వాషింగ్టన్: మార్స్‌పై జరుగుతున్న పరిశోధనల క్రమంలో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. అంగారక గ్రహంపై ‘పర్సవరన్స్’ రోవర్ ల్యాండ్ అవుతున్న అద్భుత క్షణాలకు సంబంధించిన వీడియోను అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా విడుదల చేసింది. ‘‘రోవర్‌లోని మైక్రోఫోన్ మార్స్ నుండి వచ్చే శబ్దాలను ఆడియో రికార్డింగ్‌ను అందించింది. ఇలాంటి శబ్దాలను, వీడియోను సాధించడం ఇదే మొదటిసారి..ఇవి నిజంగా అద్భుతమైన వీడియోలు" అని జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ డైరెక్టర్ మైఖేల్ వాట్కిన్స్ ఆనందంగా ప్రకటించారు. ఫిబ్రవరి 18న ఈ ల్యాండింగ్‌ను రికార్డు చేసేందుకు 7 కెమెరాలను ఆన్ చేశామని, రోవర్‌లో రెండు మైక్రోఫోన్లు, 25 కెమెరాలు ఉన్నాయన్నారు. భవిష్యత్తులో మరిన్ని వీడియోలు, ఫొటోలు విడుదల చేస్తామని నాసా సైన్స్ అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్ థామస్ జుర్బుచెన్ వెల్లడించారు. (పెర్సి సక్సెస్.. మార్స్ ఫోటోలు షేర్ చేసిన నాసా)
పర్సవరన్స్ రోవర్ శుక్రవారం అరుణగ్రహంపై ల్యాండ్ అయినసంగతి తెలిసిందే. ఇది రెడ్ ప్లానెట్‌లో ప్రవేశించిన, డీసెంట్ అండ్ ల్యాండింగ్ (ఇడీఎల్) చివరి నిమిషాల్లో ప్రధాన మైలురాళ్లను రికార్డు చేసింది. రోవర్ ల్యాండ్ కావడానికి ముందు పారాచూట్ విచ్చుకోవడంతో పాటు, అది కిందకి దిగుతున్న సమయంలో మూడు నిమిషాల 25 సెకన్ల పాటు కొనసాగే హై-డెఫినిషన్ వీడియో క్లిప్‌ను సాధించాం ఈ సందర్భంగా మార్స్ ఉపరితలం కూడా వీడియోలో కనిపించింది. గ్రహానికి దగ్గరవుతున్న కొద్దీ మరింత స్పష్టంగా కనిపించింది. అక్కడి నేలంతా ఎర్రగా ఉంది. రోవర్ అరుణగ్రహంపై దిగుతున్న సమయంలో లేచిన ధూళి మేఘం, పారాచూట్ సాయంతో వ్యోమనౌక నుంచి కిందకి దిగడం స్పష్టంగా కనిపించిందని నాసా ఇంజనీర్లు ప్రకటించారు.
Your front-row seat to my Mars landing is here. Watch how we did it.#CountdownToMars pic.twitter.com/Avv13dSVmQ
— NASA's Perseverance Mars Rover (@NASAPersevere) February 22, 2021
Now that you’ve seen Mars, hear it. Grab some headphones and listen to the first sounds captured by one of my microphones. 🎧https://t.co/JswvAWC2IP#CountdownToMars
— NASA's Perseverance Mars Rover (@NASAPersevere) February 22, 2021
Comments
Please login to add a commentAdd a comment