మట్టి మహిమ..
మట్టి కొట్టు
టెక్నాలజీ, తీరిక లేనితనం, యాంత్రిక జీవనం తదితర కారణాలతో పాత పద్ధతులకు దూరమైన నగ ర జనం క్రమేణా అందులో ఉన్న గొప్పతనాన్ని గుర్తించడం మొదలుపెట్టారు. పెద్దల మాటలు, చేతలు అవి చేసే మేళ్లను ఒంట పట్టించుకుంటున్నారు. చేల గట్ల వెంబడి పారిన నీటిని తాగిన కాలం నుంచి మినరల్ వాటర్ లేనిదే ఉండలేని స్థితికి చేరుకున్న దశలను కాదనుకుని మట్టిలోని మాధుర్యాన్ని అనుభవించేందుకు సిద్ధమవుతున్నారు. ఒళ్లంతా బురదను పులుముకొని ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందుతున్నారు. బురదకు, ఆరోగ్యానికి లింకేమిటని ఆలోచిస్తున్నారా..? ఖచ్చితంగా ఉంది.
సబ్బులు, షాంపూలు, కుంకుడు కాయలు కూడా లేని రోజుల్లో ఊరి బయటకు వెళ్లి అక్కడ లభించే రేగడి మట్టినేరుద్దుకుని స్నానం చేసేవారు. ఆ మట్టి స్నానం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని ప్రకృతి వైద్యశాస్త్రం చెబుతోంది. ఈ వేసవి నుంచి ఉపశమనాన్ని, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందేందుకు నేచర్‌క్యూర్ ఆస్పత్రుల్లో మడ్‌బాత్ (మృత్తిక స్నానం)ను ఆశ్రయిస్తున్నారు నగరవాసులు. కేవలం మడ్‌బాత్ కోసమే రోజుకు 20-25 మంది నేచర్‌క్యూర్ ఆస్పత్రికి వస్తున్నారు. - సనత్‌నగర్
కాలానుగుణంగా చికిత్స...
పంచభౌతికమైన శరీరానికి మట్టితో ఇక్కడ చికిత్స చేస్తున్నారు. మట్టిని పట్టీలుగా గానీ, రోగగ్రస్థమైన అవయవంపై లేపనంగా గానీ పూయడం వల్ల ఉపశమనం లభిస్తుంది. ఈ చికిత్సను రోగిని అనుసరించి గానీ, వాతావరణం, కాలాలను అనుసరించి గానీ తీసుకోవాల్సి ఉంటుంది. ఎండ తీవ్రతను బట్టి మృత్తిక చికిత్సలు ఉంటాయి. ఈ చికిత్సకు జిగురుతత్వాన్ని కలిగిన బంక మన్ను (రేగడి మన్ను)ను ఉపయోగిస్తారు.
రోగమేదైనా పట్టీ ఒక్కటే...
► సహజంగా మట్టిపట్టీని రోగి ఉపవాస కాలంలో రోజుకు రెండుసార్లు (ఉదయం 6 గంటలు, మధ్యాహ్నం 3 గంటలకు) వేయడం ద్వారా శరీరంలోని ఉష్ణోగ్రత మామూలు స్థితికి వస్తుంది.
ఠఎంతటి తీవ్రమైన జ్వరమొచ్చినా రెండు మూడు రోజుల్లో తగ్గించే శక్తి మట్టిపట్టీలకు ఉంటుంది.
►పేగుల్లో మండనం (మురుగు) లేకుండా చేస్తుంది. ఆంత్రవ్రణములు, అమీబియాసిస్ తదితర వ్యాధులకు మట్టి పట్టీలు రోజుకు రెండు నుంచి మూడుసార్లు వేసుకోవడం ద్వారా కొద్దిరోజులకే తగ్గుతాయట. మందులు వాడాల్సిన అవసరం అసలే ఉండదు. ఠచీము, రక్త విరేచనాలు, నీళ్ల విరేచనాలు ఒకటి రెండు రోజుల్లో నివారించవచ్చు.
►మహిళలకు వచ్చే గైనిక్ ప్రాబ్లమ్స్‌కు మట్టిపట్టీలు రోజుకు మూడు లేదా నాలుగుసార్లు రెండు గంటల వ్యవధి చొప్పున వేసుకోవడం ద్వారా సత్ఫలితాలు ఉంటాయని ప్రకృతి వైద్య నిపుణులు చెబుతున్నారు.
మూత్రం రాకుంటే మట్టి లేపనం...
నానిన రేగడిమట్టిని ఇక అంగుళం మందంతో పొట్ట భాగంలో లేపనం చేస్తారు. దీని ద్వారా మలబద్దకం, జ్వరం, అతి విరేచనాలు, రక్త గ్రహణి, ఆంత్రవ్రణములతో బాధపడుతున్న వారు ఉపశమనం పొందవచ్చు. మూత్రం మంటగా ఉన్నప్పుడు పొత్తి కడుపుపై మట్టి గానీ, మట్టిపట్టీలు గానీ వేయడం వల్ల మంట వెంటనే తగ్గుతుంది. మూత్రం రానిచో పొత్తి కడుపును కాపడం చేసి మట్టిపట్టీలు గానీ, మట్టి లేపనం గానీ చేసినట్లయితే సత్ఫలితాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.
పక్షవాతం, పోలియోలకూ...
రోగిని ఒక స్టూలుపై కూర్చోబెట్టి బాగా నానిన రేగడి మట్టిని కాళ్లకు, చేతులకు లేపనం చేసి 10 నిమిషాల తరువాత స్నానం చేయించాలి. దీని ద్వారా కండరవాతం, మేహవాతం, చేతులు, కాళ్ల మంటలు, పగుళ్లు తీపులు, వాపులు తదితర సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ముఖ్యంగా సంధివాతం, పక్షవాతం, పోలియో తదితర వ్యాధులతో బాధపడుతున్న వారికి ఈ చికిత్స ఎంతో ఉపకరిస్తుందని వైద్యులు చెబుతున్నారు.
నవ నాడులను ప్రేరేపిస్తుంది
వీపుభాగంలో, నడుముకు అంగుళం మందంతో నానిన మట్టిని లేపనం చేసి 10 నిమిషాలు ఉంచిన తరువాత మట్టిని తీసివేసి స్నానం చేయించాలి. వెన్ను దేహమునకు కేంద్ర స్థానం కావడం వల్ల మెదడును, నవ నాడులను చల్లబరిచి చురుకుగా పనిచేసేలా మట్టి లేపనం ఎంతో సహాయపడుతుంది.
గుండెజబ్బులైనా సరే..
రోగిని బల్లపై గానీ, నేలపై గానీ పడుకోబెట్టి ఒక అంగుళం మందంతో ఛాతి భాగమంతా మట్టి లేపనం చేస్తారు. దీని ద్వారా ఛాతినొప్పి, మంట, గుండె జబ్బులు, రక్తపోటు తదితర వ్యాధులతో బాధపడుతున్నవారు ఉపశమనం పొందవచ్చు.
తలను నీటితో తడిపి నానిన రేగడిమట్టిని పూస్తారు. 15 నిమిషాల పాటు ఎండలో ఉన్న తరువాత శిరస్నానం చేయాలి. పురుషులే కాకుండా స్త్రీలు కూడా ఈ రకమైన తలమట్టి స్నానం చేయవచ్చు. దీని ద్వారా తలలో ఉండే చుండ్రు, జుట్టు ఊడిపోవడం, పండిపోవడం, పేలు కొరుకుడు, తలనొప్పి, కళ్ల మంటలు, నీరుకారడం, దృష్టి లోపం, కంటి, చెవి, ముక్కు వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చని వైద్యులు చెబుతున్నారు. అలాగే ఉన్మాదం, హిస్టీరియా, నిద్రలేమితనంతో బాధపడేవారికి ఎంతో ఉపయోగం.
తల నుంచి పాదాల వరకు శరీరం మొత్తం నానిన రేగడి మట్టిని పూసుకుని 30 నిమిషాల తరువాత మట్టిని తీసివేసి స్నానం చేయాలి. మృత్తిక స్నానం వల్ల అన్ని రకాల చర్మవ్యాధులు, మొటిమలు మొదలుకొని గజ్జి, తామర, నల్లమచ్చలు, ఎర్రమచ్చలు, తెల్ల మచ్చలు, తెల్ల పొడలు, మేహం, దారుణం, అతి ఉష్ణం, కుష్టు, చర్మం పగుళ్లు తదితర అన్ని చర్మ వ్యాధుల నివారణకు మృత్తికా స్నానం ఎంతో ఉపయోగపడుతుంది.
పాము కాటుకు భూగర్భ స్నానం...
తల బయట ఉంచి భూమిలో శరీరం మొత్తాన్ని గానీ, వ్యాధి సోకిన అవయవాన్ని గానీ 10 నుంచి 30 నిమిషాల వరకు ఉంచడమే భూగర్భ స్నానం. దీని ద్వారా పక్షవాతం, పోలియో, కండరవాతం, సంధివాతం, గూని, పోలియో, చర్మవ్యాధులు, కుష్టు, బొల్లి తదితర రోగాలను నయం చేయొచ్చని వైద్యులు చెబుతున్నారు. పాముకాటుకు ఈ స్నానం ఎంతగానో ఉపయోగపడుతుందట. పాము కరిచినప్పుడు రోగిని అడ్డంగా అరగజం లోతు గొయ్యి తవ్వి తల బయటకు ఉంచి మట్టితో కప్పి కొన్ని గంటల వరకు ఉంచితే పాము విషం హరిస్తుందని వైద్యులు చెబుతున్నారు.భూమిలోని అయస్కాంత శక్తితో పాటు సేంద్రీయ లవణాల వల్ల శరీరంలోని ఎన్నో రోగాలు నివారించ వచ్చంటున్నారు.
వేసవిలో ఆదరణ బాగుంటుంది...
వేసవిలో మడ్‌బాత్‌కు ఎంతో ఆదరణ ఉంటుంది. ఎందుకంటే సూర్యరశ్మి ఉన్నప్పుడే మడ్‌బాత్ చేయాలి. దీని ద్వారా వేసవి తాపం నుంచి ఉపశమనం పొందడంతో పాటు ఒంట్లోని ఎన్నో రకాల రుగ్మతలను తొలగించుకోవచ్చని ప్రకతి వైద్య శాస్త్రం ద్వారా నిరూపితమైంది. అయితే వైద్యుల పర్యవేక్షణలో చేసుకోవాల్సి ఉంటుంది. నేచర్‌క్యూర్‌లో రోజుకు 20 మంది వరకు మడ్ ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. మంగళ, గురు, శనివారాల్లో మహిళలకు, సోమ, బుధ, శుక్ర వారాల్లో పురుషులకు మృత్తిక చికిత్స చేస్తున్నాం.
డాక్టర్ ఎంవీ మల్లికార్జున్,
సూపరింటెండెంట్,
నేచర్‌క్యూర్ ఆస్పత్రి, అమీర్‌పేట్