బెంగళూరు: జాబిలిపై పరిశోధనల కోసం ప్రయోగించిన చంద్రయాన్–3 తాలూకు లాండర్, రోవర్లతో సంబంధాలను పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు ఇస్రో శుక్రవారం ప్రకటించింది. విక్రమ్‌గా పిలుస్తున్న లాండర్, ప్రజ్ఞాన్‌గా పిలుస్తున్న రోవర్లను ఈ నెల మొదట్లో ఇస్రో సుప్తావస్థలోకి పంపడం తెలిసిందే. ఇప్పుడు అవి తిరిగి యాక్టివేట్ అయే స్థితిలో ఏ మేరకు ఉన్నదీ పరిశీలిస్తున్నట్టు పేర్కొంది. కానీ ఇప్పటిదాకా అయితే వాటినుంచి తమకు ఎలాంటి సంకేతాలూ అందలేదని వివరించింది.
వాటిని కాంటాక్ట్ చేసే ప్రయత్నాలు కొనసాగుతూనే ఉంటాయని తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో పోస్ట్ చేసింది. సెపె్టంబర్ 20 దాకా చంద్రుని మీద రాత్రి వేళ. 14 రోజులు రాత్రి ఉంటుంది. అప్పుడక్కడ ఉష్ణోగ్రతలు ఏకంగా మైనస్ 120 డిగ్రీల దాకా పడిపోతాయి. దాంతో చంద్రయాన్ లాండర్, రోవర్ పాడయ్యే ప్రమాదముంది. అందుకే వాటిని ఇస్రో స్లీప్ మోడ్‌లోకి పంపింది. ఇప్పుడు పగటి సమయం కావడంతో వాటిని యాక్టివేట్ చేయాలని నిర్ణయించి ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టింది.
Comments
Please login to add a commentAdd a comment