సాక్షి, హైదరాబాద్: పశ్చిమ బిహార్ నుంచి ఛత్తీస్గఢ్ మీదుగా తెలంగాణ వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఆదివారం రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడి న వర్షాలు కూడా పడొచ్చని చెప్పింది.
ఆది, సోమవారాల్లో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థితిలోనే నమోదవుతాయని వివరించింది. హైదరాబాద్ పరిసరాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 39–42 డిగ్రీల వరకు నమోదు కానున్నట్లు అంచనా వేసింది.
చదవండి: మళ్లీ అకాల వర్ష బీభత్సం
Comments
Please login to add a commentAdd a comment