వడదెబ్బతో ఇద్దరు మృతి
Published Wed, May 24 2017 10:05 PM | Last Updated on Fri, Sep 28 2018 3:41 PM
వెల్దుర్తి రూరల్ : వడదెబ్బతో బుధవారం ఇద్దరు మహిళలు మృతి చెందారు. రామళ్లకోట గ్రామం దాసరిపేటలో మహబూబ్‌బీ(57)..అధిక ఉష్ణోగ్రతలతో రెండు రోజుల క్రితం అస్వస్థతకు గురయ్యారు. బుధవారం ఎండలో తిరిగి స్పృహ తప్పిపడిపోయారు. ఆసుపత్రికి తరలించే లోపు మృతి చెందారు. అలాగే వెల్దురికి చెందిన ముత్యాల తిమ్మక్క (48) బుధవారం కూలీపనికి వెళ్లి అస్వస్థతకు గురైయ్యారు. కుటుంబ సభ్యులు గమనించి ఆసుపత్రికి తరలించేలోపు మృతిచెందారు. మృతురాలికి పెళ్లైన కుమార్తె ఉంది.
Advertisement
Advertisement