విభూషణరావును వివరణ కోరగా ఈ కేసుపై బాధిత ఉద్యోగి నుంచి ఎటువంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. -
చంద్రబాబు ఇచ్చిన నెల జీతం తీసుకుని పట్టాభి మాట్లాడుతున్నారు: ధర్మశ్రీ
-
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ తహసీల్దారు, డ్రైవర్ : విశాఖ
-
మహిళా సర్పంచ్ కుటుంబంపై టీడీపీ నేత దాడి
సాక్షి, చోడవరం: విశాఖ జిల్లా చోడవరం మండలం గంధవరంలో టీడీపీ వర్గీయులు గురువారం సర్పంచ్ ఇంటిపై దాడి చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గ్రామ సర్పంచ్ పల్లా ఇంద్రజతోపాటు ఆమె కుటుంబానికి చెందిన ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. చోడవరం మండలం నుంచి తెలుగుదేశం పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పల్లా అర్జున తన కుటుంబసభ్యులు, వర్గీయులు సుమారు 13 మందితో కలిసి ఇనుపరాడ్లతో వెళ్లి వైఎస్సార్సీపీ అభిమాని అయిన సర్పంచ్ ఇంద్రజ, ఆమె మేనమామ గోకివాడ రమణ ఇంటిపై దాడి చేశారు. దొరికిన వారిని దొరికినట్టు రాడ్లతో కొట్టడంతో సర్పంచ్‌తో పాటు ఆమె తల్లి సత్యవతి (46), అన్న బాలఅప్పలనాయుడు (27), చిన్నాన్న రమణబాబు (47), మేనమామ గోకివాడ రమణ (50), అతని కుమారుడు గోకివాడ మోహన్ (26), కుమార్తె గోకివాడ రామలక్ష్మి (18) తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులు కేకలు వేయగా చుట్టుపక్కల ఉన్నవారంతా అక్కడికి చేరడంతో దాడికి పాల్పడిన టీడీపీ నాయకులు పరారయ్యారు. ఇదే గ్రామంలో ఉన్న సర్పంచ్ ఇంద్రజ బంధువులు హుటాహుటిన అక్కడకు చేరుకొని దాడికి పాల్పడ్డవారిని నిలదీసేందుకు వెళ్లగా వారు అక్కడ కూడా ఎదురుతిరగడంతో ఇరువర్గాల మధ్య కొట్లాట జరిగింది. ఈ ఘర్షణలో టీడీపీకి చెందిన ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న చోడవరం సీఐ అక్కడికి చేరుకొని భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. తీవ్రంగా గాయపడిన సర్పంచ్, కుటుంబసభ్యులను చికిత్స నిమిత్తం అనకాపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా టీడీపీ వర్గీయులు విశాఖ కేజీహెచ్‌లో చికిత్స కోసం చేరారు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఓటమి చెందిన టీడీపీ నాయకులు కక్షకట్టి దాడి చేశారని వైఎస్సార్సీపీ నాయకులు ఆరోపించారు. ఘటనలో ఇరువర్గాల వారు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. -
వైఎస్సార్సీపీలో చేరిన ప్రముఖ కన్నడ నటుడు
సాక్షి, రోలుగుంట (చోడవరం): ప్రముఖ కన్నడ సినీ నటుడు గొంది సిద్ధూ తన అనుచరులతో ఆదివారం వైఎస్సార్సీపీలో చేరారు. ఆయన సొంత ఊరు.. విశాఖ జిల్లా రోలుగుంట మండలం బీబీపట్నం. రత్నంపేటలో జరిగిన సభలో చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ పార్టీ కండువా వేసి సిద్ధూను ఆహ్వానించారు. ఈ సందర్భంగా నటుడు సిద్ధూ మాట్లాడుతూ.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమ గ్రామానికి వచ్చిన కరణం ధర్మశ్రీ బోరు, ఇతర మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చి ఎమ్మెల్యే అయిన వెంటనే నెరవేర్చారన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా సీఎం వైఎస్ జగన్ ఏపీని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని ప్రశంసించారు. అంతేకాకుండా పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అమలుచేయడంలో ఆయనను మించిన సీఎం ఎవరూ ఉండరని, ఉండబోరని కొనియాడారు. (అవినీతిపై తిరుగులేని అస్త్రం) -
మందుగుండు సామాగ్రి తయారీలో అపశ్రుతి
సాక్షి, విశాఖ : దీపావళి పండుగ సందర్భంగా మందుగుండు సామాగ్రి తయారీలో అపశ్రుతి చోటుచేసుకుంది. మందుగుండు తయారు చేస్తూ నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. చోడవరం పట్టణం అన్నవరం కాలనీలోని అంబేద్కర్ వీధికి చెందిన మహేష్(20) నిఖిల్(13) జ్యోసిత(13) దివ్య శనివారం బాణసంచా సామాగ్రి తయారు చేస్తుండగా ప్రమాదం జరిగింది. ముగ్గురికి కాళ్లు, చేతులు కాలడంతో చోడవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు జ్యోసిత తీవ్రంగా గాయపడటంతో ఆమెను అనకాపల్లిలోని ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కుమార్తె వివాహానికి సీఎంను ఆహ్వానించిన ధర్మశ్రీ
సాక్షి, చోడవరం: ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ శనివారం తాడేపల్లిలో కలిశారు. ఈనెల 30న విశాఖపట్నంలో జరగనున్న తన కుమార్తె వివాహానికి హాజరుకావాలని సీఎంను ఎమ్మెల్యే ఆహ్వానించారు. వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. -
రెప్పపాటులో ఘోరం
చోడవరం/మాడుగుల: చోడవరం పెట్రోల్ బంకు వద్ద సంభవించిన రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. మాడుగుల మండలం ఎం.కోడూరుకు చెందిన కోనేటి జగదీష్ తన భార్య నూకరత్నం(30), నాలుగేళ్ల కుమార్తెతో కలిసి స్కూటర్‌పై లంకెలపాలెంలో తన బంధువుల ఇంట్లో జరిగిన పెద్దకర్మ కార్యక్రమానికి బుధవారం ఉదయం వెళ్లారు. అనంతరం తిరిగి స్వగ్రామానికి ముగ్గురూ స్కూటర్‌పై తిరుగు పయనమయ్యారు. బీఎన్ రోడ్డుపై చోడవరం ఊర్లోని పెట్రోల్ బంకు వద్దకు వచ్చే సరికి వెనుక నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు వీరి వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో స్కూటర్‌పై వెనుక కూర్చున్న నూకరత్నం రోడ్డుపై పడింది. స్కూటర్ నడుపుతున్న జగదీష్ తన ముందు కూర్చున్న కుమార్తెను పట్టుకొని రోడ్డు పక్కన ఎడమ వైపునకు పడిపోయారు. రోడ్డుపై పడిపోయిన నూకతర్నం తలపై నుంచి బస్సు వెనుక చక్రం ఎక్కేయడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. జగదీష్, కుమార్తెకు తీవ్ర గాయాలయ్యాయి. కళ్లెదుటే భార్య చనిపోవడంతో జగదీష్ కన్నీటి పర్యంతమయ్యాడు. రక్తపుమడుగులో పడి ఉన్న నూకరత్నం మృతదేహాన్ని చూసి రోదించిన తీరు అక్కడి వారిని శోకసముద్రంలో ముంచెత్తింది. చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు స్థానికులు ఎంత ప్రయతి్నంచినా రోడ్డుపై విగతజీవిగా పడి ఉన్న భార్య మృతదేహం వద్దే కుప్పకూలిపోయాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వచ్చి నూకరత్నం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చోడవరం ఆస్పత్రికి తరలించారు. గాయపడిన జగదీష్, అతని కుమార్తెకు స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందించారు. బస్సు డ్రైవర్ ప్రమాదం జరిగిన వెంటనే చోడవరం పోలీసు స్టేషన్‌కు వెళ్లి సమాచారమిచ్చాడు. -
సచివాలయ వ్యవస్థ అద్భుతం
చోడవరం: గ్రామ సచివాలయ వ్యవస్థపై విదేశీ ప్రతినిధుల అధ్యయన బృందం ప్రశంసల జల్లు కురిపించింది. గ్రామీణ ప్రజల అభివృద్ధి, అవసరాలు తీర్చడంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల పాలన చాలా బాగుందని అభినందించింది. జాతీయ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో డీఆర్డీఏ సౌజన్యంతో 19 దేశాలకు చెందిన 23 మంది ప్రతినిధులు సోమవారం విశాఖపట్నం జిల్లా చోడవరం గ్రామ సచివాలయాన్ని సందర్శించారు. ప్రతినిధి బృందంలో శ్రీలంక, బంగ్లాదేశ్, బోట్సువానా, బురుండీ, కెమెరూన్, ఈజిప్ట్, ఇథియోపియా, ఘనా, ఇరాక్, కెన్యా, మారిషస్, నైజీరియా, దక్షిణ సూడాన్, తజికిస్థాన్, టాంజానియా, ఉజ్బెకిస్థాన్, జాంబియా తదితర దేశస్తులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ పాలన వ్యవస్థ, ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, సేవలు, గ్రామీణాభివృద్ధిపై వీరు అధ్యయనం చేశారు. 11 ప్రభుత్వ శాఖలకు చెందిన సిబ్బంది సేవలందించేందుకు ప్రజలకు చేరువగా సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేయడం చాలా బాగుందన్నారు. సచివాలయ కార్యాలయం ఏర్పాటు, ఉద్యోగుల నియామకంపై సంతృప్తి వ్యక్తం చేశారు. సచివాలయ వ్యవస్థ గురించి తమ దేశాల ప్రభుత్వాలకు సూచిస్తామని చెప్పారు. చోడవరం ఎమ్మెల్యే తరఫున స్పెషలాఫీసర్ వెంకటేశ్వర్లు, ఈవోపీఆర్డీ చైతన్య, పంచాయతీ ఈవో లోవరాజు, వైఎస్సార్సీపీ నేతలు విదేశీ బృందాన్ని ఘనంగా సత్కరించారు. పాలనా వ్యవస్థ బాగుంది భారత దేశ సంస్కృతి, సంప్రదాయాలు, పాలనా వ్యవస్థ బాగున్నాయి. గ్రామీణ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంది. ప్రజలకు ప్రభుత్వం చాలా మేలు చేస్తుండటం అభినందనీయం. ప్రజలు చూపించే ప్రేమాభిమానాలకు చాలా సంతోషిస్తున్నాం. –అగిసన్యంగ్కౌప, బోట్సువానా ప్రతినిధి గ్రామీణ వ్యవస్థ బలంగా ఉంది ప్రభుత్వ ఆధీనంలో గ్రామీణ పరిపాలనను సాగిస్తుండటం బాగుంది. అన్ని విభాగాలకు చెందిన సిబ్బంది గ్రామ స్థాయిలోనే అందుబాటులో ఉండి ప్రజలకు సేవలందిస్తున్నారు. ప్రభుత్వం ప్రజలకు చాలా పథకాలు అందించడం వల్ల గ్రామీణ వ్యవస్థ బలంగా ఉంది. –ఎన్చుఫర్ క్రిస్టోఫర్, కెమెరూన్ ప్రతినిధి ప్రజలకు దగ్గరగా గ్రామీణ వ్యవస్థ ప్రజల అవసరాలకు దగ్గరగా గ్రామీణ వ్యవస్థ ఉంది. ప్రభుత్వం వృద్ధులకు పింఛన్లు ఇచ్చి ఆదుకోవడం మంచి విధానం. దారి్రద్యరేఖకు దిగువన ఉన్న వారిని ప్రభుత్వం ఆదుకోవడం అభినందనీయం. – ఒజయ్కుమార్ హల్డార్, బంగ్లాదేశ్ ప్రతినిధి -
‘గంజి లేని స్థితి నుంచి బెంజ్ కారు వరకు’
సాక్షి, విశాఖపట్నం : టీడీపీ హయాంలో నాలుకతో కూడా ఇసుకను ఎత్తుకు పోయారని చోడవరం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఎద్దేవా చేశారు. చోడవరం మండలం నర్సాపురం వద్ద ఇసు డిపోను బుధవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇసుక డిపోతో చోడవరంలో ఇసుక సమస్యలు తీరనున్నాయన్నారు. వర్షాకాలంలో వరదల వల్ల కొంత ఇసుక కొరత ఏర్పడిందని, ఇప్పడు ఆ సమస్య లేదని స్పష్టం చేశారు. ఇసుక విషయంలో ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధంతం చేస్తున్నాయని మండిపడ్డారు. టీడీపీ నాయకులు గంజి లేని స్థితి నుంచి ఇసుక అమ్మకం చేపట్టి బెంజ్ కార్లలో తిరుగుతున్నారని దుయ్యబట్టారు. అలాగే మద్యం అమ్మకాల సమయపాలన వల్ల రాష్ట్రంలో క్రైం రేటు తగ్గిందని తెలిపారు. తెలుగు భాష గురించి మాట్లాడే వ్యక్తులు వారి పిల్లలను మాత్రం ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి ఆర్డీఓ సీతారాం రాజు, గనులశాఖ ఏడీ తమ్మినాయుడు, ప్రత్యేక అధికారి అనిత పాల్గొన్నారు. -
టీడీపీ నేత బరితెగింపు
బుచ్చెయ్యపేట(చోడవరం): మండలంలో ఎల్బీ పురానికి చెందిన ప్రభుత్వ భూమిని టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే సోదరుడు ఆక్రమించాడు. దీంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమించడమే కాకుండా జాతీయ ఉపాధి హామీ పథకంలో కూలీలు చేసిన సుమారు రూ.15 లక్షల విలువైన పనుల ప్రాంతంలో జేసీబీతో చదును చేయించడంపై పలువురు కూలీలు,రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన 109 సర్వే నంబరులో తొమ్మిది ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. గతంలో ఈ భూమిని కొంతమంది ఆక్రమించి అన్యాక్రాంతం చేయడంపై పలువురు కలెక్టర్‌కు, సిట్‌లో ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాలు మేరకు అప్పటి తహసీల్దార్ కె.వి.వి. శివ, రెవెన్యూ సిబ్బంది సర్వే చేసి ప్రభుత్వ భూమిగా గుర్తించి, ఏవరైనా ఆక్రమిస్తే చర్యలు తీసికుంటామని హెచ్చరిస్తూ బోర్డు ఏర్పాటు చేశారు. రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసికుని ప్రభుత్వ భూమిగా రికార్డుల్లో నమోదు చేయించారు. ఆరు నెలల కిందట ఇదే భూమిలో రూ.15 లక్షల వ్యయంతో జాతీయ ఉపాధి హామీ పథకం కింద వందల మంది కూలీలతో ట్రెంచ్‌లు,భూమి లెవిల్ పనులు చేయించారు. కూలీలు చేసిన పనులకు ఇంకా ఆడిట్ అవలేదని వీఆర్పీ మెల్లి సత్యనారాయణ తెలిపారు. మాజీ ఎమ్మెల్యే సోదరుడు ఆ భూమిని ఆక్రమించుకుని రెండు రోజులుగా జేసీబీతో చదును చేయించాడు. దీంతో గ్రామానికి చెందిన రైతు సంఘ నాయకులు తమరాన శ్రీను,సింహాచలంనాయుడు,గుర్రు రామునాయుడు తదితరులు శనివారం జేసీబీ అడ్డుకుని, వీఆర్వో త్రినాథ్‌కు, తహసీల్దార్ మహేశ్వరరావు, ఏపీవో, పీడీలకు ఫిర్యాదు చేశారు. తహసీల్దార్ ఆదేశం మేరకు వీఆర్వో గ్రామాన్ని సందర్శించి, స్థలాన్ని పరిశీలించారు. వెంటనే పనుల నిలిపివేయాలని తెలిపారు. లక్షలు విలువ చేసే ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అవకుండా తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు. -
‘రైతులు ఆనందంగా ఉండాలన్నదే ప్రభుత్వ ధ్యేయం’
సాక్షి, విశాఖపట్నం : రాష్ట్రంలోని రైతులను ఆదుకోవడానికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతు భరోసా అమలు చేస్తున్నారని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. రైతులు ఆనందంగా ఉండాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. జిల్లాలోని చోడవరం నియోజకవర్గంలో మంత్రి అవంతి రైతు భరోసా కింద చెక్కులు పంపిణీ చేశారు. రూ. 31 కోట్ల సాయాన్ని ఈ పథకం కింద రైతులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, అనకాపల్లి ఎంపీ సత్యవతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నష్టాల్లో ఉన్న చోడవరం షుగర్ ప్యాక్టరీని ఆదుకుంటామని స్పష్టం చేశారు. కల్యాణపు లోవను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు రూ. 25 లక్షల విడుదల చేస్తామని తెలిపారు. కొమరువొలు-కొండపల్లి రిజర్వాయర్ ఆధునీకరణకు నిధులు విడుదల చేయనున్నట్టు చెప్పారు. కాపులకు బీసీ సర్టిఫికెట్లు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. మాడుగుల-చోడవరం ప్రాంతాల్లో పారిశ్రామిక వాడ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఐదేళ్ల పాలనలో కార్యకర్తలను పట్టించుకోకుండా.. తన సామాజిక వర్గానికే మేలు చేసుకున్నారని ఆరోపించారు. జిల్లాలో వర్షం కురిసిందంటే అది సీఎం వైఎస్ జగన్ మంచితనమేనని వ్యాఖ్యానించారు. -
‘చంద్రబాబు వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయి’
సాక్షి, విశాఖపట్నం : అన్ని వర్గాలకు మేలు చేసేందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. విశాఖలో జరిగిన విలేకరుల సమావేశంలో గురువారం మంత్రి మాట్లాడుతూ.. భీమిలిని అభివృద్దిలో అగ్రస్థానంలో నిలబెట్టాలన్నదే తన ఆశయం అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఆటో డ్రైవర్లకు సీఎం రూ. 10000 వేలు ఇస్తున్నారు.. అలాగే పద్మనాభం, ఆనందపురం మండలాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసే ఆలోచన చేస్తున్నారు అని మంత్రి పేర్కొన్నారు. ఇక చోడవరం ఎమ్మల్యే కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ.. గ్రామ సచివాలయాల ఏర్పాటు చారిత్రాత్మకం అన్నారు. ఎల్లో మీడియాను అడ్డు పెట్టుకుని అధికారులే దగ్గరుండి మద్యం విక్రయిస్తున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని, దీంతో ఆయన నైజం ఏంటో బయటపడిందని విమర్శించారు. అలాగే చంద్రబాబు అబద్దాలు సృష్టించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, అక్టోబర్ 2వ తేదీన ఎక్కడా మద్యం దుకాణాలు తెరవలేదని వెల్లడించారు. మద్యపాన నిషేధం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంటే చంద్రబాబు ఓర్వలేక ఆసత్య ప్రచారం చేస్తున్నారని, వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట ప్రకారం 43 వేల బెల్టు షాపులను మూసివేయించారని తెలిపారు. రాష్ట్రంలో 20 శాతం మద్యం దుకాణాలు తగ్గిపోయాయని, 2018 జూన్ నుంచి 2018 సెప్టెంబర్ వరకు 126 లక్షల కేస్ల మద్యం విక్రయాలు జరిగితే.. తమ ప్రభుత్వం వచ్చాక 105 లక్షల కేసులు తగ్గిపోయాయన్నారు. గ్రామ సచివాలయాల ఉద్యోగాలపై చంద్రబాబు చేస్తున్న రాజకీయ ప్రకటనల్లో ఒక్కటైనా రుజువు చేయగలరా అని ఆయన సవాలు విసిరారు. -
'తప్పుడు రాతలు రాస్తున్న వ్యక్తులను ఉపేక్షించం'
సాక్షి, విశాఖపట్నం : తప్పుడు రాతలు రాస్తున్న వ్యక్తులు ఎలాంటివారైనా ఉపేక్షించేది లేదని ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మండిపడ్డారు. విశాఖపట్నంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేపడుతున్నఅభివృద్ధిని ఓర్వలేకే ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారని ఆరోపించారు.విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... పోలవరం టెండర్ల ద్వారా ప్రభుత్వం నిజాయితీ ప్రదర్శించిందని పేర్కొన్నారు. పోలవరంకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో నవయుగ కంపెనీ 4.8 శాతం ఎక్కువగా టెండర్లు వేసినట్లు నిపుణులు నిర్ధారించారు. ఈ ప్రాజెక్టు టెండర్లను మేఘా ఇంజనీరింగ్ సంస్థ రూ. 4359 కోట్లకు దక్కించుకోవడం ద్వారా ప్రభుత్వానికి డబ్బు ఆదా అవుతోంది. దీంతో 2020 కల్లా పోలవరం పనులు పూర్తి కానున్నట్లు తెలిపారు. కాళేశ్వరం లాంటి భారీ ప్రాజెక్టును రూపొందించిన అనుభవం మెగా సంస్థకు ఉండడం కలిసొచ్చిన అంశమని వెల్లడించారు. పోలవరం పూర్తయితే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. -
వాలంటీర్లు అంకిత భావంతో పనిచేయాలి
-
ఈ వినాయకుడు చాలా తెలివైనవాడు
మా వినాయకుణ్ని చవితినాడు దర్శించుకోని వారంతా పరమపాపాత్ములన్నట్టుగా ఊళ్లో పేరు పడీవారు. అలాంటి వాళ్ల ముఖాన్ని చూడ్డానికీ ఎందరో ఇచ్చగించీవారు కాదు. గణపతి చతుర్థివేళ గ్రామంలో వెలిసిన విఘ్నేశ్వరునికి మొక్కి నెత్తుటి చారికల కాళ్లతో ఇళ్లకి చేరేవారికే గౌరవం. అలాంటి వారికే మర్యాద. వాళ్లే ఆ లంబోదరుని కృపకు పాత్రులయినట్టు. గుడికెళ్లిన భక్తజనం ఇంటికి వచ్చేప్పుడు ప్రసాదం పట్టుకొస్తారు. అంటిపళ్లు తింటూ వస్తారు. తీర్థం గ్రోలి వస్తారు. స్తోత్రం వల్లెవేసి వస్తారు. బొట్టుతో వస్తారు. చెవుల్లో పువ్వులు పెట్టుకుని వస్తారు. అంతేగానీ రక్తపు అడుగులతో రావడం ఏంటట?.. అక్కడే ఉంది మరి కథంతాను. విశాఖపట్నానికి ఒకమాదిరి దాపున ఉండే చోడవరం పల్లెటూళ్లో ఉద్భవించిన వినాయకుడి వ్యవహారం చిన్నది కాదు. ఆయన స్వయంభువు. భూమిలోనుంచి వెళిపొచ్చీసేడు. కాబట్టే భక్తులు విరివిగా పూజిస్తుండీవారు. ఆర్తుల పాలిట ఆయన కొంగు బంగారమని ప్రతీతి కూడాను. ఊళ్లో గుళ్లకి లోటు లేదు. కొత్తూరు దాటేక శివాలయం, జవహర్ క్లబ్ దగ్గిర కేశవాలయం, పీర్లపంజా దరిన రామాలయం, వెలంవీధిలో లక్ష్మమ్మ కోవెల, పాకలవారి వీధి మొగన కన్యకాపరమేశ్వరి మందిరం, చీడికాడ రోడ్డులో నూకాల్తల్లి గుడి, కందర్ప కోలనీలో వెంకటేశ్వరస్వామి దేవళం. ఇలా ఎంత మంది దేవుళ్లున్నా మా బొజ్జ గణపయ్యకున్న ప్రత్యేకత వాళ్లెవరికీ లేదుగాకలేదు. ఈయనగారి కోవెల్లో ప్రతీ రోజూ సందడే. మామూలు రోజుల్లోనే ఇన్ని దర్శనాలయితే చవితినాడిక చెప్పీదేముంది. జనాలు కుమ్మీసీవారు. అలా కుమ్ముకొచ్చిన వాళ్ల కాళ్లన్నీ కన్నాలడిపోతుండీవి. చవితినాడు బహు చిత్రమైన పల్లేరు పద్ధతొకటి మావూళ్లో అమలవుతుండీది. ఆ రోజున ఊరి పిల్లలందరూ ఎక్కెడెక్కడి గరువుల్లోంచీ పల్లెరుగాయలూ ఏరుకొచ్చి విఘ్నేశ్వరుడి గుడి ముంగిట దట్టంగా జల్లుతుండీవారు. గుంటసావాదిగాళ్లు ఆ రకంగా చేయడం తప్పుకదా. వచ్చిపోయేవాళ్లకి ఇబ్బంది కదా. అయినాగానీ వాళ్లని ఎవ్వరూ వారించీవారే కాదు. పైపెచ్చు పెద్దఎత్తున పల్లేరు తెమ్మనమని పెద్దలే ప్రోత్సహిస్తుండీవారు. దీంతో ఊరి గుంటజట్టంతాను చవితి పండక్కి వారం రోజుల ముందునుంచీ పల్లేరు ఏరడం కోసం చెట్లంట, పుట్లంట, తోట్లంట, దొడ్లంట తిరిగీది. కొందరు మహాభక్తులయితే చవితి పండగనాడు గుడి ముందర తమ పిల్లల చేత పల్లేరు పరిపిస్తామని మొక్కులు కూడా పెట్టీవారు. మా వినాయకుడు చాలా తెలివైన వాడు. అందుకే ఊరికి దూరంగానో ఊరికి సంబంధం లేకుండానో ఊరు వెలివేసినట్టుగానో అవతరించలేదు. సరిగ్గా ఊరి మయాన పీఠం వేస్సేడు. మెయిన్ రోడ్డు పక్కనే జానలు మూరలు కొల్చుకుని మరీ తిష్ట వేస్సేడు. రోడ్డు మీంచి వెళ్లే ప్రతీ ఒక్కడూ తనకో నమస్కారం పారీకుండా వెళ్లలేని స్థితిలో జాయిగా నిలబడిపోయేడు. అంత తెలివైన ఈ గణపతి ఆచూకీ తొలీతగా తీసిందెవరంటేను మట్టి పని చేసీ ఉప్పర్లేను. వాళ్లే నేల పొరల్లో ఉన్న ఈ ఏకదంతుణ్ని పైకి తేల్చి తెచ్చేరు. సరిగ్గా ఎన్నేళ్లయిందంటే మనం గట్టిగా చెప్పలేం గానీ చాలా ఏళ్లయిందని మాత్రం గట్టిగా చెప్పగలం. నాటి కాలాన చోడవరంలో విపరీతమైన కరువు కాటకాలు వచ్చిపడ్డాయిట. చుక్కనీరు లేక జనం అల్లాడిపోయే స్థితి వచ్చీసిందిట. అత్యవసరంగా దాహం బాధ తీరాలంటే నుయ్యో గొయ్యో తవ్వాలని పెద్దలు తలకట్టేరట. ‘నుయ్యెందుకు పెద్ద చెరువే తవ్వితే పోతుంది కదా..’ అనుకుంటూ ఉప్పర్లను రంగంలోకి దించేరు ఆ పెద్దవారు. గ్రామానికి అభిముఖంగా శ్రీరామపట్నానికి వెళ్లే దారిన ఎకరాలకొద్దీ పడున్న ఖాళీ జాగాలో చెరువు తవ్వకం ఆ రకంగా మొదలైపోయింది. గునపాలు గునగునా పనిచేసేయి. పారలు పరపరా పరుగులు తీసేయి. తట్టలు చకచకా మట్టిని మోసేయి. అలా భూమి లోలోపలికి వెళ్తూ వెళ్తూ చెరువు తవ్వుతున్న కూలీలకి నెలరోజుల తర్వాత ఒక వింత కనిపించింది. గునపం పడిన చోటునుంచి ధారలు ధారలుగా నెత్తురేదో ఎగజిమ్మడం మొదలెట్టింది. వాళ్లు హడలెత్తిపోయేరు. బెంబేలెత్తిపోయేరు. ఎర్రని చిక్కటి ద్రావకం తవ్వుతున్న కొద్దీ బయల్పడుతుండటంతో వాళ్ల కచ్చల్లో కందులు వేగిపోయేయి. వాళ్ల పుచ్చెల్లో పురుగులు పాకిరిపోయేయి. వెనువెంటనే ఊరి పెద్దల కాళ్ల దగ్గరకి వచ్చిపడ్డారు. ‘‘చెరువు తవ్వితే వస్తే గిస్తే నీళ్లు బయటకి రావాలి. నెత్తురు రావడం ఏంట్రా.’’ అంటూ పెద్దలందరూ చెరువు గట్టుకు చేరేరు. ఈ వింత తెలుసుకుని ఊరి జనాభా కూడా విడ్డూరంగా వారి బాటే పట్టింది. గట్టు మీద ప్రజాళి పేరుకోగా పెద్దల నేతృత్వంలో ఉప్పర్లందరూ ధైర్యాన్ని కూడదీసుకుని మళ్లీ తవ్వకం మొదలెట్టేరు. అయినా అదే స్థితి. లాభం లేదనుకుని పంచాయితీ ప్రెసిడెంట్ మంగు సాంబుడు, కరణం వాడ్రేవు వేంకటేశ్వరరావు, పురోహిత శ్రేష్టుడు వారణాసి జగన్నాథశాస్త్రి, జ్యోతిష్యరత్న చుండూరు శ్రీమన్నారాయణ నడుం బిగించేరు. పంచెలు ఎగ్గట్టి, గట్టు దిగ్గొట్టి తవ్వకం జరిగే స్థలానికి చేరారు. ఉప్పర్లు గోలపెడుతున్నదంతా నిజమే. నెత్తురు ఉబికివస్తున్నట్టుగా ఆ ప్రాంతమంతా రుధిరధారలతో చిత్తడినేల అయిపోయింది. చిన్నపాటి రణక్షేత్రంలా అవుపించింది. పెద్దబుర్రలకీ ఇది ఆశ్చర్యమే. కింకర్తవ్యం. ఆలోచనలో పడ్డాయవి. జనాలంతా ఆ బుర్రలచుట్టూ చేరి బుర్రలు గోక్కోడం మొదలెట్టేరు. ఇంతలోనే వారణాసి జగన్నాథశాస్త్రి కలగజేసున్నారు. ఆ ప్రదేశాన్ని మరింత పరిశీలనగా చూసేరు. తవ్వుతున్న చోట మట్టి పక్కకు తొలగిపోగా బోరుబావి గొట్టంలాంటి పొడవయిన రాతి ఆకృతిని ఆనవాలు కట్టేరు. దాని మీద గునపం పడితేనే ఎర్రెర్రని ప్రవాహమేదో తన్నుకొస్తున్నట్టుగా తీర్మానించేరు. పొడవయిన ఆ రాయి మరింతగా కళ్లకు కట్టేలా ఉప్పర్ల చేత మట్టి తీయించేరు. ఇంకేముంది. నల్లటి తొండంలాంటిదొకటి భారీగా బయటపడింది. వారణాసి పంతులుగారికి ఆలోచన అందినట్టయింది. ఆ తొండం పక్కనున్న మట్టిని తొలగిస్తూ, అది ఎంత దూరం ఉంటే అంత దూరమూ చివర్లంట తవ్వుకు పోవాలన్నారు. ఆ ప్రకారమే చేసేరు ఉప్పర్లు. ఎప్పటికీ దానికో అంతూ దరీ మటుకు కనిపించలేదు. ఒక్క రోజు కాదు. పదిరోజులు పట్టుగా తవ్వేరు. ఉప్పర్లతో పాటు గ్రామప్రజలూ కలిసేరు. చేతికందిన వస్తువుతో మట్టి తొలగించే పని చేపట్టేరు. దాదాపుగా ఆ వ్యవహారం మైలు దూరం వరకూ సాగిపోయింది. మట్టి తీస్తున్నకొద్దీ రాతిఆకృతి స్పష్టమైన ఏనుగు తొండంలా దర్శనమిచ్చింది. ఆ సమయంలోనే వారి మనస్సుల్లో భక్తి భావనా మొగ్గతొడిగింది. వాళ్ల భక్తిశ్రద్ధలను వీలయినంతగా పెంచి పోషించేరు పంతులుగారు. పదకొండో రోజు ఉదయం గంటపాటు గునపాలు పారలు పనిచేశాక ఛాతీ వరకూ కనిపించే పెద్ద విగ్రహమొకటి పెద్దపెద్ద చెవులతో భూమి లోపలి నుంచి బయటికి పొడుచుకొచ్చింది. ఇంతవరకూ కనిపించిన తొండం ఆ విగ్రహానిదేనని తేలిపోయింది. ఆ విగ్రహంతోనే ఈ తొండం కలిసి ఉందనీ తెలిసిపోయింది. జనం హడావుడి పడిపోయేరు. అందరూ కొండని తవ్వి ఎలకని పడితే మావాళ్లు చెరువుని తవ్వి ఏనుగుని పట్టేరు. బానయ్య కోనేరు నుంచి నీరు అండాలతో వచ్చిపడింది. విగ్రహాన్ని జగన్నాథశాస్త్రి ఆధ్వర్యంలో బ్రహ్మసమూహం వేదం చదువుతూ కడుక్కొచ్చింది. ఆ కడుగుడు అంతా అయ్యీసరికి ఎల్లరూ విస్మయులయ్యేలా అది పెద్ద గణపతి ప్రతిమగా కళ్లకు కట్టీసింది. ఊరి మీద ప్రేమతో పార్వతీ తనయుడే స్వయంగా వెలిసేడని వారణాసివారు ప్రకటించేరు. బోరవరకూ కనిపించిన దేవుణ్ని అలాగే కొలవాలని, ఇంకా కిందకి తవ్వి ఆయన కింద భాగాన్ని చూడకూడదనీ అనీసేరు. ఆ మాటతో విగ్రహానికి జనం దండాల మీద దండాలు పెట్టడం మొదలెట్టేరు. భక్తిప్రపత్తులతో నృత్యాలు చేయడం ఆరంభించేరు. రంగులు జల్లుకున్నారు. పూలు తెచ్చి పోస్సేరు. కొబ్బరికాయలు పటపటలాడించేరు. పెద్ద కోలాహలమే జరిగింది. ఆ మీదట, కొమ్ములు తిరిగిన వేదపండితుందరూ పంచాయితీ సావిట్లో కొలువుదీరేరు. కొత్తగా వెలిసిన వినాయకుణ్ని ఏం చేయాలన్న దానిపై చర్చలు జరిపేరు. స్వస్తి వాచకం చదివేరు. పంచాంగాలు చూసేరు. వేళ్లు కదుపుతూ గణనలు కానిచ్చేరు. చివరికి వారంతా చేసిన నిర్ణయాల మేరకు మైలు పొడవున విస్తరించిన తొండాన్ని మళ్లీ భూమిలోకే చేర్చే విధంగా తవ్విన మట్టిని ఉప్పర్లు దాని మీదనే పోసీసేరు. దాన్ని పైకి కనబడకుండా చేసీసేరు. గణనాథుని రూపాన్ని భుజాల వరకూ అగుపించేలా మట్టిపని పూర్తి చేసేరు. చుట్టూ చదును చేస్సేరు. విగ్రహానికి తాటి కమ్మలతో చిన్నపాటి పందిరి కట్టేరు. అందులో నిత్యమూ ధూపదీపనైవేద్యాలు జరిగేలా వారణాసివారు చర్యలు చేపట్టేరు. తవ్విన ప్రాంతాన్ని పూర్తిగా వదిలిపెట్టి, ఆ తర్వాత కాలాన చెరువు తవ్వకం కొనసాగింది. ఆ చెరువే పెద్దచెరువుగా మావూళ్లో ప్రఖ్యాతమైంది. కాలానుగుణంగా మరికొన్ని కొత్త చెరువులూ ఏర్పడినందువల్ల పాతచెరువుగా జనం నోట మిగిలిపోయింది. స్వయంగా పుట్టిన గణపతి గనక స్వయంభూ విఘ్నేశ్వరస్వామిగా పండితులు మా ఊరి గణపతికి నామకరణం చేసేరు. కొందరు పండితప్రకాండులు మాత్రం, ‘నెత్తురు గణపతి.. అనే పేరు పెటొచ్చుకదా! లేకపోతే నెత్తురయ్య.. అని పిలవొచ్చుకదా!’ అంటూ పిడివాదనకి దిగేరు. అలాంటి పేరు భక్తుల్లో ప్రతికూలభావాలు కలుగజేయవచ్చని మరికొందరు ప్రతివాదనలు పెట్టేరు. తమ మాట నెగ్గించుకున్నారు. దీంతో రుధిర గణపతి, ఎర్రటేనుగు వంటి పేర్లు మా విఘ్నపతిని తాకలేదు. కానీ, ఈ స్వయంసిద్ధుడు రక్తంతో భూమిలోనుంచి బయటకి వచ్చాడన్న సంగతి తెలిసిన భక్తజనం ఊరుకుంటారా. అందుకేమరి, పల్లెరుగాయలు వెదజల్లే కార్యక్రమానికి తెరతీస్సేరు. వినాయకచవితిరోజున పల్లేరు తెచ్చి గుడికి వెళ్లే దారిలో పారబోయడం మొదలెట్టేరు. ఊరి యువకులకి ఇదంతా బాగానే అంటుకుపోయింది. పాదాలకు పల్లేరు గుచ్చుకుని నెత్తురు కారడాన్ని నాటి నెత్తుటి గణపతి కథకు తెలివిగా జత చేశారెవరో. నమ్మకాలు పెంచి పోషించబడ్డాయి. అప్పటినుంచీ పల్లేరు పాలబడి గణపతి చతుర్థినాడు భక్తులు గిలగిలమంటుండీవారు. ఇదంతా పుణ్యఫలమేనని తీవ్రాతి తీవ్రంగా భావించీవారు. చాలా ఏళ్లు ఈ విధంగా పల్లేరు గుచ్చుళ్లతో చవితి పండగ చోడవరాన అద్భుతమై అలరారింది. కాలం మెల్లగా మారుతూ వచ్చింది. ఇప్పుడయితే ఆ మార్పులు మరీ వేగంగా జరిగిపోతున్నాయి. ఒకనాడు ఊళ్లోనూ ఊరిబయటా ఎటు చూసినా తోటలూ దొడ్లూ అగుపించీవి. గరువులూ చేలూ కనిపించీవి. పంటలతో పాటు పల్లేరుగాయలూ కావలిసినన్ని దొరికీవి. నేడు రియల్ఎస్టేట్ వేపారం పొటమరించిపోయింది. ఊళ్లో సిమెంటు కట్టడాలు. ఊరిబయట లే అవుట్లు. పల్లేరుగాయలు ఇంకెలా దొరుకుతాయి. ఇప్పటివేళ చవితి పూట మా వినాయకుడి గుడికి వెళ్లేవారు నిర్భయంగా పోవొచ్చు. రావొచ్చు. వాళ్ల కాళ్లకి ఒక్కటంటే ఒక్క పల్లేరూ గుచ్చుకోనే గుచ్చుకోదు. దీనికి మేం హామీ. పల్లేరుగాయలు పోయినా ఈ కథ నేటికీ మావూరి ప్రజల్లో స్థిరంగా నిలిచి ఉంది. నెత్తురు చిందిన తర్వాతే మా వినాయకుడు పుట్టేడన్న గాథ వారి గుండెల్లో బలంగా దిగబడి ఉంది. పాదాలకు నాటుకున్న పల్లేరును చప్పున తీసీవొచ్చు. మనసుకి నాటుకున్న విశ్వాసాలను తీసీడం అంత సుళువా! – చింతకింది శ్రీనివాసరావు -
తెలుగు తమ్ముళ్ల అవినీతి కంపు...
దోచుకోవడమే ధ్యేయంగా ముందుకు సాగిన ‘పచ్చ’ తమ్ముళ్లు ఆఖరికి మరుగుదొడ్లను కూడా వదల్లేదు. బాబు సర్కారు హయంలో జరిగిన అవినీతిలో రోజుకో కుంభకోణం వెలుగుచూస్తోంది. తాజాగా చోడవరం మండలం చాకిపల్లి పంచాయతీలోని రామజోగిపాలెం గ్రామంలో స్వచ్ఛభారత్ మిషన్ గ్రామీణ్ పథకంలో భాగంగా నిర్మించిన వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో సుమారు రూ.10 లక్షల మేర అవినీతి జరిగినట్టు అధికారుల విచారణలో వెల్లడైంది. సాక్షి, చోడవరం: గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ నాయకులు చేసిన అవినీతి బాగోతాలు ఒకొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఎన్టీఆర్ హౌసింగ్ నిర్మాణంలో మోసాలు వెలుగు చూసి రెండు రోజులు కాకముందే అదే పంచాయతీలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో భారీ అవినీతి బాగోతం బయటపడింది. చోడవరం మండలం రామజోగిపాలెంలో తాజాగా స్వచ్ఛభారత్ మిషన్ గ్రామీణ్ పథకంలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో సుమారు రూ.10 లక్షల మేర అవినీతి జరిగి నట్టు అధికారుల విచారణలో వెల్లడైంది. మరుగుదొడ్లు నిర్మించకుండానే నిర్మించినట్టు, అసంపూర్తిగా నిర్మాణాలు చేసి పూర్తిగా బిల్లులు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు రూ.లక్షలు దోచుకున్నట్టు అరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చాకిపల్లి పంచాయతీకి గత టీడీపీ హయాంలో 268 వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరయ్యాయి. ఈ మేరకు రూ.38 లక్షల 40వేలు నగుదును లబ్ధిదారులకు పేమెంట్స్ ఇచ్చేశారు. ఈ పంచాయతీ శివారు గ్రామమైన రామజోగిపాలేనికి వీటిలో 145 మరుగుదొడ్లు మంజూరయ్యాయి. వీటిలో రూ.18 లక్షల రూ.80 వేలు చెల్లించారు. రామజోగిపాలెంకు మంజూరైన వాటిలో సుమారు 100 మరుగుదొడ్లలో భారీగా అవినీతి జరిగినట్టు తెలు స్తోంది. గ్రామానికి చెందిన టీడీపీ నాయకుల ఒత్తిళ్లకు అప్పటి అధికారులు సహకరించడంతో వీటి నిర్మాణంలో అవినీతి జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. గ్రామంలో మొత్తం సుమారు 190 ఇళ్లు ఉండగా వీటిలో సగానికిపైగా తమ సొంత నిధులతో ఇళ్లు, మరుగుదొడ్లు కట్టుకున్నారు. మరికొన్ని ఇందిరమ్మ, ఎన్టీఆర్ హౌసింగ్ పథకంలో ఇళ్లతో పాటు మరుగుదొడ్డి నిర్మించుకున్నారు. ఇవి కాకుండా స్వచ్ఛభారత్ మిషన్ పథకంలో ఏకంగా మరో 145 మరుగుదొడ్ల మంజూరు చేసి అందులో భారీగా అవినీతికి పాల్పడ్డారు. దీనిపై గతంలోనే స్థాని కులు కొందరు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిప్పటికీ స్థానిక ఎమ్మెల్యే కూడా అధికార పార్టీకే చెందిన వారు కావడంతో స్థానిక టీడీపీ నాయకులు ఇష్టారాజ్యంగా వివిధ పథకాల్లో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలపై అప్పట్లో ఎటువంటి విచారణ జరగలేదు. కదిలిన అవినీతి డొంక.. ఇటీవల గ్రామానికి చెందిన కొందరు ఈ విషయంపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో ఆర్డబ్ల్యూఎస్, స్వచ్ఛభారత్ మిషన్ అధికారులు విచారణకు రావడంతో అవినీతి డొంక కదిలింది. మంజూరైన మరుగుదొడ్ల నిర్మాణంలో ఒకొక్క విషయం బయటపడుతుంటే అధికారులు సైతం అవాక్కవుతున్నారు. ఆర్డబ్ల్యూఎస్ సూపరింటెండెంట్ వి. రవికుమార్, చోడవరం డీఈఈ జి.శివకృష్ణ, జేఈ కనకమ్మ, స్వచ్ఛభారత్ మిషన్ జిల్లా కో–ఆర్డినేటర్, శ్రీనివాస్, మండల కో–ఆర్డినేటర్ ప్రకాష్ , గ్రామ వలంటీర్లు కలిసి ఈ వ్యవహారంపై విచారణ ప్రారంభించారు. లబ్ధిదారుల జాబి తాతో ప్రత్యక్ష విచారణకు వచ్చిన అధికారులకు ఇక్కడ వెలుగు చూస్తున్న విషయాలు ఆశ్చర్యపరిచాయి. నందికోళ్ల ప్రసాద్ అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతోపాటు బంధువుల పేరున ఎనిమిది మరుగుదొడ్లు మంజూరు చేయించుకుని ఒక్కటి కూడా కట్టకుండానే బిల్లులు తీసుకున్నట్టు తేలింది. కిల్లి రమణ, వెన్నెల పైడమ్మ, నందికోళ్ల మన్మథరావు, పోతల నాగరాజుతోపాటు అనేక మంది లబ్ధిదారుల పేరున ఉన్న మరుగుదొడ్ల నిర్మాణానికి గోతులు తవ్వకుండా, పైకప్పులులేనివి , బేసిన్లు, తలుపులు లేనినివి ఇలా అసంపూర్తిగా నిరుపయోగంగా ఉన్నాయి. అయినప్పటికీ వీటికి పూర్తిగా బిల్లులు ఇచ్చేసినట్టు తేలింది. సగానికి పైగా నిర్మాణాలు చేయకుం డానే బిల్లులు చేసినట్టు తెలుస్తోంది. ఒకొక్క మరుగుదొడ్డికి రూ.12నుంచి 15వేలు వరకు బిల్లులు చేశారు. సుమారు 100కు పైగా మరుగుదొడ్లలో రూ.10 లక్షలకు మించే అవినీతి జరిగినట్టు అంచనా వేస్తున్నారు. అయితే విచారణకు జిల్లా స్థాయి అధికారులు వచ్చినప్పటికీ గ్రామ కార్యదర్శి మాత్రం వీరితో పరిశీలనకు రాలేదు. అప్పటి ఎంపీడీవో, గ్రామ కార్యదర్శి, ఆర్డబ్ల్యూఎస్ అధికారుల సహకారంతోనే టీడీపీ నాయకులు అవినీతికి పాల్పడ్డారని గ్రామస్తులు పోతల అప్పరావు, పోతల ప్రసాద్ , రమణబాబు ఆరోపించారు. ఇదిలావుండగా గ్రామ కార్యదర్శి విచారణ సమయంలో రాకపోవడంతో విచారణ ప్రాథమికంగా జరిగిందని, ఆయన వచ్చాక పూర్తిస్థాయి విచారణ పూర్తవుతుందని ఆర్డబ్ల్యూఎస్ డీఈఈ శివకుమార్ తెలిపారు. -
వివాహేతర సంబంధంపై అనుమానంతో..
సాక్షి, చోడవరం: చోడవరంలో దారుణం చోటుచేసుకుంది. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఓ యువకుడిని అత్యంత కిరాతకంగా కత్తితో మెడపై నరికి ఓ వ్యక్తి హత్య చేశాడు. తీవ్ర సంచలనం సృష్టించిన ఈ కేసులో నిందుతుడ్ని పోలీసు చాకచక్యంగా సంఘటన జరిగిన కొద్ది గంటల్లోనే అరెస్టు చేశారు. చోడవరం పట్టణంలో ఆదివారం మధ్యాహ్నం 3గంటల సమయంలో మెయిన్‌రోడ్డుపై ఐలాండ్ బ్రాందీ షాపు ఎదురుగా బైక్‌పై ఆగి ఉన్న చోడవరం పిల్లావారితోట వీధికి చెందిన కోన లోవమహేష్(23) అలియాస్ బొర్రయ్య అనే యువకుడ్ని అత్యంత కిరాతకంగా ఓ వ్యక్తి హత్యచేశాడు. ఈ సంఘటనతో ఈ ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. తన భార్యతో వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో మహేష్‌పై కక్ష పెంచుకున్న బెన్నవోలుకు చెందిన కొండూరు సత్తిబాబు అలియాస్ ప్రభాస్ కత్తితో మాటువేశాడు. ప్లబింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్న బొరయ్య ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తన స్నేహితులతో కలిసి పట్టణశివార్లలో క్రికెట్ ఆడి మధ్యాహ్నం 2.30గంటల సమయంలో తన ఇద్దరు స్నేహితులతో కలిసి భోజనం తెచ్చుకోవడానికి మెయిన్‌రోడ్డుపై ఉన్న హోటల్‌కు మోటారు సైకిల్‌పై వచ్చాడు. మద్యం అలవాటు ఉండడంతో మద్యం కోసం ఒకరిని ముందుగా మెయిన్‌రోడ్డుపై ఉన్న ఐ ల్యాండ్ బ్రాందీ షాపు దగ్గర దించిన బొర్రయ్య మరో స్నేహితుడితో కలిసి హోటల్‌కి వెళ్లి పలావు కట్టించుకొని బ్రాందీ షాపు దగ్గర ఉన్న తన స్నేహితుడిని తీసువెళ్లేందుకు వచ్చాడు. పల్సర్ బైక్‌పై ఉండి తన స్నేహితుడికి కోసం బండి హారన్ కొడుతున్న సమయంలో అప్పటికే వీరి కదలికలను గమనిస్తూ వీరి వెంట వస్తున్న నిందుతుడు ప్రభాస్ మోటారు సైకిల్‌పై తలకు హెల్మెంట్ ధరించుకొని వెనుక నుంచి వచ్చి బైక్‌పై వెనుక ఉన్న వ్యక్తి బొర్రయ్య అనుకొని కత్తితో దాడిచేశాడు. ఆ సమయంలో కత్తి వెనుకభాగం తగలడంతో బండిపై ముందు ఉన్న బొర్రయ్యతో పాటు గాయపడిన అతని స్నేహితుడు ఇద్దరు వెనక్కి తిరిగి, ఎదురుతిరిగే లోగానే బొర్రయ్య మెడను కత్తితో ప్రభాస్ నరికి హత్యచేశాడు. ఆసమయంలో అడ్డుకోబోయిన అతని స్నేహితుడ్ని కూడా నరుకుతానని బెదిరించడంతో ఆ యువకుడు అక్కడ నుంచి భయంతో పక్కకు వెళ్లిపోయాడు. కత్తితో నరుకుతున్న సమయంలో బొర్రయ్య తన చేతులు అడ్డుపెట్టుకోగా ఆ చేతులను కూడా నరికేశాడు. దీంతో మొండెం నుంచి తల వేరై కుప్పకూలిన బొర్రయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. అప్పటికీ శాంతించని ప్రభాస్ నేలపై పడి ఉన్న బొర్రయ్య మృతదేహాన్ని మరోసారి పరిశీలించి, మళ్లీ మృతదేహంపై కత్తితో నరికి ఉన్మాదిగా వ్యవహించడం అందర్నీ భయబ్రాంతులకు గురిచేసింది. ఈ హత్య సంఘటన అక్కడ ఉన్నవారు సెల్ఫోన్లో వీడియో చిత్రీకరించిన దృశ్యం వాట్సాప్‌లో హల్‌చల్‌చేసింది. హత్యకు గురైన బొర్రయ్య ఐటీఐ వరకు చదువుకున్నాడు. తల్లి,తండ్రి, చెల్లి, తాతయ్య ఉన్నారు. చోడవరంలో ప్రభాస్‌కు చెందిన వస్త్రదుణంలో కొత్తకాలం బొర్రయ్య పనిచేశాడు. ఆ సమయంలోనే ప్రభాస్ భార్యతో బొర్రయ్య వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని అనుమానించి ఎప్పటికైనా హతమార్చాలనే ఉద్దేశ్యంతోనే చివరికి ఈ హత్య చేశాడని పోలీసులు భావిస్తున్నారు. తీవ్ర సంచలనం సృష్టించిన ఈ కేసును దర్యాప్తుచేసేందుకు పోలీసు బృందాలు రంగంలోకి దిగా యి. నర్సీపట్నం ఏఎస్పీ ఆరిఫ్ హఫీజ్ , విశాఖ క్రైమ్ డీఎస్పీ వివేకనందం నేతృత్వంలో ఇన్చార్జి సీఐ సీవీ నర్సింహమూర్తి,చోడవరం, మాడుగుల ఎస్ఐలు లక్ష్మణమూర్తి తారకేశ్వరరావులతో కూడి న పోలీసు బృందాలు నిందితుడి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టి పట్టుకున్నాయి. భార్యను హత్య చేయడానికి వెళ్తుండగా .. వివాహేతర సంబంధం అనుమానంతో బొర్రయ్య ను కత్తితో నరికి హత్యచేసిన ప్రభాస్ తన భార్యను, తన సోదరుడిని కూడా హత్యచేసేందుకు వెళ్తుండగా బెన్నవోలు గ్రామ సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు మరో ఇద్దర్ని హత్యచేయాలని యత్నిస్తుండగా అరెస్టు చేయడం వల్ల ఆ రెండు హత్యలను నివారించగలిగామని ఏఎస్పీ కె. ఆరిఫ్ హఫీజ్ తెలిపారు. హత్యజరిగిన కొద్ది గంటల్లోనే నిందితుడ్ని అరెస్టు చేయడం ఇదే మొదటి సారి. పోలీసులు వ్యూహాత్మకంగా వ్యహరించి జిల్లా ఎస్పీ బాపూజీ ఆదేశాల మేరకు జిల్లా అంతటగా ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. చోడవరం మెయిన్‌రోడ్డుపై పోలీసులు ఏర్పాటుచేసిన సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించడంతోపాటు హత్య జరిగిన సమయంలో స్థానికులు తీసి వాట్స్‌అప్‌లలో చక్కర్లు కొట్టిన వీడియోను కూడా పోలీసు అధికారులు పరిశీలించారు. హత్యకు గురైన బొర్రయ్య కుటుంబసభ్యులతోను, అతని స్నేహితులతోను మాట్లాడి పోలీసు అధికారులు ఈ హత్యచేసింది ప్రభాస్‌గా నిర్ధారించుకున్నారు. గంటలోనే నిందితుడ్ని గుర్తించిన పోలీసులు అతనిని పట్టుకునేందుకు పన్నిన వ్యూహం ఫలిచింది. కొద్ది గంటల్లోనే పోలీసులకు చిక్కడంతో రాత్రి 8గంటలకు అరెస్టు చేసినట్టు ఏఎస్పీ హఫీజ్ విలేకరులకు తెలిపారు. ఈ హత్యకు వాడిని కత్తిని ,మోటారు సైకిల్‌ను కూడా స్వాధీనపర్చుకున్నామని తెలిపారు. అయితే ఇంకా ఈ కేసులో ఎవరున్నదనే దానిపై మరింత విచారణ చేస్తున్నామని నిందితుడ్ని కోర్టులో హాజరుపరుస్తామని ఆయన చెప్పారు. -
‘బాబు పాలనలో మహిళలకు రక్షణ కరువు’
సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు నాయుడు పాలనలో మహిళలకు రక్షణ కరువైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ‘దివంగత మహానేత రాజశేఖరరెడ్డి గారి పాలనలో మహిళలను అన్ని రంగాల్లో భాగస్వామ్యులుగా చేశారు. కానీ చంద్రబాబు హయంలో మహిళలై అఘాయిత్యాలు పెరిగిపోయాయి. నాగార్జున యూనివర్సిటీలో రిషితేశ్వరి వేధింపుల గురై చనిపోతే ప్రభుత్వం నిందితులకు కొమ్ము కాసింది. కాల్ మనీ సెక్స్ రాకెట్‌పై ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. మహిళ ఎమ్మార్వోపై టీడీపీ ఎమ్మెల్యే దాడి చేస్తే చర్యలు ఉండవు. మహిళలపై దాడులలో దేశంలోనే ఏపీ 8వ స్థానంలో ఉందని నివేదికలు చెబుతున్నాయని’ విజయమ్మ పేర్కొన్నారు. బుధవారం విశాఖ జిల్లా చోడవరం నియోజకవర్గం రావికమతంలో జరిగిన బహిరంగ సభలో విజయమ్మ ప్రసంగించారు. ఇంకా విజయమ్మ మాట్లాడుతూ.. ‘30 ఏళ్ల పాటు రాజశేఖరరెడ్డి గారిని మీ భుజాలపై మోశారు. రాజశేఖర్‌రెడ్డి ప్రతి జిల్లాకు 60 నుంచి 70 సార్లు వచ్చి ఉంటారు. చాలా మందిని పేర్లు గుర్తుపెట్టుకుని మరి పిలిచే అప్యాయత ఆయనది. ఆయన సీఎం అయ్యేసరికి ఏ జిల్లాకు ఏం కావాలో తెలుసుకున్నారు. అధికారంలోకి రాగానే ప్రజలకు ఏం కావాలో చేశారు. కరెంట్ చార్జీలు, ఆర్టీసీ చార్జీలు ఏ ఒక్కటి కూడా పెంచకుండా వైఎస్సార్ పాలన నడిచింది. దేశంలో మొత్తం 48 లక్షల ఇళ్లు కడితే.. వైఎస్సార్ కేవలం రాష్ట్రంలోనే 48 లక్షలు కట్టారు. రాజశేఖరరెడ్డి గారి పాలన చూడటానికి 13 రాష్ట్రాల నుంచి అధికారులు వచ్చారు. ఆనాడు మోదీ ముఖ్యమంత్రిగా ఉన్న గుజరాత్ నుంచి అధికారులు వచ్చారు. అఖరి క్షణం వరకు వైఎస్సార్ ప్రజల కోసమే ఆలోచించారు.. వైఎస్సార్ చనిపోయాక ఈ తొమ్మిదేళ్ల కాలంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు. వైఎస్సార్ కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా అభివృద్ధి పనులు చేపట్టారు. కానీ ఇప్పుడు జన్మభూమి కమిటీ సిఫారసు చేయనిదే ఏ ఒక్క పని జరగదు. రచ్చబండ కోసం వెళ్లే సమయంలో మూడేళ్లలో పోలవరం, ప్రాణహిత ప్రాజెక్టు పనులను పూర్తిచేయాలి అని రాజశేఖరరెడ్డి అన్నారు. అఖరి క్షణం వరకు ప్రజల కోసమే వైఎస్సార్ ఆలోచించారు. రాజశేఖరరెడ్డి గారి మరణం తరువాత ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. వారిని పరామర్శించడానికి జగన ఓదార్పు యాత్రకు శ్రీకారం చుట్టారు. జగన్ ఓదార్పు యాత్ర చేపడితే మీరు అక్కున చేర్చుకున్నారు. పావురాల గుట్ట వద్ద నాన్న కోసం చనిపోయిన వాళ్లను పరామర్శిస్తానని జగన్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటునే జగన్ ఓదార్పు యాత్ర మొదలుపెట్టారు. దీంతో కాంగ్రెస్ పెద్దలు పొమ్మనలేక పోగ పెట్టారు. దీంతో జగన్ కాంగ్రెస్‌లో ఇమడలేక బయటకు వచ్చారు. దీంతో ఆయనపై కుట్రలు పన్ని ఇబ్బందులకు గురిచేశారు. ఆ రోజు 18 మంది ఎమ్మెల్యేలు మన కోసం రాజీనామా చేశారు. ఎంపీ పదవికి మేకపాటి గారు రాజీనామా చేశారు. ఆ సమయంలో ప్రతి ఒక్కరు వైఎస్ కుటుంబానికి అండగా నిలిచారు. వైఎస్సార్ కుటుంబం ఎప్పటికీ మీకు రుణపడి ఉంటుంది. ఈ తొమ్మిదేళ్లు జగన్ మీ మధ్యనే ఉన్నారు. రాష్ట్రంలో ఏ సమస్య వచ్చిన జగన్ అక్కడ ఉన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండటం కోసం, ఏపీకి ప్రత్యేక హోదా కోసం జగన్ ఢిల్లీ వేదికగా ధర్నాలు, దీక్షలు చేశారు. ప్రత్యేక హోదా సజీవంగా ఉంది అంటే అది జగన్ వల్లనే. వైఎస్సార్ ఆశయాల కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పుట్టింది. రాజశేఖరరెడ్డి, జగన్, షర్మిల పాదయాత్ర చేసినప్పుడు మీరు ఆదరించారు. మా నాన్న నన్ను ఒంటరి చేసి పోలేదని జగన్ గర్వంగా చెప్తారు. నాయకులు పార్టీని విడిచిపెట్టిపోయిన ప్రజలు మనతోనే ఉన్నారు. ఈ రోజు చంద్రబాబు పాలనలో ఎక్కడ చూసిన అన్యాయం, అవినీతి, మోసమే కనబడుతున్నాయి. రాజధాని భూములు, విశాఖలో భూములు, దళితుల భూములను చంద్రబాబు, ఆయన బినామీలు దోచుకుంటున్నారు. రైతులను బ్లాక్ లిస్ట్‌లో పెట్టారు.. చంద్రబాబు 2014లో రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత వారిని మోసం చేసిన చంద్రబాబు.. రైతులను బ్లాక్ లిస్ట్‌లో పెట్టారు. గిట్టుబాటు ధరలు లేక, బ్యాంకులు రుణాలు ఇవ్వక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. తిరిగి రాజన్న రాజ్యం రావాలంటే జగన్ సీఎం కావాలి. చంద్రబాబు పాలనలో ఏమైనా అభివృద్ధి జరిగిందా?. గత ఎన్నికల్లో 600కు పైగా హామీలు ఇచ్చినా చంద్రబాబు ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. అక్కాచెల్లమ్మలకు సున్నా వడ్డీకే రుణాలు.. ఐదేళ్ల పాలనలో చంద్రబాబు ఉద్యోగాలకు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్య శ్రీ పథకాలను నిర్వీర్యం చేశారు. మళ్లీ రాజన్న రాజ్యం రావాలంటే వైఎస్ జగన్ అధికారంలోకి రావాలి. వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే ఎక్కడ వైద్యం చేయించుకున్నా ఆరోగ్య శ్రీ వర్తింపజేస్తారు. గిరిజనులు భూములకు పట్టాలు ఇస్తారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తారు. అంతేకాకుండా గిట్టుబాటు ధరకు గ్యారంటీ ఇస్తారు. పెట్టుబడి సాయంగా రూ. 12,500 అందిస్తారు. విద్యార్థుల కోసం ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తారు. అక్కాచెల్లెమ్మలకు సున్నా వడ్డీ రుణాలు ఇవ్వడంతో పాటుగా ఎన్నికల నాటికి ఉన్న బకాయిలను నాలుగు దఫాలుగా మాఫీ చేస్తారు. గ్రామా సచివాలయాల ద్వారా ఏ పని కావాలన్నా 72 గంటల్లోనే అయిపోతుంది. సంక్షేమ పథకాలు వాలంటీర్ల ద్వారా డోర్‌డెలివరీ చేస్తాం. రైతు ప్రమాదవశాత్తు చనిపోతే ఆ కుటుంబానికి 7లక్షల రూపాయలు అందించడం జరుగుతుంది. గ్రానైట్ కొండలు మింగేశారు.. చోడవరం వ్యవసాయ ఆధారిత ప్రాంతం. చోడవరం షుగర్ ఫ్యాక్టరీ మీద వేల మంది ఆధారపడ్డారు. 2004 వరకు నష్టాల్లో ఉన్న షుగర్ ప్యాక్టరీని రాజశేఖరరెడ్డి లాభాల్లోకి తీసుకువచ్చారు. కానీ తన బినామీలకు అప్పజెప్పేందుకు చంద్రబాబు మళ్లీ నష్టాల్లోకి తీసుకెళ్లారు. లక్ష ఎకరాలకు నీరు ఇవ్వాలని ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పార్ట్ వన్‌కి రాజశేఖరరెడ్డి గారు శ్రీకారం చుట్టారు. చంద్రబాబు, ఆయన అనుచరులు ఏం చేశారంటే.. బుచ్చయ్యపేట మండలంలో 50 కోట్ల విలువైన దళితుల భూములు కబ్జా చేశారు. ఇసుక దోచుకున్నారు. రావికమతం మండలంలో గ్రానైట్ కొండలను మింగేశారు. నీరు చెట్టు అంటూ 36 కోట్లు స్వాహా చేశారు. పింఛన్ల విషయంలో దుర్మార్గంగా వ్యవహరించారు. పింఛను కోసం వికలాంగులు కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి. పింఛన్ల కోసం ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి. వైఎస్ జగన్ అధికారంలో రాగానే.. చోడవరం షుగర్ ఫ్యాక్టర్టీని లాభాల్లోకి తెచ్చుకుందాం. సాగునీటి కాలువలను ఆధునీకరణ చేసుకుందాం. మంచినీటి సమస్యను పూర్తిగా పరిష్కరించుకుందాం. చెరకు రైతులకు జగన్ గిట్టుబాటుధర కల్పిస్తారు. ప్రత్యేక హోదా అనేది మనకు చాలా ముఖ్యమైనది. 25 మంది ఎంపీలను గెలిపించుకుని ప్రత్యేక హోదా సాధించుకుందాం. వైఎస్ జగన్ ఏ రోజు కూడా ఏ పార్టీతో కలువలేదు. ఎవరైతే ప్రత్యేక హోదా ఇస్తారో వాళ్లకు మాత్రమే మద్దతిస్తాం. ఆంధ్ర ప్రజానీకంతోనే వైఎస్సార్ సీపీ పొత్తు. కాంగ్రెస్‌తో కలిసి అక్రమ కేసులు పెట్టినప్పుడే జగన్ భయపడలేదు. అలాంటింది ఇప్పుడు ఎందుకు భయపడతారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కరణం ధర్మశ్రీని, ఎంపీ అభ్యర్థి సత్యవతమ్మను భారీ మెజారిటీతో గెలిపించమ’ని కోరారు. -
చోడవరంలో వైఎస్ విజయమ్మ ఎన్నికల ప్రచారం
-
చొడవరంలో టీడీపీ నేతల దౌర్జన్యం
-
నిలువ నీడ లేని ఆడ బిడ్డ..
ఈమె పేరు కొప్పుల నాగమణి. స్వగ్రామం కృష్ణా జిల్లా చోడవరం. కొన్నేళ్ల కిందట భర్త చనిపోయాడు. పెళ్లిళ్లలో వంట చేస్తూ ఉపాధి పొందుతోంది. ఎక్కడికెళ్లినా... దివ్యాంగురాలైన కూతురిని తనతోపాటు తీసుకెళ్తూ కంటికి రెప్పలా చూసుకుంటోంది. సొంత ఇల్లు లేని నాగమణికి... ప్రభుత్వం ఎంతో గొప్పగా ప్రకటించిన ఎన్టీఆర్ హౌసింగ్ పథకంలోనైనా పక్కా గృహం వస్తుందని ఆశిస్తే నిరాశే మిగిలింది. అధికార పార్టీ స్థానిక నాయకులను కలిసినా ఫలితం లేకపోయిందని వాపోతోంది. తనకున్న కొద్దిపాటి స్థలంలో ఇల్లు కట్టుకుంటానని అధికారులను వేడుకుంటే, పునాది వేశాకే డబ్బు మంజూరు చేస్తామంటున్నారు. ఆ స్థాయి స్థోమత కూడా లేని నాగమణి ఇదుగో ఇలా స్థలం చుట్టూ పాక వేసుకుని, ఇంటికి రక్షణగా ఫ్లెక్సీలను ఉంచి జీవనం వెళ్లదీస్తోంది. -
ఎమ్మెల్యే రాజు అక్రమార్క
వరసగా రెండుసార్లు ప్రాతినిథ్యం వహించే అవకాశం కల్పించిన చోడవరం ప్రజలకు ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్ రాజు చేసిందేంట్రా బాబు అంటే.. అభివృద్ధిలో నియోజకవర్గాన్ని అట్టడుగు స్థానంలో నిలిపి, అవినీతి, అక్రమాల్లో మొదటి స్థానానికి తీసుకెళ్లడం. నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ లీజులు పొంది గ్రానైట్ గనులను ఎమ్మెల్యే అండ్ కో దోచుకుంటున్నారు. ఆవు చేలో మేస్తే.. దూడ గట్టున మేస్తుందా అన్నట్టుగా రాజు గనులకు ఎసరు పెడుతుంటే.. ఆయన అనుచరగణం అందినకాడికి దోచుకోవడంలో ఆరితేరిపోయారు. ఇసుక, మట్టి, కంకర, గ్రావెల్ ఇలా అన్నింటిని చెరబట్టి కోట్లు వెనకేసుకుంటున్నారు. ఇక అభివృద్ధి, సంక్షేమ పథకాల పేరు చెప్పి పర్సంజేట్లు, మామూళ్లు దండుకుంటున్నారు. ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలు దర్జాగా కబ్జా చేసి గుట్టుచప్పుడు కాకుండా అమ్మేస్తున్నారు. ఇక నియోజకవర్గ అభివృద్ధి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. స్వయంభూ విఘ్నేశ్వరుడు వెలసిన ఆధ్యాత్మిక ప్రాంతం.. ఎందరో రైతులు, కార్మికుల బతుకుల్లో తీపిని పంచుతున్న గోవాడ సుగర్స్.. విస్తరాకుల తయారు చేయడంలో రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందిన కొత్తకోట.. శారద, పెద్దేరు, బొడ్డేరు, తాచేరు, సర్పా, వరాహా నదుల ప్రవాహం... మెట్ట.. మాగాణి ఆయకట్టు కలగలిసిన ప్రాంతం ‘చోడవరం’. అలాంటి ఈ నియోజకవర్గంలో ఉపాధి హామీ పథకంలో వేసిన సీసీ రోడ్లు తప్పితే ఐదేళ్ల టీడీపీలో పాలనలో చెప్పుకోదగ్గ అభివృద్ధి పని ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. ఒక్క పరిశ్రమ రాలేదు. ఏ ఒక్కరికీ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించలేదు. అంతెందుకు నదులన్నీ ఈ నియోజకవర్గంలోనే ప్రవహిస్తున్నా.. నాలుగో వంతు పంచాయతీలకు గుక్కెడు మంచి నీళ్లు దొరకని దుస్థితి ఉంది. ప్రజలు.. తమ బాగోగులు చూస్తారని అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే ఏం చేస్తున్నారయ్యా అంటే.. కనిపించిన కొండను పిండి చేయడం, తద్వారా కోట్లు వెనుకేసుకోవడం, ప్రభుత్వ భూమల ఆక్రమణలో ఆరితేరిన అనుచరగణానికి అండగా నిలవడం.. ఇసుక అక్రమ వ్యాపారాల్లో దండుకోవడం.. ఇలా అవినీతిలో రా‘రాజు’గా వెలుగొందుతున్నారు. – సాక్షి టాస్క్‌ఫోర్స్ ‘రాజు’ గారి గుప్పిట్లో గనులు జిల్లాలో గ్రానైట్ కింగ్ ఎవరంటే అందరికీ ఠక్కున గుర్తొచ్చే పేరు చోడవరం ఎమ్మెల్యే రాజుదే. ఎక్కడైనా కొండ కనిపిస్తే చాలు ఒక బిడ్ వేసి ఆ కొండను పిండి చేసి కోట్లు ఎలా కూడబెట్టాలో ఆయనకు తెలిసినంతగా ఎవరికీ తెలియదని సొంత పార్టీ నాయకులే చెబుతుంటారు. సొంత సర్వేయర్లతో సర్వే చేయిస్తారు. విలువైన గ్రానైట్ ఉన్నట్టయితే ఓ దరఖాస్తు పడేస్తారు. ఆ తర్వాత ఎవరైనా దరఖాస్తు చేస్తే మొదట దరఖాస్తు చేసుకున్న వారికే క్వారీ లీజు అనుమతులు కేటాయించాలన్న గనుల శాఖ నిబంధన మేరకు ఈయన దరఖాస్తు తెరపైకి వస్తుంది. ఆ సమయంలో గుడ్‌విల్‌గా కొంతసొమ్ము తీసుకుని తాను సిఫార్సు చేసిన వారికి లీజు హక్కులు దక్కేలా చక్రం తిప్పుతారు. ఇంకా మంచి గ్రానైట్ పడితే అక్కడ స్లీపింగ్ పార్టనర్‌గా ఉంటారు. మాడుగుల, చోడవరం నియోజకవర్గాల్లో గ్రానైట్ కొండలను వెలుగులోకి తీసుకు రావడమే కాదు వాటిని తానే సొంతం చేసుకుని దర్జాగా వ్యాపారం సాగిస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యేగా వరసగా రెండు సార్లు ఎన్నికయినప్పటికీ కాంగ్రెస్ హయాంలో కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన రాజకీయ పలుకుబడితో పలు గ్రానైట్ క్వారీలకు లీజులు సంపాదించుకున్నారు. 2014లో రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడంతో ఈయన క్వారీ సామ్రాజ్యానికి అడ్డులేకుండా పోయింది. మాడుగుల, రావికమతం, రోలుగుంట మండలాల్లోనూ, మన జిల్లాతో పాటు ఇతర జిల్లాల్లోనూ కొన్ని తన పేరిట, మరికొన్ని బినామీల పేరిట ఎమ్మెల్యే రాజుకు క్వారీలు ఉన్నట్టుగా ఆయన అనుచరులే చెబుతున్నారు. తవ్వకాలకు అడ్డు చెబితే బెదిరింపులే.. తక్కువ హెక్టార్లకు లీజు పొంది రెట్టింపు విస్తీర్ణంలో గ్రానైట్ తవ్వేసి అడ్డంగా దోపిడీ చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అడ్డు తిరిగిన రైతులను, గ్రామస్తులను తన అధికార బలంతో భయబ్రాంతులకు గురిచేసి తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారన్న అభియోగాలు ఉన్నాయి. తన పేరున ఉన్న ఎరుకవాడ క్వారీ వద్ద ఇలాంటి సంఘటనే జరిగింది. తమ క్వారీకి ఆనుకుని ఉన్న రైతుల పొలాలను లీజుకు తీసుకోవాలని భావించి తక్కువ ధరను ఇవ్వచూపారు. దీనికి వారు నిరాకరించారు. క్వారీలో జరిగే బ్లాస్టింగ్లు కారణంగా రాళ్లు దిగువన ఉన్న పొలాల్లోకి వచ్చి పడి పంటలు నష్టపోతుండటంతో రైతులు తీవ్రంగా ప్రతిఘటించి ఆందోళన కూడా చేశారు. ఆ రైతులను తన అధికారంతో కొంత ఇబ్బందులకు గురిచేసిన సంఘటన అందరికీ తెలుసు. ఈ క్వారీని నెలకు రూ.లక్ష చొప్పున గుడ్‌విల్ కింద వేరొకిరి ఇచ్చేశారు. వమ్మలి జగన్నాథపురంలో ఉరలోవ కొండ గ్రానైట్ క్వారీలో ఎమ్మెల్యేకు ప్రధాన భాగస్వామ్యం ఉన్నట్టు సమాచారం. ఈ క్వారీ చుట్టు పక్కల ఉన్న రైతుల భూములను తక్కువ ధరకే దక్కించుకుని తన బినామీదారుల పేరున పెట్టారు. క్వారీకి రోడ్డు వేసేందుకు కొందరు భూములను ఇవ్వాలని కోరగా వారు అంగీకరించకపోవడంతో అధికారంతో వారిని బెదిరించి రోడ్డు వేయించారు. ఇక్కడ 15 హెక్టార్లకు లీజు అనుమతి తీసుకున్నప్పటికీ ఇప్పటివరకు 25 హెక్టార్లకు పైనే అక్రమంగా క్వారీ చేసి రూ.లక్షలు సంపాదించినట్టు తెలిసింది. రావికమతం మండలంలో ఇటీవల మరుపాక కొండ వేరొకరి పేరున క్వారీకి లీజు వేయించిన ఎమ్మెల్యే స్థానికులను ఒప్పించే ప్రయత్నం చేశారు. అక్కడ స్థానికులు ఆందోళనకు దిగి గొడవ చేయడంతో తాత్కాలికంగా క్వారీ తవ్వకాలు ఆపారు. అంతా ఎమ్మెల్యే కనుసన్నల్లోనే.. టి.అర్జాపురం, డోలన్నపాలెం, అజయ్పురం, జెడ్.బెన్నవరం క్వారీలకు వేరొకరి పేరున లీజులు వేయించి చెన్నై, హైదరాబాద్‌లకు చెందిన కొందరు వ్యక్తుల నుంచి రూ.లక్షలు తీసుకుని అమ్మేసుకున్నట్టు సమాచారం. తోటకూరపాలెం, గుడ్డిప క్వారీల్లో ఎమ్మెల్యేకు కొంత భాగస్వామ్యం ఉన్నట్టు తెలిసింది. ఈ క్వారీలకు చుట్టూ భూములు లీజుకు తీసుకునే విషయంలో కూడా ఎమ్మెల్యే సహకారం అందించినట్టు సమాచారం. కొట్నాబిల్లి గ్రానైట్ క్వారీ తన కుటుంబ సభ్యుల పేరున కొంత కాలం నిర్వహించి, తర్వాత స్లీపింగ్ పార్టనర్‌గా వేరొకరికి లీజు అనుమతులు అమ్మేశారు. ఈ వ్యవహారంలో కొంత డబ్బు గుడ్‌విల్‌గా కూడా తీసుకున్నట్టు తెలిసింది. కోటవురట్ల సమీపంలో కూడా ఈయనకు క్వారీ ఉంది. అంతే కాకుండా ఇతర జిల్లాలో కూడా కొన్ని క్వారీలు ఈయన సొంతంగానూ, బినామీల పేరున నిర్వహిస్తున్నట్టు సమాచారం. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఈయన వ్యాపారానికి మరింత అడ్డులేకుండా పోయింది. గ్రానైట్ క్వారీలకు అడ్డు వచ్చే వారిని తన అధికారంతో ఎలా ఇబ్బందులుపెడుతున్నారో గతంలో ఆయా క్వారీల వద్ద ప్రజలు, ప్రజాసంఘాల ఆందోళనలు బట్టి చూస్తే అర్థమవుతుంది. గ్రానైట్, క్వార్జ్, ఇతర గనుల క్వారీ వ్యాపారం చేసే యజమానులందరూ వడ్డాది కేంద్రంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. వారికి రాజకీయంగా అండగా ఉంటూ గనుల దోపిడీలో ఈయన కీలకపాత్ర పోషిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నీరు–చెట్టు పనుల్లో దోపిడీ ప్రధానంగా సాగునీటి చెరువు, పంట కాలువల్లో పూడికలు తీయడం, అవసరమైన చోట స్లూయీస్‌లు, మదుంలు నిర్మించడం వంటి పనులను నీరు చెట్టు నిధులతో చేశారు. నియోజకవర్గంలో సుమారు రూ.15 కోట్లతో నామినేటెడ్ పద్ధతిలో నీరు–చెట్టు పథకంలో పనులు చేశారు. గతంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో పూడికలు తీసిన చెరువుల్లోనే మరలా నీరు–చెట్ల నిధులతో యంత్రాలను ఉపయోగించి అరకొరగా పూడికలు తీసి, దాదాపు రూ.5 కోట్ల దోపిడీకి పాల్ప డ్డారు. ఉదాహరణకు నర్సాపురంలో ఒకే చెరువుకు మూడుసార్లు పూడికలు తీసినట్టు చూపించించి టీడీపీ జన్మభూమి కమిటీ సభ్యుడు సత్యనారాయణ సుమారు రూ.20 లక్షల మేర నిధులు పక్కదారి పట్టించారు. కొన్ని చెరువులకు కట్టిన స్లూయీస్‌లు, మదుంలు వర్షాలకు వెంటనే కొట్టుకుపోవడంతో ఈ పనుల్లో నాణ్యతా లోపం బట్టబయలైంది. సీనరేజ్ కట్టకుండానే చెరువుల్లో తీసిన మట్టిని అమ్మడం ద్వారా సుమారు రూ.10 కోట్ల మేర అక్రమంగా కొందరు టీడీపీ నాయకులు సంపాదించుకున్నారు. ప్రభుత్వ జాగా.. వేసేయ్ పాగా.. చోడవరం మండలంలో వెంకన్నపాలెం, గంథవరం, రాయపురాజుపేట, శీమునా పల్లి, ఖండిపల్లి, చాకిపల్లి, రామజోగిపాలెం, జన్నవరం, చోడవరం, బెన్నవోలు, అంబేరుపురం, ముద్దుర్తి, దుడ్డుపాలెం, నర్సయ్యపేట, లక్ష్మీపురం గ్రామాల్లో ప్రభుత్వ బంజరు, కొండ పోరంబోకు భూములు ఆక్రమణకు గురయ్యాయి. ఇందులో ఎక్కువగా అధికార పార్టీ నాయకులు ఆక్రమించుకున్నారు. 2004 నుంచి ఇక్కడ ఉన్న టీడీపీ ఎమ్మెల్యేను అడ్డుపెట్టుకుని వందలాది ఎకరాల్లో అక్రమంగా డీ ఫారం పట్టాలు పొందారు. వెంకన్నపాలెం రెవెన్యూ పరిధిలో 432, 436 సర్వే నంబర్లలో సుమారు 317 ఎకరాల కొండ పోరంబోకు భూమి ఉండగా టీడీపీ నాయకులే సుమారు 70ఎకరాల మేర సీఎల్డీపీ పథకంలో అక్రమంగా భూ పట్టాలు పొందారు. విషయం ఏమిటంటే.. ఇక్కడ సాగులో ఉన్న వెంకన్నపాలేనికి చెందిన రైతులకు ఈ భూములపై హక్కులు ఇవ్వకుండా.. ఎమ్మెల్యే సహకారంతో ఇతర ప్రాంతానికి చెందిన మోతుబరులైన టీడీపీ నాయకులకు డీ ఫారం పట్టాలు ఇచ్చారు. ఇక్కడ ఒకే చోట 500 ఎకరాలకు పైబడి బంజరు భూమి ఉండటంతో దొరికిన కాడికి ఆక్రమించుకుని ఎవరికి వారు ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవల ఈ పట్టాలన్నీ రద్దు చేసేందుకు రెవెన్యూ అధికారులు ప్రతిపాదన కూడా పెట్టారు. ఉదాహరణలివిగో... వెంకన్నపాలెం రెవెన్యూలో సర్వే నం.432లో కొండ బంజరులో టీడీపీ నాయకుడు, మా జీ వైస్ ఎంపీపీ ఉరుకుటి పెదరాము నాయుడు 5 ఎకరాలు ఆక్రమించి, మామిడి, జీడిమామిడి, యూకలిఫ్టస్ మొక్కలు వేసి సాగు చేస్తున్నారు. మరో 2 ఎకరాలకు ఆయన భార్య కాంతమ్మ పేరున డీ ఫారం పొందారు. పక్కనే ఉన్న మరో 3 ఎకరాలను కూడా ఆక్రమించేసుకున్నారు. వీటి విలువ అరకోటి పైమాటే. సబ్బవరం రోడ్డులో 530, 531 సర్వే నంబర్లలో రూ.3కోట్ల విలువైన సుమారు 2 ఎకరాల స్థలాన్ని టీడీపీ స్థానిక నాయకుడు, మాజీ సర్పంచ్ బూరా వెంకటరమణ, ఆయన అనుచరులు కలిసి ఆక్రమించుకున్నారు. ఈ భూమిని అనకాపల్లి, చౌడువాడ ప్రాంతాలకు చెందిన ఇద్దరు రియల్టర్ల్లకు అమ్మేశారు. ఈ విషయంపై స్థానికులు రెవెన్యూ అధికారులు ఫిర్యాదు చేయడంతో వారు సర్వే చేసి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. అయినా ఇక్కడ ఆక్రమణలు ఆగలేదు. చోడవరం మండలంలో రూ.15 కోట్ల విలు వైన 120 ఎకరాలు ఆక్రమణలకు గురి కాగా, బుచ్చెయ్యపేట మండలంలో రూ.25 కోట్లు, రావికమతంలో రూ.30కోట్ల విలువైన బంజరు భూములు టీడీపీ నేతల చెరలో ఉన్నాయని అధికారులు గుర్తించారు. రూ.8 కోట్ల తడిసిన పంచదార గోల్మాల్ గోవాడ సుగర్స్‌లో రూ.8 కోట్ల గోల్మాల్ వ్యవహారంలో టీడీపీ నాయకుడు, ఎమ్మెల్యే కుడిభుజంగా ఉన్న ఫ్యాక్టరీ చైర్మన్ గూనూరు మల్లునాయుడు రూ.లక్షలు దోచుకున్నారనే ఆరోపణ ఉంది. హుద్‌హుద్ సమయంలో అధికార టీడీపీకి చెందిన చైర్మన్ గూనూరు మల్లు నాయుడు ఆధ్వర్యంలో పాలకవర్గం, స్థానిక ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్ రాజు సహకారంతో తడిసిన పంచదార అమ్మకాల్లో భారీగా అవినీతి జరిగింది. దీనిపై రైతులు, అఖిలపక్షాలు ఆందోళనలు చేయడం, అప్పటి ఎండీతో పాటు 6 గురు ఉద్యోగులను సస్పెండ్ చేయడం కూడా జరిగింది. కాని ఫ్యాక్టరీలో ఏ పని జరిగిన అది చైర్మన్ దృష్టిలో లేకుండా, ఆయన నిర్ణయం లేకుండా జరగదు. అధికార పార్టీకి చెందిన పాలకవర్గం కావడంతో చైర్మన్‌పై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అదే విధంగా అవసరం లేక పోయిన కాంట్రాక్టు పద్ధతిలో టీడీపీ కార్యకర్తలను చైర్మన్, ఎమ్మెల్యే అనుచరులను గోవాడ సుగర్ ఫ్యాక్టరీలో నియామకాలు చేపట్టారు. ఈ వ్యవహారంలో చైర్మన్ రూ.లక్షలు దండుకున్నారు. పాలకవర్గం వచ్చాక విజ్ఞాన, విహార యాత్రలు పేరుతో కొంత, అవసరానికి మించి ఓవరాయిలింగ్ పనులకు అదనపు దుబారా ఖర్చులు చేసి భారీగా చైర్మన్ కమీషన్లు తీసుకున్నారు. ఇసుక అక్రమ తవ్వకాలు, వ్యాపారం శారద, పెద్దేరు, బొడ్డేరు, తాచేరు, సర్పా నదుల్లో ఇసుక అక్రమ వ్యాపారం వెనుక టీడీపీ నాయకులు ఉన్నారు. తన సొంత పార్టీ నాయకులు చేస్తున్న ఈ వ్యాపారానికి స్థానిక ఎమ్మెల్యే అండదండలు ఉండటంతో ఇసుక మాఫియాకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. ఏటా సుమారు రూ.4 కోట్ల మేర ఇక్కడ ఇసుక అక్రమ వ్యాపారం జరుగుతోంది. అధికార పార్టీ నాయకులకు చెందిన ఇసుక లారీలు, ట్రాక్టర్లు పట్టుకుంటే వెంటనే ఎమ్మెల్యేనే నేరుగా ఫోన్లు చేసి విడిపించడంతో పోలీసు, రెవెన్యూ, మైన్స్ అధికారులు సైతం ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. చోడవరం జెడ్పీటీసీ సభ్యుడు మత్స్యరాజు కుటుంబసభ్యులతోపాటు గోవాడ సర్పంచ్ ఏడువాక లక్ష్మణకుమార్, జుత్తాడ సర్పంచ్ సత్యనారాయణ, మాజీ సర్పంచ్ పల్లా అర్జున, సింహాద్రిపురానికి చెందిన టీడీపీ నాయకుడు, గవరవరం సర్పంచ్ చప్పగడ్డ అప్పలనాయుడు, దుడ్డుపాలేనికి చెందిన కొందరు ఇసుక మాఫియా సభ్యులు, లక్ష్మీపురం, భోగాపురం, విజయరామరాజుపేట, వడ్డాది, రావికమతం, కరక ప్రాంతాలకు చెందిన టీడీపీ నాయకులు ఈ ఇసుక అక్రమ వ్యాపారంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. దళితుల భూములనూ వదల్లేదు రావికమతం మండలంలో ఆక్రమణల్లో ఎక్కువ మేర భూములు కొండ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూములే. ఇవన్నీ ఆయా గ్రామాల్లోని నిరుపేద గిరిజన, దళిత మహిళల వద్దే ఉన్నాయి. అయితే కొత్తకోట గ్రామంలో సర్వే నంబర్ 244–2 ఏ లోనూ, 219లో 8సెంట్ల గ్రామ కంఠం భూములు మాత్రం వాస్తవంగా శారద మహిళా మండలి పేరుతోనూ, శ్రీ సీతారామ యువజన సంఘం పేరుతో పట్టాలున్నాయి. ఇవి ఆ గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు వెల్లంకి మోదినాయుడు చేతిలో ఉన్నాయి. పి.పొన్నవోలు రెవెన్యూలో 400 ఎకరాలు తూర్పుగోదావరి జిల్లా నుంచి ఇక్కడి వచ్చి స్థిరపడ్డ బొట్టా సూర్యారావు కుటుంబ సభ్యుల పేరున, విశాఖకు చెందిన బడా వ్యాపారులు చేతుల్లో బినామీ పేర్లతో ఉండగా, కొత్తకోట గ్రామకంఠం భూముల్లో శారద మహిళా మండలి భవనం, దాని పక్కనే సుమారు రూ.40 లక్షలు విలువైన 4 సెంట్ల స్థలం, వెల్లంకి వారి రామకోవెల వద్ద శ్రీ సీతారామ యువజన సేవా సంఘం పేరుతో విలువైన భూమి టీడీపీ నాయకుడి చేతిలో ఉన్నాయి. నీరు–చెట్టు నిధులు దోచుకున్నారు నర్సాపురం గ్రామంలో చెరువును పూడికలు తీయకుండానే తీసినట్టుగా రికార్డుల్లో నమోదు చేసి గ్రామ జన్మభూమి కమిటీ ప్రతినిధులైన టీడీపీ నాయకులు రూ.15 లక్షల వరకు నిధులు దోచుకున్నారు. ఒకే చెరువుకు మూడుసార్లు పని చేసినట్టుగా చూపించడంతోపాటు గతంలో ఎన్ఆర్జీఎస్ పనులు చేసిన చెరువులోనే నీరుచెట్టు పనులు చేసినట్టు రికార్డులు సృష్టించి బిల్లులు చేసుకున్నారు. వీరికి ఎమ్మెల్యే మద్దతు పలకడంతో అధికారులెవ్వరూ చర్యలు తీసుకోలేదు. టీడీపీ నేతల దోపిడీకి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఈ విషయమై గతంలో కలెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేశాం. – దొడ్డి హనుమంతు, నర్సాపురం, చోడవరం మండలం -
251వ రోజు వైఎస్ జగన్ ప్రజాస్ంకల్ప యాత్ర
-
అధికారంలోకి రాగానే చోడవరం చక్కెర ఫ్యాక్టరీ తెరిపిస్తాం..
-
ముగిసిన 251వ రోజు వైఎస్ జగన్ పాదయాత్ర
-
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం పెడతాం
-
త్రినాథ్ ఆత్మహత్యకు సీఎం కారణం కాదా?: వైఎస్ జగన్
సాక్షి, చోడవరం(విశాఖ జిల్లా): ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్య చేసుకున్న త్రినాథ్ మృతికి సీఎం చంద్రబాబు కారణం కాదా అని ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. 251వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా చోడవరం బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ప్రత్యేక హోదా కోసం 2015లో చిత్తూరు జిల్లాలో తొలి బలవన్మరణం జరిగినపుడే సీఎం చంద్రబాబు మేల్కొని ఉంటే ఇలా జరిగేదా? అప్పుడే చంద్రబాబు ఎన్డీఏ ప్రభుత్వం నుంచి వైదొలుగుంటే ప్రత్యేక హోదా రాకపోయేదా?’ అని ప్రశ్నించారు. ఈ సభలో జగన్ ఇంకా ఏమన్నారంటే.. సర్వం మాయం.. ‘పాదయాత్ర చేస్తుంటే ఇక్కడి ప్రజలు నాదగ్గరికి వచ్చి మా జిల్లాలో 15 నియోజకవర్గాలున్నాయన్నా.. 2014 ఎన్నికల్లో చంద్రబాబునాయుడి గారికి ఈ చోడవరం నియోజకవర్గంతో సహా 15కు 12 నియోజకవర్గాలు ఇచ్చాం. అవి చాలవని, మరో ఇద్దరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనేశారు. 14 మంది ఎమ్మెల్యేలు పక్కనే పెట్టుకున్నారు. అయినా మాకు చేసిందేమిటన్నా? అని అడుగుతున్నారు. చంద్రబాబు డైరెక్షన్లో ఇక్కడి నాయకులు దేన్ని కూడా వదిలిపెట్టకుండా సర్వం దోచేస్తున్నారన్నా అని చెబుతున్నారు. బుచ్చయ్య మండలంలోని తాళ్లపుడి, పెదమదీనాలో ప్రభుత్వ భూములను వదిలిపెట్టలేదు. శెట్టిదొరపాలెంలో దళితుల భూములు కూడా వదిలిపెట్టలేదు. రోలుగుండ మండలంలో జేసీ అగ్రహారంలో 412 ఎకరాలను స్వాహా చేసేందుకు స్థానిక ఎమ్మెల్యే యత్నిస్తున్నారు. ఇసుకను ఫ్రీగా ఇస్తామని చంద్రబాబు చెబుతున్నారు. కానీ 2 యూనిట్ల ఇసుక రూ.16 వేలకు అమ్ముతున్నారన్నా అని నాతో ఆవేదన వ్యక్తం చేశారు. తోటకూర పాలంలో గ్రానైట్ వదిలిపెట్టడంలేదు. అనుమతులకు మించి మైనింగ్ చేస్తుంటే లంచాలు తీసుకుని ఎమ్మెల్యే పబ్బం గడుపుతున్నాడు. నీరుచెట్టు కింద పనులు చేయకపోయినా చేసినట్లు 36 కోట్లు దోచెశారని ఇక్కడి ప్రజలకు నాతో అన్నారు. పోలియోతో బాధపడుతున్న ఆళ్ల ఆశకు పెన్షన్ కావాలంటే కోర్టుకు వెళ్లామని ఆమె కుటుంబసభ్యులు బాధపడ్డారు. పెద్దకూడు సోమనాయుడు ప్రమాదంలో రెండు చేతులు, రెండుకాళ్లు పోయినా.. ఎంపీడీవో కార్యాలయం ముందు ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరిస్తే పెన్షన్ ఇచ్చారన్నా అని నాతో చెబుతూ ఆవేదన వ్యక్తం చేశాడు. చెరకు రైతులను ఆదుకుంటాం.. చోడవరం ఫ్యాక్టరీపై దాదాపు 20వేల మంది రైతులు ఆధారపడ్డారు. గతంలో ఇదే చంద్రబాబు పాలనలో ఈ ఫ్యాక్టరీ 45 కోట్ల నష్టాల్లోకి వెళ్లింది. ఆయన కోఆపరేటివ్ ఫ్యాక్టరీలను బతకనివ్వడు. తెలిసిన వారికి వాటిని శనక్కాయపుట్నాల్లా అంటగడుతాడు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ఫ్యాక్టరీలకు పునర్వైభవం తీసుకొచ్చారు. సబ్సిడీ కూడా ఇచ్చారు. 45 కోట్ల నష్టాల్లో ఉన్న ఫ్యాక్టరీని లాభాల్లోకి తీసుకొచ్చారు. మళ్లీ బాబు సీఎం అయ్యాడు. ఆ ఫ్యాక్టరీ 100 కోట్ల నష్టాల్లోకి వెళ్లింది. మనందరి ప్రభుత్వం అధికారంలోకి వస్తే జగన్ అనే నేను మీ అందరికి విశాఖ జిల్లాలో ఉన్న అన్ని ఫ్యాక్టరీలను తెరిపిస్తానని హామీ ఇస్తున్నాను. 100 కోట్ల నష్టాల్లో ఉన్న చోడవరం ఫ్యాక్టరీకి పూర్వవైభవం తీసుకొస్తామని తెలుపుతున్నాను. రైతులకు గిట్టుబాటు ధర.. గిట్టుబాటు ధర లేక, అప్పులు భరించలేక వ్యవసాయం మానేసే పరిస్థితి ఉందన్నా అని ఇక్కడి ప్రజలు నాతో ఆవేదన వ్యక్తం చేశారు. బెల్లం ఉత్పత్తి తగ్గిపోయింది. రైతులకు బెల్లం క్వింటాకు రూ. 2500 కూడా రావడం లేదు. అదే బెల్లం హెరిటేజ్‌లో కేజీ రూ.84కు అమ్ముతున్నారు. నర్సీపట్నం-భీమిలి రోడ్డు విస్తరణను పట్టించుకునే నాథుడే లేరు. నాలుగున్నరేళ్ల చంద్రబాబు పరిపాలన చూశాం. రైతన్న పండించిన ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. రైతుల నుంచి ఉల్లి కేజీ రూ.4 కొని హెరిటేజ్‌లో రూ.25కు అమ్ముతున్నారు. బత్తాయి రైతు నుంచి రూ.12కు కొని హెరిటేజ్‌లో రూ.40కి అమ్ముతున్నారు. చంద్రబాబు దళారీగా వ్యవహరిస్తున్నారు. గిట్టు బాటు ధర లేక అప్పులు తీరలేక రామయ్య-వడ్రమ్మ అని దంపతులు ఆత్మహత్య చేసుకోవడం మనం చూశాం. రెండో పెళ్లాం కోసం.. చంద్రబాబు నాలుగున్నరేళ్లుగా బీజేపీతో సంసారం చేశారు. అప్పుడు ప్రత్యేక హోదా గురించి గుర్తుకు రాలేదు. తీరా విడాకులు తీసుకుని మొదటి పెళ్లాం మంచిది కాదు అంటున్నాడు. వెంటనే రెండో పెళ్లాం కోసం పరుగెడుతున్నాడు. ఆ రెండో పెళ్లాం ఎవరో తెలుసా మన రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టిన కాంగ్రెస్ పార్టీ. విశాఖలో మీటింగ్ పెట్టి 40 లక్షల ఉద్యోగాలు అంటాడు. ఎవరికైనా వచ్చాయా అని అడుగుతున్నా? ధర్మపోరాటం అని డ్రామాలు ఆడుతుంటే ఈ రాష్ట్రంలో ధర్మం, న్యాయం బతికుందా అని అడుగుతున్నా? చివరకు గుడి భూముల్ని సైతం చంద్రబాబు వదలట్లేదు. బాబు పాలనలో విద్యార్థుల ఫీజులు విచ్చలవిడిగా పెరిగాయి. బాబు బినామీ కాలేజీల్లో ఇంటర్ చదవాలంటే ఏడాదికి లక్షా ఆరవై వేలు కావాలి. ప్రభుత్వం స్కూళ్లను దగ్గరుండి నిర్వీర్యం చేస్తున్నారు. 20వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నా భర్తీ చేయడం లేదు. ఫీజులు తగ్గిస్తాం.. మనందరి ప్రభుత్వం వచ్చాక స్కూల్, కాలేజీ ఫీజులు తగ్గిస్తానని హామీ ఇస్తున్నా. ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ ఇంగ్లీష్ మీడియం చేస్తాం. అన్ని ప్రభుత్వ పాఠశాలలను తెరిపిస్తాం. ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని చంద్రబాబు నిర్వీర్యం చేశారు. ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలు ఫీజులు అడ్డగోలుగా పెంచేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఇటీవల జ్వరాలతో 200 మంది మృతి చెందారు. ఆరోగ్య పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోది. మంత్రి యనమల పంటినొప్పి వస్తే సింగపూర్ వెళ్తారు. అదే పేదవాడు వైద్యం కోసం హైదరాబాద్‌కు వెళ్తే ఆరోగ్యశ్రీ కట్ చేస్తారు. విజయవాడలో ఇద్దరు బాలింతలకు ఒకే మంచడం ఉండటంతో ఒకరు కిందపడి మృతి చెందారు. ఈ ఘటనతో రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుస్తోంది. ఇలా సమస్యలతో సతమతమవుతున్న రాష్ట్రం వైపు ఒకసారి చూడండి. నాలుగున్నరేళ్లు అయింది. మరో ఆరునెలల్లో ఎన్నికలు వస్తాయి. గుండెల మీద చేయివేసుకొని ఎలాంటినాయకుడు కావాలో ఆలోచించమని కోరుతున్నా. అబద్దాలు చెప్పే నాయకులు కావాలా అని అడుగుతున్నా(వద్దు వద్దు ప్రజల నుంచి), మోసాలు చేసే వారు కావాలా? మీ మనస్సాక్షి చెప్పినట్లు ఓటేయండి’ అని వైఎస్ జగన్ కోరారు. -
నవ వధువు ఆత్మహత్య
విశాఖపట్నం, రోలుగుంట(చోడవరం): పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుంది. భర్త వద్ద రెండు నెలలు ఉండి, ఆషాఢ మాసంలో అమ్మవారింటికి వచ్చింది. శ్రావణ మాసం రావడంతో అత్తవారు కోడలిని తమ ఇంటికి పంపించాలని కోరారు. మరో వారంలో కుమార్తెను అత్తవారింటికి పంపించేం దుకు ఆ తల్లి అన్నీ సిద్ధం చేసుకుని కుమార్తెతో బుధవారం రాత్రి ఆ విషయం చెప్పింది. మరి ఆ రాత్రి నవవధువు భూలక్ష్మి(19) ఏమనుకుందో, ఏమో గాని గురువారం రోలుగుంట సమీపంలో చెక్కల మిల్లు వద్ద బావిలో శవమై తేలింది. ఈ సంఘటన మండలవాసులను కలచివేస్తుంది. దీనికి సంబంధించిన స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలం కొండపాలెం గ్రామానికి చెందిన పిల్లా సత్తిబాబు, మణమ్మలకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తెకు ఆరేళ్ల వయస్సు దాటిన తరువాత సత్తిబాబు అనారోగ్యంతో మృతి చెందాడు. అప్పటి నుంచి కుమారుడు స్వామిని, కుమార్తె భూలక్ష్మిని తల్లి మణమ్మ కూలిపనులు చేస్తూ పోషించింది. కుమార్తెకు మాకవరపాలెం మండలం గిడితూరు గ్రామానికి చెందిన అధికారి అప్పలనాయుడు, వరలక్ష్మిల కుమారుడు శ్రీనుతో ఈ ఏడాది మే 3వ తేదీన వివాహం జరిపించింది. అందరూ ఆనందించారు. అయితే విధి వక్రీకరించింది. ఆషాఢమాసానికి తన ఇంటికి వచ్చిన బిడ్డ, శ్రావణమాసంలో ఆనందంగా అత్తవారింటికి వెళుతుందని తల్లి పెట్టుకున్న ఆశలు ఆడియాసలయ్యాయి. కుమార్తె చనిపోయిన విషయం తెలుసుకున్న ఆమె గుండెలు ఆవిసేలా రోదించింది. కుమార్తె మృతి చెందిన విషయాన్ని గురువారం స్థానిక పోలీసులకు మణమ్మ ఫిర్యాదు చేసింది. వివాహబంధంపై అంగాహన లేకే ఇలా చేసి ఉంటుందని ఫిర్యాదులో పేర్కొంది. ఎస్ఐ హరికృష్ణ, మండల మేజిస్ట్రేట్ పి.అప్పలనాయుడితో కలసి బావి వద్దకు వెళ్లి పరిశీలించారు. మృతురాలి కుటుంబ సభ్యులను, బంధువులను విచా రించారు. గ్రామ పెద్దల సమక్షంలో పంచనామా నిర్వహించారు. నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. -
ఎంత ఘోరం!
స్కూలు వదిలారు.. బిలబిలమంటూ పిల్లలు బస్సు చుట్టూ చేరారు.. సీటు కోసం ఎగబడుతున్న చిన్నారులు బ్యాగులను బస్సులో వేస్తున్నారు.. ఇంతలో గుండెలు పిండేలా ఆర్తనాదం.. ఎక్కే ప్రయత్నంలో కాలు జారిన విద్యార్థిపైకి వెనక్కి మళ్లుతున్న బస్సు చక్రాలు ఎక్కేశాయి.. కొత్త స్కూల్లో చేరి ఇంకా రెండు వారాలు కూడా కాకముందే పదకొండేళ్ల చిన్నారి విగత జీవిగా మిగిలాడు.. రావికమతం, బుచ్చెయ్యపేట (చోడవరం): పిల్లలిద్దరినీ ఆ ఊళ్లో రామలక్ష్మణులని పిలుస్తారు.. అన్న మరుపాక మోడల్ స్కూల్లో చదువుతున్నాడని తమ్ముడినీ అదే స్కూల్లో చేర్చారు.. ముద్దులొలికే వారిద్దరినీ విధి విడదీసింది. తల్లిదండ్రులకు గర్భశోకం మిగిల్చింది. ప్రమాదవశాత్తూ బస్సు కింద పడి మరుపాక మోడల్ స్కూల్ విద్యార్ధి గుంటల అశోక్ (11) గురువారం సాయంత్రం మృతి చెందాడు. బుచ్చెయ్యపేట మండలం చిట్టియ్యపాలెం గ్రామానికి చెందిన గుంటల నూకరాజు, వరహాలమ్మల చిన్న కొడుకు అశోక్ ఆరో తరగతి చదువుతున్నాడు. ఎనిమిదో తరగతి చదువుతున్న అన్నయ్య శివతో కలిసి ప్రతిరోజూ ఆర్టీసీ బస్సులో స్కూలుకు వెళ్లి వస్తుంటాడు. గురువారం సాయంత్రం విద్యార్ధులను తీసుకువెళ్లేందుకు బస్సు వచ్చి స్కూల్ వద్ద వెనక్కు మళ్లిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అశోక్ గట్టిగా కేకలు వేయడంతో అంతా వచ్చి గాయాలైన ఆ విద్యార్ధిని హుటాహుటిన నర్సీపట్నం ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే బాలుడు మృతి చెందినట్టు అక్కడి వైద్యులు చెప్పారు. అశోక్ ఒంటిపై గాయాలేవీ లేనప్పటికీ బస్సు మీదకు ఎక్కేస్తుందని ఆందోళన చెంది గుండె ఆగిపోయి ఉంటుందని వైద్యులు చెప్పారు. రావికమతం పోలీసులు బస్సును స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రామలక్ష్మణులను విడదీశావా దేవుడా.. అశోక్ బస్సుకింద పడి తీవ్రగాయాల పాలై మృతి చెందిన వార్తను తెలుసుకున్న అశోక్ తల్లిదండ్రులు, బంధువులు హుటాహుటిన ఆటోల్లో స్కూల్ వద్దకు వచ్చారు. అప్పటికే మృతి చెందిన వార్త తెలుసుకున్న వారు గుండెలవిసేలా రోదించారు. బిడ్డలిద్దరూ రామలక్ష్మణుల్లా స్కూల్‌కు వచ్చేవారనీ, ఇద్దరిలో ఒకరిని విడదీశావా దేముడా అంటూ కన్నీటిపర్యంతమయ్యారు. చెదిరిన కల నూకరాజు, వరహాలమ్మ నిరు పేదలు. ఎటువంటి ఆస్తులు లేకపోవడంతో కూలి పనులు చేసికుని ఇద్దరు కుమారులను చదివించుకుంటున్నారు. వారిద్దరినీ ప్రయోజకుల్ని చేయాలని ఎన్నో కలలు కన్నారు. మూడేళ్ల క్రితమే పెద్ద కుమారుడు శివను రావికమతం మండలం మరుపాక మోడల్ స్కూల్ జాయిన్ చేయగా.. ఇటీవల ఐదో తరగతి పూర్తి చేసిన అశోక్‌ను కూడా అదే పాఠశాలలోనే చేర్చారు. పది రోజుల కిందటే పాఠశాలలో జాయిన్ అయిన అశోక్ అన్నయ్యతో కలిసి గురువారం ఉదయం పాఠశాలకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా ప్రమాదం జరిగింది. అశోక్ మృతితో తోటి విద్యార్ధులతోపాటు తల్లిదండ్రులు, గ్రామస్తులు భోరున విలపిస్తున్నారు. పొట్టకూటి కోసం అశోక్ తండ్రి నూకరాజు హైదరాబాద్‌లో కూలిపనుల కోసం నెల రోజుల కిందట వెళ్లాడు. అశోక్ సర్పంచ్ కూరాకుల ముత్యాలరావుకు స్వయాన మేనల్లుడు. ప్రమాద సంఘటన తెలిసుకుని ప్రయాణంలో ఉన్న ఆయన నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి వెళ్లి తన మేనల్లుడు మృతదేహాన్ని చూసి విలపించాడు. -
కొండల్ని కొల్లగొడుతున్నారు!
సాక్షి, చోడవరం : మండలంలో అక్రమ మెటల్ తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. రెవెన్యూ అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో ఎవరికి తోచిన స్థాయిలో వారు కొండలను తవ్వేస్తున్నారు. అడ్డుకున్నవారికి మామూళ్లు ఇస్తూ..గోవాడ, అడ్డూరు, గంధవరం, బెన్నవోలు, ఖండిపల్లి, దుడ్డుపాలెం, అంభేరుపురం గ్రామాల పరిధిలోని కొండల్లో అక్రమ మెటల్ క్వారీలు నిర్వహిస్తున్నారు. అడ్డుకున్నవారికి మామూళ్లు ఇస్తూ దోచుకున్నవారికి దోచుకున్నంతగా ఈ కొండలను కొల్లగొడుతున్నారు. వాస్తవానికి ఎర్ర మెటల్ తవ్వకాలు, రవాణా చేయాలంటే ముందుగా రెవెన్యూ, గనులశాఖల అనుమతి తప్పనిసరి. కాని చోడవరం మండలంలో మాత్రం అవేమీ లేవు. స్థానిక టీడీపీ నేతల కనుసన్నల్లో.. స్థానిక అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో ఎవరికి తోచినంత వారు తవ్వేసుకొని తరలించుకుపోతున్నారు. గోవాడ–భోగాపురం గ్రామ మధ్య ఉన్న కొండపై అడుగడుగునా ఈ అక్రమ మెటల్ తవ్వకాలు జరుగుతున్నాయి. ఖండిపల్లి, భోగాపురం, దుడ్డుపాలెం, అడ్డూరు క్వారీల్లో పొక్లెయిన్, జేసీబీ యంత్రాల సాయంతో ఎక్కడికక్కడ కొండను తవ్వేసి లారీలు, ట్రాక్టర్లపై తరలించుకుపోతున్నారు. రాత్రి సమయాల్లో ఎక్కువగా ఇక్కడ తవ్వకాలు జరుగుతున్నాయి. వీటికి స్థానిక అధికారపార్టీ నాయకుల సహకారం కూడా ఉందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీ సర్పంచ్ల అనుచరులే.. ఖండిపల్లి, దుడ్డపాలెం గ్రామాల్లో అధికారపార్టీ సర్పంచ్ల అనుచరులే నేరుగా కొండను తవ్వేసి మెటల్‌ను అమ్మేస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. రియల్ఎస్టేట్ వ్యాపారులతో కుమ్మక్కై ఈ దందా నడుస్తున్నట్టు తెలిసింది. గంధవరం, అడ్డూరు గ్రామాల్లో రియల్టర్లు పక్కనే ఉన్న కొండల నుంచి ఎర్ర మెటల్, మట్టిని తవ్వేసి భూములను ఎత్తుచేసి ప్లాట్లు విక్రయిస్తున్నారు. వీఆర్వోలపై విమర్శలు.. స్థానిక గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్వోలు) సహకారంతోనే ఇదంతా జరుగుతోందని ఆరోపణలు ఉన్నాయి. పర్యవేక్షించాల్సిన మండల రెవెన్యూ అధికారులు అధికారపార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గడంతో అక్రమ క్వారీలు ఎక్కడికక్కడ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. దీనిపై మైనింగ్ శాఖ అధికారులు కూడా పట్టించుకోకపోవడంపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా అనుమతి లేకుండా కొండలను తవ్వేయడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం రాకపోగా పర్యావరణాన్ని పరిరక్షించే కొండలు, పచ్చదనం కూడా నాశనమయ్యే ప్రమాదం ఏర్పడింది. దీనిపై మైన్స్, రెవిన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. చర్యలు తీసుకుంటాం గ్రావెల్ క్వారీలకు మండలంలో ఎటువంటి అనుమతులు లేవు. అక్రమంగా తవ్వకాలు జరిపే వారిపై చర్యలు తీసుకుంటాం. తవ్వకాల నిరోధించేందుకు ఆయా గ్రామాల వీఆర్వోలతో తనిఖీ బృందం ఏర్పాటుచేస్తాం. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటాం. – కేవీఎస్ రవి, తహసీల్దార్, చోడవరం -
బిజిలీ బంద్ విజయవంతం
చోడవరం : ప్రత్యేక హోదాపై టీడీపీ, బీజేపీలు ప్రజలను మోసం చేయడాన్ని నిరసిస్తూ అఖిల పక్షాలు బిజిలీ బంద్‌ను నిర్వహించాయి. మంగళవారం రాత్రి దుకాణాలు, ఇళ్లలో విద్యుత్ దీపాలు ఆర్పేసి అంతా నిరసన తెలిపారు. ఎన్నికల ముందు రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలన్నీ నెరవేరుస్తామని చెప్పి ప్రజలను మోసం చేసిన ఈ రోజును టీడీపీ, బీజేపీలు ప్రజలను నయవంచన చేసిన దినంగా అఖిల పక్షాలు బిజిలీ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌లో భాగంగా రాత్రి 7గంటల నుంచి 7.30గంటల వరకు చోడవరం పట్టణంతోపాటు పలు ప్రాంతాల్లో వ్యాపార సముదాయాలు, కిరాణా, వస్త్ర, కిల్లీ దుకాణాలు, ఇళ్లల్లో సైతం లైట్లు బంద్ చేశారు. అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛంగా ఈ బిజిలీ బంద్‌లో పాల్గొని ప్రత్యేక హోదా కావాలని మద్దతు పలికాయి. íసీపీఐ, సీపీఎం, వైఎస్సార్సీపీ, జనసేన పార్టీల నాయకులు తమ పార్టీల జెండాలు చేతబట్టి రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. కొత్తూరు జంక్షన్ వద్ద ముక్తకంఠంతో బీజేపీ, టీడీపీపై ధ్వజమెత్తారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు, ప్రధానమంత్రి నరేంద్రమోదీలు రాష్ట్ర ప్రజలను మోసంచేశారని సీపీఐ డివిజన్ కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు, íసీపీఎం జిల్లా నాయకుడు నాగిరెడ్డి సత్యనారాయణ, వైఎస్సార్సీపీ పట్టణ యూత్ అధ్యక్షుడు గూనూరు రామకృష్ణ, జనసేన నాయకుడు జెర్రిపోతుల రమణాజీ ధ్వజమెత్తారు. త్వరలోనే టీడీపీ, బీజేపీలకు ప్రజలు బుద్ది చెబుతారని అన్నారు. ఈ బిజిలీ బంద్‌లో పాల్గొన్నవారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఆందోళనలో సీపీఐ నాయకులు నేమాల హరి, చిరికి కొండబాబు, నేమాల నర్సింగరావు, ఆబోతు శ్రీనువాసరావు, బొర్రా కనకరాజు, వైఎస్సార్సీపీ మండల యూత్ అధ్యక్షుడు బలిరెడ్డి హరీష్, పట్టణ రైతు విభాగం ప్రతినిధి లెక్కల వెంకట్రావు, జనసేన నాయకులు నాని, తదితరులు పాల్గొన్నారు. -
పీఎస్‌లో ఆర్టీసీ విజిలెన్స్ డీఎస్పీ లొంగుబాటు
-
ఆర్టీసీ విజిలెన్స్ డీఎస్పీ లొంగుబాటు
సాక్షి, విశాఖ : రౌడీ షీటర్ గేదెల రాజు హత్యకేసులో ప్రధాన నిందితుడు, ఆర్టీసీ విజిలెన్స్ డీఎస్పీ రవిబాబు ఎట్టకేలకు గురువారం తెల్లవారుజామున చోడవరం పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. అనంతరం ఆయనను విశాఖ తరలిస్తున్నారు. ఈ నెల 6వ తేదీన జరిగిన గేదెల రాజు హత్య కేసులో ఏ1 నిందితుడు, డీఎస్పీ దాసరి రవిబాబు, ఏ2 నిందితుడు క్షత్రియభేరి దినపత్రిక ఎండీ భూపతిరాజు శ్రీనివాసరాజు ఉన్నారు. అయితే గేదెల రాజు హత్య జరిగిన మరుసటి రోజు నుంచే ప్రధాన నిందితులిద్దరూ పరారీలో ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు కేసును పక్కదోవ పట్టించేందుకు రవిబాబు తన సర్వశక్తులు ఒడ్డుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అత్యున్నత స్థాయిలోనే పైరవీలు సాగిస్తున్నట్లు వినికిడి. అందుకు కాకర పద్మలత తండ్రి, పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే కాకర నూకరాజు, గేదెల రాజు భార్య కుమారి వివిధ పత్రికల్లో ఇచ్చిన స్టేట్మెంట్లు ఊతమిస్తున్నాయి. కాకర పద్మలత హత్యకు గురైందని, గేదెల రాజు సహకారంతో డీఎస్పీ రవిబాబు చేయించాడని పోలీసులు ప్రకటించిన సంగతి విదితమే. అందులో తనకు రావాల్సిన సుపారీ కోసం రవిబాబుపై గేదెల రాజు ఒత్తిడి తీసుకువచ్చినట్లు, ఈ నేపథ్యంలో అతడిని అడ్డు తొలగించుకునేందుకు భూపతిరాజు శ్రీనివాసరాజు సహకారంతో రాజును హతమార్చినట్లు పోలీసులు వెల్లడించారు. మరోవైపు డీఎస్పీ రవిబాబు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు తనకు తెలిసిన న్యాయవాదుల నుంచి సలహాలు కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. -
అతిథులొచ్చాయ్!
చోడవరంలో విదేశీ విహంగాల సందడి దశాబ్దాలుగా క్రమం తప్పకుండా రాక సైబీరియా పక్షులను సంరక్షిస్తున్న గ్రామస్తులు జిల్లాలో పురుడు పోసుకుంటాయ్.. రెక్కలు వచ్చాక ఎగిరిపోయి ఎక్కడెక్కడో పెరుగుతాయి.. సంతానోత్పత్తి కోసం మళ్లీ పుట్టింటికి వస్తాయి.. నాలుగైదు నెలల పాటు సందడి చేస్తాయి.. ఆ తర్వాత పిల్లలతో కలిసి రెక్కలు కట్టుకుని మళ్లీ ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతాయి. కొన్నేళ్లుగా సైబీరియా పక్షులు జిల్లాకు క్రమం తప్పక వస్తూ మనకు అతిథిలుగా మారాయి. ఈ ఏడాది కూడా నల్లజర్ల మండలం చోడవరంకు అతిథిలొచ్చి సందడి చేస్తున్నాయి. నల్లజర్ల : నల్లజర్ల మండలం చోడవరం గ్రామానికి ఏటా మాదిరిగానే సైబీరియా పక్షులు వచ్చాయి. దీంతో ఆ గ్రామంలో సందడి మొదలైంది. గ్రామస్తులు ఈ పక్షులను ఎంతో అపురూపంగా చూసుకుంటారు. పక్షులు గ్రామానికి వస్తున్నాయంటే వర్షాలు ప్రారంభం కాబోతున్నాయన్న సంకేతంగా ఇక్కడి వారు భావిస్తారు. జూలై చివరలో వచ్చిన ఈ పెలికాన్ పక్షులు చెట్లపై గూళ్లు కట్టుకొని గుడ్లు పెట్టి పొదిగి పిల్లలు పెద్దయ్యాక వాటితో కలిసి నవంబర్‌లో తిరుగు ప్రయాణమవుతాయి. ఈ క్రమంలో గ్రామంలో పక్షుల కిలకిలరావాలు గ్రామస్తులకు ఎంతో ఆనందాన్నిస్తాయి. జంటలుగా సంచరించడం, పక్షి పిల్లలకు ఆహారం తినిపించడం, నీరు తాగించడం, వాటికి ఎగరడం నేర్పించడం వంటి కనువిందైన సన్నివేశాలు గ్రామస్తులకు మానసికోల్లాసం కలిగిస్తుంటాయి. ఇది ఏన్నో ఏళ్లుగా జరుగుతుందని గ్రామస్తులు చెబుతున్నారు. వాటి రాక వల్ల తమ గ్రామం సుభిక్షంగా ఉంటుందని, పాడి పంటలు సమృద్ధిగా పండుతాయని గ్రామస్తులు విశ్వసిస్తుంటారు. వీటిని ప్రత్యేక అతిథులుగా భావించిన గ్రామస్తులు సంరక్షణకు చొరవ చూపడంతో ప్రాణ హాని, భయం లేకుండా ఆహార అన్వేషణకు పరిసరాల్లో స్వేచ్ఛగా సంచరిస్తూ మరింత అలరిస్తున్నాయి. పక్షులకు పుట్టిల్లు విదేశీ పక్షులకు చోడవరం పుట్టిల్లుగా మారింది. మూడు దశాబ్దాలుగా ఇక్కడకు ఏటా క్రమం తప్పకుండా పక్షులు వస్తున్నాయి. చెట్లపై గూళ్లు కట్టుకున్న తర్వాత ఆడ, మగ పక్షులు ఒకదానితో ఒకటి తొక్కిళ్లు పడతాయి. ఇలా సంపర్కం తర్వాత 1012 రోజులకు ఆడపక్షి రోజుకొకటి చొప్పున రెండు నుంచి నాలుగు గుడ్లు పెడుతుంది. ఆ తర్వాత గుడ్లపై కూర్చుని పొదుగుతుంది. ఆ కాలంలో మగపక్షి పొలాల్లోకి వెళ్లి నత్తలు, చిన్న చిన్న చేపలు, కీటకాలను తెచ్చి ఆడపక్షి నోట్లో జారవిడుస్తుంది. 21 రోజులకు గుడ్లు పగిలి పిల్లలు బయటకు వస్తాయి. ఆ తర్వాత ఆడ, మగ పక్షులు ఆహారాన్ని వేటాడి తెచ్చి పిల్లలకు పెడుతుంటాయి. చోడవరంలో నత్తగుల్లలు ఎక్కువగా ఉండటంతో వాటి ఆహారానికి కొదవ ఉండదు. ఏటా క్రమం తప్పకుండా రావడానికి ఇది కూడా ప్రధాన కారణం. గ్రామస్తుల సంరక్షణ విదేశీ పక్షులు గ్రామంలోకి రాగానే వీటి సంరక్షణ బాధ్యతలను గ్రామస్తులే చేపడతారు. గతంలో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యేగా పనిచేసిన అల్లూరి కృష్ణారావు స్వగ్రామం చోడవరం. ఎవరైనా పక్షులను వేటాడరని తెలిస్తే ఆయన పిలిచి కొరడాలతో కొట్టేవారని గ్రామస్తులు చెబుతారు. ఆనాటి నుంచే ఎవరైనా పక్షులను వేటాడినా గ్రామస్తులు జరిమానా విధిస్తారు. దీంతో వేటగాళ్లెవరూ ఈ పరిసర ప్రాంతాలకు రారు. వన్యప్రాణి విభాగం వారు కూడా పక్షుల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. గ్రామంలో స్వాగత ద్వారం ఏర్పాటు చేశారు. పక్షుల ప్రేమికులు ఈ సైబీరియా పక్షులను తిలకించేందుకు గ్రామానికి వస్తారు. పక్షులొస్తేనే వానలొస్తాయి చిన్నతనం నుంచి ఈ పక్షులను చూస్తున్నాం. ఇవి వస్తేనే వానలొస్తాయని, పంటలు పండుతాయని మాకు నమ్మకం. వీటి రాక ఆలస్యమైతే ఆ ఏడాది వర్షాలు ఆలస్యమవుతూ ఉంటాయి. పక్షులకు ఎటువంటి హాని కలగకుండా గ్రామస్తులంతా చూస్తాం. అయినం నాగేశ్వరావు, పడమర చోడవరం పర్యాటక ప్రదేశంగా గుర్తించాలి సైబీరియా పక్షులు మా గ్రామానికి ఏటా వస్తాయి. ఏటా ఆరేడు మాసాలు ఇక్కడ సందడి చేస్తాయి. ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా గుర్తించి అభివృద్ధి చేయాలి. కానీ ఇప్పటి వరకు అటువైపుగా ప్రభుత్వం ఆలోచించడం లేదు. కొత్తపల్లి రమేష్, పడమర చోడవరం -
ప్రేమ ఎంత కఠనం
⇔యువజంట ఆత్మహత్యాయత్నం ⇔ ప్రియుడు మృతి.. ప్రియురాలి పరిస్థితి విషమం ⇔యువతికి పెళ్లి నిశ్చయం ⇔వివాహానికి పెద్దలు అంగీకరించరని తొందరపడ్డ ప్రేమికులు ⇔ఇరు కుటుంబాల్లో విషాదం ఏడడుగులు వేద్దామనుకున్నారు.. జీవితాంతం కలిసి నడుద్దామనుకున్నారు.. ఉద్యోగం వచ్చాక తమ ప్రేమ విషయం పెద్దలకు చెప్పి ఒప్పించాలని ఆశ పడ్డారు.. అంతలోనే అమ్మాయికి పెళ్లి నిశ్చయం కావడంతో ఆందోళన పడ్డారు.. తరుణోపాయం తెలీక మరణమే శరణమనుకొని విషం తాగారు.. తల్లిదండ్రులకు విషాదం మిగిల్చారు.. ప్రేమికుడు కనుమూయగా.. ప్రియురాలు చావుబతుకుల్లో ఉంది. చోడవరం: ఒకే ఊరు.. ఇద్దరివీ వ్యవసాయ ఆధారిత కుటుంబాలే.. పిల్లలు పెద్ద చదువులు చదువుకోవడంతో అందివస్తారని భావించారు. అంతలోనే ఆ కుటుంబాల్లో విషాదం అలముకుంది. తూర్పుగోదావరి జిల్లా చోడవరం మండలం గాంధీ గ్రామం శోకసముద్రంలో మునిగింది. తమ అనురాగం గురించి పెద్దలకు చెప్పడానికి సాహసం చేయలేని ఆ ప్రేమ జంట.. ప్రభుత్వ ఉద్యోగం వస్తే కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకుందామనుకున్నారు. ఇటీవల ప్రభుత్వ ఉద్యోగానికి ఇద్దరూ కలిసి పరీక్షలు కూడా రాశారు. ఇంతలోనే ప్రియురాలికి కుటుంబసభ్యులు వేరొకరితో పెళ్లి కుదర్చడంతో ఇద్దరూ కలత చెందారు. దేవుని సన్నిధిలో ఒకటవుదామని చోడవరం వచ్చి అక్కడే ఆత్మహత్యకు యత్నించడం అందరినీ కలిచివేసింది. ఈ సంఘటన ఆ రెండు కుటుంబాలనూ దుఃఖసాగరంలో ముంచింది. ఎదిగొచ్చిన కొడుకు వృద్ధాప్యంలో చేదోడువాదోడుగా ఉంటాడనుకున్న సమయంలో విగత జీవిగా మారడం దాడి చంద్రశేఖర్ (27) కుటుంబ సభ్యులను కలచివేసింది. ఆస్పత్రి మంచంపై ప్రాణం లేకుండా పడి వున్న కొడుకుని చూసి తండ్రి రామచంద్రరావు, తల్లి కమల బోరున విలపించారు. విజ్ఞత కలిగిన కొడుకు ఇలా అకస్మాత్తుగా విగతజీవి కావడంతో వారు గుండెలవిసేలా రోదించారు. వ్యవసాయం, కూలి పనులు చేసుకొని జీవించే ఈ కుటుంబం చంద్రశేఖర్‌పై ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఎమ్మెస్సీ చదివిన కొడుక్కి పెద్ద ఉద్యోగం వస్తే కుటుంబానికి కొంత ఆసరాగా ఉంటాడనుకున్నామని, అంతలోనే ఘోరం జరిగిపోయిందని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. మరోపక్క యువతి కుటుంబం మరింత శోకంతో మునిగింది. మరికొద్ది రోజుల్లో ఎంతో ఆడంబరంగా ఆమెకు పెళ్లి చేసేందుకు కుటుంబసభ్యులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. తల్లి లేకపోయినా తండ్రి, అన్నయ్య కలిసి చెల్లి పెళ్లి గురించి ఎన్నో కలలు కన్నారు. ఇంతలోనే ప్రేమించిన వ్యక్తితో కలిసి పురుగు మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డంతో వారి రోదన వర్ణనాతీతంగా ఉంది. కొన ఊపిరితో చోడవరం ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతున్న చెల్లిని బతికించుకోవడానికి అన్న ఎంతో ఆత్రుత పడ్డాడు. మత్యువుతో పోరాడుతున్న చెల్లెల్ని విశాఖపట్నంలో పెద్దాసుపత్రికి తరలించేందుకు తన చేతుల మీద తీసుకొచ్చి కారెక్కించి రోదించాడు. ఆమె పరిస్థితి ప్రమాదకరంగా ఉందని బంధువులు తెలిపారు. ఈ సంఘటనపై చోడవరం పోలీసులు కేసు నమోదు చేశారు. -
ప్రేమికుల ఆత్మహత్యాయత్నం
చోడవరం(విశాఖపట్నం జిల్లా): చోడవరం మండలం గంధి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చంద్రశేఖర్(26), సునీత(24)లు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. చంద్రశేఖర్ ఎంఎస్సీ, సునీత బీఈడీ చదువుకున్నారు. ఒకరు అనకాపల్లి, మరొకరు చోడవరంలో టీచర్లుగా పనిచేస్తున్నారు. జాబ్ వచ్చాక పెళ్లి చేసుకుందామనుకున్నారు. సునీత ఇంట్లో పెళ్లి సంబంధం చూసి మేనెలలో ముహూర్తాలు పెట్టుకున్నారు. దీంతో ఇద్దరూ చోడవరం వచ్చి ఈ విషయం గురించి చర్చించుకున్నారు. తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోరని భావించిన ఇద్దరూ తమ వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగారు. ఇది గమనించిన స్థానికులు వారిని వెంటనే చోడవరం ఆసుపత్రికి తరలించారు. చికిత్సపొందుతూ శేఖర్ మరణించాడు. సునీత పరిస్థితి విషమంగా ఉండటంతో విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. -
చోడవరంలో ఎడతెరిపి లేకుండా వర్షం
విశాఖపట్నం : విశాఖపట్నం జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. చోడవరంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. దీంతో అనకాపల్లిలో శారదా నదికి ఉధృతి పెరిగింది. అలాగే దానయ్య కోనేరు. బాలాజీ నగర్, ద్వారకానగర్ , కోఆపరేటివ్ కాలనీలో వర్షం పడుతుంది. దాదాపు 2 వేల ఎకరాల పంట నీటమునిగింది. సింహాద్రిపురం, రేబెల్లు, చిట్టాడ, సీఎస్ పేట... అంకుపాలెం, లక్ష్మీపురంలో చెరుకు, వరి పంటలకు తీవ్రనష్టం వాటిల్లింది. చోడవరంలో వరద బాధితులను వైఎస్ఆర్ సీపీ నేత కరణం ధర్మశ్రీ పరామర్శించారు. -
ర్యాగింగ్ చట్ట రీత్యా నేరం
చోడవరం : ర్యాంగింగ్కు పాల్పడడం చట్టరీత్యా నేరమని చోడవరం సివిల్ జడ్జి లక్ష్మి అన్నారు. చోడవరం కలాసీల కల్యాణ మండపంలో విద్యార్థి జూనియర్ కాలేజీ విద్యార్థులకు న్యాయవిజ్ఞాన సదస్సు శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాలేజీ వయస్సు మనిషి ఎదుగుదలకు చాలా కీలకమన్నారు. కాలేజీల్లో ర్యాగింగ్ చేయడం, తోటి విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయడం చట్టరీత్యా నేరమని ఆమె అన్నారు. ఇంటర్మీడియట్ చదువు జీవితంలో ఎదుగుదలకు ఎంతో కీలకమన్నారు. క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యశించాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ మూర్తి, గోతిరెడ్డి రాంబాబు పాల్గొన్నారు. -
ఇసుక తవ్వకాల నిలిపివేత
‘సాక్షి’ కథనంతో కదిలిన అధికారులు చోడవరం ఇసుక క్వారీ వద్ద హైడ్రామా బోడె ప్రసాద్, నెహ్రూ వర్గాల మధ్య ముదిరిన వివాదం పెనమలూరు : మండలంలోని చోడవరం ఇసుక క్వారీలో తవ్వకాలను అధికారులు ఎట్టకేలకు నిలిపివేశారు. ఇసుక క్వారీలో శనివారం హైడ్రామా చోటుచేసుకుంది. గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పుకు వ్యతిరేకంగా చోడవరం ఇసుక క్వారీలో ఎమ్మెల్యే బోడె ప్రసాద్, మాజీ మంత్రి దేవినేని నెహ్రూ అనుచరులు పొక్లెయిన్లతో ఇసుక దందాకు పాల్పడుతున్నారని సాక్షిలో ‘ఇసుక దందా మళ్లీ మొదలైంది’ కథనం రావటంతో అధికారులు ఎట్టకేలకు స్పందించారు. క్వారీలో ఉన్న ఇద్దరు నేతల అనుచరులకు గ్రీన్ ట్రిబ్యునల్ ఉత్తర్వులు ప్రకారం నదిలో యంత్రాలతో ఇసుక తవ్వకాలు చేయరాదని మైన్స్ అసిస్టెంట్ డైరెక్టర్ సుబ్రమణ్యేశ్వరరావు ఆదేశించారు.lఇరువురు నేతల మధ్య ఆధిపత్యపోరు కారణంగా ఇసుక క్వారీ వద్ద నదిలో పొక్లయిన్ తొలగించే విషయంలో హైడ్రామా చోటు చేసుకుంది. చివరకు అధికారుల జోక్యంతో ఇసుక తవ్వకాలు నిలిపివేయించారు. ఏమి జరిగిందంటే... చోడవరం ఇసుక క్వారీపై ఎమ్మెల్యే బోడె ప్రసాద్, మాజీ మంత్రి దేవినేని నెహ్రూకు మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. ఇద్దరు నేతలు నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు భారీ యంత్రాలతో చేపట్టారు. వీరి పోరుతో శాంతిభద్రతల సమస్యతోపాటు, కరకట్టపై భారీగా ఇసుక లారీలు నిలుపుదల చేయటంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. ఇక్కడి పరిస్థితిపై సాక్షిలో కథనం రావటంతో అధికారులు స్పందించారు. గ్రీన్ ట్రిబ్యూనల్ తీర్పు ప్రకారం ఇసుక తవ్వకాలు యంత్రాలతో చేయరాదని మైన్స్ అధికారులు ఉత్తర్వులు ఇచ్చారు. ఎమ్మెల్యే అనుచరులు తవ్వుతున్న క్వారీలో తవ్వకాలను వీఆర్వో లావణ్య ఆపించారు. ఆతరువాత నెహ్రూ అనుచరుల వద్దకు వచ్చి తవ్వకాలు ఆపాలన్నారు. దీనికి వారు అభ్యంతరం తెలిపారు. గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పు ఉన్నా ఇంతకాలం ఎమ్మెల్యే ఇసుక ఎందుకు తవ్వించాడని ప్రశ్నించారు. ఆయన పొక్లెయిన్ నది నుంచి బయటకు రప్పిస్తే, తమ పొక్లెయిన తీస్తామన్నారు. ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు, వీఆర్వో చివరికి లారీలను నదిలోకి అనుమతించకుండా ఆపటంతో ఇరువురు తవ్వకాలు ఆపారు. -
246 కిలోల గంజాయి పట్టివేత
విశాఖపట్టణం: విశాఖపట్నం జిల్లాలో చోడవరం వద్ద ఎక్సైజ్ పోలీసులు శనివారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కారులో అక్రమంగా తరలిస్తున్న 246 కిలోల గంజాయిని వారు స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బీసీలు, కాపుల సంక్షేమానికి ఏపీ సర్కార్ కృషి
విశాఖపట్టణం : రాష్ట్రంలో బీసీలు, కాపుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్, చేనేత శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. వారి కోసం ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. మంగళవారం విశాఖపట్టణం జిల్లా చోడవరంలో జరిగిన నవ నిర్మాణ దీక్షలో మంత్రి కొల్లు రవీంద్ర ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ దీక్షలో పాల్గొన్న మరో మంత్రి సీహెచ్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ గ్రామాలలో రూ. 3 వేల కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు వేయనున్నామని చెప్పారు. 14న ఆర్థిక సంఘం నిబంధనల మేరకు రోడ్లు వేసేందుకు పంచాయతీలు ముందుకు రావాలని అయ్యన్నపాత్రుడు కోరారు. -
ఇసుక లారీలను అడ్డుకున్న మహిళలు
చోడవరం (విశాఖ) : నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలిస్తున్న లారీలను మహిళలు అడ్డుకున్నారు. విశాఖ జిల్లా చోడవరం ఇసుక క్వారీ నుంచి ఇసుక తరలిస్తున్న లారీల యజమానులు తమకు ఇవ్వాల్సిన కమీషన్ డబ్బులు ఇవ్వక పోవడానికి నిరసనగా.. డ్వాక్రా సంఘాల మహిళలు సోమవారం రోడ్డెక్కారు. స్థానిక 33 గ్రూపులకు చెందిన 500 మంది మహిళలు తమ ఖాతాలో డబ్బులు వేయకుండా.. ఇసుక తరలిస్తుండటాన్ని నిరసిస్తూ లారీలకు అడ్డంగా కూర్చుని ఆందోళన చేశారు. -
242 కేజీల గంజాయి పట్టివేత
చోడవరం (విశాఖ జిల్లా) : గంజాయి సరఫరా చేస్తున్న ఓ వ్యక్తిని విశాఖ జిల్లా రోలుగుంట పోలీసులు బుచ్చింతోట గ్రామం సమీపంలో శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. మరొక వ్యక్తి పరారయ్యాడు. పట్టుబడిన వ్యక్తి నుంచి 242 కేజీల గంజాయి, కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
భూఆక్రమణలపై ఎమ్మెల్యే ఆగ్రహం
చోడవరం : విశాఖ జిల్లా చోడవరం మండలంలోని ప్రభుత్వ భూములు కబ్జాకు గురవడం పట్ల స్థానిక ఎమ్మెల్యే కె. ఎస్.ఎన్.ఎస్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మండల పర్యటనలో భాగంగా ఆయన చోడవరంలో పలు ప్రాంతాలను సందర్శించారు. కబ్జాకు గురైన భూముల వివరాలు వెంటనే నిగ్గుతేల్చాలని తహశీల్దార్‌ను ఆదేశించారు. -
చోడవరంలో మరో కాల్‌మనీ కేసు
వడ్డీ వ్యాపారి వేధిస్తున్నాడంటూ ఇద్దరు మహిళల ఫిర్యాదు చోడవరం : చోడవరంలో కాల్‌మనీ కేసు నమోదయింది. తమను వడ్డీ వ్యాపారి వేధిస్తున్నాడంటూ ఇద్దరు మహిళలు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో పేర్కొన్న మేరకు వివరాలు ఇలా ఉన్నాయి...కొత్తకోటకు చెందిన ఇసరపు రమణ అనే వడ్డీ వ్యాపారి వద్ద తాను రూ.4 లక్షలు అప్పుతీసుకున్నానని, ఆ సమయంలో కొన్ని ప్రాంసరీనోట్లు, నాలుగు చెక్కులు ఇచ్చానని ఉలికిరి లక్ష్మి అనే మహిళ తెలిపింది. అప్పు తీర్చినప్పటికీ ప్రాంసరీ నోట్లు, చెక్కులు తిరిగి ఇవ్వలేదని, ఎన్నిసార్లు అడిగినా ఇస్తానని చెప్పి వెళ్లిపోతున్నాడని వాపోయింది. గట్టిగా అడిగితే వేధింపులకు గురిచేస్తున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇదే వడ్డీ వ్యాపారి వద్దే తాను కూడా రూ.5లక్షలు అప్పుతీసుకున్నాని మరో మహిళ సత్యవతి తన ఫిర్యాదులో పేర్కొంది. మొదట రూ.2 వడ్డీ అని చెప్పి ఇప్పుడేమో రూ.5 చొప్పున చెల్లించాలని డిమాండ్ చేస్తున్నార ని తెలిపింది. నాలుగు ప్రాంసరీ నోట్లు, నాలుగు చెక్కులు కూడా ఇచ్చానని, వడ్డీ గురించి అడిగితే వేధింపులకు గురిచేస్తున్నాడని ఆమె తెలిపింది. ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి, చర్యలు తీసుకుంటామని ఎస్ఐ రమణయ్య తెలిపారు. -
ఫ్యాక్టరీలో ప్రమాదం: ముగ్గురికి గాయాలు
చోడవరం (విశాఖపట్నం) : చక్కెర బస్తాలు లోడ్ చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు బస్తాలు జారిపడటంతో.. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వాళ్లను ఆస్పత్రికి తరలించగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లా చోడవరం లోని గోవాడ షుగర్ ఫ్యాక్టరీలో శుక్రవారం చోటుచేసుకుంది. ఫ్యాక్టరీలో చక్కెర బస్తాలను లారీలో లోడ్ చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు జారి కూలీలపై పడ్డాయి. దీంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. -
నారా లోకేష్‌ను నిలదీసిన మహిళలు
-
నారా లోకేష్‌ను నిలదీసిన మహిళలు
చోడవరం (విశాఖపట్నం జిల్లా) : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి కుమారుడు లోకేష్‌బాబుకు మహిళల నుంచి సోమవారం చేదు అనుభవం ఎదురైంది. జన చైతన్య యాత్రలో భాగంగా సోమవారం చీడికాడ మండల కేంద్రం ఎస్సీ కాలనీకి వెళ్లిన లోకేష్‌ను.. తమకు హుద్‌హుద్ తుఫాను నష్టపరిహారం ఇప్పటివరకు అందలేదంటూ అక్కడి మహిళలు నిలదీశారు. మరికొందరు మహిళలు తమకు ఎస్సీ కార్పొరేషన్ నుంచి రుణాలు మంజూరు కాలేదని వాపోయారు. అర్హత ఉన్నా పింఛన్ ఇవ్వటం లేదని మరికొందరు వృద్ధులు లోకేష్‌కు తెలిపారు. -
బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకిస్తూ ర్యాలీ
చోడవరం (విశాఖపట్నం) : విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకిస్తూ శుక్రవారం విశాఖ జిల్లా చోడవరంలో భారీ సంఖ్యలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. సుమారు వెయ్యి మంది కళాశాల విద్యార్థులు గాంధీగ్రామ్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి మెయిన్ రోడ్డు, కొత్తూరు జంక్షన్, కాంప్లెక్స్ వరకూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ర్యాలీగా వెళ్లారు. బాక్సైట్ తవ్వకాలకు ఉద్దేశించి జీవో 97ను తాత్కాలికంగా రద్దు చేయడం కాదని, పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బాక్సైట్ తవ్వకాలతో సాగు, తాగునీరు కలుషితం అవుతుందని, అటవీ ప్రాంతం అంతరించిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం ఇన్చార్జ్ తహశీల్దార్ రామారావుకు వినతిపత్రం ఇచ్చారు. -
డీఎస్సీ అభ్యర్థుల ఆందోళన
చోడవరం: విశాఖపట్నం జిల్లా చోడవరం ఎమ్మార్వో కార్యాలయం ఎదుట సోమవారం డీఎస్సీ అభ్యర్థులు ఆందోళన చేశారు. వెంటనే మెరిట్ జాబితా ప్రకటించి, జిల్లాల వారీగా పోస్టులను భర్తీ చేయాలని కోరారు. కోర్టు కేసుల నెపంతో ఆలస్యం చేస్తే ఉద్యమిస్తామని హెచ్చరించారు. వీరు చేస్తున్న ఆందోళనకు డీవైఎఫ్ఐ మద్ధతు తెలిపింది. అనంతరం అభ్యర్థులు స్థానిక తహశీల్దార్‌కు, ఎంఈఓకు వినతిపత్రం సమర్పించారు. -
ఆటో- బస్సు ఢీ: 35 మందికి గాయాలు
చోడవరం: విశాఖపట్టణం జిల్లా కోటపాడు మండలంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 35 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. వివరాలు.. విశాఖ జిల్లా కోటపాడు మండలంలోని గాలివలస మలుపు వద్ద బ్రాండెక్స్ ఫ్యాక్టరీ ఉద్యోగులను తీసుకెళుతున్న బస్సు ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టి బోల్తాపడింది. ఈ సంఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 30 మంది.. ఆటో డ్రైవర్ నాయుడుతో పాటు అందులో ప్రయాణిస్తున్న నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆటో ప్రయాణికులను కోటపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బ్రాండెక్స్ ఉద్యోగులను గాజువాక ఈఎస్ఐ ఆస్పత్రిలో చేర్చారు. బస్సు బత్తివానిపాళెంలోని బ్రాండెక్స్ ఫ్యాక్టరీకి తెల్లవారుజామున 4.30 గంటలకు సిబ్బందిని తీసుకువెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు 108కు ఫోన్‌చేయడంతో వారు సకాలంలో అక్కడికి చేరుకున్నారు. బస్సు డ్రైవర్ మద్ది రాము, బ్రాండెడ్ ఉద్యోగులు పార్వతి, రమణమ్మ, దేవి, ఆటో డ్రేవర్ నాయుడు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. -
ఏసీబీకి పట్టుబడ్డ లైన్ఇన్స్పెక్టర్
చోడవరం (విశాఖపట్నం) : పొలంలో విద్యుత్ స్తంభం ఏర్పాటు కోసం రైతు నుంచి లంచం తీసుకుంటూ ఓ లైన్ఇన్స్పెక్టర్ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ రామకృష్ణ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం...జిల్లాలోని కోటపాడు మండలం దాలివలస గ్రామానికి చెందిన బండారు శ్రీనివాసరావు అనే రైతు తన పొలంలో విద్యుత్ స్తంభం ఏర్పాటు చేయాలంటూ లైన్ ఇన్స్పెక్టర్ అప్పాజీబాబును ఆశ్రయించారు. అయితే ఆయన రూ.10 వేలు డిమాండ్ చేశాడు. చివరికి రూ.8 వేలకు ఒప్పందం కుదిరింది. దీనిపై ఆ రైతు అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ) అధికారులకు ఉప్పందించారు. వారి సూచన మేరకు సోమవారం సాయంత్రం రైతు శ్రీనివాసరావు పొలంలో స్తంభం ఏర్పాటు చేసే చోటును పరిశీలించటానికి వచ్చిన అప్పాజీబాబుకు రూ.8 వేలు లంచం అందించారు. అక్కడే మాటువేసిన ఏసీబీ అధికారులు లైన్ ఇన్స్పెక్టర్ అప్పాజీబాబును పట్టుకుని, కేసు నమోదు చేశారు. -
కారు ఢీకొని వృద్ధురాలు మృతి
చోడవరం (విశాఖ జిల్లా) : రోడ్డు దాటుతున్న వృద్ధురాలిని వేగంగా వస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. ఈ సంఘటన విశాఖజిల్లా చోడవరం పీహెచ్సీ ఎదురుగా శుక్రవారం జరిగింది. వివరాల ప్రకారం.. మండలంలోని దుడ్డుపాలెం గ్రామానికి చెందిన పరదేసమ్మ(54) అనే వృద్ధురాలు మార్కెట్‌కు వెళ్లి వస్తున్న సమయంలో.. చోడవరం నుంచి గవరవరం వెళ్తున్న కారు ఢీకొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
రైతులకు పిల్లర్ మెషీన్లు పంపిణీ
చోడవరం (విశాఖ) : విశాఖ జిల్లా చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు సోమవారం ఆదర్శ రైతులకు పిల్లర్ మెషీన్లు పంపిణీ చేశారు. వ్యవసాయ శాఖ అధికారి కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మొత్తం ఆరుగురు రైతులు మెషీన్లను అందుకున్నారు. నాట్లు వేసే సమయంలో ఇవి రైతులకు ఉపయోగపడనున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజు మాట్లాడుతూ... గోవాడ షుగర్ ఫ్యాక్టరీ పరిధిలో చెరకు సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు వీలుగా డ్రిప్ ఇరిగేషన్ విధానంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహిస్తామని చెప్పారు. -
మణిపూర్‌లో ఆర్మీ జవాన్ మృతి
- మిలిటెంట్ల దాడిలో చనిపోయినట్టు సమాచారం - శోకసముద్రంలో బెన్నవోలు చోడవరం: దేశ సేవ కోసం వెళ్లిన కొడుకు మిలిటెంట్ల దాడిలో చనిపోయాడని తెలిసి తల్లిదండ్రులు, బంధువులు శోకసముద్రంలో మునిగిపోయారు. మణిపూర్‌లో విధుల్లో ఉండగా ఆర్మీ జవాన్ మజ్జి శంకరావు(24) మృతి చెందినట్టు మంగళవారం సమాచారం రావడంతో బెన్నవోలులో విషాదం చోటుచేసుకుంది. మండలంలోని బెన్నవోలుకు చెందిన మజ్జి శంకరరావు ఆర్మీలో 2010లో చేరాడు. ఐదేళ్లపాటు ఆర్మీ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న ఇతడు ఢిల్లీలోను విధులు నిర్వహించారు. ఏడాది కిందట మణిపూర్ బదిలీ అయి అక్కడ విధులు నిర్వహిస్తున్నారు. విధుల్లో ఉండగా మంగళవారం తెల్లవారు జామున మణిపూర్ మిలిటెంట్లు దాడిలో చనిపోయినట్టు కుటుంబసభ్యులు, బంధువులు భావిస్తున్నారు. మణిపూర్ ఆర్మీ క్యాంపస్ నుంచి ఫోన్‌ద్వారా మృతుడు అన్నయ్య రాజుకు సమాచారం రావడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. మృతదేహం గురువారం స్వగ్రామానికి రావచ్చని భావిస్తున్నారు. తమకు దిక్కెవరంటూ రోదన కన్నకొడుకు మృతిచెందాడని తెలియడంతో తల్లిదండ్రులు సత్యవతి, సింహాచలం బోరున విలపిస్తున్నారు. కుటుంబానికి ఆసరాగా ఉంటాడనుకున్న కొడుకు ఆకస్మికంగా చనిపోయాడని తెలిసి తల్లి సత్యవతి బోరున విలపిస్తోంది. ఆమె రోదన అందరినీ కలిచివేస్తోంది. త్వరలో వివాహం నిశ్చయం: శంకరరావుకు బంధువు కుమార్తెతో వివాహం నిశ్చయించారు. ఈ ఏడాది చివర్లో పెళ్లికి ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టు బంధువులు తెలిపారు. ఇంతలో ఘోరం జరిగిపోయిందంటూ బోరున విలిపించారు. గ్రామం శోకసముద్రంలో మునిగిపోయింది. అందరిలోనూ విషాదమే కనిపిస్తోంది. స్నేహితుడి అకాల మరణాన్ని అతనితో కలిసి చదువుకున్న మిత్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. -
ఉషోదయ కాలేజీ అవినీతిపై విచారణ జరపాలి
విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా చోడవరం ఉపోదయ డిగ్రీ కాలేజీ యాజమాన్యం ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్‌ల పేరిట రూ. 9 కోట్లు స్వాహా చేసిందని ఏబీవీపీ ఆరోపించింది. ఆ కాలేజీ యాజమాన్యం జరిపిన అవినీతిపై సీబీఐతో విచారణ జరిపించాలని ఏబీవీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఆదివారం చోడవరంలో ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ... 2013 విద్యా సంవత్సరంలో విద్యార్థుల సంతకాలను ఫోర్జరీ చేసి... ఏటీఎం కార్డుల ద్వారా వారికి అందవలసిన సొమ్మును డ్రా చేశారని తెలిపారు. సీబీఐ విచారణతోనే కాలేజీ యాజమాన్యం జరిపిన దారుణం బయటపడుతుందని వారు స్పష్టం చేశారు. స్వాహా చేసి సొమ్మును యాజమాన్యం నుంచి రాబట్టి ... విద్యార్థులకు ఇప్పించి... నిందితులను కఠినంగా శిక్షించాలని ఏబీవీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.