చోడవరం: విశాఖపట్నం జిల్లా చోడవరం ఎమ్మార్వో కార్యాలయం ఎదుట సోమవారం డీఎస్సీ అభ్యర్థులు ఆందోళన చేశారు. వెంటనే మెరిట్ జాబితా ప్రకటించి, జిల్లాల వారీగా పోస్టులను భర్తీ చేయాలని కోరారు. కోర్టు కేసుల నెపంతో ఆలస్యం చేస్తే ఉద్యమిస్తామని హెచ్చరించారు. వీరు చేస్తున్న ఆందోళనకు డీవైఎఫ్‌ఐ మద్ధతు తెలిపింది. అనంతరం అభ్యర్థులు స్థానిక తహశీల్దార్‌కు, ఎంఈఓకు వినతిపత్రం సమర్పించారు.