intensity of the sun
-
Countdown on Health and Climate Change: ఎండ దెబ్బకు ఐదు రెట్ల మరణాలు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏటా పెరుగుతున్న ఎండల తీవ్రతతో మానవాళికి పెనుముప్పు పొంచి ఉందని లాన్సెట్ నివేదిక వెల్లడించింది. భానుడి ప్రతాపం ఇదే మాదిరి పెరుగుతూ ఉంటే వచ్చే 27 ఏళ్లలో అంటే 2050 నాటికి ఎండల తీవ్రతకు మరణించే వారి సంఖ్య ఐదు రెట్లు పెరిగే అవకాశం ఉంటుందని పేర్కొంది. తాజాగా, లాన్సెట్ ‘కౌంట్ డౌన్ ఆన్ హెల్త్ అండ్ క్లైమేట్ ఛేంజ్’పై 8వ వార్షిక నివేదిక విడుదల చేసింది. గాలి, నీరు పరివర్తనం వల్ల తలెత్తే ప్రమాదాలపై ప్రధానంగా ఈ నివేదిక దృష్టి సారించింది. ఆయిల్, గ్యాస్ వంటి రంగాలలో పెట్టుబడులు పెట్టవద్దని ప్రభుత్వాలు, కంపెనీలకు సూచించింది. 2022లో దాదాపు 86 రోజుల పాటు తీవ్రమైన వేడిమిని ఎదుర్కోవలసి వచి్చందని పేర్కొంది. ఇందులో 60 శాతానికిపైగా ఘటనలకు మానవ కార్యకలాపాలే బాధ్యత అని తెలిపింది. జీవ ఇంధనాలపై పెట్టుబడులు పెట్టే వివిధ కంపెనీల తీరును కూడా లాన్సెట్ నివేదికలో ఎండగట్టింది. జల, వాయు సంబంధిత దుష్పరిణామాలను నిలువరించేందుకు ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలు సరిపోవని లాన్సెట్ కౌంట్ డౌన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ మరీనా రొమానెలో హెచ్చరించారు. ఎండ తీవ్రత వల్ల వ్యవస్థకు కలుతున్న నష్టంపై కూడా ఆందోళన వ్యక్తం చేశారు. వాతావరణం దెబ్బతినడం వల్ల నీరు, వ్యవసాయ ఉత్పత్తులపై కూడా ప్రతికూల ప్రభావం పడి, ప్రపంచ వ్యాప్తంగా పోషకాహార లోపం సమస్య తలెత్తే ప్రమాదం ఉందని అంచనా వేశారు. కేవలం ఎండ తీవ్రత కారణంగా 2041–60మధ్య కాలంలో 52.49కోట్ల మంది ఆహార భద్రత ముప్పు ఎదుర్కోవలసి వస్తుందని పేర్కొన్నారు. 2050 వరకు ప్రాణాంతక వ్యాధుల సంఖ్య పెరగొచ్చని కూడా లాన్సెట్ ఆందోళన వ్యక్తం చేశారు. -
కళ్లు తెరవండి...
సూర్యుడు భగభగా మండుతుంటేకళ్లు మూసుకుంటాం. కానీ... మూసుకునే ఉండలేంగా?!అందుకే...కళ్లు తెరవండి. ఎండాకాలం నిజాలతో కనువిప్పు కలిగించుకోండి. కంటికి ఏదైనా కనపడాలంటే కాంతి కావాల్సిందే. కానీ అదే కాంతి తీవ్రత మరీ ఎక్కువైతే? వేసవిలో కాంతి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుందన్నది తెలిసిందే. దాంతో ఆ కాంతిలో ఉండే అల్ట్రా వయొలెట్ కిరణాలు, ఇన్ఫ్రా రెడ్ కిరణాల ప్రతికూల ఫలితాలు కంటిని ప్రభావితం చేస్తాయి. ఈ వేసవిలో కాంతి తీవ్రతతో కంటిపై పడే దుష్ప్రభావాలు, ఇతరత్రా సమస్యలపై అవగాహన కోసం ఈ కథనం. అలాగే వేసవి కాంతి తీవ్రత నుంచి కంటిని రక్షించడం కోసం నాసిరకం కళ్లజోళ్ల వల్ల కంటికి కలిగే నష్టాలు, తీవ్ర కాంతి నుంచి కళ్లను రక్షించుకోడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకుందాం. ఏమిటీ కాంతి... దాంతో ఎలా కనిపిస్తుంది? మన కన్ను పనిచేయడానికి దోహదపడే కాంతి అంటే ఏమిటో ముందుగా తెలుసుకుందాం. సూర్యుని నుంచి భూమికి చేరే అనంతమైన రేడియేషన్ పటలంలో మనం చూడగలిగేదీ, మనం గ్రహించగలిగేదీ చాలా పరిమితం. ఈ పరిమితమైన కాంతి మన కంట్లోని కంటిపాప ద్వారా వెళ్లి రెటీనాపై రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ రెటీనాపై పడ్డ ప్రతిబింబాన్ని ఆప్టిక్ నర్వ్ మన మెదడుకు చేరవేసి, అదేమిటో తెలిపేలా చూపుకు సంబంధించిన జ్ఞానాన్ని కలిగిస్తుంది. ఎన్నెన్నో రకాల రేడియేషన్... నిజానికి రేడియేషన్‌లో ఒక్క కాంతి కిరణాలు మాత్రమే కాకుండా... రేడియో తరంగాలూ, ఎక్స్–కిరణాలూ, మైక్రోవేవ్... ఇలా ఎన్నెన్నో రకాల తరంగాలు ఉంటాయి. వీటినన్నింటినీ కలిపి ‘ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్’ అంటారు. ఇందులో వేర్వేరు రకాల కిరణాలకు వేర్వేరు వేవ్‌లెంగ్త్ ఉంటుంది. నిజానికి ఆయా వేవ్లెంత్లను బట్టే ఆ రేడియేషన్‌ను వర్గీకరిస్తారు. అల రూపంలో ప్రసారితమయ్యే కాంతి కిరణంలోని పక్కపక్కనే ఉండే... ఒక పీక్‌కూ, మరో పీక్‌కూ మధ్యనున్న దూరమే వేవ్‌లెంగ్త్. దీన్ని ప్రామాణికంగా తీసుకొని చూస్తే... మన కళ్లకు కనిపించే, మనం చూడటానికి దోహదం చేసే ఈ కాంతి కేవలం 380 – 780 నానో మీటర్ల (మైక్రాన్స్) రేంజ్లో మాత్రమే ఉంటుంది. అంతకంటే తక్కువ వేవ్‌లెంగ్త్‌తో ఉండే కిరణాలను అల్ట్రా వయొలెట్ కిరణాలుగానూ, అంతకంటే ఎక్కువ వేవ్‌లెంగ్త్‌తో ఉండేవాటిని ఇన్ఫ్రా రెడ్ కిరణాలుగానూ చెబుతుంటారు. హాని కలిగేది అల్ట్రా వయొలెట్,ఇన్ఫ్రా రెడ్ కిరణాలతో... మనకు చేరే కాంతితో పాటు మన వాతావరణంలో ప్రసరిస్తూ, ప్రవహిస్తూ ఉండే అల్ట్రా వయొలెట్, ఇన్ఫ్రా రెడ్ కిరణాలు కంటికి హాని కలిగిస్తాయి. వేసవిలో ఈ కిరణాల తీవ్రత మరింత ఎక్కువగా ఉండటం వల్ల కంటికి హాని చేసే అవకాశాలు ఎక్కువ. ఇన్ఫ్రారెడ్ కిరణాల దుష్ప్రభావం ప్రధానంగా కార్నియా మీద ఉంటుంది. కాంతికి తక్షణం ఆవల ఉన్న రేడియేషన్, రకాలు మనకు కంటికి కనిపించే కాంతికి ఇరుపక్కల ఉండే రేడియేషన్‌తో మన కంటికి చాలా ప్రమాదం . కాంతికి ఇరుపక్కల ఉండే రేడియేషన్, అందులోని రకాల గురించి తెలుసుకుందాం. కాంతిపుంజం లేదా కాంతి కిరణానికి పక్కనే తక్కువ వేవ్‌లెంగ్త్‌లో ఉండే కిరణాలే అల్ట్రా వయొలెట్ కిరణాలు. అల్ట్రా వయొలెట్లోని మూడు రకాలు... కంటికి హాని చేయగల అల్ట్రా వయొలెట్ కిరణాల (యూవీ రేస్)ను మూడు రకాలుగా విభజించవచ్చు. అవీ యూవి– ఏ, యూవీ– బీ, యూవీ– సీ వీటిలో మొదటి రెండిటి కంటే యూవీ – సీ చాలా ప్రమాదకరం. ఇన్ఫ్రా రెడ్ కిరణాలను ఇన్ఫ్రారెడ్ – ఏ, ఇన్ఫ్రారెడ్ – బీ, ఇన్ఫ్రారెడ్ – సీ అని మూడుగా వి¿¶ జించవచ్చు. ఈ మూడు రకాల కిరణాలూ కంటికి ప్రమాదకరమైనవి. రేడియేషన్‌తో కంటికి హాని ఇలా... సూర్యుడి నుంచి మొదలై, మొదట శూన్యంలో ప్రయాణం చేసే రేడియేషన్, భూమి ఉపరితలంలో ఉన్న వాతావరణాన్ని చీల్చుకొని మన కంటి వరకు చేరుతుంది. ఈ క్రమంలో రేడియేషన్‌లోని అత్యంత హానికారకమైన కిరణాలను ఓజోన్ పొర చాలా వరకు వడపోస్తుంది. అందువల్ల కేవలం 3 శాతం కిరణాలు మాత్రమే ఉపరితలం వరకు చేరతాయి. అల్ట్రా వయొలెట్ కిరణాల ప్రభావం ఇలా... మామూలు కాంతి వల్ల కంటికి ఎలాంటి హాని ఉండదు గానీ తీవ్రమైన కాంతి వల్ల కంటికి జరిగే నష్టం రెండు రకాలుగా జరగవచ్చు. ఇందులో కంటికి తక్షణం కలిగే అనర్థాలను ‘అక్యూట్ అనర్థాలు’గా చెప్పవచ్చు. అదేపనిగా చాలాకాలం పాటు రేడియేషన్‌కు ఎక్స్పోజ్ అవుతున్నప్పుడు కంటిపైన దీర్ఘకాలిక దుష్ప్రభావాలూ పడవచ్చు. వీటినే ‘క్రానిక్ దుష్ప్రభావాలు’ గా పేర్కొంటారు. అల్ట్రా వయొలెట్ రకాల్లో యూవీ–ఏ వల్ల కలిగే దుష్ప్రభావాలు చాలావరకు తాత్కాలికమైనవి. యూవీ–ఏ కంటే యూవీ–బీ కిరణాలవల్ల కలిగే అనర్థాల తీవ్రత ఎక్కువ. అయితే వీటివల్ల కంటికి కలిగే అనర్థాలను వైద్యచికిత్సతో చాలావరకు చక్కదిద్దవచ్చు. కానీ యూవీ–సి వల్ల కలిగే అనర్థాలు మాత్రం చాలా తీవ్రంగా ఉంటాయి. కొన్నిసార్లు ప్రాణాలకు సైతం ముప్పు కలిగించవచ్చు. అయితే అదృష్టవశాత్తు యూవీ–సీ రకానికి చెందిన కిరణాలను ఓజోన్ పొరే నిరోధించి, జీవకోటిని రక్షిస్తుంటుంది. హానికర కిరణాల దుష్ప్రభావం ఇలా... వాతావరణంలోకి ప్రవేశించిన ఈ కాంతి కిరణాలు కొన్నిసార్లు నేరుగానూ, మరికొన్నిసార్లు రిఫ్లక్షన్ చెంది కంటిపై పడి దుష్ప్రభావాలను కలిగిస్తాయి. అయితే రిఫ్లెక్షన్‌తో కలిగే నష్టాలన్నిటిలో చాలా సందర్భాల్లో మంచు, ఇసుక, నేల, రోడ్డు, కంకర, నీళ్ల ఉపరితలం వంటి వాటిపై పడి రిఫ్లెక్ట్ అయి కంటికి చేరి దుష్ప్రభావం చూపుతాయి. సాధారణంగా మనం డ్రైవింగ్ చేసేప్పుడు నేరుగా పై వైపు కంటే, ఒకింత కిందివైపుకే చూస్తూ వాహనాన్ని నడుపుతుంటాం. కాబట్టి రిఫ్లెక్టెడ్ కిరణాలతో ఇలా దుష్ప్రభావం పడే అవకాశాలు ఎక్కువ. రిఫ్లెక్ట్ అయ్యే కిరణాలు సాధారణంగా కిందివైపు నుంచి రిఫ్లెక్ట్ అయి కంటికి చేరతాయి కాబట్టి వాటి వల్ల పడే దుష్ప్రభావాలను టోపీ, గొడుగు లాంటి వాటితో ఆపలేం. మబ్బుపట్టి ఉన్నా.. వరండాలో ఉన్నా ... మబ్బు పట్టి ఉన్నప్పుడు ఈ అల్ట్రా వయొలెట్ కిరణాలను మబ్బులు అడ్డుకుంటాయి కాబట్టి వాటి తీవ్రత ఉండదని మనం భావిస్తుంటాం. కానీ... అది వాస్తవం కాదు. మబ్బులు పట్టి ఉన్నా లేదా వరండాలాంటి బయటి గదుల్లో (ఇన్–డోర్స్‌లో) ఉన్నప్పటికీ... దాదాపు 3 శాతం అల్ట్రా వయొలెట్ కిరణాలు కంటికి చేరే అవకాశం ఉంది. అవి కంటికి హాని చేయవచ్చు. ప్రత్యేకంగా యూవీ–సీ, యూవీ–బీ తరహాకు చెందిన కిరణాల వల్ల మరింత హాని జరిగే అవకాశం ఉంది. ఇక్కడ అదృష్టం ఏమిటంటే... మన కంటిలోపల ఉండే లెన్స్ యూవీ–బీ తరహా కిరణాలను చాలావరకు ఫిల్టర్ చేస్తుంది. అయితే... కొన్నిసార్లు మాత్రం ఈ యూవీ కిరణాలు రెటీనా వరకు వెళ్లి... సోలార్ బర్న్ రూపంలో రెటీనాను దెబ్బతీసే ప్రమాదం పొంచి ఉంటుంది. తాత్కాలిక దుష్ప్రభావాలు తక్కువ శక్తిమంతమైన యూవీ కిరణాల కారణంగా కంటిపై పడే దుష్ప్రభావాల ఫలితం చాలావరకు తాత్కాలికంగానే ఉంటుంది. ఉదాహరణకు.. కంటి నుంచి నీళ్లు కారడం, కన్ను పొడిబారడం, కళ్ల వాపు, ఎక్కువ కాంతిని చూడాల్సి వస్తే కంటికి ఇబ్బందిగా అనిపించడం వంటి సమస్యలు వస్తాయి. ఇలా ఎక్కువ కాంతిని చూడలేకపోవడాన్ని ‘ఫొటోఫోబియా’ అంటారు. దీర్ఘకాలిక దుష్ప్రభావాలు చాలా సందర్భాల్లో యూవీ కిరణాలకు సుదీర్ఘకాలం పాటు ఎక్స్పోజ్ కావడం కూడా వల్ల అనర్థాలు సంభవిస్తాయి. వీటిని క్రానిక్ ‘సైడ్ఎఫెక్ట్స్’గా పేర్కొంటారు. క్రానిక్ సైడ్ ఎఫెక్ట్స్: దీర్ఘకాలం యూవీ కిరణాలకు ఎక్స్పోజ్ అయితే ఈ కింది అనర్థాలు సంభవిస్తాయి. టెరీజియమ్: కంటి చివరన ముక్కుకు దగ్గర ఉండే వైపున కంటి లోపలి కండ పింక్ రంగులో కనిపిస్తుంటుంది. ఈ కండ క్రమంగా పెరుగుతూ ఒక దశలో నల్లగుడ్డును పూర్తిగా మూసేస్తుంది. దాంతో చూపు పూర్తిగా తగ్గుతుంది. ఇలా టెరీజియమ్ అనే సమస్య రావడం అన్నది పట్టపగలు తీవ్రమైన కాంతిలో ఆరుబయట పనిచేసేవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇక సముద్రప్రాంతాల్లో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండి, కాంతి తీక్షణంగా ఉంటుంది. అందువల్ల సముద్రం అలలపై సర్ఫింగ్ చేసేవారిలోనూ టెరీజియమ్ తరచుగా కనిపిస్తుంది. అందుకే దీన్ని ‘సర్ఫర్స్ ఐ’ అని కూడా అంటారు. క్యాటరాక్ట్: కంటిలో వచ్చే తెల్ల ముత్యం లేదా తెల్లపొరను క్యాటరాక్ట్ అంటారన్న విషయం తెలిసిందే. సాధారణంగా వయసు పెరగడం వల్ల వచ్చే ముప్పుగా ఈ సమస్య చాలా మందిలో కనిపిస్తుంది. అయితే వాతావరణంలోని అల్ట్రా వయొలెట్ కిరణాలకు అదేపనిగా కన్ను ఎక్స్పోజ్ కావడం వల్ల మామూలు కంటే కాటరాక్ట్ ముందుగానే వస్తుంది. అన్ని కాటరాక్ట్ కేసులను పరిశీలిస్తే... వాటిల్లో 10 శాతం కాటరాక్ట్ కేసులు యూవీ కిరణాలకు ఎక్కువగా ఎక్స్పోజ్ కావడం వల్ల వచ్చేవేనని చాలా అధ్యయనాల్లో తేలింది. మాక్యులార్ డీజనరేషన్: ఒంటిలో ఉన్నట్టే... మెలనిన్ అనే నల్లటి రంగునిచ్చే పదార్థం కంటిలోనూ ఉంటుంది. ఇది రెటీనల్ పిగ్మెంట్ ఎపిథీలియంలో ఉండి కాంతి ప్రసరించినప్పుడు అందులోని యూవీ కిరణాలను వడపోస్తూ కంటికి రక్షణ కల్పిస్తుంది. ఇది వాతావరణంలో ఉండే అల్ట్రా వయొలెట్ కిరణాలను 90 శాతం వరకు వడపోసి, కంటికి రక్షణ ఇస్తుంది. వయసు పెరుగుతున్న కొద్దీ ఈ మెలనిన్ పాళ్లు కంటిలో తగ్గుతుంటాయి. దాంతో కంటిలో ఉండే నల్ల గుడ్డుకు గానీ, రెటీనాలో ఉండే ఎపిధీలియంలో గానీ యూవీ కిరణాలను వడపోసే సామర్థ్యం కూడా తగ్గిపోతుంది. ఫలితంగా కంటి చూపుపై ప్రభావం పడే అవకాశం ఉంది. వయసు పెరుగుతున్న కొద్దీ ఇలా యూవీ కిరణాలను వడపోసే సామర్థ్యం తగ్గిపోవడం వల్ల కంటిచూపు క్రమంగా తగ్గవచ్చు. అందుకే దీన్ని ఏజ్ రిలేటెడ్ మాక్యులార్ డీజనరేషన్ (ఏఆర్‌ఎమ్‌డీ) అని కూడా అంటారు. కంటిపై భాగంలో సంభవించే తీవ్రమైన దుష్ప్రభావాలివి... ∙ కనురెప్ప క్యాన్సర్లు ... కనురెప్పపై యూవీ కిరణాల దుష్ప్రభావాల వల్ల కనిపించే కొన్ని తీవ్రమైన అనర్థాలలో బేసల్ సెల్ కార్సినోమా, స్క్వామోజ్ సెల్ కార్సినోమా, మెలనోమా అనే రకం కంటి క్యాన్సర్లు ప్రధానమైనవి. ∙ కంజెంక్టివాకు కలిగే అనర్థాలు: కంటిపై ఉండే పొర అయిన కంజెంక్టివాకు వచ్చే సమస్యను ‘పింగ్వెక్యులా’ అని అంటారు. ఈ తరహా సమస్య వచ్చిన వారిలో కంటిపై ఉండే పొర మందంగా మారి పసుపు రంగును సంతరించుకుంటుంది. కంటిలోని నల్లపొర అంచుల పైకి రెండవైపుల నుంచి ఈ పొర పాకి వస్తున్నట్లుగా అనిపిస్తుంది. అందుకే దీన్ని ‘ఎల్లో బంప్ ఇన్ ఐ’ అని కూడా అంటారు. ఎప్పుడూ కంటిపై యూవీ కిరణాలు ప్రసరిస్తూ ఉండటం వల్ల కన్ను పొడిబారిపోవడం వల్ల కూడా ‘పింగ్వెక్యులా’ రావచ్చు. ∙ కార్నియాపై: కొందరిలో ఫొటోకెరటైటిస్ అనే సమస్య వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా ఎలాంటి రక్షణ లేకుండా వెల్డింగ్ చేసేవారిలో ఈ సమస్య ఎక్కువగా వస్తుంది. మంచుపై స్కీయింగ్ చేసే వారిలో సైతం నేరుగా పడే కాంతి కిరణాల వల్ల కార్నియాకు దెబ్బతగిలి కంటి చూపు మందగిస్తుంది. దీన్ని ‘స్నో బ్లైండ్నెస్’ అంటారు. ∙ ఐరిస్ దెబ్బతినడం వల్ల: కొందరిలో ఐరిస్‌పై దుష్ప్రభావం పడవచ్చు. ∙ రెటీనా: తీవ్రమైన యూవీ కిరణాలు ప్రసరించడం వల్ల రెటీనా దెబ్బతినే ప్రమాదం ఉండవచ్చు. దీన్నే సోలార్ బర్న్ అంటారు. దీనివల్ల హఠాత్తుగా కనుచూపు తగ్గే ప్రమాదం ఉంది. సూర్యగ్రహణాన్ని నేరుగా చూస్తే కలిగే ప్రమాదం కూడా ఇలాంటిదే. ఈ వేసవిలో కంటికి రక్షణ ఎలాగంటే... ∙ మంచి మేలైన ప్రమాణాలతో ఉన్న సన్ గ్లాసెస్ వాడటం ద్వారా తీక్షణ కాంతి దుష్ప్రభావాలనుంచి కంటిని కాపాడుకోవచ్చు. అయితే తక్కువ ప్రమాణాలతో తయారు చేసే సన్– గ్లాసెస్ వల్ల కన్ను మరింతగా తెరచుకుని చూడటంతో కంటిలోకి హానికరమైన యూవీ కిరణాలు మరింతగా ప్రవేశించవచ్చు. అందుకే మంచి ప్రమాణాలతో... అంటే పాలీకార్బనేట్, ట్రైవిక్స్ వంటి మెటీరియల్‌తో తయారైన సన్‌గ్లాసెస్ వాడాలి. ∙ 100 శాతం లేదా 400 యూవీ పొటెక్షన్ (ఇవి 400 మైక్రాన్స్ వరకు వడపోస్తాయి) ఇచ్చే లేబుల్డ్ గ్లాసెస్ కూడా వాడవచ్చు. ∙ ఫ్రేమ్ అంచులు పెద్దవిగా ఉండే గ్లాసెస్ వాడటం వల్ల కంటి మూలల నుంచి కూడా యూవీ కిరణాలు లోపలికి ప్రసరించకుండా ఉంటాయి. అందుకే ఫ్యాషన్ పేరిట ఫ్రేమ్ తక్కువగా ఉండే వాటికంటే... ఒకింత ఫ్రేమ్ ఎక్కువగా ఉండే గ్లాసెస్ మరింత మేలు చేస్తాయి. ∙ కొందరు ఏ రంగు గ్లాసెస్ అయితే మేలు అని ప్రశ్నిస్తుంటారు. ఏ రంగు అన్నదానికి అంతగా ప్రాధాన్యం ఉండదు. ఎందుకంటే... ఏ రంగు అయినా అది పూర్తిగా రక్షణ ఇచ్చేలా ఉండాలి. ∙ పోలరైజ్డ్ సన్‌గ్లాసెస్ అంత సురక్షితమైనవి కావు. ఎందుకంటే... అవి కేవలం ఒక కోణంలోంచి (భూమికి సమాంతరంగా) వచ్చే కాంతి కిరణాల నుంచి మాత్రమే రక్షణ ఇస్తాయి. ∙ కాటరాక్ట్ సర్జరీ చేయించుకున్న వాళ్లు యూవీ ప్రొటెక్షన్ ఉన్న ఇంట్రా ఆక్యులార్ లెన్స్ (ఐఓఎల్స్)ను ఎంచుకోవాలి. ∙ కంటిపైన కాంతి నేరుగా పడకుండా అంచులు (బ్రిమ్) పెద్దవిగా ఉండే టోపీలు (హ్యాట్) ధరించడం మేలు. ∙ ఫొటో కెరటైటిస్ వంటి కండిషన్ ఉన్నవారు కాంటాక్ట్ లెన్స్‌లను వాడటం ఎంతమాత్రమూ సరికాదు. ఎందుకంటే అవి వాతావరణంలోని తీక్షణ కాంతితో పాటు యూవీ కిరణాలను 50 శాతం వరకు కంటిలోకి ప్రసరింపజేస్తాయి. ∙ ఎట్టి పరిస్థితుల్లోనూ సూర్యుడిని నేరుగా చూడకూడదు. మధ్యాహ్నం వేళల్లో వీలైనంతవరకు బయటకు వెళ్లకూడదు. ∙కంటిని ఎప్పటికప్పుడు చల్లని, శుభ్రమైన నీటితో కడుక్కోవడం మంచిది. ∙ తరచూ కంటిపరీక్షలు చేయించుకోవడం. వేసవిలో కనీసం ఒకసారైనా కంటిపరీక్షలు చేయించుకోవడం మంచిది. ముఖ్యంగా మధ్యవయసు దాటిన వారికి ఇది చాలా అవసరం. ∙నాసిరకం కళ్లజోళ్లలో అల్ట్రా వయొలెట్ కిరణాలను ఫిల్టర్ చేసే సామర్థ్యం ఉండకపోవచ్చు. అందుకే సమర్థంగా అల్ట్రా వయొలెట్ కిరణాలను వడపోసే నాణ్యమైన గ్లాసులు వాడటం మంచిది. ∙వాహనాలపై ప్రయాణం చేసేవారికి తీవ్రమైన కాంతితో పాటు, గాలిలో ఎగిరి వచ్చే ఫ్లైయింగ్ అబ్జెక్ట్స్ కారణంగా కూడా కంటికి ప్రమాదం కలిగే అవకాశం ఉంది. అందుకే రాత్రి వేళల్లోనూ కంటికి రక్షణ ఇచ్చే గ్లాసులు ధరించడం మంచిది. ∙ఇటీవల రకరకాల రంగుల అద్దాలు ఉన్న గ్లాసెస్‌ను ధరిస్తున్నారు. బ్లూ కలర్ ఉన్న గ్లాసులు అన్నిటికంటే చాలా ప్రమాదం. సాధ్యమైనంత రంగు అద్దాల కంటే వరకు డార్క్షేడ్లో నల్లటివే వాడటం మంచిది. ∙స్విమ్మింగ్‌పూల్‌లో ఈదేటప్పుడు తప్పక గాగుల్స్ వాడాలి. దీనివల్ల రెండు రకాలుగా రక్షణ దొరుకుతుంది. ఒకటి యూవీ కిరణాల నుంచి; మరొకటి స్విమ్మింగ్‌పూల్‌లోని కెమికల్స్ నుంచి. ∙చెమటతో నీళ్లు కళ్ల మీదికి జారినప్పుడు కళ్లను నలపకూడదు. ∙కళ్లు పొడిబారకుండా... డాక్టర్ సలహా మేరకు ఆర్టిఫిషియల్ టియర్స్, లూబ్రికెంట్స్ వాడటం మంచిది. ∙ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే మంచి పోషకాహారం తీసుకోవడం అన్నది అన్ని సీజన్లతో పాటు ఈ వేసవిలో మరీ ఎక్కువ అవసరం. విటమిన్–ఏ ఎక్కువగా ఉండే తాజాపండ్లు, కూరగాయలు ఒంటితో పాటు కంటికీ మేలు చేస్తాయి. ∙ కంటినిండా నిద్రపోవాలి. ∙ పొగతాగకూడదు. ∙ అవసరమైనప్పుడు గదిలో తేమశాతాన్ని పెంచే హ్యుమిడిఫైయర్స్ వాడుకోవచ్చు. పిల్లల్లో ముప్పు మరీ ఎక్కువ... సాధారణంగా కాంతి మన కంటిలోకి కాంతి ప్రవేశించగానే మన ఐరిస్/ప్యూపిల్ (కంటిపాప) కాస్తంత ముడుచుకుపోతుంది. కాంతి తీవ్రతను బట్టి కంటికి రక్షణ కలిగించడం కోసం ప్రకృతి మనలో ఇలాంటి నిర్మాణాన్ని ఏర్పాటు చేసింది. అందుకే తీవ్రమైన కాంతిలోకి వచ్చినప్పుడు మనం కనురెప్పలను కాస్త మూసి, చికిలించి చూస్తుంటాం. బయటి కాంతికి మన కన్ను అడ్జెస్ట్ అయ్యేవరకు ఇలా జరగడం మనందరికీ అనుభవమే. అలాగే బయటి నుంచి కాంతి తక్కువ ఉండే ప్రదేశానికి వెళ్లినప్పుడు కూడా కాసేపు మనకు కనపబడదు. మనం ఆ కాంతికి అడ్జెస్ట్ అయ్యాక మనకు చిరుచీకట్లోనూ కనిపిస్తుంది. దీనికి కారణం... కంటిపాప విశాలంగా విప్పారడమే. అయితే చిన్నపిల్లల్లో కంటి పాప సైజ్ ఎక్కువ. పైగా లెన్స్ ట్రాన్స్పరెంట్గానూ, క్లియర్గానూ ఉంటుంది. పైగా చిన్నపిల్లలు ఆరుబయట ఎండల్లో ఎక్కువగా ఆడుతుంటారు. అందుకే పిల్లల్లో కంటిపై పడే దుష్ప్రభావాలు ఎక్కువ. ఇంకా ఎవరెవరిలో... ∙ కాటరాక్ట్ సర్జరీ చేసుకొని, యూవీ ప్రొటెక్షన్ లేని ‘ఇంట్రా ఆక్యులార్ లెన్స్’ వాడిన వారిలో ఈ యూవీ కిరణాల వల్ల దుష్ప్రభావాలు ఎక్కువ. ∙ యూవీ ప్రొటెక్షన్ లేని కాంటక్ట్ లెన్స్ వాడేవారిలోనూ దుష్ప్రభావాలు ఎక్కువ; ∙ టెట్రాసైక్లిన్ వంటి యాంటీబయాటిక్స్ వాడేవారు, గర్భనిరోధక మాత్రలు వాడే మహిళల్లో, యాంటీ మలేరియా మందులు వాడే వారితోపాటు, ఇబూప్రొఫేన్ వంటి నొప్పి నివారణ మందులు వాడే వారిలో యూవీ ప్రభావం వల్ల కలిగే దుష్ప్రభావాలు ఎక్కువ. మరీ ఎక్కువ ప్రమాదం జరిగే అవకాశాలు ఎప్పుడంటే... ∙కొందరు తమ వృత్తిరీత్యా చాలా ఎక్కువ కాంతికి ఎక్స్పోజ్ అవుతుంటారు. వారు సాధారణం కంటే చాలా ఎక్కువ కాంతిలో పనిచేస్తుంటారు. ఉదాహరణకు డ్రైవర్లు చాలా తీవ్రమైన కాంతిని అదేపనిగా చూడాల్సి వస్తుంది. అలాగే వేసవిలో పట్టపగలు తీవ్రమైన కాంతిలో తిరిగే సేల్స్ రిప్రజెంటేటివ్స్, నిర్మాణరంగంలోని పనివారు, రైతులు, కూలీలు వంటివారు చాలా ఎక్కువ కాంతికి ఎక్స్పోజ్ అవుతుంటారు. పైన పేర్కొన్న అనర్థాలు వీళ్లలో చాలా ఎక్కువ. ∙ఇక అత్యంత ఎక్కువ కాంతిని రిఫ్లెక్ట్ చేసే నీటి ఉపరితలానికి దగ్గరగా ఉండే... నదీప్రాంతాలు, సముద్రజలాల ఒడ్డులు (బీచ్‌ల) వంటి చోట్ల తిరుగాడేవారికి; ∙కాంతి తీక్షణత ఎక్కువగా ఉండే ప్రాంతాలైన భూమధ్యరేఖకు దగ్గరగా ఉండే ప్రాంతాల వారికీ; ∙అలాగే చాలా ఎల్తైన పర్వతసానువుల్లాంటి (హిల్లీ ఏరియాస్) ప్రదేశాల్లో ఉండేవారికీ; ∙ తెల్లని దేహఛాయతో ఒంట్లో, కంట్లో మెలనిన్ తక్కువగా ఉండే వారికి, చిన్నపిల్లల్లో... కాంతికారణంగా కంటిపై దుష్ప్రభావాలు పడే అవకాశం ఎక్కువ. డాక్టర్ రవికుమార్ రెడ్డి కంటి వైద్య నిపుణులు,మెడివిజన్ ఐ హాస్పిటల్,హైదరాబాద్. -
డేంజర్ బెల్
-
డేంజర్ బెల్
-
డేంజర్ బెల్
-
బెజవాడ చాలా హాట్ గురూ!
సూరంపల్లిలో సిపెట్ శంకుస్థాపనలో పాల్గొన్న కేంద్ర మంత్రులు అనంతకుమార్, వెంకయ్యనాయుడు, రాష్ట్ర మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమా శుక్రవారం నాటి ఎండ తీవ్రత, ఉక్కపోతతో నానా అవస్థలు పడ్డారు. వేదికపై చాలా ఏసీలూ ఏర్పాటుచేసినా భానుడి ప్రతాపం ముందు తెల్లముఖం వేశాయి. -
ఎండల తీవ్రత తగ్గుముఖం
పలుచోట్ల వర్షాలు.. బయ్యారంలో 6 సెంటీమీటర్ల వర్షం హైదరాబాద్: ప్రచండ భానుడి భగభగలతో విలవిలలాడిన జనం మెల్లగా ఊపిరి పీల్చుకుంటున్నారు. రాష్ట్రంలో ఎండ తీవ్రత తగ్గుముఖం పడుతోంది. మంగళవారం నిజామాబాద్‌లో అత్యధికంగా 43.3 డిగ్రీ సెల్సియస్‌ల ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్, ఆదిలాబాద్‌ల్లో అత్యధికంగా 41.2, రామగుండం, కంపాసాగర్, రుద్రూరు 40, అశ్వారావుపేట 35, జగిత్యాల 39.4, సంగారెడ్డి 39.3, తాండూరు 39.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్, రామగుండం, నిజామాబాద్‌ల్లో మాత్రమే సాధారణం కంటే అదనంగా రెండు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు అక్కడక్కడా వర్షాలు కురిశాయి. గత 24 గంటల్లో (సోమవారం) ఖమ్మం జిల్లా బయ్యారంలో 6, సత్తుపల్లి, గార్ల, డోర్నకల్‌లలో 4, గుండాల, జూలురుపాడుల్లో 2 సెంటీమీటర్ల చొప్పున కురిసింది. -
రాష్ట్రంలో తగ్గని ఎండలు
వడదెబ్బతో 161 మంది మృతి నెట్వర్క్: రాష్ట్రంలో గురువారం కూడా ఎండల తీవ్రత తగ్గలేదు. మరో వైపు వడదెబ్బ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 161 మంది మృతి చెందారు. వరంగల్ జిల్లాలో అత్యధికంగా 37 మంది ప్రాణాలు కోల్పోయారు. ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో అత్యధికంగా 48.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వడదెబ్బ కారణంగా ఆదిలాబాద్ జిల్లాలో ఆరుగురు, కరీంనగర్ జిల్లాలో 32 మంది, మెదక్ జిల్లాలో 10 మంది, మహబూబ్‌నగర్‌లో 8 మంది, నిజామాబాద్‌లో 10 మంది, నల్లగొండలో 25 మంది, ఖమ్మంలో 23 మంది, హైదరాబాద్ జిల్లాలో ఆరుగురు, రంగారెడ్డిజిల్లాలో ఆరుగురు మృత్యువాతపడ్డారు. ఖమ్మం జిల్లా ఇల్లెందులో 48 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదుకాగా, ఇదే జిల్లాలో సత్తుపల్లి, మణుగూరుల్లో 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వరంగల్ నగరంలో 43 డిగ్రీలు నమోదుకాగా, నిజామాబాద్‌లో 44.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్‌లో 42.5 డిగ్రీలు నమోదైంది. ఇదిలా ఉండగా ఖమ్మం జిల్లాలో పలుచోట్ల గురువారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. నల్లగొండలో కూడా అక్కడక్కడ జల్లులు కురిశాయి. ఏపీలో కొనసాగుతున్న మరణాలు విజయవాడ బ్యూరో: ఏపీలోవాతావరణం కాస్త చల్లబడినప్పటికీ వడగాల్పుల కారణంగా వృద్ధులు మరణిస్తూనే ఉన్నారు. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా వడదెబ్బకు గురై 193 మంది మరణించారు. -
ఎండ వేడిని సురక్షితంగా ఎదుర్కోవడం తెలుసా?
సెల్ఫ్ చెక్ ఎండ తీవ్రత ఎక్కువవుతోంది. నమోదవుతున్న ఉష్ణోగ్రత వివరాలు నిర్ధారణ చేస్తున్న ఈ పరిణామానికి కారణం పర్యావరణ సమతుల్యం దెబ్బతినడమే. ఎండకాలం వస్తుందంటే చిన్న పిల్లలు, పెద్దవాళ్లు ఉన్న ఇంట్లో ఆందోళన మొదలవుతుంటుంది. ఈ వేసవిని ఎదుర్కోవడం ఎలా? ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ఈ కాలాన్ని గడపగలమా? అని బెంగ కూడా ఉంటుంది. వేసవిని సంతోషంగా, ఆనందంగా ఆస్వాదించాలంటే మనకు తెలిసిన కొన్ని జాగ్రత్తలు పాటిస్తే చాలు. వాటిలో మీకు తెలిసినవెన్నో ఒకసారి చెక్ చేసుకోండి. 1. వేసవిలో నీటిఎద్దడిని ఎదుర్కోవడానికి, భూగర్భజలం తగ్గకుండా కాపాడుకోవడానికి ఇంటి ఆవరణలో నీరు ఇంకేటట్లు జాగ్రత్తలు తీసుకుంటారు. ఎ.అవును బి. కాదు 2. ఇంటిని చల్లబరుచుకోవడానికి ఏసీ కంటే వట్టివేరు తడికలను కర్టెన్లుగా వేయడం మంచిదని తెలుసు. ఎ.అవును బి. కాదు 3. ఇండోర్ ప్లాంట్లు ఇంటిని చల్లబరుస్తాయి. కాబట్టి ఈ కాలంలో తప్పనిసరిగా కొన్ని కుండీలను ఇంట్లో పెడతారు. ఎ.అవును బి. కాదు 4. వడదెబ్బ బారిన పడకుండా ఉండడానికి మజ్జిగ, నిమ్మరసం, కొబ్బరినీళ్లు, బార్లీ వాడతారు. ఎ.అవును బి. కాదు 5. సన్ట్యానింగ్ నుంచి రక్షణ కోసం చందనం, దోస గుజ్జు వంటి ఫేస్ ప్యాక్‌లను వేసుకుంటారు. ఎ.అవును బి. కాదు 6. కర్జూరం వంటి డ్రైఫ్రూట్స్‌ను నానబెట్టి తీసుకోవడం మంచిదని తెలుసు. ఎ.అవును బి. కాదు 7. సీజన్లో ఫ్లవర్ వాజ్‌కు బదులుగా నీరు ఎక్కువగా పట్టే వెడల్పాటి ఫ్లవర్ బౌల్స్‌తో ఇంటిని అలంకరిస్తారు. ఎ.అవును బి. కాదు పై వాటిల్లో ఐదింటికి అవును అన్నది మీ సమాధానమైతే మీకు వేసవి జాగ్రత్తలపై మంచి అవగాహన ఉందని అర్థం. -
మట్టి మహిమ..
మట్టి కొట్టు టెక్నాలజీ, తీరిక లేనితనం, యాంత్రిక జీవనం తదితర కారణాలతో పాత పద్ధతులకు దూరమైన నగ ర జనం క్రమేణా అందులో ఉన్న గొప్పతనాన్ని గుర్తించడం మొదలుపెట్టారు. పెద్దల మాటలు, చేతలు అవి చేసే మేళ్లను ఒంట పట్టించుకుంటున్నారు. చేల గట్ల వెంబడి పారిన నీటిని తాగిన కాలం నుంచి మినరల్ వాటర్ లేనిదే ఉండలేని స్థితికి చేరుకున్న దశలను కాదనుకుని మట్టిలోని మాధుర్యాన్ని అనుభవించేందుకు సిద్ధమవుతున్నారు. ఒళ్లంతా బురదను పులుముకొని ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందుతున్నారు. బురదకు, ఆరోగ్యానికి లింకేమిటని ఆలోచిస్తున్నారా..? ఖచ్చితంగా ఉంది. సబ్బులు, షాంపూలు, కుంకుడు కాయలు కూడా లేని రోజుల్లో ఊరి బయటకు వెళ్లి అక్కడ లభించే రేగడి మట్టినేరుద్దుకుని స్నానం చేసేవారు. ఆ మట్టి స్నానం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని ప్రకృతి వైద్యశాస్త్రం చెబుతోంది. ఈ వేసవి నుంచి ఉపశమనాన్ని, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందేందుకు నేచర్‌క్యూర్ ఆస్పత్రుల్లో మడ్‌బాత్ (మృత్తిక స్నానం)ను ఆశ్రయిస్తున్నారు నగరవాసులు. కేవలం మడ్‌బాత్ కోసమే రోజుకు 20-25 మంది నేచర్‌క్యూర్ ఆస్పత్రికి వస్తున్నారు. - సనత్‌నగర్ కాలానుగుణంగా చికిత్స... పంచభౌతికమైన శరీరానికి మట్టితో ఇక్కడ చికిత్స చేస్తున్నారు. మట్టిని పట్టీలుగా గానీ, రోగగ్రస్థమైన అవయవంపై లేపనంగా గానీ పూయడం వల్ల ఉపశమనం లభిస్తుంది. ఈ చికిత్సను రోగిని అనుసరించి గానీ, వాతావరణం, కాలాలను అనుసరించి గానీ తీసుకోవాల్సి ఉంటుంది. ఎండ తీవ్రతను బట్టి మృత్తిక చికిత్సలు ఉంటాయి. ఈ చికిత్సకు జిగురుతత్వాన్ని కలిగిన బంక మన్ను (రేగడి మన్ను)ను ఉపయోగిస్తారు. రోగమేదైనా పట్టీ ఒక్కటే... ► సహజంగా మట్టిపట్టీని రోగి ఉపవాస కాలంలో రోజుకు రెండుసార్లు (ఉదయం 6 గంటలు, మధ్యాహ్నం 3 గంటలకు) వేయడం ద్వారా శరీరంలోని ఉష్ణోగ్రత మామూలు స్థితికి వస్తుంది. ఠఎంతటి తీవ్రమైన జ్వరమొచ్చినా రెండు మూడు రోజుల్లో తగ్గించే శక్తి మట్టిపట్టీలకు ఉంటుంది. ►పేగుల్లో మండనం (మురుగు) లేకుండా చేస్తుంది. ఆంత్రవ్రణములు, అమీబియాసిస్ తదితర వ్యాధులకు మట్టి పట్టీలు రోజుకు రెండు నుంచి మూడుసార్లు వేసుకోవడం ద్వారా కొద్దిరోజులకే తగ్గుతాయట. మందులు వాడాల్సిన అవసరం అసలే ఉండదు. ఠచీము, రక్త విరేచనాలు, నీళ్ల విరేచనాలు ఒకటి రెండు రోజుల్లో నివారించవచ్చు. ►మహిళలకు వచ్చే గైనిక్ ప్రాబ్లమ్స్‌కు మట్టిపట్టీలు రోజుకు మూడు లేదా నాలుగుసార్లు రెండు గంటల వ్యవధి చొప్పున వేసుకోవడం ద్వారా సత్ఫలితాలు ఉంటాయని ప్రకృతి వైద్య నిపుణులు చెబుతున్నారు. మూత్రం రాకుంటే మట్టి లేపనం... నానిన రేగడిమట్టిని ఇక అంగుళం మందంతో పొట్ట భాగంలో లేపనం చేస్తారు. దీని ద్వారా మలబద్దకం, జ్వరం, అతి విరేచనాలు, రక్త గ్రహణి, ఆంత్రవ్రణములతో బాధపడుతున్న వారు ఉపశమనం పొందవచ్చు. మూత్రం మంటగా ఉన్నప్పుడు పొత్తి కడుపుపై మట్టి గానీ, మట్టిపట్టీలు గానీ వేయడం వల్ల మంట వెంటనే తగ్గుతుంది. మూత్రం రానిచో పొత్తి కడుపును కాపడం చేసి మట్టిపట్టీలు గానీ, మట్టి లేపనం గానీ చేసినట్లయితే సత్ఫలితాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. పక్షవాతం, పోలియోలకూ... రోగిని ఒక స్టూలుపై కూర్చోబెట్టి బాగా నానిన రేగడి మట్టిని కాళ్లకు, చేతులకు లేపనం చేసి 10 నిమిషాల తరువాత స్నానం చేయించాలి. దీని ద్వారా కండరవాతం, మేహవాతం, చేతులు, కాళ్ల మంటలు, పగుళ్లు తీపులు, వాపులు తదితర సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ముఖ్యంగా సంధివాతం, పక్షవాతం, పోలియో తదితర వ్యాధులతో బాధపడుతున్న వారికి ఈ చికిత్స ఎంతో ఉపకరిస్తుందని వైద్యులు చెబుతున్నారు. నవ నాడులను ప్రేరేపిస్తుంది వీపుభాగంలో, నడుముకు అంగుళం మందంతో నానిన మట్టిని లేపనం చేసి 10 నిమిషాలు ఉంచిన తరువాత మట్టిని తీసివేసి స్నానం చేయించాలి. వెన్ను దేహమునకు కేంద్ర స్థానం కావడం వల్ల మెదడును, నవ నాడులను చల్లబరిచి చురుకుగా పనిచేసేలా మట్టి లేపనం ఎంతో సహాయపడుతుంది. గుండెజబ్బులైనా సరే.. రోగిని బల్లపై గానీ, నేలపై గానీ పడుకోబెట్టి ఒక అంగుళం మందంతో ఛాతి భాగమంతా మట్టి లేపనం చేస్తారు. దీని ద్వారా ఛాతినొప్పి, మంట, గుండె జబ్బులు, రక్తపోటు తదితర వ్యాధులతో బాధపడుతున్నవారు ఉపశమనం పొందవచ్చు. తలను నీటితో తడిపి నానిన రేగడిమట్టిని పూస్తారు. 15 నిమిషాల పాటు ఎండలో ఉన్న తరువాత శిరస్నానం చేయాలి. పురుషులే కాకుండా స్త్రీలు కూడా ఈ రకమైన తలమట్టి స్నానం చేయవచ్చు. దీని ద్వారా తలలో ఉండే చుండ్రు, జుట్టు ఊడిపోవడం, పండిపోవడం, పేలు కొరుకుడు, తలనొప్పి, కళ్ల మంటలు, నీరుకారడం, దృష్టి లోపం, కంటి, చెవి, ముక్కు వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చని వైద్యులు చెబుతున్నారు. అలాగే ఉన్మాదం, హిస్టీరియా, నిద్రలేమితనంతో బాధపడేవారికి ఎంతో ఉపయోగం. తల నుంచి పాదాల వరకు శరీరం మొత్తం నానిన రేగడి మట్టిని పూసుకుని 30 నిమిషాల తరువాత మట్టిని తీసివేసి స్నానం చేయాలి. మృత్తిక స్నానం వల్ల అన్ని రకాల చర్మవ్యాధులు, మొటిమలు మొదలుకొని గజ్జి, తామర, నల్లమచ్చలు, ఎర్రమచ్చలు, తెల్ల మచ్చలు, తెల్ల పొడలు, మేహం, దారుణం, అతి ఉష్ణం, కుష్టు, చర్మం పగుళ్లు తదితర అన్ని చర్మ వ్యాధుల నివారణకు మృత్తికా స్నానం ఎంతో ఉపయోగపడుతుంది. పాము కాటుకు భూగర్భ స్నానం... తల బయట ఉంచి భూమిలో శరీరం మొత్తాన్ని గానీ, వ్యాధి సోకిన అవయవాన్ని గానీ 10 నుంచి 30 నిమిషాల వరకు ఉంచడమే భూగర్భ స్నానం. దీని ద్వారా పక్షవాతం, పోలియో, కండరవాతం, సంధివాతం, గూని, పోలియో, చర్మవ్యాధులు, కుష్టు, బొల్లి తదితర రోగాలను నయం చేయొచ్చని వైద్యులు చెబుతున్నారు. పాముకాటుకు ఈ స్నానం ఎంతగానో ఉపయోగపడుతుందట. పాము కరిచినప్పుడు రోగిని అడ్డంగా అరగజం లోతు గొయ్యి తవ్వి తల బయటకు ఉంచి మట్టితో కప్పి కొన్ని గంటల వరకు ఉంచితే పాము విషం హరిస్తుందని వైద్యులు చెబుతున్నారు.భూమిలోని అయస్కాంత శక్తితో పాటు సేంద్రీయ లవణాల వల్ల శరీరంలోని ఎన్నో రోగాలు నివారించ వచ్చంటున్నారు. వేసవిలో ఆదరణ బాగుంటుంది... వేసవిలో మడ్‌బాత్‌కు ఎంతో ఆదరణ ఉంటుంది. ఎందుకంటే సూర్యరశ్మి ఉన్నప్పుడే మడ్‌బాత్ చేయాలి. దీని ద్వారా వేసవి తాపం నుంచి ఉపశమనం పొందడంతో పాటు ఒంట్లోని ఎన్నో రకాల రుగ్మతలను తొలగించుకోవచ్చని ప్రకతి వైద్య శాస్త్రం ద్వారా నిరూపితమైంది. అయితే వైద్యుల పర్యవేక్షణలో చేసుకోవాల్సి ఉంటుంది. నేచర్‌క్యూర్‌లో రోజుకు 20 మంది వరకు మడ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. మంగళ, గురు, శనివారాల్లో మహిళలకు, సోమ, బుధ, శుక్ర వారాల్లో పురుషులకు మృత్తిక చికిత్స చేస్తున్నాం. డాక్టర్ ఎంవీ మల్లికార్జున్, సూపరింటెండెంట్, నేచర్‌క్యూర్ ఆస్పత్రి, అమీర్‌పేట్ -
మండుతున్న సూరీడు
సోమవారం 38.3 ఎండ నుంచి ఉపశమనం పొందడం ఇలా.. వీలైనప్పుడల్లా నీళ్లు తాగుతుండాలి. తెల్లని కాటన్ దుస్తులు వేసుకోవాలి. ఎండలో ద్విచక్ర వాహనంపై వెళ్లాల్సి వస్తే కళ్లకు అద్దాలు పెట్టుకోవాలి. తలకు టోపీ ధరించాలి. నడిచి వెళ్లే వారు గొడుగులు వాడాలి. రోడ్లల్లో ఎవరితోనైనా మాట్లాడాల్సి వస్తే చెట్లకింద, లేదా నీడ ఉండే ప్రదేశాల్లో నిలబడాలి. తిరుపతి తుడా: సూరీడు నిప్పులు కురిపిస్తున్నాడు. రోజు రోజుకూ ఎండలు తీవ్రమవుతున్నాయి. జనం అడుగు బయటపెట్టేందుకు భయపడిపోతున్నారు. ఉక్కపోత ఉక్కిబిక్కిరి చేస్తూ ఊపిరాడకుండా చేస్తోంది. ఉదయం 7 గంటల నుంచే భానుడు భగభగలాడుతున్నాడు. సాయంత్రం 5 గంటల వరకు ఎండ తీవ్రత తగ్గడం లేదు. మధ్యాహ్నం సమయంలో ప్రజలు బయటకు రావాలనే సాహసం చేయడం లేదు. వడగాల్పుల దాటికి భయపడుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వచ్చిన వారు తిరిగి ఇంటికి వెళ్లే సమయానికి నీరసించిపోతున్నారు. కొందరు అవగాహన లేకుండా ఎండల్లో తిరుగుతూ అనారోగ్యం పాలవుతున్నారు. భవన నిర్మాణ కార్మికులు, ఉపాధి కూలీలు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. జనం దూర ప్రయాణాలు చేసేందుకు సాహసించడం లేదు. ఇప్పటికే జిల్లాలో పది మందికి పైగా వడదెబ్బకు మృతి చెందారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణులు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వడదెబ్బ తగిలితే.. శరీరంలో ఎక్కువ వేడి ఉత్పత్తి కావడం, శరీరం ఉష్ణాన్ని కోల్పోవడంతో వడదెబ్బ తగులుతుంది. తీవ్రస్థాయిలో వడదెబ్బ తగిలితే ప్రాణాలకే ప్రమాదం కలుగుతుంది. తలనొప్పి, తలతిరగడం, చర్మం ఎండిపోవడం, విపరీతంగా జ్వరం రావడం, మగత, కలవరింతలు, పిట్స్, పాక్షిక లేదా పూర్తి అపస్మారక స్థితికి చేరుకోవడం వడదెబ్బ లక్షణాలు. వడదెబ్బ తగిలిన వ్యక్తిని వెంటనే నీడ ఉన్న ప్రదేశానికి చేర్చాలి. తక్షణం వైద్యం చేయించాలి. ఎన్ని నీళ్లు తాగితే అంత మంచిది ఎండా కాలం ఎన్ని నీళ్లుతాగితే అంత మంచిది. ఎండ తీవ్రతకు శరీరంలో నీటిశాతం తగ్గుతుంది. చెమట రూపంలో బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నీళ్లు ఎక్కువగా తీసుకోవాలి. ముఖ్యంగా చిన్న పిల్లలు, గర్భిణిలు, వృద్ధులు జాగ్రత్తలు తీసుకోవాలి. పళ్ల రసాలు తీసుకోవాలి. కర్బజా, దోస వంటి పండ్లను తినాలి. పిల్లల్ని ఎండల్లో తిరగకుండా చూసుకోవాలి. ఐస్‌క్రీంలు, శీతలపానీయాలు తీసుకోకూడదు. ఇంట్లో దొరికే మజ్జిగ, నిమ్మ రసం తరచూ తీసుకుంటే మంచిది. మాంసాహారాన్ని వీలైనంత వరకు దూరం చేయాలి. -డాక్టర్ కృష్ణప్రశాంతి, జనరల్ ఫిజీషియన్, తిరుపతి. -
చెండాడే ఎండ..!
వైల్డ్ సమ్మర్... చైల్డ్ కేర్! వేసవిలో స్కూళ్లకు సెలవలు వచ్చేది ఎందుకు? తాము ఎండలో ఆడుకునేందుకే అనేది పిల్లల మాట. ఎండాకాలం మొదలు కాగానే... ‘ఒరేయ్... ఎండలోకి వెళ్లకు’ అన్న అరుపులు ప్రతి ఇంటా వినిపిస్తుంటాయి. కానీ... వింటే వాళ్లు పిల్లలెందుకవుతారు? క్రికెట్ ఆడే కుర్రకారుకు... షాట్‌ను లాగికొట్టాక దిగంతపు బౌండరీలైన్‌కు అవతలకు కుంగిపడేపోయే ముందు ఎర్రటి గ్లేజ్బాల్లా ఆకాశంలో కనిపిస్తుంటాడు సూర్యుడు. అదే వాలిబాల్ ఆడేవాళ్లకు మాత్రం మునివేళ్లతో ఎగరేశాక సరిగ్గా నెట్ మీద ఉన్నట్లు కనిపిస్తాడు మాధ్యందిన మార్తాండుడు.అందుకే పిల్లలకు ఎండ తెలీదూ, దాని ప్రభావం తెలియదు. కానీ డాక్టర్లకు తెలుసు. పిల్లల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు తల్లిదండ్రులకూ తెలియాలి. ఎండల తీవ్రతతో పెద్దలకంటే పిల్లలకే ఎక్కువ ప్రమాదం... ఆటల్లో మునిగిపోయిన పిల్లలకు ఎండ తీవ్రత అర్థం కాదు. అందునా ఏ క్రికెట్లోనో, మరే కబడ్డీలోనో నిమగ్నమైపోతే వాళ్లకు అసలు ఎండ అనేది ఒక సమస్యే కాదు. కానీ అంత ఎండలో ఆడుతున్నప్పుడు పిల్లలకు వడదెబ్బ మొదలుకొని, డీహైడ్రేషన్ వరకు ఎన్నో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఎండ తీవ్రతతో ఎదుర్కొనే ఇబ్బందులివే... మజిల్ క్రాంప్స్ : క్రికెట్ ఆడే సమయంలో ఆటగాళ్లకు కండరాలూ, పిక్కలు పట్టేసి ఒక్కోసారి ఆటస్థలం నుంచి నిష్ర్కమిస్తుండటం తెలిసిన విషయమే. దీనికి కారణం... శరీరం తన జీవక్రియలను కొనసాగించడానికి మెదడు నుంచి ప్రతి నరానికీ ఆదేశాలందాలి. ఈ ఆదేశాలన్నీ లవణాలలోని విద్యుదావేశం కలిగిన అయాన్ల రూపంలో నరాల ద్వారా ప్రసరించి, కండరాలకు ఆదేశాలిస్తాయి. ఎండవేడిమి తీవ్రతతో నీటిని తీవ్రంగా కోల్పోయి, దాంతో పాటూ లవణాలనూ కోల్పోవడం వల్ల నరాల ద్వారా మెదడునుంచి కండరాలకు సరైన ఆదేశాలందవు. దాంతో నీరు కోల్పోయి డీ-హైడ్రేషన్‌కు గురి కాగానే... కండరాలు బిగుసుకు పోతాయి. వీటినే మజిల్క్రాంప్స్గా అభివర్ణిస్తారు. ఇలా మజిల్క్రాంప్స్కు గురైనప్పుడు శరీరం కోల్పోయిన నీటిని భర్తీ చేయాలి. మజిల్ క్రాంప్స్ వస్తే చికిత్స: పిల్లలకు మజిల్క్రాంప్స్ వచ్చి, వాళ్ల కండరాలు బిగదీసుకుపోతుంటే వారికి ‘ఓరల్-రీ-హైడ్రేషన్ (ఓఆర్ఎస్) ద్రావణాన్ని తాగించాలి. ఒకవేళ అది లభ్యం కాకపోతే తయారు చేసుకోవడం చాలా సులభం. ఒక లీటరు నీళ్లలో చిటికెడంత ఉప్పు, చారెడంత పంచదార వేసి బాగా కలిపి కూడా అప్పటికప్పుడు ఓరల్ రీ హైడ్రేషన్ ద్రావణాన్ని తయారు చేసి తాగించాలి. మనం తయారు చేయించాల్సిన అవసరం లేకుండానే అన్ని మెడికల్ దుకణాలలోనూ ఓఆర్ఎస్ ద్రావణపు పౌడర్ ఎన్నో ఫ్లేవర్లలో లభ్యమవుతోంది. ఓఆర్ఎస్ అందుబాటు లేక... ఒకవేళ కొబ్బరినీళ్లు అందుబాటులో ఉంటే అవి కూడా తాగించవచ్చు.ఓఆర్‌ఎస్‌గానీ, కొబ్బరినీళ్లుగానీ అందుబాటులో లేకపోతే... ఒక అరటిపండు తినిపించి, మంచినీళ్లు తాగించాలి. అరటిపండులో పొటాషియం వంటి లవణాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి అరటిపండు, నీటితో అవి చాలావరకు భర్తీ అవుతాయి. వడదెబ్బ : వినడానికి పెద్ద ప్రమాదకరంగా అనిపించకపోయినా ఒక్కోసారి ప్రాణాంతకం అయ్యే పరిస్థితే ఈ వడదెబ్బ. మన శరీర జీవక్రియలన్నీ సక్రమంగా జరగడానికి అవసరమైన ఉష్ణోగ్రత 98.4 డిగ్రీల ఫారెన్‌హీట్. కానీ పిల్లలు వడదెబ్బకు లోనైతే వారి శరీర ఉష్ణోగ్రత అకస్మాత్తుగా పెరిగిపోతుంది. దాంతో పాటు మరిన్ని లక్షణాలు కనిపిస్తాయి. అవి... వికారం వాంతులు కళ్లు తిరగడం నీరసం స్పృహతప్పడం; ఫిట్స్ రావడం చివరగా కోమాలోకి వెళ్లడం జరగవచ్చు. ఒంటి ఉష్ణోగ్రత 104 డిగ్రీ ఫారెన్‌హీట్‌కు చేరడం. శరీర ఉష్ణోగ్రత ఈ స్థాయికి పెరిగితే అది మెదడు, గుండె, మూత్రపిండాలు, కాలేయం వంటి కీలకమైన అవయవాల పనితీరును తీవ్రంగా దెబ్బతీస్తుంది. అందుకే అలా జరిగినప్పుడు శరీర ఉష్ణోగ్రతను మళ్లీ సాధారణ స్థాయికి (నార్మల్కు) తీసుకోరావడం అవసరం. వడదెబ్బకు చికిత్స: ఒంటి ఉష్ణోగ్రత 100 ఫారెన్‌హీట్‌కు మించుతున్నట్లు తెలియగానే వెంటనే పిల్లలను చల్లటి గాలి సోకేలా ఫ్యాన్ కింద ఉంచాలి. (ఫ్యాన్ కింద వేడిగాలి వస్తుంటే అలాంటి చోటకు తీసుకెళ్లినా ప్రయోజనం ఉండదు). దుస్తులను వదులు చేసి, ఒంటికి చల్లగాలిని బాగా తగలనివ్వాలి. ఒకవేళ బట్టలు ఇబ్బందికరంగా ఉంటే నడుముకు చిన్న ఆచ్ఛాదన ఉంచి, బట్టలన్నీ తీసేయాలి.ఈ జాగ్రత్తల తర్వాత కూడా శరీర ఉష్ణోగ్రత తగ్గకపోతే పిల్లల చంకల కింద / గజ్జల వద్ద ఐస్ గడ్డలను ఉంచాలి. దాంతో ఒళ్లు చల్లబడుతుంది. అప్పటికీ శరీర ఉష్ణోగ్రత తగ్గకపోతే, దాన్ని మెడికల్ ఎమర్జెన్సీగా గుర్తించి వెంటనే ఆసుపత్రికి తరలించాలి. కేస్ స్టడీ... ఇటీవలే వడదెబ్బ తగిలిన రమేశ్ అనే ఓ అబ్బాయిని దాదాపు కొలాప్స్ అయిన దశలో మా హాస్పిటల్‌కు తీసుకొచ్చారు. మరికాస్త ఆలస్యం అయితే ఎంతో ప్రమాదం జరిగి ఉండేది. ఆ సందర్భంలో మేం ఎంతో అప్రమత్తతతో వ్యవహరించి ఆ ప్రమాదాన్ని నివారించాం. ఎండ తాలూకు దుష్ర్పభావాల నివారణ ఇలా... ఎండవేళలల్లో పిల్లలు ఎండకు వెళ్లకుండా ఇంట్లోని చల్లటి జాగాల్లోనే ఆడుకునేలా ప్రోత్సహించాలి. ఎండవేళల్లో ఇన్డోర్ గేమ్స్‌కు మాత్రమే వారిని పరిమితం చేయాలి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వారిని ఇంట్లోనే ఉండేలా చూడాలి. పిల్లలు నీడలో ఉన్నా... ఒకవేళ ఆ నీడ ఉన్న గది ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే నీడపట్టున ఉన్నా పిల్లలకు వడదెబ్బ తగలవచ్చు. అందుకే పిల్లలను ఒకింత చల్లగా ఉండే ప్రదేశంలోనే ఉంచాలి. ఆటల్లో పూర్తిగా నిమగ్నమైపోయిన పిల్లలు తరచూ మంచినీళ్లు తాగకపోవచ్చు. అందుకే తరచూ వారిని పిలుస్తూ కాస్త కాస్త మంచినీళ్లు పట్టిస్తూ ఉండాలి. మధ్యమధ్యలో కొబ్బరినీళ్లు, పళ్లరసాలు ఇవ్వాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే... పిల్లలకు ఎండదెబ్బ తాలూకు దుష్ర్పభావాలనుంచి రక్షించుకోవచ్చు. దాంతో పాటు నట్టింట్లో పిల్లల సందడినీ ఆస్వాదించవచ్చు. సాయంత్రం చల్లబడ్డ తర్వాతనే వాళ్లకు గల్లీ క్రికెట్, ఇరత ఔట్‌డోర్ గేమ్స్‌కు అనుమతించాలి. -
ఎండః 40.6 డిగ్రీలు
నేడు,రేపు 42 డిగ్రీలకు చేరుకునే అవకాశం సిటీబ్యూరో: భానుడు భగ్గుమంటున్నాడు. గ్రేటర్‌పై నిప్పులు కురిపిస్తున్నాడు. రోజురోజుకూ ఎండలు తీవ్రమవుతున్నాయి. ప్రజలు అడుగు బయట పెట్టేందుకే భయపడే పరిస్థితులు నెలకొంటున్నాయి. బుధవారం మధ్యాహ్నం గరిష్టంగా 40.6 డిగ్రీల ఉష్ణోగ్రత లు నమోదయ్యాయి. ఈ సీజన్లో ఇదే అత్యధికం. కనిష్ట ఉష్ణోగ్రత 27.6 డిగ్రీల మేర నమోదయ్యాయి. ఉదయం 9 గంటల నుంచే ఎండ తీవ్రత పెరుగుతోంది. సాయంత్రం 5 గంటల వరకూ ఎండ వేడిమి తగ్గడం లేదు. ఇంటి నుంచి బయటకు వెళుతున్నప్రయాణికులు వడదెబ్బకు గురవుతున్నారు. ఆస్పత్రుల్లో వడదెబ్బ కేసులు పెరుగుతున్నాయి. గురు, శుక్రవారాల్లో ఉష్ణోగ్రతలు 42 నుంచి 43 డిగ్రీలకు చేరుకునే అవకాశం ఉందని బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది. మండు వేసవి, పొడి వాతావరణ పరిస్థితుల కారణంగానే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ శాస్త్రవేత్తలు తెలిపారు. గాలిలో తేమ 24 శాతానికి పడిపోవడంతో చర్మం, కళ్ల సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. వేసవి తాపం నుంచి రక్ష ణ పొందేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. -
భానుడు భగభగ
39.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు ఈ సీజన్లో ఇదే అత్యధికం సిటీబ్యూరో: గ్రేటర్‌పై భానుడు ప్రతాపం చూపుతున్నాడు. మంగళవారం మధ్యాహ్నం గరిష్టంగా 39.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్లో ఇప్పటి వరకు నమోదైన ఉష్ణోగ్రతల్లో ఇదే అత్యధికం. కనిష్టంగా 27.2 డిగ్రీలు నమోదైనట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది. ఎండ తీవ్రత వల్ల మధ్యాహ్నం వివిధ పనులకు ఇళ్ల నుంచి బయటకువెళ్లిన వారిలో కొందరు సొమ్మసిల్లారు. లస్సీ,ఫలుదా, కొబ్బరిబోండాలు, శీతల పానీయాలతో మరికొందరు ఉపశమనం పొందారు. ఎండ అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రజలు గొడుగులు, క్యాప్‌లు, చలువ కళ్లద్దాలు ధరించాలని, చర్మ, కళ్ల సంరక్షణపై శ్రద్ధ చూపాలని వైద్యులు సూచిస్తున్నారు. రాగల 24 గంటల్లో ఉష్ణోగ్రతల్లో స్వల్ప పెరుగుదల నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. -
మండే ఎండలా.. మజాకా!
మండే ఎండల్లో కొందరు చల్ల చల్లని పానీయాలు అమ్ముకుంటూ బతుకు బండిని లాగిస్తున్నారు. మరి కొందరు ఎండలే అదనుగా భావించి ధరలు పెంచి దండుకుంటున్నారు. ప్రజలేమో ఎండలకు తట్టుకోలేక గొంతు తడుపుకోవడానికి పరుగులు తీస్తున్నారు. ఇలా ఒక్కొక్కరికి ఒకో రీతిలో మండే ఎండలా.... మజాకా అనిపిస్తున్నాయి. - రాయచూరు రాయచూరు: ఉత్తర కర్ణాటకలో రెండే సీజన్లు వేసవి, అతి వేసవి అన్న సంగతి తెలియని వారెవరూ ఉండరేమో. మే రాక ముందే ఎండలు మండిపోతున్నాయి. జిల్లా వ్యాప్తంగా రెండు నెలలుగా (మొన్న కురిసిన అకాల వర్షం మినహా) సగటున 39 నుంచి 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జిల్లా కేంద్రమైన రాయచూరు నగరానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారికి మండుటెండలు స్వాగతం ప లుకుతున్నాయి. దీంతో వారు సహజంగానే చల్లటి పానీ యాలు, చలువ చేసే పదార్థాల కోసం తపిస్తున్నారు. ఉన్నవా రు ఎలాగూ బాటిళ్ల నీళ్లను కొని దాహం తీర్చుకుంటున్నారు. పేదవారు ఆర్టీసీ ఏర్పాటు చేసిన తాగునీరు అలాగే అక్కడి అన్నపూర్ణ క్యాంటీన్ నీళ్లను తాగి ఉపశమనం పొందుతున్నా రు. ఇక చల్లటి పానీయాల సంగతి సరే సరి చెరుకు రసంతో పాటు రకరకాల జూస్లు ఇతరత్రా డ్రింక్స్ ప్యాపారాలు జో రుగా కొనసాగుతున్నాయి. ఇక యాపలదిన్ని తదితర గ్రా మాల నుంచి తెలుగు వారైన మహిళలు బస్టాండ్ రెండు ప్ర ధాన గేట్ల బయట తాటిముంజలను రూ.10 కి 4-5 చొప్పున అమ్ముతున్నారు. రెండు నెలల నుంచి ఈ మహిళలు ప్రజలకు చలువ చేసే తాటిముంజలను విక్రయిస్తున్నారు. ఇక పుచ్చకాయ ఒక ముక్క 10 రూపాయలు కాగా అలాగే ఖర్బుజా ఇతర చలువ నిచ్చే ఆహార పదార్థాలు, కాయగూరల వైపు ప్రజలు పరుగులు తీస్తున్నారు. ముఖ్యంగా దోసకాయ, క్యారెట్, మొలకెత్తిన పెసర్లు తదితరాలకు డిమాండ్ ఎక్కువగానే ఉంది. ఇవి రోజు రోజుకూ ధరలు మారుతున్నాయి. ఈ విషయమై స్థానిక స్టేషన్ రోడ్డు వెస్ట్‌పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న కూరగాయల ప్రముఖ వ్యాపారి, మాజీ దళపతి వీరణ్ణ మాట్లాడుతూ, 100 గ్రాములు ఉన్న మొలకెత్తిన పెసర్లు రూ.12, అలాగే దోసకాయ, క్యారెట్, నిమ్మకాయ, ముల్లంగి, బీరకాయ తదితరాలన్ని కేజీ రూ.40-50 పైమాటే. ఇక నిమ్మకాయల ధరను అడగాల్సిన పని లేదన్నారు. రెండు రోజుల క్రితం బసవ జయంతి, వైశాఖమాస పెళ్లిళ్ల సీజన్‌తో పలు కాయగూరల ధరలు ఒక్క సారిగా రెండింతలు మూడింతలు పెరిగాయి. ఎవర్గ్రీన్ ఎళెనీరు(కొబ్బరి బొండం) ధర రూ.30 దగ్గర స్థిర పడిపోయింది. -
జలమిలా... మనకెలా?
అడుగంటుతున్న జలాశయాలు గ్రేటర్ వాసుల్లో ఆందోళన నెలాఖరులో గండిపేట్ వద్ద పంపింగ్ షురూ సిటీబ్యూరో: ఎండల తీవ్రతతో గ్రేటర్ దాహార్తిని తీరుస్తున్న జలాశయాల్లో నీటి మట్టాలు పడిపోతున్నాయి. ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్లతో పాటు సింగూరు, మంజీర జలాశయాల్లో నీటిమట్టాలు తగ్గుముఖం పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. వీటిలోని నీటి నిల్వలు జూన్ వరకు నగర తాగునీటి అవసరాలకు సరిపోతాయని జలమండలి భరోసా ఇస్తున్నా.. ఈ వేసవిలో కటకట తప్పేలా లేదన్న సంకేతాలు వెలువడుతున్నాయి. నీటి మట్టాలు బాగా తగ్గడంతో ఈనెలాఖరున గండిపేట్ జలాశయం వద్ద నాలుగు విద్యుత్ మోటార్లు ఏర్పాటు చేసి నీటిని తోడేందుకు జలమండలి సన్నాహాలు చేస్తోంది. రోజువారీగా జంట జలాశయాల నుంచి 40 మిలియన్ గ్యాలన్లు, సింగూరు, మంజీర జలాశయాల నుంచి 120, కృష్ణా మొదటి, రెండోదశల ద్వారా 180.. మొత్తంగా 340 మిలియన్ గ్యాలన్ల నీటిని నగర నలుమూలలకు సరఫరా చేస్తున్నట్లు జలమండలి వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. ఈ నెలాఖరుకు కృష్ణా మూడోదశ ద్వారా నగరానికి మరో 45 మిలియన్ గ్యాలన్లు తరలిస్తామని పేర్కొన్నాయి.