అవును.. కేజీ మట్టి కోసం అన్ని లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నమాట నిజమే. కాకపోతే అది భూమ్మీద మట్టి కోసం కాదు. అంతరిక్షంలో అదీ అంగారక గ్రహం మీద మట్టి కోసం. ఈ విషయాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా అధికారికంగా ప్రకటించింది.
మార్స్ మీద దిగిన నాసా పర్సీవరెన్స్ రోవర్ ఇదివరకే పరిశోధనలు మొదలుపెట్టిన విషయం తెలిసిందే. అయితే అత్యంత విలువైందిగా భావిస్తున్న అక్కడి మట్టిని భూమ్మీదకు రప్పించే ప్రయత్నాలు చేస్తోంది నాసా. ఈ ప్రాజెక్టు కోసం నాసా 9 బిలియన్ల డాలర్లు ఖర్చు చేయబోతోంది. ఒకవేళ అంగారక గ్రహం మీద మట్టి భూమ్మీదకు చేరితే గనుక.. ఇప్పటిదాకా భూమ్మీది అపురూపమైన వస్తువులలో అదే అగ్రస్థానంలో ఉంటుంది.
దాదాపు రెండు పౌండ్ల మట్టి(దాదాపు కేజీ)ని మట్టిని మార్స్ నుంచి తెప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొత్తం మూడు దశలో ఈ ప్రాజెక్టు ఉండబోతుంది. అయితే ఈ శాంపిల్ సేకరణ ప్రక్రియ మొత్తం పూర్తి కావడానికి రెండేళ్లు పట్టే అవకాశం ఉందని నాసా చెబుతోంది. ఇక ఆ మట్టిని భూమ్మీదకు తేవడానికి మరో పదేళ్లకాలం పైనే పట్టొచ్చని అంచనా. కాగా, మార్స్ మట్టి కోసం ఇంత ఖర్చు చేయబోతున్న నాసా తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి కూడా.
చదవండి: మార్స్‌పై ఆక్సిజన్
Comments
Please login to add a commentAdd a comment