చంద్రయాన్ ల్యాండర్.. బంగారు రంగులో మెరిసి పోతూ ఉంటుంది. పైగా.. ఏదో గిఫ్ట్‌ప్యాక్ చుట్టిపెట్టి నట్లు గోల్డ్ ఫాయిల్‌లాగా ఉంటుంది. ఇంతకీ మెరిసేదంతా బంగారమేనా? అస్సలు కాదు.. ఇది మల్టీ లేయర్ ఇన్సులేషన్.. అనేక పొరలుగా ఉంటుంది. ఉష్ణ నిరోధకంగా దీన్ని ఉపయోగి స్తారు. అంతరిక్షంలోకి ఉపగ్రహం వెళ్లినప్పుడు అక్కడి ఉష్ణోగ్రతలు వాటిల్లోని పరికరాలపై ప్రభావం చూపుతాయి. దీని వల్ల అవి సరిగా పనిచేయలేక పోవచ్చు. దాన్ని నివారించడానికి ఇలా కప్పి ఉంచుతారు.
మూన్ గురించి.. మీకు తెలుసా?
మనం అనుకు న్నట్లు.. చంద మామ గుండ్రంగా ఉండడు.. గుడ్డు ఆకారంలో ఉంటాడు.. అలాగే చల్లనయ్య.. తెల్లనయ్య కాదు.. దగ్గర్నుంచి చూస్తే.. ముదురు బూడిద రంగులో ఉంటాడు. మనం ఎప్పుడు చూసినా.. చంద్రునిలోని 59 శాతం మాత్రమే మనకు కనిపిస్తుందట. అంతేకాదు.. చంద్రుడిని దగ్గర నుంచి చూస్తే.. భారీ గుంతలులాంటివి కనిపిస్తుంటాయి. ఇవన్నీ.. కొన్ని కోట్ల ఏళ్ల క్రితం ఖగోళ వస్తువులు దాన్ని ఢీకొన్నప్పుడు ఏర్పడినవే..
చదవండి: చంద్రయాన్ 3 సాఫ్ట్ ల్యాండింగ్ వెనుక తమిళనాడు మట్టి కీలక పాత్ర..
Comments
Please login to add a commentAdd a comment