బీసీలు, కాపుల సంక్షేమానికి ఏపీ సర్కార్ కృషి | kollu ravindra visits chodavaram | Sakshi
Sakshi News home page

బీసీలు, కాపుల సంక్షేమానికి ఏపీ సర్కార్ కృషి

Published Tue, Jun 7 2016 2:09 PM | Last Updated on Sat, Mar 23 2019 8:59 PM

kollu ravindra visits chodavaram

విశాఖపట్టణం : రాష్ట్రంలో బీసీలు, కాపుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్, చేనేత శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. వారి కోసం ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. మంగళవారం విశాఖపట్టణం జిల్లా చోడవరంలో జరిగిన నవ నిర్మాణ దీక్షలో మంత్రి కొల్లు రవీంద్ర ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ దీక్షలో పాల్గొన్న మరో మంత్రి సీహెచ్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ గ్రామాలలో రూ. 3 వేల కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు వేయనున్నామని చెప్పారు. 14న ఆర్థిక సంఘం నిబంధనల మేరకు రోడ్లు వేసేందుకు పంచాయతీలు ముందుకు రావాలని అయ్యన్నపాత్రుడు కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement