పాత పద్ధతిలో నియమించాలి
పాత పద్ధతిలో నియమించాలి
Published Fri, Aug 19 2016 9:00 PM | Last Updated on Mon, Sep 4 2017 9:58 AM
గన్నవరం :
పశువైద్యుల నియామకాలను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయాలనే ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా స్థానిక ఎన్టీఆర్ వెటర్నరీ కళాశాల విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నారు. శుక్రవారం కూడా బోర్డు పరీక్షలను, తరగతులను బహిష్కరించిన విద్యార్థులు కళాశాల ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏపీపీఎస్సీ వద్దు... డీఎస్సీనే ముద్దు అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు జి.చంద్రశేఖర్‌రెడ్డి, డి.మోహన్‌వంశీ, ఎల్.ఫణికుమారి, సుభాష్‌చంద్రబోస్ మాట్లాడుతూ... గత 30 ఏళ్లుగా పశువైద్యుల నియామకాలను పశుసంవర్ధక శాఖ ద్వారా జరుపుతున్నారని తెలిపారు. అయితే ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన 300 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయాలను కోవడం నిరుద్యోగ పశువైద్య విద్యార్థులను తీవ్రంగా నిరాశపరుస్తుందన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల తమ భవిష్యత్ అంధకారంలోకి పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైన ప్రభుత్వం పునరాలోచించి పాతపద్ధతిలోనే పశువైద్యుల నియామకాలను జరపాలని డిమాండ్ చేశారు. లేకపోతే తమ ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విద్యార్థులు సుమంత్, సురేంద్ర, టి.హేమ, దీప్తి, వీణ, రాగిణి పాల్గొన్నారు.
Advertisement
Advertisement