న్యూఢిల్లీ: Chandrayaan-3 చంద్రుడిపై నిద్రాణ స్థితిలో ఉన్న ల్యాండర్, రోవర్‌ను మళ్లీ మేల్కొలిపేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ల్యాండర్, రోవర్ నుంచి సంకేతాలు అందడం లేదని సైంటిస్టులు చెబుతున్నారు. దీంతో చందమామపై వాటి ప్రస్థానం ముగిసిపోయినట్లేనా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ల్యాండర్, రోవర్‌తో అనుసంధానం కోసం ఇస్రో సైంటిస్టులు ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు.
కాగా చంద్రయాన్–3 ప్రయోగం ద్వారా భారత్ చరిత్ర సృష్టించింది. చందమామ దక్షిణ ధ్రువంపై క్షేమంగా అడుగుపెట్టిన మొట్టమొదటి దేశంగా రికార్డుకెక్కింది. చంద్రయాన్–3 మిషన్‌లో అంతర్భాగమైన ల్యాండర్ విక్రమ్ ఆగస్టు 23న జాబిల్లి దక్షిణ ధ్రువంపై సురక్షితంగా దిగింది. అందులో నుంచి రోవర్ ప్రజ్ఞాన్ బయటకు వచ్చిన, చంద్రుడి ఉపరితలంపైకి చేరుకుంది.
అవి రెండూ 14 రోజుల పాటు నిర్విరామంగా పనిచేశాయి. జాబిల్లిపై పరిశోధనలు జరిపి, విలువైన సమాచారాన్ని భూమిపైకి చేరవేశాయి. అనంతరం సెప్టెంబర్ 2న దక్షిణ ధ్రువంపై సూర్యాస్తమయం కావడంతో స్లీప్ మోడ్‌లోకి వెళ్లిపోయాయి. మళ్లీ సూర్యోదయం కావడంతో ఈ నెల 22న తిరిగి మేల్కోవాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment