జాబిల్లి పెరట్లో రోవర్ ఆటలు.. చంద్రయాన్ 3 న్యూ వీడియో.. | ISRO Latest Video On Rover Roaming On Moon | Sakshi
Sakshi News home page

జాబిల్లి పెరట్లో రోవర్ ఆటలు.. చంద్రయాన్ 3 న్యూ వీడియో..

Published Thu, Aug 31 2023 3:33 PM | Last Updated on Thu, Aug 31 2023 4:51 PM

ISRO Latest Video On Rover Roaming On Moon - Sakshi

బెంగళూరు: చంద్రయాన్ 3 ప్రాజెక్టులో భాగంగా రోవర్ ప్రజ్ఞాన్ తన పనిలో బిజిబిజీగా గడుపుతోంది. జాబిల్లిపై ఉండే రాళ్లు, లోయలను పసిగడుతూ తన మార్గాన్ని జాగ్రత్తగా నిర్దేశించుకుంటోంది. 14 రోజుల గడువు దగ్గరపడుతున్న నేపథ్యంలో శాస్త్రవేత్తలు నిర్దేశించిన అన్వేషణను కొనసాగిస్తోంది. దీనికి సంబంధించిన కొత్త వీడియోను ఇస్రో షేర్ చేసింది.  

రోవర్ ప్రజ్ఞాన్ సరైన దారిని వెతుక్కునే క్రమంలో అక్కడక్కడే తిరుగాడుతున్న దృశ్యాలను ల్యాండర్ ఇమేజర్ కెమెరా వీడియో తీసింది. ఈ వీడియోను ఇస్రో తన అధికారిక ఖాతాలో పంచుకుంది. అమ్మ ఆప్యాయంగా చూస్తుండగా.. పెరట్లో ఆడుకుంటున్న చంటిబిడ్డలా రోవర్‌ భలే ఉంది కదా..? అంటూ క్యాప్షన్‌ను కూడా జోడించింది. 

 చంద్రయాన్ 3 ప్రాజెక్టులో భాగంగా విక్రమ్ ల్యాండర్ చంద్రుని దక్షిణ ధ్రువంపై దిగ్విజయంగా దిగిన విషయం అందరికీ తెలిసిందే. విక్రమ్ ల్యాండర్ నుంచి బయటకు వచ్చిన రోవర్ ప్రజ్ఞాన్.. పరిశోధనలను కొనసాగిస్తోంది. చంద్రునిపై నీటిజాడ, వాయువులు, మట్టి, అక్కడ దొరుకుతున్న రసాయనిక పదార్థాల గురించి ఆరా తీస్తోంది. 

చంద్రుని దక్షిణ ధ్రువంపై సల్ఫర్ మూలకం పుష్కలంగా ఉందని ప్రజ్ఞాన్ రోవర్ ఇప్పటికే గుర్తించింది. అల్యూమినియం, కాల్షియం, ఇనుము, క్రోమియం, టైటానియం, మాంగనీసు, సిలికాన్, ఆక్సిజన్ కూడా అక్కడ ఉన్నట్లు కనుగొంది. చంద్రునిపై ఉష్ణ్రోగ్రత 70 డిగ్రీల వరకు ఉంటోందని ఇస్రో తెలిపింది.

ఇదీ చదవండి: Chandrayaan-3: విజయవంతంగా చంద్రయాన్.. వాట్ నెక్ట్స్.?


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement