
మట్టిపెళ్లలు పడి ఇద్దరు దుర్మరణం
ఇల్లందు: ఖమ్మం జిల్లా ఇల్లందు మండలం జెకెఓసి నిర్వాసితుల కాలనీ సమీపంలో మట్టి తవ్వుతుండగా పెళ్లలు విరిగిపడి ఇద్దరు కూలీలు మృతి చెందారు. ఈ సంఘటన శనివారం ఉదయం జరిగింది. మట్టి లోడుచేసేందుకు ధనియాలపాడు తండా గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ట్రాక్టర్ తీసుకుని వెళ్లారు. మట్టిని తవ్వుతుండగా ఉన్నట్టుండి పెళ్లలు విరిగిపడ్డాయి. ఈ సంఘటనలో ఇద్దరు మృతిచెందగా, ఒకరు ప్రాణాలతో బయటపడ్డారు. గమనించిన స్థానికులు మృతదేహాలను వెలికితీశారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.