
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, కృష్ణా : వైద్యవిద్య చదివేందుకు వెళ్లిన తెలుగు రాష్ట్రానికి చెందిన విద్యార్థి రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందిన సంఘటన ఫిలిప్పీన్స్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కృష్ణా జిల్లా నందిగామ నేతాజీ నగర్కు చెందిన పొన్నపల్లి జగదీష్ వైద్య విద్యను చదివేందుకు 2016లో ఫిలిప్పీన్స్ కు వెళ్లాడు. ప్రస్తుతం జగదీష్ వెటర్నరీ కోర్సులో నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం బైక్ డ్రైవింగ్ చేస్తున్న సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన బస్సు అతన్ని ఢీకొట్టింది. దీంతో జగదీష్ అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా జగదీష్ మృతితో అతని స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.