perseverance
-
Patenting: ప్రకృతికి పేటెంట్ తీసుకోవచ్చా!!!
భగవంతుడు మనకు మాట ఇచ్చాడు, బుద్ది ఇచ్చాడు, ఇంత గొప్ప శరీరాన్ని ఇచ్చాడు... అన్న విశ్వాసం మనకు ఉండాలి. నేను ఏదో సాధించాలన్న ఉద్దేశంతోనే నాకు ఇవి బహూకరించాడు... ఎన్ని ప్రతిబంధకాలు ఎదురయినా సరే... నేను అనుకున్నది సాధించితీరతాను... అన్న పట్టుదల ఉంటే ఎంతటి నిరాశానిస్పృహలు ఎదురయినా సరే... సునాయాసంగా వాటిని దాటి... లక్ష్యాలను సాధించవచ్చు... అనడానికి – ఆత్మహత్య ఆలోచనలను వెనక్కి తీసుకుని, కష్టాలతోనే కడుపు నింపుకుని, ఒకటి కాదు, రెండు నోబెల్ బహుమతులు గెలుచుకున్న ధీర వనిత మేరీ క్యూరీ గొప్ప ఉదాహరణ. మేరీ అసలు పేరు మరియా. 1867 నవంబరు 7న జన్మించారు. పోలండ్ దేశస్థురాలు. తల్లిదండ్రులు టీచర్లు. 11వ ఏట తల్లి మరణించింది. పోలండ్ లోని రాజకీయ అనిశ్చితి వాతావరణంలో తండ్రి ఉద్యోగం పోయింది. అక్కడినుంచి కష్టాలను ఈదుకుంటూ పారిస్ చేరుకుంది. ఆ రోజుల్లో సై¯Œ ్స చదవడానికి స్త్రీలు ముందుకు రాకుండా సంప్రదాయవాదులనుండి అనేక అవరోధాలుండేవి. ఆమెకు సైన్సంటే మక్కువ, పరిశోధనలంటే ప్రాణం. ఇంటిపట్టునే ఉన్నవనరులతోనే ప్రయోగశాల పెట్టుకుంది. ప్రొఫెసర్ హెన్నీ బెకెరెల్ సాయంతో పరిశోధనలు చేసేది. ఇంచుమించు తనలాగే అనేక కష్టాలను ఓర్చుకుంటూ పరిశోధనలు సాగిస్తున్న పీరే క్యూరీతో పరిచయం, సాహచర్యం తరువాత పెళ్ళికి దారితీసాయి. అయినా కష్టాలు తీరకపోగా కలిసి అనుభవించడం అలవాటు చేసుకున్నారు. భయంకరమైన కాన్సర్ వ్యాథి చికిత్సకు తోడ్పడగల కారకాల కోసం పరిశోధనలు ముమ్మరంగా సాగుతుండేవి. రేడియోయాక్టివిటీ సిద్ధాంత అభివృద్ధికి, దాని తాలూకు పరిశోధనలకు ఆమె గురువుకి, భర్తకి, ఆమెకు కలిపి నోబెల్ బహుమతి లభించింది. ఆ తరువాత ఒక చిన్న రోడ్డు ప్రమాదంలో ఆమె భర్త మరణించారు. తరువాత కాలంలో పొలోనియం, రేడియం మూల పదార్థాల అన్వేషణకు ఈసారి రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి ఆమెను వరించింది. ఒక స్త్రీకి రెండుసార్లు, అదీ రెండు వేర్వేరు సబ్జెక్ట్ లలో నోబెల్ రావడం విశేషం, అపూర్వం. ఆమె సాధించిన ఫలితాలకు ఆమె కానీ, ఆమె భర్త కానీ పేటెంట్ తీసుకుని ఉంటే.... వారి వారసులు ఇప్పటి లెక్కల ప్రకారం ప్రపంచంలో అత్యంత సంపన్నులుగా ఉండేవారు. కానీ ఆమె నిజ జీవిత సిద్ధాంతం ఏమిటో తెలుసా... ‘‘అవి (ఖనిజాలు) ప్రకృతి ఇచ్చిన వరం. అది ప్రజలది. వాటి మీద నాకేం హక్కు ఉందని పేటెంట్ తీసుకోవాలి. అందరి మేలుకోసం వాటిని నేను ఉపయోగించగలగడం నాకు జీవితంలో దక్కిన అదృష్టం... అందుకే వాటికోసం తాపత్రయపడలేదు. నిజానికి దంపతులిద్దరికీ అవార్డులు, రివార్డుల మీద ధ్యాస ఉండేది కాదు... నిరంతరం పరిశోధనలే... అవికూడా ఇంటిపట్టున ఏర్పాటు చేసుకున్న అరాకొరా సౌకర్యాలతో... సరైన రక్షణ చర్యలు లేకపోవడంతో ... ధార్మిక ప్రభావానికి ఆమె శరీరం గురయింది... చివరకు ఆమెకు కూడా కాన్సర్ సోకి, మరణానికి దారితీసింది... ఆమె పారిస్(ఫ్రా¯Œ ్స దేశం)లో స్థిరపడినా, మాతృదేశం పట్ల ఆమెకు ఎంత గాఢమైన ప్రేమంటే... తాను కనుగొన్న పదార్థాలలో ఒకదానికి తన దేశం పేరు ధ్వనించేలా పొలోనియం అని పేరుపెట్టింది. చివరకు తన మరణానంతరం ఖననానికి ముందు.. శవపేటిక తెరచి.. జన్మభూమి పోలండ్ నుంచి తెచ్చిన మట్టి చల్లాలని కోరింది. మానవాళి శ్రేయస్సుకు తపించడం తప్ప ఆమె సర్వసుఖాలను, సంపదలను దూరంగా పెట్టింది.. చివరకు కీర్తికాంక్షను కూడా. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
సౌర వలయాలు
ఫొటోల్లో కన్పిస్తున్నది సూర్యుని చుట్టూ ఏర్పడ్డ వెలుతురు వలయం (సన్ హాలో). రెండో ఫొటోలోది భూమ్మీద నుంచి కన్పిస్తున్నది కాగా, మొదటి ఫొటోలోనిదేమో అంగారకునిపై నుంచి కన్పించిన సన్ హాలో. అరుణ గ్రహంపై జీవం ఆనవాళ్లను అన్వేషించే క్రమంలో పెర్సెవరెన్స్ రోవర్ ఈ అరుదైన దృగ్విషయాన్ని గత డిసెంబర్లో అనుకోకుండా క్లిక్‌మనిపించింది. 2021 డిసెంబర్ 15న వాటిని నాసాకు పంపింది. సన్ హాలో భూమి పై నుంచి తరచూ కనిపిస్తూనే ఉంటుంది గానీ అంగారకునిపై నుంచి కంటబడటం ఇదే తొలిసారని స్పేస్ సైన్స్ ఇన్స్టిట్యూట్కు చెందిన ప్లానెటరీ సైంటిస్టు మార్క్ లేమన్ చెప్పారు. 2020లో నాసా ఈ రోవర్‌ను అంగారకునిపైకి పంపించడం తెలిసిందే. ఏమిటీ సన్ హాలో...? మేఘాల్లో అసంఖ్యాకమైన సూక్ష్మ మంచు స్ఫటికాలుంటాయి. కాంతి వాటి గుండా సాగే క్రమంలో అప్పడప్పుడూ విడిపోవడంతో పాటు వక్రీభవనం కూడా చెందుతుంటుంది. ఫలితంగా ఒక్కోసారి ఇంద్రధనుస్సును తలపించే కాంతి వలయాలు ఏర్పడతాయి. నిర్దిష్ట కోణం నుంచి చూసినప్పుడు ఇవి వృత్తాకారంలో కనువిందు చేస్తాయి. వాటిని సన్ హాలోగా పిలుస్తారు. ఇలా భూమ్మీది నుంచి కన్పించే వలయాలు సాధారణంగా 22 డిగ్రీల కోణంలో ఏర్పడేవి అయుంటాయని అమెరికాలోని ఇల్లినాయీ యూనివర్సిటీ అధ్యయనంలో తేలింది. అయితే భూమితో పోలిస్తే అంగారకునిపై నీటి శాతం అత్యల్పం. అక్కడ అత్యధికంగా ఉండేది కార్బన్ డయాక్సైడే. కాబట్టి పెర్సెవరెన్స్ రోవర్ అందించిన ఫొటోలు నిజంగా సన్ హాలోకు సంబంధించినవేనా అని శాస్త్రవేత్తలు మీమాంసలో పడ్డారు. బహుశా రోవర్ తాలూకు కెమెరా కోణం వల్ల అలాంటి వెలుతురు వలయం ఏర్పడి ఉండొచ్చన్న అభిప్రాయమూ వ్యక్తమైంది. అయితే చివరికి ఇది దుమ్మూ ధూళి వల్ల ఏర్పడ్డది కాదని, సన్ హాలోయేనని తేల్చారు. – నేషనల్ డెస్క్, సాక్షి -
మంచి మాట: సాధన.. ఓ తపస్సు
ఏ విద్యలోనైనా పట్టు రావాలంటే సాధన అవసరం. అది నిరంతరం కొనసాగాలి. ‘అభ్యాసం కూసు విద్య..’ అన్నారు కదా పెద్దలు. అభ్యసించటానికి శ్రద్ధాసక్తులే కాక అకుంఠిత దీక్ష కావాలి. దానికి పట్టుదల కలవాలి. ఇష్టపడి నేర్చుకున్న ఒక విద్యను అభ్యసించవలసి వుంటుంది. ఆ విద్యను సరిగా ఒక గురువు వద్ద నేర్చుకోవాలి. సుశిక్షితులైన పిదప నేర్చిన విద్యను అభ్యసించాలి. అపుడే దానికొక దిశ – దశ ఏర్పడతాయి. సక్రమ మార్గం ఏర్పడుతుంది. నేర్చుకున్న విద్య కరతలామలకమవ్వాలంటే అభ్యాసం వల్లే సాధ్యం. సరైన శిక్షణ లేని విద్య సాధన చేయటం సమయం వృథా. ఇక్కడ జాగరూకత చాలా అవసరం. తపస్సుకు మనో నిశ్చలత అత్యంత ప్రధానమైనది. ఒక దైవాన్ని మనస్సు లో ప్రతిష్టించుకోవాలి. ఆ దేవుడి నామాన్నో.. మంత్రాన్నో ఉచ్చరిస్తూ వుండాలి. జగాన్ని మరవాలి. పెదవుల కదలికలు నెమ్మది.. నెమ్మదిగా అదృశ్యమై మీ ఉచ్ఛ్వాస,.. నిశ్వాసాలే ఆ నామ, మంత్రాలవుతాయి. ఇది తపస్సులో గొప్ప దశ. ఆ అద్భుత స్థితికి చేరగలిగామా.. తపస్సులో అత్యున్నత దశకు చేరుకున్నట్టే. సాధనలో కూడ అంతటి త్రికరణ శుద్ధి కావాలి. అపుడే మనం అభ్యసిస్తున్నా దానిలో గొప్ప ప్రావీణ్యం పొందుతాం. ఎలాగూ మన మనస్సుకు నచ్చిన విద్యను ఎంపిక చేసుకుంటాం కనుక ఆమూలాగ్రంగా నేర్చుకోవాలి. ఏకాగ్రతతో సాధన చేయాలి. మన శక్తియుక్తుల్ని ధారపోయాలి. సంకల్పం... పట్టుదల..మనోనిశ్చలత.. ఏకాగ్రత.. ఈ శక్తుల పిల్ల కాలువలన్నీ సాధన అనే మహా నదిగా మారిన వేళ.. మార్చుకున్న వారికి విద్య స్వాధీనమై.. విద్వత్తు వశమవదా..! సా.. ధ.. న అనే మూడు అక్షరాల వెనుక ఇన్ని శక్తుల కలయిక ఉందని.. ఉంటుందని గ్రహించాలి. అలా గ్రహించిన వారే వాటిని తమలో అంతర్గతంగా వుంటే గుర్తిస్తారు. లేకుంటే అలవరచుకుంటారు. అటువంటి వారే ఆ సాధనా తపస్సులో పరిపూర్ణులవుతారు. ఆ తపోఫలితాన్ని పొందుతారు. సాధారణంగా ఎవరైనా.. నేర్చుకున్న విద్యను సాధన చేస్తారు. ఇది లోకరీతి. గురువు చెప్పిన విద్యను దాని లోతుపాతులను క్షుణ్ణంగా తెలుసుకోవాలంటే బాగా అభ్యసించాలి. జీవితంతో పోల్చి చూసుకోవాలి. స్వీయ అనుభవాలు, ఇతరుల అనుభవాలు పరిశీలించాలి. ఆ సాధనకు విచక్షణ, వివేచనల తోడు చేసి మరింతగా గట్టిపరచుకోవాలి. కొందరికి అద్భుత ప్రతిభా వ్యుత్పత్తులంటాయి. వారి వైఖరే వేరు. అసలు గురువునుండి విద్యను గ్రహించి ఆకళింపు చేసుకునే పద్ధతే విభిన్నం. కౌరవులకు .. పాండవులకు విలువిద్య నేర్పే ఆరంభ దశలోనే.. బాణంతో చేధించవలసిన పక్షికన్ను తప్ప ఇంకేమి కనుపించటంలేదన్న అర్జునుడి మాటలతో అతనే ఆ విద్యకు సరైన అర్హుడని నిర్ణయించుకున్నాడు ద్రోణాచార్యుడు. గొప్ప కలయిక వారిరువురిది. ఏకాగ్రతతో గురువు చెప్పిన విద్యను సాధన చేయసాగాడు. ఓ రాత్రివేళ.. దీపంలేని తరుణాన... భోజనం చేయగలిగిన పార్థుడు ఒక అద్భుతమైన ఆలోచన చేశాడు. చీకటిలో శబ్దాన్ని బట్టి.. ఆ దిశ వైపు బాణం వేసి వేటాడటం నేర్చుకున్నాడు. గొప్పగా సాధన చేసాడు. పట్టు సంపాదించాడు. తన గురువు మెప్పు పొందాడు. గురువు నేర్పిన విద్యను సాధన చేసే క్రమంలో వచ్చే ఆలోచనలకు తన అద్భుత ఊహశక్తిని మేళవించి తాను నేర్చిన.. నేర్చుకుంటున్న విద్యకు ఒక రూపు.. కోణం.. ఓ వైవిధ్యతను.. ఓ విభిన్నతను కలిపి ఆ విద్యను పరివ్యాపితం చేసాడు తన శక్తి యుక్తులతో. తన గురు ప్రశంస పొందాడు. అలా విశేషమైన ప్రతిభ కల శిష్యులుంటారు. ప్రతిభకు వైవిధ్యం తోడైతే అది ఓ అద్భుతమే. అంతే కాదు.. ఓ నవ నవోన్మేషమే అవుతుంది. విశ్వనాథ సత్యనారాయణ, మంగళంపల్లి బాలమురళీకృష్ణ ప్రభృతులు అటువంటి ప్రతిభ సంపన్నులే. నిరంతర సాధన మన సామర్థ్యాన్ని పెంచుతుంది. ఎనలేని ఆత్మ విశ్వాసాన్నిస్తుంది. పొరపాట్లు.. తప్పిదాలను గమనించి వాటిని సరిదిద్దుకునే అవకాశమిస్తుంది. విద్యాప్రతిభను ప్రదర్శించే సందర్భాలు నల్లేరు మీద బండిలా సాగాలంటే అభ్యాసం తప్పదు. భూ గర్భంలోని రత్నం వంటిదే ప్రతిభ. రత్నాన్ని వెలిక్కితీసి సానపెడితే కాని ధగధగద్ధాయమానంగా ప్రకాశించదు. మనలోని పాడగలిగే గొంతుకకైనా.. అద్భుత కవితాశక్తికైనా... చిత్రలేఖనా ప్రతిభకైనా మార్గదర్శకత్వం చేయగల గొప్పగురువు కావాలి. ఆయన నుండి పొందిన మన జ్ఞానానికొక పరిపుష్టి.. పరిపూర్ణత.. అద్భుత స్వాధీనత.. రాణింపు రావాలంటే సాధన కావాలి. ఒక విద్వాంసుడి.. లేదా ఒక కళాకారుడి ప్రతిభ నిజానికి పేరు ప్రఖ్యాతులు ఎంత బాగా వస్తే వారు అంత ఎక్కువగా సాధన చేయాలి. ఒక కళాకారుడు అత్యున్నత స్థాయికి చేరిన తరువాత అతని ప్రదర్శన తిలకించటానికి వచ్చేప్రేక్షకులు అది అత్యున్నతంగా ఉండాలని... ఉంటుందని ఆశించి వస్తారు. అది ఎంతో సహజమైనది. తాను ఎప్పుడూ ఇస్తున్న ప్రదర్శనే కదా.. సాధన ఎందుకు చేయాలన్న ఆలోచన ఏ కళాకారుడికైనా.. పండితుడికైనా వచ్చిన క్షణం అతడి ప్రతిభాభానుడికి మేఘాలు కమ్ముతాయి. కళాకారులు ఎంతటి లోకప్రసిద్ధులైతే అంతటి సాధన కావాలి. చేయాలి. వారి స్థాయికి తగ్గని ప్రదర్శన ఇవ్వాలి. అలా ఇవ్వాలంటే సాధన చేయక తప్పదు. సాధన చేసే క్రమంలో ఏకాగ్రత.. పట్టుదలలు సడలకూడదు. మనస్సు చంచలం కాకూడదు. సాధన ఎంత కాలం చేయాలి, దీనిని ఎక్కడ ఆపాలి..? అసలు ఆపచ్చా... అన్న ప్రశ్నలు.. సందేహాలు వస్తుంటాయి. సాధన నిలుçపు చేయటం అన్న ఆలోచనే పుట్టకూడదు మనలో. వచ్చిన క్షణం మనలో నేర్చుకునే తపన చనిపోతుంది. చాలానే నేర్చుకున్నామన్న తృప్తి.. ఇంకా నేర్చుకోవలసిన అవసరం లేదన్న ఆలోచనే అందుకు కారణం! సాధనకు దూరమయ్యామంటే నేర్చుకున్న విద్య మీద పట్టు తగ్గచ్చు. అందుకే సాధన ఒక జీవనది కావాలి. ఎంత సాధన చేస్తే. అంత పరిపూర్ణత. అంత అలవోకగా చేయగల సామర్థ్యం వస్తుంది. నేర్చుకునే సమయంలో సాధన చాలా మంది చేస్తారు. ఇది సహజం. ఒక దశకు చేరుకున్న తరువాత శ్రద్ధ పెట్టం. కాని సాధన ఊపిరున్నంత వరకు చేయాల్సిందే. అలా చేసినవారే తమ విద్వత్తును, దానిలోని సారాన్ని అనాయాసంగా చదువరులకు లేదా శ్రోతలకు ఇవ్వగలరు. రంజింప చేయగలరు. ‘మాలో మీరనే ఉత్కృష్టత నిరంతరాభ్యాసం వల్ల ఒక అలవాటుగా మారింది’ అన్నారు గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్. -
భూమ్మీదే కాదు.. అక్కడా వరదలు ముంచెత్తాయి!
ఇప్పుడంటే అంగాకర గ్రహం ఎండిపోయి.. రాళ్లు, రప్పలు, మట్టిదిబ్బలతో కనిపిస్తోంది. మరి ఒకప్పుడు? అంటే.. ఓ 3.7 బిలియన్ల సంవత్సరాల కిందట. ఆ సమయంలో మార్స్.. ఎర్త్ తరహాలోనే ఉండేదని పరిశోధనలు ఒక్కొక్కటిగా చెబుతూ వస్తున్నాయి. ఇంతకీ ఈ అరుణ గ్రహం మానవ నివాస యోగ్యానికి అనుకూలమా? కాదా? అనేది తేల్చేక్రమంలో ఆసక్తికరమైన విషయాలెన్నో బయటపడుతున్నాయి. తాజాగా.. అంగారకుడిపై వరద ప్రవాహాల్ని సైతం గుర్తించింది నాసాకు చెందిన పర్సివరెన్స్ రోవర్. తాను దిగిన జీజెరో క్రాటర్ ప్రాంతంలోనే ఈ రోవర్, వరద జాడల్ని గుర్తించడం విశేషం. కుంభవృష్టి వరదలతో లోతైన గుంతలు ఏర్పడి ఉండొచ్చని సైంటిస్టులు నిర్ధారణకు వచ్చారు. ఇక కొత్త రోవర్‌తో అనుసంధానం కాసేపు ఆగిపోవడానికి ముందు.. పర్సివరెన్స్ కీ ఫొటోల్ని నాసా సెంటర్‌కు పంపింది. అంగారకుడి ఉపరితలంపై తీసిన ఈ చిత్రాలను పరిశీలించిన తర్వాత.. నాసా కొన్ని విషయాల్ని వెల్లడించింది. ► ఆ కాలంలో మార్స్ మీద వాతావరణం(పొరలు) దట్టంగా ఉండేది(మొదటి నుంచి ఇదే చెప్తున్నారు) ► జీజెరో క్రాటర్‌ను ఒక సరస్సుగా దాదాపు నిర్ధారణకు వచ్చేశారు ► నదులు, వాటి ప్రవాహం వల్ల మార్స్ మీద ఫ్యాన్ ఆకారంలో డెల్టా ప్రాంతాలు సైతం ఏర్పడ్డాయి ► సరస్సు(ఎండిపోయిన) చిన్నభూభాగాలు.. నది డెల్టా ప్రాంతానికి చెందినవే అయ్యి ఉంటాయి ► గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతో కుంభవృష్టి వరదలు ముంచెత్తాయి.. బహుశా ఆ ప్రాంతమంతా ఎండిపోయి ఉండొచ్చు ► వరదలతో సరస్సుల్లోకి కొట్టుకువచ్చిన రాళ్లురప్పల ఫొటోల్నే పర్సివరెన్స్ ఇప్పుడు నాసాకి పంపింది. చదవండి: గంటన్నర పాటు భారీ ప్రకంపనలతో ఊగిపోయిన మార్స్...! -
మార్స్ పై రోవర్ నిజంగానే సెల్ఫీ తీసుకుందా..!
మామూలుగా సెల్ఫీ తీసుకునేటప్పుడు మనలో చాలా మంది సెల్ఫీ స్టిక్ లేదా మనలో ఎవరైనా పొడుగ్గా ఉన్నవారిని ఉపయోగించి సెల్ఫీను తీసుకుంటాం. మనం సెల్ఫీ తీసుకున్నట్లుగా ఫోటోను చూసి ఇట్టే చెప్పవచ్చును ఆ ఫోటో సెల్ఫీ ...! లేదా ఎవరైనా తీశారా..! గత కొన్ని రోజుల క్రితం మార్స్ ఉపరితలంపై పర్సివర్సెన్స్ రోవర్ తీసుకున్న సెల్ఫీ ఫోటోను ఏప్రిల్ 6 నాసా విడుదల చేసింది. కాగా ఈ ఫోటోపై చాలా మందికి అనుమానాలు రేకెత్తాయి. ఫోటోను ఎవరో తీశారనే సందేహాలు వ్యక్త పరిచారు. కాగా తాజాగా పర్సివర్సెన్స్ తీసుకున్న సెల్ఫీ ఫోటోపై నాసా వివరణ ఇచ్చింది. నాసా వివరణ: అంగారక గ్రహంపై పరిశోధనలు చేపట్టడానికి ‘పర్సవరెన్స్’రోవర్‌ను నాసా పంపిన విషయం తెలిసిందే. పర్సవరెన్స్ రోవర్ ప్రాజెక్టులో భాగంగా ఇన్‌జెన్యూటీ హెలికాప్టర్‌ను కూడా పంపారు. మార్స్ఉపరితలంపై పర్సీవరెన్స్ రోవర్‌తో కలిసి హెలికాప్టర్ ఇన్‌జెన్యూటీని ఏప్రిల్ 6న సెల్ఫీ తీసుకుంది. ఈ సెల్ఫీను తీసుకోవడానికి వాట్సాన్ అనే కెమెరానుపయోగించింది. పర్సివరెన్స్ రోవర్‌కు అమర్చిన రోబోటిక్ ఆర్మ్‌తో వాట్సాన్ కెమెరాను ఉపయోగించి సెల్ఫీ తీసింది. కెమెరాతో తీసిన సుమారు 62 వ్యక్తిగత చిత్రాలను జోడించి పర్సివరెన్స్, ఇన్‌జెన్యూటీ హెలికాప్టర్ల పూర్తి సెల్ఫీ చిత్రాన్ని విడుదల చేసింది. కాగా చిత్రాల జోడింపునకు సంబంధించిన వీడియోను నాసా జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ విడుదల చేసింది. వ్యక్తిగతంగా తీసుకున్న చిత్రాలను కలిపి పూర్తి చిత్రాన్ని విడుదల చేశామని నాసా పేర్కొంది. చదవండి: నాసా సాధించిన మరో ఘన విజయం..మార్స్‌పై తొలిసారిగా.. -
అంగారక గ్రహంపై ఆక్సిజన్...!
వాషింగ్టన్: మానవ మనుగడ కోసం భూమి కాకుండా మరో గ్రహాం కోసం నాసా అనేక పరిశోధనలు చేస్తున్న విషయం తెలిసిందే. అందుకోసం అంగారక గ్రహంపై నాసా పరిశోధనలు చేస్తోంది. పరిశోధనల్లో భాగంగా అంగారక గ్రహంపైకి పెర్సివరెన్స్ రోవర్‌ను పంపగా, ఈ రోవర్ అంగారక గ్రహంపై పలు పరిశోధనలు చేస్తోంది. అంగారక గ్రహంపై తొలిసారిగా ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసింది. మార్స్ వాతావరణంలోని కార్బన్‌డయాక్సైడ్‌ను ఆక్సిజన్‌గా మార్చడంలో నాసా ముందడుగు వేసింది. ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి పర్సివరెన్స్ రోవర్లో ‘మోక్సీ ’అనే పరికరాన్ని అమర్చారు. ఈ పరికరం మార్టిన్ వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్ను గ్రహించి, ఎలక్ట్రాలసిస్ ప్రక్రియ ద్వారా కార్బన్ డయాక్సైడ్ను విచ్చినం చేసి ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తోంది. కాగా, తొలి ప్రయోగంలో మోక్సీ పరికరం 5గ్రాముల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయగా, ఇది వ్యోమగామికి అందించే సుమారు 10 నిమిషాల విలువైన శ్వాసకు సమానం అని నాసా తెలిపింది. ఏడు నెలల ప్రయాణం తరువాత ఫిబ్రవరి 18న అంగారక గ్రహంపైకి అడుగుపెట్టిన నాసా రోవర్ పర్సివరెన్స్తో పంపిన ఇన్జేన్యూటి, మోక్సీ తమ తొలి ప్రయోగంలో విజయవంతంగా ప్రయోగింపబడ్డాయి. ఆక్సిజన్ ఉత్పత్తి మానవ మనుగడకు కీలక మైలురాయి అని నాసా పేర్కొంది. దీంతో భవిష్యత్‌లో ఆక్సిజన్‌ను భూమి నుంచి తీసుకెళ్లే బాధతప్పింది. ఆక్సిజన్‌ను తీసుకెళ్లడానికి బదులుగా మార్టిన్ వాతావరణం నుంచి కార్బన్ డయాక్సైడ్ను ఆక్సిజన్‌గా మార్చే యంత్రాన్ని తీసుకెళ్లడం చాలా సులువని అంతరిక్ష పరిశోధకులు భావిస్తున్నారు. అంగారక గ్రహంపై సుమారు 95 శాతం వరకు కార్బన్ డయాక్సైడ్ ఉంది. Another huge first: converting CO2 into oxygen on Mars. Working off the land with what’s already here, my MOXIE instrument has shown it can be done! Future explorers will need to generate oxygen for rocket fuel and for breathing on the Red Planet. https://t.co/9sjZT9KeOR — NASA's Perseverance Mars Rover (@NASAPersevere) April 21, 2021 చదవండి: నాసా సాధించిన మరో ఘన విజయం..మార్స్‌పై తొలిసారిగా.. -
రోవర్ ల్యాండింగ్ సైటు పేరెంటో తెలుసా..
లాస్ఎంజిల్స్: అంగారక గ్రహంపై పరిశోధనల నిమిత్తం నాసా పంపిన పర్సెవరన్స్ రోవర్ దిగిన స్థలానికి నాసా పేరుపెట్టింది. రోవర్ దిగిన స్థలానికి ప్రముఖ సైన్స్ ఫిక్షన్ రచయిత ‘ఆక్టేవియా ఇ బట్లర్ ’ పేరును పెట్టారు. అంగారక గ్రహంపై రాళ్లు, మట్టిని పరిశోధించడం, సూక్ష్మజీవుల ఉనికిని అన్వేషించడం, నేరుగా మానవుడు ల్యాండ్ అవ్వడానికి అనువైన స్థలాన్ని వెతకడం పర్సెవరన్స్ విధి. గతంలో మార్స్‌పై దిగిన క్యూరియాసిటి రోవర్ ల్యాండింగ్ స్థలానికి ‘రే బ్రాడ్బరీ’ రచయిత పేరును 2012 ఆగస్టు 22న పెట్టారు. గత ఏడాది జూలై 30 న ఈ రోవర్‌ను నాసా ప్రయోగించిన విషయం తెలిసిందే . ఇది 203 రోజుల ప్రయాణం తరువాత ఫిబ్రవరి 18 న అంగారక గ్రహానికి చేరింది. (చదవండి:మార్స్‌పై రోవర్ అడుగులు షురూ!) -
మార్స్‌పై మహిళా శక్తి
‘పెర్సీ’ రోవర్ మార్స్ పైన దిగి వారం అయింది. ఇప్పుడేం చేస్తూ ఉంటుంది? ఏం చేయడం లేదు. ఉన్న చోటే ఉండి భూమి పైకి ఫొటోలు పంపుతూ ఉంది. పెర్సీ ఒక్కటే లేదు అక్కడ. తల్లి ఒడిలో బిడ్డలా (కంగారూ తల్లీబిడ్డల్ని ఊహించండి) పెర్సీ పొదుగు కింద ‘ఇంజిన్యూటీ’ అనే హెలికాఫ్టర్ కూడా ఉంది. ఆ బిడ్డకు తల్లి పాలిస్తూ ఉంది. 30 పర్సెంట్ ఛార్జింగ్ అయింది ఇప్పటికి. పాలివ్వడం పూర్తవగానే బిడ్డకు రెక్కలొచ్చి మార్స్ పై ఎగురుకుంటూ తిరుగుతుంది. అదలా ఎగరగానే పెర్సీ కూడా మెల్లిగా కదలడం, ముందుకీ వెనక్కూ అడుగులు వేయడం మొదలు పెడుతుంది. మార్స్ పై నున్న తల్లీబిడ్డల్ని యాక్టివేట్ చేయించే పని.. కింద కన్సోల్ లో ఉన్న ‘నాసా’ టీమ్ ది. టీమ్ లో 12 మంది భారత సంతతి సైంటిస్టులుగా కాగా.. వారిలో 8 మంది మహిళలే! నాసా పంపిన ‘పెర్సీ’ రోవర్ ఈ నెల 18 న అంగారకుడిపై విజయవంతంగా ల్యాండ్ అయింది. అక్కడే ఏడాది పాటు ఉండి మానవ నివాస యోగ్యమైన వాతావరణ పరిస్థితులు అక్కడ ఉన్నదీ లేనిదీ పెర్సీ కనిపెట్టి చెబుతుంది. భూమికి, అంగారకుడికి మధ్య దూరం సుమారు 21 కోట్ల 80 లక్షల కిలోమీటర్లు. పెర్సీ అంతదూరం నిరంతరాయంగా ప్రయాణించి మార్స్ పైకి చేరడమే గొప్ప ‘భూవిశేషం’ అని చెప్పాలి! మానవ నిర్మితం కనుక. యూఎస్‌లోని ఫ్లోరిడా నుంచి ‘అట్లాస్’ అనే రాకెట్ ‘పెర్సీ’ రోవర్‌ని, పెర్సీకి తగిలించిన ‘ఇన్‌జెన్యూటీ’ హెలికాప్టర్ని భద్రంగా మోసుకెళ్లి పైన వదిలి పెట్టింది. ఇక తర్వాతిదంతా భూమి మీద ఫ్లారిడాలోని పెర్సీ ప్రాజెక్ట్ నాసా శాస్త్రవేత్తల పనే. పెర్సీని రాకెట్లో ఉంచి మార్స్ పైకి పంపిన ఈ బృందం చేతుల్లోనే.. పెర్సీ అక్కడ తన పని ప్రారంభించడానికి, కొనసాగించడానికి, పూర్తి చేయడానికి ఆదేశాలిచ్చే ముఖ్యమైన మీటలన్నీ ఉంటాయి. టీమ్ మొత్తంలో కనీసం 12 మంది భారత సంతతి శాస్త్రవేత్తలు ఉన్నారు. వారిలో 8 మంది మహిళలే. నేడు భారత్ ‘నేషనల్ సైన్స్ డే’ కనుక.. ఈ సందర్భంగా పెర్సీ ‘కన్సోల్’ రూమ్‌లో కూర్చొని ఉన్న మన సైంటిస్టులు ఎవరెవరు ఏయే కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారో తెలుసుకుందాం. మొదట బాబ్ బలరామ్ గురించైతే తప్పక చెప్పుకోవాలి. ఈ క్షణాన అంగారక గ్రహంలో రోవర్ పొదుగున చార్జ్ అవుతున్న ‘ఇన్‌జెన్యూటీ’ అనే ఆ హెలికాప్టర్ని కనిపెట్టింది ఆయనే. బాబ్ 1990 లలోనే ఇలాంటి మార్స్ హెలికాప్టర్ ఆలోచన చేశారు. అయితే అప్పటికి ఇంత టెక్నాలజీ లేదు. ‘అసాధ్యం’ అన్నారంతా. బాబ్ మెడ్రాస్ ఐ.ఐ.టి విద్యార్థి. నాసాలో అధ్యయనం చేస్తున్నారు. ఏడేళ్ల క్రితం మళ్లీ మార్స్ హెలికాప్టర్ టాపిక్ వచ్చింది. నాసా ‘జెట్ ప్రొపల్షన్ లేబరేటరీ’ (జె.పి.ఎల్) డైరెక్టర్ తన ప్రసంగంలో.. మార్స్‌పై ఎగిరే హెలికాప్టర్‌ను తయారు చేయలేమా? అనే ప్రశ్న సంధించినప్పుడు సమావేశంలో ఉన్న కొందరు అప్పటికి దశాబ్దం క్రితమే జరిగిన బాబ్ బలరామ్ ప్రయత్నాల గురించి చెప్పారు. వెంటనే ఆ డైరెక్టర్ నుంచి బాబ్‌కు పిలుపు వెళ్లింది. బాబ్, ఆయన బృందం ఎనిమిది వారాలు కష్టించి మార్స్ హెలికాప్టర్‌ను కనిపెట్టేందుకు పట్టే సమయం, అయ్యే ఖర్చుపై అంచనాలు వేసి ఇచ్చారు. ఆ క్రమంలో ఏడేళ్ల నిర్విరామ కృషితో తయారైనదే ఇప్పుడు మార్స్ పైన ఛార్జింగ్ అవుతూ ఉన్న ‘ఇన్‌జెన్యూటీ’ హెలికాప్టర్. అంటే నాసా తొలి మార్స్ హెలికాప్టర్ ఆలోచన కర్త, సృష్టికర్త మన భారతీయుడే. అందుకే ఈ ఏడాది నేషనల్ డే మనకు ప్రత్యేకమైనది. ఈ ప్రతిష్టాత్మకమైన ‘మార్స్ 2020 మిషన్’ లో బాబ్ బలరామ్‌తో పాటు మహిళా సైంటిస్టులు స్వాతి మోహన్, వందనా వర్మ, నాగిన్ కాక్స్, యోగితా షా, ఉషా గూడూరి, కవితా కౌర్, ప్రియాంక శ్రీవాత్సవ, శివాలీ రెడ్డి; మిగతా సైంటిస్టులు విష్ణుశ్రీధర్, సౌమ్యోదత్తా, నీల్ పటేల్ పాలు పంచుకున్నారు. పెర్సీ ప్రాజెక్టులో ప్రతిదీ కీలకమైన ప్రాజెక్టే అయినప్పటికీ.. ప్రధానమైన బాధ్యతలన్నిటినీ స్వాతీ మోహన్ నిర్వర్తిస్తున్నారు. రోవర్‌కి గైడెన్స్, నేవిగేషన్, కంట్రోల్ లీడ్ ఆమె విధులు. రోవర్‌ని కదిలించే బాధ్యత వందనా వర్మది. అంగారకుడిపై ఉన్న రోవర్ ప్రస్తుతం ‘వామింగ్ అప్’ మోడ్‌లో స్థిరంగా ఉంది. ఇకపై ఆమే రోవర్‌కి నడకలు నేర్పించాలి. నాగిన్ కాక్స్ డిప్యూటీ టీమ్ చీఫ్. ఆమె ఆధ్వర్యంలోనే పెర్సీ ఇంజినీరింగ్ ఆపరేషన్స్ అన్నీ జరుగుతాయి. నాగిన్ బెంగళూరు అమ్మాయి. గతంలో యు.ఎస్. ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్‌గా పని చేశారు. ఆమె పెరిగిందంతా మలేషియా, అమెరికాలలో. నాగిన్కు నాసా, నాసా వారి జె.పి.ఎల్.లో స్పేస్‌క్రాఫ్ట్ ఆపరేషన్స్ ఇంజినీర్ గా 20 ఏళ్ల అనుభవం ఉంది. ఇక యోగితా షా ఎలక్ట్రానిక్స్ ఇంజినీరు. కమ్యూనికేషన్, నేవిగేషన్లకు అవసరమైన ఎలక్ట్రానిక్స్ వ్యవస్థను పర్యవేక్షిస్తున్నారు. ఆమెది మహారాష్ట్రలోని ఔరంగాబాద్. జె.పి.ఎల్.లో ఫ్లయిట్ సిస్టమ్స్ ఇంజినీరుగా శిక్షణ పొందారు. ఉషా గూడూరి సాఫ్ట్వేర్ ఇంజినీరు. యాక్టివిటీ ప్లానింగ్, సబ్‌సిస్టమ్ సీక్వెన్సింగ్లకు సాఫ్ట్‌వేర్‌ను కనిపెట్టడం ఆమె వంతు. బిట్స్ పిలానీలో చదివారు. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో ఉషకు 18 ఏళ్ల అనుభవం ఉంది. ‘కాస్సినీ’ ప్రాజెక్టులోనూ కీలక పాత్ర పోషించారు. శనిగ్రహంపై పరిశోధనలకు నాసా రూపొందించిన నాలుగో ప్రాజెక్టే కాస్సినీ. అలాగే ‘డాన్’ అనే మరొక ఉపగ్రహ పరిశోధన ప్రాజక్టుకు కూడా. ఇక కవితా కౌర్ గ్రౌండ్ డేటా సిస్టమ్స్ నిపుణురాలు. ఆమెది చండీఘడ్. ప్రియాంక శ్రీవాత్సవ సిస్టమ్స్ ఇంజినీరు. లక్నో, పంజాబ్‌లలో చదువుకున్నారు. నాసా ఫ్లయిట్ మిషన్లలో పని చేశారు. ఇప్పుడీ మార్స్ మిషన్‌లో మోటార్ కంట్రోల్ అసెంబ్లీలో బాధ్యత ప్రియాంకదే. ఆమెకు సహాయంగా శివాలీ రెడ్డి ఉంటారు. వీరు కాక.. మిగిలిన ముగ్గురిలో విష్ణు శ్రీధర్ అంగారకుడిపై రాళ్లు, రప్పల్ని విశ్లేషిస్తారు. సౌమ్యోదత్తా రోవర్ కదలికల్ని స్టడీ చేస్తారు. నీల్ పటేల్ అంతరిక్ష పదార్థాలను సేకరించేందుకు రోవర్‌కి ఆటోమేటెడ్ సిస్టమ్‌ని అందజేస్తారు. శాస్త్ర సాంకేతిక రంగాలు మహిళలవి కావు అన్నట్లు ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు మహిళలు లేకుండా సైన్స్ ముందుకు సాగలేని పరిస్థితి! ప్రతిభకు, నైపుణ్యానికీ స్త్రీ, పురుష భేదం ఉండదని అనేక మిషన్లు నిరూపించాయి. ఇప్పుడీ మార్స్ 2020 మిషన్ కూడా. నేటి ‘నేషనల్ సైన్స్ డే’ని భారత్ సగర్వంగా జరుపుకోడానికి కారణమైన మన ‘అంగారక’ సైంటిస్టులకు, ముఖ్యంగా మహిళా సైంటిస్టులకు మనం కృతజ్ఞతలు తెలుపుకోవాలి. అలాగే అభినందనలు. -
పెర్సి ల్యాండింగ్ : అద్భుతం, తొలి ఆడియో
వాషింగ్టన్: మార్స్‌పై జరుగుతున్న పరిశోధనల క్రమంలో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. అంగారక గ్రహంపై ‘పర్సవరన్స్’ రోవర్ ల్యాండ్ అవుతున్న అద్భుత క్షణాలకు సంబంధించిన వీడియోను అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా విడుదల చేసింది. ‘‘రోవర్‌లోని మైక్రోఫోన్ మార్స్ నుండి వచ్చే శబ్దాలను ఆడియో రికార్డింగ్‌ను అందించింది. ఇలాంటి శబ్దాలను, వీడియోను సాధించడం ఇదే మొదటిసారి..ఇవి నిజంగా అద్భుతమైన వీడియోలు" అని జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ డైరెక్టర్ మైఖేల్ వాట్కిన్స్ ఆనందంగా ప్రకటించారు. ఫిబ్రవరి 18న ఈ ల్యాండింగ్‌ను రికార్డు చేసేందుకు 7 కెమెరాలను ఆన్ చేశామని, రోవర్లో రెండు మైక్రోఫోన్లు, 25 కెమెరాలు ఉన్నాయన్నారు. భవిష్యత్తులో మరిన్ని వీడియోలు, ఫొటోలు విడుదల చేస్తామని నాసా సైన్స్ అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్ థామస్ జుర్బుచెన్ వెల్లడించారు. (పెర్సి సక్సెస్.. మార్స్ ఫోటోలు షేర్ చేసిన నాసా) పర్సవరన్స్ రోవర్ శుక్రవారం అరుణగ్రహంపై ల్యాండ్ అయినసంగతి తెలిసిందే. ఇది రెడ్ ప్లానెట్‌లో ప్రవేశించిన, డీసెంట్ అండ్ ల్యాండింగ్ (ఇడీఎల్) చివరి నిమిషాల్లో ప్రధాన మైలురాళ్లను రికార్డు చేసింది. రోవర్ ల్యాండ్ కావడానికి ముందు పారాచూట్ విచ్చుకోవడంతో పాటు, అది కిందకి దిగుతున్న సమయంలో మూడు నిమిషాల 25 సెకన్ల పాటు కొనసాగే హై-డెఫినిషన్ వీడియో క్లిప్‌ను సాధించాం ఈ సందర్భంగా మార్స్ ఉపరితలం కూడా వీడియోలో కనిపించింది. గ్రహానికి దగ్గరవుతున్న కొద్దీ మరింత స్పష్టంగా కనిపించింది. అక్కడి నేలంతా ఎర్రగా ఉంది. రోవర్ అరుణగ్రహంపై దిగుతున్న సమయంలో లేచిన ధూళి మేఘం, పారాచూట్ సాయంతో వ్యోమనౌక నుంచి కిందకి దిగడం స్పష్టంగా కనిపించిందని నాసా ఇంజనీర్లు ప్రకటించారు. Your front-row seat to my Mars landing is here. Watch how we did it.#CountdownToMars pic.twitter.com/Avv13dSVmQ — NASA's Perseverance Mars Rover (@NASAPersevere) February 22, 2021 Now that you’ve seen Mars, hear it. Grab some headphones and listen to the first sounds captured by one of my microphones. 🎧https://t.co/JswvAWC2IP#CountdownToMars — NASA's Perseverance Mars Rover (@NASAPersevere) February 22, 2021 -
పెర్సి సక్సెస్.. మార్స్ ఫోటోలు షేర్ చేసిన నాసా
వాషింగ్టన్: అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా అరుదైన రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. అరుణ గ్రహంపై జీవం ఆనవాళ్లను గుర్తించేందుకు ఉద్దేశించిన ‘పర్సవరన్స్’ రోవర్ గురువారం తెల్లవారుజామున విజయవంతంగా ల్యాండ్ అయ్యింది. 2020, జూలైలో ప్రారంభమైన ఈ సుదీర్ఘయాత్ర విజయవంతం కావడం అంతరిక్ష శాస్త్రవేత్తలకు శుభవార్తే. ఈ క్రమంలో శుక్రవారం నాసా.. రోవర్ ‘పర్సవరన్స్’ పంపంచిన అరుదైన ఫోటోలను షేర్ చేసింది. వీటిలో రోవర్ కేబుల్స్ సాయంతో అరుణ గ్రహంపై ల్యాండ్ అయిన ఫోటో కూడా ఉంది. ల్యాండ్ అయ్యే సమయానికి ఆరు ఇంజన్లు ఉన్న ఈ రోవర్ తన వేగాన్ని గంటకు 1.7 మైళ్లకు తగ్గించుకుని అరుణగ్రహంపై ల్యాండ్ అయినట్లు నాసా వెల్లడించింది. రోవర్ అరుణగ్రహం ఉపరితలం మీద ల్యాండ్ అయినప్పుడు అక్కడ దుమ్ము లేవడం వీటిల్లో కనిపిస్తుంది అని రోవర్ చీఫ్ ఇంజనీర్ తెలిపారు. ఫోటో కర్టెసీ: నాసా ‘‘రోవర్ తన మొట్టమొదటి హై-రిజల్యూషన్, కలర్ ఫోటోను అప్లోడ్ చేయగలిగింది. ఇది జెజెరో క్రేటర్‌లో అడుగుపెట్టిన చదునైన ప్రాంతాన్ని చూపిస్తుంది. ఇక్కడ బిలియన్ల సంవత్సరాల క్రితం ఒక నది, లోతైన సరస్సు ఉనికిలో ఉన్నాయనే ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక రెండవ కలర్ ఫోటోలో రోవర్ ఆరు చక్రాలలో ఒకటి కనిపిస్తుంది. దాని పక్కనే అనేక రాళ్ళు ఉన్నాయి. ఇవి 3.6 బిలియన్ సంవత్సరాల కన్నా పురాతనమైనవిగా భావిస్తున్నాం’’ అంటూ నాసా ట్వీట్ చేసింది. ఫోటో కర్టెసీ: నాసా ‘‘ఈ రాళ్ళు అగ్నిపర్వత లేదా అవక్షేప మూలాన్ని సూచిస్తాయా అనేది తేలాల్సింది. రోవర్ భూమి మీదకు వచ్చినప్పుడు తనతో పాటు తీసుకువచ్చే ఈ రాళ్లను పరీక్షించి అవి ఏ కాలానికి చెందినవి.. ఏ రకానికి చెందినవి అనేది తేలుస్తాం’’ అన్నారు. పర్సవరన్స్ గురువారం నాడు కొన్ని ఫోటోలను పంపింది. అవి బ్లాక్ అండ్ వైట్‌లో ఉన్నాయి. అంత క్లారిటీగా లేవు. ఇప్పుడు వచ్చిన ఫోటోలు చాలా బాగా ఉన్నట్లు నాసా వెల్లడించింది. The moment that my team dreamed of for years, now a reality. Dare mighty things. #CountdownToMars pic.twitter.com/8SgV53S9KG — NASA's Perseverance Mars Rover (@NASAPersevere) February 19, 2021 చదవండి: మార్స్ పైకి ‘పెర్సీ’ నాసా ప్రయోగం; ఎవరీ స్వాతి మోహన్..? -
'నాసా' అనుకున్నది సాధించింది..
మొత్తానికి అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా అనుకున్నది సాధించింది. ఆ సంస్థ పంపిన రోవర్ ‘పర్సవరన్స్’ అరుణగ్రహంపై సరిగ్గా అనుకున్నచోట, అనుకున్న సమయానికి దిగింది. నిరుడు జూలైలో ప్రారంభమైన సుదీర్ఘ యాత్ర ఇలా సుఖాంతం కావటం అంతరిక్ష శాస్త్రవేత్తలకు మాత్రమే కాదు... ఆ రంగంపై ఆసక్తిగల ప్రపంచ పౌరులందరికీ శుభవార్తే. వివిధ దశలుగా పదేళ్లపాటు కొనసాగే మరికొన్ని ప్రయోగాల పరంపర కూడా అనుకున్నట్టుగా పూర్త యితే... అక్కడ సేకరించిన మట్టి నమూనాలు జయప్రదంగా వెనక్కి తీసుకురాగలిగితే అరుణ గ్రహంతోపాటు మొత్తంగా సౌర కుటుంబ నిర్మాణంపై ఇప్పటివరకూ మనకుండే అవగాహన మరిన్ని రెట్లు విస్తరిస్తుంది. మన భూగోళం పుట్టుక గురించి మనకుండే జ్ఞానం సైతం మరింత పదునెక్కుతుంది. చీకటి ఆకాశంలోకి మనం తలెత్తి చూసినప్పుడు తళుకు బెళుకులతో సంభ్ర మాశ్చర్యాల్లో ముంచెత్తే అనేకానేక తారల్లో అంగారకుడిది విశిష్టమైన స్థానం. అది మిగిలిన గ్రహాలకన్నా అధికంగా మెరుస్తూంటుంది. అందుకే అరుణగ్రహం చుట్టూ ఊహలు ఊరేగాయి. దాన్ని ఇతివృత్తంగా తీసుకుని ఎన్నో సైన్స్ ఫిక్షన్ కథలు, నవలలు వచ్చాయి. అంగారకుడిపై వచ్చిన చలనచిత్రాలకూ, టెలివిజన్ ధారావాహికలకూ లెక్కేలేదు. ఈ సౌర కుటుంబంలో కేవలం అరుణ గ్రహంపై మాత్రమే జీవరాశికి అనువైన పరిస్థితులుండేవని, ఏకారణంచేతనో అవి తారుమార య్యాయని శాస్త్రవేత్తల విశ్వాసం. ఒకప్పుడు పుష్కలంగా నీటితో అలరారిన ఆ గ్రహంపై ఇప్పుడు అందుకు సంబం ధించిన ఆనవాళ్లే మిగిలాయి. లోగడ అక్కడ దిగిన రోవర్లు నదీజలాలు పారినట్టు కనబడిన ఆనవాళ్లను పంపాయి. గ్రహం లోలోపలి పొరల్లో ఇంకా ఎంతో కొంత నీటి జాడ వుండొచ్చునని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇప్పుడు ‘పర్సవరన్స్’ను కూడా సరిగ్గా అలాంటి ప్రాంతాన్ని చూసుకునే దించారు. 350 కోట్ల సంవత్సరాలక్రితం అతి పెద్ద సరస్సు వున్నదని భావించే బిలం అంచుల్లో అది సురక్షితంగా దిగటం శాస్త్రవేత్తల ఘనవిజయమని చెప్పాలి. ఆ దిగే ప్రాంతానికి శాస్త్రవేత్తలు బోస్నియా–హెర్జెగోవినాలోని ఒక పట్టణం పేరైన ‘జెజిరో’గా నామకరణం చేశారు. సరస్సు అని దానర్థం. ఒక పెద్ద స్నానాలతొట్టె ఆకారంలో వున్న ఆ ప్రాంతంలోని రాళ్లలో రహ స్యాలెన్నో దాగివున్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వాటి రసాయన నిర్మాణాన్ని ఛేదిస్తే కోట్లాది సంవత్సరాలక్రితం ఆ సరస్సు ఎలాంటి పరిస్థితుల్లో అంత రించిపోయిందో అంచనా వేయటానికి ఆస్కారం వుంటుందంటున్నారు. ఈ భూగోళంపై కూడా మనిషితో సహా అన్ని జీవులూ నదీ తీరాలను ఆశ్రయించుకుని వుండేవి. అక్కడే తొలి నాగరికతలు వర్థిల్లాయి. అంగారకుడిపై సైతం అదే జరిగివుండాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అరుణగ్రహంపైకి యాత్ర అత్యంత సంక్లిష్టమైనది. దానిపైకి ఇంతవరకూ పంపిన అంతరిక్ష నౌకల్లో 50 శాతం విఫలమయ్యాయి. అందుకే నాసా శాస్త్రవేత్తలు ఈ ఏడు నెలలూ ఊపిరి బిగపట్టి పర్సవరన్స్ గమనాన్ని 24 గంటలూ నిశితంగా పరిశీలిస్తూ వచ్చారు. ఎప్పటికప్పుడు అవసరమైన సందేశాలు పంపుతూ అది సజావుగా చేరేలా చర్యలు తీసుకున్నారు. ఇంతవరకూ వివిధ దేశాలు పంపిన రోవర్‌లకన్నా పర్సవరన్స్ చాలా పెద్దది. ఒక కారు సైజున్న ఈ రోవర్‌కు ఒక మినీ హెలికాప్టర్ అమర్చారు. అక్కడి మట్టి నమూనాలను సేకరించడానికి, వాటిని విశ్లేషించి ఎప్పటికప్పుడు సమాచారం నాసాకు చేరేయడానికి అందులో అత్యంతాధునికమైన ఏడు రకాల ఉపకరణాలున్నాయి. ఛాయాచిత్రాలు తీసేందుకు జూమ్ చేయడానికి వీలుండే ఇరవై 3డీ కెమెరాలు, ఆ రోవర్‌ను తాకుతూ వీచే గాలుల ధ్వనిని, మట్టిని సేకరించటానికి రాళ్లను తొలి చినప్పుడు వెలువడే శబ్దాలను రికార్డు చేసేందుకు మైక్రో ఫోన్లు, ఇతర సెన్సర్లు కూడా అమర్చారు. అలాగే అది సేకరించిన నమూనాలను నిక్షిప్తం చేయటానికి చిన్న సైజులోవుండే 43 కంటెయినర్లున్నాయి. అందుకే రోవర్ అనటం దీన్ని ఒక రకంగా చిన్నబుచ్చటమే. ఇది ఏకకాలంలో భిన్నమైన పనులు చేయగల బుద్ధి కుశలతను సొంతం చేసుకున్న ఒక అద్భుత వాహనం. ప్రాజెక్టులో పనిచేసే ఇంజనీర్లు, సైంటిస్టులూ పర్సవరన్స్కి అమర్చిన ఉపకరణాలు, దాని వ్యవస్థలూ నిరంతరం రెప్పవాల్చకుండా పర్యవేక్షిస్తుంటారు. ఒకటి రెండు నెలలు గడిచాక రోవర్‌కి అమర్చిన హెలికాప్టర్‌ను విడివడేలా చేస్తారు. అన్నీ సక్రమంగా పనిచేసి రోవర్ నిర్దేశించిన కర్తవ్యాలను పూర్తి చేస్తే అది ఇంతవరకూ మానవాళి సాధించిన విజయాల్లోకెల్లా తలమానికమైనది అవుతుంది. అగ్ని పర్వతాలు బద్దలై లావాలు ప్రవహించిన కారణంగానో, ఒక భారీ గ్రహ శకలం పెను వేగంతో ఢీకొన్న కారణంగానో ఒకప్పుడు నీళ్లు సమృద్ధిగా పారిన అరుణగ్రహం గడ్డ కట్టుకు పోయింది. దాని ఉల్కలు ఇక్కడికి చేరకపోలేదు. కానీ ఇప్పుడు తాను సేకరించే నమూనాలను పర్సవరన్స్ వేర్వేరు కంటెయినర్లలో సీల్ చేస్తుంది. వాటిని నిర్దిష్టమైన ప్రాంతంలో వుంచితే భవి ష్యత్తులో జరిపే అంతరిక్ష ప్రయోగాల ద్వారా వాటిని భూమ్మీదకు తీసుకొస్తారు. ఎంతో ఓర్పుతో, పట్టుదలతో జరగాల్సిన ఈ సుదీర్ఘ ప్రక్రియకు ఇంగ్లిష్‌లో దానికి సమానార్థకమైన పర్సవరన్స్ అని పేరు పెట్టడం సబబైనదే. ఆ పేరుకు తగినట్టే అది మన శాస్త్ర విజ్ఞానంపై కొత్త వెలుగులు ప్రస రించటానికి దోహదపడుతుందని ఆశిద్దాం. -
తొలి అంతరిక్ష హెలికాప్టర్ ‘ఇంజెన్యూటీ’
వాషింగ్టన్: అరుణగ్రహంపైకి తాము పంపించే తొలి హెలికాప్టర్‌కు భారత సంతతికి చెందిన పదిహేడేళ్ళ బాలిక వనీజా రూపానీ సూచించిన పేరును అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ సెలక్ట్చేసింది. ఈ హెలికాప్టర్ అంతరిక్ష నౌక తో పాటు ప్రయాణం చేస్తుంది అని నాసా ట్వీట్ చేసింది. అంతరిక్ష నౌక పర్సెవరెన్స్, ఇంజెన్యూటీలను జూలైలో నాసా అంతరిక్షంలోకి పంపనుంది. చిన్నప్పటినుంచి రూపానీకి అంతరిక్ష శాస్త్రం పై ప్రత్యేక ఆసక్తి ఉండేదని ఆమె తల్లి నౌషీన్ రూపానీ చెప్పారు. -
బెల్జియం ఈసారైనా?
పారిస్: 117 ఏళ్ల చరిత్ర కలిగిన డేవిస్ కప్ పురుషుల టీమ్ టెన్నిస్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచేందుకు బెల్జియం జట్టుకు మరో అవకాశం లభించింది. గతంలో రెండుసార్లు (2015లో, 1904లో) ఫైనల్‌కు చేరి రన్నరప్‌తో సరిపెట్టుకున్న బెల్జియం మూడో ప్రయత్నంలోనైనా డేవిస్‌కప్ టైటిల్‌ను సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో శుక్రవారం మొదలయ్యే డేవిస్ కప్ ఫైనల్లో తొమ్మిదిసార్లు చాంపియన్ ఫ్రాన్స్‌తో బెల్జియం జట్టు తలపడుతుంది. డేవిస్ కప్ ముఖాముఖి పోరులో ఫ్రాన్స్ 4–3తో బెల్జియంపై ఆధిక్యంలో ఉంది. బెల్జియం ఆశలన్నీ ప్రపంచ ఏడో ర్యాంకర్ డేవిడ్ గాఫిన్‌పై ఉండగా... ఫ్రాన్స్ భారమంతా ప్రపంచ 15వ ర్యాంకర్ జో విల్ఫ్రైడ్ సోంగాపై ఉంది. శుక్రవారం జరిగే రెండు సింగిల్స్ మ్యాచ్‌ల్లో లుకాస్ పుయి (ఫ్రాన్స్)తో గాఫిన్... సోంగా (ఫ్రాన్స్)తో స్టీవ్ డార్సిస్ తలపడతారు. -
ఉన్నతంగా ఎదిగే శక్తి మీలో ఉందా?
సెల్ఫ్ చెక్ వివిధ రకాల వృత్తులలో ఉన్నవారు వారి ప్రత్యేకత నిలుపుకోవటానికి ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తుంటారు. అనుకున్నది సాధించేవరకు పోరాడుతూనే ఉంటారు. ఉన్నతంగా ఎదగటానికి అవసరమైన శక్తియుక్తులు మీలో ఉన్నాయోలేవో తెలుసుకోండి. 1. ప్రస్తుతం మీరు సాధించినదానికన్నా ఉన్నతంగా ఎదగాలని పట్టుదలగా ఉన్నారు. ఎ. కాదు బి. అవును 2. ఇతరుల విజయాన్ని చూసి స్ఫూర్తి పొందుతారు. ఎ. కాదు బి. అవును 3. అన్ని విషయాల్లో ఇతరులకన్నా ప్రత్యేకంగా కనిపించే ప్రయత్నం ఎప్పుడూ చేస్తారు. ఎ. కాదు బి. అవును 4. ఏపనినైనా ఏకాగ్రతతో చేస్తారు. ఎ. కాదు బి. అవును 5. సాధించినవాటి పట్ల తేలికగా సంతృప్తి చెందరు. ఎ. అవును బి. కాదు 6. మిమ్మల్ని వ్యతిరేకించేవారిపై ద్వేషభావాన్ని పెంచుకోరు. ఎ. కాదు బి. అవును 7. లక్ష్యాలు సాధించేందుకు నిత్యం శ్రమిస్తుంటారు. ఎ. కాదు బి. అవును 8. అవకాశాలను ఏమాత్రం వదులుకోరు. ఎ. కాదు బి. అవును 9. కొత్తవిషయాలు నేర్చుకోటానికి ముందుంటారు. ఎ. కాదు బి. అవును 10. సందర్భానుసారం ప్రవర్తిస్తారు. ప్రతి విషయంలో మెచ్యూరిటీ కనిపిస్తుంది. ఎ. కాదు బి. అవును ‘బి’ లు ఏడు దాటితే కెరియర్లో దూసుకుపోవటానికి అవసరమైన శక్తిసామర్థ్యాలు మీలో ఉన్నట్లే. ‘ఎ’ లు ‘బి’ ల కంటే ఎక్కువగా వస్తే జీవితంలో పైకి రావటానికి మీరింకా కృషి చేయాలని అర్థం. -
శ్రమ, పట్టుదల ఉంటే ఉన్నత శిఖరాలకు
హైకోర్టు రిటైర్డ్ జడ్జి బి.చంద్రకుమార్ జనగామ : విద్యార్థులు తమ లక్ష్యాలను అధిగమించేందుకు శ్రమ, పట్టుదలతో కృషి చేయాలని హైకోర్టు రిటైర్డ్ జడ్జి బి.చంద్రకుమార్ అన్నారు. పట్టణంలోని సాహితీ కళాశాల విద్యార్థుల ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించినప్రేషర్స్ డే వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కళాశాల ప్రిన్సిపాల్ కరై కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమాన్ని చంద్రకుమార్ ప్రారంభించారు. కష్టపడితే ఉన్నత శిఖరాలకు ఎలా వెళ్లాలో తనను ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు. ప్రభుత్వాల నుంచి దేశంలో పారిశ్రామికవేత్తలు తీసుకున్న వేల కోట్ల రూపాయల రుణాలను రాబట్టుకోగలితే కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా విద్యను అందించవచ్చన్నారు. కానీ, ప్రభుత్వాల అసమర్థత కారణంతో పారిశ్రామిక వేత్తలు వేల కోట్ల రూపాయల రుణాలను చెల్లించడం లేదన్నారు. జీవితంలో ఎంత ఎత్తు ఎదిగినా కన్న తల్లిదండ్రులు, విద్యాబుద్దులు నేర్పిన గురువులను మరిచిపోవద్దని సూచించారు. అంతకుముందు విద్యార్థులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. అనంతరం చంద్రకుమార్‌ను కళాశాల యాజమాన్యం ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో డైరెక్టర్లు ఆకుల నర్సింహులు, అధ్యాపకులు ఉపేందర్, రత్నాకర్, భాస్కర్, సతీష్, మహేష్, రాజు, భాస్కర్, రాంబాబు, రామచంద్రం, రాజకొంమురయ్య, దివ్య, చైతన్య, శ్వేత, శ్రీకాంత్ ఉన్నారు. 12జెజిఎన్05 : చంద్రకుమార్‌ను సత్కరిస్తున్న యాజమాన్యం -
గిరిజన యువతి పట్టుదలముందు తలవంచిన పేదరికం
రామాయంపేట: ఆమె పట్టుదల, లక్ష్యంముందు పేదరికం తలవంచింది. తమ కుటుంబం తరతరాలుగా వ్యవసాయానికే పరిమితంకాగా, ఎలాగైనా తాను అందరిలా కాకుండా జీవితంలో ఉన్నత స్థానానికి ఎదిగి ఇతరులకు ఆదర్శంగా ఉండాలని కలలుగంది. వివాహామైనా ఆమె చదువుకు ఎలాంటి ఆటంకంలేకుండా భర్త ప్రోత్సాహంతో ముందుకుసాగి అనుకున్నది సాధించింది. వివరాల్లోకి వెలితే... రామాయంపేట గిరిజన తండాకు చెందిన లంబాడి మంగ్యా, పద్మ దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు, ఇద్దరు కుమారులు. వారి పెద్ద కూతురు మీనా చదువులో ముందుంజలో ఉండగా, ఆమె ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు ప్రోత్సహించారు. వారి ఆశలను అడియాశలు చేయకుండా పట్టుదలతో చదివి ఇంటర్లో 917 మార్కులు సాధించి గుర్తింపు పొందింది. ఎంసెట్‌లో మంచి ర్యాంకు సాధించిన మీనాను ఆమె తల్లిదండ్రులు ఇంజనీరింగ్‌లో చేర్పించారు. ఇంజనీరింగ్ చదువుతున్న క్రమంలోనే మీనాకు మండలంలోని జడ్చెరువు తండాకు చెందిన రామావత్ రవినాయక్‌తో వివాహాం జరిగింది. దీనితో ఆమెకు మరింతగా భర్త ప్రోత్సాహాం లభించింది. దీనితో ఇంజనీరింగ్ విద్య పూర్తి చేసుకున్న మీనా ఉద్యోగం నిమిత్తం హైదరాబాద్ వెళ్లి ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంది. ప్రభుత్వ కొలువే లక్ష్యంగా ఆమె రాత్రింబవళ్లు కష్టపడి చదివి గ్రామీణ నీటి సరఫరా విభాగం( ఆర్డబ్ల్యూఎస్)లో ఏఈఈగా ఉద్యోగం సాదించింది. ఆమె మొదటి పోస్టు నిజామాబాద్ జిల్లా దోమకొండ మండల కేంద్రంలో ఏఈఈగా విధుల్లో చేరింది. భర్త ప్రోత్సాహాంతోనే... -మీనా... నాభర్త రవి ప్రోత్సాహాంతోనే ఉద్యోగం సాధించాను. పెళ్లయితే చదువుకు పులిస్టాప్ పడుతుందని చాలామంది అమ్మాయిలు బావిస్తుంటారు... ఇందుకు విరుద్దంగా రవి మాత్రం తన వెనుక ఉండి ప్రోత్సహించారు. తండాలో ఇతర విద్యార్థినులు చదువులో ముందుండేలా వారిని పోత్సహించడంతోపాటువారికి సలాహాలు, సూచనలు అందజేస్తాను... -
బీపీవో ఇంటర్వ్యూ.. టాప్ కొశ్చన్స్
బీపీవో ఇంటర్వ్యూలు అనేక రౌండ్లతో సుదీర్ఘంగా ఉంటాయి. వీటిలో విజయం సాధించాలంటే పట్టుదల, సమయస్ఫూర్తి ఉండాల్సిందే. ఔత్సాహికులకు ఉపయోగపడేలా బీపీవో ఇంటర్వ్యూల్లో తరచూ ఎదురయ్యే ప్రశ్నలు, వాటికి తగిన సమాధానాలు... 1. మీ గురించి చెప్పండి? ఇంటర్వ్యూయర్లకు అత్యంత ఇష్టమైన ప్రశ్న. దీనికి మీ సమాధానం అంతే ఆహ్లాదంగా, ఆకట్టుకునేలా ఉండాలి. 2. బీపీవో అంటే ఏమిటి? అదెలా పనిచేస్తుంది? బీపీవో అంటే.. బిజినెస్ ప్రాసెస్ ఔట్సోర్సింగ్. ఇవి ఇతర కంపెనీల నాన్‌కోర్ కార్యకలాపాలకు సంబంధించి ఔట్సోర్సింగ్ సేవలందిస్తాయి. 3. రాత్రి వేళల్లో పనిచేయగలరా? అభ్యంతరం లేదని చెప్పండి. ఎలాంటి సమయంలోనైనా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొనండి. 4. ఆఫ్‌షోర్ అవుట్సోర్సింగ్ అంటే ఏమిటి? సుదూర దేశాల కంపెనీలకు ఔట్సోర్సింగ్ సేవలను అందించే వాటిని ఆఫ్‌షోర్ కంపెనీలు అంటారు. చుట్టుపక్కల దేశాల కంపెనీలకు ఔట్సోర్సింగ్ సేవలను అందించేవి షోర్ సోర్సింగ్ కంపెనీలు. 5. ఇన్బాండ్, అవుట్ బాండ్ కాల్‌సెంటర్ల మధ్య వ్యత్యాసం ఏమిటి? సేవలకు సంబంధించి కాల్స్‌ను మాత్రమే అందుకునేవి ఇన్ బాండ్ కాల్ సెంటర్లు. సేవలకు సంబంధించి వినియోగదారులకు కాల్స్ చేసే కంపెనీలను అవుట్ బాండ్ కాల్ సెంటర్లు అంటారు. 6. బీపీవోలనే మీ కెరీర్‌గా ఎందుకు ఎంచుకున్నారు? కెపీవో అంటే..నాలెడ్జ్ ప్రాసెస్ ఔట్సోర్సింగ్. ఇవి డాక్యుమెంటేషన్, బిల్లింగ్, ఇన్సూరెన్స్లకు సంబంధించిన సేవలను అందిస్తే బీపీవోలు కస్టమర్ కేర్ ఆధారిత సేవలను అందిస్తాయి. 7. కేపీవో, బీపీవో మధ్య వ్యత్యాసం ఏమిటి? కెపీవో అంటే.. నాలెడ్జ్ ప్రాసెస్ ఔట్సోర్సింగ్. ఇవి డాక్యుమెంటేషన్, బిల్లింగ్, ఇన్సూరెన్స్లకు సంబంధించిన సేవలను అందిస్తే బీపీవోలు కస్టమర్ కేర్ ఆధారిత సేవలను అందిస్తాయి. 8. కంపెనీలకు ఔట్సోర్సింగ్ అవసరం ఏమిటి? బీపీవోలకు నాన్ కోర్ సర్వీసెస్‌ను ఔట్‌సోర్సింగ్‌కు ఇవ్వడం ద్వారా కంపెనీలకు డబ్బు ఆదా అవడంతో పాటు నాణ్యతతో కూడిన సేవలు అందుతాయి. 9. వినియోగదారులతో చక్కగా మాట్లాడగలరా? మాట్లాడగలను అని చె ప్పండి. మాక్ కాల్ వస్తేఆకట్టుకునేలా ఆన్సర్ చేయడానికి సిద్ధంగా ఉండండి. 10. 5 ఏళ్ల తర్వాత మీ భవిష్యత్ ఎలా ఉండాలనుకుంటున్నారు? కంపెనీకి ‘నా సేవలు ఏ స్థాయిలో అయితే గరిష్టంగా ఉపయోగపడతాయో అక్కడికి చేరుకోవాలనుంది’ అని చెప్పండి. -
అవకాశం రావాలే గానీ...ఆడవాళ్లూ సాధించగలరు!
జీవితం ఎప్పుడూ ఒకలానే ఉండదు. ఊహించని ఎదురు దెబ్బలు తగులుతాయి. ఎత్తూపల్లాలు ఎదురై ఇబ్బంది పెడతాయి. వాటిని తట్టుకుంటూ, అధిగమించుకుంటూ వెళ్లినవాళ్లే విజయ శిఖరాలను అందుకోగలరు. అందుకు అసలు సిసలు ఉదాహరణ... ఉమా అమర్నాథ్. ఒకప్పుడు సాధారణ గృహిణి అయిన ఆవిడ... ఇవాళ ఓ పెద్ద సంస్థను విజయవంతంగా నడపగలుగుతున్నారంటే అందుకు ఆమె పట్టుదల, శ్రమించే తత్వమే కారణం. టీఎంసీ సారథిగా తన పయనం గురించి ఉమా అమర్నాథ్ సాక్షితో జరిపిన సంభాషణ ఇది... దీపావళి అంటే వ్యాపారస్తులకు, కస్టమర్లకూ కూడా పండుగే. ఈ యేడు దీపావళి ఎలా ఉండబోతోంది? ఎప్పటిలాగే ఈసారి కూడా మా కస్టమర్లకు మేం మంచి మంచి ఆఫర్లు ఇస్తున్నాం. వెయ్యి రూపాయల కొనుగోళ్లు చేసిన వాళ్లందరికీ కూపన్లు ఇస్తాం. దీపావళికి తీసే డ్రాలో పాతిక లక్షల నగదు బహుమతిని గెలుచుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాం. అలాగే బంపర్ డ్రా విజేతకు 45 లక్షల విలువ గల డ్యూప్లెక్స్ విల్లాను ఇటాలియన్ ఫర్నిచర్‌తో సహా ఇవ్వబోతున్నాం. 250 కోట్ల టర్నోవర్ ఉన్న టీఎంసీ సంస్థకి సీఎండీ స్థానంలో ఉండటమంటే మాటలు కాదు. ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని ఎలా నడిపిస్తున్నారు? ఈ సామ్రాజ్యాన్ని నా భర్త అమర్నాథ్ సృష్టించారు. ఆయన ఎంత మంచి వ్యాపారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చిన్న వయసు నుంచీ పట్టుదలతో, స్వయంకృషితో ఎదిగిన వ్యక్తి ఆయన. టీఎంసీ ఆయన కలల పుత్రిక. నిద్రలో కూడా టీఎంసీ అనే కలవరించేవారు. రాత్రీపగలూ దీని అభివృద్ధి కోసం పాటు పడ్డారు. ఈ స్థాయికి తీసుకొచ్చారు. ఆయన లేరు. ఆయన కలల్ని నెరవేర్చాల్సిన బాధ్యత నా మీద ఉంది. అదే నన్ను నడిపిస్తోంది. ఆయన మీకు దూరమైన ఆ దురదృష్టకర సంఘటన గురించి...? అది 2011, డిసెంబర్ 4. ఆ రోజు ఉదయం మామూలుగానే లేచారు. ఒక ఫంక్షన్ ఉంటే దాని ఏర్పాట్ల గురించి ఫోన్లలో మాట్లాడుతున్నారు. అంతలో ఛాతిలో నొప్పి అన్నారు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించాం. కానీ ఆరోజు ఆదివారం కావడంతో స్పెషలిస్టులెవరూ అందుబాటులో లేరు. వాళ్లు వచ్చేసరికి ఆలస్యమైపోయింది. నా కళ్లముందే ఆయన ఊపిరి ఆగిపోయింది. ఒక్కసారిగా అంతా శూన్యమై పోయినట్టుగా అనిపించింది. ఆయన లేరన్న నిజాన్ని జీర్ణించుకోవడానికి చాలా సమయమే పట్టింది. ఎప్పుడూ హుషారుగా, చలాకీగా ఉండే ఆయన అంత త్వరగా (44 యేళ్లు) వెళ్లిపోతారని ఊహించలేదు! టీఎంసీ బాధ్యతలు చేపట్టాలన్నది మీ నిర్ణయమేనా? ఎవరైనా అటు నడిపించారా? పిల్లలు చిన్నవాళ్లు. బాధ్యత తీసుకోవడానికి ఎవరూ లేరు. దాంతో ఆయన పోయిన పదిహేను రోజులకే నేను ఆయన స్థానంలోకి వెళ్లక తప్పలేదు. ఉన్నట్టుండి అంత పెద్ద బాధ్యత... భయం వేయలేదా? చాలా భయపడ్డాను. నిజానికి నేను వ్యాపారస్తుల కుటుంబం నుంచే వచ్చాను. ఓ వ్యాపారికే భార్యనయ్యాను. కానీ వ్యాపారం గురించి నాకేమీ తెలియదు. కేవలం డిగ్రీ చదివిన నేను, ఓ కంపెనీని నడపాల్సి వస్తుందని ఎన్నడూ ఊహించలేదు. దాంతో ఉక్కిరిబిక్కిరి అయిపోయాను. దేవుడి దయవల్ల ముందు నుంచీ మా దగ్గర మంచి స్టాఫ్ ఉన్నారు. వాళ్లంతా అండగా నిలబడ్డారు. వ్యాపార రంగం అనేది నేటికీ పురుషుల ప్రపంచమే. ఓ మహిళగా ఇక్కడ మీరెలా మనగలుగుతున్నారు? కొంతమంది అంటుంటారు... ఆడవాళ్లు ఏం చేయగలరు అని! అవకాశం రావాలేగానీ ఆడవాళ్లు కూడా అన్నీ సాధించగలరు. మావారు ఉన్నప్పుడు నేను దీపావళికి పూజ చేయడానికి మాత్రమే ఆఫీసుకు వచ్చేదాన్ని తప్ప, ఆఫీసులో ఏం జరుగుతుందో పట్టించుకునేదాన్నే కాదు. కానీ ఏం జరిగింది? ఇల్లు విడిచి ఓ కొత్త ప్రపంచంలోకి రావాల్సి వచ్చింది. ఇంతమందిని డీల్ చేయాల్సి వచ్చింది. వెనకడుగు వేసివుంటే ఈరోజు పరిస్థితి ఎలా ఉండేది? మా కంపెనీ ఏమయ్యేది?! మీ పిల్లల గురించి చెప్పండి...? బాబు పన్నెండో తరగతి చదువుతున్నాడు. పాప ఈ మధ్యనే లండన్‌లో డిగ్రీ పూర్తి చేసి వచ్చింది. ఓ రెండేళ్లు ఇక్కడే పని చేసి, మాస్టర్స్ కోసం మళ్లీ విదేశాలకు వెళ్లిపోతుంది. ఓ పక్క పిల్లలు... మరోపక్క కంపెనీ... లైఫ్‌ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? ఆయన హఠాత్తుగా దూరమైనప్పుడు నేను పిల్లల గురించి కంటే కంపెనీ గురించే ఎక్కువ ఆలోచించాను. కంపెనీని పైకి తీసుకెళ్లడం తర్వాత, ముందు పడిపోకుండా నిలబెట్టాలనుకున్నాను. అదృష్టం కొద్దీ పిల్లలు కూడా నా తపనను అర్థం చేసుకున్నారు. అంతేకాదు, నాకు ధైర్యం చెప్తూ ఉంటారు. మా పాప అంటుంది... ‘‘మమ్మీ... డాడీ మనకు అన్నీ ఇచ్చి వెళ్లారు. అందుకే మనం ఇవాళ ఇలా అయినా ఉన్నాం. డాడీ అనుకున్నవన్నీ మనం చేయాలి. కంపెనీని నిలబెట్టాలి’’ అని! ఇంత మంచి పిల్లలున్నందుకు గర్వంగా ఉంటుంది నాకు! అమర్నాథ్గారి పేరు మీద ‘అమర్నాథ్ ఎన్. ప్రమోషనల్ బ్లిట్జ్ అవార్డు’ ఇస్తున్నారు కదా... దాని గురించి చెప్పండి? బజాజ్ గ్రూప్‌వాళ్లు దేశవ్యాప్తంగా ఉన్న తమ డీలర్లలో ఒక ఉత్తమ డీలర్‌ను ఎంపిక చేసి, వారికి మావారి పేరుమీద అవార్డునివ్వాలని నిర్ణయించుకున్నారు. అమర్నాథ్ ఎప్పుడూ కొత్త కొత్త స్కీములు ఆలోచించి, ముందు తను వాటిని ఆచరణలో పెట్టి విజయం సాధించి, తర్వాత మిగతా డీలర్లందరినీ కలిసి అలా చేయమని ప్రోత్సహించేవారట. అందుకే ఆయన పేరు మీద అవార్డును నెలకొల్పాలనుకుంటున్నామని వాళ్లు చెప్పగానే చాలా ఆనందపడ్డాను. మరీ సంతోషకరమైన విషయం ఏమిటంటే... నెలకొల్పిన తర్వాత వరుసగా రెండేళ్లూ మా కంపెనీయే ఆ అవార్డును గెలుచుకోవడం! మరి మీవారి గుర్తుగా మీరు కూడా ఏదైనా చేయాలనుకుంటున్నారా? ప్రతి జిల్లాలోనూ టీఎంసీ ఉండాలనేది అమర్ నాథ్ కోరిక. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఎనిమిది, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలో ఒక్కోటి చొప్పున షోరూమ్స్ ఉన్నాయి. మిగతా అన్ని జిల్లాల్లో కూడా మా షోరూములు ప్రారంభించడమే నా ముందున్న లక్ష్యం. అది మాత్రమే కాదు... ఆయన ఎప్పుడూ ఒక హాస్పిటల్ కట్టించాలి అనేవారు. ఆ పని నేను పూర్తి చేయాలనుకుంటున్నాను. ఆయన కోరిక తీర్చడం కోసమే కాదు. ఆయనకి జరిగినట్టు ఎవరికీ జరగకుండా ఉండటం కోసం. బోలెడంత డబ్బు ఉంది. చికిత్స చేయించుకోగల స్తోమతా ఉంది. కానీ ఏం లాభం? సమయానికి డాక్టర్లు లేక మావారు ప్రాణాలు కోల్పోయారు. ఆ పరిస్థితి ఎవరికీ రాకూడదు. వారం పొడవునా, ఏ సమయంలో ఏ రోగి వచ్చినా వైద్యం అందించే విధంగా ఓ ఉత్తమ హాస్పిటల్‌ను ఏర్పాటు చేయాలని ఉంది. దానికి కాస్త సమయం పట్టవచ్చు. కానీ ఎప్పటికైనా చేసి తీరతాను. ఆ రెండూ చేసిన రోజున, ఓ భార్యగా నా భర్త కలలను నిజంగా నిజం చేసినదాన్ని అవుతాను! - సమీర నేలపూడి మేమెప్పుడూ అలా ఆలోచించం. అమర్నాథ్ ఎప్పుడూ ఒకటే చెప్పేవారు... తక్కువ లాభం తీసుకోవాలి, కస్టమర్లను ఎక్కువ శాటిస్ఫై చేయాలి అని! అది ఏ వ్యాపారికోగానీ ఉండని గొప్ప దృక్పథం. ఎప్పుడూ కస్టమర్లను సంతోషపెట్టడానికే చూసేవారాయన. అదే మా కంపెనీని ఉన్నత స్థాయికి చేర్చింది. అందుకే నేనూ ఆయన చూపిన బాటలోనే నడుస్తున్నాను. ఆయన పాలసీనే ఫాలో అవుతున్నాను.