restores
-
Chandrayaan 3: లాండర్, రోవర్ నుంచి సంకేతాలు లేవు
బెంగళూరు: జాబిలిపై పరిశోధనల కోసం ప్రయోగించిన చంద్రయాన్–3 తాలూకు లాండర్, రోవర్లతో సంబంధాలను పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు ఇస్రో శుక్రవారం ప్రకటించింది. విక్రమ్‌గా పిలుస్తున్న లాండర్, ప్రజ్ఞాన్‌గా పిలుస్తున్న రోవర్లను ఈ నెల మొదట్లో ఇస్రో సుప్తావస్థలోకి పంపడం తెలిసిందే. ఇప్పుడు అవి తిరిగి యాక్టివేట్ అయే స్థితిలో ఏ మేరకు ఉన్నదీ పరిశీలిస్తున్నట్టు పేర్కొంది. కానీ ఇప్పటిదాకా అయితే వాటినుంచి తమకు ఎలాంటి సంకేతాలూ అందలేదని వివరించింది. వాటిని కాంటాక్ట్ చేసే ప్రయత్నాలు కొనసాగుతూనే ఉంటాయని తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో పోస్ట్ చేసింది. సెపె్టంబర్ 20 దాకా చంద్రుని మీద రాత్రి వేళ. 14 రోజులు రాత్రి ఉంటుంది. అప్పుడక్కడ ఉష్ణోగ్రతలు ఏకంగా మైనస్ 120 డిగ్రీల దాకా పడిపోతాయి. దాంతో చంద్రయాన్ లాండర్, రోవర్ పాడయ్యే ప్రమాదముంది. అందుకే వాటిని ఇస్రో స్లీప్ మోడ్‌లోకి పంపింది. ఇప్పుడు పగటి సమయం కావడంతో వాటిని యాక్టివేట్ చేయాలని నిర్ణయించి ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టింది. -
జమ్మూ కశ్మీర్లో మొబైల్ సేవల పునరుద్ధరణ
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్లో ప్రీపెయిడ్ మొబైల్ సేవలను పునరుద్ధరిస్తున్నట్లు అక్కడి అధికారులు శనివారం నిర్ణయం తీసుకున్నారు. ప్రీపెయిడ్ మొబైల్ సేవల్లో భాగంగా వాయిస్ కాల్స్, మెసేజ్ సర్వీసులపై ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు జమ్మూ కశ్మీర్ ప్రధాన కార్యదర్శి రోహిత్ కన్సాల్ మీడియాకు వెల్లడించారు.శనివారం నుంచే ఇది అమల్లోకి రానుందని ఆయన తెలిపారు. జమ్మూలోని పది జిల్లాలు, కశ్మీర్‌లోని రెండు జిల్లాల్లో బ్రాడ్‌బాండ్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను తిరిగి ప్రారంభించాలని ఆయన కోరారు. కాగా మొబైల్ ఇంటర్నెట్ సేవల విషయంలో సిమ్‌కార్డులను ఆధారాలతో దృవీకరించుకోవాలని టెలికాం అధికారులకు కన్సాల్ సూచించారు. అయితే కేవలం ప్రభుత్వ గుర్తింపు ఉన్న సైట్లకు మాత్రమే ఇది వర్తిస్తుందని, సోషల్ మీడియాపై మాత్రం నిషేధం అలాగే కొనసాగుతుందని కన్సాల్ పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని గతేడాది ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శాంతి భద్రతలు పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని జమ్మూ కశ్మీర్లో అన్ని ప్రీపెయిడ్ మొబైల్ సేవలను నిలిపివేస్తూ టెలికాం శాఖ ఆంక్షలు విధించింది. -
‘ప్రిసర్వేషన్ అండ్ రీస్టోరేషన్’ వర్క్‌షాప్
-
‘శివ’ గురించి బాధ పడుతున్నా..
ఒకప్పుడు సినిమాలు ఫిల్మ్ డబ్బాల్లో భద్రపరిచేవారు. తర్వాత చేతిలో ఇమిడిపోయే డీవీడీల్లో నిక్షిప్తం చేసి దాచేవారు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. పెన్‌డ్రైవ్ లాంటి డివైజ్‌ల్లో ఇమిడిపోతున్నాయి. సినిమాని డీవీడీ రూపంలో ఎంత భద్రపరిచినప్పటికీ అది పాడవుతుంది. ప్లే చేసే సమయంలో డాట్స్ రావడం, కాపీ మార్కులు కనిపిస్తుంటాయి. అందుకే పాత కాలపు సినిమాలన్నీ ఒకేచోటకు తెచ్చి వాటిని ‘రిస్టోరేషన్’ చేస్తున్నారు సినీనటుడు అక్కినేని నాగార్జున. మంగళవారం అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగినకార్యక్రమంలో వర్క్‌షాప్ పోస్టర్నునాగార్జున, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండర్ శివేంద్రసింగ్, వయోకామ్18 సీఈఓ, ఎండీ సుధాన్షువత్స్, అమల అక్కినేని ఆవిష్కరించారు. అనంతరం నాగార్జున ‘ప్రిసెర్వేషన్ అండ్ రీస్టోరేషన్’ వర్క్‌షాప్ గురించి ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. పాతకాలం చలన చిత్రాలను చూడాలనే కోరిక చాలామందికి ఉంటుంది. కానీ.. ప్రింట్ సరిగ్గా లేకనో, ఆడియో సరిగ్గా వినిపించకో, విజువల్స్ కనిపించకో ఇబ్బంది పడాలి. ఏ సినిమా లేదా ఫొటో అయినా డ్రైవ్, హార్డ్ డిస్క్‌లో క్వాలిటీ కాలపరిమితి కేవలం 5 ఏళ్లు. తర్వాత క్వాలిటీ తగ్గిపోతుంది. అయితే, ఒకప్పటి ఎవర్గ్రీన్ హిట్ చిత్రాలకు ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్, వయోకామ్18 సంస్థలు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కొత్తగా మారుస్తున్నాయి. ‘శివ’ గురించి బాధ పడుతున్నా.. ప్రిజర్వేషన్ అండ్ రిస్టోరేషన్ గురించి అమితా బ్, జయా బచ్చన్ చెప్పారు. వారు చెప్పారు కాబట్టి ఫాలో అయిపోతాను. నా సినిమాలు, నాన్నగారి సినిమాలు దాచుకోవచ్చని వెంటనే ఒప్పుకున్నాను. మా అన్నపూర్ణ స్టూడియోస్ లో అయితే స్టూడెంట్స్ కూడా ఉంటారు కాబట్టి, వారు కూడా ఈ సబ్జెక్ట్‌ని నేర్చుకుంటారనే ఆశతో ఇక్కడ మొదలుపెట్టాం. 1989లో ఎంత పెద్ద హిట్లో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అంతకముందు వచ్చిన గీతాంజలి, నిన్నేపెళ్లాడతా, అన్నమయ్య, హలోబ్రదర్ వంటి చిత్రాలు ఇప్పుడు నా వద్ద లేవు. వాటిని డీవీడీ, హార్డ్‌డిస్క్‌లో ఉంచాను కానీ. ప్రింట్ సరిగ్గా రావట్లేదు. ‘శివ’ అయితే కాఫీ మరకలు పడితే ఎలా ఉంటుందో.. సినిమా అలా అయిపోయింది. నాన్న అక్కినేని నాగేశ్వర్రావు సినిమాల్లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘దేవదాస్’ అడ్రస్ లేదు. నేను, నాన్న ఇన్ని సినిమాలు చేసి ఆ మరుపురాని చిత్రాలు మా వద్ద లేకపోతే ఇంతకాలం ఇండస్ట్రీలో ఉండి ఏం సాధించినట్లు? అందుకే ‘ప్రిజర్వేషన్ అండ్ రిస్టోరేషన్’ వర్క్‌షాప్ ద్వారా మా సినిమాలతో పాటు, తెలుగు సినిమాలన్నింటినీ పరిరక్షించుకునే బాధ్యతను తీసుకుంటున్నా. త్వరలో ఫిల్మ్ ఛాంబర్‌కి ప్రపోజల్ తెలుగు సినిమాని పరిరక్షించుకునేందుకు త్వరలో ఫిల్మ్ ఛాంబర్‌ని ‘ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్, వయోకామ్, అన్నపూర్ణ స్టూడియోస్’ కలవనుంది. దీనిపై నిర్మాతలకు వివరిస్తాం. తెలుగులో ఎన్నో బ్లాక్‌బస్టర్స్ ఉన్నాయి. వాటన్నింటినీ పరిరక్షించుకోవాల్సి న బాధ్యతపై మాపై ఉంది. డిసెంబర్లో జరి గే వర్క్‌షాప్‌లో ప్రొడ్యూసర్స్‌ను బట్టి ఆయా సినిమాలను రిస్టోరేషన్ చేసేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. ఇలా చేయడం వల్ల కష్టపడి, కోట్లు వెచ్చించిన నిర్మాతలకు కూడా మేలు జరుగుతుంది. శాటిలైట్ రైట్స్ కొనగోలు చేసిన టీవీ ఛానల్స్ కూడా సహకారించాలి. ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్, వయాకామ్18 సంస్థలు ఈ ప్రెసెర్వేషన్ అండ్ రిస్టోరేషన్ వర్క్‌షాప్‌ని 2015లో ముంబైలోప్రారంభించాయి. తర్వాత ఏడాది పుణె, 2017లో చెన్నై, 2018లో కోల్‌కత్తాలో నిర్వహించి, ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ సహకారంతోహైదరాబాద్లో నిర్వహించనున్నారు. డిసెంబర్ 8 నుంచి 15వ తేదీ వరకు ఈ వర్క్‌షాప్ జరగనుంది. దీనికి శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్, ఆప్ఘనిస్థాన్ దేశాలకు చెందిన సినీరంగ ప్రముఖులనుఆహ్వానిస్తున్నారు. ఆ పాత మధురాలకు రక్షణ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎన్నో మరుపురాని ఎవర్గ్రీన్ చిత్రాలు ఉన్నాయి. వీటిని కాపాడే ప్రయత్నాన్ని మేం చేస్తున్నాం. దీనికి నాగార్జున ముందుకు రావడం ఆనందంగా ఉంది. విదేశాల్లో ఈ ప్రయత్నం ఫలించడంతో మనదేశంలో నాలుగు నగరాల్లో నిర్వహించాం. ఇప్పుడు హైదరాబాద్‌లో చేపడుతున్నాం. – శివేంద్రసింగ్, ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండర్ టెక్నాలజీతో అద్భుతాలు ఇప్పుడు మనం ఏ అద్భుతం చేయాలన్నా అది టెక్నాలజీ ద్వారానే సాధ్యం. పాత సినిమాలు చూడాలంటే ఇప్పుడు యూట్యూబ్‌లో కూడా దొరకవు. కానీ ఫిల్మ్ హెరిటేజ్ అండ్ వయోకామ్ చేస్తున్న పని చాలా బాగుంది. వారి వద్ద ఉన్న టెక్నాలజీ పాత అద్భుతాలను కొత్తగా మలచగలరనే నమ్మకం కలుగుతోంది.– జయేష్ రంజన్, ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి -
ఇంటర్నెట్ సేవలు మళ్లీ బంద్
► విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు కానిస్టేబుల్ ప్రయత్నం ► జమ్ములో తీవ్ర ఉద్రిక్తత.. నిందితుడి అరెస్టు జమ్మూలో పురాతన శివాలయాన్ని ధ్వంసం చేసిన ఘటనతో చెలరేగిన తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చల్లబడక ముందే మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. రెండు రోజుల క్రితం ఓ సస్సెండ్ అయిన జమ్మూకాశ్మీర్ పోలీస్ కానిస్టేబుల్... స్థానిక ఆలయంలోని విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా నానక్ నగర్ లోని శివాలయ ధ్వంసానికి ఓ వ్యక్తి ప్రయత్నించడం మరోసారి అలజడి రేగింది. దీంతో మూడు రోజులుగా ప్రభుత్వం మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. జమ్మూలో గురువారం జరిగిన పురాతన శివాలయ ధ్వంసం ఘటన మరువక ముందే మరో అలజడి రేగింది. సస్పెండెడ్ కానిస్టేబుల్ గుర్బచన్ సింగ్ నానక్ నగర్ లోని ఆలయంలోకి వెళ్ళి అక్కడి శివుడి విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆలయధ్వంసం ఘటన తెలియడంతో స్థానికులు నిరసనకు దిగారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోగా, పోలీసులు పరిస్థితుల్ని అదుపులోకి తెచ్చారు. అంతకు ముందు రూప్ నగర్ లో జరిగిన ఆలయ ధ్వంసానికి, తాజా ఘటనకు ఏదైనా సంబంధం ఉందా అన్నకోణంలో దర్యాప్తు చేస్తున్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో జమ్మూలో మొబైల్, ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. అయితే రెండు రోజులుగా ఆందోళనలతో ఉన్న జమ్మూలో నేడు కొంత ప్రశాంత వాతావరణం కనిపించింది. వ్యాపార సంస్థలు, దుకాణాలు తెరుచుకున్నాయి. రోడ్లపై ట్రాఫిక్ కూడా ఎప్పట్లాగే కనిపించింది. అయితే స్థానికంగా మొబైల్, ఇంటర్నెట్ సేవలు మాత్రం కొనసాగడం లేదు. మూడు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా సేవలు స్తంభించిపోయాయి. దక్షిణ కాశ్మీర్ లో అమరనాథ్ యాత్ర సందర్భంలోనే మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ప్రణాళికా బద్ధంగా దేవాలయాలను ధ్వంసం చేసే కుట్ర జరుగుతోందన్న అనుమానంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలు నిలిపివేసింది. అయితే నిందితుడు నానక్ నగర్ ఆలయధ్వంసానికి పాల్పడే ముందు సెల్ ఫోన్ లో ఇతరులతో విషయాన్ని వివరించినట్లు జమ్ము డివిజినల్ కమిషనర్ పవన్ కొత్వాల్ తెలిపారు. నానక్ నగర్ ఆలయంలో శివుడి విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తిని సస్పెండ్ అయిన పోలీస్ కానిస్టేబుల్ గుర్బచన్ సింగ్ అలియాస్ మింటా గా గుర్తించామని, అతడు ఘటనకు ముందు మాట్లాడిన సెల్ ఫోన్ సంభాషణను బట్టి అతడ్ని ఆదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. ఫోన్ లో అవతలి వ్యక్తితో సింగ్... చెప్పిన పని పూర్తయిందని, తన ఖాతాలో డబ్బు జమచేయమని చెప్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. అనంతరం సింగ్ ను పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ కింద జమ్ము డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ సిమరన్ దీప్ ఆదేశాల మేరకు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరించిన ప్రభుత్వం జమ్మూలో మాత్రం మూడోరోజూ నిలిపివేతను కొనసాగిస్తోంది. అంతకుముందు జరిగిన నిరసన ప్రదర్శనలలో వేర్పాటువాదులు పాకిస్థాన్, ఐఎస్ఐఎస్ జెండాలను ఎగరేశారు.