rover
-
Japan: ‘మూన్ స్నైపర్’ శీర్షాసనం!.. ఇదిగో అసలు ఫొటో
చంద్రుడి ఉపరితలంపై సజావుగా దిగి శోధించడానికి ‘స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్’ (స్లిమ్)ను జపాన్ ఏరో స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ ‘జాక్సా’ ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఈ ల్యాండర్ ముద్దు పేరు ‘మూన్ స్నైపర్’. భారత కాలమానం ప్రకారం ఈ నెల 19వ తేదీ రాత్రి 8:50 గంటలకు జాబిలి నేలపై ‘మూన్ స్నైపర్’ దిగడానికైతే మృదువుగా, సాఫీగానే దిగింది. కానీ.. పక్కకు డొల్లిపోయి ‘వెల్లకిలా పడిన తాబేలు’ మాదిరి తలకిందులు అయింది. ల్యాండింగ్‌లో సంభవించిన ఈ లోపం కారణంగా ‘జాక్సా’ ప్రస్తుతం భారీ మూల్యమే చెల్లించుకుంటోంది. చంద్రుడిపై తాను దిగడానికి కొన్ని క్షణాల ముందుగా ల్యాండర్ జారవిడిచిన రెండో రోవర్ (లూనార్ ఎక్స్కర్షన్ వెహికల్-2) ఈ ఫొటో తీసింది. సూర్యకాంతిని గ్రహించి, సౌరవిద్యుత్ ఉత్పత్తి చేసి ల్యాండర్ బ్యాటరీని ఛార్జ్ చేయాల్సిన సౌరఫలకాలు(సోలార్ ప్యానెల్స్)ప్రస్తుతం సూర్యుడికి అభిముఖంగా లేవు. చదవండి: ‘మూన్ స్నైపర్’ బతికేనా?.. అవి ల్యాండర్ తల భాగంలో (కింది వైపు) సూర్యుడికి వ్యతిరేక దిశలో (ఆవలి వైపు) ఉన్నాయి. చంద్రుడిపై 15 రోజులు పగలు, 15 రోజులు రాత్రి ఉంటాయి. చంద్రుడి ఈక్వెటర్ (చంద్రమధ్యరేఖ)కు దక్షిణంగా షియోలీ బిలం వాలులో సూర్యోదయ వేళలో ల్యాండర్ జాబిలిపై కాలుమోపాల్సింది పోయి ‘తలమోపింది’. ‘మూన్ స్నైపర్’ దిగిన ప్రదేశంలో ఇప్పుడు మధ్యాహ్న సమయం. అంటే.. ల్యాండర్ పై భాగంలో సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. సూర్యుడి కోణం మారి ఎండ కాస్త ఆవలి వైపునకు వెళితే సౌరఫలకాలకు సోకుతుంది. ప్రస్తుతం నిద్రాణ స్థితిలో ఉన్న ‘స్లిమ్’ వ్యోమనౌకలోని ఆన్‌బోర్డ్ బ్యాటరీలో 12% పవర్ మిగిలివుంది. వ్యోమనౌక సోలార్ ప్యానెళ్లకు సూర్యరశ్మి అందుబాటులోకొస్తే బ్యాటరీని పునఃప్రారంభించాలని (రీ-స్టార్ట్ చేయాలని) ‘జాక్సా’ తలపోస్తోంది. అప్పుడు ‘మూన్ స్నైపర్’ ల్యాండర్ కోలుకునే అవకాశాలు ఉంటాయి. ఈ ప్రయత్నంలో జపాన్ సఫలం కావాలని కోరుకుందాం. ఆ 100 మీటర్ల స్పాట్లోనే దిగాం అసాధారణ రీతిలో కచ్చితత్వంతో కూడిన (ప్రెసిషన్) ల్యాండింగులో సఫలమైనట్టు ప్రకటించిన జపాన్ అంతరిక్ష పరిశోధన సంస్థ ‘జాక్సా’. ఈ నెల 19న చంద్రుడిపై కాలుమోపే ఆఖరి అంకంలో ‘మూన్ స్నైపర్’లోని రెండు ప్రధాన ఇంజిన్లలో ఒక ఇంజిన్ పనిచేయడం ఆగిపోయిందట. ఫలితంగా వ్యోమనౌక చంద్రుడి ఉపరితలంపై షియోలి బిలం వాలులో సమతాస్థితి తప్పి, దొర్లి, శాస్త్రవేత్తలు నిర్దేశించిన లక్ష్యిత ప్రదేశం నుంచి నెమ్మదిగా 55 మీటర్ల ఆవలకు కొట్టుకెళ్లి అవాంఛిత స్థితి (భంగిమ)లో నిలిచిపోయిందని వెల్లడించిన ‘జాక్సా’. ఇంజిన్ సమస్యే కనుక లేకపోతే నిర్దేశిత ప్రాంతానికి 3-4 మీటర్ల సమీపంలోనే ల్యాండర్ బహుశా దిగి ఉండేదని సంస్థ తెలిపింది. మన ‘చంద్రయాన్-3’లోని ‘విక్రమ్’ ల్యాండర్ మాదిరిగానే ‘మూన్ స్నైపర్’ ల్యాండర్ కూడా చంద్రుడి ఉపరితలంపై మైనస్ డిగ్రీల్లో ఉండే రాత్రి వేళల అతి చలి ఉష్ణోగ్రతలను తట్టుకోలేదు. మరో వారం రోజుల లోపు సౌరవిద్యుత్ తయారై, దాని సాయంతో మేలుకుంటే ‘మూన్ స్నైపర్’ బతికినట్టు. లేదంటే ఆశలు వదిలివేసుకోవడమే! మరోవైపు... జాబిలి ఉపరితలంపై ముందుగా నిర్ణయించిన ప్రదేశంలోనే (లక్ష్యంగా నిర్దేశించిన 100 మీటర్ల స్థలి) దిగామో, లేదో నిర్ధారించేందుకు ల్యాండర్ పంపిన డేటాను ‘జాక్సా సవివరంగా విశ్లేషిస్తున్నట్టు మరికొన్ని కథనాలు వెల్లడించాయి. - జమ్ముల శ్రీకాంత్ -
చంద్రయాన్–3 ప్రస్థానం ముగిసినట్లేనా!
న్యూఢిల్లీ: Chandrayaan-3 చంద్రుడిపై నిద్రాణ స్థితిలో ఉన్న ల్యాండర్, రోవర్‌ను మళ్లీ మేల్కొలిపేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ల్యాండర్, రోవర్ నుంచి సంకేతాలు అందడం లేదని సైంటిస్టులు చెబుతున్నారు. దీంతో చందమామపై వాటి ప్రస్థానం ముగిసిపోయినట్లేనా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ల్యాండర్, రోవర్‌తో అనుసంధానం కోసం ఇస్రో సైంటిస్టులు ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. కాగా చంద్రయాన్–3 ప్రయోగం ద్వారా భారత్ చరిత్ర సృష్టించింది. చందమామ దక్షిణ ధ్రువంపై క్షేమంగా అడుగుపెట్టిన మొట్టమొదటి దేశంగా రికార్డుకెక్కింది. చంద్రయాన్–3 మిషన్‌లో అంతర్భాగమైన ల్యాండర్ విక్రమ్ ఆగస్టు 23న జాబిల్లి దక్షిణ ధ్రువంపై సురక్షితంగా దిగింది. అందులో నుంచి రోవర్ ప్రజ్ఞాన్ బయటకు వచ్చిన, చంద్రుడి ఉపరితలంపైకి చేరుకుంది. అవి రెండూ 14 రోజుల పాటు నిర్విరామంగా పనిచేశాయి. జాబిల్లిపై పరిశోధనలు జరిపి, విలువైన సమాచారాన్ని భూమిపైకి చేరవేశాయి. అనంతరం సెప్టెంబర్ 2న దక్షిణ ధ్రువంపై సూర్యాస్తమయం కావడంతో స్లీప్ మోడ్‌లోకి వెళ్లిపోయాయి. మళ్లీ సూర్యోదయం కావడంతో ఈ నెల 22న తిరిగి మేల్కోవాల్సి ఉంది. -
Chandrayaan 3: లాండర్, రోవర్ నుంచి సంకేతాలు లేవు
బెంగళూరు: జాబిలిపై పరిశోధనల కోసం ప్రయోగించిన చంద్రయాన్–3 తాలూకు లాండర్, రోవర్లతో సంబంధాలను పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు ఇస్రో శుక్రవారం ప్రకటించింది. విక్రమ్‌గా పిలుస్తున్న లాండర్, ప్రజ్ఞాన్‌గా పిలుస్తున్న రోవర్లను ఈ నెల మొదట్లో ఇస్రో సుప్తావస్థలోకి పంపడం తెలిసిందే. ఇప్పుడు అవి తిరిగి యాక్టివేట్ అయే స్థితిలో ఏ మేరకు ఉన్నదీ పరిశీలిస్తున్నట్టు పేర్కొంది. కానీ ఇప్పటిదాకా అయితే వాటినుంచి తమకు ఎలాంటి సంకేతాలూ అందలేదని వివరించింది. వాటిని కాంటాక్ట్ చేసే ప్రయత్నాలు కొనసాగుతూనే ఉంటాయని తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో పోస్ట్ చేసింది. సెపె్టంబర్ 20 దాకా చంద్రుని మీద రాత్రి వేళ. 14 రోజులు రాత్రి ఉంటుంది. అప్పుడక్కడ ఉష్ణోగ్రతలు ఏకంగా మైనస్ 120 డిగ్రీల దాకా పడిపోతాయి. దాంతో చంద్రయాన్ లాండర్, రోవర్ పాడయ్యే ప్రమాదముంది. అందుకే వాటిని ఇస్రో స్లీప్ మోడ్‌లోకి పంపింది. ఇప్పుడు పగటి సమయం కావడంతో వాటిని యాక్టివేట్ చేయాలని నిర్ణయించి ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టింది. -
చంద్రయాన్ -3: ఇస్రో కీలక అప్డేట్
చంద్రయాన్ 3 మిషన్ గురించి భారత అంతరిక్ష సంస్థ ఇస్రో కీలక అప్డేట్ అందించింది. చంద్రుడిపై నిద్రాణ స్థితిలో ఉన్న విక్రమ్ ల్యాండర్, ప్రగ్యాన్ రోవన్‌ను మేల్కొలిపే ప్రక్రియను ప్రారంభించినట్లు తెలిపింది. కాగా గత 14 రోజుల నుంచి చంద్రుడిపై చీకటి ఉండటంతో ల్యాండర్, రోవర్ స్లీప్ మోడ్‌లోకి వెళ్లిపోయాయి. ప్రస్తుతం జాబిల్లిపై సూర్మరశ్మి వెలుతురు పడటంతో నేడు(శుక్రవారం) వీటిని పునరుద్దరించేందకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ల్యాండర్ నుంచి తమకు ఎలాంటి సిగ్నల్స్ అందలేదని ఇస్రో పేర్కొంది. తమ ప్రయత్నాలను కొనసాగిస్తున్నామని చెప్పింది. చదవండి: చైనా కవ్వింపు.. అరుణాచల్ ఆటగాళ్ల వీసాలు రద్దు Chandrayaan-3 Mission: Efforts have been made to establish communication with the Vikram lander and Pragyan rover to ascertain their wake-up condition. As of now, no signals have been received from them. Efforts to establish contact will continue. — ISRO (@isro) September 22, 2023 కాగా ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 మిషన్ ఆగస్టు 23న విజయంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ అయిన విషయం తెలిసిందే. ల్యాండర్ దిగిన ప్రదేశాన్ని భారత్ ‘శివ శక్తి పాయింట్’గా నామకరణం చేసింది. ల్యాండర్ నుంచి రోవర్ బయటకు వచ్చి చంద్రుని ఉపరితలంపై విజయవంతంగా ప్రయోగాలు నిర్వహించింది. 14 రోజులపాటు అక్కడి వాతావరణ, నీటి పరిస్థితి, ఖనిజాల గురించి అధ్యయనం చేసి కీలక సమాచారాన్ని ఇస్రోకు చేరవేసింది. ఇస్రో మొదట రోవర్ 300-350 మీటర్ల దూరం ప్రయాణించేలా ప్లాన్ చేసింది. అయితే కొన్ని కారణాల వల్ల రోవర్ ఇప్పటి వరకు 105 మీటర్లు మాత్రమే కదిలింది. అయినప్పటికీ, మిషన్ దాని లక్ష్యాలను అధిగమించింది. అయితే చంద్రునిపై 14 రోజులు పగలు, 14 రోజులు రాత్రి ఉంటుంది. ఈ కారణంగా రాత్రిళ్లు ఉష్ణోగ్రత దాదాపు మైనస్ 200 వరకు ఉంటోంది. ఈ వాతావరణ పరిస్థితుల్లో పరిశోధనలు సాధ్యం కాకపోవడంతో సెప్టెంబర్ 2 రోవర్, సెప్టెంబర్ 4న ల్యాండర్‌ను స్లీప్ మోడ్‌లో ఉంచారు. ఇక నేడు సూర్యోదయం కావడంతో రోవర్‌పై సూర్యర్శ్మి పడగానే, పరికరాలు వేడి అవుతాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ ప్రక్రియ తర్వాత ల్యాండర్, రోవర్ నుంచి సిగ్నల్స్ వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. రోవర్, ల్యాండర్‌ను నిద్రలేపి మళ్లీ క్రియాశీలకంగా మార్చితే.. చంద్రునిపై మరింత సమాచారాన్ని సేకరించవచ్చని భావిస్తున్నట్లు చెప్పారు. చదవండి: ఉగ్రవాద వ్యాఖ్యలు.. బీజేపీ ఎంపీకి లోక్‌సభ స్పీకర్ వార్నింగ్.. -
చంద్రయాన్ 3:కీలక ఘట్టానికి రంగం సిద్ధం
చంద్రయాన్ 3 ప్రయోగంలో మరో కీలక ఘట్టానికి ఇస్రో సమాయత్తమవుతోంది. నిద్రాణ స్థితిలో ఉన్న ల్యాండర్ విక్రమ్, రోవర్ ప్రజ్ఞాన్‌ను మేల్కొల్పడానికి ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయత్నాలు ప్రారంభించారు. సూర్యరశ్మి తాకగానే రోవర్ నుంచి సిగ్నల్ కన్ఫర్మేషన్ కోసం వేచి చూస్తున్నట్లు ఇస్రో స్పష్టం చేసింది. రోవర్, ల్యాండర్ ఇంకా నిద్రాణ స్థితిలోనే ఉన్నాయని చెప్పారు. #WATCH | On Vikram Lander and Pragyan Rover, former ISRO Chairman K Sivan says, "We have to wait and see. It has undergone a lunar night. Now the lunar day starts. So, now they will try to wake up. If all the systems are functioning, it will be alright...This is not the end, a… pic.twitter.com/le3hpbMGcd — ANI (@ANI) September 22, 2023 నిద్రాణ స్థితి.. చంద్రయాన్ 3 ప్రయోగంలో భాగంగా ల్యాండర్ విక్రమ్, రోవర్ ప్రజ్ఞాన్ 14 రోజుల వ్యవధిలో నిర్దేశించిన లక్ష్యాలను చేరుకున్నాయి. కీలక సమాచారాన్ని చేరవేశాయి. చంద్రునిపై 14 రోజులు పాటు పగలు, 14 రోజులు రాత్రి ఉంటోంది. రాత్రిళ్లు ఉష్ణోగ్రత దాదాపు మైనస్ 200 వరకు ఉంటోంది. ఈ వాతావరణ పరిస్థితుల్లో పరిశోధనలు సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 2న రోవర్‌ను, సెప్టెంబర్ 4న ల్యాండర్ విక్రమ్‌ను నిద్రాణ స్థితిలోకి పంపారు. మేల్కొల్పు.. విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై ల్యాండ్ అయిన శివశక్తి పాయింట్.. దక్షిణ ధ్రువానికి 600 మీటర్ల దూరంలో ఉంది. 14 రోజుల తర్వాత చంద్రునిపై నేడు సూర్యోదనయం కానుంది. సూర్యరశ్మి రోవర్‌పై పడగానే, పరికరాలు వేడి అవుతాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ ప్రక్రియ తర్వాత ల్యాండర్, రోవర్ నుంచి సిగ్నల్స్ వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. రోవర్, ల్యాండర్‌ను నిద్రలేపి మళ్లీ క్రియాశీలకంగా మార్చితే.. చంద్రునిపై మరింత సమాచారాన్ని సేకరించవచ్చని భావిస్తున్నట్లు చెప్పారు. ఇదీ చదవండి: ఇస్రో సేవలు అద్భుతం -
‘చంద్రయాన్–3’ రీయాక్టివేట్‌కు సన్నద్ధం
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్–3 మిషన్‌లో భాగంగా గత 23న చంద్రుడి ఉపరితలంపై దక్షిణ ధృవంలో దిగి సేవలందించిన ల్యాండర్, రోవర్లను రీయాక్టివేట్ చేసేందుకు ఇస్రో సన్నద్ధమవుతోంది. ఇప్పటికే రోవర్ చంద్రుడి ఉపరితలంపై సుమారు 200 మీటర్ల దూరం ప్రయాణించి అక్కడి సమాచారాన్ని అందించింది. అనంతరం దక్షిణ ధృవం సూర్యరశ్మి లేకుండా చీకటితో నిండిపోయే సమయం ఆసన్నమవ్వడంతో.. ఇస్రో శాస్త్రవేత్తలు ముందు జాగ్రత్తగా ఈనెల 2న రోవర్‌ను, 4న ల్యాండర్‌ను స్లీపింగ్ మోడ్‌లోకి పంపించారు. ఇప్పుడు మళ్లీ ల్యాండర్, రోవర్లు ఉన్న ప్రాంతంలో సూర్య కిరణాలు ప్రసరించనున్నాయని ఇస్రో శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. బుధ, గురువారాల్లో సూర్యరశి్మని ఉపయోగించుకొని.. ల్యాండర్, రోవర్‌లోని బ్యాటరీలు రీచార్జ్ అవుతాయని భావిస్తున్నారు. ఈనెల 22న ల్యాండర్, రోవర్ పనితీరును ఇస్రో పునరుద్ధరించే అవకాశముంది. బ్యాటరీలు రీచార్జ్ అయ్యి ల్యాండర్, రోవర్ మళ్లీ పనిచేస్తే.. ఇస్రో అంతరిక్ష చరిత్రలో ఇది మరో అద్భుతం కానుంది. -
చివరి దశకు చేరిన చంద్రయాన్-3.. ఇస్రో కీలక ప్రకటన!
సాక్షి, బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 మరో ఘనత సాధించింది. మిషన్‌లో భాగమైన ప్రగ్యాన్ రోవర్ చంద్రుడి ఉపరితలంపై 100 మీటర్లు విజయవంతంగా ప్రయాణించించినట్లు ఇస్రో శనివారం వెల్లడించింది. మరోవైపు చంద్రయాన్-3 మిషన్ చివరి దశకు చేరింది. చంద్రునిపై సూర్యకాంతి క్షీణిస్తుండటం వల్ల విక్రమ్ ల్యాండర్, ప్రగ్యాన్ రోవర్ రెండింటినీ స్లీప్ మోడ్‌లో ఉంచడానికి ఇస్రో సిద్ధమవుతోంది. ఈ తరుణంలో చంద్రయాన్ ఈ మైలురాయిని అందుకోవడం విశేషం కాగా ఆదిత్య ఎల్1 మిషన్ విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టిన తర్వాత ఇస్రో చైర్మన్ సోమనాథ్ ఈ విషయాన్ని వెల్లడించారు. చంద్రయాన్-3కి చెందిన అన్ని పరికరాలు సవ్యంగా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు.. ల్యాండర్, రోవర్లు ఇంకా ఫంక్షన్ చేస్తున్నాయన్నారు. రోవర్ పంపిన డేటాను ఇస్రో శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు. మరో ఒకటి రెండు రోజుల్లో రోవర్, ల్యాండర్లను స్లీపింగ్ మోడ్‌లోకి తీసుకువెళ్లనున్నట్లు సోమనాథ్ చెప్పారు. చదవండి: ఆదిత్య ఎల్-1 ప్రయోగం విజయవంతం.. అభినందనల వెల్లువ Chandrayaan-3 Mission: 🏏Pragyan 100* Meanwhile, over the Moon, Pragan Rover has traversed over 100 meters and continuing. pic.twitter.com/J1jR3rP6CZ — ISRO (@isro) September 2, 2023 చంద్రయాన్ మిషన్ గురించి.. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్–3 మిషన్ ఆగస్టు 23న జాబిల్లిపై అడుగుపెట్టింది. జూలై 14న శ్రీహరికోట నుంచి నింగిలోకి దూసుకెళ్లిన ఈ వ్యోమనౌక.. 41 రోజుల సుదీర్ఘ ప్రయాణం చేసి విక్రమ్ ల్యాండర్‌ను చందమామ దక్షిణ ధ్రువం ఉపరితలంపై నిర్దేశిత ప్రాంతంలో సురక్షితంగా ల్యాండ్ చేసింది. జాబిల్లి దక్షిణ ధ్రువంపై దిగిన మొట్టమొదటి మిషన్‌గా చరిత్ర సృష్టించింది. 4 గంటల తర్వాత ల్యాండర్ నుంచి ఆరు చక్రాలతో రోవర్ ప్రగ్యాన్ విజయవంతంగా బయటకు వచ్చింది. నెమ్మదిగా అడుగులు వేస్తూ జాబిల్లి ఉపరితలానికి చేరుకుంది. అటూ ఇటూ తిరుగుతూ చంద్రుడిపై పరిశోధనలు ప్రారంభించింది. చంద్రుడి ఉపరితలంపై మట్టి స్వభావం, వాతావరణం, ఖనిజాలు వంటి విలువైన సమాచారాన్ని భూమిపైకి చేరవేస్తోంది. -
జాబిల్లి పెరట్లో రోవర్ ఆటలు.. చంద్రయాన్ 3 న్యూ వీడియో..
బెంగళూరు: చంద్రయాన్ 3 ప్రాజెక్టులో భాగంగా రోవర్ ప్రజ్ఞాన్ తన పనిలో బిజిబిజీగా గడుపుతోంది. జాబిల్లిపై ఉండే రాళ్లు, లోయలను పసిగడుతూ తన మార్గాన్ని జాగ్రత్తగా నిర్దేశించుకుంటోంది. 14 రోజుల గడువు దగ్గరపడుతున్న నేపథ్యంలో శాస్త్రవేత్తలు నిర్దేశించిన అన్వేషణను కొనసాగిస్తోంది. దీనికి సంబంధించిన కొత్త వీడియోను ఇస్రో షేర్ చేసింది. రోవర్ ప్రజ్ఞాన్ సరైన దారిని వెతుక్కునే క్రమంలో అక్కడక్కడే తిరుగాడుతున్న దృశ్యాలను ల్యాండర్ ఇమేజర్ కెమెరా వీడియో తీసింది. ఈ వీడియోను ఇస్రో తన అధికారిక ఖాతాలో పంచుకుంది. అమ్మ ఆప్యాయంగా చూస్తుండగా.. పెరట్లో ఆడుకుంటున్న చంటిబిడ్డలా రోవర్ భలే ఉంది కదా..? అంటూ క్యాప్షన్‌ను కూడా జోడించింది. Chandrayaan-3 Mission: The rover was rotated in search of a safe route. The rotation was captured by a Lander Imager Camera. It feels as though a child is playfully frolicking in the yards of Chandamama, while the mother watches affectionately. Isn't it?🙂 pic.twitter.com/w5FwFZzDMp — ISRO (@isro) August 31, 2023 చంద్రయాన్ 3 ప్రాజెక్టులో భాగంగా విక్రమ్ ల్యాండర్ చంద్రుని దక్షిణ ధ్రువంపై దిగ్విజయంగా దిగిన విషయం అందరికీ తెలిసిందే. విక్రమ్ ల్యాండర్ నుంచి బయటకు వచ్చిన రోవర్ ప్రజ్ఞాన్.. పరిశోధనలను కొనసాగిస్తోంది. చంద్రునిపై నీటిజాడ, వాయువులు, మట్టి, అక్కడ దొరుకుతున్న రసాయనిక పదార్థాల గురించి ఆరా తీస్తోంది. చంద్రుని దక్షిణ ధ్రువంపై సల్ఫర్ మూలకం పుష్కలంగా ఉందని ప్రజ్ఞాన్ రోవర్ ఇప్పటికే గుర్తించింది. అల్యూమినియం, కాల్షియం, ఇనుము, క్రోమియం, టైటానియం, మాంగనీసు, సిలికాన్, ఆక్సిజన్ కూడా అక్కడ ఉన్నట్లు కనుగొంది. చంద్రునిపై ఉష్ణ్రోగ్రత 70 డిగ్రీల వరకు ఉంటోందని ఇస్రో తెలిపింది. Chandrayaan-3 Mission: In-situ scientific experiments continue ..... Laser-Induced Breakdown Spectroscope (LIBS) instrument onboard the Rover unambiguously confirms the presence of Sulphur (S) in the lunar surface near the south pole, through first-ever in-situ measurements.… pic.twitter.com/vDQmByWcSL — ISRO (@isro) August 29, 2023 ఇదీ చదవండి: Chandrayaan-3: విజయవంతంగా చంద్రయాన్.. వాట్ నెక్ట్స్.? -
విజయవంతంగా రోవర్ ఏడు రోజుల ప్రయాణం
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): భారత్ ఈ నెల 23న చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండర్‌ను దించిన తొలి దేశంగా రికార్డులు సృష్టించింది. ల్యాండర్ దిగిన మరికొన్ని గంటలకే దాని నుంచి రోవర్ కూడా బయటకొచ్చి తన పనిని మొదలుపెట్టేసింది. మొత్తం 14 రోజులపాటు రోవర్ చంద్రుడిపై అన్వేషణలు కొనసాగించనుంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఏడు రోజులు పూర్తయ్యాయి. మరో ఏడు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో ఈ వారం రోజులు కీలకమని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తరువాత చంద్రుడిపై 14 రోజులపాటు చిమ్మ చీకట్లు ఆవరించడంతోపాటు భారీగా మంచు కురుస్తుందని పేర్కొంటున్నారు. దీంతో ల్యాండర్, రోవర్లు పనిచేస్తాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తదుపరి 14 రోజులు తర్వాత ల్యాండర్, రోవర్లు ఉన్న చోట మళ్లీ సూర్యకిరణాలు పడతాయి. వీటికి సోలార్ ప్యానెల్స్ రీస్టార్ట్ అయితే ల్యాండర్, రోవర్లు తిరిగి పనిచేస్తాయి. లేదంటే వాటి కాలపరిమితి తీరిపోయినట్టేనని చెబుతున్నారు. కాగా ఇప్పటివరకు తన ఏడు రోజుల ప్రయాణంలో రోవర్ సుమారు 250 మీటర్ల దూరం ప్రయాణం చేసినట్టు ఇస్రో వెల్లడించింది. విజయవంతంగా లిబ్స్.. కాగా రోవర్లో అమర్చిన లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్‌డౌన్ స్పెక్ట్రోస్కోప్ (లిబ్స్) అనే పేలోడ్ విజయవంతంగా పనిచేయడం వల్ల చంద్రుడిలో దాగిన రహస్యాలను తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలోనే చంద్రుడి దక్షిణ ధృవంపై సల్ఫర్ ఉనికిని తొలిసారి కనుగొన్నారు. అలాగే అల్యూమినియం, కాల్షియం, ఐరన్, క్రోమియం, టైటానియం, మాంగనీస్, సిలికాన్ తో పాటు ఆక్సిజన్ కూడా ఉన్నట్లుగా తేలింది. ప్రస్తుతం హైడ్రోజన్ కోసం మరింతగా రోవర్ పరిశోధనలు చేస్తోంది. అయితే లిబ్స్ అనే పేలోడ్ చంద్రుడి ఉపరితలంపై శక్తివంతమైన లేజర్‌ను షూట్ చేసినప్పుడు.. అందులో నుంచి వెలువడే కాంతి ఆధారంగా మూలకాలను గుర్తించి ఆ డేటాను ఇస్రో భూ నియంత్రిత కేంద్రానికి పంపుతోంది. ఈ సైంటిఫిక్ పేలోడ్‌ను బెంగళూరులోని లేబొరేటరీ ఫర్ ఎలక్ట్రో ఆప్టిక్స్ సిస్టం (లియోస్) అభివృద్ధి చేసింది. భారత్, చైనాకు చెందిన రెండు రోవర్లు మరోవైపు 2019 జనవరి 3న చంద్రుడి దక్షిణ ధృవం ప్రాంతంలో ఐట్కిన్ బేసిన్లో చైనాకు చెందిన వాంగ్–4 మిషన్ యూటూ 2 రోవర్ సైతం పరిశోధనలు చేస్తోంది. భారత్, చైనా రోవర్ల మధ్య దూరం 1,948 కిలోమీటర్లు ఉన్నట్టుగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చంద్రుడిపై ఒకేసారి రెండు రోవర్లు పనిచేయడం ఇదే మొదటిసారని పేర్కొంటున్నారు. నీలి రంగు నిండు జాబిలి! ఆకాశంలో నిండు జాబిలి నీలి రంగులో కనువిందు చేసింది. బుధవారం రాత్రి 9.30 గంటల సమయంలో విజయవాడలో ఇలా అరుదైన బ్లూ మూన్ సాక్షాత్కరించింది. ఒకే నెలలో రెండోసారి వచ్చే పౌర్ణమి రోజున కనిపించే చంద్రుడిని బ్లూమూన్ అంటారు. ఆగస్టు ఒకటో తేదీన ఒకసారి, 30వ తేదీన రెండోసారి కనిపించింది. ఇలా ఒకే నెలలో రెండవసారి రోజూ కంటే పెద్దదిగా కనిపించడం విశేషం. ఈ సూపర్ బ్లూ మూన్ 2037 వరకు మళ్లీ కనిపించదని నిపుణులు చెబుతున్నారు. – విశాల్, సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ -
Chandrayaan-3: తొలిసారి విక్రమ్‌ను ఫోటో తీసిన రోవర్.. ఇదిగో ఫోటో
ఇస్రో చేపట్టిన చంద్రయాన్- మిషన్‌లో భాగంగా చంద్రుడిపై అడుగుపెట్టి పరిశోధనలు సాగిస్తున్న ప్రగ్యాన్ రోవర్.. తొలిసారి విక్రమ్ ల్యాండర్ ఫోటోలు తీసింది. బుధవారం ఉదయం 7.35 గంటలకు రోవర్ నావిగేషన్ కెమెరా ఈ ఫోటోలు క్లిక్‌మనించిందని ఇస్రో ట్వీట్ చేసింది. ఈ కెమెరాలను బెంగుళూరులోని ఎలక్ట్రో-ఆప్టిక్స్ సిస్టమ్స్ ల్యాబ్‌లో తయారు చేసినట్లు వెల్లడించింది. Chandrayaan-3 Mission: Smile, please📸! Pragyan Rover clicked an image of Vikram Lander this morning. The 'image of the mission' was taken by the Navigation Camera onboard the Rover (NavCam). NavCams for the Chandrayaan-3 Mission are developed by the Laboratory for… pic.twitter.com/Oece2bi6zE — ISRO (@isro) August 30, 2023 కాగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్–3 మిషన్ ఆగస్టు 23న జాబిల్లిపై అడుగుపెట్టింది. జూలై 14న శ్రీహరికోట నుంచి నింగిలోకి దూసుకెళ్లిన ఈ వ్యోమనౌక.. 41 రోజుల సుదీర్ఘ ప్రయాణం చేసి విక్రమ్ ల్యాండర్‌ను చందమామ దక్షిణ ధ్రువం ఉపరితలంపై నిర్దేశిత ప్రాంతంలో సురక్షితంగా ల్యాండ్ చేసింది. జాబిల్లి దక్షిణ ధ్రువంపై దిగిన మొట్టమొదటి మిషన్‌గా చరిత్ర సృష్టించింది. దాదాపు 4 గంటల తర్వాత ల్యాండర్ నుంచి ఆరు చక్రాలతో రోవర్ ప్రజ్ఞాన్ విజయవంతంగా బయటకు వచ్చింది. నెమ్మదిగా అడుగులు వేస్తూ జాబిల్లి ఉపరితలానికి చేరుకుంది. అటూ ఇటూ తిరుగుతూ చంద్రుడిపై పరిశోధనలు ప్రారంభించింది. చంద్రుడి ఉపరితలంపై మట్టి స్వభావం, వాతావరణం, ఖనిజాలు వంటి విలువైన సమాచారాన్ని భూమిపైకి చేరవేస్తోంది. ఇక విక్రమ్ సాఫ్ట్ ల్యాండింగ్ జరిగి వారం రోజులు పూర్తయ్యింది. ఈ మిషన్‌కు ఇంకా వారం రోజుల కాల వ్యవధి మిగిలి ఉంది. ఈ ఏడు రోజుల్లో ల్యాండర్, రోవర్ ఏం చేయనున్నాయన్నది ఆసక్తికరంగా మారింది. చదవండి: అనారోగ్యంతో చిరుత.. గ్రామస్థుల ఆకతాయి చేష్టలు! -
చివరి దశకు చేరిన చంద్రయాన్–3 మిషన్.. మిగిలింది వారం రోజులే!
న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్–3 మిషన్ ఈ ఏడాది జూలై 14న శ్రీహరికోట నుంచి నింగిలోకి దూసుకెళ్లింది. 41 రోజుల ప్రయాణం అనంతరం ఆగస్టు 23న సాయంత్రం 6.04 గంటలకు ల్యాండర్ విక్రమ్ చందమామ దక్షిణ ధ్రువం ఉపరితలంపై నిర్దేశిత ప్రాంతంలో సురక్షితంగా అడుగుపెట్టింది. జాబిల్లి దక్షిణ ధ్రువంపై దిగిన మొట్టమొదటి మిషన్‌గా చరిత్ర సృష్టించింది. దాదాపు 4 గంటల తర్వాత ల్యాండర్ నుంచి ఆరు చక్రాలతో రోవర్ ప్రజ్ఞాన్ విజయవంతంగా బయటకు వచ్చింది. నెమ్మదిగా అడుగులు వేస్తూ జాబిల్లి ఉపరితలానికి చేరుకుంది. అటూ ఇటూ తిరుగుతూ చంద్రుడిపై పరిశోధనలు ప్రారంభించింది. విలువైన సమాచారాన్ని భూమిపైకి చేరవేస్తోంది. సాఫ్ట్ ల్యాండింగ్ జరిగి వారం రోజులు పూర్తయ్యింది. ఆగస్టు 23 నుంచి ఆగస్టు 29 వరకు మొత్తం ఏడు రోజుల వ్యవధిలో చంద్రయాన్–3 మిషన్ ఏమేం చేసింది? అనే వివరాలను ఇస్రో బహిర్గతం చేసింది. రోవర్ చాకచక్యం చంద్రుడిపై ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్, ల్యాండర్ నుంచి రోవర్ విజయవంతంగా బయటికి వచ్చి తన కార్యాచరణ ప్రారంభించడం, చంద్రుడి ఉపరితలంపై పరిశోధనలు అనేవి మూడు ప్రధాన లక్ష్యాలు కాగా, ఆగస్టు 26 నాటికే తొలి రెండు లక్ష్యాలు నెరవేరాయి. ఆగస్టు 27న చంద్రుడి ఉపరితలంపై ఉష్ణోగ్రతల మార్పుల వివరాలను రోవర్ ప్రజ్ఞాన్ భూమిపైకి చేరవేసింది. అందరూ అనుకుంటున్నట్లు చంద్రుడు చల్లగా ఉండడని, ఉపరితలంపై 70 డిగ్రీల దాకా వేడి ఉంటుందని తేల్చింది. ఆగస్టు 28న తన ప్రయాణానికి 4 మీటర్ల లోతున్న గొయ్యి అడ్డు రావడంతో ఇస్రో కమాండ్స్‌ను పాటిస్తూ రోవర్ చాకచక్యంగా తప్పించుకుంది. ఈ మిషన్‌కు ఇంకా వారం రోజుల కాల వ్యవధి మిగిలి ఉంది. ఈ ఏడు రోజుల్లో ల్యాండర్, రోవర్ ఏం చేయనున్నాయన్నది ఆసక్తికరం. సాంకేతికంగా వాటికి ఇదే చివరి దశ. మిగిలిన ఏడు రోజుల్లో చందమామపై ల్యాండర్, రోవర్ మరిన్ని శాస్త్రీయ పరిశోధనలు చేస్తాయి. రోవర్ ప్రజ్ఞాన్ చంద్రుడి ఉపరితలంపై మట్టి స్వభావాన్ని విశ్లేషిస్తుంది. చంద్రుడిపై ఉన్న దుమ్ము ధూళీ, రాళ్లలోని రసాయనిక సమ్మేళనాలను రోవర్ గుర్తిస్తుంది. చందమామ ఉపరితల వాతావరణం, ఉపరితలం లోపలి పరిస్థితుల గురించి సమాచారం అందిస్తుంది. ల్యాండర్ విక్రమ్‌లో నాలుగు పేలోడ్లు ఉన్నాయి. ఇవి చంద్రుడిపై ప్రకంపనలు, ఉపరితలంపై ఉష్ణోగ్రతల స్థితిగతులు, ప్లాస్మాలో మార్పులను అధ్యయనం చేస్తాయి. చంద్రుడికి–భూమికి మధ్యనున్న దూరాన్ని కచ్చితంగా లెక్కించడంలో ల్యాండర్‌లోని పేలోడ్లు సహకారం అందిస్తాయి. చంద్రుడిపై మట్టి స్వభావాన్ని విశ్లేషిం చడం, ఉష్ణోగ్రతలను గుర్తించడం అనేవి అత్యంత కీలకమైనవి. చందమామ దక్షిణ ధ్రువంలో చీకటి పడగానే 14 రోజులపాటు ఉష్ణోగ్రత మైనస్ 230 డిగ్రీలకు పడిపోనుంది. ఈ అత్యల్ప ఉష్ణోగ్రతను తట్టుకొని పనిచేసేలా ల్యాండర్‌ను, రోవర్‌ను డిజైన్ చేయలేదు. ఉపరితలంపై సూర్యాస్తమయం కాగానే ఇవి పనిచేయడం ఆగిపోతుంది. కొన్ని సవాళ్లు ఎదురైనప్పటికీ చంద్రయాన్–3 మిషన్ ఇప్పటిదాకా సాధించింది తక్కువేమీ కాదు. ఎవరూ చూడని జాబిల్లి దక్షిణ ధ్రువం గురించి కీలక సమాచారం అందించింది. చంద్రయాన్–3 చివరి దశలోకి ప్రవేశించడంతో ఇక ల్యాండర్, రోవర్ అందించే సమాచారం కోసం ప్రపంచ దేశాలు ఉత్సుకతతో ఎదురు చూస్తున్నాయి. చంద్రయాన్–3 విజయంపై కేబినెట్ ప్రశంస చందమామపై చంద్రయాన్–3 ల్యాండర్ విక్రమ్ క్షేమంగా దిగడాన్ని ప్రశంసిస్తూ కేంద్ర కేబినెట్ మంగళవారం తీర్మానం ఆమోదించింది. ఇది కేవలం ‘ఇస్రో’ విజయం మాత్రమే కాదని, దేశ ప్రగతికి, అంతర్జాతీయ వేదికపై పెరుగుతున్న దేశ గౌరవ ప్రతిష్టలకు నిదర్శనమని కొనియాడింది. ఆగస్టు 23వ తేదీని ‘నేషనల్ స్పేస్ డే’గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించడాన్ని స్వాగతించింది. చంద్రయాన్–3 ప్రయోగాన్ని విజయవంతం చేసిన ఇస్రోను మంత్రివర్గం అభినందించిందని, సైంటిస్టులకు కృతజ్ఞతలు తెలిపిందని మంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పారు. -
Chandrayaan-3: రోవర్‌కు తప్పిన ప్రమాదం
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్రుడిపై పరిశోధనలకు పంపిన రోవర్‌కు చంద్రుడిపై పెద్ద ప్రమాదం తప్పింది. ల్యాండర్ నుంచి విడుదలైన రోవర్ చంద్రుడిపై తిరుగుతూ పలు రకాల పరిశోధనలు చేస్తూ భూనియంత్రిత కేంద్రాలకు సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంది. రోవర్ ప్రయాణిస్తున్న మార్గంలో సుమారు నాలుగు మీటర్లు వెడల్పయిన బిలాన్ని గుర్తించింది. అయితే, బిలాన్ని మూడుమీటర్ల దూరంలో ఉండగానే రోవర్ గుర్తించిందని ఇస్రో తెలిపింది. ప్రమాదవశాత్తూ ఆ బిలంలో పడి ఉంటే పెద్ద ప్రమాదం జరిగేదని పేర్కొంది. ప్రత్యేక ఆదేశాలతో మరో దారిని రోవర్ ఎంచుకుందని వివరించింది. ప్రస్తుతం రోవర్ సురక్షితమైన మార్గంలో ముందుకు సాగుతోందని ఇస్రో సోమవారం ఎక్స్(ట్విట్టర్)లో పేర్కొంది. రోవర్ తప్పించుకున్న బిలం ఇదే.. దారిమళ్లిన రోవర్ గుర్తులు -
జాబిల్లిపై రోవర్ చక్కర్లు.. వీడియో చూశారా?
Chandrayaan-3: చంద్రయాన్-3 మిషన్‌కు సంబంధించి ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌లను అందిస్తోంది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ISRO. తాజాగా చంద్రుడిపై రోవర్ చక్కర్లు కొడుతున్న ఓ వీడియోను విడుదల చేఏసింది. జాబిల్లిపై రోవర్ తిరుగుతుండగా.. ఆ చక్రాల గుర్తులు పడడం.. ఇస్రో షేర్ చేసిన వీడియోలో చూడొచ్చు. చంద్రుడిపై దక్షిణ ధ్రువంలో మట్టి అన్వేషణ.. గడ్డ కట్టిన నీటి అణువులను ప్రగ్యాన్(ప్రజ్ఞాన్) రోవర్ పరిశోధించనుంది. విక్రమ్ ల్యాండర్ నుంచి బయటకు వచ్చిన క్షణం నుంచి రెండువారాల పాటు ఇదే పనిలో ఉంది రోవర్. Chandrayaan-3 Mission: 🔍What's new here? Pragyan rover roams around Shiv Shakti Point in pursuit of lunar secrets at the South Pole 🌗! pic.twitter.com/1g5gQsgrjM — ISRO (@isro) August 26, 2023 -
‘చంద్రయాన్-3లో ప్రయాణించిన వారికి సెల్యూట్’.. మంత్రిపై ట్రోల్స్
అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ సరికొత్త చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. 140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలు సాకారం చేస్తూ ఇస్రో ప్రయోగించిన ప్రతిష్టాత్మక చంద్రయాన్-3 ప్రయోగం బుధవారం విజయవంతం అయ్యింది. ఇప్పటి వరకు ఏ దేశం అడుగుపెట్టని జాబిల్లి దక్షిణ ధ్రువంపై మువ్వన్నెల జెండా పాతేసింది. చంద్రుడి దక్షిణధ్రువంపై అడుగుపెట్టిన మొదటి దేశంగా భారత్ రికార్డు నెలకొల్పింది. ల్యాండర్‌తోపాటు రోవర్ కూడా క్షేమంగా దిగడంతో దేశ వ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. చివరి దశలో వ్యోమనౌక జాబిల్లిపై కాలు మోపే క్షణాలను టీవీలు, ఫోన్లలో ప్రత్యక్షంగా చూసి ఉద్విగ్నానికి లోనయ్యారు. దేశ, విదేశాల నుంచి ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో చంద్రయాన్-కు సంబంధించి రాజస్థాన్ మంత్రి విచిత్ర వ్యాఖ్యలు చేశారు. చదవండి: Chandrayaan-3: ఆ సంతోషం మాటల్లో చెప్పలేం.. ఇస్రో చైర్మన్ రాష్ట్ర క్రీడా, యువజన వ్యవహారాలశాఖ మంత్రి అశోక్ చందన్.. చంద్రుడి మీదకు వెళ్లిన ప్రయాణికులకు సెల్యూట్ అంటూ నోరూజారారు.. ‘చంద్రుడిపై సురక్షితంగా కాలుమోపాం.. అందులో ప్రయణించిన వారికి సెల్యూట్. సైన్స్ స్పేస్ రీసెర్చ్‌లో ఇండియా మరో అడుగు ముందుకేసింది. మిషన్ సక్సెస్ అయిన సందర్భంగా భారత పౌరులందరికీ కూడా శుభాకాంక్షలు చెబుతున్నా’ అని మీడియాతో ముందు తెలిపారు. ఈ వ్యాఖ్యలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. కాగా చంద్రయాన్-3 మానవ రహిత మిషన్. ఇస్రో ఇందులో కేవలం విక్రమ్ ల్యాండర్, ప్రగ్యాన్ రోవర్ మాత్రమే పంపిన విషయం తెలిసిందే. వ్యోమగాములను రోదసిలోకి పంపలేదు. అయితే మంత్రి స్థానం ఉన్న అశోక్ చందన్. ప్రయోగం గురించి తెలుసుకోకుండా, సరైన అవగాహన లేకుండా మాట్లాడి ట్రోల్స్‌కు గురవుతున్నారు.దీనిపై నెటిజన్లు జోకులు పేలుస్తూ.. మంత్రికి చురకలంటిస్తున్నారు. ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 వ్యోమనౌక బుధవారం సాయంత్రం 6.04 గంటలకు జాబిల్లిపై ఎలాంటి అవాంతరాలు లేకుండా సాఫ్ట్ ల్యాండింగ్ చేసింది. విక్రమ్ ల్యాండ్ అయిన నాలుగు గంటల తర్వాత అంటే రాత్రి 10.04 గంటలకు రోవర్ బయటకు వచ్చింది. ల్యాండర్లో పంపించిన రోవర్ పేరు ప్రగ్యాన్. ప్రస్తుతం జాబిల్లిపై అడుగుపెట్టిన రోవర్ ‘ప్రజ్ఞాన్’.. అక్కడ తన అధ్యయనం మొదలుపెట్టింది. చంద్రుడిపై వాతావరణ, నీటి వనరులు, భూగర్భ శాస్త్రం, భవిష్యత్తులో మానవ మనుగడకు సామర్థ్యాలను అధ్యయనం చేయనుంది. చదవండి: చంద్రయాన్ ల్యాండర్.. మెరిసేదంతా బంగారమేనా.. -
Chandrayaan-3: ఆ సంతోషం మాటల్లో చెప్పలేం.. ఇస్రో చైర్మన్
ప్రతిష్టాత్మక చంద్రయాన్–3 మిషన్ ఘన విజయం సాధించి అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ చరిత్ర సృష్టించింది. బుధవారం సాయంత్రం 6.04 గంటలకు జాబిల్లిపై ఎలాంటి అవాంతరాలు లేకుండా సాఫ్ట్ ల్యాండింగ్ చేసింది. విక్రమ్ ల్యాండ్ అయిన నాలుగు గంటల తర్వాత అంటే రాత్రి 10.04 గంటలకు రోవర్ బయటకు వచ్చింది. ల్యాండర్లో పంపించిన రోవర్ పేరు ప్రగ్యాన్. ప్రస్తుతం జాబిల్లిపై అడుగుపెట్టిన రోవర్ ‘ప్రగ్యాన్’.. చంద్రుడిపై తన అధ్యయనం మొదలుపెట్టింది. ఇప్పటికే ల్యాండర్ క్షేమంగా దిగడంతో భారత్ సంబరాలు చేసుకుంటున్న వేళ.. రోవర్‌కూడా సక్సెస్‌ఫుల్‌గా బయటకు రావడంతో ఇస్రో శాస్త్రవేత్తల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దీనిపై ఇస్రో స్పందిస్తూ ట్వీట్ చేసింది ‘చంద్రయాన్-3 రోవర్ చంద్రుడి కోసం భారత్‌లో తయారైంది. అది ల్యాండర్ నుంచి సజావుగా బయటకు వచ్చింది. భారత్ చంద్రుడిపై నడిచింది. మిషన్‌కు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ తర్వలోనే షేర్ చేస్తాం’ అంటూ పేర్కొంది. చదవండి: చంద్రయాన్ ల్యాండర్.. మెరిసేదంతా బంగారమేనా.. Chandrayaan-3 Mission: Chandrayaan-3 ROVER: Made in India 🇮🇳 Made for the MOON🌖! The Ch-3 Rover ramped down from the Lander and India took a walk on the moon ! More updates soon.#Chandrayaan_3#Ch3 — ISRO (@isro) August 24, 2023 ఆ సంతోషం మాటల్లో చెప్పలేం: ఇస్రో చైర్మన్ చంద్రయాన్-2 వైఫల్యంతో అనేక పాఠాలు నేర్చుక్నుఆమని ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు. ల్యాండర్ చంద్రుడిపై అడుగుపెట్టినప్పుడు కలిగిన సంతోషం మాటల్లో చేప్పలేమన్నారు. ఫెయిల్యూర్ ఘటనలు మనకు అనేక పాఠాలు నేర్పుతాయని తెలిపారు. మేము రోబోటిక్ పాత్ ప్లానింగ్ ప్రయోగం కూడా చేస్తామని చెప్పారు. కాగా మైక్రోవేవ్ సైజ్ ఉన్న ప్రజ్ఞాన్ రోవర్.. చంద్రుని ఉపరితలంపై 500 మీటర్లు (1,640 అడుగులు) వరకు ప్రయాణించేలా రూపొందించారు. దీని బరువు 26 కిలోలు.రోవర్లో కెమెరా, స్పెక్ట్రోమీటర్, మాగ్నెటోమీటర్‌తో సహా అనేక రకాల పరికరాలతో అమర్చారు. ఇది చంద్రునిపై వాతావరణం, భూగర్భ శాస్త్రం, ఖనిజశాస్త్రం, చరిత్ర, స్థితిగతుల గురించి అధ్యయనం చేయడానికి ప్రయోగాలు చేస్తుంది. Photo Courtesy: IndiaToday ఆరు చక్రాలతో కూడిన రోవర్ ప్రగ్యాన్ చంద్రుడిపై సెకనుకు ఒక సెంటీమీటర్ వేగంతో ముందుకు కదులుతోంది. ఆరు చక్రాల సాయంతో చంద్రుడి ఉపరితలంపై 14 రోజులు తిరుగుతూ పనిచేస్తుంది. ఇందులో రెండు పేలోడ్లు ఉన్నాయి. రోవర్ సోలార్ ప్యానెల్స్ ద్వారా శక్తిని పొంది చంద్రయాన్-3 ఆర్బిటర్‌తో కమ్యూనికేట్ చేస్తుంది. ఇక 40 రోజుల రోజుల ఉత్కంఠకు బుధవారం శుభం కార్డు పడిన విషయం తెలిసిందే. 140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలు సాకారమయ్యాయి. అగ్రరాజ్యాలను తోసిరాజంటూ.. భారత్ జాబిల్లి దక్షిణ ధ్రువంపై జెండా పాతేసింది. చంద్రుడి దక్షిణధ్రువంపై అడుగుపెట్టిన మొదటి దేశంగా భారత్ రికార్డు నెలకొల్పింది. చందమామపై ల్యాండర్‌ను భద్రంగా దించిన నాలుగో దేశంగా ఘనత సాధించింది. చంద్రయాన్–3 విజయంపై దేశ ప్రజల్లో ఆనందోత్సాహాలు వెల్లు విరిశాయి. ఇస్రో శాస్త్రవేత్తలపై ప్రశంసల జల్లు కురిపించారు. ఇక భారత్‌కు వివిధ దేశాల అధినేతల నుంచి అభినందనలు అందాయి. చంద్రయాన్ 3 సాఫ్ట్ ల్యాండింగ్ వెనుక తమిళనాడు మట్టి కీలక పాత్ర.. -
చంద్రయాన్ ల్యాండర్.. మెరిసేదంతా బంగారమేనా..
చంద్రయాన్ ల్యాండర్.. బంగారు రంగులో మెరిసి పోతూ ఉంటుంది. పైగా.. ఏదో గిఫ్ట్‌ప్యాక్ చుట్టిపెట్టి నట్లు గోల్డ్ ఫాయిల్లాగా ఉంటుంది. ఇంతకీ మెరిసేదంతా బంగారమేనా? అస్సలు కాదు.. ఇది మల్టీ లేయర్ ఇన్సులేషన్.. అనేక పొరలుగా ఉంటుంది. ఉష్ణ నిరోధకంగా దీన్ని ఉపయోగి స్తారు. అంతరిక్షంలోకి ఉపగ్రహం వెళ్లినప్పుడు అక్కడి ఉష్ణోగ్రతలు వాటిల్లోని పరికరాలపై ప్రభావం చూపుతాయి. దీని వల్ల అవి సరిగా పనిచేయలేక పోవచ్చు. దాన్ని నివారించడానికి ఇలా కప్పి ఉంచుతారు. మూన్ గురించి.. మీకు తెలుసా? మనం అనుకు న్నట్లు.. చంద మామ గుండ్రంగా ఉండడు.. గుడ్డు ఆకారంలో ఉంటాడు.. అలాగే చల్లనయ్య.. తెల్లనయ్య కాదు.. దగ్గర్నుంచి చూస్తే.. ముదురు బూడిద రంగులో ఉంటాడు. మనం ఎప్పుడు చూసినా.. చంద్రునిలోని 59 శాతం మాత్రమే మనకు కనిపిస్తుందట. అంతేకాదు.. చంద్రుడిని దగ్గర నుంచి చూస్తే.. భారీ గుంతలులాంటివి కనిపిస్తుంటాయి. ఇవన్నీ.. కొన్ని కోట్ల ఏళ్ల క్రితం ఖగోళ వస్తువులు దాన్ని ఢీకొన్నప్పుడు ఏర్పడినవే.. చదవండి: చంద్రయాన్ 3 సాఫ్ట్ ల్యాండింగ్ వెనుక తమిళనాడు మట్టి కీలక పాత్ర.. -
చంద్రయాన్ 3 సాఫ్ట్ ల్యాండింగ్ వెనుక తమిళనాడు మట్టి కీలక పాత్ర..
న్యూఢిల్లీ: చంద్రుని దక్షిణ ధ్రువం మీద సగర్వంగా జెండా పాతి చంద్రయాన్ –3 విజయనాదం చేసింది. దేశ దక్షిణ కొసన తమిళనాడులో మారుమూల విసిరేసినట్టుగా ఉండే నమ్మక్కల్‌లో సంబరాలు మిన్నంటాయి. ఎందుకంటే చంద్రయాన్ ప్రయోగాల్లో అక్కడి మట్టిదే ప్రధాన పాత్ర మరి! ఎందుకు, ఎలా అన్నది ఓ ఆసక్తికరమైన కథ...! అంతరిక్షంలో ప్రయోగం పూర్తిగా శాస్త్రవేత్తల కంట్రోల్లో ఉండదు. ఉపగ్రహాలు, నింగిలోకి పంపేటప్పడు ఉపయోగించే వాటి పనితీరును భూమిపైనే పరిశీలిస్తారు. అంతరిక్షంలో ఉండే వాతావరణాన్ని భూమిపైనే ఏర్పాటు చేసి పరిశోధనలు చేస్తారు. 2008లో చంద్రయాన్–1 అనంతరం తర్వాతి ప్రయోగాలకు ఇస్రో సిద్ధమవుతున్న రోజులవి. చంద్రునిపై సఫ్ట్ లాండింగే లక్ష్యంగా చంద్రయాన్ –2 ను తయారు చేశారు. అది చంద్రునిపై దిగితే అందులోని రోవర్ బయటికి వచ్చి చంద్రుని నేలపై నడిచేలా ప్లాన్ చేశారు. అందుకోసం లాండర్‌ను ఎక్కడ దించాలి? రోవర్ ఎలా నడవాలి? ఇవన్నీ ప్రశ్నలే. చదవండి: చంద్రుడి గుట్టు తెలుసుకొనేలా.. వాటికి సమాధానం వెదికేందుకు ఇస్రో సిద్ధమైంది. అందుకు చంద్రునిపై ఉండే మట్టి మాదిరి మట్టి కావాలి. అందుకోసం వెదుకులాట మొదలైంది. వారికి సరిపోయే మట్టి చెన్నైకు 400 కిలోమీటర్ల దూరంలో నమ్మక్కల్ లో దొరికింది. 2021లో అక్కడి నుంచి 50 టన్నుల మట్టి సేకరించారు. 2019లో చంద్రయాన్ –2 మిషన్‌లో ఆ మట్టితోనే ల్యాండర్, రోవర్ అడుగులను పరీక్షించారు. తాజాగా చంద్రయాన్ –3 ప్రయోగాలకు నమ్మక్కల్ మట్టినే వాడారు. అది అనర్‌తో సైట్ మృత్తిక ‘చంద్రుని ఉపరితలం మీద ఉన్నది అనర్‌తో సైట్ రకం మృత్తిక. తమిళనాడులోని కొన్ని చోట్ల అదే రకం మట్టి ఉన్నట్టు మేం యాదృచ్ఛికంగా చేసిన భూగర్భ పరిశోధనల్లో తేలింది. కున్నమలై, సీతంపూంది వంటి నమ్మక్కల్ పరిసర ప్రాంతాల్లో అది పుష్కలంగా దొరికింది’అని పెరియార్ విశ్వవిద్యాలయం జియాలజీ ప్రొఫెసర్ అయిన ఎస్.అన్బళగన్ వెల్లడించారు. చదవండి: చంద్రుడి గుట్టు తెలుసుకొనేలా.. -
చంద్రయాన్ –3 తరువాత?
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ తన రెండో ప్రయత్నంలో జాబిల్లి దక్షిణ ధ్రువంపై రోవర్‌ను ల్యాండ్ చేయడంలో విజయం సాధించింది. భవిష్యత్తు ఏమిటన్న విషయానికి క్లుప్తంగా ఇవ్వగలిగిన సమాధానం ఆకాశమే హద్దుగా అంతరిక్ష రంగంలో మనదైన ముద్రను వేయడమే అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ ఏడాదిలోనే రష్యా, ఇజ్రాయెల్‌లు రెండూ జాబిల్లి దక్షిణ ధ్రువంపై దిగేందుకు విఫలయత్నం చేశాయి. భారత్ మాత్రమే విజయం సాధించగలిగింది. కచ్చితంగా ఇది భారత శాస్త్రవేత్తల సునిశిత ప్లానింగ్, ఆలోచన, నిబద్ధతలకు ప్రత్యక్ష ప్రమాణం. కాబట్టి చంద్రయాన్–3 తరువాత అంతరిక్ష ప్రయోగాల కోసం ఇస్రో వైపు చూసే దేశాల సంఖ్య నిస్సందేహంగా పెరుగుతుంది. ప్రస్తుతం భారత అంతరిక్ష ప్రయోగ మార్కెట్ విలువ దాదాపు 800 కోట్ల డాలర్లని అంచనా. 2040 నాటికి ఇది ఐదు రెట్లు పెరుగుతుందని ఇప్పటికే ఒక అంచనా ఉండగా.. చంద్రయాన్–3 విజయం ఈ లక్ష్యాన్ని మరింత ముందుగానే అందుకునేందుకు అవకాశం కల్పిస్తుంది. కొన్నేళ్లుగా భారత అంతరిక్ష రంగం ఇతర దేశాల కంటే రెట్టింపు వేగంతో ఎదుగుతున్న విషయం తెలిసిందే. కలిసొచ్చే జుగాడ్... చంద్రయాన్ –3 ఖర్చు రూ.600 కోట్లు ఉంటే.. ఇంతే స్థాయి అంతరిక్ష ప్రయోగానికి విదేశాల్లో ఎన్నో రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుందనేది ఇప్పటికే మనకు అనుభవమైన విషయం. అతితక్కువ ఖర్చుతో ఉపగ్రహాలను అంతరిక్షంలోకి చేర్చగలగడం ఇస్రో ప్రత్యేకతగా మారింది. కాబట్టి సొంతంగా ఉపగ్రహాలు పంపుకోలేని చాలా దేశాలిప్పుడు భారత్‌ను ఆశ్రయిస్తాయి. ఇది మనకు కలిసొచ్చే అంశం. ఇస్రోకు నేరుగా ప్రయోజనం కలిగితే ఈ సంస్థకు విడిభాగాలు, సామాన్లు సరఫరా చేసే ప్రైవేట్ కంపెనీలు బోలెడన్ని లాభాలు చవిచూస్తాయి. రక్షణ రంగంతోపాటు అంతరిక్ష రంగంలోనూ ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్శించేందుకు కేంద్రం ఆలోచన చేస్తున్న నేపథ్యంలో చంద్రయాన్–3 విజయం చాలా కీలకం కానుంది. విదేశీ కంపెనీలు భారతీయ సంస్థలతో కలిసి పనిచేసేందుకు, లేదా సొంతంగా కార్యకలాపాలు ప్రారంభించేందుకు అవకాశాలు మెరుగవుతాయి. ఉపగ్రహాలను మోసుకెళ్లేందుకు మానవసహిత అంతరిక్ష ప్రయోగాలకు, ఇతర అవసరాలకు వేర్వేరు శక్తిసామర్థ్యాలు కలిగిన జియోసింక్రనస్ లాంఛ్ వెహికల్ కలిగి ఉండటం ఇస్రోకు లాభించే ఇంకో అంశం. భవిష్యత్తు అవసరాల కోసం? 1972 తరువాత భూమి సహజ ఉపగ్రహం చంద్రుడిపై మనిషి కాలుపెట్టలేదు. అయితే అక్కడ నీరు ఉందన్న విషయం స్పష్టమైన తరువాత చాలా దేశాలు వ్యోమగాములను పంపేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. అమెరికా తన ఆర్టిమిస్ ప్రోగ్రామ్ ద్వారా వచ్చే ఏడాదికల్లా చంద్రుడిపైకి వ్యోమగాములను పంపడం, అక్కడే ఒక శాశ్వత స్థావరం ఏర్పాటు చేసుకోవడం వంటి లక్ష్యాలతో పనిచేస్తోంది. జాబిల్లిపై నీటితోపాటు చాలా విలువైన ఖనిజాలు ఉన్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. కాలుష్యరహితమైన, అత్యంత సమర్థమైన హీలియం–3 ఆ వనరుల్లో ఒకటి. భవిష్యత్తులో జాబిల్లిపైని వనరులను వాడుకునే అవకాశం లభిస్తే (శుద్ధి, రవాణా వంటి వాటికి తగిన టెక్నాలజీలు అభివృద్ధి చేసుకోవాలి) అందులో భారత్‌కూ భాగస్వామ్యం లభించేందుకు చంద్రయాన్–3 విజయం సాయపడుతుంది. అలాగే జాబిల్లిని ఒక కేంద్రంగా ఏర్పాటు చేసుకుని సౌర కుటుంబంలోని ఇతర గ్రహాలను అన్వేషించాలని, అంగారకుడిపై స్థిర నివాసం ఏర్పరచుకోవాలని మనిషి చాలాకాలంగా ఆలోచిస్తున్నాడు. ఈ ప్రస్థానంలో జాబిల్లి దక్షిణ ధ్రువం మాదిరిగా ఇతర గ్రహాలపైని అత్యంత కఠినమైన పరిస్థితులను తట్టుకుని వ్యోమనౌకలను ల్యాండ్ చేయడమెలా అన్నది తెలిసిన వారి అవసరం కచ్చితంగా ఉంటుంది. అంతేకాకుండా.. ఇస్రో ఇప్పటికే అనేక దేశాలతో కలిసి అంతరిక్ష ప్రయోగాలు నిర్వహించింది. పరిశోధనల్లోనూ భాగస్వామిగా నిలిచింది. ఈ అనుభవమంతా భవిష్యత్తులో అంతరిక్షాన్ని మన అవసరాల కోసం ఉపయోగించుకునే సందర్భంలో ఉపయోగపడుతుంది. అంతరిక్షాన్ని శాంతియుత ప్రయోజనాల కోసం వాడుకోవాలన్న భారత ప్రకటిత లక్ష్యానికి తగిన విధానాలను రూపొందించవచ్చు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
చందమామపై యాక్సిడెంట్.. మీరేం తీసుకెళ్తారు?
మన ఇస్రో మొన్న చందమామపైకి రోవర్‌ను పంపింది. నిన్న రష్యా కూడా పంపింది. ఇంకొన్నేళ్లు ఆగితే మనుషులూ వెళతారు. అక్కడక్కడా కాలనీలు కట్టుకుంటారు. అప్పుడప్పుడూ జనం భూమ్మీదికి, చంద్రుడిపైకి వచ్చిపోతూ ఉంటారు. ఇంతవరకు సరేగానీ.. ఒకవేళ మీరు చంద్రుడిపైకి వెళ్లిన అంతరిక్ష నౌకలో సమస్య వచ్చి, మనుషుల కాలనీకి దూరంగా పడిపోతే ఎలా? అంతరిక్ష నౌకలో దెబ్బతినగా మిగిలిన వస్తువులను ఎలా వాడుతారు? అన్న ఓ కొత్త సవాల్ తెరపైకి వచ్చింది. అదేమిటో తెలుసుకుందామా? – సాక్షి సెంట్రల్ డెస్క్ ఆలోచనకు పరీక్ష.. మెదడుకు మేత.. అంతరిక్షంలో విహరించాలన్నది చాలా మంది కల. ఇప్పటికే చంద్రుడిపై అడుగుపెట్టాం. ఇటీవల మరిన్ని ప్రయోగాలు చేపట్టాం. భవిష్యత్తులో చంద్రుడిపై కాలనీలనూ కట్టేసుకోనున్నాం. 2025లో మనుషులను చంద్రుడిపైకి పంపేందుకు అమెరికా ఆర్టిమిస్ మిషన్‌ను కూడా చేపట్టింది. ఈ క్రమంలో చంద్రుడిపైకి రాకపోకలు మొదలై, ఏదైనా సమస్య వస్తే ఎలాగన్న ప్రశ్న ఓ వైపు.. అంతరిక్షంపై ఆసక్తి ఉన్నవారికి మేధోశక్తికి పరీక్ష పెట్టడం, కొత్త ఆలోచనలు కల్పించే లక్ష్యం మరోవైపు.. అమెరికాకు చెందిన టెక్సాస్ యూనివర్సిటీ ‘ది నాసా మూన్ సరై్వవల్ టెస్ట్’ను రూపొందించింది. ఏ వస్తువుకు.. ఎంత ప్రాధాన్యత అంటూ.. మీరు చంద్రుడిపైకి కొంత మందితో కలిసి వెళ్లిన స్పేస్‌షిప్.. మనుషులు ఉండే కాలనీకి కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో కూలిపోయింది. కమ్యూనికేషన్ పరికరాలు పాడయ్యాయి. స్పేస్‌షిప్‌లో పాడైనవి పోగా మిగిలిన 15 వస్తువుల సాయంతో.. అక్కడి నుంచి నడుస్తూ కాలనీకి వెళ్లాలి. గ్రావిటీ తక్కువగా ఉంటుంది కాబట్టి ఎగురుతూ, నడుస్తూ వెళ్లాల్సి వస్తుంది. అక్కడ అందుబాటులో ఉన్న సామగ్రి, పరికరాల లిస్టు ఇది.. వీటిలో దేనికి మొదటి ప్రాధాన్యత, తర్వాత దేనికి.. ఇలా అన్నింటికి నంబర్లు వేయాలి. ఉన్నవి ఇవీ.. ప్రాధాన్యతలు ఏవి? ♦ అగ్గిపెట్టె ♦ పోషకాలన్నీ దట్టించిన ప్రత్యేక ఆహారం ♦ 50 అడుగుల నైలాన్ తాడు ♦ పారాచూట్ సిల్క్ (వస్త్రం) ♦ పోర్టబుల్ హీటింగ్ యూనిట్ (వేడిని ఇచ్చే పరికరం) ♦ రెండు కాలిబర్ పిస్టళ్లు ♦ ఒక బాక్స్ నిండా పాల సీసాలు ♦ ఒక్కోటీ 45కిలోల బరువున్న రెండు ఆక్సిజన్ సిలిండర్లు ♦ అంతరిక్షంలో చుక్కల స్థానాన్ని బట్టి మన స్థానం తెలుసుకునే మ్యాప్ ♦ లైఫ్ రాఫ్ట్ (అత్యవసర సమయాల్లో ఒక్కసారిగా గాలి నిండి పడవలా మారే బెలూన్) ♦ దిక్కులను చూపించే మాగ్నెటిక్ కంపాస్ ♦ 20 లీటర్ల నీళ్ల క్యాన్ ♦ సిగ్నల్ ఫ్లేర్స్ (బాణాసంచా రాకెట్లా గాల్లోకి పంపి మన స్థానం తెలిపే పరికరం) ♦ వివిధ రకాల విటమిన్లు, అత్యవసర మందుల సిరంజీలు ఉన్న ఫస్ట్ ఎయిడ్ కిట్ ♦ సోలార్ పవర్‌తో పనిచేస్తూ.. ఎఫ్ఎం రేడియో సిగ్నళ్లు పంపే, అందుకునే పరికరం (చందమామపై కాలనీకి దూరంగా చిక్కుకుపోయిన మీరు వీటిలో ఏయే పరికరాలకు ఎంత ప్రాధాన్యత క్రమం ఇస్తారో ఇవ్వండి. తర్వాత కింద నాసా నిపుణులు ఇచ్చిన ఫలితాలు చూడండి) ఇదీ ప్రాధాన్యత.. దేనికి? ఎందుకు? 1. ఆక్సిజన్ ట్యాంకులు: అంతరిక్షంలో మనం జీవించడానికి ఆక్సిజన్ అత్యంత కీలకం. ఆహారం లేకుండా కొన్నిరోజులు ఉండొచ్చు. స్పేస్‌సూట్ శరీరంలోని నీటిని రీసైకిల్ చేయడం ద్వారా ఇంకొన్ని రోజులు బతకొచ్చు. కానీ ఆక్సిజన్ లేకుంటే నిమిషం కూడా బతకలేం. అందుకే దీనికి ఫస్ట్ ప్రయారిటీ. చంద్రుడిపై గ్రావిటీ తక్కువ కాబట్టి ఆక్సిజన్ ట్యాంకుల బరువు కూడా పెద్ద విషయమేం కాదు. భూమ్మీదితో పోలిస్తే.. ఒక్కో ట్యాంకు ఏడెనిమిది కిలోలే ఉంటుందట. 2. మంచి నీళ్లు: ఆక్సిజన్ తర్వాత అత్యంత ముఖ్యమైనవి మంచి నీళ్లే. తగిన స్థాయిలో నీళ్లు ఉంటే డీహైడ్రేషన్ బారినపడకుండా ఉండొచ్చు. కాలనీకి చేరుకోవచ్చు. 3. అంతరిక్ష మ్యాప్: చంద్రుడిపై కూడా దాదాపు భూమి నుంచి చూసినట్టే.. గ్రహాలు, నక్షత్రాలు, గెలాక్సీలు కనిపిస్తాయి. అందువల్ల ముందే కాలనీలు మార్క్ చేసి ఉన్న మ్యాప్ ఉంటే.. ఆ వైపుగా ప్రయాణం చేయవచ్చు. 4. ప్రత్యేక ఆహారం: చిక్కుకున్న చోటి నుంచి కాలనీకి వెళ్లాలన్నా, రెస్క్యూ బృందం వచ్చేదాకా బతకాలన్నా ఆహారం కావాల్సిందే. 5. ఎఫ్ఎం పరికరం: ఎఫ్ఎం ట్రాన్స్మిటర్/రిసీవర్ పరికరాలు కొన్ని కిలోమీటర్ల వరకే సిగ్నళ్లను పంపడం, అందుకోవడం చేయగలుగుతాయి. అయినా అత్యవసర పరిస్థితుల్లో రెస్క్యూకు, సమీపంలోని ఇతర బృందాలకు సమాచారం ఇవ్వడానికి పనికివస్తాయి. 6. నైలాన్ తాడు: చంద్రుడిపై నైలాన్ తాడు ఎందుకు అనిపించొచ్చు. అక్కడ గ్రావిటీ తక్కువగా ఉంటుంది కాబట్టి ఒకరికొకరు తాడుతో పట్టుకుని ఉండొచ్చు. చిన్నపాటి కొండల్లాంటివి ఉంటే ఎక్కడానికి వినియోగించుకోవచ్చు. మన సామగ్రిని ఒక్కదగ్గర కట్టి ఉంచుకోవచ్చు. 7. ఫస్ట్ ఎయిడ్ కిట్: స్పేస్ షిప్ కూలిపోయినప్పుడు గాయపడినా, ప్రయాణంలో సమస్య తలెత్తినా, ఏదైనా అకస్మాత్తు అనారోగ్యానికి గురైనా ఫస్ట్ ఎయిడ్ కిట్‌తో లాభం ఉంటుంది. అందులోని విటమిన్ ఇంజెక్షన్లు.. మన శరీరం సంతులనంగా ఉండటానికి తోడ్పడుతాయి. 8. పారాచూట్ వస్త్రం: చంద్రుడిపై వాతావరణం ఉండదు. కాబట్టి సూర్యుడి అతినీలలోహిత (యూవీ) కిరణాలు నేరుగా పడతాయి. దీనితో స్పేస్ సూట్, సామగ్రితోపాటు మన కళ్లకూ నష్టం. అలా జరగకుండా పారాచూట్ వస్త్రం కప్పుకోవచ్చు. 9. లైఫ్ రాఫ్ట్: అత్యవసర పరిస్థితుల్లో వాడే లైఫ్రాఫ్ట్లో వేగంగా వాయువు నిండటానికి కార్బన్ డయాక్సైడ్ను బాగా ఒత్తిడితో నింపిన బాటిళ్లు ఉంటాయి. చంద్రుడిపై గ్రావిటీ తక్కువగా ఉంటుంది కాబట్టి.. బాటిళ్లను స్పేస్సూట్కు కట్టుకుని, కార్బన్ డయాక్సైడ్ను మెల్లగా వదులుతూ ఉంటే.. రాకెట్లా ముందుకెళ్లిపోవచ్చు. 10. సిగ్నల్ ఫ్లేర్స్: కాలనీలకు దూరంగా ఎక్కడో స్పేస్‌షిప్ కూలిపోతే.. సిగ్నల్ ఫ్లేర్స్‌తో ప్రయోజనం లేనట్టే. అయితే రెస్క్యూ బృందాలు వచ్చినప్పుడు మాత్రం వాటితో మనమున్న స్థానాన్ని గుర్తించేలా చేయవచ్చు. 11. కాలిబర్ పిస్టళ్లు: చందమామపై పిస్టళ్లు దేనికి అనే అనుమానం రావొచ్చు. అయితే లైఫ్ రాఫ్ట్లలోని కార్బన్ డయాక్సైడ్ క్యాన్ల తరహాలో.. మనం వేగంగా ముందుకు దూసుకెళ్లేందుకు రాకెట్లలాగా పిస్టల్ కాల్పులు ఉపయోగపడతాయట. 12. పాల క్యాన్లు: పోషకాలతో కూడిన ప్రత్యేక ఆహారం ఎలాగూ ఉంది. ఇంకా ఈ పాలక్యాన్లు అదనపు బరువు. ఎక్కువ కాలం వేచి ఉండాల్సి వస్తే మాత్రం వీటితో ప్రయోజనం 13. హీటింగ్ యూనిట్: చంద్రుడిపై వెలుతురు భాగంలో వేడికి కొదవ లేదు. ఒకవేళ చీకటి భాగంలోకి వెళితే మాత్రం హీటింగ్ యూనిట్ అవసరం. లేకుంటే ఉత్తదే. 14. మ్యాగ్నెటిక్ కంపాస్: చంద్రుడిపై అయస్కాంత క్షేత్రం సరిగా లేదు. అందువల్ల అక్కడ మ్యాగ్నెటిక్ కంపాస్‌కు పనిలేదు. 15. అగ్గిపెట్టె: దీన్ని ఎంచుకోవడం అన్నింటికన్నా వృథా. ఎందుకంటే చంద్రుడిపై ఆక్సిజన్ ఉండదు కాబటి అగ్గిపుల్ల వెలగదు, మంట అంటుకోదు. మనం సరై్వవ్ కావడానికి ఏమాత్రం పనికిరాదు. -
ఏలియన్ల అన్వేషణ! ప్చ్.. ఇలాంటివన్నీ చైనాకే కనిపిస్తాయా?
Cube Shaped House On Moon, Viral Photos: ఛాన్స్ దొరికిందంటే చాలు.. చైనావాళ్లను సోషల్‌మీడియాలో ఒక రేంజ్‌లోనే ఆడేసుకోవడం మనవాళ్లకు బాగా అలవాటైంది. అంతెందుకు కరోనా వైరస్ విషయంలో చైనా పాత్రను ధృవీకరించేసుకుని మరీ ఆడుకున్నంత ఆట అంతా ఇంతా కాదు. ఈ తరుణంలో ఇప్పుడు మరో సెటైర్ పేలుతోంది. చైనాకు చెందిన రోవర్ ‘యుటు-2’ 2019లో చంద్రుడి మీదకు చేరి, పరిశోధనలు మొదలుపెట్టింది. అయితే తాజాగా ఇది చంద్రుడి మీద క్యూబ్ ఆకారంలో ఒక వస్తువును గుర్తించింది. ఆ ఫొటోల్ని చైనా స్పేస్ ఏజెన్సీ సీఎన్ఎస్ఏ (China National Space Administration) రిలీజ్ చేసింది. వోన్ కర్మన్ ప్రాంతానికి 80 మీటర్ల దూరంలో గుర్తించినట్లు వెల్లడించారు. ఇక్కడి నుంచే అసలు విషయం మొదలైంది. ఇదొక మిస్టరీ హౌజ్ కావొచ్చని, బహుశా ఏలియన్ల నివాసం కావొచ్చని చైనా స్పేస్ రీసెర్చర్లు ముందస్తు ప్రకటనలు ఇచ్చుకున్నారు. మరొకొన్ని రోజుల్లో ఏలియన్ల మిస్టరీ గుట్టు తేలుస్తామంటూ తొందరపడి అధికారిక మీడియా ద్వారా స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. అంతే.. రాళ్లు, రప్పాలపై చైనా చేస్తున్న అతివ్యహారంపై సెటైర్లు పడుతున్నాయి. ఇక ఇలాంటి వన్నీ చైనా వాళ్లకే కనబడతాయంటూ ఇంటర్నెట్లో మనవాళ్లు జోకులు, దొరికితే సూప్ చేసుకుని తాగుతారా? అంటూ సెటైర్లు పేలుస్తున్నారు. సాధారణంగా యూఎఫ్‌వో-అమెరికా మీద ఎక్కువ ఇంటర్నెట్లో వెటకారం కనిపిస్తుంటుంది. pic.twitter.com/OrhWdHroDt — Joseph VR777 (@JosephRuggiero4) December 5, 2021 కానీ, చైనా మీద మాత్రం ఏలియన్ల వ్యవహారంలో జోకులు పేలుతుంటాయి. అందుకు కారణం లేకపోలేదు. చైనా ఏకంగా ఏలియన్ల ఉనికి కోసమే అడ్డగోలుగా ఖర్చు పెడుతోంది. ఇదివరకే ఏలియన్ల ఉనికిని పసిగట్టడం కోసం భారీ టెలిస్కోప్ రాడార్ రీసెర్చ్ సెంటర్‌ను ఏర్పాటు చేసిన డ్రాగన్ కంట్రీ.. ప్రత్యేకమైన స్పేస్ సెంటర్ టియాన్గోంగ్ను కూడా అందుకే నిర్మిస్తోందంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే చంద్రుడిపై కనిపించిన ఆ ఆకారం.. ఏ స్థూపమో లేదంటే ఏలియన్లకు సంబంధించిందో కాదని, కానీ, ఆసక్తిని రేకెత్తించేదిగా ఉందంటూ స్పేస్ డాట్ కామ్ జర్నలిస్ట్ ఆండ్రూ జోన్స్ తెలిపారు. రోవర్ నుంచి ఆ నిర్మాణానికి కేవలం 80మీటర్ల దూరమే ఉంది. కానీ, చేరుకోవడానికి 3 నెలల టైం పడుతుందట!. అప్పుడుగానీ అదెంటో మిస్టరీ వీడుతుందన్నమాట. It's an Amazon delivery. — Sandra Sarff (@SandySarff) December 5, 2021 pic.twitter.com/c9alRuvUtQ — ConnorJC (@ConnorJConroy) December 6, 2021 It's a Chinese photo shop — Ross Probert (@probiesr) December 4, 2021 చదవండి: ప్రపంచానిది ఓ దారి.. చైనాది మరో దారి! ఏలియన్ల కోసం ఆరునెలలు.. -
SpaceBok: మార్స్ జీవం గుట్టు తేల్చే రోబో
మన భూమ్మీదనే కాకుండా ఇంకెక్కడైనా జీవం ఉందా? ఇంతకుముందైనా ఉండేదా..? చాలా కాలంగా శాస్త్రవేత్తలను తొలిచేస్తున్న ప్రశ్నలివి. ఈ ఆసక్తితోనే సౌర కుటుంబంలోని వివిధ గ్రహాల వద్దకు శాటిలైట్లను పంపుతున్నారు. ముఖ్యంగా భూమిని పోలి ఉన్న అంగారక (మార్స్) గ్రహంపై పరిశోధనలు చేస్తున్నారు. ఇప్పటికే అక్కడకు రోవర్లను పంపారు. తాజాగా నాలుగు కాళ్లతో నడిచే ఓ రోబోను పంపేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఆ విశేషాలు ఏమిటో తెలుసుకుందామా? ఏమిటీ రోబో.. ఎందుకీ ప్రయోగం? ఇప్పటికే అంగారకుడిపైకి పలుమార్లు రోవర్లను పంపారు. చిన్న కారు పరిమాణంలో ఉండి చక్రాలతో కదులుతూ పరిశోధనలు చేసే ఈ రోవర్లకు చాలా పరిమితులు ఉన్నాయి. అవి కదిలే వేగం చాలా తక్కువ, రాళ్లురప్పలు, ఇసుక వంటివి ఉంటే ముందుకు ప్రయాణించలేవు. ఎత్తైన చోట్లకు వెళ్లడం కష్టం. ఈ నేపథ్యంలోనే స్విట్జర్లాండ్‌కు చెందిన ఈటీహెచ్‌జ్యూరిచ్, జర్మనీకి చెందిన మాక్స్‌ప్లాంక్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తల బృందం ‘స్పేస్‌బాక్’పేరుతో నాలుగు కాళ్లతో నడిచే ప్రత్యేకమైన రోబోను రూపొందించింది. అంగారకుడిపై జీవం ఉనికిని గుర్తించేందుకు దీనిని త్వరలోనే పంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నిజానికి చంద్రుడిపై పరిశోధనల కోసం ఈ రోబోను రూపొందించారు. తర్వాత మార్స్‌పైకి పంపేందుకు వీలుగా మార్పులు చేశారు. భూమి అవతల ఇలా కాళ్లతో నడిచే రోబోను వినియోగించనుండటం ఇదే తొలిసారి కానుంది. రోవర్లకు సమస్యలు రావడంతో.. మార్స్ పైకి 2006లో పంపిన ఆపర్చునిటీ రోవర్ ఓసారి ఇసుకలో ఐదు వారాల పాటు చిక్కుకుపోయింది. చివరికి మెల్లగా బయటపడింది. ఇక 2009లో పంపిన స్పిరిట్రోవర్కూడా పెద్ద రాళ్లు ఉన్న ఇసుకలో చిక్కుకుపోయింది. అది బయటికి రాలేకపోవడంతో ఆ మిషన్నే ఆపేశారు. ఇలాంటి సమస్య లేకుండా పనిచేసేలా ‘స్పేస్‌బాక్’ను రూపొందించారు. ప్రస్తుతం మార్స్‌పై నాసాకు చెందిన క్యూరియాసిటీ, పర్సవరెన్స్‌రోవర్లు, చైనాకు చెందిన ఝురోంగ్ రోవర్ పరిశోధనలు చేస్తున్నాయి. ‘స్పేస్‌బాక్’.. ఈజీ గోయింగ్ రాళ్లురప్పలు, ఇసుకతో కూడిన ప్రాంతాల్లో అయినా, గుంతలుగా, ఎత్తుపల్లాలతో ఉన్న చోట, చిన్న చిన్న కొండలపైకి ఈ ‘స్పేస్‌బాక్’రోబో సులువుగా వెళ్లగలదు. ఇందుకోసం దీని కాళ్లను ప్రత్యేకంగా డిజైన్‌చేశారు. ఎత్తు పల్లాలు ఉన్నప్పుడు పడిపోకుండా, ఎక్కువ శక్తి వృథా కాకుండా అటూ ఇటూ వంకరటింకరగా నడిచేలా సాఫ్ట్‌వేర్‌ను నిక్షిప్తం చేశారు. మార్స్‌పై ఉండే నేల వంటిదానిని ల్యాబ్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసి పరీక్షించగా.. ఈ రోబో సులువుగా నడవగలిగింది. అయితే ఈ రోబో రోవర్లకు ప్రత్యామ్నాయం కాదని.. రోవర్లకు వీలుకాని చోట్లకు వెళ్లి పరిశోధన చేసేందుకు ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. చదవండి: Fastskin 4.0: ఆక్వామ్యాన్ లాంటి సూట్.. ఎలా పని చేస్తుందంటే.. -
కేజీ మట్టి.. ఆరున్నర లక్షల కోట్లు!!
అవును.. కేజీ మట్టి కోసం అన్ని లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నమాట నిజమే. కాకపోతే అది భూమ్మీద మట్టి కోసం కాదు. అంతరిక్షంలో అదీ అంగారక గ్రహం మీద మట్టి కోసం. ఈ విషయాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా అధికారికంగా ప్రకటించింది. మార్స్ మీద దిగిన నాసా పర్సీవరెన్స్ రోవర్ ఇదివరకే పరిశోధనలు మొదలుపెట్టిన విషయం తెలిసిందే. అయితే అత్యంత విలువైందిగా భావిస్తున్న అక్కడి మట్టిని భూమ్మీదకు రప్పించే ప్రయత్నాలు చేస్తోంది నాసా. ఈ ప్రాజెక్టు కోసం నాసా 9 బిలియన్ల డాలర్లు ఖర్చు చేయబోతోంది. ఒకవేళ అంగారక గ్రహం మీద మట్టి భూమ్మీదకు చేరితే గనుక.. ఇప్పటిదాకా భూమ్మీది అపురూపమైన వస్తువులలో అదే అగ్రస్థానంలో ఉంటుంది. దాదాపు రెండు పౌండ్ల మట్టి(దాదాపు కేజీ)ని మట్టిని మార్స్ నుంచి తెప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొత్తం మూడు దశలో ఈ ప్రాజెక్టు ఉండబోతుంది. అయితే ఈ శాంపిల్ సేకరణ ప్రక్రియ మొత్తం పూర్తి కావడానికి రెండేళ్లు పట్టే అవకాశం ఉందని నాసా చెబుతోంది. ఇక ఆ మట్టిని భూమ్మీదకు తేవడానికి మరో పదేళ్లకాలం పైనే పట్టొచ్చని అంచనా. కాగా, మార్స్ మట్టి కోసం ఇంత ఖర్చు చేయబోతున్న నాసా తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి కూడా. చదవండి: మార్స్‌పై ఆక్సిజన్ -
అంగారకుడిపై ‘జురోంగ్’ తొలి అడుగులు
బీజింగ్: అంగారక గ్రహం ఉపరితలంపై జీవం మనుగడకు గల పరిస్థితులను అన్వేషించేందుకు డ్రాగన్ దేశం చైనా తొలిసారిగా ప్రయోగించిన జురోంగ్ రోవర్ తన విధులు నిర్వర్తించేందుకు రంగం సిద్ధమయ్యింది. శనివారం ల్యాండర్ నుంచి జురోంగ్ విజయవంతంగా బయటకు అడుగుపెట్టింది. ఆరు చక్రాలున్న ఈ రోవర్ బరువు 240 కిలోలు. సౌర శక్తితో పని చేస్తుంది. ల్యాండర్ నుంచి నెమ్మదిగా కిందికి దిగి, మార్స్‌పై ఇసుక నేలలో పాదం మోపినట్లు చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్(సీఎన్ఎస్ఏ) ప్రకటించింది. అరుణ గ్రహంపై పరిశోధనల కోసం చైనా 2020 జూలై 23న టియాన్వెన్–1న మిషన్‌కు శ్రీకారం చుట్టింది. ఇందులో ఆర్బిటార్, ల్యాండర్, రోవర్ ఉన్నాయి. ల్యాండర్ ఈ నెల 15న మార్స్‌పై దిగింది. జురోంగ్ రోవర్ మూడు నెలలపాటు పని చేయనుంది. -
అంగారకుడిపై అరుణ పతాకం
బీజింగ్: డ్రాగన్ దేశం ప్రయోగించిన జురోంగ్ రోవర్ అంగారక గ్రహంపై శనివారం విజయవంతంగా దిగింది. అరుణ గ్రహంపై రోవర్‌ను దింపిన రెండో దేశంగా చైనా చరిత్ర సృష్టించింది. 9 నిమిషాల ఉత్కంఠ పరిస్థితుల తర్వాత తమ రోవర్ మార్స్‌పై దిగినట్లు చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (సీఎన్ఎస్ఏ) ప్రకటించింది. చైనా పురాణాల్లోని అగ్నిదేవుడి పేరు జురోంగ్. 320 మిలియన్ కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత.. ముందే నిర్దేశించినట్లుగా మార్స్‌పై ఉటోపియా ప్లానిటియా దక్షిణ ప్రాంతంలో జురోంగ్ చైనా కాలమానం ప్రకారం ఉదయం 7.18 గంటలకు అడుగు మోపింది. రోవర్ మార్స్‌పై దిగాక తన సోలార్ ప్యానెళ్లను, యాంటెనాను విప్పుకొని, సిగ్నల్స్ పంపించగానే చైనా స్పేస్ సైంటిస్టులు హర్షాతిరేకాలు చేశారు. అంగారకుడిపై విజయవంతంగా ఎర్రజెండా పాతి, స్పేస్ ప్రాజెక్టుల్లో తాను ముందంజలో ఉన్నానన్న సంకేతాలను ప్రపంచ దేశాలకు చైనా పంపించింది. ప్రాజెక్టును విజయవంతం చేసిన తమ స్పేస్ సైంటిస్టులకు చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ అభినందనలు తెలిపారు. ఆరు చక్రాలున్న జురోంగ్ రోవర్ సౌర విద్యుత్‌తో పనిచేస్తుంది. తనకు అవసరమైన విద్యుత్‌ను సొంతంగా ఉత్పత్తి చేసుకుంటుంది. ఈ రోవర్ బరువు 240 కిలోలు. తన వెంట ఆరు శాస్త్ర సాంకేతిక పరికరాలను మార్స్‌పైకి మోసుకెళ్లింది. ల్యాండర్ నుంచి వేరుపడిన తర్వాత మూడు నెలల పాటు విధులు నిర్వర్తిస్తుంది. అరుణ గ్రహం ఉపరితలంపై జీవించడానికి అనువైన పరిస్థితులు ఉన్నాయా? లేదా? అనేది పరిశీలిస్తుంది. -
అరుదైన రికార్డ్: అమెరికా సరసన చేరిన చైనా
బీజింగ్: అంతరిక్ష పరిశోధనలు, ప్రయోగాల్లో చైనా దూసుకుపోతుంది. ఇప్పటికే ఛాంగీ–5 శోధక నౌక ద్వారా చంద్రుడి నమూనాలు భూమీ మీదకు తీసుకువచ్చిన డ్రాగన్ దేశం.. వచ్చే ఏడాదికల్లా అంతరిక్షంలో సొంతంగా స్పేస్ స్టేషన్ నిర్మించుకునేందుకు ప్రయత్నించడమే కాక వచ్చే నెలలో ముగ్గురు వ్యోమగాముల్ని అంతరిక్షంలోకి పంపడానికి ప్రయత్నిస్తున్న సంగతి తెలిసందే. ఈ క్రమంలో తాజాగా చైనా మరో అరుదైన రికార్డు సృష్టించి అగ్రరాజ్యం అమెరికా సరసన చేరింది. అంగారక గ్రహంపై చైనా రోవర్ ఝురొంగ్ విజయవంతంగా ల్యాండ్ అయినట్లు ఆ దేశ అదికారిక మీడియా ప్రకటించింది. అమెరికా తర్వాత... మార్స్‌పై రోవర్‌ని దించిన రెండో దేశంగా చైనా నిలిచింది. ఈ మేరకు చైనా అధికారిక మీడియా శనివారం ఉదయం (నేడు).. మార్స్ మీద ఉన్న సున్నితమైన వాతావరణంలో... ఓ విశాల మైదానంలో... రోవర్‌ను సురక్షితంగా దింపినట్లు వెల్లడించింది. ఇక నాసా లాగే... చైనా కూడా... మార్స్‌పై మట్టి ఎలా ఉంది, అందులో ఏ ఖనిజాలు ఉన్నాయి... అక్కడి కొండలు, గుట్టలు అన్నింటినీ అత్యంత దగ్గర నుంచి రోవర్ ద్వారా పరిశీలించగలదు. చైనా మార్స్ మిషన్ ఇది.. గత జులైలో చైనా... తియాన్వెన్-1మిషన్‌ను మార్స్ మీదకు పంపింది. అందులో ఓ ఆర్బిటర్, ఓ ల్యాండర్, ఓ రోవర్ ఉన్నాయి. ఫిబ్రవరి 10న ఈ మిషన్... మార్స్ వాతావరణంలోకి చేరింది. ఆ తర్వాత గుండ్రంగా తిరుగుతూ ల్యాండింగ్ క్షణాల కోసం ఎదురుచూసింది. రోవర్ పేరు ఝురోంగ్. చైనా జనపదాల్లో అగ్నిని ఝురోంగ్ అనేవారు. అదే పేరును దానికి పెట్టింది. ఈ ఝురోంగ్ రోవర్... 240 కేజీల బరువు ఉంది. ఇది సోలార్ పవర్ ఉపయోగించుకొని మార్స్‌పై తిరగగలదు. దీనికి కెమెరాలు, రాడార్, మాగ్నెటిక్ ఫీల్డ్ డిటెక్టర్, వెదర్ స్టేషన్ వంటివి ఉన్నాయి. 1976 నుంచి ఇప్పటి వరకు అమెరికా అంగారక గ్రహంపై తొమ్మిది సార్లు రోవర్లును విజయవంతంగా ల్యాండ్ చేసింది. 1971 లో సోవియట్ యూనియన్ అంగారక గ్రహం మీద అడుగుపెట్టింది. అయితే ల్యాండ్ అయిన తరువాత సమాచారం పంపడంలో విఫలమవడంతో ఈ మిషన్ ఫెయిల్ అయినట్లు ప్రకటించారు. చదవండి: అంగారక గ్రహంపై ఆక్సిజన్...! -
రోవర్ ల్యాండింగ్ సైటు పేరెంటో తెలుసా..
లాస్ఎంజిల్స్: అంగారక గ్రహంపై పరిశోధనల నిమిత్తం నాసా పంపిన పర్సెవరన్స్ రోవర్ దిగిన స్థలానికి నాసా పేరుపెట్టింది. రోవర్ దిగిన స్థలానికి ప్రముఖ సైన్స్ ఫిక్షన్ రచయిత ‘ఆక్టేవియా ఇ బట్లర్ ’ పేరును పెట్టారు. అంగారక గ్రహంపై రాళ్లు, మట్టిని పరిశోధించడం, సూక్ష్మజీవుల ఉనికిని అన్వేషించడం, నేరుగా మానవుడు ల్యాండ్ అవ్వడానికి అనువైన స్థలాన్ని వెతకడం పర్సెవరన్స్ విధి. గతంలో మార్స్‌పై దిగిన క్యూరియాసిటి రోవర్ ల్యాండింగ్ స్థలానికి ‘రే బ్రాడ్బరీ’ రచయిత పేరును 2012 ఆగస్టు 22న పెట్టారు. గత ఏడాది జూలై 30 న ఈ రోవర్‌ను నాసా ప్రయోగించిన విషయం తెలిసిందే . ఇది 203 రోజుల ప్రయాణం తరువాత ఫిబ్రవరి 18 న అంగారక గ్రహానికి చేరింది. (చదవండి:మార్స్‌పై రోవర్ అడుగులు షురూ!) -
మార్స్‌పై రోవర్ అడుగులు షురూ!
లాస్ఏంజెల్స్: మార్స్‌పై పరిశోధనల నిమిత్తం నాసా పంపిన పర్సెవరెన్స్ రోవర్ తాజాగా అంగారక ఉపరితలంపై టెస్ట్‌డ్రైవ్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. కుజుడిపై పరిశోధనలు ప్రారంభించే ముందు ఈ రోవర్ 6.5 మీటర్ల మేర ప్రయాణం చేసింది. ఇందుకు సుమారు 33 నిమిషాలు పట్టిందని నాసా వెల్లడించింది. రోవర్ పనితీరులో ఇది పెద్ద ముందడుగుగా అభివర్ణించింది. రోవర్‌లోని ప్రతి వ్యవస్థ పనితీరును చెక్ చేయడానికి ఈ టెస్ట్ డ్రైవ్ నిర్వహించినట్లు తెలిపింది. ఇతర గ్రహాలపై రోవర్ల టెస్ట్‌డ్రైవ్‌కు ఎంతో ప్రాముఖ్యత ఉంటుందని, పర్సెవరెన్స్ ఈ పనిని అద్భుతంగా నిర్వహించిందని, దీనివల్ల రాబోయే రెండేళ్ల పాటు రోవర్ పనితీరు బాగుంటుందని నమ్ముతున్నట్లు నాసా సైంటిస్టు అనైస్ జరిఫియన్ చెప్పారు. ఇకపై పరిశోధనల్లో భాగంగా రోవర్ 200 మీటర్ల దూరాలను కూడా కవర్ చేయాల్సిఉంటుందన్నారు. గతనెల 18న ఈరోవర్ మార్స్‌పై లాండ్ అయింది. కుజుడిపై రాళ్లు, మట్టిని పరిశోధించడం, సూక్ష్మజీవుల ఉనికిని అన్వేషించడం, మనిషి లాండ్ అయ్యే అవకాశాలను పరిశీలించడం దీని విధులు. -
వర్క్ ఫ్రమ్ హోమ్: లండన్ టు అంగారకుడు
భూమి పైనుండి అంగారక పరిశోధనలు జరుపుతున్న ప్రొఫెసర్ సంజీవ్ గుప్తా.. బ్రిటన్ నుంచి అమెరికా మాత్రం ప్రయాణించలేకపోయారు! కారణం కరోనా నిబంధనలు. ప్రస్తుతం మార్స్ పైనున్న ‘పెర్సీ’ చేత రాళ్లు రప్పలూ, మట్టి ఎత్తించవలసింది ఆయనే. సంజీవ్ గుప్తా జియాలజిస్ట్. నాసా సైంటిస్ట్. ఎర్సీ టీమ్ మొత్తం కాలిఫోర్నియాలోని ‘జెట్ ప్రొపెల్షన్ లేబరేటరీ’ నుంచి పని చేస్తుంటే, ఆ టీమ్ సభ్యుడు అయిన సంజీవ్ ఒక్కరే సౌత్ లండన్ లోని ఒక అపార్ట్మెంట్ నుంచి ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ చేస్తున్నారు! తొమ్మిదేళ్ల తర్వాత పెర్సీ భూమి మీదకు తిరిగి వస్తుంది. అప్పటి వరకు ప్రొఫెసర్ సంజీవ్ (55) ఈ అపార్ట్మెంట్ లోనే 5 కంప్యూటర్ లు, 2 వీడియో కాన్ఫెరెన్సింగ్ స్క్రీన్ లతో 24 గంటలూ పనిచేస్తుంటారు. మార్స్ ది ఒక టైమ్ జోన్. కాలిఫోర్నియాది ఒక టైమ్ జోన్. సౌత్ లండన్‌ది ఒక టైమ్ జోన్. మూడు భిన్నమైన టైమ్ జోన్ల పర్మినెంట్ ‘జెట్ లాగ్’ నుంచి ఆయన్ని సేద తీర్చే మోనిటర్లు భార్యాపిల్లలే. ఇంతలా వర్క్‌ని, హోమ్నీ బ్యాలెన్స్ చేసుకుంటున్న ప్రొఫెసర్ సంజీవ్ గుప్తా ‘గ్రహస్తు జీవితం’ గురించి తెలుసుకోవలసిందే. దక్షిణ లండన్‌లోని ఒక అపార్ట్మెంట్లో దిగువ భాగాన ఉన్న హెయిర్ కటింగ్ సెలూన్‌కు సరిగ్గా పై పోర్షన్లో ఉంటారు ప్రొఫెసర్ సంజీవ్ గుప్తా. అక్కడి నుంచి ఆయన తన ఆఫీస్ వర్క్ చేస్తుంటారు. వర్క్ ఫ్రమ్ హోమ్. ఇంటిలో నుంచి ఆఫీస్ పని చేస్తున్నా, ఆయన చేస్తున్నది భూమి పై ఉన్న ఆఫీస్ పని కాదు. మార్స్ పని! వాడుక పలుకుబడిలో చెప్పాలంటే.. ఈ నెల 18న అంగారకుడిపై దిగిన రోవర్ ‘పెర్సీ’ చేత మట్టి తట్టలు మోయించే పనిలో ఉన్నారు సంజీవ్ గుప్తా! కేవలం మట్టి మాత్రమే కాదు. రాళ్లూ రప్పలు కూడా. పెర్సీ వాటిని చిన్న చిన్న మూటలు కట్టి ఉంచుతుంది. తిరిగి భూమిపైకి వచ్చేటప్పుడు తనతో పాటు ఆ మూటల్ని తెస్తుంది. ఆ తర్వాత వాటిని స్టడీ చేసే బాధ్యత కూడా సంజీవ్ గుప్తాదే. ఆయన జియాలజిస్టు. భూవిజ్ఞాన శాస్త్రవేత్త. భూమి ఒక్కటే కాదు. గ్రహాల ఉపరితలాల నేలల్ని, సముద్రాల అట్టడుగుల్నీ అధ్యయనం చేయగల నిపుణులు. నాసా సైంటిస్ట్. పెర్సీని అంగారకుడికి పంపడంలోని నాసా ఉద్దేశం తెలిసిందే. మానవ నివాస యోగ్యమైన వాతావరణం అక్కడ ఉందా లేదా, ఉండి ఉండేదా అని తెలుసుకోవడం. నాసా కోసం ప్రొఫెసర్ సంజీవ్ గుప్తా (55) ఉండవలసింది యూ.ఎస్‌లోనే అయినప్పటికీ బ్రిటన్ నుంచే పని చేస్తున్నారు. ఇండియా నుంచి వలస వెళ్లిన కుటుంబం వాళ్లది. గుప్తా లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీ ప్రొఫెసర్. యు.ఎస్. మార్స్ ‘పెర్సీ’ ప్రాజెక్ట్ బృందంలో ఆయన కీలక సభ్యుడు. భార్యా పిల్లలు లండన్‌లో ఉండటంతో వాళ్లతోపాటు సంజీవ్‌ను అక్కడే ఉండి ప్రాజెక్ట్ పని చేసేందుకు నాసా సమ్మతించింది. అందుకు అవసరమైన ఉపకరణాలను, టెక్నాలజీని ఆయన ఆపార్ట్‌మెంట్‌లో ఏర్పాటు చేసింది. ఐదు కంప్యూటర్లు, రెండు వీడియో కాన్ఫరెన్సింగ్ స్క్రీన్లు, మధ్య మధ్య భార్య అందించే టీ, టిఫిన్లు, భోజనం, కాఫీలతో ఆయన వర్క్ ఫ్రమ్ హోమ్ ఇరవై నాలుగు గంటలూ నిర్విరామంగా సాగుతూనే ఉంటుంది. నిద్రవేళల్ని కూడా మెల్లిగా ఆయన క్రమబద్ధం చేసుకోగలిగారు. అంగారకుడిపై ఉన్న రోవర్ కదలికల్ని అక్కడి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మూడు వేర్వేరు ప్రాంతాల సమన్వయంతో నియంత్రిస్తూ ఉండవలసిన ఒక శాస్త్రవేత్త వర్క్ ఫ్రమ్ హోమ్ ఎలా ఉంటుందో ఊహించండి. పెర్సీ ఉన్నది మార్స్ మీద. పెర్సీ బృందం ఉన్నది కాలిఫోర్నియాలోని జెట్ ప్రొపల్షన్ లేబరేటరీలో. ప్రొఫెసర్‌గారు ఉన్నది దక్షిణ లండన్‌లోని తన అపార్ట్మెంట్లో. మూడూ మూడు టైమ్ జోన్లు. ఒకసారి విమానయానం చేసొస్తేనే ‘జెట్ లాగ్’ అంటుంటారు. అలాంటి వివిధ టైమ్ జోన్లలో సంజీవ్ గుప్తా తన విధులను నిర్వర్తిస్తున్నారు. ఆయనకు ఆ శక్తిని ఇస్తున్నది చేస్తున్న పని ధ్యాస మాత్రమే కాదు. భూమిపై ఆయన్నొక పెర్సీలా కనిపెట్టుకుని ఉంటున్న అర్ధాంగి కూడా. జెట్ ప్రొపల్షన్ లేబరేటరీలో వందల మంది నాసా సైంటిస్టులు ల్యాప్‌టాప్‌లోకి కూరుకుపోయి గడియారాల్లా పని చేస్తుంటారు. వారందరితో ఏకకాలంలో గానీ, విడివిడి గానీ ప్రొఫెసర్ సంజీవ్ మాట్లాడవలసి ఉంటుంది. ఇది ఆయన కు పెద్దసంగతేమీ కాదు. ప్రస్తుతం ఆయన మానసికంగా 2030లో ఉన్నారు! భూమిపైకి పెర్సీ మణులు మాణిక్యాల్లాంటి మట్టి రాళ్లను తీసుకొచ్చే సంవత్సరం అది. 1,043 కిలోల బరువు గల ఆ రోవర్‌ను అంగారకుడిపై కదిలిస్తూ ఉండే శాస్త్రవేత్త ఒకరు. రీచార్జ్ చేస్తుండేవారొకరు. ప్రోగ్రామింగ్ చేస్తుండేవారు వేరొకరు. ఇలా పెర్సీ ప్రాజెక్ట్ టీమ్‌లో ప్రొఫెసర్ సంజీవ్ ఒకరు. ఏ రాయిని పడితే ఆ రాయిని, ఏ ధూళిని పడితే ఆ ధూళిని కాకుండా, జీవం కనుగొనేందుకు వీలైన వాటిని పెర్సీ చేతబట్టేలా చేయడం ఆయన ప్రధాన విధి. పెర్సీ దిగేందుకు ‘జెజెరో’ బిలాన్ని ఎంపిక చేసినవారిలో సంజీవ్ కూడా ఉన్నారు. సంజీవ్ గుప్తాకు 5 ఏళ్ల వయసులో ఆయన తల్లిదండ్రులు ఆగ్రా నుంచి బ్రిటన్ వలస వెళ్లారు. ఆయన తండ్రి కూడా రిసెర్చ్ సైంటిస్టే. అయితే తన కొడుకు మెడిసిన్ గానీ, మామూలు ఇంజినీరింగ్ గానీ చేయాలని ఆయన అనుకున్నారు. సంజీవ్ మాత్రం జియాలజీ వైపు ఆకర్షితులయ్యారు. ఆల్ప్ పర్వతాలు ఎలా ఏర్పడ్డాయనే విషయమై ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోని ‘సెయింట్ క్రాస్ కాలేజీలో’ సంజీవ్ పీహెచ్.డీ చేశారు. హిమాలయాలు, జర్మనీలోని ‘బ్లాక్ ఫారెస్ట్’ పర్వత శ్రేణులు, అట్లాంటిక్ సముద్ర గర్భంలోని అడుగు నేలలపైన కూడా సంజీవ్ గుప్తా అధ్యయనం జరిపారు. అంగారకుడిపై నీటి జాడలు ఉండేవని కానీ, ఉన్నట్లు లేవని ఈ ప్రపంచానికి నిర్థారణగా చెప్పగలవారు ప్రస్తుతానికైతే గుప్తా ఒక్కరే. అలాగని అందుకు తోడ్పడే పెర్సీ ‘మట్టిమూటల’ కోసం ఆయన మరో పదేళ్లు ఆగనక్కర్లేదు. ఈలోపే వేరొక మార్గంలో అంగారకుడి నుంచి భూమి పైకి ఆక్కడి మట్టి నమూనాలు చేరినా చాలు. వాటిని సంజీవ్ విశ్లేషిస్తారు. ‘వేరొక మార్గం’ అంటే.. ఇప్పుడు పెర్సీని అంగారకుడిపై వదిలి వచ్చిన వన్ టైమ్ రాకెట్ కాకుండా, భూమిపైకి తిరిగి వచ్చే రీ యూజబుల్ రాకెట్ అక్కడికి వెళ్లినప్పుడు పెర్సీ సేకరించిన నమూనాలను తీసుకురావడం. తెచ్చి సంజీవ్ చేతికివ్వడం. -
పెర్సి ల్యాండింగ్ : అద్భుతం, తొలి ఆడియో
వాషింగ్టన్: మార్స్‌పై జరుగుతున్న పరిశోధనల క్రమంలో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. అంగారక గ్రహంపై ‘పర్సవరన్స్’ రోవర్ ల్యాండ్ అవుతున్న అద్భుత క్షణాలకు సంబంధించిన వీడియోను అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా విడుదల చేసింది. ‘‘రోవర్‌లోని మైక్రోఫోన్ మార్స్ నుండి వచ్చే శబ్దాలను ఆడియో రికార్డింగ్‌ను అందించింది. ఇలాంటి శబ్దాలను, వీడియోను సాధించడం ఇదే మొదటిసారి..ఇవి నిజంగా అద్భుతమైన వీడియోలు" అని జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ డైరెక్టర్ మైఖేల్ వాట్కిన్స్ ఆనందంగా ప్రకటించారు. ఫిబ్రవరి 18న ఈ ల్యాండింగ్‌ను రికార్డు చేసేందుకు 7 కెమెరాలను ఆన్ చేశామని, రోవర్లో రెండు మైక్రోఫోన్లు, 25 కెమెరాలు ఉన్నాయన్నారు. భవిష్యత్తులో మరిన్ని వీడియోలు, ఫొటోలు విడుదల చేస్తామని నాసా సైన్స్ అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్ థామస్ జుర్బుచెన్ వెల్లడించారు. (పెర్సి సక్సెస్.. మార్స్ ఫోటోలు షేర్ చేసిన నాసా) పర్సవరన్స్ రోవర్ శుక్రవారం అరుణగ్రహంపై ల్యాండ్ అయినసంగతి తెలిసిందే. ఇది రెడ్ ప్లానెట్‌లో ప్రవేశించిన, డీసెంట్ అండ్ ల్యాండింగ్ (ఇడీఎల్) చివరి నిమిషాల్లో ప్రధాన మైలురాళ్లను రికార్డు చేసింది. రోవర్ ల్యాండ్ కావడానికి ముందు పారాచూట్ విచ్చుకోవడంతో పాటు, అది కిందకి దిగుతున్న సమయంలో మూడు నిమిషాల 25 సెకన్ల పాటు కొనసాగే హై-డెఫినిషన్ వీడియో క్లిప్‌ను సాధించాం ఈ సందర్భంగా మార్స్ ఉపరితలం కూడా వీడియోలో కనిపించింది. గ్రహానికి దగ్గరవుతున్న కొద్దీ మరింత స్పష్టంగా కనిపించింది. అక్కడి నేలంతా ఎర్రగా ఉంది. రోవర్ అరుణగ్రహంపై దిగుతున్న సమయంలో లేచిన ధూళి మేఘం, పారాచూట్ సాయంతో వ్యోమనౌక నుంచి కిందకి దిగడం స్పష్టంగా కనిపించిందని నాసా ఇంజనీర్లు ప్రకటించారు. Your front-row seat to my Mars landing is here. Watch how we did it.#CountdownToMars pic.twitter.com/Avv13dSVmQ — NASA's Perseverance Mars Rover (@NASAPersevere) February 22, 2021 Now that you’ve seen Mars, hear it. Grab some headphones and listen to the first sounds captured by one of my microphones. 🎧https://t.co/JswvAWC2IP#CountdownToMars — NASA's Perseverance Mars Rover (@NASAPersevere) February 22, 2021 -
నాసా రోవర్.. సాఫ్ట్ వేర్ రాసింది మన మహిళే!
మొన్నటి ‘పెర్సీ’ రోవర్‌తో కలిపి నాసా ఇంతవరకు ఐదు రోవర్లను అంగారకుడి మీదకు పంపింది. వాటిల్లో స్పిరిట్, ఆపర్చునిటీ, క్యూరియాసిటీ అనే రోవర్లకు, తాజా పెర్సీ రోవర్‌కు లాండింగ్ సాఫ్ట్ వేర్ రాసింది మన భారతీయ మహిళే! పేరు వందన. పెర్సీ ప్రాజెక్టును విజయవంతం చేసిన స్వాతి టీమ్‌లోని సభ్యురాలు. 2007 నుంచి నాసాలో రోబోటిసిస్ట్గా పని చేస్తున్న వందన పంజాబీ మహిళ. నాసా ఆఫీస్‌లో అంతా వందనను ‘వండీ’ అని పిలుస్తారు. అందరితో ఆమె కలుపుగోలుగా ఉండటమే ఆ ఆప్యాయతకు కారణం. అంగారకుడి పైకి పంపే రోవర్ల నియంత్రణకు స్క్రీన్‌ప్లే వంటి సాఫ్ట్‌వేర్‌ను రూపొందించడంలో ఆమె నిపుణురాలు. ఇప్పటి వరకు నాసా పంపిన ఐదు రోవర్లలో ఒక్క సోజర్న్ రోవర్‌కు తప్ప మిగతా వాటన్నిటికీ ఆమే సాఫ్ట్వేర్ రాశారు. వ్యోమగామి కల్పనాచావ్లా జన్మస్థలమైన హర్యానా పక్క రాష్ట్రం పంజాబ్ నుంచే వందన కూడా నాసా వరకు వెళ్లారు. పంజాబ్‌లోని హల్వారా వందన జన్మస్థలం. ఆమె తండ్రి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ లో పైలట్. ఉద్యోగ రీత్యా వందన చిన్నప్పుడే ఆయన భారతదేశంలోని ముఖ్య నగరాలన్నీ చుట్టేశారు. వాటిని చుట్టినట్లే ఆమెకు అంతరిక్షాన్నీ చుట్టి రావాలని ఉండేది. హల్వారాలోనే కేంద్రీయ విద్యాలయలో పాఠశాల చదువు పూర్తయింది. చండీగఢ్ పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ అయింది. తర్వాత యూఎస్‌లోని కార్నెగీ మెలాన్ యూనివర్శిటీ (సి.ఎం.యు.) లో రోబోటిక్స్ తీసుకుని మాస్టర్స్ డిగ్రీ చేశారు. ఆ తర్వాత పీహెచ్‌డి. చదువుకుంటూనే ఆమె చేసిన పని విమానం నడపడంలో శిక్షణ తీసుకుని పైలట్ లైసెన్స్ సంపాదించడం. చదువుతున్నప్పుడే పార్ట్ టైమ్‌గా దక్షిణమెరికా అటకామా ఎడారిలో ఆస్ట్రోబయాలజీ ప్రయోగాల్లో పాల్పంచుకున్నారు. అటాకామాలో అంగారకుడి పోలిన స్నేహపూర్వకం కాని వాతావరణం ఉంటుంది. అక్కడ పరిశోధనలు చేశారు. ఇక సి.ఎం.యు.లోనైతే నిర్దేశించిన అవసరాలకు తగినవిధంగా రోబోను తయారు చేసి దానిని నియంత్రించే ప్రోగ్రామ్‌ను రాయడంలో వందనకే ఎప్పుడూ ఫస్ట్. అలా ఆమెకు అంగారకుడి మీద, అంగారకుడిపైకి పంపే రోవర్ల మీద పట్టు లభించింది. 2006లో నాసాలో అవకాశం వచ్చింది. అక్కడ ఆమె తొలి ప్రాజెక్టే ‘ప్లెక్సిల్’కు సాఫ్ట్వేర్ రాయడం. ఫ్లెక్సిల్ అంటే ప్లాన్ ఎగ్జిక్యూషన్ ఇంటర్‌ఛేంజ్ లాంగ్వేజ్. అదొక ఆటోమేషన్ టెక్నాలజీ భాష. ఆ ప్రాజెక్ట్‌ను విజయవంతంగా నిర్వహించారు. ఇప్పుడు పెర్సీని అంగారకుడి పైకి దింపింది కూడా నాటి ఫ్లెక్సిల్ సాఫ్ట్‌వేర్‌కు అభివృద్ధి రూపమే. వందన 2007లో నాసా వారి జెట్ ప్రొపల్షన్ లేబరీటరీలో జాయిన్ అయ్యారు. అక్కడ మరింత అధునాతనమైన, మెరుగైన రోబో టెక్నాలజీని కనిపెట్టవలసి ఉంటుంది. అక్కడ ఆమె ప్రతిభ ఆమెను ఆటానమస్ సిస్టమ్స్ ప్రాజెక్టుకు గ్రూప్ లీడర్‌ను చేసింది. ఆ ప్రతిభా నైపుణ్యాలే వందనకు నాసాలో విశిష్టమైన రోబోటిసిస్టుగా గుర్తింపు తెచ్చిపెట్టాయి. నాసా లేబరేటరీలో రోవర్ల మధ్య వందన -
పెర్సి సక్సెస్.. మార్స్ ఫోటోలు షేర్ చేసిన నాసా
వాషింగ్టన్: అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా అరుదైన రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. అరుణ గ్రహంపై జీవం ఆనవాళ్లను గుర్తించేందుకు ఉద్దేశించిన ‘పర్సవరన్స్’ రోవర్ గురువారం తెల్లవారుజామున విజయవంతంగా ల్యాండ్ అయ్యింది. 2020, జూలైలో ప్రారంభమైన ఈ సుదీర్ఘయాత్ర విజయవంతం కావడం అంతరిక్ష శాస్త్రవేత్తలకు శుభవార్తే. ఈ క్రమంలో శుక్రవారం నాసా.. రోవర్ ‘పర్సవరన్స్’ పంపంచిన అరుదైన ఫోటోలను షేర్ చేసింది. వీటిలో రోవర్ కేబుల్స్ సాయంతో అరుణ గ్రహంపై ల్యాండ్ అయిన ఫోటో కూడా ఉంది. ల్యాండ్ అయ్యే సమయానికి ఆరు ఇంజన్లు ఉన్న ఈ రోవర్ తన వేగాన్ని గంటకు 1.7 మైళ్లకు తగ్గించుకుని అరుణగ్రహంపై ల్యాండ్ అయినట్లు నాసా వెల్లడించింది. రోవర్ అరుణగ్రహం ఉపరితలం మీద ల్యాండ్ అయినప్పుడు అక్కడ దుమ్ము లేవడం వీటిల్లో కనిపిస్తుంది అని రోవర్ చీఫ్ ఇంజనీర్ తెలిపారు. ఫోటో కర్టెసీ: నాసా ‘‘రోవర్ తన మొట్టమొదటి హై-రిజల్యూషన్, కలర్ ఫోటోను అప్లోడ్ చేయగలిగింది. ఇది జెజెరో క్రేటర్‌లో అడుగుపెట్టిన చదునైన ప్రాంతాన్ని చూపిస్తుంది. ఇక్కడ బిలియన్ల సంవత్సరాల క్రితం ఒక నది, లోతైన సరస్సు ఉనికిలో ఉన్నాయనే ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక రెండవ కలర్ ఫోటోలో రోవర్ ఆరు చక్రాలలో ఒకటి కనిపిస్తుంది. దాని పక్కనే అనేక రాళ్ళు ఉన్నాయి. ఇవి 3.6 బిలియన్ సంవత్సరాల కన్నా పురాతనమైనవిగా భావిస్తున్నాం’’ అంటూ నాసా ట్వీట్ చేసింది. ఫోటో కర్టెసీ: నాసా ‘‘ఈ రాళ్ళు అగ్నిపర్వత లేదా అవక్షేప మూలాన్ని సూచిస్తాయా అనేది తేలాల్సింది. రోవర్ భూమి మీదకు వచ్చినప్పుడు తనతో పాటు తీసుకువచ్చే ఈ రాళ్లను పరీక్షించి అవి ఏ కాలానికి చెందినవి.. ఏ రకానికి చెందినవి అనేది తేలుస్తాం’’ అన్నారు. పర్సవరన్స్ గురువారం నాడు కొన్ని ఫోటోలను పంపింది. అవి బ్లాక్ అండ్ వైట్‌లో ఉన్నాయి. అంత క్లారిటీగా లేవు. ఇప్పుడు వచ్చిన ఫోటోలు చాలా బాగా ఉన్నట్లు నాసా వెల్లడించింది. The moment that my team dreamed of for years, now a reality. Dare mighty things. #CountdownToMars pic.twitter.com/8SgV53S9KG — NASA's Perseverance Mars Rover (@NASAPersevere) February 19, 2021 చదవండి: మార్స్ పైకి ‘పెర్సీ’ నాసా ప్రయోగం; ఎవరీ స్వాతి మోహన్..? -
'నాసా' అనుకున్నది సాధించింది..
మొత్తానికి అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా అనుకున్నది సాధించింది. ఆ సంస్థ పంపిన రోవర్ ‘పర్సవరన్స్’ అరుణగ్రహంపై సరిగ్గా అనుకున్నచోట, అనుకున్న సమయానికి దిగింది. నిరుడు జూలైలో ప్రారంభమైన సుదీర్ఘ యాత్ర ఇలా సుఖాంతం కావటం అంతరిక్ష శాస్త్రవేత్తలకు మాత్రమే కాదు... ఆ రంగంపై ఆసక్తిగల ప్రపంచ పౌరులందరికీ శుభవార్తే. వివిధ దశలుగా పదేళ్లపాటు కొనసాగే మరికొన్ని ప్రయోగాల పరంపర కూడా అనుకున్నట్టుగా పూర్త యితే... అక్కడ సేకరించిన మట్టి నమూనాలు జయప్రదంగా వెనక్కి తీసుకురాగలిగితే అరుణ గ్రహంతోపాటు మొత్తంగా సౌర కుటుంబ నిర్మాణంపై ఇప్పటివరకూ మనకుండే అవగాహన మరిన్ని రెట్లు విస్తరిస్తుంది. మన భూగోళం పుట్టుక గురించి మనకుండే జ్ఞానం సైతం మరింత పదునెక్కుతుంది. చీకటి ఆకాశంలోకి మనం తలెత్తి చూసినప్పుడు తళుకు బెళుకులతో సంభ్ర మాశ్చర్యాల్లో ముంచెత్తే అనేకానేక తారల్లో అంగారకుడిది విశిష్టమైన స్థానం. అది మిగిలిన గ్రహాలకన్నా అధికంగా మెరుస్తూంటుంది. అందుకే అరుణగ్రహం చుట్టూ ఊహలు ఊరేగాయి. దాన్ని ఇతివృత్తంగా తీసుకుని ఎన్నో సైన్స్ ఫిక్షన్ కథలు, నవలలు వచ్చాయి. అంగారకుడిపై వచ్చిన చలనచిత్రాలకూ, టెలివిజన్ ధారావాహికలకూ లెక్కేలేదు. ఈ సౌర కుటుంబంలో కేవలం అరుణ గ్రహంపై మాత్రమే జీవరాశికి అనువైన పరిస్థితులుండేవని, ఏకారణంచేతనో అవి తారుమార య్యాయని శాస్త్రవేత్తల విశ్వాసం. ఒకప్పుడు పుష్కలంగా నీటితో అలరారిన ఆ గ్రహంపై ఇప్పుడు అందుకు సంబం ధించిన ఆనవాళ్లే మిగిలాయి. లోగడ అక్కడ దిగిన రోవర్లు నదీజలాలు పారినట్టు కనబడిన ఆనవాళ్లను పంపాయి. గ్రహం లోలోపలి పొరల్లో ఇంకా ఎంతో కొంత నీటి జాడ వుండొచ్చునని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇప్పుడు ‘పర్సవరన్స్’ను కూడా సరిగ్గా అలాంటి ప్రాంతాన్ని చూసుకునే దించారు. 350 కోట్ల సంవత్సరాలక్రితం అతి పెద్ద సరస్సు వున్నదని భావించే బిలం అంచుల్లో అది సురక్షితంగా దిగటం శాస్త్రవేత్తల ఘనవిజయమని చెప్పాలి. ఆ దిగే ప్రాంతానికి శాస్త్రవేత్తలు బోస్నియా–హెర్జెగోవినాలోని ఒక పట్టణం పేరైన ‘జెజిరో’గా నామకరణం చేశారు. సరస్సు అని దానర్థం. ఒక పెద్ద స్నానాలతొట్టె ఆకారంలో వున్న ఆ ప్రాంతంలోని రాళ్లలో రహ స్యాలెన్నో దాగివున్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వాటి రసాయన నిర్మాణాన్ని ఛేదిస్తే కోట్లాది సంవత్సరాలక్రితం ఆ సరస్సు ఎలాంటి పరిస్థితుల్లో అంత రించిపోయిందో అంచనా వేయటానికి ఆస్కారం వుంటుందంటున్నారు. ఈ భూగోళంపై కూడా మనిషితో సహా అన్ని జీవులూ నదీ తీరాలను ఆశ్రయించుకుని వుండేవి. అక్కడే తొలి నాగరికతలు వర్థిల్లాయి. అంగారకుడిపై సైతం అదే జరిగివుండాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అరుణగ్రహంపైకి యాత్ర అత్యంత సంక్లిష్టమైనది. దానిపైకి ఇంతవరకూ పంపిన అంతరిక్ష నౌకల్లో 50 శాతం విఫలమయ్యాయి. అందుకే నాసా శాస్త్రవేత్తలు ఈ ఏడు నెలలూ ఊపిరి బిగపట్టి పర్సవరన్స్ గమనాన్ని 24 గంటలూ నిశితంగా పరిశీలిస్తూ వచ్చారు. ఎప్పటికప్పుడు అవసరమైన సందేశాలు పంపుతూ అది సజావుగా చేరేలా చర్యలు తీసుకున్నారు. ఇంతవరకూ వివిధ దేశాలు పంపిన రోవర్‌లకన్నా పర్సవరన్స్ చాలా పెద్దది. ఒక కారు సైజున్న ఈ రోవర్‌కు ఒక మినీ హెలికాప్టర్ అమర్చారు. అక్కడి మట్టి నమూనాలను సేకరించడానికి, వాటిని విశ్లేషించి ఎప్పటికప్పుడు సమాచారం నాసాకు చేరేయడానికి అందులో అత్యంతాధునికమైన ఏడు రకాల ఉపకరణాలున్నాయి. ఛాయాచిత్రాలు తీసేందుకు జూమ్ చేయడానికి వీలుండే ఇరవై 3డీ కెమెరాలు, ఆ రోవర్‌ను తాకుతూ వీచే గాలుల ధ్వనిని, మట్టిని సేకరించటానికి రాళ్లను తొలి చినప్పుడు వెలువడే శబ్దాలను రికార్డు చేసేందుకు మైక్రో ఫోన్లు, ఇతర సెన్సర్లు కూడా అమర్చారు. అలాగే అది సేకరించిన నమూనాలను నిక్షిప్తం చేయటానికి చిన్న సైజులోవుండే 43 కంటెయినర్లున్నాయి. అందుకే రోవర్ అనటం దీన్ని ఒక రకంగా చిన్నబుచ్చటమే. ఇది ఏకకాలంలో భిన్నమైన పనులు చేయగల బుద్ధి కుశలతను సొంతం చేసుకున్న ఒక అద్భుత వాహనం. ప్రాజెక్టులో పనిచేసే ఇంజనీర్లు, సైంటిస్టులూ పర్సవరన్స్కి అమర్చిన ఉపకరణాలు, దాని వ్యవస్థలూ నిరంతరం రెప్పవాల్చకుండా పర్యవేక్షిస్తుంటారు. ఒకటి రెండు నెలలు గడిచాక రోవర్‌కి అమర్చిన హెలికాప్టర్‌ను విడివడేలా చేస్తారు. అన్నీ సక్రమంగా పనిచేసి రోవర్ నిర్దేశించిన కర్తవ్యాలను పూర్తి చేస్తే అది ఇంతవరకూ మానవాళి సాధించిన విజయాల్లోకెల్లా తలమానికమైనది అవుతుంది. అగ్ని పర్వతాలు బద్దలై లావాలు ప్రవహించిన కారణంగానో, ఒక భారీ గ్రహ శకలం పెను వేగంతో ఢీకొన్న కారణంగానో ఒకప్పుడు నీళ్లు సమృద్ధిగా పారిన అరుణగ్రహం గడ్డ కట్టుకు పోయింది. దాని ఉల్కలు ఇక్కడికి చేరకపోలేదు. కానీ ఇప్పుడు తాను సేకరించే నమూనాలను పర్సవరన్స్ వేర్వేరు కంటెయినర్లలో సీల్ చేస్తుంది. వాటిని నిర్దిష్టమైన ప్రాంతంలో వుంచితే భవి ష్యత్తులో జరిపే అంతరిక్ష ప్రయోగాల ద్వారా వాటిని భూమ్మీదకు తీసుకొస్తారు. ఎంతో ఓర్పుతో, పట్టుదలతో జరగాల్సిన ఈ సుదీర్ఘ ప్రక్రియకు ఇంగ్లిష్‌లో దానికి సమానార్థకమైన పర్సవరన్స్ అని పేరు పెట్టడం సబబైనదే. ఆ పేరుకు తగినట్టే అది మన శాస్త్ర విజ్ఞానంపై కొత్త వెలుగులు ప్రస రించటానికి దోహదపడుతుందని ఆశిద్దాం. -
నాసా ముందడుగు.. ల్యాండైన ‘పెర్సి’
కేప్ కెనవరెల్: అరుణ గ్రహంపై జీవం ఆనవాళ్లను గుర్తించే దిశగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ ముందడుగు వేసింది. నాసా ‘పర్సవరన్స్’ రోవర్ ఈ రోజు (శుక్రవారం) తెల్లవారుజామున అరుణ గ్రహంపై ల్యాండ్ అయ్యింది. ల్యాండింగ్‌కు సంబంధించిన సంకేతాలను కాలిఫోర్నియాలోని నాసాజెట్ ప్రొపల్షన్ లాబొరేటరీకి పంపించింది. ఇది అంగారక గ్రహంపై ఉన్న రాళ్లు, మట్టిని సేకరించనుంది. కాగా..మార్స్‌పై దిగిన ఏడో రోవర్‌గా ‘పర్సవరన్స్’నిలిచింది. ‘పెర్సీ’అనే ముద్దు పేరున్న ఈ ‘పర్సవరన్స్’నాసా పంపిన అతిపెద్ద, అత్యాధునిక రోవర్. రోవర్ ప్రత్యేకతలు.. ఇది ప్లుటోనియం ఇంధనాన్ని కలిగి ఉండి, కారు సైజులో ఉంటుంది. ఇది అరుణ గ్రహంపై నదీ పరివాహక ప్రాంతంగా భావిస్తున్న ప్రదేశంలో సంచరించనుంది. ఈ పెర్సీ రోవర్ 7 అడుగుల లోతు వరకు తవ్వి, రాళ్లు, మట్టి, ఇతర పదార్ధాలను సేకరించగలదు. ఈ శాంపిల్స్‌ను ట్యూబ్స్‌లో భద్రపరిచి, అక్కడే ఉంచుతుంది. తరువాత పంపించే మరో రోవర్ ఆ సాంపిల్స్‌ను మరో వ్యోమనౌక ద్వారా భూమికి తీసుకువస్తుంది. అంటే, ఈ నమూనాలు భూమిని చేరేందుకు మరో పదేళ్లు పడుతుంది. ఒకవేళ ఈ అరుణ గ్రహంపై జీవం ఉండి ఉంటే 300–400 కోట్ల ఏళ్లకు ముందు ఉండి ఉండవచ్చని శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు. కీలక బాధ్యతలు నిర్వహించిన భారత మహిళ.. ఈ ప్రయోగంలో భారతీయ సంతతికి చెందిన శాస్త్రవేత్త డాక్టర్ స్వాతి మోహన్ కీలక బాధ్యతలు నిర్వహించారు. ‘మార్స్ 2020 గైడెన్స్, నేవిగేషన్, అండ్ కంట్రోల్స్(జీఎన్ అండ్ సీ)కి ఆమె ఆపరేషన్స్ లీడ్‌గా నాయకత్వం వహించారు. మొత్తం ప్రయోగంలో లీడ్ సిస్టమ్ ఇంజినీర్‌గానూ కీలకంగా ఉన్నారు. మిషన్ కంట్రోల్ స్టాఫ్‌కు విధుల కేటాయింపు, మిషన్ కంట్రోల్ రూమ్‌లో పాటించే విధివిధానాల రూపకల్పన తదితర బాధ్యతలు నిర్వహించారు. ‘జీఎన్ అండ్ సీ’సబ్ సిస్టమ్స్‌కి, ప్రయోగంలో పాలు పంచుకుంటున్న ఇతర బృందాలకు సంధానకర్తగా వ్యవహరించారు. మొత్తం ప్రయోగానికి ‘జీఎన్ అండ్ సీ’అత్యంత కీలకమైన విభాగం. ఈ మిషన్‌కు కళ్లు, చెవులు ఈ విభాగమే. -
మార్స్ పైకి ‘పెర్సీ’
కేప్ కెనవరెల్: అరుణ గ్రహంపై జీవం ఆనవాళ్లను గుర్తించే దిశగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’పంపించిన ‘పర్సవరన్స్’ రోవర్ గురువారం(భారతకాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున) ఆ గ్రహంపై దిగనుంది. ‘మార్స్ 2020’ ప్రయోగంలో భాగంగా అక్కడ రాళ్లు, మట్టి తదితరాలను సేకరించనుంది. రోవర్ అంగారక గ్రహంపై ల్యాండ్ అయిన తరువాత ఆ విషయాన్ని కాలిఫోర్నియాలోని నాసా జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీకి సంకేతాలను పంపిస్తుంది. ల్యాండింగ్ విజయవంతమైతే.. మార్స్‌పై దిగిన ఏడో రోవర్‌గా ‘పర్సవరన్స్’ నిలుస్తుంది. ‘పెర్సీ’అనే ముద్దు పేరున్న ఈ ‘పర్సవరన్స్’ నాసా పంపిస్తున్న అతిపెద్ద, అత్యాధునిక రోవర్. ఇది కార్ సైజ్‌లో ఉంటుంది. ప్లుటోనియంను ఇంధనంగా వాడుకుంటుంది. అంగారక గ్రహంపై ఉన్న పురాతన నదీ పరివాహక ప్రాంతంగా భావిస్తున్న ప్రదేశంలో ఈ రోవర్ దిగనుంది. ఒకవేళ ఈ అరుణ గ్రహంపై జీవం ఉండి ఉంటే 300–400 కోట్ల ఏళ్లకు ముందు ఉండి ఉండవచ్చని శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు. ఈ పెర్సీ రోవర్ 7 అడుగుల లోతు వరకు తవ్వి, రాళ్లు, మట్టి, ఇతర పదార్ధాలను సేకరించగలదు. ఈ శాంపిల్స్‌ను ట్యూబ్స్‌లో భద్రపరిచి, అక్కడే ఉంచుతుంది. తరువాత పంపించే మరో రోవర్ ఆ సాంపిల్స్‌ను మరో వ్యోమనౌక ద్వారా భూమికి తీసుకువస్తుంది. అంటే, ఈ నమూనాలు భూమిని చేరేందుకు మరో పదేళ్లు పడుతుంది. స్వాతి మోహన్ కీలక పాత్ర ఈ ప్రయోగంలో భారతీయ సంతతికి చెందిన శాస్త్రవేత్త డాక్టర్ స్వాతి మోహన్ కీలక బాధ్యతలు నిర్వరిస్తున్నారు. ‘మార్స్ 2020 గైడెన్స్, నేవిగేషన్, అండ్ కంట్రోల్స్(జీఎన్ అండ్ సీ)కి ఆమె ఆపరేషన్స్ లీడ్‌గా నాయకత్వం వహిస్తున్నారు. మొత్తం ప్రయోగంలో లీడ్ సిస్టమ్ ఇంజినీర్‌గానూ కీలకంగా ఉన్నారు. మిషన్ కంట్రోల్ స్టాఫ్‌కు విధుల కేటాయింపు, మిషన్ కంట్రోల్ రూమ్‌లో పాటించే విధివిధానాల రూపకల్పన తదితర బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ‘జీఎన్ అండ్ సీ’సబ్ సిస్టమ్స్‌కి, ప్రయోగంలో పాలు పంచుకుంటున్న ఇతర బృందాలకు సంధానకర్తగా వ్యవహరిస్తున్నారు. మొత్తం ప్రయోగానికి ‘జీఎన్ అండ్ సీ’అత్యంత కీలకమైన విభాగం. ఈ మిషన్‌కు కళ్లు, చెవులు ఈ విభాగమే. -
‘చంద్రయాన్’ రోవర్ క్షేమం!
న్యూఢిల్లీ: ‘చంద్రయాన్ 2’ ప్రయోగం చివరి దశలో చంద్రుడి ఉపరితలాన్ని ఢీ కొని నాశనమైందని భావిస్తున్న ప్రజ్ఞాన్ రోవర్.. నిజానికి ధ్వంసం కాలేదని చెన్నైకి చెందిన అంతరిక్ష పరిశోధనలపై ఆసక్తి ఉన్న టెకీ షణ్ముగ సుబ్రమణియన్ వాదిస్తున్నారు. అందుకు సాక్ష్యాలుగా కొన్ని ఫొటోలను ఆయన చూపిస్తున్నారు. ఆయన వాదన ప్రకారం.. ల్యాండర్ నుంచి విడివడిన ప్రజ్ఞాన్ కొద్ది మీటర్ల దూరం దొర్లుకుంటూ వెళ్లి నిలిచిపోయింది. ప్రస్తుతం అది చంద్రుడి ఉపరితలంపై క్షేమంగా ఉంది. గతంలో మూన్‌ల్యాండర్ ‘విక్రమ్’ శకలాలను కూడా సుబ్రమణియన్ గుర్తించారు. ఆ విషయాన్ని నాసా కూడా నిర్ధారించింది. తాజాగా, ప్రజ్ఞాన్ క్షేమంగా ఉందని పేర్కొంటూ, పలు ఫొటో ఆధారాలతో సుబ్రమణియన్ పలు ట్వీట్లు చేశారు. సుబ్రమణియన్ అందజేసిన సమాచారానికి సంబంధించిన ఆధారాలను పరీక్షిస్తున్నామని ఇస్రో చైర్మన్ కే శివన్ తెలిపారు. ‘చంద్రుడి ఉపరితలంపై కూలిపోయిన తరువాత కూడా ల్యాండర్‌కు భూమి నుంచి సందేశాలు అంది ఉండవచ్చు. అయితే, అది మళ్లీ తిరిగి సమాధానం ఇవ్వలేకపోయి ఉండవచ్చు’ అని సుబ్రమణియన్ పేర్కొన్నారు. నాసా విడుదల చేసిన ఒక ఫొటోను వివరిస్తూ.. ల్యాండర్, రోవర్ ఉన్న ప్రదేశాలను ఆయన అంచనా వేశారు. రోవర్ ఇంకా పనిచేస్తూ ఉందని కచ్చితంగా చెప్పలేనన్నారు. గత సెప్టెంబర్‌లో ల్యాండర్ విక్రమ్ చంద్రుడి ఉపరితలంపై కుప్పకూలిన విషయం తెలిసిందే. -
భారత రోయింగ్‌లో డోపింగ్ కలకలం
న్యూఢిల్లీ: ఒకే క్రీడకు చెందిన ఆటగాళ్లు పెద్దసంఖ్యలో డోపీలుగా తేలడం... వారంతా మైనర్లు కావడం భారత క్రీడారంగంలో కలకలం రేపింది. ఏకంగా 22 మంది జూనియర్ రోయర్లు నిషిద్ధ ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) పరీక్షల్లో తేలింది. వీరిలో చాలా మంది ‘ఖేలో ఇండియా’ గేమ్స్‌లో పాల్గొన్న వారే కావడం గమనార్హం. పోటీలు లేని సమయంలో హైదరాబాద్‌లో ఉన్నప్పుడు వీరి నుంచి సేకరించిన నమూనాల్లో అంతా ఒకే రకమైన నిషిద్ధ ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు తేలడం పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. థాయ్‌లాండ్‌లో జరిగిన ఆసియా జూనియర్ రోయింగ్ చాంపియన్‌షిప్ కోసం అప్పుడు వీరంతా హైదరాబాద్ శిబిరంలో శిక్షణ తీసుకుంటున్నారు. 2005లో ‘నాడా’ మొదలయ్యాక ఇలా ఒకే ఆటకు చెందిన ఇంత మంది పట్టుబడటం ఇదే తొలిసారి.] వీరంతా 16 ఏళ్ల నుంచి 18 ఏళ్ల లోపు (మైనర్లు) వారే కావడంతో నిబంధనల ప్రకారం రోయర్ల పేర్లు వెల్లడించడం లేదు. దీనిపై తదుపరి చర్యలు తీసుకునేందుకు ‘నాడా’ సిద్ధమైంది. జాతీయ డోప్ టెస్టింగ్ లాబోరేటరీపై నిషేధం ఉండటంతో ‘నాడా’... దోహా లాబోరేటరీలో నమూనాల్ని పరీక్షించింది. ఇందులో జూనియర్ రోయర్లంతా ఒకే రకమైన ఉత్ప్రేరకాన్ని తీసుకున్నట్లు తేలింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన భారత రోయింగ్ సమాఖ్య (ఆర్ఎఫ్ఐ) విచారణ చేపట్టనుంది. బహుశా రోయర్లు తీసుకున్న ఆహార పదార్థాలే కారణం కావొచ్చని ఆర్ఎఫ్ఐ ప్రాథమికంగా భావిస్తోంది. తదుపరి దర్యాప్తులోనే ఈ విషయాలు వెల్లడవుతాయని ఆర్ఎఫ్ఐ కార్యదర్శి శ్రీరామ్ తెలిపారు. -
చంద్రుని దక్షిణ ధ్రువంపైకి రోవర్
సాక్షి ప్రతినిధి, చెన్నై/శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చంద్రయాన్–2 ప్రాజెక్టును ఈ ఏడాది జూలై 9వ తేదీ నుంచి 16వ తేదీల మధ్యలో ప్రయోగించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా చంద్రుని దక్షిణ ధ్రువంపైకి ఇస్రో ల్యాండర్, రోవర్లను పంపనుంది. ‘ఇప్పటి వరకు ఎవరూ కూడా చీకటిగా ఉండే ఈ ప్రాంతంలోకి రోవర్‌ను దించలేదు. చంద్రుని ఈక్వేటర్‌కు సమీపంలోకి ఇది వెళ్తుంది’ అని ఇస్రో చైర్మన్ కె.శివన్ తెలిపారు. జీఎస్ఎల్వీ మార్క్–3 రాకెట్ ద్వారా ప్రయోగించే ఉపగ్రహంలో ల్యాండర్ విక్రమ్, రోవర్ ప్రజ్ఞాన్ ఉంటాయి. ఇవి సెప్టెంబర్ నాటికి అక్కడికి చేరుకుంటాయని ఆయన వివరించారు. వీటి ద్వారా తాము సేకరించే సమాచారంపై ప్రపంచ నలుమూలలా ఉన్న శాస్త్రవేత్తలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని అన్నారు. ప్రయోగాలన్నిటినీ పూర్తి చేసి 2022లోగా చంద్రునిపైకి మానవుడిని పంపుతామని ఇస్రో చైర్మన్ తెలిపారు. దీంతోపాటు వచ్చే ఏడాది తొలి అర్ధ భాగంలో సూర్యుడిపై ప్రయోగాల కోసం ఆదిత్య–ఎల్1 సూర్యుని కక్ష్యలోకి ప్రయోగిస్తామని తెలిపారు. ఈ ప్రయోగం వల్ల సూర్యుని గురించి ఇంతవరకు తెలియని అనేక విషయాలను తెలుసుకుంటామని చెప్పారు. ఇతర గ్రహాలపైనా పరిశోధనలు చేపట్టేందుకు ఇస్రో సమాయత్తం అవుతోందని తెలిపారు. -
చంద్రుడి వెనక ఏముంది?
బీజింగ్: అంతరిక్ష రంగంలో సూపర్ శక్తిగా ఎదిగే దిశగా చైనా గొప్ప ముందడుగు వేసింది. అమెరికా, రష్యాలు కూడా ఇంత వరకు అడుగుపెట్టని, ఎవరికీ ఏమీ తెలియని చంద్రుడి వెనక భాగానికి శనివారం రోవర్‌ను ప్రయోగించింది. చాంగె–4 ప్రోబ్ మిషన్ పేరిట చేసిన ఈ ప్రయోగం విజయవంతమైందని చైనా అధికారులు ప్రకటించారు. కొత్త సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి చాంగె–4 సుదూర ప్రయాణం చేసి నిర్దేశిత ప్రాంతాన్ని చేరుతుందని అంచనావేస్తున్నారు. భూమికి అభిముఖంగా ఉండే చంద్రుడి ముందటి భాగం సమతలంగా ఉంటుంది. కానీ వెనక భాగం మాత్రం పూర్తిగా కొండలు, ఎత్తుపల్లాలతో చీకటిగా ఉంటుంది. ఈ చీకటి ప్రాంతానికి సంబంధించిన ఫొటోల్ని 1959లో సోవియెట్ యూనియన్ సంపాదించే వరకు అక్కడున్న భారీ బిలాల గురించి ఎవరికీ తెలియదు. అయితే ఇక్కడ పరిశోధన చేసేందుకు ఇంత వరకు ఏ దేశం కూడా వాహక నౌకను దించలేదు. దీంతో చైనా ప్రయోగించిన రోవరే మొదటి మిషన్‌గా గుర్తింపు పొందింది. అంతరిక్ష రంగంలో పరిశోధనకు సంబంధించి 1960, 70లలో అమెరికా, రష్యాలు సాధించిన విజయాల్ని చైనా గత 10, 20 ఏళ్లలో అధిగమించింది. అయితే ఆ దేశాలేవీ ఇంతకు ముందు చేయని కొత్త ప్రయోగాన్ని తాజాగా చైనా విజయవంతంగా చేపట్టింది. ఈ క్షణం కోసమే చైనా చాలా ఏళ్లుగా శ్రమిస్తోంది. ఆలూ సాగుపై.. చాంగె–4 చంద్రుడిపై అడుగుపెట్టబోతున్న భాగం భూమికి చాలా దూరంలో ఉంటుంది. అక్కడి నుంచి భూమికి నేరుగా సంకేతాలు చేరవేయడానికి సౌకర్యాలు లేకపోవడంతో పరిష్కార మార్గంగా మే నెలలో ఓ ఉపగ్రహాన్ని చంద్రుడి కక్ష్యలో ప్రవేశపెట్టారు. భూమి, రోవర్ మధ్య ఈ ఉపగ్రహం సమాచారాన్ని మార్పిడి చేస్తుంది. చంద్రుడి ఉపరితలంపై ఖనిజాల పరిశీలనకు, బంగాళాదుంపలు, ఇతర విత్తనాలు నాటేందుకున్న పరిస్థితులపై చాంగె–4 మిషన్ అధ్యయనం చేస్తుందని స్థానిక మీడియా తెలిపింది. చంద్రుడి ఉపరితలంపై దిగాక రోవర్‌కు ఎన్నో సవాళ్లు ఎదురుకానున్నాయి. ఒక ల్యూనార్ నైట్(భూమిపై 14 రోజులకు సమానం)లో ఉష్ణోగ్రతలు మైనస్ 173 డిగ్రీ సెల్సియస్లకు పడిపోతాయి. ఇక ల్యూనార్ డే(భూమిపై 14 రోజులు)లో 127 డిగ్రీలకు పెరుగుతాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్ని తట్టుకునే సాధనాల్నే మిషన్‌లో పంపించారు. వచ్చే ఏడాది ప్రయోగించే మరో ల్యాండర్ చాంగె–5 అక్కడి నుంచి నమూనాల్ని, చాంగె–4 అవశేషాల్ని వెనక్కి తీసుకొస్తుంది. -
మార్స్ రోవర్ డిజైన్లు విడుదల చేసిన చైనా
బీజింగ్: అంగారక గ్రహం పైకి 2020లో పంపించనున్న రోవర్‌కు సంబంధించిన డిజైన్లను చైనా విడుదల చేసింది. 2020 జూలై లేదా ఆగస్టులో ఈ రోవర్‌ను అంగారక గ్రహం మీదకి పంపించనున్నట్లు మార్స్ మిషన్ చీఫ్ ఆర్కిటెక్ట్ జాంగ్ తెలిపారు. ఆరు చక్రాలు, నాలుగు సౌరఫలకాలున్న దీని బరువు 200కేజీలని పేర్కొన్నారు. మూడు మార్షియన్ నెలల పాటు సేవలందించేలా దీనిని రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. అక్కడి వాతావరణం, ఉపరితలం, అంతర్గత, భౌతిక నిర్మాణం, అయాన్ ఆవరణాన్ని రోవర్ అధ్యయనం చేస్తుందని జాంగ్ వెల్లడించారు. అలాగే దీనికి లోగో రూపకల్పనతో పాటు పేరు పెట్టాలని ప్రజల్ని ఆహ్వానిస్తున్నామన్నారు. కాగా, మార్స్ మిషన్‌లో అమెరికా, రష్యా, యురోపియన్ యూనియన్, భారత్‌లు విజయం సాధించగా.. చైనా 2011లో ప్రయత్నించి విఫలమైంది. -
అరుణగ్రహంపై మీథేన్, కర్బన అణువులు!
వాషింగ్టన్: భూమిపై 380 కోట్ల ఏళ్ల క్రితం జీవం ఆవిర్భవించిందని భావిస్తున్నట్లే అంగారకుడిపైనా అదే సమయంలో సరస్సులు ఉండేవని, వాటిలో బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులు నివసించి ఉండవచ్చని అమెరికాకు చెందిన నాసా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇందుకు తొలిసారిగా కచ్చితమైన ఆధారాలను అంగారకుడిపై ఉన్న క్యూరియాసిటీ రోవర్ గుర్తించిందని వారు వెల్లడించారు. మార్స్‌పై గేల్‌క్రేటర్ ప్రాంతంలో 2012, ఆగస్టులో దిగిన ఈ రోవర్ అక్కడ ఓ మడ్స్టోన్ శిలకు రంధ్రం చేసి దాని పొడిని ‘శాంపిల్ అనలైసిస్ ఎట్ మార్స్’ పరికరంతో పరీక్షించింది. ఆ ఫలితాలను విశ్లేషించగా.. గేల్‌క్రేటర్‌లో కార్బన్, హైడ్రోజన్, ఆక్సీజన్లతో కూడిన సేంద్రియ అణువులు, క్లోరిన్ అణువులు, క్లోరోబెంజీన్, డైక్లోరోఆల్కేన్ రసాయనాలూ ఉన్నట్లు తేలిందని వారు ప్రకటించారు. మార్స్ వాతావరణంలో మీథేన్ వాయువు ఉనికినీ క్యూరియాసిటీ గుర్తించిందన్నారు. అయితే కర్బన అణువులు, మీథేన్ కొన్ని పరిస్థితుల్లో రసాయనిక చర్యల వల్ల కూడా ఏర్పడే అవకాశం ఉన్నందున, ఇవి సూక్ష్మజీవుల చర్యల వల్లే ఏర్పడ్డాయనేది చెప్పలేమంటున్నారు. -
జాబిల్లిపై దిగిన చైనా రోవర్
బీజింగ్: అంతరిక్ష రంగంలో చైనా కీలక ముందడుగు వేసింది. ఇటీవల ప్రయోగించిన తొలి రోవర్‌ను శనివారం చందమామపై విజయవంతంగా దింపింది. దీంతో అమెరికా, సోవియెట్ యూనియన్ల తర్వాత ఈ ఘనత సాధించిన మూడో దేశంగా చైనా రికార్డు సృష్టించింది. చైనా డిసెంబరు 1న లాంగ్‌మార్చ్-3బీ రాకెట్ ద్వారా చాంగ్-3 వ్యోమనౌకను ప్రయోగించిన సంగతి తెలిసిందే. యుటూ (జేడ్ ర్యాబిట్) అనే రోవర్, ల్యాండర్‌తో కూడిన చాంగ్-3 శనివారం రాత్రి 9:11 గంటలకు చంద్రుడిపై సైనస్ ఇరిడమ్ (హరివిల్లుల అఖాతం) అనే చోట సురక్షితంగా దిగిందని ఈ మేరకు బీజింగ్ ఏరోస్పేస్ కంట్రోల్ సెంటర్ వెల్లడించింది. చంద్రుడిపై ఓ రోవర్ దిగడం గత నాలుగు దశాబ్దాలలో ఇదే తొలిసారి. చైనీయుల విశ్వాసం ప్రకారం.. జాబిల్లిపై ఉండే దేవత పేరు ‘చాంగ్’ కాగా, ఆమె తెల్లని పెంపుడు కుందేలు పేరే ‘యుటూ’. చంద్రుడిపై పరిశోధనలో రెండో దశలో భాగంగా చైనా ఈ చాంగ్-3 ప్రయోగం చేపట్టింది. తొలిదశలో భాగంగా 2007లో చాంగ్-1, 2010లో చాంగ్-2 వ్యోమనౌకలను చైనా పంపింది. కానీ అవి చంద్రుడి చుట్టు మాత్రమే తిరిగి సమాచారాన్ని సేకరించాయి. తాజాగా.. చంద్రుడిపై దిగిన ల్యాండర్ దిగినచోటే ఉండి పరిశోధనలు కొనసాగిస్తుంది. ఖగోళ వస్తువుల మీదా దృష్టిపెడుతుంది. ల్యాండర్ నుంచి రోవర్ విడిపోయి మూడునెలలపాటు మూడు చదరపు కి.మీ. ప్రాంతంలో తిరుగుతూ చంద్రుడి అంతర్నిర్మాణాన్ని, ఉపరితలాన్ని సర్వే చేస్తుంది. సహజ వనరుల కోసం అన్వేషణ సాగిస్తుంది. ఇలా దిగిపోయింది: చంద్రుడికి 15 కి.మీ. దూరం నుంచే వేరియెబుల్ థ్రస్ట్ ఇంజిన్ వేగం క్రమంగా తగ్గిస్తూ వ్యోమనౌక 100 మీటర్ల సమీపానికి చేరుకుంది. చంద్రుడి ఉపరితలంపై రాళ్లు, అడ్డంకులు లేని తగిన స్థలాన్ని సెన్సర్లతో గుర్తించింది. అనంతరం షాక్‌అబ్జార్బర్ల సాయంతో నెమ్మదిగా నాలుగు కాళ్లూమోపి దిగిపోయింది. అత్యంత కీలకమైన ఈ ప్రక్రియంతా 12 నిమిషాల్లో ఆటోమేటిక్‌గా జరిగిపోయింది. వ్యోమనౌకకు, దాని పరికరాలకు ఎలాంటి నష్టం కలగకుండానే సురక్షితంగా ‘సాఫ్ట్ ల్యాండింగ్’ పూర్తయిపోయింది.