ప్రొద్దుటూరు: వైఎస్సార్ జిల్లా ప్రొదుటూరులోని పశువైద్య కళాశాలకు విద్యార్థులు శుక్రవారం తాళం వేసి ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం జారీ చేసిన జీఓ నంబర్ 97ను రద్దు చేయాలని కోరుతూ ఐదు రోజులుగా నిరసన కార్యక్రమాలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో అధ్యాపకులను వెలుపలికి పంపించిన విద్యార్థులు అనంతరం కళాశాలకు తాళం వేశారు.
జీవో ప్రకారం ఇక నుంచి వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను ప్రభుత్వానికి నేరుగా సంబంధం లేకుండా పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో ఎన్జీఓలు నియమించుకుంటారని అన్నారు. రాత్రింబవళ్లు కష్టపడి, ఎంసెట్ ర్యాంకు ద్వారా ఇక్కడ చదువుతున్న తమకు ప్రభుత్వ ఉద్యోగం కూడా లేకుండా చేస్తారా? అని ప్రశ్నించారు. ఈ జీవోను ప్రభుత్వం రద్దు చేసే వరకు పోరాటం చేస్తామని పేర్కొన్నారు.
పశువైద్య కళాశాలకు తాళాలు వేసి విద్యార్థుల ధర్నా
Published Fri, May 13 2016 9:52 PM | Last Updated on Mon, Sep 4 2017 12:02 AM
Advertisement