Vertical Farming
-
నిలువు పుచ్చ తోట!అవును..నిజమే!
నిలువు పుచ్చ తోట, అవును మీరు చదవింది.. ఈ ఫొటోలో చూస్తోంది.. నిజమే! మన పుచ్చ తోటల్లో పాదులు నేలపై పరచుకొని ఉంటాయి. పుచ్చ కాయలు నేలపైనే పెరుగుతాయి కదా. సౌతాఫ్రికాలో ఒక కంపెనీ పాలీహౌస్‌లలో పుచ్చ పాదులు నిలువుగా ఎగబాగుకుతున్నాయి. పుచ్చ కాయలు వాటికి వేలాడుతున్నాయి. ట్రెల్లిస్ పద్ధతిలో పెరిగే టొమాటోల మాదిరిగా ఈ పుచ్చకాయలు వేలాడుతున్నాయి కదూ.. కాండీ బాల్ సీడ్లెస్ పుచ్చకాయలు కిలో నుంచి కిలోన్నర వరకు బరువు పెరుగుతాయి. అదేమాదిరిగా కిలో బరువు పెరిగే స్మైల్ మెలన్స్ (ఇదో రకం కర్బూజ) పండ్లను కూడా నిలువు తోటల్లో పెంచుతున్నారు. టొమాటోలు వంటి కాయలు బరువు తక్కువగా ఉంటాయి కాబట్టి తీగజాతి మొక్కలు మొయ్యగలుగుతాయి. అయితే, ఇలాంటి నిలువు తోటలో పుచ్చకాయలు, కర్బూజ కాయల బరువు మొక్కలకు భారం కాకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్లాస్టిక్ నెట్ కవర్లతో కాయలను ప్లాస్టిక్ వైర్లకు కట్టేస్తున్నారు. ‘నిలువు తోటలో పెరిగిన పుచ్చకాయలను మేం త్వరలోనే అమ్మకానికి పెట్టబోతున్నాం. సౌతాఫ్రికా మార్కెట్లో మేమే ఫస్ట్’ అంటున్నారు ఆ కంపెనీ ప్రతినిధి ఫ్రాంకోయిస్ ఫౌరీ. పాలీహౌస్‌లు, నెట్‌హౌస్‌లలో, మేడపై ఇంటిపంటల్లో ట్రెల్లిస్ పుచ్చ, కర్బూజ సాగు సాధ్యమే అని గ్రహించాలి! -
పరి పరిశోధన
వర్టికల్ ఫార్మింగ్‌తో 30 రెట్లు ఎక్కువ దిగుబడి నేల అవసరం లేని నిట్టనిలువు వ్యవసాయం గురించి మనం చాలాసార్లు వినే ఉంటాంగానీ.. ఇందులోనూ రికార్డులు బద్దలు కొట్టేందుకు కంపెనీలు సిద్ధమవుతున్నాయి. అమెరికాకు చెందిన బోవరీ విషయాన్నే తీసుకోండి. ఈ సంస్థ అతితక్కువ స్థలం, నీరు, వనరులు వాడుకుని బోలెడన్ని ఆకు కూరలు పండించేందుకు రంగం సిద్ధం చేసింది. సంప్రదాయ పద్ధతుల్లో ఎకరానికి పండించే దానికంటే బోవరీలో పండేది ఏకంగా 30 రెట్లు ఎక్కువ ఉండటం విశేషం. అత్యాధునిక టెక్నాలజీలను వాడుకోవడం ద్వారా తాము 95 శాతం తక్కువ నీరు.. క్రిమికీటక నాశినులు, రసాయన ఎరువులు ఏవీ వాడకుండానే అధిక దిగుబడులు సాధిస్తామని కంపెనీ ప్రతినిధి ఒకరు చెప్పారు. ఒకే రకమైన పంట కాకుండా ఏకకాలంలో దాదాపు వంద రకాల ఆకు కూరలు, ఔషధ మొక్కలు పెంచడం ఇంకో విశేషం. ప్రత్యేకంగా తయారుచేసుకున్న కంప్యూటర్ సాఫ్ట్వేర్ ద్వారా మొక్కలకు సంబంధించిన ప్రతి అంశాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ తదనుగుణంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మహానగరాలకు చేరువలో ఇలాంటి వర్టికల్ ఫార్మింగ్ చేపట్టడం ద్వారా నగరవాసులకు తాజా ఆకుకూరలు దొరుకుతాయి. ఇందువల్ల రవాణా చేయవలసిన అవసరం ఉండదు. ఇలా చేయడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించవచ్చునని బోవెరీ అంటోంది. ప్రస్తుతం ఈ సంస్థ పంటలు న్యూయార్క్‌లోని ఫోరేజ్, హోల్సమ్ ఫుడ్స్ వంటి స్టోర్లలో లభ్యమవుతున్నాయి. పెంగ్విన్ల కాలనీ బయటపడింది... మంచుముద్ద అంటార్కిటికాలో ఓ పెంగ్విన్ల కాలనీని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ.. ఇందులో విశేషమేముంది? అనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే అంతరించిపోతున్నాయని అనుకుంటున్న అడిలీ రకం పెంగ్విన్లు ఇక్కడ ఉండటం ఒక విశేషమైతే.. ఏకంగా 15 లక్షల ప్రాణులు ఉండటం ఇంకో విశేషం. వుడ్హోల్ ఓషన్రోఫిక్ ఇన్స్టిట్యూషన్ శాస్త్రవేత్తలు ఉపగ్రహ ఛాయాచిత్రాలు, డ్రోన్లతో జరిపిన పరిశోధనల ద్వారా ఈ కొత్త కాలనీ గురించి ప్రపంచానికి తెలిసింది. డాంగర్ ద్వీపంలో ఉన్న ఈ కాలనీని ఇప్పటివరకూ మనుషులెవరూ సందర్శించలేదని.. బహుశా అందుకే ఆ ప్రాంతంలో పెంగ్విన్లు బాగా వృద్ధి చెందుతూండవచ్చునని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త టామ్ హార్ట్ తెలిపారు. 1959లో తీసిన ఉపగ్రహ ఛాయాచిత్రాల్లోనూ వీటి ఉనికి గురించి కొన్ని ఆనవాళ్లు కనిపించాయని, ఆ తరువాత డాంగర్ ద్వీపమున్న పశ్చిమ అంటార్కిటికా ప్రాంతంలో పెంగ్విన్లు క్రమేపీ తగ్గిపోతూ వచ్చాయని హార్ట్ వివరించారు. దాదాపు ఏడు లక్షల జంటలతో ప్రపంచంలోనే అతిపెద్ద పెంగ్విన్ కాలనీగా ‘హార్ట్’ నిలిచింది అంటున్నారు. ఆక్సఫర్డ్ విశ్వవిద్యాలయంతోపాటు అమెరికా, ఫ్రాన్స్‌లలోని ఇతర విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు కూడా ఈ పరిశోధనల్లో పాలుపంచుకున్నారు. నిత్య యవ్వనం గుట్టు తెలిసింది... నిండు నూరేళ్లూ... ఎలాంటి జబ్బులు, ఇబ్బందులు లేకుండా గడిపితే ఎలా ఉంటుంది? అద్భుతంగా ఉంటుంది గానీ.. సాధ్యమయ్యేదెలా? అంటున్నారా? అరిజోనా స్టేట్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల పరిశోధనల పుణ్యమా అని ఈ దిశగా ఇంకో అడుగు ముందుకు పడింది. విషయం ఏమిటంటే.. మన క్రోమోజోమ్‌ల చివరన ఉండే టెలిమోర్లకు సంబంధించిన ఓ కీలక విషయాన్ని తెలుసుకున్నారు. డీఎన్ఏ పోగుల్లోని కొన్ని భాగాలను టెలీమోర్లుగా మార్చేందుకు టెలిమరేస్ అనే ఎంజైమ్‌లు ఎలా పనిచేస్తాయో వీరు గుర్తించారు. సాధారణంగా మన శరీర కణాలు కొన్నిసార్లు విభజితమైన తరువాత మరణిస్తాయి. ఈ క్రమంలో క్రోమోజోమ్‌ల చివర ఉండే టెలీమోర్ల పొడవు తగ్గుతూ వస్తుంది. ఎప్పుడైతే టెలిమోర్ల పొడవు నిర్దిష్ట స్థాయికంటే తక్కువ అవుతుందో అప్పుడు కణ విభజన ఆగిపోతుంది. ఇంకోలా చెప్పాలంటే కణాలు.. వాటితోపాటు మనమూ వృద్ధులమవుతామన్నమాట. ఈ నేపథ్యంలో టెలీమోర్ల పొడవు తగ్గకుండా చూసేందుకు శాస్త్రవేత్తలు రకరకాల పరిశోధనలు చేస్తున్నారు. టెలీమెరేస్లో క్రోమోజోమ్ చివరల్లో ఉండే టెలీమోర్లకు సంబంధించిన డీఎన్ఏ ముక్కలను కచ్చితంగా తయారు చేసేందుకు ఒక వ్యవస్థ ఉందని.. ఇది.. ఆ ఎంజైమ్ మొత్తం పనితీరునూ ప్రభావితం చేస్తోందని వీరు తెలుసుకున్నారు ఈ వ్యవస్థను నియంత్రించగలిగితే టెలీమోర్ల పొడవు తగ్గకుండా ఉంటుంది.. తద్వారా కణాలు.. మనమూ నిత్యయవ్వనంతో ఉండవచ్చునని అంచనా. -
చుట్టూ పొలాలు.. మధ్యలో డెస్క్‌టాప్
నగరాలు పెరిగిపోతున్నాయి. దీంతోపాటే అవసరాలూ! అందుకే కాయగూరల్ని ఎక్కడో పల్లెల్లో పండించి నగరాల వరకూ వాటిని తీసుకొచ్చి తద్వారా ఖర్చులు తడిసి మోపెడు చేసుకోవడం ఎందుకని ప్రపంచవ్యాప్తంగా వర్టికల్ ఫార్మింగ్‌పై ఆసక్తి పెరుగుతోంది. అపార్ట్మెంట్ల మాదిరిగా నిట్టనిలువు వరుసల్లో అతితక్కువ నీరు, ఎరువులు, క్రిమి కీటకనాశినులతో చేసే సాగును వర్టికల్ ఫార్మింగ్ అంటారన్నది తెలిసిందే. అమెరికాతోపాటు, యూరప్‌లోనూ చాలా చోట్ల వర్టికల్ ఫార్మింగ్ ద్వారా టన్నులకు టన్నుల కాయగూరలు పండిస్తున్నారు. ఫొటోలో కనిపిస్తున్నది కూడా అలాంటి వర్టికల్ ఫార్మింగ్ కేంద్రమే. ఇది ఒకొక్కటీ ఏడాదికి 500 టన్నుల కాయగూరలు పండిస్తుందని అంటోంది స్వీడిష్ కంపెనీ ప్లాంటగాన్! అంతేకాదు. దీంట్లో ఇంకో విశేషం ఏమిటంటే.. దాదాపు 60 మీటర్ల ఎత్తుండే ఈ వ్యవసాయ క్షేత్రం 16 అంతస్తుల ఆఫీసు బిల్డింగ్‌గా కూడా ఉపయోగపడుతుంది. భారీ గోళాకారంలో ఉన్న అద్దాల మేడలో బయటివైపున పచ్చగా ఉన్న ప్రాంతమంతా వ్యవసాయ క్షేత్రంగా ఉంటే, మధ్యలో ఉన్న తెల్లటి స్తంభం లాంటి నిర్మాణంలో కార్యాలయాలు ఏర్పాటవుతాయన్నమాట. అంతేకాదు. వ్యవసాయ క్షేత్రం అవసరాలకు కావాల్సిన విద్యుత్తులో కనీసం సగం.. బిల్డింగ్ శోషించుకునే వేడి ద్వారానే ఉత్పత్తి చేస్తారు. ఒక్కసారి దీని నిర్మాణం పూర్తయితే ఏటా దాదాపు వెయ్యి టన్నుల కార్బన్ డైయాక్సైడ్ వాతావరణంలోకి చేరకుండా అడ్డుకుంటుంది. అలాగే ఏడాదికి దాదాపు 5 కోట్ల లీటర్ల నీటిని ఆదా చేస్తుంది. ప్రస్తుతానికి డిజైన్ల స్థాయిలో ఉన్న ఈ ‘వరల్డ్ ఫుడ్ బిల్డింగ్’ను వాస్తవ రూపంలోకి తీసుకొచ్చేందుకు ప్లాంటగాన్ నిధుల సేకరణ పనిలో ఉంది. తమ ఆలోచనకు దాదాపు లక్ష మంది మద్దతుందని, అందరూ తలా ఒక చేయి వేస్తే దీన్ని పూర్తి చేయడం పెద్ద కష్టమేమీ కాదని అంటోంది ప్లాంటగాన్. - సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
అరల్లో ఎకరాలు ఎకరాలు!
ప్రపంచంలో అన్నీ మారిపోతున్నాయి. వెళ్లే కార్లు మొన్నటి మాదిరిగా లేవు. నడిచే రోడ్లు, ఉండే ఇళ్లు కూడా గతంలోలా లేవు. తాజాగా ఈ జాబితాలోకి వ్యవసాయం కూడా చేరిపోతోంది! నిన్న మొన్నటి దాకా గ్రీన్హౌస్ వ్యవసాయంపై బోలెడన్ని వార్తలు వచ్చేవి. ఇప్పుడు ఆ ట్రెండ్ మారిపోయింది. వర్టికల్ ఫార్మింగ్దే హవా. ఫొటోలో కనిపిస్తున్న సోలార్ ప్యానెళ్లను చూశారుగా.. ఇవి కూడా ఓ వర్టికల్ ఫార్మ్వే. అమెరికాలోని ఫిలడెల్ఫియాలోని బ్రదర్లీ లవ్ భవనంలో ఏర్పాటైంది ఈ నిట్టనిలువు వ్యవసాయ క్షేత్రం. మెట్రోపోలిస్ ఫార్మ్ పేరుతో ఏర్పాటైన ఈ క్షేత్రం విస్తీర్ణం 2.2 ఎకరాలు మాత్రమే కానీ... 660 ఎకరాల సాధారణ నేలలో పండించేంత మోతాదులో పంటలు పండుతాయి ఇక్కడ. అబ్బో అదెలా సాధ్యమంటే... అంతా టెక్నాలజీ మహిమ అంటున్నారు మెట్రోపోలిస్ ఫార్మ్ యజమానులు. ఒకదానిపై ఒకటి ఉంచే అరల్లో పంటలు పండుతాయి. సూర్యరశ్మి స్థానంలో ఎల్ఈడీ బల్బుల వెలుగులు మొక్కలకు అవసరమైన శక్తిని అందిస్తాయి. ఇలాంటి నిట్టనిలువు వ్యవసాయం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. నీటిని అత్యంత పొదుపుగా సమర్థంగా వాడుకోవడం ఒకటైతే.. క్రిమికీటకాల బెడద అస్సలు ఉండదు కాబట్టి అందుకు తగ్గట్టుగానే ఎరువులు, కీటకనాశినుల వాడకం కూడా అవసరముండదు. ఎల్ఈడీ బల్బుల కోసం.. ఇతర అవసరాలన్నింటి కోసం భవనం పైకప్పుపై దాదాపు 2003 సోలార్ ప్యానెళ్లతో 500 కిలోవాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్నారు. వర్టికల్ ఫార్మింగ్‌కు సూర్యరశ్మిని అందించే సోలార్ ప్యానెళ్లు ఇప్పటివరకూ ఏర్పాటైన అనేక వర్టికల్ ఫార్మ్‌లకు దీనికీ ఇంకో ప్రధానమైన తేడా ఉంది. తక్కిన వాటిల్లో కేవలం ఆకుకూరలు మాత్రమే పండేవి. కానీ తాము టెక్నాలజీలో కొన్ని మార్పులు చేయడం ద్వారా దాదాపు అన్ని రకాల పంటలూ పండించగలుగుతున్నామని అంటున్నారు మెట్రోపోలిస్ ఫార్మ్ యజమానులు. టమోటాలు, స్ట్రాబెర్రీలు, దోసకాయలతోపాటు వీరు ఆకుకూరలు కూడా పండిస్తున్నారు.! నగరం నడిబొడ్డున 660 ఎకరాలకు సరిపడా పంట పండితే.. కాయగూరలను పల్లెల నుంచి నగరాలకు తీసుకు రావాల్సిన అవసరం తప్పుతుంది కాబట్టి అంతమేరకు ఆదా చేయవచ్చునన్నది వీరి ఆలోచన. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
మట్టి లేకుండానే వ్యవసాయం..
అలస్కా : వ్యవసాయాన్ని ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు. కొందరు ఆరు బయట పొలాల్లో సాగు చేస్తే మరికొందరు గ్రీన్హౌస్లో చేస్తారు. ఏది ఏమైనా వ్యవసాయం చేయాలంటే మాత్రం మట్టి(నేల) కావాల్సిందే. కానీ అలస్కాలోని కొందరు మట్టి అవసరం లేకుండానే సాగు చేస్తున్నారు. ఈ విచిత్రమైన సాగు పేరు వర్టికల్ ఫార్మింగ్. దీనికి హైడ్రోపోనిక్ ఫార్మ్ అని మరోపేరు కూడా ఉంది. అలస్కాలోని కోట్జెబు నగరంలోని కొందరు ఈ విధమైన సాగు పద్ధతిని అవలంబిస్తున్నారు. ఈ వర్టికల్ ఫార్మింగ్ ద్వారా ఒక కంటైనర్‌లో తాజా కూరగాయలను పెంచుతున్నారు. రాక్ ఊల్ (దూది బెండు)పై ఈ మొక్కలను పెంచుతున్నారు. మొక్కకు కావాల్సిన నీరు, పోషకాలు బయట నుంచి ఇస్తే సరిపోతుంది. ఇక సూర్యకాంతి కావాలి కదా! దానికోసం ఎల్ఈడీ కాంతులను వినియోగిస్తున్నారు. ఇందులో దిగుబడి కూడా అధికంగా వస్తుంద అక్కడి వారు చెబుతున్నారు.