Veternary
-
యాంటీబయాటిక్స్‌తో భూసారానికీ ముప్పు.. అదెలా అంటే!
పశువైద్యంలో యాంటీబయాటిక్స్ అతిగా వాడటం వల్ల దీర్ఘకాలంలో మట్టి ఆరోగ్యం దెబ్బతినటమే కాకుండా భూతాపాన్ని పెంపొందించే కర్బన ఉద్గారాల బెడద సైతం పెరుగుతుందని కొలరాడో స్టేట్ యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడైంది. పశు వ్యాధుల చికిత్సలో యాంటీబయాటిక్స్ వల్ల వాటి విసర్జితాలు నేలపై పడినప్పుడు మట్టిలో శిలీంధ్రాలు, సూక్ష్మజీవుల నిష్పత్తిలో మార్పులు చోటు చేసుకుంటాయని అధ్యయనానికి సారధ్యం వహించిన డా. కార్ల్ వెప్కింగ్ అంటున్నారు. యాంటీబయాటిక్స్ దుష్ప్రభావానికి గురికాని వాతావరణం భూతలం మీద లేదన్నారు. యాంటీబయాటిక్స్ వల్ల కర్బనాన్ని పట్టి ఉంచే శక్తిని మట్టి కోల్పోతుందన్నారు. యాంటీబయాటిక్స్‌ను పశుపోషణలో అతిగా వాడటం వల్ల.. మనుషుల్లో కొన్ని రకాల సూక్ష్మక్రిములు యాంటీబయాటిక్స్‌కు లొంగని పరిస్థితి నెలకొంటున్న విషయం తెలిసిందే. చదవండి: Red Rice: ఎర్ర బియ్యం అమ్మాయి -
కేరళలో కొత్త వైరస్ కలకలం.. ఆందోళనలో అధికారులు
తిరువనంతపురం: ఇప్పటికే కరోనా వైరస్ వెన్నులో వణుకు పుట్టిస్తుంటే తాజాగా కేరళలో మరో వైరస్ కేసు నమోదు కావడం ఆ రాష్ట్రాన్ని కలవరం పెడుతోంది. తాజాగా వాయనాడ్ జిల్లాలో నోరో వైరస్ కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. వివరాల ప్రకారం.. వాయనాడ్ జిల్లాలోని వైత్తిరి సమీపంలోని పూకోడ్‌లోని వెటర్నరీ కళాశాలలో 13 మంది విద్యార్థులకు అరుదైన నోరోవైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు. జంతువుల ద్వారా సంక్రమించే నోరో వైరస్, కలుషితమైన నీరు, ఆహారం ద్వారా వ్యాపిస్తుందని చెప్పారు. వ్యాధి నియంత్రణకు మార్గదర్శకాలను జారీ చేశారు. ‘సరైన నివారణ, చికిత్సతో నోరో వైరస్ వ్యాధి త్వరగా నయమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వ్యాధి, దాని నివారణ మార్గాల గురించి తెలుసుకోవాలి’ అని పేర్కొన్నారు. తాగునీటి వనరులు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలన్నారు. పరిస్థితులు అదుపులోకి వచ్చినప్పటికీ, మరింత వ్యాప్తి చెందకుండా నివారణ చర్యల్లో భాగంగా ఆ వెటర్నరీ కళాశాల విద్యార్థుల డేటాను సిద్ధం చేస్తున్నామని ఆరోగ్య అధికారులు తెలిపారు. వెటర్నరీ కళాశాల అధికారులు మాట్లాడుతూ.. క్యాంపస్ వెలుపల హాస్టళ్లలో నివసిస్తున్న విద్యార్థులలో మొదట ఈ వైరస్ ఉన్నట్లు గుర్తించడంతో ఈ ఘటన వెలుగలోకి వచ్చింది. రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ అధ్యక్షతన ఆ ప్రాంత ఆరోగ్య అధికారుల సమావేశం నిర్వహించి వాయనాడ్‌లో పరిస్థితిని సమీక్షించారు. ప్రస్తుతం వైద్య అధికారులు మాట్లాడుతూ..ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అయితే అందరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. -
ఫిలిప్పీన్స్‌లో తెలుగు వైద్య విద్యార్థి మృతి
సాక్షి, కృష్ణా : వైద్యవిద్య చదివేందుకు వెళ్లిన తెలుగు రాష్ట్రానికి చెందిన విద్యార్థి రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందిన సంఘటన ఫిలిప్పీన్స్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కృష్ణా జిల్లా నందిగామ నేతాజీ నగర్‌కు చెందిన పొన్నపల్లి జగదీష్ వైద్య విద్యను చదివేందుకు 2016లో ఫిలిప్పీన్స్ కు వెళ్లాడు. ప్రస్తుతం జగదీష్ వెటర్నరీ కోర్సులో నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం బైక్ డ్రైవింగ్ చేస్తున్న సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన బస్సు అతన్ని ఢీకొట్టింది. దీంతో జగదీష్ అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా జగదీష్ మృతితో అతని స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
‘అభినందన’ మందులు వద్దు
- పనిచేయడం లేదని అధికారుల సూచన - జిల్లా స్థాయి సాంకేతిక కమిటీ తీర్మానం కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా స్థాయి సాంకేతిక కమిటీ సూచనల ప్రకారం పశువైద్యానికి నాణ్యమైన మందులు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటామని జిల్లా పశుసంవర్థకశాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సుదర్శన్ కుమార్ తెలిపారు. బుధవారం తన చాంబర్లో మందుల సరఫరాపై జిల్లా స్థాయి సాంకేతిక కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. అభినందన అనే కంపెనీకి చెందిన మందులు నాణ్యత లేవని, రోగాలపై అసలు పనిచేయడం లేదని వీటిని జిల్లాకు సరఫరా కాకుండా చర్యలు తీసుకోవాలని కమిటీ సభ్యులు సూచించారు. అలాగే అభినందన కంపెనీ మందులు జిల్లాకు అవసరం లేదని కమిటీ తీర్మానం చేసింది. రేట్ కాంట్రాక్టు ఉన్న 50 కంపెనీల్లో కొన్ని కంపెనీల మందులు బాగా పనిచేస్తున్నాయని వాటిని తెప్పించాలని కమిటీ సభ్యులు సూచించారు. జేడీ మాట్లాడుతూ జిల్లాలోని నాణ్యమైన, బాగా పనిచేసే వాటినే తెప్పించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. సమావేశంలో కర్నూలు, ఆదోని, నంద్యాల, ఆళ్లగడ్డ డీడీలు సీవీ రమణయ్య, పి.రమణయ్య, జీవీ రమణ, వరప్రసాద్, గొర్రెల అభివృద్ధి విభాగం ఏడీ డాక్టర్ చంద్రశేఖర్, వెటర్నరీ పాలిక్లినిక్ డీడీ హమీద్‌పాషా తదితరులు పాల్గొన్నారు. -
ఇది గాలి కుంటు వ్యాధి కాలం
నేటి నుంచి గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు పశుశాఖ జేడీ డాక్టర్ కె.జయకుమార్ అనంతపురం అగ్రికల్చర్ : ప్రస్తుతం పశువులకు గాలికుంటు వ్యాధి సోకే కాలమని, చికిత్స కన్నా వ్యాధి నివారణే ముఖ్యమని పశుసంవర్ధకశాఖ జేడీ డాక్టర్ కె.జయకుమార్ తెలిపారు. ఈ వ్యాధి నివారణకు ముందస్తుగా ఉచిత టీకాలు కార్యక్రమం నేటి (శనివారం) నుంచి చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. జిల్లా వ్యాప్తంగా గ్రామ గ్రామాన నెల రోజుల పాటు (సెప్టెంబర్ 19వ తేదీ వరకు) 10 లక్షల పశువులకు టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. వ్యాధి లక్షణాలు.. నివారణ మార్గాలను వివరిస్తున్నారు. వ్యాధి లక్షణాలు : వ్యాధి వ్యాపిస్తే పశువుల్లో మరణాలు తక్కువైనా పాల ఉత్పత్తులు బాగా తగ్గిపోతాయి. ఏవోటీ, ఆసియా–1, ఆసియా–22, ఆసియా–10, పిటార్నో లాంటి వైరస్ వల్ల సోకే ప్రమాదకరమైన అంటు వ్యాధి కావడంతో ఉత్పాదకశక్తి, సామర్థ్యం తగ్గిపోతుంది. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా, బలహీనంగా ఉండే యుక్తవయస్సు పశువుల్లో వ్యాధి వేగంగా వ్యాపిస్తుంది. 104 నుంచి 106 డిగ్రీల జ్వరం ఉంటుంది. గిట్టల మధ్య పుండ్లు ఏర్పడుతాయి. నోటిలోపల, నాలుక మీద, ముట్టె లోపల భాగంలో బొబ్బలు ఏర్పడుతాయి. 24 గంటల్లోగా చిక్కిపోయి అల్సర్‌కు గురవుతాయి. మేత మేయవు. చొంగకారుస్తాయి. గిట్టల మధ్య పుండ్ల కారణంగా సరిగా నడవలేవు. గర్భంతో ఉన్న పశువులు అబార్షన్‌కు గురవుతాయి. ఒక్కోసారి పొదుగుపై కూడా బొబ్బలు రావడం వల్ల పొదుగువాపు వ్యాధి వస్తుంది. బ్యాక్టీరియా చేరి చీము వస్తుంది. చీము కారడం వల్ల ఇతరత్రా రోగాలు వ్యాపించే అవకాశం ఉంటుంది. అలాగే చీముపై ఈగలు వాలి గ్రుడ్లు పెట్టడం, వాటి నుంచి వచ్చిన లార్వాలు కండరాలకు చేరి మాంసాన్ని తినడం వల్ల పెద్ద పెద్ద గాయాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువ. వ్యాధి సోకిన పశువుల పాలను తాగడం వల్ల దూడలు మరణిస్తాయి. మంచి ఎద్దులు సైతం వ్యాధి సోకితే బలహీనమై పనిచేసే సామర్థ్యం తగ్గిపోతుంది. నివారణ ఇలా.. : వ్యాధి సోకిన పశువులను పొటాషియం పర్మాంగనేట్ ద్రావణంతో గిట్టలు, పుండ్లను శుభ్రం చేయాలి. బోరోగ్లిజరిన్ పూత పూయాలి. ఈగలు వాలకుండా వేపనూనె, నిమ్లెంట్, లారాజెంట్ లాంటి మందులు వాడాలి. పశువైద్యాధికారి సిఫారసు మేరకు యాంటీబయాటిక్ మందులు తాపించాలి. వ్యాధి సోకిన పశువులకు రోజూ 50 గ్రాములు అÄñæ¬డైజ్డ్ ఉప్పు దాణాతో ఇస్తే కొంత ఉపశమనం. అలాగే 30 గ్రాములు ఎముకలపొడి పచ్చిమేతతో కలిసి రోజూ ఇస్తే త్వరగా కోలుకుంటాయి. ముందస్తు నివారణలో భాగంగా పశుశాఖ ద్వారా ఉచితంగా టీకాలు వేయించుకోవాలి. ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా టీకాలు వేయించుకుంటే మంచిది. -
పాత పద్ధతిలో నియమించాలి
గన్నవరం : పశువైద్యుల నియామకాలను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయాలనే ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా స్థానిక ఎన్టీఆర్ వెటర్నరీ కళాశాల విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నారు. శుక్రవారం కూడా బోర్డు పరీక్షలను, తరగతులను బహిష్కరించిన విద్యార్థులు కళాశాల ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏపీపీఎస్సీ వద్దు... డీఎస్సీనే ముద్దు అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు జి.చంద్రశేఖర్‌రెడ్డి, డి.మోహన్‌వంశీ, ఎల్.ఫణికుమారి, సుభాష్‌చంద్రబోస్ మాట్లాడుతూ... గత 30 ఏళ్లుగా పశువైద్యుల నియామకాలను పశుసంవర్ధక శాఖ ద్వారా జరుపుతున్నారని తెలిపారు. అయితే ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన 300 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయాలను కోవడం నిరుద్యోగ పశువైద్య విద్యార్థులను తీవ్రంగా నిరాశపరుస్తుందన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల తమ భవిష్యత్ అంధకారంలోకి పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైన ప్రభుత్వం పునరాలోచించి పాతపద్ధతిలోనే పశువైద్యుల నియామకాలను జరపాలని డిమాండ్ చేశారు. లేకపోతే తమ ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విద్యార్థులు సుమంత్, సురేంద్ర, టి.హేమ, దీప్తి, వీణ, రాగిణి పాల్గొన్నారు. -
పశువైద్య కళాశాలకు తాళాలు వేసి విద్యార్థుల ధర్నా
ప్రొద్దుటూరు: వైఎస్సార్ జిల్లా ప్రొదుటూరులోని పశువైద్య కళాశాలకు విద్యార్థులు శుక్రవారం తాళం వేసి ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం జారీ చేసిన జీఓ నంబర్ 97ను రద్దు చేయాలని కోరుతూ ఐదు రోజులుగా నిరసన కార్యక్రమాలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో అధ్యాపకులను వెలుపలికి పంపించిన విద్యార్థులు అనంతరం కళాశాలకు తాళం వేశారు. జీవో ప్రకారం ఇక నుంచి వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను ప్రభుత్వానికి నేరుగా సంబంధం లేకుండా పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో ఎన్జీఓలు నియమించుకుంటారని అన్నారు. రాత్రింబవళ్లు కష్టపడి, ఎంసెట్ ర్యాంకు ద్వారా ఇక్కడ చదువుతున్న తమకు ప్రభుత్వ ఉద్యోగం కూడా లేకుండా చేస్తారా? అని ప్రశ్నించారు. ఈ జీవోను ప్రభుత్వం రద్దు చేసే వరకు పోరాటం చేస్తామని పేర్కొన్నారు.