ఐకెపి ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తాం: జగన్ | we will regularise ikp employees: YS Jagan | Sakshi
Sakshi News home page

ఐకెపి ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తాం: జగన్

Published Sat, Feb 8 2014 8:31 PM | Last Updated on Wed, Jul 25 2018 4:07 PM

ఐకెపి ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తాం: జగన్ - Sakshi

ఐకెపి ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తాం: జగన్

విశాఖపట్నం: తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఇందిరా క్రాంతి పదం(ఐకెపి) ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి హామీ ఇచ్చారు. చోడవరంలో జరిగిన సమైక్యశంఖారావం భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఐకెపి మహిళలు వచ్చి జగన్ను కలిశారు. వారు తమ సమస్యలను ఆయనకు తెలిపారు. జగన్ వెంటనే స్పందించి 47వేల మంది ఐకెపి ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి అయిన వెంటనే తొలిరోజునే ఆ ఫైలుపై  సంతకం చేస్తానని చెప్పారు.

అక్కా చెల్లెమ్మలకు వైఎస్ఆర్ సిపి తోడుగా ఉంటుందని హామీ ఇచ్చారు. పార్టీకి అండగా ఉంటుంది అక్కచెల్లెమ్మలేనని, వారిని తప్పక ఆదుకుంటామని చెప్పారు. విఏఓలు, సంఘమిత్ర ఉద్యోగుల సమస్యలు కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement