
పశువైద్యంలో యాంటీబయాటిక్స్ అతిగా వాడటం వల్ల దీర్ఘకాలంలో మట్టి ఆరోగ్యం దెబ్బతినటమే కాకుండా భూతాపాన్ని పెంపొందించే కర్బన ఉద్గారాల బెడద సైతం పెరుగుతుందని కొలరాడో స్టేట్ యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడైంది. పశు వ్యాధుల చికిత్సలో యాంటీబయాటిక్స్ వల్ల వాటి విసర్జితాలు నేలపై పడినప్పుడు మట్టిలో శిలీంధ్రాలు, సూక్ష్మజీవుల నిష్పత్తిలో మార్పులు చోటు చేసుకుంటాయని అధ్యయనానికి సారధ్యం వహించిన డా. కార్ల్ వెప్‌కింగ్ అంటున్నారు.
యాంటీబయాటిక్స్ దుష్ప్రభావానికి గురికాని వాతావరణం భూతలం మీద లేదన్నారు. యాంటీబయాటిక్స్ వల్ల కర్బనాన్ని పట్టి ఉంచే శక్తిని మట్టి కోల్పోతుందన్నారు. యాంటీబయాటిక్స్‌ను పశుపోషణలో అతిగా వాడటం వల్ల.. మనుషుల్లో కొన్ని రకాల సూక్ష్మక్రిములు యాంటీబయాటిక్స్‌కు లొంగని పరిస్థితి నెలకొంటున్న విషయం తెలిసిందే.
చదవండి: Red Rice: ఎర్ర బియ్యం అమ్మాయి
Comments
Please login to add a commentAdd a comment