మట్టిపెళ్లలు పడి ఇద్దరు మృతి | 2-people-died-accidentally-in kondapur | Sakshi
Sakshi News home page

మట్టిపెళ్లలు పడి ఇద్దరు మృతి

Published Mon, Mar 13 2017 11:14 AM | Last Updated on Tue, Sep 5 2017 5:59 AM

మట్టిపెళ్లలు పడి ఇద్దరు మృతి

మట్టిపెళ్లలు పడి ఇద్దరు మృతి

మాదాపూర్: నగరంలోని మాదాపూర్‌ కొత్తగూడలో విషాదం చోటు చేసుకుంది. బహుళ అంతస్తుల భవనం నిర్మాణంలో భాగంగా భారీ సెల్లార్ గుంత తవ్వుతుండగా ప్రమాదవశాత్తూ మట్టి పెళ్లలు పడి ఇద్దరు మహిళలు దుర్మరణం చెందారు. మృతిచెందిన వారిని భారతవ్వ (35), కిష్టవ్వ (22)గా గుర్తించారు. శిథిలాల నుంచి నలుగురు కూలీలు త్రుటిలో బయటపడ్డారు. మరో ఇద‍్దరి పరిస్థితి విషమంగా ఉంది.
 
మట్టి పెళ్లల కింద మరికొందరు కూలీలు ఉన్నట్టు సమాచారం. భారీ భవన నిర్మాణంలో ఇంజనీర్ల పర్యవేక్షణ లోపించనట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిర్మాణ సంస్థపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.
 
ప్రమాదస్థలాన్ని మేయర్‌ బొంతు రామ్మోహన్‌ పరిశీలించారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడంవల్లనే ప్రమాదం జరిగిందని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మాదాపూర్‌ డీసీపీ విశ్వప్రసాద్‌ తెలిపారు. కాగా, ప్రమాదస్థలిలో మృతుల బంధువులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం జరిగే వరకు మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించేందుకు ఒప్పుకోమంటూ వారు స్పష్టం చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement