
ఆన్‌లైన్‌లో ప్రతి వస్తువు అమ్మకానికి ఉంచినట్లే, చైనాలో మట్టిని కూడా ఆన్‌లైన్‌లో అమ్ముతున్నారు. ఇందులో వింత ఏముంది అని అనుకుంటున్నారా? అయితే, ఈ మట్టి అలాంటి ఇలాంటి మట్టి కాదు, ‘ఇదొక అదృష్టాల మట్టి, ఈ మట్టిని ఇంట్లో పెట్టుకుంటే డబ్బుల వర్షం కురిపిస్తుంది’ అంటూ బ్యాంకుల ఆవరణలోని మట్టిని రాత్రివేళలో సేకరించి ఆన్‌లైన్‌లో అమ్ముతున్నారు.
వంద గ్రాముల మట్టి ధర సుమారు వెయ్యి నుంచి పదివేల రూపాయల వరకు ఉంటోంది. ఈ మట్టితో ఆర్థికంగా లాభాలు పొందవచ్చని చాలా మంది నమ్మి, బ్యాంకుల ముందు మట్టిని, బ్యాంక్ లోపల పూలకుండీల వద్ద ఉండే మట్టిని, కౌంటింగ్ మిషన్ నుంచి వచ్చిన ధూళిని కూడా సేకరిస్తున్న వీడియాలు వైరల్‌గా మారాయి. ఈ విషయాన్ని గుర్తించిన చైనా ప్రభుత్వం పబ్లిక్ ప్రదేశాల్లో మట్టిని తవ్వడం నిషిద్ధంగా ప్రకటించింది. ఇలాంటివి నమ్మవద్దని ప్రకటనలు ఇస్తోంది చైనా ప్రభుత్వం.
(చదవండి:
Comments
Please login to add a commentAdd a comment