వడదెబ్బతో 161 మంది మృతి
నెట్‌వర్క్: రాష్ట్రంలో గురువారం కూడా ఎండల తీవ్రత తగ్గలేదు. మరో వైపు వడదెబ్బ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 161 మంది మృతి చెందారు. వరంగల్ జిల్లాలో అత్యధికంగా 37 మంది ప్రాణాలు కోల్పోయారు. ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో అత్యధికంగా 48.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వడదెబ్బ కారణంగా ఆదిలాబాద్ జిల్లాలో ఆరుగురు, కరీంనగర్ జిల్లాలో 32 మంది, మెదక్ జిల్లాలో 10 మంది, మహబూబ్‌నగర్‌లో 8 మంది, నిజామాబాద్‌లో 10 మంది, నల్లగొండలో 25 మంది, ఖమ్మంలో 23 మంది, హైదరాబాద్ జిల్లాలో ఆరుగురు, రంగారెడ్డిజిల్లాలో ఆరుగురు మృత్యువాతపడ్డారు. ఖమ్మం జిల్లా ఇల్లెందులో 48 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదుకాగా, ఇదే జిల్లాలో సత్తుపల్లి, మణుగూరుల్లో 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వరంగల్ నగరంలో 43 డిగ్రీలు నమోదుకాగా, నిజామాబాద్‌లో 44.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్‌లో 42.5 డిగ్రీలు నమోదైంది. ఇదిలా ఉండగా ఖమ్మం జిల్లాలో పలుచోట్ల గురువారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. నల్లగొండలో కూడా అక్కడక్కడ జల్లులు కురిశాయి.
ఏపీలో కొనసాగుతున్న మరణాలు
విజయవాడ బ్యూరో: ఏపీలోవాతావరణం కాస్త చల్లబడినప్పటికీ వడగాల్పుల కారణంగా వృద్ధులు మరణిస్తూనే ఉన్నారు. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా వడదెబ్బకు గురై 193 మంది మరణించారు.
రాష్ట్రంలో తగ్గని ఎండలు
Published Fri, May 29 2015 2:38 AM | Last Updated on Sun, Sep 3 2017 2:50 AM
Advertisement