GO 97
-
జీఓ-97 రద్దు చేసిన ప్రభుత్వం
-
పశువైద్య కళాశాలకు తాళాలు వేసి విద్యార్థుల ధర్నా
ప్రొద్దుటూరు: వైఎస్సార్ జిల్లా ప్రొదుటూరులోని పశువైద్య కళాశాలకు విద్యార్థులు శుక్రవారం తాళం వేసి ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం జారీ చేసిన జీఓ నంబర్ 97ను రద్దు చేయాలని కోరుతూ ఐదు రోజులుగా నిరసన కార్యక్రమాలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో అధ్యాపకులను వెలుపలికి పంపించిన విద్యార్థులు అనంతరం కళాశాలకు తాళం వేశారు. జీవో ప్రకారం ఇక నుంచి వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను ప్రభుత్వానికి నేరుగా సంబంధం లేకుండా పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో ఎన్జీఓలు నియమించుకుంటారని అన్నారు. రాత్రింబవళ్లు కష్టపడి, ఎంసెట్ ర్యాంకు ద్వారా ఇక్కడ చదువుతున్న తమకు ప్రభుత్వ ఉద్యోగం కూడా లేకుండా చేస్తారా? అని ప్రశ్నించారు. ఈ జీవోను ప్రభుత్వం రద్దు చేసే వరకు పోరాటం చేస్తామని పేర్కొన్నారు. -
జీవో 97పై నోరు మెదపని చంద్రబాబు
-
'జీవో 97 ఉపసంహరణ చంద్రబాబు కుట్ర'
సీలేరు (విశాఖ) : విశాఖ మన్యంలోని ఆదివాసీ గిరిజనుల ఆగ్రహంపై నీళ్లు చల్లేందుకే జీవో97ను ఉపసంహరించుకుంటున్నట్లు సీఎం చంద్రబాబు నాటకం ఆడుతున్నారని మావోయిస్టులు ఆరోపించారు. ఆంధ్రా-ఒడిశా బోర్డర్ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి చంద్రమౌళి పేరుతో శుక్రవారం మీడియాకు ఒక లేఖ అందింది. పోలీసులను ఆదివాసీలపై ఉసిగొల్పేందుకే ముఖ్యమంత్రి ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు. స్పెషల్ ప్యాకేజీల పేరుతో ఆదివాసీలను చీల్చి, ఒక వర్గం వారిని తమ వైపు లాక్కునేందుకు కుట్ర పన్నుతున్నారని ఆ లేఖలో తెలిపారు. -
'ప్రభుత్వం గిరిజనుల జీవితాలను పణంగా పెట్టింది'
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ధనార్జనకోసం అమాయక గిరిజనుల జీవితాలను పణంగా పెట్టి బాక్సైట్ తవ్వకాలకోసం జీవో జారీ చేసిందని వైఎస్ఆర్ సీపీ నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. జీవో 97 పై ప్రభుత్వం పనరాలోచించుకొని వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. విశాఖలో సోమవారం ఆయన విలేకరులో సమావేశంలో మాట్లాడారు. బాక్సైట్ తవ్వకాల వల్లే కలిగే పరిణామాల గురించి ప్రధానికి వివరిస్తామన్నారు. డిసెంబర్ 2న చింతపల్లిలో వైఎస్సార్సీపీ అధినేత జగన్ బహిరంగ సభ జరుగుతుందని ఈ సందర్భంగా గిరిజనులకు పార్టీ పరంగా మద్దతు ప్రకటిస్తారని బొత్స చెప్పారు. ఎన్నికల ముందు బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకించిన టీడీపీ ఇప్పుడు గిరిజనులను నిరాశ్రయులను చేయడం సరికాదన్నారు. గిరిజనులకు మద్దతుగా ఈ అంశంపై అసెంబ్లీలో ప్రభుత్వంతో పోరాడుతామని చెప్పారు. ఈ నెల 24న అనంతపురంలో, 28 కాకినాడలో జగన్ ఆధ్వర్యంలో యువభేరి సభలు ఉంటాయని ప్రకటించారు. ప్రతి జిల్లాలో సభలు నిర్వహించడం ద్వారా ప్రజలను చైతన్యవంతం చేస్తామని చెప్పారు. గిరిజనులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని బొత్స హామీ ఇచ్చారు. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ఆపేశామనే ఆరోపణలు వాస్తవం కాదన్న ఆయన కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదాను కేటాయించేంతవరకు పోరాడుతామని స్పష్టం చేశారు. -
'ప్రభుత్వం గిరిజనుల జీవితాలను పణంగా పెట్టింది'