చోడవరం (విశాఖపట్నం జిల్లా) : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి కుమారుడు లోకేష్‌బాబుకు మహిళల నుంచి సోమవారం చేదు అనుభవం ఎదురైంది. జన చైతన్య యాత్రలో భాగంగా సోమవారం చీడికాడ మండల కేంద్రం ఎస్సీ కాలనీకి వెళ్లిన లోకేష్‌ను.. తమకు హుద్‌హుద్ తుఫాను నష్టపరిహారం ఇప్పటివరకు అందలేదంటూ అక్కడి మహిళలు నిలదీశారు. మరికొందరు మహిళలు తమకు ఎస్సీ కార్పొరేషన్ నుంచి రుణాలు మంజూరు కాలేదని వాపోయారు. అర్హత ఉన్నా పింఛన్ ఇవ్వటం లేదని మరికొందరు వృద్ధులు లోకేష్కు తెలిపారు.