పలుచోట్ల వర్షాలు.. బయ్యారంలో 6 సెంటీమీటర్ల వర్షం
హైదరాబాద్: ప్రచండ భానుడి భగభగలతో విలవిలలాడిన జనం మెల్లగా ఊపిరి పీల్చుకుంటున్నారు. రాష్ట్రంలో ఎండ తీవ్రత తగ్గుముఖం పడుతోంది. మంగళవారం నిజామాబాద్‌లో అత్యధికంగా 43.3 డిగ్రీ సెల్సియస్‌ల ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్, ఆదిలాబాద్‌ల్లో అత్యధికంగా 41.2, రామగుండం, కంపాసాగర్, రుద్రూరు 40, అశ్వారావుపేట 35, జగిత్యాల 39.4, సంగారెడ్డి 39.3, తాండూరు 39.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
హైదరాబాద్, రామగుండం, నిజామాబాద్‌ల్లో మాత్రమే సాధారణం కంటే అదనంగా రెండు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు అక్కడక్కడా వర్షాలు కురిశాయి. గత 24 గంటల్లో (సోమవారం) ఖమ్మం జిల్లా బయ్యారంలో 6, సత్తుపల్లి, గార్ల, డోర్నకల్‌లలో 4, గుండాల, జూలురుపాడుల్లో 2 సెంటీమీటర్ల చొప్పున కురిసింది.
ఎండల తీవ్రత తగ్గుముఖం
Published Wed, Jun 3 2015 1:44 AM | Last Updated on Sun, Sep 3 2017 3:07 AM
Advertisement