మట్టి లేకుండానే వ్యవసాయం..
అలస్కా : వ్యవసాయాన్ని ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు. కొందరు ఆరు బయట పొలాల్లో సాగు చేస్తే మరికొందరు గ్రీన్‌హౌస్‌లో చేస్తారు. ఏది ఏమైనా వ్యవసాయం చేయాలంటే మాత్రం మట్టి(నేల) కావాల్సిందే. కానీ అలస్కాలోని కొందరు మట్టి అవసరం లేకుండానే సాగు చేస్తున్నారు. ఈ విచిత్రమైన సాగు పేరు వర్టికల్ ఫార్మింగ్. దీనికి హైడ్రోపోనిక్ ఫార్మ్ అని మరోపేరు కూడా ఉంది. అలస్కాలోని కోట్జెబు నగరంలోని కొందరు ఈ విధమైన సాగు పద్ధతిని అవలంబిస్తున్నారు. ఈ వర్టికల్ ఫార్మింగ్ ద్వారా ఒక కంటైనర్‌లో తాజా కూరగాయలను పెంచుతున్నారు.
రాక్ ఊల్ (దూది బెండు)పై ఈ మొక్కలను పెంచుతున్నారు. మొక్కకు కావాల్సిన నీరు, పోషకాలు బయట నుంచి ఇస్తే సరిపోతుంది. ఇక సూర్యకాంతి కావాలి కదా! దానికోసం ఎల్‌ఈడీ కాంతులను వినియోగిస్తున్నారు. ఇందులో దిగుబడి కూడా అధికంగా వస్తుంద అక్కడి వారు చెబుతున్నారు.