సాక్షి, విజయవాడ: ఏపీ బీజేపీ ఆధ్వర్యంలో శంఖానాదం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా బీజేపీ సోషల్ మీడియా, ఐటీ ప్రతినిధులకు రాష్ట్రస్థాయి వర్కషాపు నిర్వహిస్తున్నారు. ఏపీ బీజేపీ కార్యకర్తలకు శిక్షణ ఇచ్చేందుకు ఢిల్లీ నుంచి బీజేపీ సోషల్ మీడియా ఇన్‌చార్జ్ పునీత్ జీ రాష్ట్రానికి వచ్చారు.
ఈ మేరకు ఏపీ బీజేపీ అధ్యక్షరాలు పురందేశ్వరి మీడియాతో మాట్లాడుతూ.. ‘ఎన్నికల సమయానికి అందరూ సన్నధ్దం కావాలి. నేడు సోషల్ మీడియా ఎంతో కీలకంగా పనిచేస్తుంది. సమాజంలో సోషల్ మీడియా అంశాల పైనే చర్చ సాగుతుంది. సోషల్ మీడియా లో ఎలా పనిచేయాలో నేడు శిక్షణ ఇస్తాం. నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాక కేంద్రం అనేక సంక్షేమ పధకాలు అమలు చేసింది. ఎన్నికల సమర శంఖం పూరించేలా... శంఖానాదం అని పేరు పెట్టాం. మహిళల కోసం మోదీ ఒక అన్న గా అండగా నిలిచారు. మహిళల గౌరవం కోసం మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టారు.
నాడు కొంతమంది అవహేళనగా మాట్లాడారు. మహిళల పేరుతో ఇళ్ల నిర్మాణం చేశారు. మహిళల పై జరుగుతున్న దురాగతాలను నివారించే చర్యలు చేపట్టారు. మహిళల కు ప్రాధాన్యత ఇస్తూ మోదీ అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఉజ్జ్వల పధకం ద్వారా గ్యాస్ సిలిండర్లను అంద చేశారు. రాఖీ పండుగ సందర్భంగా సోదరీమణులు కోసం గ్యాస్ సిలిండర్ ధర తగ్గించారు. గ్రామ పంచాయతీల నిధులు మళ్లింపు పై మేము పోరాటం చేశాం. మా మిత్ర పక్షం జనసేన తో కలిసి ఆందోళనలు నిర్వహించాం.
నా భూమి, నాదేశం కార్యక్రమం బిజెపి జాతీయ స్థాయిలో చేపట్టింది. సెప్టెంబరు ఒకటి నుంచి 15 వరకు అన్ని గ్రామాల్లో మట్టిని సేకరిస్తాం. పట్టణాలు, నగరాల్లో బియ్యం సేకరిస్తాం.రెండో దశలో గాంధీ జయంతి వరకు సేవా కార్యక్రమాలు చేపడతాం. ఈ మట్టిని ఢిల్లీ తీసుకెళ్లి అక్కడ అన్ని రాష్ట్రాల మట్టితో అమృత వనం ఏర్పాటు చేస్తాం. ఈ మట్టి ఎలా పంపాలో రెండో దశలో ప్రజలకు వివరిస్తాం. రాష్ట్ర, జిల్లా స్థాయిలో ప్రతినిధులు సోషల్ మీడియా లో పని చేసేలా అవగాహన కల్పిస్తాం. ఎన్టీఆర్ ఆవిష్కరణలో మా కుటుంబం అంతా పాల్గొంది. మా తరువాత వారుసులు కూడా తాతపై ప్రేమతో పాల్గొన్నారు. ఎనిమిది మాసాల్లో ఎన్నికలు ఉన్నాయి అప్పటి కి పార్టీ ని సన్నద్ధం చేస్తున్నాం’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment