న్యూఢిల్లీ: చంద్రుని దక్షిణ ధ్రువం మీద సగర్వంగా జెండా పాతి చంద్రయాన్ –3 విజయనాదం చేసింది. దేశ దక్షిణ కొసన తమిళనాడులో మారుమూల విసిరేసినట్టుగా ఉండే నమ్మక్కల్‌లో సంబరాలు మిన్నంటాయి. ఎందుకంటే చంద్రయాన్ ప్రయోగాల్లో అక్కడి మట్టిదే ప్రధాన పాత్ర మరి! ఎందుకు, ఎలా అన్నది ఓ ఆసక్తికరమైన కథ...!
అంతరిక్షంలో ప్రయోగం పూర్తిగా శాస్త్రవేత్తల కంట్రోల్‌లో ఉండదు. ఉపగ్రహాలు, నింగిలోకి పంపేటప్పడు ఉపయోగించే వాటి పనితీరును భూమిపైనే పరిశీలిస్తారు. అంతరిక్షంలో ఉండే వాతావరణాన్ని భూమిపైనే ఏర్పాటు చేసి పరిశోధనలు చేస్తారు. 2008లో చంద్రయాన్–1 అనంతరం తర్వాతి ప్రయోగాలకు ఇస్రో సిద్ధమవుతున్న రోజులవి. చంద్రునిపై సఫ్ట్ లాండింగే లక్ష్యంగా చంద్రయాన్ –2 ను తయారు చేశారు. అది చంద్రునిపై దిగితే అందులోని రోవర్ బయటికి వచ్చి చంద్రుని నేలపై నడిచేలా ప్లాన్ చేశారు. అందుకోసం లాండర్‌ను ఎక్కడ దించాలి? రోవర్ ఎలా నడవాలి? ఇవన్నీ ప్రశ్నలే.
చదవండి: చంద్రుడి గుట్టు తెలుసుకొనేలా..
వాటికి సమాధానం వెదికేందుకు ఇస్రో సిద్ధమైంది. అందుకు చంద్రునిపై ఉండే మట్టి మాదిరి మట్టి కావాలి. అందుకోసం వెదుకులాట మొదలైంది. వారికి సరిపోయే మట్టి చెన్నైకు 400 కిలోమీటర్ల దూరంలో నమ్మక్కల్ లో దొరికింది. 2021లో అక్కడి నుంచి 50 టన్నుల మట్టి సేకరించారు. 2019లో చంద్రయాన్ –2 మిషన్‌లో ఆ మట్టితోనే ల్యాండర్, రోవర్ అడుగులను పరీక్షించారు. తాజాగా చంద్రయాన్ –3 ప్రయోగాలకు నమ్మక్కల్ మట్టినే వాడారు.
అది అనర్తో సైట్ మృత్తిక
‘చంద్రుని ఉపరితలం మీద ఉన్నది అనర్తో సైట్ రకం మృత్తిక. తమిళనాడులోని కొన్ని చోట్ల అదే రకం మట్టి ఉన్నట్టు మేం యాదృచ్ఛికంగా చేసిన భూగర్భ పరిశోధనల్లో తేలింది. కున్నమలై, సీతంపూంది వంటి నమ్మక్కల్ పరిసర ప్రాంతాల్లో అది పుష్కలంగా దొరికింది’అని పెరియార్ విశ్వవిద్యాలయం జియాలజీ ప్రొఫెసర్ అయిన ఎస్.అన్బళగన్ వెల్లడించారు.
చదవండి: చంద్రుడి గుట్టు తెలుసుకొనేలా..
Comments
Please login to add a commentAdd a comment