Soil
-
తక్కువ ఖర్చుతో...పంటభూమిలో విషానికి బ్యాక్టీరియాతో చెక్
రసాయనిక వ్యవసాయం వల్ల కాలుష్య కాసారంగా మారిపోయిన వ్యవసాయ భూములను తక్కువ ఖర్చుతో, సులభంగా, సమర్థవంతంగా శుద్ధి చేసే కొన్ని జాతుల సూక్ష్మజీవుల మిశ్రమాన్ని ముంబై ఐఐటి పరిశోధకులు కనుగొన్నారు. రసాయనిక పురుగుమందుల వల్ల, ఇతరత్రా కాలుష్య కారకాల వల్ల పంట భూములు నాశనమవుతున్న సంగతి తెలిసిందే.విషతుల్య కాలుష్య కారకాలను హరించటంతో పాటు నేలలో ఉన్నప్పటికీ మొక్కలకు అందుబాటులో లేని పోషకాలను అందుబాటులోకి తేవటం ద్వారా పనిలో పనిగా పంట దిగుబడిని కూడా పెంపొందించడానికి ఈ ‘బ్యాక్టీరియా కాక్టెయిల్’ ఉపయోగపడుతున్నదని ముంబై ఐఐటి పరిశోధకులు ప్రకటించారు. ముంబై ఐఐటిలో బయోసైన్సెస్, బయోఇంజినీరింగ్ విభాగం అధిపతి ప్రొఫెసర్ ప్రశాంత్ ఫలే మార్గ దర్శకత్వంలో సందేశ్ పపడే ఈ పరిశోధన చేశారు. మట్టిలోని విషాలను విచ్చిన్నం చేసి తీసివేయటంతో పాటు ఈ బ్యాక్టీరియా అధికోత్పత్తికి దోహదం చేసే గ్రోత్ హార్మోన్ల పెరుగుదలకు ఊతం ఇస్తున్నాయని, అదేసమయంలో హానికారక శిలీంధ్రాలను అరికడుతున్నాయని, తద్వారా పోషకాల లభ్యత పెరుగుతోందని గుర్తించారు. రసాయనిక పురుగుమందులు, తెగుళ్ల మందుల వాడకాన్ని తగ్గించటానికి.. నేలల ఆరోగ్యం, ఉత్పాదకశక్తిని పెంపొందించడానికి ఉపయోడపడుతోందని ప్రొఫెసర్ ప్రశాంత్ ఫలే వెల్లడించారు. రసాయనిక పురుగుమందులు, తెగుళ్ల మందులలోని బెంజీన్ వంటి ఆరోమాటిక్ కాంపౌండ్స్ వల్ల నేలలు కలుషితం కావటం వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న పెద్ద సమస్య. ఈ సమ్మేళనాలు విషతుల్యమైనవి. విత్తనం మొలక శాతాన్ని ఇవి తగ్గిస్తాయి. పంట మొక్కల ఎదుగుదలకు, దిగుబడికి ప్రతిబంధకంగా మారుతున్నాయి. ధాన్యాలు, గింజల్లో, మొక్క భాగాల్లో ఈ విషతుల్యమైన సమ్మేళనాలు చేరి΄ోతాయి. కార్బారిల్, నాఫ్తలిన్, బెంజోయేట్, 2,4–డ్రైక్లోరోఫెనాక్సియేసెటిక్ ఆసిడ్, థాలేట్స్‌ను పురుగుమందుల్లో విస్తృతంగా వాడుతున్నారు. సౌందర్యసాధనాలు, దుస్తులు, నిర్మాణ రంగం, ఆహార రంగంలో వాడే ప్రిజర్వేటివ్స్, అద్దకం, పెట్రోలియం, ప్లాస్టిక్ ఉత్పత్తి రంగాల్లో కూడా ఈ విషతుల్యమైన సమ్మేళనాలను వాడుతున్నారు. వీటి వల్ల మట్టి, నీరు, గాలి కలుషితం అవుతున్నాయి. అయితే, ఈ కలుషితాలను తొలగించడానికి ప్రస్తుతం అనుసరిస్తున్న రసాయనిక పద్ధతి లేదా కలుషితమైన మట్టిని తొలగించటం వంటి పద్ధతులు అధిక ఖర్చుతో కూడినవే కాక సమస్యను సమూలంగా పరిష్కరించకుండా తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే కలిగిస్తున్నాయి. ఈ దృష్ట్యా సమస్యాత్మక నేలలను శుద్ధి చేసుకోవటానికి ఐఐటి ముంబై పరిశోధకుల కృషి తోడ్పడుతుందని నిపుణులు చెబుతున్నారు.సహజ పద్ధతిలో శుద్ధిఘాటైన వాసనలతో కూడిన రసాయనిక విషపదార్థాలను చక్కగా విచ్ఛిన్నం చేయటానికి సూడోమోనాస్, అసినెటోబాక్టర్ తదితర జాతుల బ్యాక్టీరియా ఉపయోగపడుతున్నట్లు గుర్తించారు. ఇవి విషతుల్య సమ్మేళనాలను తిని.. హానికరం కాని, విషరహిత సమ్మేళనాలుగా మార్చుతున్నాయి. ఆ క్రమంలో కలుషిత∙పర్యావరణాన్ని ఇవి సహజంగా శుద్ధి చేస్తున్నాయని ఫలే వ్యాఖ్యానించారు.పెరిగిన పోషకాల లభ్యత ఫాస్ఫరస్, పొటాషియం వంటి నీట కరగని స్థూల పోషకాలను ఈ బ్యాక్టీరియా నీట కరిగేలా చేస్తుంది. తద్వారా పంట మొక్కల వేర్లు అదనపు పోషకాలను పీల్చుకునే అవకాశం కల్పిస్తాయి. నిస్సారమైన భూముల్లో పెరిగే పంట ఐరన్‌ను ఎక్కువగా తీసుకోలేకపోతుంటుంది. ఈ సూక్ష్మజీవులు సైడెరోఫోర్స్ అనే పదార్ధాన్ని విడుదల చేయటం ద్వారా ఐరన్‌ను సరిగ్గా తీసుకునేలా చేస్తాయి. అంతేకాకుండా ఇండోల్ అసెటిక్ ఆసిడ్ (ఐఎఎ) అనే గ్రోత్ హార్మోన్‌ను ఈ బ్యాక్టీరియా విడుదల చేసి దిగుబడిని పెంచుతుంది. ఇంకా ప్రొఫెసర్ ఫలే ఇలా అన్నారు.. ‘సూడోమోనాస్, అసెనెటోబాక్టర్ జెనెరకు చెందిన అనేక జాతుల సూక్ష్మజీవుల మిశ్రమాన్ని వాడిన తర్వాత గోధుమ, పెసర పాలకూర, మెంతికూర తదితర పంటల దిగుబడి 40–45% వరకు పెరిగింది. మట్టిలో రసాయనాలను కొన్ని రకాల బ్యాక్టీరియా విచ్ఛిన్నం చేస్తుంటే, మరికొన్ని సూక్ష్మజీవులు మొక్కల పెరుగుదలను పెంపొందించే హార్మోన్ ఉత్పత్తికి, చీడపీడల బెడద నుంచి దీటుగా తట్టుకునేందుకు ఉపయోగపడుతున్నాయని, కలసికట్టుగా పనిచేస్తే కలిగే ప్రయోజనం ఇదే అన్నారు ప్రొ. ఫలే. -
వైఎస్సార్సీపీ నేత పొలాన్ని తవ్వేసిన పచ్చమూకలు
సాక్షి, పల్నాడు జిల్లా: మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ నేతలు బరితెగించారు. దుర్గి మండలం కోలగొట్లలో వైఎస్సార్సీపీ నేత కన్నెబోయిన నాసరయ్య పొలాన్ని జేసీబీలతో మట్టిని తవ్వేసి తరలించుకుపోయారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి టీడీపీ నేతల బెదిరింపులతో కన్నెబోయిన నాసరయ్య ఊరు వదిలి బయటకు వచ్చి నివసిస్తున్నారు. టీడీపీ నాయకుల దందాను వీఆర్వో దృష్టికి తీసుకువెళ్తే.. టీడీపీ నేతలను సంప్రదించమంటూ సలహా ఇస్తున్నారని నాసరయ్య మండిపడుతున్నారు.ప్రోక్లైన్లతో నాసరయ్య పొలంలో పెద్ద పెద్ద గోతులు పెడుతూ టీడీపీ నేతలు మట్టి తీసుకెళ్లిపోయారు. ఇవాళ మధ్యాహ్నం నుంచి మరోసారి పొలంలో తవ్వకాలు మొదలుపెట్టిన టీడీపీ రౌడీలు.. భారీగా మట్టి తరలిస్తున్నారు. ప్రభుత్వం మాదంటూ.. పోలీసులు, కలెక్టర్ గాని మమ్మల్ని ఎవరు ఏం చేయలేరంటూ టీడీపీ నేతలు బెదిరింపులకు దిగుతున్నారు. తెలుగుదేశం నాయకుల బెదిరింపులతో అధికారులు చేతులెత్తేశారు. ఇదీ చదవండి: మాధవీలతపై వ్యాఖ్యలు..క్షమాపణ చెప్పిన జేసీ ప్రభాకర్‌రెడ్డి -
శ్రీశైలంలో పూడిక నష్టం 102.11 టీఎంసీలు
సాక్షి, అమరావతి: కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో రెండు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు శ్రీశైలం జలాశయంలో పూడిక పేరుకుపోతుండటంతో గరిష్ట నీటినిల్వ సామర్థ్యం 102.11 టీఎంసీలు తగ్గింది. లైవ్ స్టోరేజి సామర్థ్యం 72.77 టీఎంసీలు, డెడ్ స్టోరేజీ సామర్థ్యం 29.33 టీఎంసీలు తగ్గిందని రాష్ట్ర జల వనరుల శాఖ, కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) సంయుక్తంగా రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీని ఉపయోగించుకుని నిర్వహించిన హైడ్రోగ్రాఫిక్ సర్వేలో వెల్లడైంది. బేసిన్లో పెద్దఎత్తున అడవులను నరికివేస్తుండటంతో వర్షాలు కురిసినప్పుడు భూమి భారీగా కోతకు గురువుతుండటం.. వరదతోపాటు భూమి కోతకు గురవడం వల్ల వచ్చే మట్టి కలిసి ప్రవహిస్తూ జలాశయంలోకి చేరుతోంది. ఏటా పూడిక పేరుకుపోతుండటం వల్లే శ్రీశైలం జలాశయంలో నీటినిల్వ సామర్థ్యం భారీగా తగ్గిందని సీడబ్ల్యూసీ తేల్చింది. దేశంలో జలాశయాల్లో పేరుకుపోతున్న పూడికపై 1991, 2001, 2015, 2020లలో సీడబ్ల్యూసీ సర్వేచేసి.. నివేదికలను కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది. ఈ ఏడాది దేశంలోని 548 జలాశయాల్లో నీటినిల్వ సామర్థ్యంపై సర్వే చేసింది. పెద్దఎత్తున పూడిక పేరుపోవడం వల్ల నీటినిల్వ సామర్థ్యం భారీగా తగ్గిన జలాశయాల్లో శ్రీశైలం మొదటి స్థానంలో నిలిచింది.45 ఏళ్లలో కొండలా పూడికకృష్ణా నదిపై నంద్యాల జిల్లా శ్రీశైలం సమీపంలో 1960లో జలాశయం నిర్మాణాన్ని ప్రారంభించారు. 1976 నాటికి పూర్తి చేశారు. జలాశయంలో నీటినిల్వను 1976 నుంచే ప్రారంభించారు. అప్పట్లో రాష్ట్ర జలవనరుల శాఖ నిర్వహించిన సర్వేలో జలాశయంలో గరిష్ట నీటినిల్వ సామర్థ్యం 308.06 టీఎంసీలు కాగా.. సాగు, తాగునీటి అవసరాల కోసం ఏటా 253.05 టీఎంసీలను వినియోగించుకోచ్చని తేల్చింది.జలాశయంలో పూడిక పేరుకుపోతుండటం వల్ల ఏటా నీటినిల్వ సామర్థ్యం తగ్గుతూ వస్తోంది. సీడబ్ల్యూసీ, రాష్ట్ర జల వనరుల శాఖ తాజాగా నిర్వహించిన సర్వేలో శ్రీశైలం గరిష్ట నీటినిల్వ సామర్థ్యం 205.95 టీఎంసీలుగా తేలింది. అంటే.. 45 ఏళ్లలో గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 102.11 టీఎంసీలు తగ్గినట్టు స్పష్టమవుతోంది. జలాశయంలో పూడిక కొండలా పేరుకుపోవడం వల్లే ఆ స్థాయిలో నీటినిల్వ సామర్థ్యం తగ్గిందన్నది స్పష్టమవుతోంది.ఆయకట్టుకు నీళ్లందించడం సవాలేశ్రీశైలం జలాశయంపై ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు గంగ, ఎస్సార్బీసీ (శ్రీశైలం కుడి గట్టు కాలువ), గాలేరు–నగరి, హంద్రీ–నీవా, తెలంగాణలో కల్వకుర్తి ఎత్తిపోతలు ఆధారపడ్డాయి. పూడిక వల్ల శ్రీశైలం గరిష్ట నీటినిల్వ సామర్థ్యం, లైవ్ స్టోరేజి సామర్థ్యం భారీగా తగ్గిన నేపథ్యంలో ఆ ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు నీళ్లందించడం సవాల్‌గా మారుతుందని నీటి పారుదలరంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొండలా మారిన పూడికను తొలగించడం భారీ వ్యయంతో కూడిన పని అని, పూడిక తొలగింపు అసాధ్యమని తేల్చిచెబుతున్నారు. తగ్గిన నీటినిల్వ సామర్థ్యం మేరకు కొత్తగా రిజర్వాయర్ నిర్మించే అవకాశాలను పరిశీలించాలని ప్రభుత్వానికి సూచిస్తున్నారు. శ్రీశైలం రిజర్వాయర్ సమగ్ర స్వరూపంతొలిసారి రిజర్వాయర్‌ను నింపింది: 1976గరిష్ట నీటిమట్టం 885 అడుగులుక్యాచ్మెంట్ ఏరియా: 60,350 చ.కి.మీ.గరిష్ట స్థాయిలో నీటిని నిల్వ చేసినప్పుడు నీరు నిల్వ ఉండే ప్రాంతం 615.18 చ.కి.మీ. -
నేలలపై శ్రద్ధ పెట్టాలి!
2024 అంతర్జాతీయ భూముల దినోత్సవం (డిసెంబర్ 5) సందర్భంగా ‘మట్టి గణాంకాల సేకరణ, పర్యవేక్షణ, నిర్వహణ’పై దృష్టిని కేంద్రీకరించాలని ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఎ.ఓ.) ప్రపంచ దేశాల ప్రభుత్వాలకు పిలుపునిచ్చింది.‘మన కాళ్ల కింద ఉన్న నేల ఒక జీవవ్యవస్థ. అనేక జాతుల మనోహరమైన మొక్కలు, జంతుజాలానికి నిలయం. మనకు పోషకాహారంతో పాటు స్వచ్ఛమైన నీరు, జీవవైవిధ్యాన్ని అందిస్తున్న నేలలపై శ్రద్ధ పెట్టి పరిరక్షించుకోవటానికి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు దృష్టి కేంద్రీకరించాల’ని ప్రముఖ నేలల నిపుణుడు డాక్టర్ వి. రామ్మూర్తి సూచించారు. బెంగళూరులోని నేషనల్ బ్యూరో ఆఫ్ సాయిల్ సర్వే అండ్ లాండ్ యూజ్ ప్లానింగ్ (ఐసిఎఆర్ అనుబంధం)ప్రాంతీయ కార్యాలయం అధిపతిగా ప్రధాన శాస్త్రవేత్త (వ్యవసాయం)గా ఆయన వ్యవహరిస్తున్నారు.దక్షిణాది రాష్ట్రాల్లో నేలల బాగోగులపై అధ్యయనం చేసి, విధాన నిర్ణేతలకు తగు సూచనలు ఇచ్చే కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలోని అనేక మండలాల్లో నేలల స్థితిగతులపై తమ సంస్థ జరిపిన అధ్యయనంలో వెల్లడైన విషయాలను ఆయన ‘సాక్షి సాగుబడి’కి వెల్లడించారు. 2 రాష్ట్రాల్లో నేలలపై అధ్యయనంతెలంగాణలోని గజ్వేల్, ఇంద్రవెల్లి, మహబూబ్‌నగర్ రూరల్ మండలాల్లో.. ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్ జిల్లా రాయచోటి, తొండూరు మండలాల్లో, అనంతపురం జిల్లా కదిరి, ఓబుల దేవర చెరువు(ఓడిసి) మండలాల్లోని నేలల స్థితిగతులపై నేషనల్ బ్యూరో ఆఫ్ సాయిల్ సర్వే అండ్ లాండ్ యూజ్ ప్లానింగ్ తరఫున అధ్యయనం చేశామని డా. రామ్మూర్తి తెలిపారు. భూమి స్థితిగతులను తెలుసుకోవడానికి అది ఏ రకం భూమి? మట్టి ఎంత లోతుంది? వంటి వివరాలతో పాటు భూసారాన్ని అంచనా వేయటానికి సేంద్రియ కర్బనం ఆయా నేలల్లో ఎంత శాతం ఉందో మట్టి పరీక్షల ద్వారా నిర్థారణ చేస్తారు. సేంద్రియ కర్బనాన్ని మూడు స్థాయిల్లో (తక్కువ – 0.50% లోపు, మధ్యస్థం – 0.50–0.75% మధ్య, అధికం – 0.75% కన్నా ఎక్కువ) లెక్కిస్తారు. సేంద్రియ కర్బనం తెలంగాణ నేలలతో పోల్చితే రాయలసీమ నేలల్లో తక్కువగా ఉందని డా. రామ్మూర్తి అన్నారు. ఈ తేడాలకు కారణం ప్రకృతి వైపరీత్యాలు, వర్షపాతం, సాగు పద్ధతి కారణాలని తెలిపారు. మహబూబ్‌నగర్ రూరల్ మండలంలోని పరీక్షలు నిర్వహించిన సాగు భూముల్లో 100% నేలల్లో సేంద్రియ కర్బన శాతం అధికంగా (అంటే.. 0.75% కన్నా ఎక్కువగా) ఉండటం విశేషం. అనంతపురం జిల్లా ఇనగలూరు పంచాయతీలోని 46.29% సాగు భూముల్లో సేంద్రియ కర్బనం తక్కువగా, 35.26% భూముల్లో మధ్యస్థంగా, 18.45% భూముల్లో అధికంగా ఉందని వెల్లడైందన్నారు (పూర్తి వివరాలు పట్టికలో). వరి, పత్తి, మిర్చికి రసాయనాల వాడకం ఎక్కువవరి, పత్తి, మిర్చి పంటలకు రసాయనిక ఎరువులు మరీ ఎక్కువగా వేస్తున్నారు. ఎంత అవసరమో గమనించకుండా పక్క రైతును చూసి వేస్తున్నారు. పురుగుమందుల పిచికారీ కూడా అంతే. పశువుల ఎరువు, పచ్చిరొట్ట ఎరువులను చాలా మంది రైతులు వాడటం లేదు. అదే పంటను ప్రతి ఏటా సాగు చేస్తున్నారు. అందుకే సేంద్రియ కర్బనం అడుగంటుతోందని డా. రామ్మూర్తి తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు, రైతులు ఇప్పటికైనా జాగ్రత్తపడి సేంద్రియ కర్బనాన్ని అన్ని సాగు భూముల్లోనూ 0.7 శాతానికి పెంచుకోకపోతే భూములు సాగు యోగ్యం కాకుండా పోతాయని హెచ్చరిస్తున్నారాయన.΄పొటెన్షియల్ క్రాప్ జోన్లు ఆయా భూముల స్వభావం, భూసార పరిస్థితులు, ఆప్రాంత వాతావరణం, వర్షపాతం, అక్కడి ప్రజల ఆసక్తి, మార్కెట్ స్థితిగతులపై 20 ఏళ్ల క్రితం నాటి నుంచి సమాచారం సేకరించి విశ్లేషించామని డా. రామ్మూర్తి చెప్పారు. ఈ సమాచారంతో శాస్త్రీయంగా ΄పొటెన్షియల్ క్రాప్ జోన్స్ నివేదికలు ఇస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పత్తి, వరి, జొన్న, వేరుశనగ పంటలకు ఏయే జిల్లాలో ఎన్ని హెక్టార్ల భూమిలో ‘చాలా బాగా, ఒక మాదిరిగా, కొంతమేరకు’ ఆయా పంటల సాగుకు అనువుగా ఉన్నాయో చెప్పామన్నారు.అన్ని మండలాల్లో మట్టిని అధ్యయనం చేయాలిభూమిపై మన జీవితం ఆరోగ్యకరమైన నేలలపై ఆధారపడి ఉంటుంది. మన పాదాల కింద ఉన్న నేల ఒక జీవవ్యవస్థ. అనేక మనోహరమైన మొక్కలు, చెట్లు, జంతువులకు నిలయం. మట్టి మనకు పోషకాహారాన్ని, స్వచ్ఛమైన నీటిని, జీవవైవిధ్యాన్ని అందిస్తుంది. ప్రతి జిల్లాలో అన్ని మండలాల్లోని ΄పొలాల్లో మట్టి పరీక్షలు చేసి, అధ్యయనం చేయాలి. మన మట్టిలో వుండే పోషకాలు ఏమిటి? మట్టిలోని జీవరాశి ఏమేమి ఉన్నాయి? ఏమేమి లేవు? కాలక్రమంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి? సాగు భూములు బాగుండాలంటే వాటిని ఎలా నిర్వహించుకోవాలి? అనే విషయాలపై పాలకులు శ్రద్ధ చూపాలి.ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ్రపోత్సాహమిస్తే మట్టి ఎలా ఉందో పరీక్షించి ఎక్కువగా ఎరువులు వేయకుండా నివారించటంతో పాటు పంటల మార్పిడి,‡మట్టిని పంటలతో కప్పి ఉంచటం వంటి భూసంరక్షణ పద్ధతులపై రైతులకు చైతన్యం కలిగిస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సుసంపన్న సాంస్కృతిక జీవనానికి, ఆరోగ్యకరమైన జీవనానికి కూడా మట్టి మూలాధారం. మట్టి ద్వారానే 95% ఆహారం మనకు వస్తోంది. ఇందులో 18 సూక్ష్మ,స్థూల పోషకాంశాలు ఉంటాయి. వీటిలో 15 పోషకాంశాలను నేల నుంచి మిగతా మూడిటిని వాతావరణం నుంచి మనం ΄పొందుతున్నాం. ఈ స్పృహతో సాగు నేలల ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలి. – డాక్టర్ వి. రామ్మూర్తి (94803 15146), అధిపతి, ప్రధాన శాస్త్రవేత్త (వ్యవసాయం),్ర పాంతీయ కార్యాలయం, ఐసిఎఆర్– నేషనల్ బ్యూరో ఆఫ్ సాయిల్ సర్వే అండ్ లాండ్ యూజ్ ప్లానింగ్, బెంగళూరుఅవును..! మీరు చదివింది, ఈ ఫొటోలో చూస్తోంది.. నిజమే! మన పుచ్చ తోటల్లో పాదులు నేలపై పరచుకొని ఉంటాయి. పుచ్చ కాయలు నేలపైనే పెరుగుతాయి కదా. సౌతాఫ్రికాలో ఒక కంపెనీ పాలీహౌస్‌లలో పుచ్చ పాదులు నిలువుగా ఎగబాగుకుతున్నాయి. పుచ్చ కాయలు వాటికి వేలాడుతున్నాయి. ట్రెల్లిస్ పద్ధతిలో పెరిగే టొమాటోల మాదిరిగా ఈ పుచ్చకాయలు వేలాడుతున్నాయి కదూ.. కాండీ బాల్ సీడ్లెస్ పుచ్చకాయలు కిలో నుంచి కిలోన్నర వరకు బరువు పెరుగుతాయి. అదేమాదిరిగా కిలో బరువు పెరిగే స్మైల్ మెలన్స్ (ఇదో రకం కర్బూజ) పండ్లను కూడా నిలువు తోటల్లో పెంచుతున్నారు. టొమాటోలు వంటి కాయలు బరువు తక్కువగా ఉంటాయి కాబట్టి తీగజాతి మొక్కలు మొయ్యగలుగుతాయి.అయితే, ఇలాంటి నిలువు తోటలో పుచ్చకాయలు, కర్బూజ కాయల బరువు మొక్కలకు భారం కాకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్లాస్టిక్ నెట్ కవర్లతో కాయలను ప్లాస్టిక్ వైర్లకు కట్టేస్తున్నారు. ‘నిలువు తోటలో పెరిగిన పుచ్చకాయలను మేం త్వరలోనే అమ్మకానికి పెట్టబోతున్నాం. సౌతాఫ్రికా మార్కెట్లో మేమే ఫస్ట్’ అంటున్నారు ఆ కంపెనీ ప్రతినిధి ఫ్రాంకోయిస్ ఫౌరీ. పాలీహౌస్‌లు, నెట్‌హౌస్‌లలో, మేడపై ఇంటిపంటల్లో ట్రెల్లిస్ పుచ్చ, కర్బూజ సాగు సాధ్యమే అని గ్రహించాలి!12 నుంచి విశాఖ ఆర్గానిక్ మేళాగో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం, ఏపీ రైతు సాధికార సంస్థ, ప్రకృతి వ్యవసాయదారుల సేవాల సంఘం సంయుక్తంగా డిసెంబర్ 12 నుంచి 15వ తేదీ వరకు విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో 5వ విశాఖ ఆర్గానిక్ మేళా నిర్వహించనున్నాయి. రైతులు, ప్రకృతి/ సేంద్రియ వ్యవసాయదారులు, ఆహారోత్పత్తుల ఉత్పత్తిదారుల, వినియోగదారులు పెద్ద ఎత్తున పాల్గొనాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. 12న ఉ. 10 గంటలకుప్రారంభోత్సవంతో పాటు సేంద్రియ/ప్రకృతి వ్యవసాయదారుల సమ్మేళనం ఉంటుంది. 13న ఉ. 10 గం.కు ఆరోగ్య అవగాహన సదస్సు, 14న ఆహారప్రాసెసింగ్పై సదస్సు, 15 సేంద్రియ ఇంటిపంటలు/ మిద్దె తోటల సదస్సు, ముగింపు సమావేశం జరుగుతాయి. అందరూ ఆహ్వానితులే. ఇతర వివరాలకు.. 78934 56163, 91001 86522. -
కూటమి నేతల మధ్య ‘మట్టి’ రగడ
«సాక్షి టాస్క్‌ఫోర్స్: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో కూటమి నాయకుల మధ్య ‘మట్టి వార్’ తారాస్థాయికి చేరింది. ధర్మవరం మండలం రేగాటిపల్లిలో ఆదివారం మట్టిని అక్రమంగా తవ్వుతున్న టీడీపీ నాయకులకు చెందిన జేసీబీని జనసేన నాయకులు ధ్వంసం చేశారు. ఇక్కడ మట్టిని తాము తప్ప మరెవ్వరూ తవ్వకూడదని జనసేన నాయకులు హెచ్చరించినట్లు తెలిసింది. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ధర్మవరం మండలం రేగాటిపల్లిలో జనసేనకు చెందిన ముఖ్య నేత ఆ«ధ్వర్యంలో జేసీబీ, హిటాచీ వాహనాలతో పెద్ద ఎత్తున అక్రమంగా మట్టి తవ్వి ట్రాక్టర్లు, టిప్పర్లలో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. రోజూ రూ.లక్షల్లో ఆదాయం గడిస్తున్నారు. మట్టి కోసం ఈ పంచాయతీ దరిదాపుల్లోకి ఇతరులెవరినీ రానీయకుండా సదరు జనసేన నేత హుకుం జారీ చేస్తున్నారు. ఇదే పంచాయతీకి చెందిన పలువురు టీడీపీ నాయకులు తాము కూడా ఎన్నికల్లో కూటమి గెలిచేందుకు కృషి చేశామని, తామూ మట్టి తవ్వుకుంటామని పలుమార్లు జనసేన కీలక నేతకు విజ్ఞప్తి చేశారు. ఇందుకు ఆయన అంగీకరించలేదు. అయితే టీడీపీ నాయకులు ఆదివారం సొంతంగా జేసీబీతో రేగాటిపల్లి కొండ సమీపంలో మట్టి అక్రమ తవ్వకాలకు పూనుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన తమ పార్టీకి చెందిన పదిమందిని పంపి దౌర్జన్యం చేయించారు. మట్టి తవ్వుతున్న జేసీబీపై రాళ్ల వర్షం కురిపించి ధ్వంసం చేయించారు. ఇంత గొడవ జరుగుతున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించినట్లు సమాచారం. ఆ తర్వాత తీరిగ్గా రెండు వర్గాల మధ్య రాజీకి ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. దీన్ని తీవ్ర అవమానంగా భావించిన టీడీపీ నాయకులు తమ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి అక్కడే ఈ మట్టి గొడవ తేల్చుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. కాగా, మంత్రి సత్యకుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మవరం నియోజకవర్గంలో యథేచ్ఛగా మట్టి, ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నా, ఈ విషయంలో కూటమి నాయకులు గొడవపడుతున్నా పోలీస్, మైనింగ్ అధికారులు కనీసం పట్టించుకున్న పాపాన పోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
మట్టి పెళ్లలు విరిగిపడి.. ఐదుగురి మృతి
అహ్మదాబాద్: గుజరాత్లో విషాదం చోట చేసుకుంది. మెహసానా జిల్లాలోని కడి పట్టణ సమీపంలో శనివారం ఓ నిర్మాణ స్థలంలో మట్టిపెళ్లలు విరిగిపడిన ఘటన ఐదుగురు కార్మికులు మృతి చెందారు. జిల్లా కేంద్రానికి 37 కిలోమీటర్ల దూరంలోని జసల్‌పూర్ గ్రామంలో కార్మికులు భూగర్భ ట్యాంకు కోసం గొయ్యి తవ్వుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.Five Labourers Killed in Construction Site Collapse in Gujarat's Mehsana District #Mehsana #Gujarat #ConstructionCollapseMishap @INCGujarat @AAPGujarat https://t.co/UBMZgVKjXQ— Vibes of India (@vibesofindia_) October 12, 2024క్రెడిట్స్: Vibes of India ప్రమాద స్థలంలో ఈ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కడి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ప్రహ్లాద్‌సిన్హ్ వాఘేలా తెలిపిన వివరాల ప్రకారం.. పట్టిపెళ్లలు కూలిపోవడంతో పలువురు కార్మికులు మృతిచెందినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఐదు మృతదేహాలను వెలికితీశాం. ముగ్గురికిపైగా కార్మికులు చిక్కుకున్నారని తెలుస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకురావటానికి అధికారులు కృషి చేస్తున్నారు. -
పట్టాలపై ఇసుక పోసి.. రైలు ప్రమాదానికి మరో కుట్ర
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో రైళ్లను పట్టాలు తప్పించేందుకు జరుగుతున్న కుట్రలు ఆగడంలేదు. తాజాగా ఇటువంటి ఘటన రాయ్‌బరేలీ జిల్లాలో చోటుచేసుకుంది. ఖీరూన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రఘురాజ్ సింగ్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలపై ఇసుక కుప్పను చూసిన ప్యాసింజర్ రైలు లోకో పైలట్ వెంటనే రైలును ఆపాడు. ఈ ఘటనను పోలీసులు ధృవీకరించారు.ఖీరోన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ (ఎస్హెచ్ఓ) దేవేంద్ర భడోరియా మాట్లాడుతూ డంపర్ నుండి రైల్వే ట్రాక్‌పై ఇసుక పోశారని, దానిని తొలగించిన తరువాత రైలు ముందుకు సాగిందన్నారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామన్నారు. స్థానికంగా రోడ్డు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, దీనిలోభాగంగా మట్టిని రవాణా చేసే పని రాత్రిపూట జరుగుతున్నదన్నారు. ఈ నేపధ్యంలోనే ఓ డ్రైవర్ డంపర్ నుంచి ఇసుకను రైల్వే ట్రాక్‌పై పోసి అక్కడినుంచి పరారయ్యాడన్నారు. ఇది జరిగిన కొద్దిసేపటి తర్వాత రాయ్ బరేలీ- రఘురాజ్ సింగ్ స్టేషన్ మధ్య నడుస్తున్న షటిల్ రైలు ఈ రూట్లో వచ్చిందన్నారు. అయితే ఆ రైలు లోకో పైలట్ రైల్వే ట్రాక్‌పై మట్టిని గమనించి, రైలును ఆపాడని దేవేంద్ర భడోరియా తెలిపారు. లోకో పైలట్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పిందని, రైల్వే ట్రాక్‌పై మట్టిని తొలగించిన తర్వాత రైలు నెమ్మదిగా ముందుకు కదిలిందన్నారు. ఈ సమయంలో గ్రామస్తులు పెద్ద ఎత్తున సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గేట్మెన్ శివేంద్ర ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ రైలు వేగం తక్కువగా ఉన్నకారణంగానే ప్రమాదం తప్పిందని, ఒకవేళ వేగం ఎక్కువగా ఉంటే రైలు పట్టాలు తప్పేదన్నారు. పోలీసులు ఈ ప్రమాదానికి కారకుడైన లారీ డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.ఇది కూడా చదవండి: ఎయిర్‌పోర్టు వెలుపల పేలుడు.. ఇద్దరు మృతి -
నేల, నీరే జీవనాధారం!
వాతావరణ మార్పు వల్ల కరువు, వరదలు, అధిక ఉష్ణోగ్రతలు విరుచుకుపడుతున్న నేపథ్యం ఇది. పంటల సాగు, పశుపోషణ, ఆక్వా సాగులో రైతులు అనేక కష్టనష్టాలకు గురవుతున్న కలికాలం. మనతో పాటు సకల జీవరాశి మనుగడకు నేల, నీరే మూలాధారాలు. నేలను, నీటిని ప్రాణప్రదంగా పరిరక్షించుకుంటూనే సేద్యాన్ని కొనసాగించేలా ఐక్యరాజ్యసమితికి చెందిన వ్యవసాయ ఆహార సంస్థ (ఎఫ్.ఎ.ఓ.) ప్రజలు, రైతులను చైతన్యవంతం చేస్తూ పాలకులకు దిశానిర్దేశం చేస్తూ ఉంటుంది. రసాయనాల్లేకుండా, లోతుగా దుక్కి దున్నకుండా, ఒకటికి నాలుగు పంటలు కలిపి వేసుకోవటం ద్వారా పర్యావరణ అనుకూల వ్యవసాయ పద్ధతులను అనుసరించటం ద్వారా నేలను, నీటిని సంరక్షించుకోవటం సాధ్యమవుతుందని సమాజంలో ప్రతి ఒక్కరం గుర్తించాల్సిన తరుణం ఇది. మానవాళికి 95% ఆహారాన్ని అందిస్తున్న నేలలను పరిరక్షించుకోవాలన్న స్ఫూర్తిని కలిగించడానికి ప్రతి ఏటా డిసెంబర్ 5వ తేదీన ప్రపంచ నేలల లేదా భూముల దినోత్సవాన్ని ఎఫ్.ఎ.ఓ. నిర్వహిస్తోంది. ఈ ఏడాది నినాదం: ‘నేల, నీరే జీవరాశి అంతటికీ జీవనాధారం’! ఎఫ్.ఎ.ఓ. ఇంకా ఏం చెబుతోందో చదవండి.. ఈ నెల 8,10 తేదీల్లో విశాఖ ఆర్గానిక్ మేళా గోఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం, ఏపీ ప్రభుత్వ రైతు సాధికార సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో డిసెంబర్ 8,9,10 తేదీల్లో విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్‌లో సేంద్రియ/ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శన, అమ్మకం మేళా జరగనుంది. విశాఖలో జరుగుతున్న నాలుగో వార్షిక ఆర్గానిక్ మేళా ఇది. 8న ఉ. 10 గంటలకు రైతుల సమ్మేళనం, 9న గ్రాడ్యుయేట్ రైతుల సదస్సు, 10న ఇంటిపంటలపై సదస్సు, 11న సేంద్రియ ఉత్పత్తుల వ్యాపారుల చర్చాగోష్ఠి జరుగుతుందని నిర్వాహకులు కుమారస్వామి తెలిపారు. వివరాలకు.. 78934 56163, 86862 24466. 11న ప్రకృతి సేద్య కార్యకర్తల సమావేశం ప్రముఖ ప్రకృతి సేద్య నిపుణులు పద్మశ్రీ పురస్కార గ్రహీత సుభాశ్ పాలేకర్ డిసెంబర్ 11న ఉ.10 నుంచి. మ.1 గం. వరకు హైదరాబాద్ దోమల్‌గూడలోని రామచంద్రమిషన్‌లో ప్రకృతి వ్యవసాయ వ్యాప్తికి కృషి చేసే కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులతో ముచ్చటిస్తారు. పర్యావరణ సంక్షోభం నేపథ్యంలో ప్రకృతి వ్యవసాయాన్ని స్వతంత్ర ఉద్యమంగా గ్రామస్థాయిలో రైతుల్లో విస్తరింపజేయటంపై చర్చిస్తారు. వివరాలకు.. సేవ్ స్వచ్ఛంద సంస్థ: 63091 11427. 14 నుంచి పల్లెసృజన శోధాయాత్ర ప్రకృతితో మమేకమై జీవించే గ్రామీణులు ముఖ్యంగా రైతులు, వృత్తిదారులు, కళాకారుల విజ్ఞానాన్ని తెలుసుకోవటం.. అజ్ఞాతంగా మిగిలిపోయిన గ్రామీణ ఆవిష్కరణలను వెలికితేవటమే లక్ష్యంగా పల్లెసృజన స్వచ్ఛంద సంస్థ శోధాయాత్రలు నిర్వహిస్తోంది. 47వ చిన్న శోధాయాత్ర అన్నమయ్య జిల్లా రాజంపేట నుంచి వెంకట రాజంపేట వరకు డిసెంబర్ 14 నుంచి 17 వరకు జరుగుతుంది. వలంటీర్లు కాలినడకన పయనిస్తూ ప్రజలతో ముచ్చటిస్తారు. ఆసక్తి గల వారు రిజిస్ట్రేషన్ చేసుకొని యాత్రలో పాల్గొనవచ్చు. వివరాలకు.. బ్రిగేడియర్ పి.గణేశం – 98660 01678, 99666 46276, 99859 19342. 9, 10 తేదీల్లో సుందర రామన్ శిక్షణ తమిళనాడుకు చెందిన ప్రముఖ ప్రకృతి వ్యవసాయ నిపుణులు ఎస్.ఆర్. సుందర రామన్ డిసెంబర్ 9,10 తేదీల్లో సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని కామ్యవనంలో రైతులకు రెండు రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. రసాయనాలతో సాగుచేస్తున్న భూమిని ప్రకృతి వ్యవసాయంలోకి ఎలా మార్చాలి? నేలలో సేంద్రియ కర్బనం ఎలా పెంచాలి? ఉద్యాన పంటలకు పిచికారీ లేకుండా సమగ్ర పోషకాలు ఎలా అందించాలి? వంటి అనేక ప్రకృతి సేద్య పద్ధతులపై రైతులకు అవగాహన కల్పిస్తారు. ముందస్తు రిజిస్ట్రేషన్ల వివరాలకు.. 94495 96039, 99490 94730. 15న పాలేకర్ ఫైవ్ లేయర్ క్షేత్ర సందర్శన వికారాబాద్ జిల్లా థారూరు మండలం బూరుగడ్డ గ్రామంలో సేవ్ స్వచ్ఛంద సంస్థ సంస్థ వ్యవస్థాపకులు విజయరామ్ సుభాశ్ పాలేకర్ కృషి (ఎస్.పి.కె.) పద్ధతిలో అభివృద్ధి చేసిన ఐదు అంతస్థుల ఉద్యాన పంటల నమూనా క్షేత్రాన్ని డిసెంబర్ 15 (శుక్రవారం)న ఉ. 10.–సా.5 వరకు పద్మశ్రీ పురస్కార గ్రహీత సుభాశ్ పాలేకర్ సందర్శిస్తారు. ప్రతి అంశం వెనుక గల శాస్త్రీయతను పాలేకర్ వివరిస్తారు. 4 రాష్ట్రాల రైతులు పాల్గొంటున్నారు. ప్రసంగం తెలుగు అనువాదం ఉంటుందని విజయరామ్ తెలిపారు. 3 కి.మీ. నడవగలిగిన వారే రావాలి. భోజన ఏర్పాట్లు ఉన్నాయి. నేరుగా వచ్చే వారికి ప్రవేశ రుసుం రూ. 100. హైదరాబాద్ రామకృష్ణమిషన్ దగ్గర గల సేవ్ కార్యాలయం నుంచి బస్సులో వెళ్లే వారికి రూ. 500. ముందస్తు రిజిస్ట్రేషన్ తప్పనిసరి. వివరాలకు.. 63091 11427. (చదవండి: ప్రపంచానికి చిరుధాన్యాల సత్తా చాటిన భారత్ !) -
మట్టిని కాపాడుకోవాలి
సాక్షి, హైదరాబాద్: ‘మన జీవితాల్లో అత్యంత కీలకమైనది..అందుకు తగ్గ గుర్తింపు లేని అంశం ఏదైనా ఉంది అంటే.. అది మన పాదాల కింది మట్టేనని’ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి స్పష్టం చేశారు. సూక్ష్మజీవులు, క్రిమికీటకాలు, మొక్కలు, వృక్షాల వేళ్లతో కూడిన ఈ సంక్లిష్ట జీవావరణ వ్యవస్థను కాపాడుకోవడం ఇప్పుడు మనిషికి అత్యవసరమన్నారు. హైదరాబాద్ సమీపంలోని ‘కాన్హా శాంతివనం’లో ‘4 పర్ 1000’ పేరుతో మట్టి సంరక్షణ లక్ష్యంగా బుధవారం ప్రారంభమైన అంతర్జాతీయ సదస్సుకు మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జర్మనీ, ఫిజీలతోపాటు సుమారు 18 దేశాల వ్యవసాయశాఖల మంత్రులు పాల్గొన్న ఈ సమావేశంలో నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ నీరు, పోషకాలతో కూడిన మట్టి అటు వాతావరణాన్ని నియంత్రించడమే కాకుండా, జీవవైవిధ్యాన్ని కాపాడేందుకూ సాయపడుతోందని చెప్పారు. అయితే వివిధ కారణాల వల్ల ప్రపంచవ్యాప్తంగా మట్టి సారం తగ్గిపోతుండటం, సారవంతమైన మట్టి కొట్టుకుపోవడం మానవాళి మనుగడకు ముప్పు కలిగించేవని ఆందోళన వ్యక్తం చేశారు. ఆహారభద్రత, పర్యావరణ సమతుల్యతలకూ ప్రమాదకరంగా మారిన ఈ సమస్యను పరిష్కరించేందుకు సమష్టిగా కృషి చేయాల్సిన అవసరముందన్నారు. ఆర్థిక విలువ జోడించాలి: దాజి, ఆధ్యా త్మిక గురువు దేశంలోనే అత్యంత వేగంగా పచ్చదనం పెంచుకుంటున్న రాష్ట్రంగా తెలంగాణ ఎదుగుతోందని, అయితే మొక్కల పెంపకం ఏదో మొక్కుబడి తంతుగా కాకుండా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేదిగా మార్చాలని ‘హార్ట్ఫుల్నెస్ ఇనిస్టిట్యూట్’ ఆధ్యాత్మిక మార్గదర్శి, రామచంద్రమిషన్ అధ్యక్షుడు దాజి తెలిపారు. బంజరుభూమిని కూడా ఎంత అద్భుతమైన, జీవవంతమైన నేలగా మార్చవచ్చో కాన్హా ద్వారా స్పష్టంగా తెలుస్తుందని ఆయన చెప్పారు. తెలంగాణలోని ప్రతిగ్రామంలో మొక్కల నర్సరీలు ఏర్పాటు చేయడం బాగుందని.. అయితే ప్రభుత్వం చెట్లు నరికేయకుండానే గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికదన్ను అందించేలా చర్యలు తీసుకోవాలని, ఇంధన అవసరాలు తీర్చే దిశగా ప్రయత్నాలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫిజీ వ్యవసాయశాఖ మంత్రి సకయాసీ రాల్సెవూ డిటోకా, ఫ్రాన్స్ కాన్సుల్ జనరల్ (బెంగళూరు) థియరీ బెర్త్‌లాట్, వ్యవసాయశాఖ కార్యదర్శి ఎం.రఘునందన్‌రావు, ‘4 పర్ 1000’ ఎగ్జిక్యూటివ్ కార్యదర్శి డాక్టర్ పాల్లూ తదితరులు పాల్గొన్నారు. మూడు రోజులపాటు జరిగే ఈ సదస్సులో వాతావరణ మార్పులు, ఆహార భద్రతను ఎదుర్కొనేందుకు మట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలా అన్న అంశంపై చర్చలు జరుగుతాయి. -
AP: ఊర్ల నుంచి మట్టి సేకరణకు బీజేపీ సన్నద్ధం
సాక్షి, విజయవాడ: ఏపీ బీజేపీ ఆధ్వర్యంలో శంఖానాదం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా బీజేపీ సోషల్ మీడియా, ఐటీ ప్రతినిధులకు రాష్ట్రస్థాయి వర్కషాపు నిర్వహిస్తున్నారు. ఏపీ బీజేపీ కార్యకర్తలకు శిక్షణ ఇచ్చేందుకు ఢిల్లీ నుంచి బీజేపీ సోషల్ మీడియా ఇన్చార్జ్ పునీత్ జీ రాష్ట్రానికి వచ్చారు. ఈ మేరకు ఏపీ బీజేపీ అధ్యక్షరాలు పురందేశ్వరి మీడియాతో మాట్లాడుతూ.. ‘ఎన్నికల సమయానికి అందరూ సన్నధ్దం కావాలి. నేడు సోషల్ మీడియా ఎంతో కీలకంగా పనిచేస్తుంది. సమాజంలో సోషల్ మీడియా అంశాల పైనే చర్చ సాగుతుంది. సోషల్ మీడియా లో ఎలా పనిచేయాలో నేడు శిక్షణ ఇస్తాం. నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాక కేంద్రం అనేక సంక్షేమ పధకాలు అమలు చేసింది. ఎన్నికల సమర శంఖం పూరించేలా... శంఖానాదం అని పేరు పెట్టాం. మహిళల కోసం మోదీ ఒక అన్న గా అండగా నిలిచారు. మహిళల గౌరవం కోసం మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టారు. నాడు కొంతమంది అవహేళనగా మాట్లాడారు. మహిళల పేరుతో ఇళ్ల నిర్మాణం చేశారు. మహిళల పై జరుగుతున్న దురాగతాలను నివారించే చర్యలు చేపట్టారు. మహిళల కు ప్రాధాన్యత ఇస్తూ మోదీ అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఉజ్జ్వల పధకం ద్వారా గ్యాస్ సిలిండర్లను అంద చేశారు. రాఖీ పండుగ సందర్భంగా సోదరీమణులు కోసం గ్యాస్ సిలిండర్ ధర తగ్గించారు. గ్రామ పంచాయతీల నిధులు మళ్లింపు పై మేము పోరాటం చేశాం. మా మిత్ర పక్షం జనసేన తో కలిసి ఆందోళనలు నిర్వహించాం. నా భూమి, నాదేశం కార్యక్రమం బిజెపి జాతీయ స్థాయిలో చేపట్టింది. సెప్టెంబరు ఒకటి నుంచి 15 వరకు అన్ని గ్రామాల్లో మట్టిని సేకరిస్తాం. పట్టణాలు, నగరాల్లో బియ్యం సేకరిస్తాం.రెండో దశలో గాంధీ జయంతి వరకు సేవా కార్యక్రమాలు చేపడతాం. ఈ మట్టిని ఢిల్లీ తీసుకెళ్లి అక్కడ అన్ని రాష్ట్రాల మట్టితో అమృత వనం ఏర్పాటు చేస్తాం. ఈ మట్టి ఎలా పంపాలో రెండో దశలో ప్రజలకు వివరిస్తాం. రాష్ట్ర, జిల్లా స్థాయిలో ప్రతినిధులు సోషల్ మీడియా లో పని చేసేలా అవగాహన కల్పిస్తాం. ఎన్టీఆర్ ఆవిష్కరణలో మా కుటుంబం అంతా పాల్గొంది. మా తరువాత వారుసులు కూడా తాతపై ప్రేమతో పాల్గొన్నారు. ఎనిమిది మాసాల్లో ఎన్నికలు ఉన్నాయి అప్పటి కి పార్టీ ని సన్నద్ధం చేస్తున్నాం’ అని అన్నారు. -
నేల సాగు కన్నా బ్యాగు సేద్యం మిన్న!
సేంద్రియ కూరగాయ పంటలను పొలంలో సాధారణ పద్ధతిలో నేలలో కన్నా.. ప్రత్యేకమైన బ్యాగుల్లో సాగు చేయటం ద్వారా రెట్టింపు కన్నా ఎక్కువగా దిగుబడి తీయవచ్చని తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లా తునికిలోని డా. రామానాయుడు ఏకలవ్య సేంద్రియ కృషి విజ్ఞాన కేంద్రంలో ఈ ఏడాది ఫిబ్రవరి–జూలై నెలల మధ్య ప్రయోగాత్మక సాగులో రుజువైంది. ఈ పంటల సాగును శాస్త్రవేత్తలు ఆసాంతమూ సేంద్రియ పద్ధతుల్లో సాగు చేసి, శాస్త్రీయంగా గణాంకాలను నమోదు చేశారు. నగరాలు, పట్టణాలకు దగ్గల్లోని భూసారం అంతగా లేని భూముల్లో, రసాయనాలతో కలుషితమైన లేదా చౌడు తదితర సమస్యాత్మక భూముల్లో బ్యాగు సేద్యం ద్వారా పెద్ద ఎత్తున సేంద్రియ కూరగాయల ఉత్పత్తి పొందడానికి, తద్వారా అన్‌సీజన్‌లో రైతులు అధికాదాయం పొందడానికి అవకాశం ఉన్నట్లు ఈ ప్రయోగం ద్వారా వెల్లడైందని కేవీకే అధ్యక్షుడు టి. వినోద్‌రావు తెలిపారు. సేంద్రియ రైతు శాస్త్రవేత్త ఎం.ఎస్. సుబ్రహ్మణ్యం రాజు మార్గదర్శకత్వంలో కేవీకే శాస్త్రవేత్తల బృందం బ్యాగు సాగులో అద్భుత దిగుబడులు రాబడుతోంది. ఎత్తు బెడ్లపై సేంద్రియ కాకర సాగు కాకరను వేసవి పంటగా నేలపై ఎత్తు బెడ్లపై ఏక పంటగా సాగు చేయగా.. ఎకరానికి 4,480 కిలోల (4.48 టన్నులు/ఎకరం) సేంద్రియ కాకర కాయల దిగుబడి వచ్చింది. తునికి కేవీకే ప్రాంగణంలోని 12.5 సెంట్ల భూమి (0.125 ఎకరం)లో సాధారణ పందిరి పద్ధతిలో 1,000 కాకర విత్తనాలను ఎత్తయిన బెడ్లపై ఫిబ్రవరి 25న విత్తారు. పూర్తిగా సేంద్రియ పద్ధతిలో బిందు సేద్యం ద్వారా పండించారు. పంట కోత ఏప్రిల్ 17 నుంచి జూలై12 వరకు కాకర కాయలు కోశారు. ఈ వెయ్యి మొక్కల నుంచి∙560.5 కిలోల దిగుబడి వచ్చింది. ఒక్కో మొక్క నుంచి 0.56 కిలోల కాకర కాయల దిగుబడి వచ్చింది. ఈ లెక్కన.. ఎత్తు బెడ్స్ పద్ధతిలో సగటున ఎకరానికి 4,480 కిలోల కాకర దిగుబడి రాగా, సగటున ఎకరానికి రూ. 1,92,000 ఖర్చయినట్లు (కౌలు కాకుండా) శాస్త్రవేత్తలు రికార్డు చేశారు. బ్యాగుల్లో కాకర సాగు పక్క పొలంలోనే ప్లాస్టిక్ బ్యాగుల్లో కాకర పంటను పూర్తిగా సేంద్రియ పద్ధతుల్లో సాగు చేయగా.. సగటున ఎకరానికి 8,000 కిలోల (8 టన్నులు/ఎకరం) సేంద్రియ కాకర కాయల దిగుబడి వచ్చింది. 25 సెంట్ల భూమిలో 2023 ఫిబ్రవరి 2న 616 బ్యాగుల్లో, ఒక్కో బ్యాగులో రెండు చొప్పున, కాకర విత్తనాలను పెట్టి, మొక్కలను పందిరికి పాకించారు. విత్తిన 70 రోజులకు మొదలై 175 రోజుల (జూలై 25) వరకు కాయలు కోశారు. మొత్తం 2 టన్నుల కాకర కాయల దిగుబడి వచ్చింది. ఈ లెక్కన.. సగటున ఎకరానికి 8 టన్నుల కాకర దిగుబడి వచ్చింది. బ్యాగుల్లో కాకర సాగుకు సగటున ఎకరానికి (కౌలు కాకుండా) రూ. 2,40,000 ఖర్చయినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. కాకరతో పాటు.. అదే పొలంలో టొమాటో, పుదీనా, క్యాబేజీ కూడా.. ఎత్తు బెడ్ల సాగులో కాకర ఒక్కటే పంట సాగు చేయగా, బ్యాగు సాగులో కాకరతో పాటు మరికొన్ని బ్యాగుల్లో టొమాటో, పుదీనా, క్యాబేజీ పంటలు కూడా సాగు చేశారు. ఈ పంటల ద్వారా 3,640 కిలోల(3.64 టన్నులు/ఎకరం) దిగుబడి అదనంగా రావటం విశేషం. 25 సెంట్ల భూమిలో మొత్తం 1,566 బ్యాగులు పెట్టారు. అందులో 616 బ్యాగుల్లో రెండేసి కాకర మొక్కలు (2 టన్నుల దిగుబడి), 410 బ్యాగుల్లో రెండేసి క్యాబేజీ మొక్కలు (374 కిలోల దిగుబడి), 180 బ్యాగుల్లో రెండేసి టొమాటో మొక్కలు పెట్టారు. మరో 360 బ్యాగుల్లో ఒక్కోటి చొప్పున టొమాటో, పుదీనా మొక్కలు కలిపి నాటారు. మొత్తం 453 కిలోల టొమాటోలు, 83.6 కిలోల పుదీనా దిగుబడి వచ్చింది. బ్యాగుల్లో సేంద్రియ సాగు ఇలా.. అడుగున్నర ఎత్తు, అడుగు వెడల్పు ఉండే పాలిథిన్ బ్యాగులో 15 కిలోల పశువుల ఎరువు, 15 కిలోల ఎర్రమట్టి, 100 గ్రా. వేపపిండి కలిపిన మిశ్రమాన్ని నింపారు. జీవామృతం ప్రతి 10–15 రోజులకోసారి పాదుల్లో పోశారు. పంచగవ్య, రాజ్మాగింజల ద్రావణం, కొబ్బరి నీరు నాలుగైదు సార్లు పిచికారీ చేశారు. వేసవిలో కురిసిన అకాల వర్షాల వల్ల లీఫ్ బ్లైట్ వంటి తెగుళ్లు సోకినప్పటికీ సేంద్రియ పద్ధతుల్లోనే వాటిని నియంత్రించటం విశేషం. ఈ కేవీకేలో బ్యాగు సేద్యంపై (గత ఏడాది డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు) రెండు బ్యాచ్‌లలో ప్రయోగాలు పూర్తయ్యాయి. 10న నందిగామలో ప్రకృతి సేద్యంపై శిక్షణ సెప్టెంబర్ 10(ఆదివారం)న ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ ఇవ్వనున్నారు. ప్రకృతి వ్యవసాయ ప్రచారకులు విజయ్ రామ్ అవగాహన కల్పిస్తారు. ప్రవేశం ఉచితం. ముందుగా పేరు నమోదు చేసుకోవాలి. 150 మందికి అవకాశం ఉంటుందని నిర్వాహకులు బాలకృష్ణారెడ్డి తెలిపారు. వివరాలకు.. 90281 85184, 64091 11427. వచ్చే నెల 4 నుంచి తేనెటీగల పెంపకంపై శిక్షణ ప్రొ. జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని సకశేరుక చీడల యాజమాన్య విభాగం సెప్టెంబర్ 4 నుంచి 9వ తేదీ వరకు తేనెటీగల పెంపకంపై శిక్షణ ఇవ్వనుంది. తేనెటీగల పెంపకంపై ఆసక్తి ఉన్న రైతులు, నిరుద్యోగ యువత ఈ శిక్షణకు అర్హులని ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ డాక్టర్ వి. సునీత తెలిపారు. అభ్యర్థులకు ఉచిత భోజన వసతులు కల్పిస్తామన్నారు. వివరాలకు.. 94948 75941. (చదవండి: అర్బన్ కౌలు రైతుల పాట్లు!..కొద్దిపాటి స్థలంలోనే సిటీ ఫార్మింగ్! ) -
చంద్రయాన్ 3 సాఫ్ట్ ల్యాండింగ్ వెనుక తమిళనాడు మట్టి కీలక పాత్ర..
న్యూఢిల్లీ: చంద్రుని దక్షిణ ధ్రువం మీద సగర్వంగా జెండా పాతి చంద్రయాన్ –3 విజయనాదం చేసింది. దేశ దక్షిణ కొసన తమిళనాడులో మారుమూల విసిరేసినట్టుగా ఉండే నమ్మక్కల్‌లో సంబరాలు మిన్నంటాయి. ఎందుకంటే చంద్రయాన్ ప్రయోగాల్లో అక్కడి మట్టిదే ప్రధాన పాత్ర మరి! ఎందుకు, ఎలా అన్నది ఓ ఆసక్తికరమైన కథ...! అంతరిక్షంలో ప్రయోగం పూర్తిగా శాస్త్రవేత్తల కంట్రోల్లో ఉండదు. ఉపగ్రహాలు, నింగిలోకి పంపేటప్పడు ఉపయోగించే వాటి పనితీరును భూమిపైనే పరిశీలిస్తారు. అంతరిక్షంలో ఉండే వాతావరణాన్ని భూమిపైనే ఏర్పాటు చేసి పరిశోధనలు చేస్తారు. 2008లో చంద్రయాన్–1 అనంతరం తర్వాతి ప్రయోగాలకు ఇస్రో సిద్ధమవుతున్న రోజులవి. చంద్రునిపై సఫ్ట్ లాండింగే లక్ష్యంగా చంద్రయాన్ –2 ను తయారు చేశారు. అది చంద్రునిపై దిగితే అందులోని రోవర్ బయటికి వచ్చి చంద్రుని నేలపై నడిచేలా ప్లాన్ చేశారు. అందుకోసం లాండర్‌ను ఎక్కడ దించాలి? రోవర్ ఎలా నడవాలి? ఇవన్నీ ప్రశ్నలే. చదవండి: చంద్రుడి గుట్టు తెలుసుకొనేలా.. వాటికి సమాధానం వెదికేందుకు ఇస్రో సిద్ధమైంది. అందుకు చంద్రునిపై ఉండే మట్టి మాదిరి మట్టి కావాలి. అందుకోసం వెదుకులాట మొదలైంది. వారికి సరిపోయే మట్టి చెన్నైకు 400 కిలోమీటర్ల దూరంలో నమ్మక్కల్ లో దొరికింది. 2021లో అక్కడి నుంచి 50 టన్నుల మట్టి సేకరించారు. 2019లో చంద్రయాన్ –2 మిషన్‌లో ఆ మట్టితోనే ల్యాండర్, రోవర్ అడుగులను పరీక్షించారు. తాజాగా చంద్రయాన్ –3 ప్రయోగాలకు నమ్మక్కల్ మట్టినే వాడారు. అది అనర్‌తో సైట్ మృత్తిక ‘చంద్రుని ఉపరితలం మీద ఉన్నది అనర్‌తో సైట్ రకం మృత్తిక. తమిళనాడులోని కొన్ని చోట్ల అదే రకం మట్టి ఉన్నట్టు మేం యాదృచ్ఛికంగా చేసిన భూగర్భ పరిశోధనల్లో తేలింది. కున్నమలై, సీతంపూంది వంటి నమ్మక్కల్ పరిసర ప్రాంతాల్లో అది పుష్కలంగా దొరికింది’అని పెరియార్ విశ్వవిద్యాలయం జియాలజీ ప్రొఫెసర్ అయిన ఎస్.అన్బళగన్ వెల్లడించారు. చదవండి: చంద్రుడి గుట్టు తెలుసుకొనేలా.. -
ఎర్రమట్టికి, ఎర్రమట్టి దిబ్బలకు తేడా తెలుసుకో పవన్
కొమ్మాది (భీమిలి): ఎర్రమట్టికి, ఎర్రమట్టి దిబ్బలకు తేడా తెలుసుకోవాలని ఇక్కడి జేవీ అగ్రహారం, నిడిగట్టు, కొత్తవలస రైతులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు సూచించారు. పర్యాటక ప్రాంతం ఎర్రమట్టి దిబ్బలను ధ్వంసం చేస్తున్నారంటూ పవన్ చేస్తున్న వ్యాఖ్యలను వారు ఖండించారు. గురువారం ఎర్రమట్టి ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రైతులు మాట్లాడారు. దేశ ప్రధానిగా ఇందిరాగాంధీ ఉన్న సమయంలో ఈ ప్రాంతాల్లో ఒక్కో రైతుకు 5 ఎకరాలు ఇచ్చారని తెలిపారు. కాలక్రమేణా పంటలు పండకపోవడంతో ప్రభుత్వం ఈ భూములను అభివృద్ధి చేస్తామనడంతో లాండ్ పూలింగ్‌కు ఇచ్చామని, తమపై ఎటువంటి ఒత్తిడీ లేదని చెప్పారు. బుధవారం పవన్ పర్యటించిన ప్రాంతం నుంచి కనుచూపు మేరలో కూడా ఎర్రమట్టి దిబ్బలు లేవన్నారు. అసలు ఎర్రమట్టి కనిపించే ప్రాంతమంతా ఎర్రమట్టి దిబ్బలు కావని పవన్ తెలుసుకోవాలన్నారు. ఈ ప్రాంతంలో ఎక్కడ చూసినా మట్టి ఎర్రగా ఉంటుందని, అలా అని ఊరంతా ఎర్రమట్టి దిబ్బలంటే ఎలా అని ప్రశ్నించారు. పవన్ పర్యటించిన ప్రాంతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం నాయకులు రైతుల వద్ద తక్కువ ధరకు డీఫారం భూములు కొన్నారని చెప్పారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక లాండ్ పూలింగ్ ద్వారా రైతులకు మేలు జరిగిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో భూములు చవగ్గా లాగేసుకున్నా మాట్లాడని పవన్ ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. పవన్ వాస్తవాలు తెలుసుకుని ప్రజల్లోకి వెళ్లాలే తప్ప ఇతర పార్టీల లబ్ధికోసం పేదల పొట్టకొట్టడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో రైతులతోపాటు వైఎస్సార్సీపీ వార్డు అధ్యక్షుడు రమణారెడ్డి, నాయకులు రామకృష్ణ, నల్లబాబు, చంటి తదితరులు పాల్గొన్నారు. -
Banothu Vennela: మట్టిని కాపాడుకుందాం!
మట్టితో పోరాడితేనే విత్తనం మొక్కగా ఎదగగలదు. కానీ, సారం లేని మట్టిలో ఏ విత్తనమూ మొలకెత్తదు. మనిషి స్వార్థంతో చేసే కలుషిత కారకాల ద్వారా మట్టి సారం కోల్పోతోంది. భూసారాన్ని కాపాడుకోకుంటే భవిష్యత్తులో అనేక దుష్పరిణామాలు తలెత్తవచ్చు. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న బానోత్ వెన్నెల అనే గిరిజన అమ్మాయి ‘సేవ్ సాయిల్’ పేరుతో ఐదు వేల కిలోమీటర్ల సైకిల్ యాత్రకు పూనుకుంది. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని మారుమూల గిరిజన గ్రామపరిధిలోని సర్దాపూర్ తండాకు చెందిన బానోత్ వెన్నెల 60 రోజుల్లో 5 వేల కిలోమీటర్ల సైకిల్ యాత్రను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. సైకిల్ యాత్ర ద్వారా వేలాది మంది రైతులకు, ప్రజలకు ‘మట్టి’ పట్ల అవగాహన కల్పిస్తోంది. ఇప్పటికి దాదాపు రెండు వేల కిలోమీటర్లకు చేరువైంది. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల మీదుగా ఆమె సైకిల్ యాత్ర చేస్తోంది. మే1న కామారెడ్డి నుంచి సైకిల్ యాత్రను ప్రారంభించిన వెన్నెల మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి, జోగులాంబ గద్వాల, మహబూబ్‌నగర్ జిల్లాల మీదుగా వెళుతోంది. అన్ని ప్రాంతాల్లోనూ రైతులను, గ్రామ పెద్దలను కలిసి ‘మట్టిని ఏ విధంగా కాపాడాలో, ఎందుకు కాపాడాలో’ వివరించి, తిరిగి తన యాత్రను కొనసాగిస్తోంది. కలల అధిరోహణ వెన్నెల చిన్నతనంలోనే ఆమె తండ్రి మోహన్ చనిపోయాడు. తల్లి భూలి కూలి పనులు చేస్తూ పిల్లల్ని పోషిస్తోంది. వెన్నెలకు ఇద్దరు అన్నలు, ఒక అక్క. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పదవతరగతి పూర్తి చేసింది వెన్నెల. తల్లి కూలి పనికి వెళితే గానీ కుటుంబం నడవని పరిస్థితి. అలాంటి పేద కుటుంబంలో పుట్టిన వెన్నెలకు పెద్ద పెద్ద లక్ష్యాలున్నాయి. ఎన్ని కష్టాలైనా సరే వాటిని సాధించాలన్న పట్టుదలతో నిరంతరం సాధన చేస్తోంది. పర్వతారోహణ చేయాలన్నది ఆమె లక్ష్యం. ఇందుకోసం కొంతకాలం భువనగిరిలో రాక్ క్లైబింగ్ స్కూల్లో మౌంటెనీర్లో శిక్షణ కూడా తీసుకుంది. అయితే పేదరికం ఆమెకు శాపంగా మారింది. సోషల్‌మీడియాలో జగ్గీవాస్‌దేవ్ ‘సేవ్ సాయిల్’ కథనాలు విని స్ఫూర్తి పొందిన వెన్నెల భవిష్యత్తు భూసారాన్ని పెంచడానికి తన వంతుగా సమాజాన్ని జాగృతం చేయాలనుకుంది. రెండు నెలల పాటు ఒంటరిగా సైకిల్‌పై వెళ్లే యాత్రకు పూనుకుంది. తల్లి చెవి కమ్మలతో సైకిల్... ఒంటరి యాత్రకు తల్లిని ఒప్పించింది. కానీ, సైకిల్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేని పరిస్థితులు. తిరిగి తల్లినే బతిమాలుకుంది. తల్లి చెవి కమ్మలు అమ్మి, ఆమె ఇచ్చిన డబ్బులతో సైకిల్ కొనుగోలు చేసింది. మే 1 న కామారెడ్డి నుంచి సైకిల్ యాత్రను ప్రారంభించింది. ప్రస్తుతం కొత్తగూడెం భద్రాచలం జిల్లాలో యాత్ర కొనసాగుతోంది. 60 రోజుల్లో 5,000 కిలోమీటర్ల సైకిల్ యాత్ర నిర్వహించాలని లక్ష్యం పెట్టుకుంది. రాత్రిపూట ఉండాల్సిన పరిస్థితులు, యాత్రలో సమస్యల గురించి ప్రస్తావించినప్పుడు ‘ఇప్పటి వరకు ఆరు గరŠల్స్ హాస్టల్లో రాత్రిళ్లు బస చేశాను. మిగతా చోట్ల. పోలీస్ స్టేషన్లలో ఉన్నాను. ఈ రోజు (రాత్రి) కూడా పోలీస్ స్టేషన్లో ఉన్నాను. స్థానికంగా ఉండే రాజకీయ నాయకులు కూడా సపోర్ట్ చేస్తున్నారు. 10 రోజులు యాత్ర పూర్తయ్యాక ఈషా ఫౌండేషన్ వాళ్లు కలిశారు. ఒక అమ్మాయిగా ఇలాంటి సాహసమైన పనిని చేస్తున్నందుకు గర్వంగా ఉంది. రోజూ వంద కిలోమీటర్లు ‘రోజుకు వంద కిలోమీటర్లు సైకిల్ యాత్ర చేస్తున్నాను. దారిలో రైతులు, గ్రామస్తులను కలుస్తున్నాను. భూసారం గురించి, వారు చేస్తున్న పంటల పనుల గురించి అడిగి తెలుసుకుంటున్నాను. చాలా వరకు భూమిలో సేంద్రీయత కేవలం 0.9 శాతం మాత్రమే ఉంది. ఇది ఇలాగే తగ్గితే భవిష్యత్తులో పంటల దిగుబడులకు, మనుషుల మనుగడకు పెద్ద ప్రమాదం పొంచి ఉంది. ఈ సమస్య తలెత్తకుండా ఉండాలంటే ఇప్పటి నుంచే మేలుకోవాలి. 2050 నాటికి కనీసం 3 నుంచి 6 శాతం తిరిగి భూసారం పెంచాల్సిన అవసరం ఉంది. ఇందుకు సేంద్రీయ పద్ధతులను అవలంభించి భూసారాన్ని కాపాడాలి. లేదంటే ఇబ్బందులు తప్పవని దారిపొడవునా కలిసిన వారికల్లా వివరిస్తున్నాను’ అని తెలిపింది వెన్నెల. నిన్నటితో దాదాపు రెండు వేల కిలోమీటర్ల సైకిల్ యాత్ర పూర్తయ్యింది. ఎక్కడా ఏ ఇబ్బందులూ లేవని, గ్రామస్తుల ఇళ్లలోనే వారి ఆహ్వానం మేరకు భోజనం సదుపాయం కూడా పొందుతున్నాను’ అని తెలిపింది వెన్నెల. మట్టిబిడ్డగా మట్టి కోసం... మాది పేద కుటుంబం. అమ్మే అన్నీ తానై మమ్మల్ని పెంచి పెద్ద చేస్తోంది. ఎవరెస్ట్ అధిరోహించాలన్నది నా లక్ష్యం. ఆ లక్ష్యాన్ని సాధించాలంటే ఎన్నో అవరోధాలను అధిగమించాలి. అందుకే కొన్ని రోజులు శిక్షణ తీసుకున్నా. ఇప్పుడు భూ సారాన్ని కాపాడమంటూ సైకిల్ యాత్ర చేపట్టా. యాత్ర ద్వారా ఎంతో మంది చైతన్యం అవుతున్నారు. మట్టి బిడ్డగా మట్టికోసం చేస్తున్న ఈ యాత్ర సక్సస్ అవుతుంది. దీని తరువాత కాలేజీలో అడ్మిషన్ తీసుకోవాలి. ఆ తర్వాత పర్వతారోహణ మీద దృష్టి పెడతా. – బానోత్ వెన్నెల, సర్దాపూర్ తండా, కామారెడ్డి – ఎస్.వేణుగోపాలచారి, సాక్షి, కామారెడ్డి. -
పంటపొలాల్లో పేరుకుపోయిన భాస్వరం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పంటపొలాల్లో భాస్వరం నిల్వలు పేరుకుపోయాయని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం సర్వేలో తేలింది. రాష్ట్రవ్యాప్తంగా 6 వేల మట్టి నమూనాలను సేకరించి పరీక్షించగా 53 శాతం నేలల్లో అధిక భాస్వరం నిల్వలు ఉన్నట్లు తేలింది. 208 మండలాల్లో అధిక భాస్వరం నిల్వలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇందులో 54 మండలాల్లో ఓ మోస్తరు, 154 మండలాల్లో అత్యధికస్థాయిలో ఉన్నట్లు తేల్చింది. నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో 90 శాతం కన్నా ఎక్కువ మండలాల్లో భాస్వరం నిల్వలు అధికంగా ఉన్నట్లు తేల్చారు. నిజామాబాద్‌లో 27 మండలాలకుగానూ 26 మండలాల్లో అధికనిల్వలు ఉన్నట్లు తేలింది. కామారెడ్డి జిల్లాలో 22 మండలాలకుగానూ 20 మండలాల్లో, కరీంనగర్లో 16 మండలాలకుగానూ అన్నిచోట్లా, పెద్దపల్లిలో 14 మండలాలకుగానూ అన్నిచోట్లా, సిరిసిల్లలో 13 మండలాలకుగానూ అన్ని మండలాల్లోనూ అధిక భాస్వరం నిల్వలు పేరుకుపోయాయని తేలింది. పంటకు అవసరమైన భాస్వరాన్ని డీఏపీ లేదా కాంప్లెక్స్ ఎరువుల రూపంలో అందిస్తారు. పంటకు వేసిన ఎరువులో కేవలం 15–20 శాతం ఎరువునే పంట వినియోగించుకుంటుంది. మిగిలిన 80 శాతం కరగని స్థితిలో భూమిపొరల్లో ఉండిపోతుంది. అయినప్పటికీ రైతులు విచ్చలవిడిగా ఎరువులను వినియోగిస్తూనే ఉన్నారని విశ్వవిద్యాలయం అధికారులు చెబుతున్నారు. కాగా, ఎరువుల ధరలను కూడా కేంద్రం భారీగా పెంచింది. దీంతో రైతుకు పెట్టుబడి ఖర్చు అధికమయ్యే ప్రమాదం ఏర్పడింది. పొలాల్లో పేరుకుపోయిన భాస్వరం నిల్వలను కరిగించి మళ్లీ పంటకు ఉపయోగపడేలా చేసేందుకు వ్యవసాయ శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా ఫాస్పేట్ సాల్యుబింగ్ బ్యాక్టీరియా(పీఎస్బీ) తయారు చేశారు. ఇది పౌడర్, ద్రవరూపంలో అన్ని ఎరువుల షాపుల్లో లభిస్తుందని వ్యవసాయ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు రైతులకు అవగాహన పెంచేలా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. -
చెరువు మట్టి.. భూమికి బలం
ఎల్.ఎన్.పేట: పంట దిగుబడి కోసం రైతులు విచక్షణా రహితంగా ఎరువులు, పురుగు మందులు వినియోగిస్తుంటారు. దీని వలన భూసారం క్షీణిస్తోందని వ్యవసాయ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. భూసారం పెంచాలంటే కొత్తమట్టిని వేయడం ద్వారా సత్ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు. చెరువుల్లోని పూడిక మట్టి వేస్తే పొలం సారవంతంగా మారుతుందని సూచిస్తున్నారు. ఈ మట్టి వేయడం ద్వారా భూసారంతో పాటు పోషక విలువలు పెరుగుతాయని స్పష్టం చేస్తున్నారు. పురుగు మందులు, ఎరువులు ఎక్కువగా వాడటం వలన భూమి పొరల్లో ఉండే మిత్ర పురుగులు నశించడం వలన రైతుకు నష్టం ఉంటుందంటున్నారు. పూడిక మట్టిలో పోషకాలు చెరువులో నీరు నిల్వ ఉన్నప్పుడు ఆకులు, గడ్డి వంటి వ్యర్థాలు కుళ్లి మట్టిలో చేరుతాయి. వేసవలి సమయంలో చెరువులు అడుగంటుతాయి. ఈ సమయంలో చెరువు పూడిక మట్టిలో తగినంత పాళ్లలో నత్రజని, భాస్వరం, పొటాషియం, జింకు, బోరాన్, సేంద్రియకార్భన్ పదార్థాలు, మొక్కల పెరుగుదలకు ఉపయోగపడే సూక్ష జీవులు, పంటకు మేలు చేసే మిత్ర పురుగులు వృద్ధి చెందుతాయి. భూమి పొరల్లో తేమను ఎక్కువ రోజుల పాటు ఉండేలా చేసే గుణం ఈ మట్టికి ఉంది. కిలో పూడిక మట్టిలో నత్రజని 720 మి.గ్రా, భాస్వరం 320 మి.గ్రా, పోటాషియం 810 మి.గ్రా, సేంద్రియకార్భనం 308 మి.గ్రాలతో పాటు మైక్రోబియల్ బయోమాన్ కార్బన్లు ఉంటాయి. ఎరువుల ఖర్చు తక్కువ ఎకరా పొలంలో వరి పండించాలంటే తక్కువగా అనుకున్నా ఒక బస్తా డీఏపీ, రెండు బస్తాల యూరియా, బస్తా పోటాష్, బస్తా జింక్ తప్పనిసరి అవుతుంది. వీటితో పాటు పంటను ఆశించే తెగుళ్లను నివారించేందుకు పురుగు మందుల పిచికారీ తప్పటం లేదు. ఎరువులు, పురుగు మందుల కోసం సుమారు రూ. 6 వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. చెరువు మట్టి వేసుకోవటం వలన ఎరువుల ఖర్చు తగ్గుతుంది. రైతులకు పెట్టుబడి తగ్గటంతో పాటు భూమి సారవంతం అవుతుంది. ఎరువులు, పురుగుల మందుల్లేని పంటను సాధించవచ్చు. చెరువు మట్టి వేసే వాళ్లం గతంలో చెరువుల్లో లభ్యమయ్యే పూడిక మట్టిని పొలాలకు వేసేవాళ్లం. దీంతో భూసారం పెరిగి పంటదిగుబడి బాగా వచ్చేది. వేసవిలో చెరువు మట్టిని నాటుబళ్ల పెరిగి పొలంలో వేసేవాళ్లం. వర్షాల తరువాత పొలంలో వేసిన మట్టి నేలలో కలిసేలా దుక్కి దున్నేవాళ్లం. ఎరువులు వేయకుండానే పంట ఏపుగా పెరిగేది. ఇప్పుడు రైతులెవ్వరూ చెరువు మట్టి వేయటం లేదు. ఎరువుల వినియోగంతో పెట్టుబడి పెరిగిపోతుంది. భూసారం తగ్గిపోతుంది. లావేటి నర్సింహులు, రైతు, కృష్ణాపురం భూసారం పెరుగుతుంది చెరువు మట్టి వేసుకోవటం వలన భూమి సారవంతంగా మారుతుంది. చౌడు భూముల్లో కూడా పచ్చని పంటలు పండించవచ్చు. చెరువు మట్టిలో తేమ ఎక్కువగా ఉండటం వలన పంటకు నీటినిల్వలు బాగా ఉంటాయి. సేంద్రియ శాతం ఎక్కువగా ఉండటంతో ఎరువులా ఉపయోగపడుతుంది. ఒక సంవత్సరం చెరువు మట్టి వేయటం వలన మూడేళ్ల వరకు భూమి సారవంతంగా ఉంటుంది. పంటకు మేలు చేస్తుంది. పైడి లతశ్రీ, ఏఓ, ఎల్.ఎన్.పేట -
వర్క్ ఫ్రం హోమ్.. మరోపక్క ప్రకృతి వ్యవసాయం
రవి కుమార్, సునంద యువ దంపతులు. లాక్డౌన్ నేపథ్యంలో సొంతూరు వెళ్లిపోయారు. రసాయన రహితంగా పండించిన ఆహారంతోనే ఆరోగ్యం చేకూరుతుందన్న స్పృహతో రసాయనాల్లేని వ్యవసాయం ప్రారంభించారు. రవి ఆన్లైన్లో ఉద్యోగం చేస్తూనే 8 ఎకరాల నల్లరేగడి భూమిలో భార్య తోడ్పాటుతో ఆఫ్‌లైన్‌లో వర్షాధార సేద్యం చేస్తున్నారు. పూర్తిగా సీవీఆర్ పద్ధతిలో మట్టి సేద్యంతో తొలి ఏడాదే మంచి దిగుబడులు తీసి భళా అనిపించుకుంటున్నారు ఈ ఆదర్శ యువ రైతులు. మాదాని రవి, సునంద ఎమ్మెస్సీ చదువుకున్నారు. హైదరాబాద్‌లో ఉంటూ అతను ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుంటే, ఆమె ప్రైవేటు కాలేజీలో లెక్చరర్‌గా ఉద్యోగం చేస్తుండే వాళ్లు. వారికి ఇద్దరు పిల్లలు. రవి స్వగ్రామం కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని విజయనగరం. 40 ఎకరాల భూమి కలిగిన అతని తల్లిదండ్రులు వరి, పత్తి తదితర పంటలను రసాయనిక పద్ధతిలోనే సాగు చేస్తున్నారు. బాల్యం నుంచీ రవికి వ్యవసాయం అంటే మక్కువ ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా రవి, సునంద ప్రకృతి వ్యవసాయ విషయాలను ఆసక్తిగా గమనిస్తున్నారు. సుభాష్ పాలేకర్ ప్రసంగాలు విని, పుస్తకాలు, పత్రికలు చదివి, రైతుల విజయగాధల వీడియోలు చూసి స్ఫూర్తి పొందారు. వారాంతాల్లో వీలైనప్పుడల్లా స్వయంగా కొన్ని క్షేత్రాలకు వెళ్లి చూసి, వివరాలు తెలుసుకొని వచ్చేవారు. ఇంట్లో ఎవరో ఒకరికి నెలకోసారైనా ఆస్పత్రికి వెళ్లాల్సి వచ్చేది. మార్కెట్లో దొరికే వంటనూనెలు వాడటం ఆపేసి గానుగ నూనె వాడటం మొదలు పెట్టిన తర్వాత క్రమంగా ఆస్పత్తికి వెళ్లాల్సిన అవసరం తగ్గిపోయిందని.. ఆ తర్వాత బియ్యం, పప్పులు కూడా మార్చుకున్నామని సునంద చెప్పారు. ఆ విధంగా రసాయనాల్లేని ఆహారంతో ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చని గుర్తించిన తర్వాత.. నగర పరిసరాల్లో భూమిని కౌలుకు తీసుకునైనా వారాంతాల్లో మనమే ఎందుకు పంటలు పండించుకోకూడని ఆలోచించారు. ఆ ప్రయత్నాలు సాగుతుండగా కరోనా వచ్చిపడింది. నవారతో ప్రారంభం లాక్డౌన్ కారణంగా వర్క్‌ఫ్రం హోం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో గతేడాది ఫిబ్రవరిలో వీరి కుటుంబం సొంత గ్రామానికి మకాం మార్చింది. తొలుత గత ఏడాది ఫిబ్రవరిలో 3–4 సెంట్ల భూమిలో నవార విత్తారు. ‘మా అత్త మామల ద్వారా దుక్కి చేయటం, గొర్రుతో విత్తనం వేయటం వంటి ప్రతి పనినీ కొత్తగా నేర్చుకున్నాం. అయితే, రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపు మందులు వాడటం అక్కడి రైతులందరికీ బాగా అలవాటు. అవి లేకుండా పంటలు ఎలా పండిస్తారని ప్రశ్నించేవారు. అయినా వెనక్కి తగ్గ లేదు’ అన్నారు సునంద. మొదట వ్యవసాయం చాలా కష్టంగా అనిపించినా పట్టు వదలకుండా ముందుకు సాగారు. మొదట ఆకు కూరలు, కూరగాయలు సాగు చేశారు. వేసవిలో పెరట్లో గోంగూర మొక్కలకు పిండి నల్లి సోకినప్పుడు మట్టి ద్రావణం ఆశ్చర్యకరమైన ఫలితాలనిచ్చింది. దాంతో వ్యవసాయం అంతా పద్మశ్రీ అవార్డు గ్రహీత, సీనియర్ రైతు శాస్త్రవేత్త చింతల వెంకటరెడ్డి (సీవీఆర్) చెప్పిన విధంగా కేవలం మట్టి ద్రావణం పద్ధతిలోనే సాగు చేసి మంచి దిగుబడులు తీయొచ్చన్న నమ్మకం కుదిరింది. అదే పద్ధతి అనుసరిస్తున్నాం అని సునంద వివరించారు. పంట ఏదైనా కేవలం మట్టి ద్రావణమే ఈ ఏడాది వానాకాలంలో 8 ఎకరాల నల్లరేగడి నేలలో వర్షాధారంగా వరి, సోయాబీన్, కంది, సజ్జ, కొర్రలు, రాగి తదితర పంటలు ఎడ్ల గొర్రుతో విత్తారు. పంటలు ఏవైనా మట్టి ద్రావణమే ప్రతి 10 రోజులకోసారి పిచికారీ చేస్తుండటం విశేషం. 200 లీటర్ల నీటిలో 30 లోపలి మట్టి (భూమిలో 2 అడుగుల లోతు నుంచి తీసి ఎండబెట్టిన పొడి మట్టి), అర లీటరు అముదంను కలిపి ఈ ద్రావణాన్ని అన్ని పంటలకు 10 రోజులకోసారి మొక్కలు పూర్తిగా తడిచేలా పిచికారీ చేయాలి. పంట పూత/పిందె దశలో 3 పిచికారీలకు మాత్రం ఈ ద్రావణానికి రాక్ డస్ట్ 5 కిలోలు కలిపి పిచికారీలు చేయాలి. దీనితో పాటు.. 30 కిలోల లోపలి మట్టికి అర లీటరు ఆముదం కలిపి.. ఆ మట్టి మిశ్రమాన్ని పంట మొక్కల కింద 20 రోజులకు ఒకసారి ఎరువుగా వేయాలి. ఈ మట్టి మిశ్రమం వేసిన తర్వాత వారం వరకు జీవామృతం వంటి ద్రావణాలు వేయకూడదు. ఇంతే. పంటలన్నిటికీ ఇవే ఇస్తున్నామని సునంద, రవి వివరించారు. సోయా.. ఎకరానికి 11 క్విం. సునంద, రవి వానాకాలంలో 3 ఎకరాల నల్లరేగడి నేలలో వర్షాధారంగా సోయా విత్తారు. సాళ్ల మధ్య 1.5 అడుగులు పెట్టారు. కలుపు మందు చల్లకుండా నాగళ్లతో 2 సాళ్లు పైపాటు చేయించారు, ఓసారి కూలీలతో కలుపు తీయించారు. సీవీఆర్ మట్టి ద్రావణం మాత్రం పిచికారీ చేశారు. పూత, పిందె దశలో మినుము, పెసర, నవార వడ్లు, బొబ్బర్లను ఒక్కో రకం ఒక్కోసారి మొలకల ద్రావణాన్ని కూడా కలిపి పిచికారీ చేశామని సునంద వివరించారు. ఇంకేమీ వెయ్యలేదు. అయినా, సగటున ఎకరానికి 11 క్వింటాళ్ల దిగుబడి సాధించటం విశేషం. వత్తుగా విత్తుకొని రసాయనిక సేద్యం చేసిన వారికన్నా ఎక్కువ దిగుబడి సాధించడం సాగులో పూర్వానుభవం లేని తమకు ఎంతో సంతోషాన్ని, ధైర్యాన్ని ఇచ్చిందని సునంద, రవి ఆనందిస్తున్నారు. 2 ఎకరాల్లో కంది విత్తారు. అంతర పంటలు వేశారు. 5 క్వింటాళ్ల కొర్రలు, 2 క్లింటాళ్ల సజ్జలు (సగానికిపైగా చిలకలు తినగా మిగిలినవి), 5 క్వింటాళ్ల కొర్రల దిగుబడి వచ్చింది. ఇవి కోసిన తర్వాత కుసుమ విత్తారు. 3 ఎకరాల్లో అధిక పోషకాలతో కూడిన ఇంద్రాణి, కుజూపటాలియా, కాలాబట్టి, నవార, మాపిళ్ళె సాంబ వంటి దేశీ వరి రకాలను సాగు చేసి 30 క్వింటాళ్ల దిగుబడి పొందటం విశేషం. ధైర్యంగా మట్టి ద్రావణంతో సేద్యం చేపట్టి నలుగురూ ఇదేమి సేద్యం అని తప్పుపడుతున్నా ముందుకు సాగి.. చివరకు గ్రామస్తులతో ఔరా అనిపించుకున్నారు రవి, సునంద వ్యవసాయంలోకి రాదలచిన యువతకు మార్గదర్శకులు. – కమ్రె నరేష్, సాక్షి, కౌటాల, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఎన్ని ఇబ్బందులున్నా ఆనందంగా ఉంది నేను ఇంటి వద్ద నుంచి ఉద్యోగం చేస్తున్నాను. నా భార్య సునంద ఉద్యోగానికి స్వస్తి చెప్పి ఇంటి పనులతో పాటు వ్యవసాయం చూసుకుంటున్నది. నేను విధుల్లో ఉన్న సమయంలో నా భార్య సునంద పొలం పనులు చూసుకుంటుంది. ఇద్దరం కలిసి ఇష్టపూర్వకంగా సహజ వ్యవసాయం చేస్తున్నాం. ఎన్ని ఇబ్బందులున్నా ఫలితాలను చూసి మాకెంతో ఆనందంగా ఉంది. సహజ పద్ధతిలో పండించిన పంటతో మంచి ఆరోగ్యం చేకూరుతుంది. యువ రైతులందరూ సహజ పద్ధతిలో పంటల సాగు చేపట్టాలి. అప్పుడే భూమి సారవంతం కావడంతో పాటు మనుషులు ఆరోగ్యంగా ఉంటారు. – మాదాని రవి, యువ రైతు, విజయనగరం, కౌటాల మండలం, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సీవీఆర్ మట్టి సేద్య పద్ధతి చాలు! వ్యవసాయం చేయడానికి శ్రద్ధతో పాటు చాలా ఒపిక ఉండాలి. అటు ఉద్యోగం.. ఇటు పిల్లల్ని చూసుకుంటూ సహజ పద్ధతిలో పంటలు సాగు చేస్తున్నాం. ఏసీలో ఉండే మీరు ఎందుకు వ్యసాయం చేస్తున్నారు? మందులు (రసాయనిక ఎరువులు, పురుగుమందులు) వాడకుండా పంటలు ఎలా పండుతాయని చాలా మంది ఎద్దేవా చేశారు. కానీ, ఎన్నో కష్టాలు పడి పంటలు సాగు చేస్తున్నాం. పంట దిగుబడిని చూసినప్పుడు ఆనందంగా ఉంటుంది. సీవీఆర్ మట్టి సేద్య పద్ధతి ఒక్కటి అనుసరిస్తే చాలని మా అనుభవంలో శాస్త్రీయంగా నేర్చుకున్నాం. సంతృప్తిగా ఉంది. NSU Nandanam natural farms యూట్యూబ్ ఛానల్ ద్వారా సలహాలు, సూచనలు అందిస్తున్నాం. – సునంద (77995 44705), యువ రైతు, విజయనగరం, కౌటాల మండలం, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా -
యాంటీబయాటిక్స్‌తో భూసారానికీ ముప్పు.. అదెలా అంటే!
పశువైద్యంలో యాంటీబయాటిక్స్ అతిగా వాడటం వల్ల దీర్ఘకాలంలో మట్టి ఆరోగ్యం దెబ్బతినటమే కాకుండా భూతాపాన్ని పెంపొందించే కర్బన ఉద్గారాల బెడద సైతం పెరుగుతుందని కొలరాడో స్టేట్ యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడైంది. పశు వ్యాధుల చికిత్సలో యాంటీబయాటిక్స్ వల్ల వాటి విసర్జితాలు నేలపై పడినప్పుడు మట్టిలో శిలీంధ్రాలు, సూక్ష్మజీవుల నిష్పత్తిలో మార్పులు చోటు చేసుకుంటాయని అధ్యయనానికి సారధ్యం వహించిన డా. కార్ల్ వెప్కింగ్ అంటున్నారు. యాంటీబయాటిక్స్ దుష్ప్రభావానికి గురికాని వాతావరణం భూతలం మీద లేదన్నారు. యాంటీబయాటిక్స్ వల్ల కర్బనాన్ని పట్టి ఉంచే శక్తిని మట్టి కోల్పోతుందన్నారు. యాంటీబయాటిక్స్‌ను పశుపోషణలో అతిగా వాడటం వల్ల.. మనుషుల్లో కొన్ని రకాల సూక్ష్మక్రిములు యాంటీబయాటిక్స్‌కు లొంగని పరిస్థితి నెలకొంటున్న విషయం తెలిసిందే. చదవండి: Red Rice: ఎర్ర బియ్యం అమ్మాయి -
కేజీ మట్టి.. ఆరున్నర లక్షల కోట్లు!!
అవును.. కేజీ మట్టి కోసం అన్ని లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నమాట నిజమే. కాకపోతే అది భూమ్మీద మట్టి కోసం కాదు. అంతరిక్షంలో అదీ అంగారక గ్రహం మీద మట్టి కోసం. ఈ విషయాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా అధికారికంగా ప్రకటించింది. మార్స్ మీద దిగిన నాసా పర్సీవరెన్స్ రోవర్ ఇదివరకే పరిశోధనలు మొదలుపెట్టిన విషయం తెలిసిందే. అయితే అత్యంత విలువైందిగా భావిస్తున్న అక్కడి మట్టిని భూమ్మీదకు రప్పించే ప్రయత్నాలు చేస్తోంది నాసా. ఈ ప్రాజెక్టు కోసం నాసా 9 బిలియన్ల డాలర్లు ఖర్చు చేయబోతోంది. ఒకవేళ అంగారక గ్రహం మీద మట్టి భూమ్మీదకు చేరితే గనుక.. ఇప్పటిదాకా భూమ్మీది అపురూపమైన వస్తువులలో అదే అగ్రస్థానంలో ఉంటుంది. దాదాపు రెండు పౌండ్ల మట్టి(దాదాపు కేజీ)ని మట్టిని మార్స్ నుంచి తెప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొత్తం మూడు దశలో ఈ ప్రాజెక్టు ఉండబోతుంది. అయితే ఈ శాంపిల్ సేకరణ ప్రక్రియ మొత్తం పూర్తి కావడానికి రెండేళ్లు పట్టే అవకాశం ఉందని నాసా చెబుతోంది. ఇక ఆ మట్టిని భూమ్మీదకు తేవడానికి మరో పదేళ్లకాలం పైనే పట్టొచ్చని అంచనా. కాగా, మార్స్ మట్టి కోసం ఇంత ఖర్చు చేయబోతున్న నాసా తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి కూడా. చదవండి: మార్స్‌పై ఆక్సిజన్ -
ఆ మట్టి ఖరీదు రూ.11 లక్షలు
వాషింగ్టన్: అంతరిక్షానికి సంబంధించిన విషయాలు ఆసక్తిని కలిగించడమే కాక ఖరీదైనవి కూడా. ఎంత విలువైనవి అంటే అక్కడి మట్టే లక్షల విలువ చేస్తుంది. అవును చంద్రుడి మీద మట్టి కోసం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా 15 వేల డాలర్లు(11,05,803 రూపాయలు) చెల్లించేందుకు సిద్ధ పడింది. చంద్రుడి మీద నుంచి తీసుకువచ్చే మట్టిని కొనుగోలు చేసేందుకు నాసా నాలుగు ప్రైవేట్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. రానున్న సంవత్సరాల్లో సదరు కంపెనీలు చంద్రుడి మీద నుంచి మట్టిని సేకరించి నాసాకు అప్పగిస్తాయి. "మేము నాలుగు కంపెనీల నుంచి మొత్తం, 25,001 డాలర్లకు చంద్రుడి మీద నుంచి తీసుకువచ్చే వాటిని కొనుగోలు చేయబోతున్నాం" అని నాసా కమర్షియల్ స్పేస్ ఫ్లైట్ డివిజన్ డైరెక్టర్ ఫిల్ మక్అలిస్టర్న్ వార్తా సంస్థ ఏఎఫ్‌పీతో తెలిపారు. (చదవండి: బోస్-ఐన్స్టీన్లు ఊహించినట్టుగానే అంతరిక్షంలో..) ఇక ఈ ఒప్పందలో లునార్ అవుట్‌పోస్ట్ ఆఫ్ గోలెడ్న్, కొలరాడోతో ఒక్క డాలర్‌కు ఒప్పందం కుదుర్చుకోగా.. టోక్యోకు చెందిన ఇస్పేస్ జపాన్‌తో 5,000 డాలర్లకు.. లక్సెంబర్గ్ ఐస్పేస్ యూరప్‌తో మరో 5,000 డాలర్లకు.. చివరగా కాలిఫోర్నియాలోని మోజావే మాస్టెన్ స్పేస్ సిస్టమ్స్‌తో 15,000 డాలర్లకు నాసా ఒప్పందం కుదుర్చుకుంది. ఇక 2022-23 సంవత్సారల్లో ఈ కంపెనీలు చంద్రుడి మీద నుంచి మట్టిని తెచ్చి నాసాకు అప్పగిస్తాయి. ఈ కంపెనీలు చంద్రుడి మీద నుంచి తీసుకువచ్చే ఈ మట్టిని ‘రెగోలిత్’ అంటారు. మట్టితో పాటు దాని సేకరణ, సేకరించిన పదార్థాలకు సంబంధించిన చిత్రాలను కూడా అందిస్తాయి. ఇక ఈ మట్టిని నాసా ఆర్టెమిస్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఏకైక భాగస్వామిగా వినియోగించనుంది. అయితే ఈ మట్టిని భూమికి తీసుకువస్తారా లేదా అనే దాని గురించి ఎలాంటి స్పష్టత లేదు. ఆర్టెమిస్ ప్రోగ్రామ్‌లో భాగంగా నాసా 2024 నాటికి స్త్రీ, పురుషిలిద్దరిని చంద్రుడి మీదకు పంపేందుకు సన్నాహాలు చేస్తోంది. దీని ఫలితాల ఆధారంగా అంగారక గ్రహంపై కాలు మోపాలని భావిస్తోంది. -
చంద్రుడి మట్టిని పట్టిన చాంగె–5
బీజింగ్: చైనాకు చెందిన అంతరిక్ష నౌక చాంగె–5 చంద్రుడి మీద మట్టిని సేకరించిందని చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు బుధవారం వెల్లడించారు. చంద్రుడి మీద మట్టిని సేకరించడం గత 40 ఏళ్లలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. చంద్రుడి మీద ఉన్న ఓసియానుస్ ప్రొసెల్లారమ్ అనే ప్రాంతంనుంచి చాంగె–5 మట్టిని సేకరించింది. ఈ సేకరణలో భాగంగా ల్యాండర్ రెండు మీటర్ల లోతులోని మట్టిని సేకరించిందని చెప్పారు. మరికొన్ని శాంపిళ్లను కూడా సేకరించే ప్రక్రియ సాగుతోందని చెప్పారు. దాదాపు రెండు కేజీల మట్టిని సేకరించిందని తెలిపారు. చంద్ర ఉపరితలం నుంచి, అలాగే లోతుల్లోంచి కూడా మట్టిని సేకరించామని తెలిపారు. మొదటిసారే విజయం సాధించడం గమనార్హం. దీనిపై అమెరికా స్పేస్ ఏజెన్సీ చైనా స్పేస్ ఏజెన్సీకి అభినందనలు తెలిపింది. అంతర్జాతీయ పరిశోధనా కమ్యూనిటీ ద్వారా కొన్ని శాంపిళ్లపై పరిశోధన చేసే అవకాశం తమకూ రావచ్చని అమెరికా అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ సైన్స్ కమ్యూనిటీకి లబ్ధి చేకూరే అవకాశం ఉందని చెప్పింది. చంద్రుడి నుంచి శాంపిళ్లను సేకరించిన మూడో దేశంగా అమెరికా, రష్యాల సరసన చైనా నిలిచింది. మట్టిని సురక్షితంగా తీసుకొచ్చేందుకు పటిష్టమైన కంటెయినర్‌ను వాడాల్సి ఉంటుందని చైనా శాస్త్రవేత్తలు చెప్పారు. -
అనుమతులు గోరంత.. దోచేది కొండంత !
పిడుగురాళ్ల రూరల్: ప్రభుత్వం పేదల కోసం నిర్మించే ఇళ్ల స్థలాల చదును కోసం మట్టి తవ్వకాలకు అనుమతులు తీసుకొని ప్రైవేటు పనులకు అక్రమ మట్టి తవ్వకాలు జరుపుతూ అక్రమార్కులు కోట్ల రూపాయలను సొమ్ము చేసుకుంటున్నారు. పదుల సంఖ్యలో టిప్పర్లను పెట్టి భారీ యంత్రాలతో తవ్వకాలు జరుపుతూ అక్రమార్జనకు తెరలేçపుతున్నారు. అధికారులు సైతం జరుగుతున్న అక్రమంలో తమకు ఎటువంటి సంబంధం లేదంటూ మేము ఉన్న సమయంలో ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని, ఆ తవ్వకాలకు మాకు ఎటువంటి సంబంధం లేదని చర్యలు తీసుకోవటంలో జాప్యం వహిస్తూ నిర్లక్ష్య సమాధానాలు చెబుతున్నారు. అనుమతి తీసుకున్న సదరు కాంట్రాక్టర్ పిడుగురాళ్ల మండల పరిధిలోని కామేపల్లి గ్రామ బైపాస్ వద్ద ఉన్న టీడీపీ నేతకు చెందిన స్థలంలోకి, స్థానిక సిమెంట్ ఫ్యాక్టరీకి పెద్ద మొత్తంలో మట్టి తరలిస్తూ ప్రభుత్వం ఆదాయానికి చిల్లు పెడుతున్నారు. ఇష్టారాజ్యంగా తవ్వకాలు పిడుగురాళ్ల, మాచవరం మండలం సరిహద్దుల్లో ఉన్న గాంధీనగర్ గ్రామం పొల్లాల్లో సర్వే నంబర్ 976/2 పట్టా భూమి నందు పిన్నెల్లి గ్రామంలోని ఇళ్ల స్థలాలు చదును చేయటానికి అనుమతులు తీసుకున్నారు. గ్రావెల్ రోడ్డుకు మట్టి తవ్వకాలు నిర్వహించుకోనేందుకు కాంట్రాక్టర్ 1,660 క్యూబిక్ మీటర్లకు ఆగస్టు నెల 19న అనుమతులు పొందాడు. భారీ ప్రొక్లెయిన్లు, పదుల సంఖ్యలో లారీలతో అర్ధరాత్రి సమయంలో అదే అనుమతిని అడ్డం పెట్టుకొని పిడుగురాళ్ల మండలం కామేపల్లి బైపాస్ పక్కనే ఉన్న ఓ టీడీపీ నేత పెట్రోల్ బంకు నిర్మాణానికి, తుమ్మలచెరువు గ్రామ శివారులో ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీకి వేల టన్నుల్లో మట్టిని సరఫరా చేస్తున్నారు. 1,660 క్యూబిక్ మీటర్లకు 93 టిప్పర్లు మాత్రమే మట్టిని సరఫరా చేసుకోవాలి. అంటే 18 క్యూబిక్ మీటరుŠల్ ఒక టిప్పర్‌కు సమానం. రోజుకు సుమారు 120 టిప్పర్లతో మట్టిని తవ్వకాలు చేపడుతున్నారు. ఒక్కో టిప్పర్‌కు వచ్చి రూ.6 వేలు వసూలు చేస్తున్నారు. ఇలా ఒక్క రోజుకే సుమారు రూ.9 లక్షలకుపైగా ఆదాయం గడిస్తున్నారు. ఇంత జరుగుతున్నా కూడా అధికారులు ఇటువైపు కన్నెతి కూడా చూడటం లేదు. అనుమతులు పొందిన సర్వే నంబర్ ఒకటి, తవ్వకాలు జరిపేది ఒక చోట అని వదంతులు వినిపిస్తున్నాయి. స్థానిక వీఆర్వో అడిగినా తనకు ఎలాంటి సమాచారం తెలియదని, ఉన్నతాధికారులను సంప్రదించాలని మాట దాటవేశారు. దీనిపై మాచవరం మండలం తహసీల్దార్ సి.చెంచులక్ష్మిని సాక్షి ఫోన్లో వివరణ కోరగా తనకు తెలియదని తాను కొత్తగా వచ్చానని, గత తహసీల్దార్ అనుమతులు ఇచ్చారని, దీనిపై తనకు తెలియదని సమాధానం చెప్పి ఫోన్ కట్ చేశారు. చర్యలు తీసుకుంటాం వెంకటేశ్వరరావు అనే వ్యక్తి పిన్నెల్లి గ్రామ శివార్లలో 1,660 క్యూబిక్ మీటర్లకు గ్రావెల్ రోడ్డు నిర్మాణం కోసం అనుమతి తీసుకున్నారు. అయితే స్థానికంగా ఉన్న తహసీల్దార్ ఎంత వరకు తవ్వకాలు జరిపారో, ఎక్కడికి తరలిస్తున్నారో అని సమాచారం తెలుసుకోవాలి. నిబంధనలు అతిక్రమిస్తే రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలి. అధికంగా తవ్వకాలు జరిపితే మేం చర్యలు తీసుకుంటాం. – వెంకట్రావు, మైనింగ్ ఏడీ, నడికుడి -
ఘన జీవామృతం చేద్దామిలా!
ప్రకృతి వ్యవసాయానికి ఘన జీవామృతం, ద్రవ జీవామృతం పట్టుగొమ్మలు. ఆవు పేడ, మూత్రం, పప్పుల పిండి, బెల్లంలతో ద్రవ జీవా మృతాన్ని ప్రతి 15 రోజులకోసారి తయారు చేసుకొని వాడే రైతులు ఘన జీవా మృతాన్ని అనుకూలమైన ఎండాకాలంలో తయారు చేసుకుంటారు. భూసారం పెంపుదలలో పశువుల ఎరువు, వర్మీ కంపోస్టులకు ఇది చక్కని ప్రత్యామ్నాయం. ఎకరానికి ఏటా 400 కిలోలు వేస్తే చాలు. ఘన జీవామృతాన్ని దుక్కిలో వేసుకోవడంతోపాటు.. నిల్వ చేసుకొని కొద్ది నెలల తర్వాత కూడా అవసరాన్ని బట్టి పంటలకు వేస్తూ ఉంటారు. ఖరీఫ్ వ్యవసాయ సీజన్‌కు సమాయత్తమవుతున్న ప్రకృతి వ్యవసాయదారులు ప్రస్తుతం ఘన జీవామృతాన్ని తయారు చేసుకోవడంలో నిమగ్నమవుతున్నారు. ఘన జీవామృతాన్ని రెండు విధాలుగా తయారు చేసుకోవచ్చు. ఏపీ కమ్యూనిటీ మానేజ్డ్ ప్రకృతి వ్యవసాయ విభాగం విజయనగరం జిల్లా అధికారి ప్రకాశ్ (88866 13741) అందించిన వివరాలు.. ఘన జీవామృతం –1 తయారీకి కావాల్సిన పదార్థాలు : దేశీ ఆవు పేడ (వారం రోజుల్లో సేకరించినది) 100 కిలోలు, దేశీ ఆవు మూత్రం 5 లీటర్లు, ద్విదళ పప్పుల (శనగ, ఉలవ, పెసర, మినుముల పిండి.. ఈ పిండ్లన్నీ కలిపైనా లేదా ఏదో ఒక రమైనా సరే పర్వాలేదు. అయితే, నూనె శాతం ఎక్కువగా ఉండే వేరుశనగ, సోయాచిక్కుళ్ల పిండి వాడరాదు) పిండి 2 కేజీలు, బెల్లం 2 కేజీలు (నల్లబెల్లం అయితే మరీ మంచిది) లేదా చెరకు రసం 3 లీటర్లు లేదా తాటి పండ్ల గుజ్జు తగినంత, పిడికెడు పుట్టమట్టి లేదా రసాయనాలు తగలని పొలం గట్టు మన్ను. తయారు చేసే విధానం : చెట్టు నీడలో లేదా షెడ్డులో ఈ పదార్థాలన్నిటినీ వేసి చేతితో బాగా కలిపి, 10 రోజులు ఆరబెడితే ఘనజీవామృతం సిద్ధమవుతుంది. తయారు చేసిన వారం రోజుల్లో పొలంలో వెదజల్లి, దుక్కి దున్నవచ్చు. నిల్వ చేసుకొని తదనంతరం వాడుకోవాలనుకుంటే.. దినుసులన్నీ కలిపిన వెంటనే గుండ్రటి ఉండలుగా చేసి నీడలో ఆరబెట్టుకోవాలి. ఆ ఉండలను గోనె సంచులలో నిల్వ ఉంచుకోవాలి. సీజన్లో అవసరమైనప్పుడు ఉండలను పొడిగా చేసుకొని పొలంలో వెదజల్లుకోవాలి. ఘన జీవామృతం – 2 తయారీకి కావాల్సిన పదార్థాలు : 200 బాగా చివికిన పశువుల పేడ ఎరువు, 20 లీటర్ల ద్రవ జీవామృతం. తయారు చేసే విధానం : 200 కేజీలు బాగా చివికిన పశువుల పేడ ఎరువును చెట్టు నీడలో లేదా షెడ్డులో పలుచగా పరవాలి. దానిపై 20 లీటర్ల ద్రవ జీవామృతాన్ని చల్లి, బాగా కలియబెట్టి కుప్పగా చేసి, గోనె పట్టా కప్పాలి. 48 గంటలు గడచిన తర్వాత దీన్ని పలుచగా చేసి ఆరబెట్టుకోవాలి. పూర్తిగా ఆరిపోయిన తరువాత గోనె సంచులలో నిల్వ చేసుకోవాలి. పంటలకు అవసరమైనప్పుడు వాడుకోవచ్చు. ఇలా తయారు చేసిన ఘన జీవామృతం 6 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఎకరానికి ఎంత? ఘన జీవామృతాన్ని ఈ రెంటిలో ఏ పద్ధతిలో తయారు చేసినప్పటికీ.. ఎకరానికి దుక్కిలో కనీసం 400 కిలోల ఘన జీవామృతం వేసుకోవాలి. దానితోపాటు.. పైపాటుగా ఎకరానికి కనీసం మరో 200 కిలోలు వేసుకోగలిగితే మంచిది. పంటలకు పోషకాల లోపం లేకుండా మంచి దిగుబడులు పొందవచ్చు. -
నేలతల్లికి ఎంత కష్టం.. ఎంత కష్టం..
విత్తనం మొలకెత్తి ధాన్యరాశులైతేనే మన కడుపు నిండేది. మనం తింటున్న ఆహారం 95% మేరకు నేలతల్లే మనకు అందిస్తున్నది. అయితే, ఈ క్రమంలో మనం అనుసరిస్తున్న విధ్వంసకర పద్ధతుల వల్ల భూమి నిస్సారమైపోతోంది. భూమి నాశనమైపోతోందని అందరికీ తెలిసిందే. అయితే, ప్రపంచవ్యాప్తంగా ఎంత భూమి పాడై ఉంటుంది? ఈ విషయం తెలుసుకునేందుకు 2018లో ఐక్యరాజ్య సమితి ఒక సర్వే జరిపింది. భూముల విస్తీర్ణంలో 75% ఇప్పటికే తీవ్రస్థాయిలో నిస్సారమై పోయిందని దిగ్భ్రాంతికరమైన వాస్తవాన్ని వెల్లడించింది. రైతులే కాదు మానవాళి యావత్తూ మేలుకొని జాగ్రత్తపడకపోతే 2050 నాటికి 90% భూమి నాశనమైపోవచ్చని కూడా ఐరాస హెచ్చరించింది. భూమికి జరిగే ఈ నష్టం విలువ ఎంత ఉండొచ్చు? ఎడారీకరణపై ఐక్యరాజ్యసమితి ఒడంబడిక నివేదిక ప్రకారం ఈ నష్టం 23 ట్రిలియన్ డాలర్ల మేరకు ఉండొచ్చని అంచనా. భూతాపం పెరిగి సాగు యోగ్యం కాకుండా ఎడారిగా మారిపోవడానికి మూడింట ఒక వంతు కారణం.. అడవిని నరికేయడం, ప్రకృతికి నష్టదాయక వ్యవసాయ పద్ధతుల వల్ల భూమిలో కర్బనం తగ్గిపోవడం, నీటి లభ్యత తగ్గిపోవడం. భూమిలో జీవం తగ్గిపోవడం వల్ల జీవవైవిధ్యం అంటే.. భిన్న జాతుల చెట్టు చేమ, జీవరాశి అంతరించిపోతోంది. వరల్డ్ వైడ్ ఫండ్ సంస్థ తొలిసారి 2018లోనే ‘గ్లోబల్ సాయిల్ బయోడైవర్సిటీ అట్లాస్’ను రూపొందించింది. చాలా దేశాల్లోని భూముల్లోని సూక్ష్మజీవరాశి, వానపాములు వంటి జీవులకు తీవ్ర ముప్పు పొంచి ఉంది. నిజానికి ఈ ముప్పు మానవాళికి ఎదురవుతున్న ముప్పే. జాగ్రత్తపడకపోతే 2050 నాటికి 500 కోట్ల మంది మనుగడకే ముప్పు పొంచి ఉంటుంది. అటువంటి దేశాల జాబితాలో మన దేశంతోపాటు పాకిస్తాన్, చైనా కూడా ఉన్నాయి. ఆఫ్రికా, ఐరోపా, ఉత్తర అమెరికా దేశాల్లో నేలల్లో సూక్ష్మజీవరాశి ఘోరంగా దెబ్బతిన్నది. భూమి లోపల జీవైవిధ్యం దెబ్బతినటంతోపాటు పరపరాగ సంపర్కానికి దోహదపడే తేనెటీగలు, సీతాకోకచిలుకలు అంతరించిపోతున్నాయి. వ్యక్తులు, సంస్థలు, అన్ని దేశాలూ కలసికట్టుగా కదలాలి. నిర్ణీత కాలంలో జీవవైవిధ్యాన్ని పెపొందించుకునేలా చర్యలు తీసుకొని అమలు చేయడం మేలని ఐక్యరాజ్యసమితి హెచ్చరిస్తోంది. గమనించాల్సిన విషయం ఏమిటంటే ఏటేటా ముప్పు పెరుగుతోంది. -
యథేచ్ఛగా మట్టి అక్రమ రవాణా
ధన్వాడ (నారాయణపేట) : గ్రామాల్లో పైరవీకారులు, కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యమైంది. అధికారుల అనుమతి లేకుండా సహజవనరులను ధ్వంసం చేస్తున్నారు. మండలంలోని మంత్రోనిపల్లి గ్రామ శివారులో ఉన్న గుట్టను తవ్వి అక్కడి మట్టిని తరలిస్తున్నా అడ్డుకునే నాథుడే లేకుండా పోయారు. ముందు గుట్టపై ఉన్న చెట్లను పూర్తిగా తొలగించారు. అంతటితో ఆగకుండా గుట్ట అంచునుంచి కొద్దికొద్దిగా మట్టిని తొలచి రవాణా చేస్తున్నారు. ఈ విషయాన్ని పలుమార్లు గ్రామస్తులు అధికారులకు తెలిపినా పట్టించుకోలేదు. గున్ముక్ల నుంచి మంత్రోనిపల్లి గ్రామం వరకు మొటల్‌రోడ్డు మంజూరైంది. అది పూర్తి కాకముందే బీటీకి అనుమతులు రావడంతో పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ పక్కనే ఉన్న గుట్ట నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా మట్టిని తరలిస్తున్నారు. ఆ ప్రాంతమంతా సమాంతరం కావడంతో కొందరు చదునుచేసి పంటలు కూడా పండిచుకుంటున్నారు. ఇదిలాఉండగా మంగళవారం బీటీ రోడ్డు పనులు ప్రారంభించడానికి వచ్చిన ఆర్అండ్బీ అ«ధికారులు ఈ వ్యవహారాన్ని చూసికూడా చూడనట్లు నటించారు. కొందరు గ్రామస్తులు ఈ విషయంపై స్థానిక తహసీల్దార్ రాఘవేంద్రనా«థ్‌కు ఫిర్యాదు చేయగా ఆయన స్పందించి ఆర్ఐ శ్రీనివాసులును పంపించి పనులను నిలిపివేయించారు. ఆయన వెళ్లిపోగానే మళ్లీ పనులు మొదలెట్టారు. -
దులుపుకుంటే పోతుంది
ఎన్ని విధాలుగా కూడా గాడిద బయటికి వచ్చే మార్గం కనబడలేదు. ఇక దాన్ని తీయలేక, అలాగని వదిలేయలేక– అలాగే ప్రాణాలతో పూడ్చిపెట్టడానికి సిద్ధమయ్యాడు. ఒక ఊళ్లో ఒకాయనకు గాడిదే సర్వస్వం. దాని మీద మోసుకొచ్చే సరుకులతోనే అతడి జీవితం గడిచిపోయేది. అట్లానే ఒక పనిమీద ఆయన గాడిదను తోలుకొని పొరుగూరు వెళ్లాడు. దానికోసం ఒక చిట్టడవిని దాటాలి. అలా వెళ్తుండగా, ఒక చోట ప్రమాదవశాత్తూ ఒక పెద్ద గుంతలో పడిపోయిందా గాడిద. దాన్ని బయటికి తీయడానికి రకరకాలుగా ప్రయత్నించాడు యజమాని. చెట్టు కొమ్మలను విరిచేశాడు, దాని ఆసరాగా ఎక్కొస్తుందని. తాడు పేని లాగడానికి యత్నించాడు. ఎన్ని విధాలుగా కూడా గాడిద బయటికి వచ్చే మార్గం కనబడలేదు. ఇక దాన్ని తీయలేక, అలాగని వదిలేయలేక– అలాగే ప్రాణాలతో పూడ్చిపెట్టడానికి సిద్ధమయ్యాడు. మట్టిని గుంతలో నింపడం మొదలుపెట్టాడు. మీద పడిన మట్టిని దులుపుకుంటూ గాడిద కొంచెం పైకి వచ్చింది. ఆయన మరింత మట్టిని పోస్తూనేవున్నాడు. గాడిద దాన్ని దులిపేసుకుంటూ మరికొంత పైకి వస్తూనేవుంది. ఎంత మట్టి పోస్తుంటే అంత పైకి రాసాగింది. సాయంత్రంకల్లా పూర్తిగా బయటకు వచ్చేసి ఆబగా గడ్డిని మేయసాగింది. దాన్నే చూసుకుంటూ కూర్చున్న యజమాని మనసులో అనుకున్నాడు: ‘నేను ఎంత పొరపాటుగా ఆలోచించాను! కష్టమొచ్చిందని దాన్ని నేను పాతేయబోయాను. కానీ అదే కష్టాన్ని దులిపేసుకుంటూ అది పైకి వచ్చేసింది. ఈ పాఠాన్ని నేను ఎప్పటికీ మరిచిపోను’. నెమ్మదిగా వెళ్లి, గాడిదను ప్రేమగా నిమరసాగాడు. -
క్షుద్ర పూజలకు మట్టి తీశాడని..
సాక్షి, ఒడిశా : క్షుద్ర పూజ జరిపేందుకు తన ఇంటి ముంగిట మట్టిని తీసుకువెళ్తున్న ఒడిశాకు చెందిన గిరిజన యువకుడ్ని పట్టుకుని పట్టణ పోలీసులకు అప్పగించిన ఘటన సాలూరు పట్టణంలోని బంగారమ్మ కాలనీలో గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కాలనీలో నివాసముంటున్న చుక్క వెంకటరమణ ఇంటి ముంగిట మట్టిని ఒడిశా రాష్ట్రం రాళ్లగడ్డ సమీపంలోని పుక్కిలి గ్రామానికి చెందిన గిరిజన యువకుడు జయరాం తీసుకుని వెళుతుండగా అక్కడ వున్న మహిళలు అతడ్ని ప్రశ్నించారు. దీంతో ఆ యువకుడు తనను ఈ ఇంటి ముంగిట వున్న మట్టిని తీసుకురమ్మని రామా కాలనీకి చెందిన పల్లి వెంకటరావు పురమాయించాడని చెప్పినట్టు స్థానికులు తెలిపారు. ఆ మట్టి ఎందుకని ప్రశ్నిస్తే పూజలు చేయడానికని ఆ యువకుడు బదులివ్వడంతో దేహశుద్ది చేసి, పట్టణ పోలీసులకు అప్పగించారు. ఇదిలా వుండగా చుక్క వెంకటరమణ కుటుంబానికి, పల్లి వెంటకరావు కుటుంబానికి వైరం నడుస్తుందని, అందుకే క్షుద్ర పూజలు జరిపించి, తమ కుటుంబాన్ని నాశనం చేసేందుకు వెంకటరావు కుట్ర పన్నాడని వెంకటరమణ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. -
ఆయిల్ మాత్రమే కాదు ..కొత్త సాయిల్ కూడా డేటానే
సాక్షి, న్యూఢిల్లీ: దేశీయ టెలికాం పరిశ్రమ నష్టాలకు జియోను నిందించొద్దని ప్రముఖ వ్యాపారవేత్త ,రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ పేర్కొన్నారు. భారతీ ఎయిర్టెల్ అధినేత సునీల్ మిట్టల్ తనకు ప్రత్యర్థి కాదని, స్నేహితుడని ప్రకటించారు. వ్యాపారంలో సాహసాల ఫలితంగానే లాభనష్టాలు వస్తాయని.. ఏది ఏమైనా కస్టమర్లు ప్రధానమని చెప్పుకొచ్చారు. దేశం పురోగతి చెందుతుందా, వినియోగదారుడికి ప్రయోజనం కలుగుతుందా అనేదే కీలకమన్నారు. హెచ్‌టీ లీడర్షిప్ సమ్మిట్ 2017 లో ముకేష్ అంబానీ మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో 'డిజిటల్ హరిత విప్లవం' రావాలన్నారు. ఈ నేపథ్యంలో 58,000 కళాశాలలు, 700 విశ్వవిద్యాలయాలు , 19 లక్షల పాఠశాలలు డిజిటల్‌గా అనుసంధానంకానున్నాయన్నారు. దేశంలో జియో ఎంట్రీతో డేటా సేవల స్వరూపమే మారిపోయిందన్నారు. మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ మార్కెట్లో గత ఏడాది 150వ స్థానంలో ఉన్న భారత్ ప్రపంచంలో నంబర్‌వన్‌గా ఎదిగిందని ఆయన వెల్లడించారు. ఇపుడు దేశానికి ఆయిల్ సాయిల్ డేటా అని చెప్పారు. అలాగేతన మిత్రుడు నందన్‌నీలేకని సృష్టించిన బయోమెట్రిక్ ఆధార్ ప్రపంచంలోనే అత్యంత భద్రమైన వ్యవస్థగా నిలిచిందని ప్రశంసించారు. భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి మార్గంలో పయనిస్తోందని ముఖేశ్ అంబానీ అన్నారు. 2024 నాటికి దేశ ఆర్థిక వ్యవస్థ రెట్టింపై 5 ట్రిలియన్ డాలర్లను చేరుకుంటుందన్నారు. ‘2004లో భారత ఆర్థిక వ్యవస్థ 500 బిలియన్ డాలర్లుగా ఉంది. వచ్చే 20ఏళ్లలో 5 ట్రిలియన్ డాలర్లకు పెరుగుతుందని అప్పుడే తాను అంచనా వేశాననీ, ప్రస్తుత ప్రగతి చూస్తుంటే అంతకంటే ముందే ఆ లక్ష్యాన్ని భారత్ చేరుకుంటుంది.వచ్చే పదేళ్లలో 7 ట్రిలియన్ డాలర్లకు కచ్చితంగా చేరగలం మనీ.. 2030 నాటికి 10 ట్రిలియన్ డాలర్ల సమీపానికి ఎదుగుతామని అంబానీ వెల్లడించారు. -
మట్టి పెళ్లలు పడి ఇద్దరు మహిళలు మృతి
-
మట్టిపెళ్లలు పడి ఇద్దరు మృతి
మాదాపూర్: నగరంలోని మాదాపూర్ కొత్తగూడలో విషాదం చోటు చేసుకుంది. బహుళ అంతస్తుల భవనం నిర్మాణంలో భాగంగా భారీ సెల్లార్ గుంత తవ్వుతుండగా ప్రమాదవశాత్తూ మట్టి పెళ్లలు పడి ఇద్దరు మహిళలు దుర్మరణం చెందారు. మృతిచెందిన వారిని భారతవ్వ (35), కిష్టవ్వ (22)గా గుర్తించారు. శిథిలాల నుంచి నలుగురు కూలీలు త్రుటిలో బయటపడ్డారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మట్టి పెళ్లల కింద మరికొందరు కూలీలు ఉన్నట్టు సమాచారం. భారీ భవన నిర్మాణంలో ఇంజనీర్ల పర్యవేక్షణ లోపించనట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిర్మాణ సంస్థపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రమాదస్థలాన్ని మేయర్ బొంతు రామ్మోహన్ పరిశీలించారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడంవల్లనే ప్రమాదం జరిగిందని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మాదాపూర్ డీసీపీ విశ్వప్రసాద్ తెలిపారు. కాగా, ప్రమాదస్థలిలో మృతుల బంధువులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం జరిగే వరకు మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించేందుకు ఒప్పుకోమంటూ వారు స్పష్టం చేశారు. -
మట్టి లేకుండానే వ్యవసాయం..
అలస్కా : వ్యవసాయాన్ని ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు. కొందరు ఆరు బయట పొలాల్లో సాగు చేస్తే మరికొందరు గ్రీన్హౌస్లో చేస్తారు. ఏది ఏమైనా వ్యవసాయం చేయాలంటే మాత్రం మట్టి(నేల) కావాల్సిందే. కానీ అలస్కాలోని కొందరు మట్టి అవసరం లేకుండానే సాగు చేస్తున్నారు. ఈ విచిత్రమైన సాగు పేరు వర్టికల్ ఫార్మింగ్. దీనికి హైడ్రోపోనిక్ ఫార్మ్ అని మరోపేరు కూడా ఉంది. అలస్కాలోని కోట్జెబు నగరంలోని కొందరు ఈ విధమైన సాగు పద్ధతిని అవలంబిస్తున్నారు. ఈ వర్టికల్ ఫార్మింగ్ ద్వారా ఒక కంటైనర్‌లో తాజా కూరగాయలను పెంచుతున్నారు. రాక్ ఊల్ (దూది బెండు)పై ఈ మొక్కలను పెంచుతున్నారు. మొక్కకు కావాల్సిన నీరు, పోషకాలు బయట నుంచి ఇస్తే సరిపోతుంది. ఇక సూర్యకాంతి కావాలి కదా! దానికోసం ఎల్ఈడీ కాంతులను వినియోగిస్తున్నారు. ఇందులో దిగుబడి కూడా అధికంగా వస్తుంద అక్కడి వారు చెబుతున్నారు. -
కొంప ముంచిన కక్కుర్తి!
ఎస్సారెస్పీ కాలువకు గండి వానకు కొట్టుకుపోయిన మట్టి నాణ్యత లోపాలే కారణం కాంట్రాక్టర్ ఇష్టారాజ్యం పనులు పర్యవేక్షించని అధికార యంత్రాంగం సాక్షిప్రతినిధి, వరంగల్ : ఆధునీకరణలో భాగంగా ఎస్సారెస్పీ కాలువను పటిష్టం చేసే పనులు చేపట్టారు. గతంలో ఉన్న కాలువల మట్టి కొంత తీసి నాణ్యమైన మట్టిని పోయాల్సి ఉంది. కాంట్రాక్టర్ బయటి నుంచి మట్టిని తెచ్చి ఉపయోగించినట్లు తెలుస్తోంది. భారీ వర్షాలతో ఆ మట్టి కొట్టుకుపోయి గండి పడిందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. భారీ వర్షాలు.. కొన్నిసార్లు అభివృద్ధి పనుల నాణ్యత లోపాలను కనిపించకుండా చేస్తాయి. ఇటీవల కురిసిన వర్షాలు మాత్రం పనుల్లో అక్రమాలను బహిర్గతం చేశాయి. దశాబ్దాలుగా భారీ వరదలను తట్టుకుని నిలిచిన కాలువ తాజా భారీ వర్షాలకు గండిపడడం... అదీ మరమ్మతులు చేసిన తర్వాత జరగడం నాణ్యత లోపాలను వెల్లడిస్తోంది. నాణ్యత లోపాల కారణంగా కాలువకు గండి పడిందని సాగునీటి శాఖ ఇంజనీర్లే చెబుతున్నారు. గండి పడిన ప్రాంతంలో చేపట్టిన పనులను ఇంజనీర్లు పర్యవేక్షించలేదని తెలుస్తోంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటిని జిల్లా వరకు సరఫరా చేసే ప్రధాన కాలువల్లో నిర్దేశిత సామర్థ్యం మేరకు నీటి సరఫరా జరగడం లేదు. కాలువలు పటిష్టంగా లేకపోవడం, నిర్మించి 15 ఏళ్లు పూర్తి కావడంతో సరిపడా నీటిని సరఫరా చేయలేక పోతున్నామని ఇంజనీర్ల చెప్పడంతో ప్రభుత్వం కోట్ల రుపాయలతో అధునీకరణ పనులను చేపట్టింది. ఈ పనులు పూర్తి చేశాక కూడా కాలువకు గండి పడడం అనేక విమర్శలకు తావిస్తోంది. పనులు జరిగిన సమయంలో ఇంజనీరింగ్ అధికారులు నాణ్యత ప్రమాణాలు పట్టించుకోలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాలువకు కుడివైపు 5 మీటర్లు, ఎడమ వైపు 7మీటర్ల వెడల్పుతో పటిష్టం చేసే పనులు చేపట్టారు. గతంలో ఉన్న కాలువల మట్టి కొంత మేరకు తీసి ప్రమాణాలు కలిగిన మట్టిని పోయాల్సి ఉంది. అయితే కాంట్రాక్టర్ ఇష్టానుసారంగా బయటి నుంచి మట్టిని తెచ్చి పటిష్టానికి ఉపయోగించినట్లు తెలుస్తోంది. భారీ వర్షాలతో మట్టి కొట్టుకుపోయి గండి పడిందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. కాలువ పటిష్టత కోసం మట్టిని లేయర్లుగా పోస్తూ, నీటిని చల్లుతూ, రోలింగ్ చేయాల్సి ఉండగా... నిధులు కొంత మిగిల్చికోవాలన్న ఉద్దేశంతో మొత్తం మట్టిని ఒకేసారి పోసి రోలింగ్ చేసినట్లు తెలిసింది. దీని వల్ల అడుగు భాగంలో గట్టిగా లేక మట్టి గుళ్లగా మారి భారీ వర్షాలకు కొట్టుకుపోయిందని తెలుస్తోంది. అధికారులు మాత్రం నాణ్యత లోపాలపై దృష్టి పడకుండా వ్యవహరిస్తున్నారు. నీటి ప్రవాహం ఎక్కువై సీపేజీ(ఊట) రావడంతోనే ఇలా గండి పడిందని అంటున్నారు. ‘మూడో ప్యాకేజీ’లో గండి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు(ఎస్సారెస్పీ) ప్రధాన కాలువను పటిష్ట పరచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నిర్దేశిత సామర్థ్యం మేరకు ఎస్సారెస్పీ నీటి సరఫరా జరిగేలా కాకతీయ ప్రధాన కాల్వను మరమ్మతు చేసేందుకు అధికారులు అంచనాలు రూపొందించారు. కాలువలోని 191 కిలోమీటరు నుంచి 234 కిలోమీటరు వరకు పటిష్ట పరిచేందుకు రూ.60 కోట్లు అవవసరమని రూపొందించిన అంచనాలను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ పనులను నాలుగు ప్యాకేజీలుగా చేపట్టేందుకు అధికారులు టెండర్లు నిర్వహించి కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారు. కాకతీయ కాలువ 191 కిలో మీటరు నుంచి 201 కిలో మీటరు, 201 కిలో మీటరు నుంచి 209 కిలో మీటరు, 209 కిలో మీటరు నుంచి 226 కిలో మీటరు, 226 కిలో మీటరు నుంచి 234 కిలో మీటరు ప్యాకేజీలు విభజించి టెండర్లు పూర్తి చేశారు. ఎండా కాలంలో నాలుగు ప్యాకేజీల్లో పనులు పూర్తి చేశారు. మూడో ప్యాకేజీగా పేర్కొన్న 209 కిలో మీటరు నుంచి 226 కిలో మీటరు కాలువకు బుధవారం గండి పడింది. ఎస్సారెస్పీ సూపరింటెండెంట్ ఇంజనీర్ సుధాకర్‌రెడ్డి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. గండిని మట్టితో పూడ్చినప్పటికీ ప్రవాహం ఎక్కువ అవుతుండడంతో కాలువ కట్ట తెగే ప్రమాదం పొంచి ఉంది. దీంతో ఇసుక బస్తాలతో కట్ట ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. -
మట్టి గణపతి విగ్రహాల పంపిణీ
భువనగిరి : పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులను ప్రతిష్ఠించుకోవాలని స్థానిక యువటీం సభ్యులు కోరారు. ఈ మేరకు శనివారం పలు పాఠశాలల్లో విద్యార్థులకు మట్టిగణపతులను అందజేశారు. సోమవారం ఉదయం 7గంటల నుంచి స్థానిక బస్టాండ్ వద్ద ఉచితంగా మట్టి విగ్రహాలను అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో యువటీం సభ్యులు తంగెళ్ళపల్లి మోహన్, రంగ రంజీత్, సన్నీ, మాదాసు రిత్విక్, ఏనుగు వినీత్, పోత్నక్ సన్నీ, పెండెం లక్ష్మణ్, తదితరులు ఉన్నారు. పట్టణంలోని దేదేప్య హైస్కూల్లో విద్యార్థులకు మట్టి ప్రతిమలను ఆ పాఠశాల కరస్పాండెంట్ శేషగిరిరావు అందజేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ రంగారావు, శంకర్, వీరనాగేందర్, వనజ, బాలమణి, అర్చన, తదితరులు పాల్గొన్నారు. వాసవీక్లబ్ భువనగిరి ఆధ్వర్యంలో ఈ నెల 4న మట్టి గణపతి విగ్రహాలను అందజేస్తామని ఆ సంఘం అధ్యక్షులు బొలిశెట్టి లక్ష్మినర్సయ్య తెలిపారు. పట్టణంలోని ప్రెసిడెన్సీలో పాఠశాలలో కూరగాయలు, రంగురంగుల కాగితాలు, వివిధ రకాల పువ్వులతో గణేష్ విగ్రహాలను తయారు చేసి ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెట్ డి.బాలాజీ, ప్రిన్సిపాల్ రూపారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
మట్టి గణపతికి జై!
ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు వద్దు.. నష్టాలున్నాయంటున్న పర్యావరణ నిపుణులు పర్యావరణాన్ని రక్షించు కోవాలంటూ ప్రచారం సత్తెనపల్లి: వినాయక చవితి వచ్చేస్తోంది...గ్రామాలు, పట్టణాలలో ప్రతి ఇంటితో పాటు వీధివీధినా గణనాధులు కొలువుదీరనున్నారు... పూజలందుకోనున్నారు. అయితే ఆర్భాటంగా జరిగే ఈ ఉత్సవాల్లో మట్టి ప్రతిమలనే పూజించాలంటూ పర్యావరణ పరిరక్షకులు ప్రచారం చేస్తున్నారు. మట్టి వినాయకులను పూజించడమే ఆచారమని తెలియజేస్తున్నారు. ‘మట్టి’ మేలు తలపెట్టవోయ్.. గ్రామాల్లో, పట్టణాల్లో వినాయక మండపాల ఏర్పాటుకు నిర్వాహకులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఒక్క సత్తెనపల్లి నియోజకవర్గంలోనే మొత్తం మీద నాలుగు మండలాలు, పట్టణంతో కలిపి సుమారు 700లకు పైగానే వినాయక మండపాలు ఏర్పాటు చేస్తున్నట్లు అంచనా. ఇవిగాక ప్రతి ఇంట వినాయక ప్రతిమలతో పూజలు చేస్తారు. ఇలా ఏర్పాటయ్యే మండపాల్లో అందం, ఆకర్షణ కోసం ఎక్కువగా రంగురంగుల ప్లాస్టర్ పారిస్ వినాయక విగ్రహాలను వినియోగించడానికే ఎక్కువ మంది మొగ్గుచూపుతుండడం గమనార్హం. ఇదే పర్యావరణానికి పెద్ద సమస్యగా మారుతోంది. ఉత్సవ నిర్వాహకులు వాస్తవ పరిస్థితులు పరిగణనలోకి తీసుకుని, పర్యావరణ హితంగా వేడుకలు నిర్వహిస్తే మనల్ని మనం రక్షించుకోవడంతోపాటు పర్యావరణాన్ని రక్షించుకున్న వారమవుతామని పలువురు పేర్కొంటున్నారు. ప్రతి ఒక్కరు మట్టి ప్రతిమలనే ఏర్పాటు చేసుకుని ఉత్సవాలను నిర్వహించుకోవాలని పర్యావరణ నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటికే కొంత మంది పర్యావరణ ప్రేమికులు, పలు స్వచ్ఛంద సంస్థల వారు మట్టి వినాయకులనే పూజించాలంటూ ప్రచారం చేస్తున్నారు. మట్టితో లాభాలు.. సహజ సిద్ధంగా పొలాల్లో దొరికే బంక మట్టితో విగ్రహాలు తయారు చేసుకోవడం మంచిది. ఇవి నీటిలో సులభంగా కరిగిపోతాయి. మట్టి వినాయక విగ్రహాల నిమజ్జనంతో నీటి వనరులకు ఎలాంటి నష్టం ఉండదు. మట్టి సులువుగా నీటిలో కరిగిపోయి జీవరాసులకు మేలు చేస్తుంది. సహజసిద్ధమైన చెట్ల ఆకులు, బెరడుతో తయారు చేసే రంగులను మట్టి బొమ్మలకు అద్ది ఆకర్షణీయంగా తయారు చేసుకోవచ్చు. రసాయనాలతో అనర్థాలు.. ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారు చేసే విగ్రహాలు కాలువలు, నదుల్లో నిమజ్జనం చేసినా కరుగవు. వీటికి పూసిన రంగులు నీటిని కలుషితం చేస్తాయి. ఈనీటిని తాగిన పశువులకు జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. రసాయనాలు కలిసిన నీటి మూలంగా శరీరంలో నరాలపై ప్రభావం చూపి క్యాన్సర్ వ్యాధికి దారితీస్తుంది. చర్మవ్యాధులు వ్యాప్తి చెందుతాయి. రసాయనిక రంగులు కలిసిన నీరు పంట పొలాల్లో చేరి దిగుబడులు తగ్గించడమే కాకుండా ఆహార ఉత్పత్తులను కలుషితం చేస్తుంది ప్లాస్టర్ పారిస్ నీటిలో కరగడానికి కొన్నేళ్ళు పడుతుంది. నీరు, నేల, గాలి అన్నింటిపైన కాలుష్య ప్రభావం ఉంటుంది. -
‘మట్టి’ మాయ
ఈ ఏడాది 77 లక్షల క్యూ.మీ మట్టి వెలికితీత దారిమళ్లుతున్నా పట్టించుకోని యంత్రాంగం టీడీపీ నేతల జేబులు నింపుతున్న నీరు–చెట్టు పక్కదారి పట్టిన మట్టి విలువ రూ.100 కోట్ల పైమాటే ‘నీరు–చెట్టు’ మట్టి గుటకాయ స్వాహా అవుతోంది. అధికారులకు, అధికార పార్టీ నేతలకు కల్పతరువుగా మారుతోంది. తవ్వుతున్న మట్టికి లెక్కాపత్రం చెప్పే పరిస్థితి లేకపోవడంతో అమ్ముకున్న వాళ్లకు అమ్ముకున్నంత అన్నట్టుగా తయారైంది. గతేడాది 18 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి ఏమైపోయిందో తెలియలేదు. తాజాగా ఈ ఏడాది ఇప్పటివరకు ఏకంగా 77 లక్షల క్యూ.మీ. మట్టిని వెలికి తీసినట్టు రికార్డుల్లో చూపిస్తున్నారు. అయితే ఆ మట్టిని ఏ విధంగా వినియోగిస్తున్నదీ చెప్పే నాధుడు కరువయ్యాడు. ఇప్పటి వరకు వెలికి తీసినదానిలో పక్కదారి పట్టిన మట్టి విలువ అక్షరాల రూ. వంద కోట్ల పైమాటేనని తెలుస్తోంది. సాక్షి, విశాఖపట్నం: నీరు–చెట్టు పథకం కింద జిల్లాలో గతేడాది రెండు విడతలుగా 92 చెరువుల్లో రూ.23 కోట్లతో పనులు చేపట్టారు. 73 చెరువు పనులు ప్రారంభించినప్పటికీ 20 శాతం పనులు మాత్రమే పూర్తి కాగా రూ.ఐదు కోట్ల చెల్లింపులు చేశారు. ఏకంగా 18 లక్షల క్యూ.మీ. మట్టిని మాత్రం వెలికి తీశారు. ఇక ఈ ఏడాది 326 చెరువుల్లో పూడిక తీయాలన్న లక్ష్యంతో రూ.107 కోట్లతో 1068 పనులకు పరిపాలనామోదం ఇచ్చారు. వీటిలో 756 పనులు గ్రౌండ్ కాగా, వాటిలో 356 పనులు పూర్తయ్యాయి. మరో 406 పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఇప్పటివరకు రూ.21 కోట్లు ఖర్చు చేయగా.. రూ.9 కోట్ల మేర చెల్లింపులు చేశారు. మరో రూ.11 కోట్ల మేర చెల్లింపులు చేయాల్సి ఉంది. అనధికారికంగా మరింత మట్టి ఇప్పటివరకు పూర్తయిన, ప్రగతిలో ఉన్న పనుల ద్వారా 77 లక్షల క్యూ.మీ. మట్టిని వెలికి తీసినట్టు అధికారులు లెక్కతేల్చారు. ఇందుకోసం 271 ఎక్స్వటర్స్ వినియోగించగా, 1650 ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా ఈ మట్టిని తరలించినట్టు రికార్డుల్లో చూపారు. ఇంత పెద్దఎత్తున వెలికి తీసిన మట్టి్ట ఏమైందంటే మాత్రం అధికారుల వద్ద సమాధానం లేదు. ప్రతి చెరువులోనూ మీటర్ నుంచి రెండున్నర మీటర్ల (ఆరడుగులు) లోతున సిల్ట్ తొలగిస్తున్నట్టు చూపిస్తున్నారు. ఈ లెక్కన ఎకరాకు 4వేల క్యూ.మీ వరకు మట్టి వస్తుందని అంచనా. అధికారికంగానే 77 లక్షల క్యూ.మీ. మట్టిని వెలికి తీసినట్టు చెబుతున్నారంటే అనధికారికంగా ఇంకెంత మట్టిని వెలికి తీశారో అర్థమవుతుంది. ఎందుకంటే ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన చెరువులన్నీ దాదాపు వందెకరాలకు పైగా విస్తీర్ణంలో ఉన్నవే. వెలికితీసిన మట్టిని పంచాయతీల పరిధిలోనే రైతులు.. స్థానికుల అవసరాలకు వినియోగించాలి. కాని ఇప్పటివరకు ఏ ఒక్క పంచాయతీలో మట్టికి సంబంధించి సీనరేజ్ సొమ్ము జమైన దాఖలాలు లేవు. స్థానికంగా వినియోగించిన ఛాయలు లేవు. పొలాల గట్లను ఎత్తు చేసుకునేందుకు రైతులు తరలించుకు పోతున్నారని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. ఇంత పెద్దఎత్తున వస్తున్న మట్టిని ఉపయోగించి బలహీనంగా ఉన్న శారదా, వరహా, గోస్తని వంటి నదుల కరకట్టలను బలోపేతం చేసుకునే వెసులుబాటు ఉంది. కానీ ఆ దిశగా చర్యలు తీసుకున్న దాఖలాలు కన్పించడం లేదు. క్యూ.మీ మట్టి రూ.250 మార్కెట్లో క్యూ.మీ మట్టి రూ.250 పలుకుతోంది. విశాఖలో రియల్టర్లు తమ వెంచర్స్‌లో ఎర్త్ ఫిల్లింగ్ కోసం నీరు చెట్టు మట్టినే వినియోగిస్తున్నట్టు తెలిసింది. వీరికి కొంత మంది టీడీపీ నేతలు మట్టిని సరఫరా చేస్తున్నారని చెబుతున్నారు. గతేడాది మాటెలాగున్నా ఈ ఏడాది ఇప్పటి వరకు వెలికి తీసిన మట్టిలో కనీసం 50 లక్షల క్యూ.మీ. దారి మళ్లినట్టు తెలుస్తోంది. ఈ మట్టి విలువ రూ.100 కోట్ల పైమాటేనని అంచనా. ఇదే విషయాన్ని ఇరిగేషన్ శాఖాధికారులను వివరణ కోరితే వెలికి తీసిన మట్టిని తిరిగి చెరువు గట్లు, స్థానిక రైతుల పొలాల గట్ల పటిష్టతకు, పంచాయతీల పరిధిలోని శ్మశానవాటికలు, పల్లపు ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ స్థలాలను ఎత్తు చేసేందుకే వినియోగిస్తున్నారని.. ఎక్కడా పక్కదారి పట్టలేదని చెప్పుకొస్తున్నారు. -
ఒండ్రు మట్టితో భక్తుల ఇబ్బందులు
మంగపేట : మండల కేంద్రంలోని గోదావరి పుష్కరఘాట్ వద్ద ప్రమాదం పొంచి ఉన్నప్పటికి సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో అంత్య పుష్కర స్నానానికి వస్తున్న భక్తులు ఆందోళనకు గురవుతున్నారు. అంత్య పుష్కరాలను పురస్కరించుకుని ఐదు రోజుల నుంచి స్థానికులతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన భక్తులు రోజుకు సుమారు 50 మంది వరకు మంగపేట పుష్కరఘాట్‌కు వస్తున్నారు. ఈ సందర్భంగా వారు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి పితృదేవతలకు పిండ ప్రదానాలు చేస్తున్నారు. అయితే పుష్కరాలు ప్రారంభమై ఐదు రోజులు గడుస్తున్నా ఘాట్ మెట్లపై పేరుకుపోయిన ఒండ్రు మట్టిని తొలగించకపోవడంతో పుష్కరస్నానానికి నీటిలోకి దిగుతున్న భక్తులు జారిపడుతున్నారు. ఒండ్రుమట్టి కారణంగా కొందరు భక్తులు పుష్కరస్నానం చేయకుండా తలపై నీటిని చల్లుకుని వెళ్తుండగా.. మరికొందరు కర్రల సాయంతో నీటిలో మూడు మునకలు వేసి గోదారమ్మకు పూజలు నిర్వహించి వెళ్తున్నారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి ఘాట్ మెట్లపై పేరుకుపోయిన ఒండ్రుమట్టిని తొలగించాలని భక్తులు కోరుతున్నారు. -
మృత్తికలను అధ్యయనం చేసే శాస్త్రం?
భూపటల ఉపరితలంపై వదులుగా,∙అదృఢీ భూతంగా ఉండే పొరను మృత్తిక అంటారు.∙మృత్తికలో ఉండే పొరలను ‘హారైజన్స్’ అంటారు. మృత్తికలు ఏర్పడే స్వభావాన్ని బట్టి వీటిని 2 రకాలుగా విభజించారు. అవి.. 1. స్థానబద్ధ మృత్తికలు: స్థానిక మాతృశిల నుంచి ఏర్పడతాయి. 2. నిక్షేప మృత్తికలు: నీరు, పవనాల నిక్షేపణల వల్ల ఏర్పడతాయి. రష్యాకు చెందిన ‘దెకుబన్’, అమెరికా శాస్త్రజ్ఞుడు‘మార్పట్’లు మృత్తికలు ఏర్పడే ప్రాంతాల లక్షణాలు, శీతోష్ణస్థితి వంటి అంశాల ఆధారంగా వీటిని మూడు రకాలుగా వర్గీకరించారు. అవి.. 1. జోనల్ (మండల మృత్తికలు): ఇవి విశాలంగా విస్తరించి ఉన్న ముఖ్యమైన మృత్తికలు. మాతృ శిలపైఏర్పడి అభివృద్ధి చెందాయి. ఉదా‘‘ చెర్నోజెమ్, ఎర్ర, లాటరైట్, ఎడారి మృత్తికలు 2. ఇంట్రా జోనల్ (అంతర మండల మృత్తికలు): నీటిలో కరిగిన లవణాలు భూమి లోపలి నుంచి ఉపరితలానికి కేశ నాళిక ప్రక్రియ వల్ల వచ్చి, నీరు ఆవిరై ఆ లవణాలు మిగిలిపోగా ఏర్పడ్డాయి.ఉదా‘‘ లవణ మృత్తికలు, పీట్, సున్నపు మృత్తికలు 3. అజోనల్ (అమండల మృత్తికలు): వివిధ లవణాలు రవాణా కావడం వల్ల ఏర్పడిన మృత్తికలు. ఉదా‘‘ ఒండ్రు మృత్తికలు, లోయస్ మృత్తికలు, లావా మృత్తికలు.నేలలు లేదా మృత్తికలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ‘పెడాలజీ’ అంటారు. భారతదేశం– మృత్తికలు (నేలలు) భూ ఉపరితలంపై శిథిలమైన శిలా శకలాలు, కుళ్లిన జంతు, వృక్ష సంబంధిత పదార్థాల పలుచటి పొరనే మృత్తికలుగా నిర్వచించవచ్చు. వ్యవసాయం ప్రధాన వృత్తిగా ఉన్న భారత్ వంటి దేశాల్లో మానవ ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక పురోగతిని నిర్ణయించడంలో మృత్తికలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. మంచి మృత్తికలు, ముఖ్యంగా ఒండ్రు మృత్తికలున్న ప్రదేశాల్లో అనేక గొప్ప నాగరికతలు వెల్లివిరిశాయి. వయనం, లవణాలు, కుళ్లిన జీవ సంబంధ పదార్థాల (హ్యూమస్)ను సరైన పాళ్లలో కలిగిన మృత్తికలు వ్యవసాయదారులకు, దేశ ఆర్థిక వ్యవస్థకు సత్ఫలితాలను అందిస్తాయి. 1893లో ఓల్కర్, 1898లో లెదర్ సాగించిన పరిశోధనల వల్ల భారతదేశంలోని మృత్తికలను ప్రధానంగా 4 రకాలుగా వర్గీకరించారు. అవి.. 1. గంగా– సింధు ఒండలి మృత్తికలు, 2. నల్లరేగడి మృత్తికలు, 3. ఎర్ర మృత్తికలు, 4. లాటరైట్ మృత్తికలు. మృత్తికల లక్షణాలను పరిగణనలోకి తీసుకుని భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) 8 ప్రధాన వర్గాలుగా వర్గీకరించింది. అవి.. 1. ఒండలి మృత్తికలు 2. నల్లరేగడి మృత్తికలు 3. ఎర్ర మృత్తికలు 4. లాటరైట్ మృత్తికలు 5. శుష్క, ఎడారి మృత్తికలు 6. లవణీయ, క్షార మృత్తికలు 7. అటవీ మృత్తికలు 8. పీట్, జీవ సంబంధ మృత్తికలు. ఒండలి మృత్తికలు నదులు క్రమక్షయం చేసి తీసుకొచ్చిన ఒండ్రు మట్టి నిక్షేపితాలతో ఏర్పడినవే ఒండలి మృత్తికలు. ఇవి సాధారణంగా నదీ ప్రవాహానికి ఇరు వైపులా, నదీ మైదానాలు, డెల్టా ప్రాంతాల్లో ఏర్పడతాయి. ఈ మృత్తికలు అత్యంత సారవంతమైనవి. కాబట్టి వ్యవసాయభివృద్ధిలో ఈ మృత్తికలు కీలకంగా వ్యవహరిస్తాయి. వీటిలో సున్నం, పొటాష్, భాస్వరం సమృద్ధిగా ఉంటాయి. కానీ, నత్రజని, హ్యూమస్లు తక్కువ పరిమాణంలో ఉంటాయి. ఇవి దేశంలోని మొత్తం భూభాగంలో 23.40 శాతం మేర విస్తరించి వ్యవసాయ ఉత్పత్తిలో సింహ భాగాన్ని కలిగి ఉన్నాయి. మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లోని నర్మద, తపతి నదీ లోయలు, మధ్యప్రదేశ్, ఒడిశాలోని మహానది డెల్టా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని గోదావరి, కృష్ణా నదీ లోయలు, తమిళనాడులోని కావేరి డెల్టా, ఉత్తరాన పంజాబ్ నుంచి అసోం వరకూ ఈ నేలలు విస్తరించి ఉన్నాయి. ఒండలి నేలల్లో డెల్టాయిక్ ఒండలి, కాల్కేరియస్ ఒండలి, తీరస్థమైన ఒండలి, తీర ప్రాంతాల్లో ఇసుక నేలలు ఉన్నాయి. ఈ నేలలు ప్రధానంగా హిమాలయాల నుంచి వచ్చిన విచ్ఛిన్నావశేషం నుంచి లేదా ప్రస్తుతంlవిలుప్తమైపోయిన టెథిస్ సముద్రం వదిలి పెట్టిన సిల్ట్ నుంచి ఏర్పడ్డాయి. గంగా మైదానంలో వీటిని రకరకాలుగా పిలుస్తారు. అవి.. 1. ఖాదర్ 2. భంగర్ 3. భాబర్ 4. టెరాయ్ ఖాదర్: బాగా మెత్తగా ఉండే కొత్త ఒండలి మైదానాన్ని ఖాదర్ అంటారు. ఈ నేలలు లేత రంగులో ఉండి లైమ్, పొటాష్లను ఎక్కువగా కలిగి ఉంటాయి. భంగర్: పాత ఒండలి మైదానాన్ని భంగర్ అంటారు. ఈ నేలలు ముదురు రంగులో ఉండి, బంకమన్నును అధికంగా కలిగి ఉంటాయి. భాబర్: శివాలిక్ పర్వత పాదాల వెంటlముతక లేదా గులకరాళ్లతో కూడిన ఒండలి మండలాన్ని భాబర్ అంటారు. టెరాయ్: భాబర్‌కు దక్షిణాన సిల్ట్ నేలలతో కూడిన తుంపర పల్లపు భూములను టెరాయ్ అంటారు. భారతదేశంలో ఈ నేలలున్న ప్రాంతాలు గోధుమ, వరి ధాన్యాగారాలుగా ప్రసిద్ధి చెందాయి. నల్లరేగడి మృత్తికలు కొన్ని మిలియన్ సంవత్సరాల కిందట అగ్ని పర్వతాలు నిక్షిప్తం చేసిన లావా నిక్షేపణ, నీస్, గ్రానైట్ శిలలు శైథిల్యానికి గురి కావడం వల్ల ఈ నేలలు ఏర్పడ్డాయి. వీటిలో ఇనుము, కాల్షియం, మెగ్నీషియం, కార్బొనేట్లు, అల్యూమినియం ఫుష్కలంగా ఉంటాయి. నత్రజని, పాస్ఫారిక్ ఆమ్లం, హ్యూమస్లు తక్కువ మోతాదులో ఉంటాయి. ఇవి అధిక మొత్తంలో మెత్తని ఇనుప పదార్థాన్ని కలిగి ఉండటం వల్ల నలుపు రంగులో ఉంటాయి. వీటినే చెర్నోజమ్ నేలలని కూడా పిలుస్తారు. పత్తి పంటకు అనువైనవి కావడం వల్ల వీటిని బ్లాక్ కాటన్ సాయిల్స్ అని కూడా అంటారు. వీటిలో బంకమన్ను శాతం అధికంగా ఉంటుంది. అందువల్లే ఇవి తేమను ఎక్కువ రోజులు నిల్వ చేసుకునే శక్తిని కలిగి ఉంటాయి. కాబట్టే ఈ నేలలు భూసారానికి ప్రసిద్ధి చెందాయి. ఈ మృత్తికలు ముఖ్యంగా దక్కన్ పీఠభూమి ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి. మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలతోపాటు ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. ఎర్ర మృత్తికలు తక్కువ వర్షపాతం ఉండే ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతల వల్ల స్ఫటిక, రూపాంతర శిలలు శైథిల్యం చెంది ఈ మృత్తికలు ఏర్పడతాయి. వీటిలో ఇనుము, ఫెర్రో మెగ్నీషియం ఖనిజాలు పుష్కలంగా ఉండి, సున్నపురాయి, కంకర, నైట్రోజన్, ఫాస్ఫారికామ్లం, ఫ్రీ కార్బొనేట్లు లోపించి ఉంటాయి. కాబట్టి ఈ నేలలు ఎక్కువ పొడిగా, తక్కువ సారవంతంగా గాలి పారేటట్లు ఉంటాయి. ఇవి లోతైన పల్లపు ప్రాంతాల్లో రేగడి మన్ను, ఇసుక కలిసిన మృత్తికలుగా, ఉన్నత భూముల్లో వదులైన గ్రావిల్గా ఉంటాయి. భారతదేశ భూభాగంలో ఈ నేలలు 29.08 శాతం మేర విస్తరించి ఉన్నాయి. తమిళనాడు (అంతటా), కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు, ఏపీ, తెలంగాణ, మధ్యప్రదేశ్‌లోని తూర్పు ప్రాంతం, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లోని ఛోటా నాగ్‌పూర్ ప్రాంతాల్లో ఈ నేలలున్నాయి. లాటరైట్ మృత్తికలు ఏకాంతరంగా ఉండే ఆర్ధ్ర, అనార్ధ్ర రుతువుల్లోని అధిక వర్షపాత, ఉష్ణోగ్రతా పరిస్థితుల్లో లాటరైట్ మృత్తికలు ఏర్పడతాయి. ఆయా పరిస్థితులు మౌలిక శిల నుంచి సిలికా అనే పదార్థం ఎక్కువగా నిక్షాళనం చెందేందుకు దోహదపడతాయి. వీటిలో అల్యూమినియం, ఇనుముల హైడ్రేటె ఆక్సైడ్ల మిశ్రమం ఉంటుంది. ఇనుముతో కూడిన మిశ్రమం ఎక్కువగా ఉండడం వల్ల ఈ మృత్తికలు ఎరుపు రంగులో ఉంటాయి. ఈ నేలల భూ సారం అతి తక్కువగా ఉంటుంది. ఇవి తోట పంటలకు అనువైనవి. ఈ నేలలు మన దేశంలో 4.30 శాతం భూ భాగంలో విస్తరించి ఉన్నాయి. మధ్యపదేశ్లోని వింధ్య, సాత్పురా పర్వతాలకు చెందిన బసాల్టిక్ పర్వత శిఖరాల మీద, ఒడిశాలోని తూర్పు కనుమల ప్రాంతం, దక్షిణ మహారాష్ట్ర, కర్ణాటక, కేరళల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈ నేలలు విస్తరించి ఉన్నాయి. తక్కువ ఎత్తులో ఉన్న లాటరైట్ నేలల్లో వరి, ఎక్కువ ఎత్తులో ఉన్న నేలల్లో తేయాకు, కాఫీ, రబ్బరు, మల్బరీ వంటి తోట పంటలు బాగా పండుతాయి. శుష్క, ఎడారి మృత్తికలు శుష్క, అర్ధ శుష్క పరిస్థితుల్లో అధిక ఉష్ణోగ్రత, అల్ప వర్షపాతం వల్ల ఈ మృత్తికలు ఏర్పడతాయి, వాయు నిక్షేపిత ఇసుక దిబ్బలు (లోయస్లు) కూడా ఈ నేలల కిందకే వస్తాయి. ఈ మృత్తికల్లో ఫాస్ఫేట్, ఫాస్ఫారిక్ ఆమ్లం ఎక్కువ మోతాదులో ఉండి, నత్రజని, భాస్వరం, ఇనుములు తక్కువ మోతాదులో ఉంటాయి. ఈ నేలలు దేశ భూభాగంలో 8.46 శాతం మేర విస్తరించి ఉన్నాయి. పశ్చిమ రాజస్థాన్, దక్షిణ పంజాబ్, దక్షిణ హరియాణాల్లో ఈ నేలలు ఎక్కువగా ఉన్నాయి. క్షారత్వాన్ని తట్టుకోగలిగే బార్లీ, పత్తి వంటి పంటలు ఈ నేలల్లో అధికంగా పండుతాయి. లవణీయ, క్షార మృత్తికలు ఇవి ఉత్తరప్రదేశ్, బిహార్, రాజస్థాన్, పంజాబ్, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లోని శుష్క, అర్ధ శుష్క ప్రాంతాల్లో కనిపిస్తాయి. ఈ నేలల ఉపరితలం మీద సోడియం, కాల్షియం, మెగ్నీషియంలతో కూడిన గట్టి పొరలుంటాయి. వీటినే రే, కల్లర్, ఊసర్ నేలలు అని కూడా అంటారు. లవణీయ మృత్తికల్లో సోడియం లోపం ఉంటే, క్షార మృత్తికల్లో సోడియం క్లోరైడ్ నిక్షేపాలుంటాయి. అటవీ మృత్తికలు (పర్వత మృత్తికలు) అడవుల నుంచి ఉత్పన్నమైన కర్బన çపదార్థ నిక్షేపణ వల్ల ఈ నేలలు ఏర్పడ్డాయి. వీటినే పర్వత మృత్తికలు అని కూడా అంటారు. ఇవి వివిధ స్థాయిల్లో అభివృద్ధి చెంది ఉంటాయి. స్వల్ప రసాయన శైథిల్యం, స్వల్ప బృహచ్ఛలనం వల్ల పూర్తిగా పరిణతి చెందని ఈ మృత్తికలు తక్కువ సారవంతమైనవి. ఈ నేలల్లో హ్యూమస్ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ ఎత్తయిన ప్రాంతంలో ఈ నేలలు ఆమ్ల రహితమైన పోడ్జీత్లుగా ఉంటాయి. ఈ నేలలు దేశం మొత్తం భూభాగంలో 10.64 శాతం మేర విస్తరించి ఉన్నాయి. హిమాలయాలు, ఉత్తరాన ఉన్న ఇతర పర్వత శ్రేణులు, తూర్పు, పశ్చిమ కనుమలు, కర్ణాటక (కూర్గ్)లో ఈ నేలలున్నాయి. తేయాకు, కాఫీ, సుగంధ ద్రవ్యాలు, పండ్ల తోటలకు ఈ నేలలు అనుకూలం. పీట్, జీవ సంబంధ మృత్తికలు నేలల్లో జీవ సంబంధ పదార్థం ఎక్కువగా సంచయనం కావడం వల్ల ఆర్ర ్ధ ప్రాంతాల్లో పీట్ మృత్తికలు ఏర్పడతాయి. వీటిలో ద్రావణీయమైన లవణాలు గణనీయంగా ఉండే అవకాశం ఉంది. దేశంలో ఈ నేలలు 150 చ.కి.మీ విస్తీర్ణంలో ఉన్నాయి. ఇవి ఎక్కువగా కేరళలోని కొట్టాయమ్, అలెప్పీ జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి. అక్కడ వీటిని స్థానికంగా ‘కరి’ నేలలంటారు. ఒడిశా సముద్రతీర ప్రాంతాలు, బెంగాల్‌లోని సుందర వనాలతోపాటు ఉత్తర బిహార్, ఆగ్నేయ తమిళనాడుల్లో ఈ నేలలున్నాయి. -ముల్కల రమేష్ సబ్జెక్ట్ నిపుణులు, హన్మకొండ -
భారీగా పెరిగిన రసాయన ఎరువుల వినియోగం
– ఇప్పటికే 1,22,615 టన్నుల వాడకం – ఎరువుల ఖర్చు రూ.110 కోట్లపైనే – 34 శాతం భూముల్లోనే పంటలు సాగు – ఇంకా సాగుకు నోచుకోని వరి కర్నూలు(అగ్రికల్చర్): ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ఇప్పటి వరకు రసాయన ఎరువుల వినియోగం భారీగా పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే ఈ సారి 10శాతం వరకు పెరిగినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇప్పటి వరకు జిల్లాలో 1,22, 615 టన్నుల ఎరువుల విక్రయాలు జరిగినట్లు తెలుస్తోంది. అంటే ఒక్క ఎరువులపైనే రైతులు రూ.110.35 కోట్లు వ్యయం చేసినట్లు లెక్క. ఖరీఫ్ సీజన్‌కు 3,32,054 టన్నుల ఎరువులు అవసర మవుతాయి. అయితే గత ఏప్రిల్ 1 నాటికి జిల్లాలో 1,46,279.24 టన్నులు నిల్వ ఉండగా అప్పటి నుంచి ఇప్పటి వరకు 1,03,395.4 టన్నుల వచ్చాయి. మొత్తంగా 2,49,674.64 టన్నుల ఎరువులుండగా 1,22, 615 టన్నులు అమ్మకం జరిగింది. ఇందులో అత్యధికంగా కాంప్లెక్స్ ఎరువులు 58,509.75 టన్నులు వినియోగించారు. యూరియా 54,233.05 టన్నులు, డీఏపీ 7,175.08 టన్నులు, ఎంఓపీ 5,977.3 టన్నులు, ఎస్ఎస్పీ 1,164.46 టన్నుల ప్రకారం వినియోగించారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 2.14 లక్షల హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. అంటే కేవలం 34శాతం భూముల్లో సాగైన పంటలకే ఇంత భారీగా ఎరువులు వినియోగించడం గమనార్హం. పూర్తిస్థాయిలో పంటలు సాగైతే ఎరువుల వినియోగం ఎంతమేరకు చేరుతుందోనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రకతి వ్యవసాయంపై ఆసక్తి కరువు.. రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకం వల్ల పెట్టుబడి వ్యయం పెరిగిపోయిన రైతులు నష్టపోతున్న నేపథ్యంలో ఇందుకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం ప్రకతి వ్యవసాయ విధానాలను ప్రోత్సహిస్తోంది. అయితే ఖరీఫ్ సీజన్లో రెండు నెలలు దాటకుండానే ఇంతలా రసాయన ఎరువుల వినియోగం నమోదుకావడాన్ని బట్టి ప్రకతివ్యవసాయ విధానాలపై రైతులు పెద్దగా ఆసక్తి చూపలేదని స్పష్టమవుతోంది. -
శాస్త్రోక్తంగా మృత్తిక సంగ్రహణ
– బంగారు పల్లకీలో మృత్తిక ఊరేగింపు – రాఘవేంద్రుల బందావనంతో విశేష పూజలు మంత్రాలయం : ప్రముఖ శ్రీరాఘవేంద్రస్వామి మఠంలో ఏటా గురు పూర్ణిమను పురస్కరించుకుని మృత్తిక(మట్టి) సేకరించడం ఆనవాయితీ. మంగళవారం శ్రీమఠం పీఠాధిపతి సుభుధేంద్రతీర్థులు శాస్త్రోక్తంగా మృత్తిక సంగ్రహణ గావించారు. వేకువ జామున సుప్రభాత సేవతో మఠంలో పూజలు ప్రారంభమయ్యాయి. అనంతరం మఠం వెనుక భాగంలోని తులసీవనం చేరుకున్నారు. అక్కడ పండితుల వేదమంత్రోచ్ఛారణలు పఠిస్తుండ, మంగళవాయిద్యాల సుస్వరాల మధ్య వనంలో విశేష పూజలు నిర్వహించారు. పీఠాధిపతి స్వహస్తాలతో మృత్తికను సంగ్రహణం చేశారు. మృత్తికను పవిత్రంగా స్వర్ణపల్లకీలో ఉంచగా ఊరేగింపుగా శ్రీమఠానికి తీసుకువచ్చారు. శ్రీమఠం మాడవీధుల్లో కన్నుల పండువగా ఊరేగింపు కానిచ్చారు. మృత్తికను రాఘవేంద్రస్వామి మూల బృందదావనం ముందుంచి విశేష పూజలు చేపట్టారు. అనంతరం మృత్తికను బందావనంపై ఉంచారు. సేకరించిన మృత్తికను రాఘవేంద్రుల మత్తిక బందావనాల స్థాపనకు ఇక్కడి నుంచి తీసుకెళ్లడం ఆచారం. రోగ పీడిత భక్తులకు సైతం మత్తికను అందజేస్తారు. వేడుకలో మఠం ఏఏవో మాధవశెట్టి, మేనేజర్ శ్రీనివాసరావు, జోనల్ మేనేజర్ శ్రీపతి ఆచార్, అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి, ధార్మిక సహాయ అధికారి వ్యాసరాజాచార్ పాల్గొన్నారు. -
మట్టిపెళ్లలు పడి ఇద్దరు దుర్మరణం
ఇల్లందు: ఖమ్మం జిల్లా ఇల్లందు మండలం జెకెఓసి నిర్వాసితుల కాలనీ సమీపంలో మట్టి తవ్వుతుండగా పెళ్లలు విరిగిపడి ఇద్దరు కూలీలు మృతి చెందారు. ఈ సంఘటన శనివారం ఉదయం జరిగింది. మట్టి లోడుచేసేందుకు ధనియాలపాడు తండా గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ట్రాక్టర్ తీసుకుని వెళ్లారు. మట్టిని తవ్వుతుండగా ఉన్నట్టుండి పెళ్లలు విరిగిపడ్డాయి. ఈ సంఘటనలో ఇద్దరు మృతిచెందగా, ఒకరు ప్రాణాలతో బయటపడ్డారు. గమనించిన స్థానికులు మృతదేహాలను వెలికితీశారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పూడిక మట్టికి రేటు
ఒక్కో లారీకి రూ.4300 ప్రతీ రోజు వందల కొద్దీ ట్రిప్పులు ముడుపులతో అధికారుల కళ్లకు గంతలు సాక్షి, హన్మకొండ: చెరువుల నుంచి పూడిక తీసిన మట్టిని వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. ఆ మట్టిని రైతులకు ఉచితంగా సరఫరా చేయూల్సి ఉండగా టన్నుకు వంద రూపాయల చొప్పున అమ్ముకుంటున్నారు. నగర శివార్లలో మిషన్ కాకతీయ పథకం అమలవుతున్న చెరువులపై మట్టి వ్యాపారులు కన్నేశారు. ఎక్కువ పూడిక ఉందనే మిషతో మైనింగ్ సీనరేజ్ చెల్లించి ఇష్టారీతిగా పూడిక తీస్తున్నారు. మిషన్ కాకతీయ పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లతో కుమ్మక్కై రైతుల నోట్లో మట్టి కొడుతూ పూడిక మట్టిని ఇటుక బట్టీలకు తరలిస్తున్నా రు. తక్కువ సమయంలో ఎక్కువ మట్టిని తరలించేందుకు ట్రాక్టర్లు, లారీలను కాదని భారీ టిప్పర్లను అద్దెకు తెప్పిస్తున్నారు. ప్రస్తుతం 40 టన్నుల సామర్థ్యం కలిగిన టిప్పరుకు రూ.4,300 వసూలు చేస్తున్నారు. ఈ దందాకు సహకరించే అధికార యంత్రాంగానికి వాటా లు సమర్పించినా.. ప్రతీ టిప్పరుపై మట్టి వ్యాపారులకు రూ.1000 నుంచి 1500 వరకు లాభం వస్తున్నట్లు సమాచారం. అధిక లోడ్ తక్కువ సమయంలో ఎక్కువ లాభం పొందేం దుకు పరిమితికి మించిన లోడుతో మట్టిని రవాణా చేస్తున్నారు. నిబంధనల ప్రకారం 6 టైర్ల లారీలో 16 టన్నులు, 10 టైర్ల లారీలో 25 టన్నులు, 12 టైర్లకు 31 టన్నులకు మించి లోడ్ వేయరాదు. కానీ మిషన్ కాకతీయలో పూడిక మట్టిని తీసుకెళ్తున్న లారీలు అధిక లోడ్ తో వెళ్తున్నాయి. గీసుకొండ మండలం ఊకల్, శాయంపేట చెరువుల వద్ద 12 టైర్ల లారీలు 30 తిరుగుతుండగా ఇందులో ప్రతీ ట్రిప్పుకు కనీసం 40 టన్నులకు తగ్గకుండా మట్టి లోడ్ చేస్తునారు. ఈ భారీ వాహనాలతో రోడ్లు త్వర గా పాడయ్యే ప్రమాదం ఉంది. గీసుకొండ మండలం ఊకల్లు చెరువు, వంచనగిరి శాయంపేట చెరువు, చెన్నారం, హన్మకొండ మండ లం నక్కలపల్లి, తిమ్మాపురం, మామునూరు చెరువుల నుంచి మట్టి ఇటుక బట్టీలకు నిరంతరం తరలిపోతోంది. మిషన్ మట్టితో జరుగుతున్న అక్రమ వ్యాపారాన్ని అరికట్టాల్సిన విజి లెన్స్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ అధికారులు.. కళ్లేదుటే నిత్యం వందలాది లారీలు తిరుగుతున్నా తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. కేసులు నమోదు చేస్తాం గీసుకొండ మండలం ఊకల్ చెరువుతో మరి కొన్ని చెరువుల్లో పూడికతీతల పేరిట నిబంధనలకు విరుద్ధంగా రెండు నుంచి నాలుగు మీటర్ల వరకు మట్టితో పాటు మొరం తీయడంపై సోమవారం సాక్షిలో ప్రచురితమైన కథనానికి ఇరిగేషన్ బ్రాంచ్ ములుగు ఈఈ గోపాలరావు స్పందించారు. పూడికతీతలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదిక అందించాలని సంబంధిత డీఈఈకి ఆదేశాలు జారీ చేశామని, మిషన్ కాకతీయ పనుల్లో భాగంగా చెరువుల్లో నిబంధలనకు విరుద్ధంగా పూడిక మట్టి తీస్తే సంబంధిత కాంట్రాక్టర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. ఈ చెరువులో పూడిక మట్టి ఎక్కువగా ఉన్నట్లు గుర్తించామని, మట్టిని ప్రైవేటు వ్యక్తులు వారి అవసరాలకు తీసుకుపోయేందుకు మైనింగ్ శాఖకు సీనరేజీ చెల్లించారని తెలిపారు. నిర్దేశించిన క్యూబిక్ మీటర్ల మట్టిని తీసుకుపోయేందుకు తాము అనుమతి ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. -
మట్టి దోపిడీ.. రూ.500 కోట్లు
చెరువుల్లో గోతులు తవ్వి అమ్ముకున్నారు తవ్విన మట్టికి {పభుత్వ డబ్బు కాజేశారు చెరువుకు కనీసంగా రూ.40 లక్షలు స్వాహా నీరు-చెట్టు పథకంలో లెక్కలేని అవినీతి చెరువుల్లో మట్టిని తవ్వి అమ్ముకున్నారు. కూలీల ద్వారా మట్టి తీయించామంటూ బిల్లులు చేసుకొని కోట్లు గడించారు. అటు ప్రభుత్వ ధనం దోపిడీ చేయడంతో పాటు వ్యాపారులు, పరిశ్రమలకు అమ్ముకోగా వచ్చిన డబ్బును దాచుకున్నారు. ఒక్క ఏడాదిలో గ్రామ స్థాయి చోటా కాంట్రాక్టర్లు కోట్లు గడించారు. ఇదంతా ప్రభుత్వం గ్రామాల్లోని కార్యకర్తలకు దోచిపెట్టింది. విజయవాడ : నీరు-చెట్టు కార్యక్రమంలో కూలీల ద్వారా తవ్వించిన మట్టిని నిబంధనల ప్రకారం ప్రభుత్వ అవసరాలకు ఉపయోగించాలి. లేదా రైతుల్లో అడిగిన వారికి ఇవ్వాలి. చెరువుల్లోని ఒండ్రు మట్టిని రైతుల పొలాల్లోకి తోలుకునేందుకు కొంతమేరకు అనుమతులు ఉన్నాయి. అయితే ఆ పనులు వారే చేసుకోవాలి. ఇవన్నీ నీరు-చెట్టులో జరగలేదు. కంచికచర్ల మండలం గండేపల్లి సుబ్బరాజు చెరువులో జరిగిన అవినీతిని పరిశీలిస్తే పరిస్థితి అర్థమవుతుంది. ఈ చెరువులో మట్టి తవ్వినందుకు రూ.44.14 లక్షలు ప్రభుత్వం బిల్లుల రూపంలో ఇచ్చింది. టీడీపీ నాయకులు అమ్ముకున్న మట్టికి సుమారు రూ.50 లక్షలు వచ్చింది. ఇలా లెక్క వేస్తే పనులు జరిగిన 650 చెరువుల్లో సుమారు రూ.500 కోట్లు దోచేశారని ఆరోపణలు వస్తున్నాయి. మంత్రి మండలంలో దోపిడీ... గత ఏడాది ఏప్రిల్, మే నెలల్లో కంచికచర్ల మండలం గండేపల్లి సుబ్బరాజు చెరువులో జరిగిన నీరు-చెట్టు కార్యక్రమాన్ని పరిశీలిస్తే కాంట్రాక్టర్లు ఎలా దోచుకున్నారో అర్థమవుతుంది. జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సొంత మండలం కంచికచర్ల కావడం గమనార్హం. కాంట్రాక్టర్ మందడపు వెంకటకృష్ణ అలియాస్ రాఘవయ్య గత ఏడాది ఏప్రిల్ 18 నుంచి 22 వరకు చేపల చెరువులకు, మే 4 నుంచి 9 వరకు సెంటినీ కంపెనీకి, ఏప్రిల్ 20 నుంచి మే 10 వరకు కీసరలోని గ్రానైట్ క్వారీల గుంతలు పూడ్చేందుకు మట్టిని తోలారు. ఇందుకు ప్రత్యేకంగా డబ్బులు తీసుకున్నారు. ట్రాక్టర్‌కు రూ.500 వంతున వసూలు చేశారు. మట్టిని తీసేందుకు జేసీబీ, పొక్లెయిన్లు ఉపయోగించారు. ఈ చెరువు మట్టిని తవ్వేందుకు గ్రామసభ నిర్వహించలేదు. మొదట కావడం వల్ల క్యూబిక్ మీటరుకు రూ.29 వంతున రూ.44.14 లక్షలు మట్టిని తోలినందుకు బిల్లులు ప్రభుత్వం చెల్లించింది. ప్రభుత్వ ధనంతో పాటు మట్టిని ప్రైవేట్ వారికి అమ్ముకున్న డబ్బు కలిపి సుమారు కోటి రూపాయలు పైగా వసూలైనట్లు తెలుస్తోంది. ఈ చెరువు 67.97 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. చెరువు కింద ఆయకట్టు 72.65 ఎకరాలు ఉంది. ప్రభుత్వ మెమో 10444/సీఏపీ/2014 (31-3-2015) ప్రకారం వంద ఎకరాల కంటే తక్కువ ఆయకట్టు చెరువు అయితే ఎన్ఆర్ఈజీఎస్ పద్ధతుల్లో పనులు చేపట్టాలి. జేసీబీలు, పొక్లెయిన్లు పెట్టి చేశారు. ఈ చెరువులో జరిగిన అవినీతి వ్యవహారాన్ని పూర్తిస్థాయిలో తహసీల్దార్‌కు, కలెక్టర్‌కు స్థానికులు ఫిర్యాదు చేశారు. 650 చెరువుల్లో దోచుకున్నారు... జిల్లాలో 924 చెరువులు ఉన్నాయి. వీటిలో 235 మైనర్ చెరువులు. గత వేసవి నుంచి ఇప్పటివరకు 650 చెరువులను నీరు-చెట్టు కింద పూడిక తీసేందుకు నిర్ణయించారు. ఇందుకోసం రూ.5 కోట్ల నిధులను కలెక్టర్ వద్ద ఉంచారు. పశ్చిమకృష్ణాలోని కట్టలేరు ఆయకట్టు పరిధిలో 239 చెరువులు, బుడమేరు పరిధిలో 356, తమ్మిలేరు, రామిలేరు పరిధిలో 180 చెరువులు ఉన్నాయి. ఈ చెరువుల్లో మట్టి తవ్వకాలు, మట్టి అక్రమ విక్రయాల ద్వారా సుమారు రూ.500 కోట్లు టీడీపీ చోటా కాంట్రాక్టర్లు, నాయకులు కాజేశారనే ఆరోపణలు ఉన్నాయి. అంతులేని మట్టి వ్యాపారం... : క్యూబిక్ మీటరు మట్టి తవ్వినందుకు పొక్లెయిన్‌కు గతంలో రూ.29 ఉండగా ఇప్పుడది రూ.34కు చేరింది. చెరువుల నుంచి మట్టిని తరలిస్తున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు ట్రాక్టర్ మట్టిని రూ.300 నుంచి రూ.700 వరకు విక్రయిస్తున్నారు. నీరు-చెట్టు పథకం పేరు చెప్పి మట్టి వ్యాపారం జోరుగా సాగిస్తున్నారు. అనుమతులు లేవు... : మచిలీపట్నం నియోజకవర్గంలో రుద్రవరం, చిన్నాపురం, వెంకట దుర్గాంబపురం, తుమ్మలపాలెం, పల్లె తుమ్మలపాలెం, బుద్దాలపాలెం పంచాయతీల్లో నీరు-చెట్టు కింద చెరువు పూడికతీత పనులు జరిగాయి. అంచనాలు రూపొందించకుండా, అనుమతులు లేకుండా పనులు చేయటం గమనార్హం. జిల్లాలోని అధికార పార్టీ కీలక ప్రజాప్రతినిధి, మరో టీడీపీ నేత కనుసన్నల్లో ఈ వ్యవహారం మొత్తం నడిచింది. లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి అవుట్ మైలవరంలోని చంద్రాల చెరువులో 83 వేల క్యూబిక్ మీటర్ల మట్టిని తరలించారు. టీడీపీకి చెందిన నాయకులు ఒక ట్రాక్టర్ మట్టిని రూ.500 చొప్పున ఇటుక బట్టీలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకున్నారు. చెరువులో నుంచి తీసిన మట్టిని పొలాలకు మళ్లిం చాల్సి ఉండగా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు విక్రయించారు. చంద్రగూడెం చెరువు, వెల్వడం, పొందుగల ఎర్ర చెరువుల నుంచి భారీ స్థాయిలో మట్టిని తరలించి సొమ్ము చేసుకున్నారు. చల్లపల్లి ఎంపీపీ యార్లగడ్డ సోమశేఖరప్రసాద్ (లంకబాబు), వైస్ ఎంపీపీ బోలెం నాగమణిల మధ్య లక్ష్మీపురం పంచాయతీలో చెరువు పూడికతీత పనుల విషయంలో విభేదాలు వచ్చాయి. ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎంపీడీవో కార్యాలయం వద్ద దుర్భాషలాడుకున్నారు. వివాదం ముదరటంతో టీడీపీ నాయకులు సర్ది చెప్పారు. దీంతో లక్ష్మీపురం చెరువు నుంచి మట్టిని యథేచ్ఛగా తరలిస్తున్నారు. ఒక్కొక్క ట్రాక్టర్ మట్టిని దూరాన్ని బట్టి రూ.300 నుంచి రూ.500 వరకు విక్రయిస్తున్నారు. గన్నవరం నియోజకవర్గంలోనూ మట్టి విక్రయాలు తీవ్రస్థాయిలో జరిగాయి. ఇక్కడ మంత్రి అనుచరులు, స్థానిక ప్రజాప్రతినిధి అనుచరులు అక్రమ మట్టి వ్యాపారంలో భాగస్వాములయ్యారు. -
కర్నాటక మట్టిలో పుట్టాడు.. దేశం వదిలిపోడు..!
మనీ ల్యాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కోవడమే కాక, దేశం వదిలి పారిపోయారన్న ప్రచారంతో ఇటీవల ప్రధానంగా వార్తల్లో నిలిచిన లిక్కర్ కింగ్ విజయమాల్యాపై మాజీ ప్రధాని హెచ్ డి దేవెగౌడ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హల్ చల్ చేస్తున్నాయి. బ్యాంకులకు 9000 కోట్ల రూపాయలు ఎగవేసి, గుట్టు చప్పుడు కాకుండా విదేశాలకు చెక్కేశారంటూ మాల్యాపై ఆరోపణలు చేయడం సరి కాదని ఆయన వెనకేసుకొచ్చారు. ''అతడు కర్నాటక మట్టిలో పుట్టాడు. దేశం వదిలి పారిపోడు'' అంటూ మాజీ ప్రధాని హెచ్ డి దేవెగౌడ ట్విట్ చేశారు. ఓ టాప్ బిజినెస్ మెన్ ను పట్టుకుని ఆరోపణలు చేయడం సరికాదన్నారు. కాగా మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద మాల్యాకు ఇప్పటికే ఈడీ సమన్లు జారీ చేసింది. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఎదుట హాజరు కావాల్సిందిగా లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు సమన్లు పంపింది. అయితే తాను దేశం వదిలి పరారైనట్లు మీడియాలో వస్తున్న వార్తలను మాల్యా ట్విట్టర్ లో ఖండించిన విషయం తెలిసిందే. తాను అంతర్జాతీయ వ్యాపారవేత్తనని, విదేశాలకు వెళ్ళి రావడం తనకు మామూలేనని, పరారైనట్లుగా మీడియా ప్రచారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మాల్యాను సపోర్ట్ చేస్తూ మాజీ ప్రధాని వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదిలా ఉంటే విజయ్ మాల్యా ప్రస్తుతం బ్రిటన్ లో ఉన్నట్లు చెప్తున్నా కచ్చితమైన సమాచారం మాత్రం దొరకలేదు. ఈడీ సమన్ల నేపథ్యంలో ఆయన ఈనెల 18న భారత్ కు తిరిగి వస్తారా లేదా అనేదానిపై సస్పెన్స్ నెలకొంది. అయితే అనుకున్నట్లుగా మాల్యా భారత్ తిరిగి వస్తే ...ఆయన పరారైనట్లు జరిగిన ప్రచారం ఉత్తదేనని తేలిపోవడంతోపాటు.. దేవెగౌడ వ్యాఖ్యలకూ ఊతం చేకూరే అవకాశం ఉంది. -
భారత్‌లో మరో ప్రాణాంతక వ్యాధి..!?
మరో ప్రాణాంతక వ్యాధికి భారతదేశం కేంద్రమైందని తాజా నివేదికలు చెప్తున్నాయి. గాలి, నీరు, మట్టిలో విస్తృతంగా ఉండే ఓ బ్యాక్టీరియా కారణంగా ఆ వ్యాధి సోకుతుందని, దాన్ని వెంటనే గుర్తించకపోతే రెండు రోజుల్లో ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని ఆక్స్ఫర్డ్ వర్శిటీ పరిశోధకులు వెల్లడించారు. ఇప్పటికే స్వైన్ ఫ్లూ, డెంగ్యూ, మలేరియా వంటి ప్రాణాంతక వ్యాధులను ఎలా నిర్మూలించాలోనని తలలు పట్టుకుంటుండగా.. భారత్‌లో మరో ప్రాణాంతక వ్యాధిని కలిగించే అత్యంత భయంకరమైన బ్యాక్టీరియా వ్యాపించి ఉందని ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయం పరిశోధకులు వెల్లడించారు. 'మెలియోఐడోసిస్' పేరున గాలి, నీరు, మట్టిలో లో ఈ క్రిమి వ్యాపించి ఉన్నట్లు నివేదికలు చెప్తున్నాయి. వ్యాధి సోకిన వెంటనే సరైన సమయానికి వైద్యం అందించకపోతే కేవలం రెండు రోజుల్లోనే ప్రాణాలు తీసేంత ప్రమాదకారి అని చెప్తున్నారు. అయితే ఈ బ్యాక్టీరియాను గుర్తించడం కొంత కష్టమేనని లండన్‌కు చెందిన నేచర్ మైక్రో బయాలజీ పత్రికలో నివేదికను ప్రచురించారు. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేసుల్లో 44శాతం దక్షిణాసియాలోనే ఉన్నట్లు ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన డేవిడ్ డ్యాన్స్ నవంబర్‌లో మణిపాల్ వర్శిటీలో చెప్పారు. అంతేకాక మిగిలిన దేశాలతో పోలిస్తే ఇండియాలోనే ఈ బ్యాక్టీరియాతో మరణాలు అధికశాతం నమోదవుతున్నట్లు వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి సుమారు 1,65,000 మెలియోఐడోసిస్ కేసులను గుర్తిస్తే, దీని బారిన పడి సుమారు 89 వేలమంది చనిపోతున్నట్లు నివేదికలు చెప్తున్నాయి. తమ అంచనాల ప్రకారం సుమారు 45 దేశాల్లో ఈ బ్యాక్టీరియా వ్యాపించి ఉందని పరిశోధకులు చెప్తున్నారు. మరో 34 దేశాల్లో ఈ క్రిములు వ్యాపించి ఉన్నా వాటిని గుర్తించలేదని నేచర్ మైక్రోబయాలజీ పత్రిక పేర్కొంది. ఈ భయంకర క్రిములు ఎక్కువగా ఈశాన్య ఆసియా, ఉత్తర ఆస్ట్రేలియాలోని వ్యాపించి ఉన్నాయని జ్వరం, మూర్ఛ, శ్వాసకోశాలకు సంబంధించిన అసౌకర్యం కలిగి ఉండటం ఈ వ్యాధి లక్షణాలని అంటున్నారు. ముఖ్యంగా భారత దేశంలో పెద్ద తరహా నిర్మాణాలతో.. ఆయా ప్రదేశాల్లో గాలితో ఎగిరే దుమ్ము, మట్టి వల్ల ఈ వ్యాధి మరింత సులభంగా వ్యాప్తి చెందుతుందని చెప్తున్నారు. అయితే ఈ వ్యాధికి ఇంకా ఎటువంటి ముందస్తు టీకాలు కనిపెట్టలేదని, ఒక్కసారి సోకిందంటే చికిత్స కాస్త కష్టమేనని పరిశోధకులు అంటున్నారు. మధుమేహం, మూత్రపిండాల వ్యాధులతో బాధపడే వారికి ఈ బ్యాక్టీరికా మరింత త్వరగా సోకే అవకాశముందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. -
మడ్ ఫెస్టివల్..
-
రైల్వేలైన్ పేరిట మట్టి దందా!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: పెద్దపల్లి-నిజామాబాద్ న్యూ బ్రాడ్‌గేజ్ రైల్వేలైను నిర్మాణంలో భాగంగా నిజామాబాద్ జిల్లా ఆర్మూరు ప్రాంతంలో జరుగుతున్న పనుల కోసం చేపట్టిన మట్టి, మొరం తవ్వకాల వివాదం ముదురుతోంది. నిబంధనలకు విరుద్ధంగా చెరువుల్లో సాగిన అక్రమ మట్టి, మొరం తవ్వకాలపై ఓ వైపు ‘పిల్’ దాఖలు కాగా.. మరోవైపు ఆ చెరువులను వదిలేసిన కాంట్రాక్టు సంస్థలు ఏకంగా ప్రభుత్వ భూముల్లోనే తవ్వడం వివాదాస్పదం అవుతోంది. ఆర్మూరు-నిజామాబాద్ మధ్య సాగుతున్న ఈ రైల్వేలైను పనుల కోసం నిబంధనలకు విరుద్ధంగా రాంచంద్రపల్లి సింగసముద్రం, ధర్పల్లి మండలం లోలం చెరువుల నుంచి రూ.8 కోట్ల విలువ చేసే 4 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి, మొరం తవ్వకాలు జరిపి ఆ చెరువులను పూర్తిగా విచ్ఛిన్నం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదే సమయంలో మాక్లూరు, జక్రాన్‌పల్లి మండలాల్లోని రాంచంద్రపల్లి, మునిపల్లిలలో ప్రభుత్వ స్థలాల్లో అనుమతుల పేరిట నిబంధనలను గాలికి వదిలి తవ్వకాలు చేపట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చెరువుల్లో నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరిపారని వరంగల్ జిల్లాకు చెందిన రేవూరి నారాయణ రెడ్డి అండ్ సన్స్ ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్, మిలీనియం కన్స్ట్రక్షన్స్, జీవీఆర్ కన్స్ట్రక్షన్స్ సంస్థల జాయింట్ వెంచర్‌పై ప్రజా ప్రయోజనాల వాజ్యం (పిల్) దాఖలైంది. కాంట్రాక్టు సంస్థలతో పాటు అప్పటి జిల్లా కలెక్టర్ సహా నీటిపారుదల, మైనింగ్, రెవెన్యూ అధికారులు14 మందిని కూడా చేర్చారు. ఈ ‘పిల్’పై సీరియస్‌గా స్పందించిన హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, జస్టిస్ ఎస్.వి.భట్ సెప్టెంబర్ 7న హైకోర్టుకు హాజరై తగిన ఆధారాలను సమర్పించాలని నోటీసులు జారీ చేశారు. ఇదే సమయంలో నిబంధనలకు విరుద్ధంగా మాక్లూరు మండలం రాంచంద్రపల్లి, జక్రాన్‌పల్లి మండలం మునిపల్లిల్లో ప్రభుత్వ భూముల్లో తవ్వకాలకు అనుమతులు ఇచ్చిన రెవెన్యూశాఖ మరో వివాదానికి తెర లేపింది. మట్టి, మొరం తవ్వకాల అనుమతుల విషయంలో రాంచంద్రపల్లి, మునిపల్లి గ్రామాల రైతులపై ఒకతీరుగా వ్యవహరించిన రెవెన్యూ, మైనింగ్ శాఖలు, రైల్వేలైన్ కాంట్రాక్టు సంస్థలకు అనుకూలంగా స్పందించాయి. మునిపల్లికి చెందిన బాయి లింబన్న అనే రైతు 53/1 సర్వేనంబర్ (ప్రస్తుతం కాంట్రాక్టు సంస్థలు తవ్వకాలు జరుపుతున్న ప్రభుత్వ భూమి)లో పంటచేల అవసరాల కోసం కొద్దిపాటి తవ్వకానికి అనుమతించాలని ఐదు నెలల క్రితం దరఖాస్తు చేసుకున్నారు. ఎన్వోసీ ఇచ్చినట్లే ఇచ్చిన రెవెన్యూ అధికారులు.. ఆ పరిసరాల్లో ఉన్న చర్చి, హైస్కూల్, హౌసింగ్‌బోర్డు కాలనీవాసులు వ్యతిరేకిస్తున్నారనే సాకుతో ఆయన ఫైలు డిప్యూటీ డెరైక్టర్ (మైనింగ్ ) కార్యాలయూనికి చేరే స్థాయిలో నిలిపివేశారు. ఇప్పుడు అదే సర్వే నంబర్, అదే భూమిలో పెద్ద ఎత్తున యంత్రాలతో తవ్వకాలు, భారీ వాహనాల్లో మొరం రవాణా చేసేందుకు కాంట్రాక్టు సంస్థలకు ఎన్వోసీ జారీ చేశారు. మునిపల్లి శివారులోని 53/1 సర్వే నంబర్లో 2.16 ఎకరాల్లో తవ్వకాలు జరిపేందుకు అనుమతులు ఇచ్చారు. అదే విధంగా మాక్లూరు మండలం రాంచంద్రపల్లి శివారులో 4.2 ఎకరాల ప్రభుత్వ భూమిలో సైతం తవ్వకాలకు అనుమతులు ఇచ్చారు. అధికారులు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై ఈ మేరకు అనుమతులు ఇస్తున్నారన్న ఆరోపణలున్నాయి. -
పట్టపగలే మొరం దోపిడీ..!
రైల్వే లైన్ పేరిట దోచుకున్నారు.. * అనుమతులపై అధికారులు తలోమాట * రూ.8 కోట్ల మొరం తీశారని హైకోర్టులో ‘పిల్’ * ఎంసీ, జీవీఆర్, ఆర్ఎన్ఆర్ సంస్థలకు నోటీసులు * కలెక్టర్, ఇరిగేషన్ ఎస్ఈ తదితరులకు కూడా జారీ సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: పెద్దపల్లి-నిజామాబాద్ బ్రాడ్‌గేజ్ రైల్వేలైన్ నిర్మాణంలో భాగంగా ఆర్మూరు ప్రాంతంలో జరుగుతున్న పనులు వివాదాస్పదంగా మారాయి. ఆర్మూరు-నిజామాబాద్‌ల మధ్యన సాగుతున్న ఈ రైల్వేలైన్ పనుల కోసం నిబంధనలకు విరుద్ధంగా రాంచంద్రపల్లి సింగసముద్రం, ధర్పల్లి మండలం లోలం చెరువుల నుంచి లక్షలాది క్యూబిక్ మీటర్ల మొరం, మట్టి అక్రమంగా తవ్విన వ్యవహారం ఇప్పుడు కోర్టు చెంతకు చేరింది. సుమారు రూ. 8 కోట్ల విలువ చేసే 3.50 లక్షల క్యూబిక్ మీటర్ల మొరం అక్రమంగా తీశారంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్)పై హైకోర్టు సీరియస్‌గా స్పందించింది. రైల్వేలైన్ నిర్మాణ పనులు దక్కించుకున్న రేవూరు నారాయణ రెడ్డి అండ్ సన్స్ ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్, జీవీఆర్ కన్స్ట్రక్షన్, మిలీనియం కన్స్ట్రక్షన్ల జాయింట్ వెంచర్ కాంట్రాక్టు సంస్థలతో పాటు జిల్లా కలెక్టర్, నీటిపారుదలశాఖ ఎస్ఈ, నిజామాబాద్ ఈఈ, నిజామాబాద్ ఆర్డీవో సహా 14 మందిని బాధ్యులను చేస్తూ హైకోర్టు తాత్కాలిక గౌరవ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, జస్టిస్ ఎస్.వి.భట్లు ఇటీవల నోటీసులు జారీ చేశారు. సెప్టెంబర్ 7న కౌంటర్ దాఖలు చేసేందుకు ఆధారాలతో కోర్టుకు హాజరు కావాలని హైకోర్టు నీటిపారుదలశాఖను ఆదేశించగా... నిబంధనలకు విరుద్ధంగా చెరువుల నుంచి అక్రమ మొరం తవ్వకాల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. పథకం ప్రకారం తవ్వకాలు... పెద్దపల్లి-నిజామాబాద్ బ్రాడ్‌గేజ్ రైల్వేలైన్ నిర్మాణంలో భాగంగా నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూరు-నిజామాబాద్ లైను పనుల కోసం అర్హత కలిగిన కాంట్రాక్టు సంస్థల ద్వారా రూ.43 కోట్లతో పనులు నిర్వహించేందుకు టెండర్లు నిర్వహించారు. వరంగల్ జిల్లాకు చెందిన రేవూరి నారాయణ రెడ్డి అండ్ సన్స్ ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్, మిలీనియం కన్స్ట్రక్షన్స్, జీవీఆర్ కన్స్ట్రక్షన్స్ సంస్థలు జాయింట్ వెంచర్‌గా టెండర్ల ప్రక్రియ ద్వారా రూ. 50 కోట్లకు దక్కించుకున్నాయి. ఒప్పందంలో ైరె ల్వే లైన్ మట్టికట్టల కోసం మొత్తం 16.15 లక్షల క్యూబిక్ మీటర్ల మొరం అవసరమని అంచనా వేసిన రైల్వేశాఖ.. కాంట్రాక్టర్లు ఆ మొరం కొనుగోలు చేసేందుకు క్యూబిక్ మీటర్‌కు రూ.164.84 చెల్లించేందుకు అంగీకరించింది. ఈ మేరకు సదరు కాంట్రాక్టు సంస్థలు ప్రభుత్వం నుంచి కానీ, పట్టాదారుల నుంచి కానీ కొనుగోలు చేయాల్సి ఉండగా... ఆర్మూరు-నిజామాబాద్ ప్రధానరహదారిని ఆనుకొని ఉన్న మాక్లూరు మండలం రాంచంద్రపల్లిలోని సిం గసముద్రం, ధర్పల్లి మండలం లోలం చెరువులపై క న్నేశాయి. పథకం ప్రకారం రాంచంద్రపల్లి గ్రామాభివృద్ధి కమిటీ, సర్పంచ్ల ద్వారా అనుమతి ఇవ్వాలంటూ రెవెన్యూ, నీటిపారుదల శాఖలకు లేఖలు ఇప్పించారు. అప్పటికే కాంట్రాక్టు సంస్థలు చెరువుల్లో మొరం తవ్వకాలు ప్రారంభించాయి. అం తకు ముందే (జూన్ 27న) రాంచంద్రాపూర్ చెరువులో నీటిపారుదల శాఖ అసిస్టెంట్ ఇంజినీర్ జి.గంగారాం ఐదుగురు ప్రభుత్వ ఉద్యోగుల సమక్షంలో నిర్వహించిన పంచనామా ప్రకారం సింగసముద్రం చెరువులో మొరం తవ్వకాలకు అనుమతి ఇవ్వడం సాధ్యం కాదని తేల్చారు. ఈ కాపీలను నీటిపారుదలశాఖ ఈఈ, ఆర్మూరు డిప్యూటీ ఈఈ, నిజామాబాద్ ఆర్డీవో, మాక్లూరు ఎస్ఐ, తహసీల్దార్లకు ఇచ్చినా.. అక్రమ మొరం తవ్వకాలను నియంత్రించలేకపోయా రు. ఈ నివేదికలను పక్కనబెట్టి సింగసముద్రం, లోలం చెరువుల్లో నిబంధనలకు విరుద్ధంగా మొరం తవ్వకాలకు అనుమతులు ఇవ్వగా.. ఇష్టారాజ్యంగా సాగిన ఈ తవ్వకాలపై పి. నరేందర్‌రెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో ‘పిల్’ దాఖలు చేయడం చర్చనీయాంశంగా మారింది. నిబంధనల ఉల్లంఘన అభివృద్ధి పథకం పేరుతో కాంట్రాక్టు సంస్థలు సాగించిన డే లైట్ రాబరీ (పట్టపగలు దోపిడీ) ‘పిల్’తో వెలుగుచూడటం అందరినీ ఆశ్చర్యపరిచింది. సింగసముద్రం, లోలం చెరువుల్లో అనుమతులు పేరిట ఆ చెరువులతో పాటు ఆర్మూరు-నిజామాబాద్ రహదారి పక్కన కనిపించిన చోట మొరం తవ్వకాలను సాగించిన కాట్రాక్టర్లు రూ.8 కోట్ల విలువ చేసే మొరంను వినియోగించినట్లు అంచనా. చెరువుల్లో నిజంగానే అనుమతి ఇచ్చినా... చెరువు కట్ట 10 మీటర్ల ఎత్తుంటే 100 మీటర్ల దూరంలో స్లూయిస్ (తూములు) ఎత్తుకే మొరం తీయాలి. చెరువు కట్ట నుంచి 300 మీటర్ల దూరంలో కేవలం 2 మీటర్ల లోతు వరకే తీయాలన్న నిబంధనలను తుంగలో తొక్కి కాంట్రాక్టు సంస్థ నిర్వాహకులు చెరువు కట్టకు సమీపంలో 2 మీటర్ల కంటే అధికంగా మట్టి తవ్వి తరలించారు. మొరం తీసే క్రమంలో ఏ నష్టం జరిగినా వారే బాధ్యులు కాగా, ఫుల్ ట్యాంక్ లెవెల్ (ఎఫ్టీఎల్)లోనే ఉండాలి. సింగసముద్రం చెరువులో ఏఈ గంగారాం పర్యవేక్షణలోనే మొరం తవ్వకాలు జరగాలి. కాని ఇవేమీ పట్టని కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా మొరం తీసి చెరువుల రూపురేఖలనే మార్చేశారు. ఇదిలా ఉంటే వరద కాల్వ మొరంను కూడ ప్రభుత్వం క్యూబిక్ మీటర్‌కు రూ.54.50 చొప్పున విక్రయిస్తోంది. సీనరేజ్ చార్జ్ కలిపితే క్యూబిక్ మీటర్‌కు రూ.76.50లు పడుతుంది. ఇదే లెక్కన చిన్ననీటి వనరుల నుంచి మొరం తీసే కాంట్రాక్టు సంస్థల నుంచి ఎందుకు వసూలు చేయకూడదన్న ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. ఇంత జరుగుతున్నా.. అన్ని స్థాయిల్లో అధికారులు కాంట్రాక్టు సంస్థల నిర్వాహకులతో జత కట్టడంతో చెరువులు, గుట్టలు, ప్రభుత్వభూముల్లో నుంచి మట్టి తీస్తూ.. క్యూబిక్ మీటర్‌కు రూ.164.84 చొప్పున కాంట్రాక్టర్లు జేబులో వేసుకుంటున్నారన్న చర్చ బహిరంగంగా సాగుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం రంగంలోకి దిగి అక్రమంగా తవ్విన మట్టికి లెక్కలు కడితే... సుమారు రూ.8 కోట్ల మేరకు సర్కారు ఖజానాకు చేరుతాయంటున్నారు. -
విజి‘లెన్స్’ ఎక్కడ!
ఇసుక, మట్టి.. ఏడాది కాలంగా జిల్లాలోని ప్రజాప్రతినిధులు మొదలుకుని అధికార పార్టీ కార్యకర్తల వరకు అందరికీ అవే ప్రధాన ఆదాయ మార్గాలుగా మారాయి. జిల్లాలోని ముగ్గురు ప్రజాప్రతి నిధులైతే కేవలం ఇసుక, మట్టి విక్రయాల ద్వారానే ఈ ఏడాది కాలంలో రూ.కోట్లకు పడగలెత్తారంటే అతిశయోక్తి కాదు. ఎనిమిది నెలలుగా ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు చేపట్టి అక్రమంగా తరలించిన నేతలు ఇప్పుడు ర్యాంపుల్లో గట్ల వెంబడి ఉన్న ఇసుక నిల్వలనూ వదలడం లేదు. వర్షాకాలం నేపథ్యంలో ముందుజాగ్రత్తగా అధికారులు కొన్ని ర్యాంపుల వద్ద నిల్వ చేసిన ఇసుకను సైతం అక్రమార్కులు తరలించేస్తున్నారు. ఆయా నియోజకవర్గాల ప్రజాప్రతినిధుల కనుసన్నల్లోనే ఇసుక మాఫియా పేట్రేగిపోతుందనేది బహిరంగ రహస్యం. పోలవరం, గూటాల, కొవ్వూరు ర్యాంపుల నుంచి జీలుగుమిల్లి మీదుగా ఇప్పటికీ భారీ ఎత్తున ఇసుక తెలంగాణ రాష్ట్రంలోకి తరలిపోతోంది. నల్లజర్ల మండలం నబీపేట రేవులోని ఇసుకను స్థానిక సంస్థల ప్రతినిధి ఒకరు తన అనుచరులకు ఆదాయ మార్గంగా మలిచారు. పెదవేగి, నిడదవోలు, గోంగూర తిప్పలంక, మందలపర్రు, పెండ్యాల, కానూరు ర్యాంపుల నుంచే కాదు.. చివరకు మెప్మా అధికారుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఔరంగాబాద్ రేవు నుంచి కూడా ఇసుక భారీగా తరలిపోతోంది. మట్టి నుంచి నోట్ల కట్టలు పిండేశారు ఇక రైతులు తమ పొలాలను, పేదలు ఇళ్ల స్థలాలకు మెరక వేసుకునేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన నీరు-చెట్టు పథకాన్ని కూడా అధికార పార్టీ నేతలు అక్రమాల అడ్డాగా మార్చివేశారు. చెరువుల నుంచి తవ్విన మట్టిని రైస్‌మిల్లులు, పెట్రోలు బంకులు, టైల్స్ ఫ్యాక్టరీలకు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలించి రూ.లక్షలు ఆర్జించారు. జిల్లావ్యాప్తంగా 97 లక్షల 50 వేల 262 క్యూబిక్ మీటర్ల మట్టిని చెరువుల్లోంచి తవ్వినట్టు రికార్డుల్లో నమోదైన్నప్పటికీ ఇందులో రైతులు తమ అవసరాలకు తోలుకుంది మాత్రం 20 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి మాత్రమే. మిగిలిన 77లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తెలుగు తమ్ముళ్ల ఆదాయ వనరుగా మారిపోయింది. ఇదే మట్టిని ఆయా గ్రామ పంచాయతీల రోడ్లకు వినియోగించి బిల్లులు కూడా పెట్టుకున్నారంటే ఈ పథకంలో అవినీతి ఏ స్థాయిలో జరిగిందో ఊహించొచ్చు. గడువు ముగిసిన తర్వాత కూడా ఇప్పటికీ చెరువుల నుంచి మట్టి, గ్రావెల్‌ను తవ్వేస్తున్నారనేది స్వయంగా అధికారులు కూడా అంగీకరించే వాస్తవం. మరి నిఘా విభాగం ఏంచేస్తున్నట్టు? ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలపై ఉక్కుపాదం మోపాల్సిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల ఉనికి ప్రశ్నార్థకంగా మారడం అనుమానాలకు తావిస్తోంది. ర్యాంపులపై దాడులు చేపట్టి అక్రమార్కులకు పెనాల్టీలు విధించి.. అవసరమైతే కేసులు గట్టిగా జూలు విదల్చాల్సిన విజిలెన్స్ విభాగం చేష్టలు చూస్తోందన్న విమర్శలు ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా ఇసుకాసురులు పేట్రేగిపోతున్నా విజిలెన్స్ అధికారులు తమకేం పట్టనట్టే వ్యవహరించారు. కేవలం కిరోసిన్ హాకర్లు, హోటళ్లపై దాడులు చేస్తూ చిన్న చేపలపై ప్రతాపం చూపిస్తున్న ఈ కీలక విభాగం అధికారులు ఇసుక, మట్టి మింగే పెద్దచేపల జోలికి వెళ్లే సాహసం మాత్రం ఇప్పటివరకు చేయలేకపోయారు. నిద్రపోయేవాళ్లను లేపగలం కానీ, నిద్ర నటించే వాళ్లను మాత్రం లేపలేమంటారు. మరి విజిలెన్స్ అధికారులు నిజంగానే నిద్రావస్థలో ఉన్నారా.. లేక నిద్ర నటిస్తున్నారా అనేది పాలకులకే ఎరుక. - జి.ఉమాకాంత్, సాక్షి ప్రతినిధి, ఏలూరు -
మట్టి పోసి.. మ..మ అనిపించారు..
- షట్టర్ల కింది మట్టి తొలగింపులో నిర్లక్ష్యం - రింగ్బండ్తో పొంచి ఉన్న ముప్పు - ఆందోళనలో రామప్ప రైతులు వెంకటాపురం : రామప్ప సరస్సు లీకేజీ నీటిని అరికట్టేందుకు తాత్కాలికంగా మట్టితో ఆన కట్ట నిర్మించి ఐబీ అధికారులు చేతులు దులుపుకున్నారు. రామప్ప ప్రధాన తూము నుంచి మూడు రోజులుగా సరస్సు నీరు వృథాగా పోతుందని ‘సాక్షి’లో కథనాలు రావడంతో స్పందించిన అధికారులు ప్రొక్లెయినర్‌తో తూము ముందు చిన్న ఆన కట్ట నిర్మించి లీకేజీ నీటిని అదుపుచేశారు. కానీ షట్టర్ల కింద పేరుకుపోయిన మట్టి, రాళ్లను తొలగించాల్సిన పనిని మాత్రం మరిచారు. ఒక భారీ వర్షం కురిసిందంటే తూము ముందు పేరుకుపోయిన మట్టి, రాళ్లు తూములోకి వెళ్లి నిలిచిపోతారుు. అదే జరిగితే ప్రధాన తూము నుంచి ఆయకట్టు పొలాలకు రాబోయే రోజుల్లో చుక్కసాగునీరు కూడా అందే పరిస్థితులు కనిపించడం లేదు. రామప్ప సరస్సును నమ్ముకుని పంటలు సాగుచేసుకుంటున్న రైతాంగానికి ఇక గడ్డుకాలమే ఎదురుకానుంది. రింగ్‌బండ్ తొలగించకపోతే తమ పంటపొలాలు ఎండిపోయే పరిస్థితులు దాపురిస్తాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం లీకేజీ నీటిని అదుపు చేసిన నీటిపారుదల శాఖ అధికారులు భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలపై దృష్టి సారించడం లేదని విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు స్పందించి రింగ్‌బండ్‌ను తొలగించి షట్టర్ల కింద పేరుకుపోయిన మట్టి, రాళ్లను తొలగించాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. -
మట్టి మహిమ..
మట్టి కొట్టు టెక్నాలజీ, తీరిక లేనితనం, యాంత్రిక జీవనం తదితర కారణాలతో పాత పద్ధతులకు దూరమైన నగ ర జనం క్రమేణా అందులో ఉన్న గొప్పతనాన్ని గుర్తించడం మొదలుపెట్టారు. పెద్దల మాటలు, చేతలు అవి చేసే మేళ్లను ఒంట పట్టించుకుంటున్నారు. చేల గట్ల వెంబడి పారిన నీటిని తాగిన కాలం నుంచి మినరల్ వాటర్ లేనిదే ఉండలేని స్థితికి చేరుకున్న దశలను కాదనుకుని మట్టిలోని మాధుర్యాన్ని అనుభవించేందుకు సిద్ధమవుతున్నారు. ఒళ్లంతా బురదను పులుముకొని ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందుతున్నారు. బురదకు, ఆరోగ్యానికి లింకేమిటని ఆలోచిస్తున్నారా..? ఖచ్చితంగా ఉంది. సబ్బులు, షాంపూలు, కుంకుడు కాయలు కూడా లేని రోజుల్లో ఊరి బయటకు వెళ్లి అక్కడ లభించే రేగడి మట్టినేరుద్దుకుని స్నానం చేసేవారు. ఆ మట్టి స్నానం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని ప్రకృతి వైద్యశాస్త్రం చెబుతోంది. ఈ వేసవి నుంచి ఉపశమనాన్ని, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందేందుకు నేచర్‌క్యూర్ ఆస్పత్రుల్లో మడ్‌బాత్ (మృత్తిక స్నానం)ను ఆశ్రయిస్తున్నారు నగరవాసులు. కేవలం మడ్‌బాత్ కోసమే రోజుకు 20-25 మంది నేచర్‌క్యూర్ ఆస్పత్రికి వస్తున్నారు. - సనత్‌నగర్ కాలానుగుణంగా చికిత్స... పంచభౌతికమైన శరీరానికి మట్టితో ఇక్కడ చికిత్స చేస్తున్నారు. మట్టిని పట్టీలుగా గానీ, రోగగ్రస్థమైన అవయవంపై లేపనంగా గానీ పూయడం వల్ల ఉపశమనం లభిస్తుంది. ఈ చికిత్సను రోగిని అనుసరించి గానీ, వాతావరణం, కాలాలను అనుసరించి గానీ తీసుకోవాల్సి ఉంటుంది. ఎండ తీవ్రతను బట్టి మృత్తిక చికిత్సలు ఉంటాయి. ఈ చికిత్సకు జిగురుతత్వాన్ని కలిగిన బంక మన్ను (రేగడి మన్ను)ను ఉపయోగిస్తారు. రోగమేదైనా పట్టీ ఒక్కటే... ► సహజంగా మట్టిపట్టీని రోగి ఉపవాస కాలంలో రోజుకు రెండుసార్లు (ఉదయం 6 గంటలు, మధ్యాహ్నం 3 గంటలకు) వేయడం ద్వారా శరీరంలోని ఉష్ణోగ్రత మామూలు స్థితికి వస్తుంది. ఠఎంతటి తీవ్రమైన జ్వరమొచ్చినా రెండు మూడు రోజుల్లో తగ్గించే శక్తి మట్టిపట్టీలకు ఉంటుంది. ►పేగుల్లో మండనం (మురుగు) లేకుండా చేస్తుంది. ఆంత్రవ్రణములు, అమీబియాసిస్ తదితర వ్యాధులకు మట్టి పట్టీలు రోజుకు రెండు నుంచి మూడుసార్లు వేసుకోవడం ద్వారా కొద్దిరోజులకే తగ్గుతాయట. మందులు వాడాల్సిన అవసరం అసలే ఉండదు. ఠచీము, రక్త విరేచనాలు, నీళ్ల విరేచనాలు ఒకటి రెండు రోజుల్లో నివారించవచ్చు. ►మహిళలకు వచ్చే గైనిక్ ప్రాబ్లమ్స్‌కు మట్టిపట్టీలు రోజుకు మూడు లేదా నాలుగుసార్లు రెండు గంటల వ్యవధి చొప్పున వేసుకోవడం ద్వారా సత్ఫలితాలు ఉంటాయని ప్రకృతి వైద్య నిపుణులు చెబుతున్నారు. మూత్రం రాకుంటే మట్టి లేపనం... నానిన రేగడిమట్టిని ఇక అంగుళం మందంతో పొట్ట భాగంలో లేపనం చేస్తారు. దీని ద్వారా మలబద్దకం, జ్వరం, అతి విరేచనాలు, రక్త గ్రహణి, ఆంత్రవ్రణములతో బాధపడుతున్న వారు ఉపశమనం పొందవచ్చు. మూత్రం మంటగా ఉన్నప్పుడు పొత్తి కడుపుపై మట్టి గానీ, మట్టిపట్టీలు గానీ వేయడం వల్ల మంట వెంటనే తగ్గుతుంది. మూత్రం రానిచో పొత్తి కడుపును కాపడం చేసి మట్టిపట్టీలు గానీ, మట్టి లేపనం గానీ చేసినట్లయితే సత్ఫలితాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. పక్షవాతం, పోలియోలకూ... రోగిని ఒక స్టూలుపై కూర్చోబెట్టి బాగా నానిన రేగడి మట్టిని కాళ్లకు, చేతులకు లేపనం చేసి 10 నిమిషాల తరువాత స్నానం చేయించాలి. దీని ద్వారా కండరవాతం, మేహవాతం, చేతులు, కాళ్ల మంటలు, పగుళ్లు తీపులు, వాపులు తదితర సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ముఖ్యంగా సంధివాతం, పక్షవాతం, పోలియో తదితర వ్యాధులతో బాధపడుతున్న వారికి ఈ చికిత్స ఎంతో ఉపకరిస్తుందని వైద్యులు చెబుతున్నారు. నవ నాడులను ప్రేరేపిస్తుంది వీపుభాగంలో, నడుముకు అంగుళం మందంతో నానిన మట్టిని లేపనం చేసి 10 నిమిషాలు ఉంచిన తరువాత మట్టిని తీసివేసి స్నానం చేయించాలి. వెన్ను దేహమునకు కేంద్ర స్థానం కావడం వల్ల మెదడును, నవ నాడులను చల్లబరిచి చురుకుగా పనిచేసేలా మట్టి లేపనం ఎంతో సహాయపడుతుంది. గుండెజబ్బులైనా సరే.. రోగిని బల్లపై గానీ, నేలపై గానీ పడుకోబెట్టి ఒక అంగుళం మందంతో ఛాతి భాగమంతా మట్టి లేపనం చేస్తారు. దీని ద్వారా ఛాతినొప్పి, మంట, గుండె జబ్బులు, రక్తపోటు తదితర వ్యాధులతో బాధపడుతున్నవారు ఉపశమనం పొందవచ్చు. తలను నీటితో తడిపి నానిన రేగడిమట్టిని పూస్తారు. 15 నిమిషాల పాటు ఎండలో ఉన్న తరువాత శిరస్నానం చేయాలి. పురుషులే కాకుండా స్త్రీలు కూడా ఈ రకమైన తలమట్టి స్నానం చేయవచ్చు. దీని ద్వారా తలలో ఉండే చుండ్రు, జుట్టు ఊడిపోవడం, పండిపోవడం, పేలు కొరుకుడు, తలనొప్పి, కళ్ల మంటలు, నీరుకారడం, దృష్టి లోపం, కంటి, చెవి, ముక్కు వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చని వైద్యులు చెబుతున్నారు. అలాగే ఉన్మాదం, హిస్టీరియా, నిద్రలేమితనంతో బాధపడేవారికి ఎంతో ఉపయోగం. తల నుంచి పాదాల వరకు శరీరం మొత్తం నానిన రేగడి మట్టిని పూసుకుని 30 నిమిషాల తరువాత మట్టిని తీసివేసి స్నానం చేయాలి. మృత్తిక స్నానం వల్ల అన్ని రకాల చర్మవ్యాధులు, మొటిమలు మొదలుకొని గజ్జి, తామర, నల్లమచ్చలు, ఎర్రమచ్చలు, తెల్ల మచ్చలు, తెల్ల పొడలు, మేహం, దారుణం, అతి ఉష్ణం, కుష్టు, చర్మం పగుళ్లు తదితర అన్ని చర్మ వ్యాధుల నివారణకు మృత్తికా స్నానం ఎంతో ఉపయోగపడుతుంది. పాము కాటుకు భూగర్భ స్నానం... తల బయట ఉంచి భూమిలో శరీరం మొత్తాన్ని గానీ, వ్యాధి సోకిన అవయవాన్ని గానీ 10 నుంచి 30 నిమిషాల వరకు ఉంచడమే భూగర్భ స్నానం. దీని ద్వారా పక్షవాతం, పోలియో, కండరవాతం, సంధివాతం, గూని, పోలియో, చర్మవ్యాధులు, కుష్టు, బొల్లి తదితర రోగాలను నయం చేయొచ్చని వైద్యులు చెబుతున్నారు. పాముకాటుకు ఈ స్నానం ఎంతగానో ఉపయోగపడుతుందట. పాము కరిచినప్పుడు రోగిని అడ్డంగా అరగజం లోతు గొయ్యి తవ్వి తల బయటకు ఉంచి మట్టితో కప్పి కొన్ని గంటల వరకు ఉంచితే పాము విషం హరిస్తుందని వైద్యులు చెబుతున్నారు.భూమిలోని అయస్కాంత శక్తితో పాటు సేంద్రీయ లవణాల వల్ల శరీరంలోని ఎన్నో రోగాలు నివారించ వచ్చంటున్నారు. వేసవిలో ఆదరణ బాగుంటుంది... వేసవిలో మడ్‌బాత్‌కు ఎంతో ఆదరణ ఉంటుంది. ఎందుకంటే సూర్యరశ్మి ఉన్నప్పుడే మడ్‌బాత్ చేయాలి. దీని ద్వారా వేసవి తాపం నుంచి ఉపశమనం పొందడంతో పాటు ఒంట్లోని ఎన్నో రకాల రుగ్మతలను తొలగించుకోవచ్చని ప్రకతి వైద్య శాస్త్రం ద్వారా నిరూపితమైంది. అయితే వైద్యుల పర్యవేక్షణలో చేసుకోవాల్సి ఉంటుంది. నేచర్‌క్యూర్‌లో రోజుకు 20 మంది వరకు మడ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. మంగళ, గురు, శనివారాల్లో మహిళలకు, సోమ, బుధ, శుక్ర వారాల్లో పురుషులకు మృత్తిక చికిత్స చేస్తున్నాం. డాక్టర్ ఎంవీ మల్లికార్జున్, సూపరింటెండెంట్, నేచర్‌క్యూర్ ఆస్పత్రి, అమీర్‌పేట్ -
మట్టి లేకుండా సేంద్రియ ఇంటిపంటలు!
టై మీద, పెరట్లో మట్టి వాడకుండా హైడ్రోపోనిక్స్ పద్ధతిలో కూరగాయలు, ఆకుకూరలను సేంద్రియ పద్ధతుల్లో పెంచుకునే అవకాశం ఉంది. వీటితోపాటు మంచినీటి చేపలు లేదా అక్వేరియం చేపలను కూడా కలిపి ఆక్వాపోనిక్స్ పద్ధతిలో సాగు చేయవచ్చని స్వానుభవంతో చెబుతున్నారు డా. ఎన్ఎంకే సూరి. బాల్కనీల్లో, టైల పైన, పెరట్లో మట్టి లేకుండానే కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, ఔషధ మొక్కలు పెంచుకోవాలంటే సులువైన విధానం హైడ్రోపోనిక్స్. కొబ్బరి పొట్టులో వర్మీకంపోస్టు(2:1 నిష్పత్తిలో) కలిపి సేంద్రియ ఇంటిపంటగా రసాయన రహిత ఆహారాన్ని పెంచుకోగల అవకాశాలు మెండు. తక్కువ నీటి వసతి ఉన్న చోట ఈ పద్ధతి బాగా ఉపయోగ పడుతుంది. ఆక్వాపోనిక్ పద్ధతి ద్వారానైతే.. ప్రత్యేకంగా నీరు పోయాల్సిన శ్రమ ఉండదు. అదనంగా చేపలు కూడా పెంచుకోవచ్చు. చేపలు పెంచుకోవడానికి అక్వేరియం ఒకటి ఏర్పాటు చేసుకొని, దానిలో నుంచి చేపల నీటిని పంపు ద్వారా మొక్కలకు అందేలా పైపు అమర్చుకోవాలి. అక్వేరియంలో నీటిని మార్చే శ్రమ కూడా వద్దనుకుంటే, మొక్కలకు అందించిన నీటినే తిరిగి అక్వేరియంలోకి చేరేలా మరో పైపును అమర్చి నిరంతర నీటి ప్రవాహం జరిగే ఏర్పాటు కూడా చేసుకోవచ్చు. అక్వేరియం, మొక్కల కుండీలు, మోటారు పంపు, పైపులు ఏ సైజులో ఎట్లా ఉండాలి? అనేది మీరు ఎంపికచేసుకునే స్థలాన్ని బట్టి ఉంటుంది. తినడానికి పనికివచ్చే మంచినీటి కార్పు చేపలు లేదా అక్వేరియానికి పనికి వచ్చే ఆర్నమెంటల్ ఫిష్ గానీ, మన అవసరాన్ని బట్టి ప్లాన్ చేసుకోవాలి. మొక్కలను కుండీల్లో పెట్టుకోవచ్చు లేదా వీలైన సైజులో ఒక గ్రోటబ్ను ఏర్పాటు చేసుకోవచ్చు. అందులో అక్వేరియం సామగ్రిని అమ్మే వారి వద్ద దొరికే స్టోన్స్(3/4‘)ను నింపుకొని.. ఆ టబ్‌లో ఆకుకూరలు, కూరగాయ మొక్కలను నాటుకోవచ్చు. పోషకాలు అందేదెలా? చేపల విసర్జితాలు కలిసే నీరే మొక్కలకు ప్రధాన పోషక వనరు. జీవామృతం లేదా వర్మీ వాష్ వంటి ద్రావణ ఎరువులను అదనంగా వాడొచ్చు. ఆకుకూరల మొక్కలకు వారానికోసారి, కూరగాయపంటలకు వారానికి రెండుసార్లు వాడాలి. సాధారణంగా చెరువుల్లో పెరిగే రోహు, తిలాపియా వంటి ఏ చేపలనైనా పెంచొచ్చు. ఇవి ఎదగడానికి 6-9 నెలల కాలం పడుతుంది. ట్యాంకు సైజు ఎంత పెద్దగా ఉంటే చేపలు అంత బాగా పెరుగుతాయి. ఆక్వాపోనిక్స్ను ఇంటి పెరట్లో ఏర్పాటు చేసుకుంటే మంచిది. స్టెయిన్లెస్ స్టీల్ ఆక్వాపోనిక్స్ వ్యవస్థను ఇంట్లో పెట్టుకోవచ్చు. మా టై మీద ప్లాస్టిక్ ట్యాంకులలో 4’్ఠ4’్ఠ4’ ప్రయోగాత్మకంగా ఆక్వాపోనిక్స్ వ్యవస్థను ఏర్పాటు చేసి సత్ఫలితాలు సాధించాను. దీన్ని 30’్ఠ20’ లకు విస్తరింపచేయబోతున్నాను. ఔత్సాహికులు చిన్న అక్వేరియం అంతటి పాత్రలను ఏర్పాటు చేసుకొని సేంద్రియ ఆక్వాపోనిక్స్ పద్ధతిలో అలవాటు చేసుకోవచ్చు. అక్వేరియం చేపలు, మొక్కల పెంపకం గురించి కొంత అవగాహన ఉన్న వారికి ఆక్వాపోనిక్స్ అంతగా కష్టమేమీ అనిపించదు. సేంద్రియ ఇంటిపంటల సాగుపై ఆసక్తి ఉన్న వారికి ఇదొక మంచి ప్రత్యామ్నాయం. - డా. ఎన్ఎంకే సూరి, నాగోల్, హైదరాబాద్