samaikya shankaravam
-
రాష్ట్ర చరిత్రను మార్చేది ఆ నాలుగు సంతకాలే: జగన్
శ్రీకాకుళం: తాము అధికారంలోకి వచ్చిన తరువాత తాను చేసే మొదటి నాలుగు సంతకాలు రాష్ట్ర చరిత్రను మార్చేస్తాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి చెప్పారు. సమైక్య శంఖారావంలో భాగంగా శ్రీకాకుళంలో ఈ సాయంత్రం జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. బడికి వెళ్లే ప్రతి ఇద్దరి చిన్నారులకు 500 రూపాయల చొప్పున ఇస్తానని పిల్లలను బడికి పంపించే అక్కాచెల్లెళ్లకు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన రోజే వెనువెంటనే 4 సంతకాలు చేస్తానని చెప్పారు. ఆ సంతకాలు పేదల జీవితాలను మార్చివేస్తాయని చెప్పారు. అధికారంలోకి రాగానే మొదటి సంతకం అమ్మఒడి పథకం - రెండవ సంతకం వృద్ధాప్య ఫించన్లు - మూడవ సంతకం రైతులకు గిట్టుబాటు ధర కల్పించే స్థిరీకరణ నిధి - నాలుగవ సంతకం మంచి అన్నలా అక్కాచెల్లెళ్లు తీసుకున్న డ్వాక్రా రుణాల మాఫీ కోసం అని వివరించారు. అధికారంలోకి వచ్చిన రెండవ రోజు ఇచ్చాపురం, టెక్కలిలలో పవర్ ప్లాంట్ల మూసివేయాలని అయిదవ సంతకం చేస్తానని చెప్పారు. దివంగ మహానేత వైఎస్ఆర్ అడ్రస్ అడిగితే, ప్రతి ఒక్కరూ తమగుండెల్లో ఉన్నారని సగర్వంగా చెబుతున్నారన్నారు. ఇవాళ్టి రాజకీయాల్లో నిజాయతీ ఎక్కడుందని ప్రశ్నించారు. టార్చ్‌లైట్ పెట్టి వెతికినా కనిపించడం లేదన్నారు. ఇవాళ్టి రాజకీయం అంతగా దిగజారిపోయిందని బాధపడ్డారు. ఇవాళ రాజకీయాలు ఎంతగా దిగజారిపోయాయంటే, ఓట్ల కోసం దొంగకేసులు పెట్టడానికి, మనిషిని తప్పించడానికి, అవసరమైతే రాష్ట్రాన్ని చీల్చడానికి కూడా వెనుకాడడం లేదన్నారు. పిల్లల చదువుల కోసం ఈ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా మంజూరు చేయలేదన్నారు. ఆ విషయంపై శాసనసభలో చర్చించిందిలేదు. గ్యాస్‌పై కూడా చర్చలేదన్నారు. తన కొడుకుకుని ప్రధాని గద్దెపై కూర్చోబెట్టడానికి సోనియా గాంధీ రాష్ట్రాన్ని విడగొడుతున్నారన్నారు. బంగారంలా ఉన్న రాష్ట్రాన్ని విడగొట్టడానికి సోనియా కుట్ర పన్నారని విమర్శించారు. టిడిపికి చెందిన కొంతమంది ఎంపిలు రాష్ట్రాన్నిసమైక్యంగా ఉంచమని కోరతారు, మరికొందరు విడగొట్టమని కోరతారు. టిడిపి వారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కుమ్మక్కయ్యారు. సమాచార పదవులు పంచుకున్నారు అని విమర్శించారు. రాజకీయాలు దిగజారిపోయాయి. రాజకీయాలలో నీతిలేదు. అవసరమైతే రాష్ట్రాన్ని విడదీయటానికి కూడా సిద్ధపడుతున్నారు. విశ్వసనీయత అన్న పదానికి అర్ధం మారిపోయిందని బాధపడ్డారు. 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఒక రైతుకు మంచి చేశాను. ఒక మహిళకు మంచి చేశాను. ఒక విద్యార్థికి మంచి చేశాను అని చెప్పగలరా? అని ప్రశ్నించారు. తనను చూసి ఓటు వేయమని అడిగే దమ్ము, ధైర్యం ఉన్నవాడే నాయకుడన్నారు. పలానా వాడు తమ నాయకుడని ప్రతి కార్యకర్త కాలరెగరేసి చెప్పుకునేలా ఉండాలని చెప్పారు. నాలుగు నెలలు ఆగండి. ఆ తరువాత సువర్ణ యుగం వస్తుందని భరోసా ఇచ్చారు. 30 ఏళ్లపాటు వైఎస్ఆర్ సువర్ణయుగాన్ని ఇస్తానని జగన్ హామీ ఇచ్చారు. -
ఐకెపి ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తాం: జగన్
విశాఖపట్నం: తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఇందిరా క్రాంతి పదం(ఐకెపి) ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి హామీ ఇచ్చారు. చోడవరంలో జరిగిన సమైక్యశంఖారావం భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఐకెపి మహిళలు వచ్చి జగన్‌ను కలిశారు. వారు తమ సమస్యలను ఆయనకు తెలిపారు. జగన్ వెంటనే స్పందించి 47వేల మంది ఐకెపి ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి అయిన వెంటనే తొలిరోజునే ఆ ఫైలుపై సంతకం చేస్తానని చెప్పారు. అక్కా చెల్లెమ్మలకు వైఎస్ఆర్ సిపి తోడుగా ఉంటుందని హామీ ఇచ్చారు. పార్టీకి అండగా ఉంటుంది అక్కచెల్లెమ్మలేనని, వారిని తప్పక ఆదుకుంటామని చెప్పారు. విఏఓలు, సంఘమిత్ర ఉద్యోగుల సమస్యలు కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. -
పేదవాడి మనసెరిగిన నేత వైఎస్: జగన్
విశాఖపట్నం: ప్రతి పేదవాడి మనసెరిగిన నేత వైఎస్ రాజశేఖర రెడ్డి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి అన్నారు. చోడవరంలో జరిగిన సమైక్యశంఖారావం భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ప్రతి గుండెలో ఆ మహానేత బతికే ఉన్నారని చెప్పారు. చంద్రబాబు భయానక పాలన మరచిపోలేమన్నారు. ఆయన పాలనలో పేదవాడు పడ్డబాధలు తనకు ఇంకా గుర్తున్నాయని చెప్పారు. ఆయన ఎప్పుడూ పేద విద్యార్థి గురించి పట్టించుకోలేదన్నారు. అదే వైఎస్ అయితే ప్రతి పేద విద్యార్థి ఇంజనీర్ కావాలని కలలుగన్నారని చెప్పారు. రైతులు అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకుంటే, తిన్నది అరగక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చంద్రబాబు అవహేళన చేశాన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ గీసిన గీత దాటరని విమర్శించారు. ఇసుకవేస్తే రాలని విధంగా బహిరంగ సభకు జనం తరలి వచ్చారు. చోడవరం జనసంద్రమైంది. వీధులన్నీ జనంతో నిండిపోయాయి. దాదాపు అయిదు గంటలు ఆలస్యమైనప్పటికీ జనం కదలకుండా జగన్ రాకకోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. జగన్ ప్రసంగానికి విశేష స్పందన లభించింది. -
మార్మోగనున్న సమైక్య శంఖారావం
సమరశంఖం పూరించనున్న వై.ఎస్.జగన్మోహన్రెడ్డి శ్రీకాకుళంలో ఆదివారం భారీ బహిరంగ సభ అదే వేదికపై ధర్మాన ప్రసాదరావు ‘చిక్కోలు తిరుగుబాటు’ భారీ స్థాయిలో అనుయాయులతో వైఎస్ఆర్సీపీలో చేరనున్న ధర్మాన కూకటివేళ్లతో కూలనున్న జిల్లా కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో ఉరకలెత్తుతున్న ఉత్సాహం సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లాలో సమైక్య సమర శంఖం పూరించనుంది. సమైక్యాంధ్ర విధానానికి కట్టుబడ్డ ఏకైక ప్రధాన పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రజాక్షేత్రంలోకి వస్తున్నారు. ఆయన రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న సమైక్య శంఖారావం యాత్ర జిల్లాలో అడుగుపెట్టనుంది. జిల్లా కేంద్రం శ్రీకాకుళంలో ఆదివారం నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో జగన్మోహన్రెడ్డి పాల్గొననున్నారు. వైఎస్సార్ కూడలి వద్దనున్న ఎన్టీఆర్ మున్సిపల్ ఉన్నత పాఠశాల మైదానంలో ఆదివారం మధ్యాహ్నం 2 గంట లకు భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. అదే వేదికపై నుంచి సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు కాంగ్రెస్ పార్టీపై ‘చిక్కోలు తిరుగుబాటు‘ చేయనున్నారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ దాదాపు తుడిచిపెట్టుకుపోయేరీతిలో ధర్మాన భారీ సంఖ్యలో ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలతో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్‌లో చేరనున్నారు. అటు తెలుగుజాతికి కీలకమైన సమైక్యాంధ్ర నినాదంతో రాష్ట్ర ప్రగతికి దశా, దిశా నిర్దేశించడంతోపాటు.. ఇటు జిల్లా చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో రాజకీయ ప్రకంపనలు సృష్టించనున్న వై.ఎస్.జగన్మోహన్రెడ్డి యాత్ర జిల్లా చరిత్రలో నూతన అధ్యాయానికి నాందీ ప్రస్తావన పలకనుంది. కదలిరానున్న ప్రజానీకం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి నిర్వహించనున్న సమైక్య శంఖారావం బహిరంగ సభకు జిల్లా ప్రజానీకం యావత్ కదలిరానుంది. ఇందుకోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులు ఉరకలెత్తుతున్నాయి. ఇప్పటికే అటు ఇచ్ఛాపురం నుంచి రణస్థలం వరకు, ఇటు వీరఘట్టం నుంచి గార వరకు పార్టీ నేతలు, కార్యకర్తలు సమావేశాలు ఏర్పాటు చేసుకుని సన్నద్ధమవుతున్నారు. పార్టీ సమైక్యాంధ్ర నినాదం ప్రతిధ్వనించేలా వై.ఎస్.జగన్మోహన్రెడ్డి బహిరంగ సభను విజయవంతం చేయడానికి ఉద్యుక్తమవుతున్నారు. బహిరంగ సభ నిర్వహణపై జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ పార్టీ నేతలతో చర్చిస్తున్నారు. వై.ఎస్.జగన్మోహన్రెడ్డి టూర్ ప్రోగామ్ కోఆర్డినేటర్ తలశిల రఘురాంతో కలసి ఆయన, శుక్రవారం ఎన్టీఆర్ మున్సిపల్ పాఠశాల మైదానాన్ని పరిశీలించారు. సభ ఏర్పాట్లను సమీక్షించారు. వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ర్యాలీని శ్రీకాకుళంలో ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభించి నేరుగా మున్సిపల్ పాఠశాల మైదానానికి చేరుకునేలా ప్రణాళిక రూపొందించారు. ధర్మాన కృష్ణదాస్.. శ్రీకాకుళం, గార, నరసన్నపేట, రణస్థలం, ఎచ్చెర్లలో శుక్రవారం పర్యటించి సమైక్య శంఖారావం సభకు జనసమీకరణపై పార్టీ నేతలతో చర్చించారు. శనివారం ఆయన ఆమదాలవలస, పాలకొండల్లో పర్యటించనున్నారు. అదేవిధంగా పార్టీ నేతలు తమ్మినేని సీతారాం, పాలవలస రాజశేఖరం, నియోజకవర్గాల సమన్వయకర్తలు, ఇతర నేతలు కూడా తమతమ నియోజకవర్గాల్లో కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు. సమైక్య శంఖారావం సభను విజయవంతం చేసేందుకు కార్యాచరణ చేపట్టారు. ధర్మాన చేరికతో చారిత్మాత్మక మార్పులు ఖాయం సమైక్య శంఖారావం సభ జిల్లా రాజకీయ సమీకరణలలో చరిత్రాత్మక మార్పులకు వేదికగా నిలవనుంది. జిల్లా కాంగ్రెస్‌కు పెద్దదిక్కుగా ఉన్న మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు వైఎస్ఆర్ కాంగ్రెస్‌లో చేరనున్నారు. 30 ఏళ్లుగా ప్రజాజీవితంలో ఉన్న ఆయన కీలకమైన రాజకీయ నిర్ణయం తీసుకోనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా ఆ పార్టీకి రాజీనామా చేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా భారీసంఖ్యలో ఉన్న నేతలు, కార్యకర్తలతో కలసి జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ సీపీలో చేరనున్నారు. అందుకోసం ధర్మాన కొన్ని రోజులుగా భారీ స్థాయిలో సన్నాహాలు చేస్తున్నారు. శ్రీకాకుళంతోపాటు నరసన్నపేట, పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లో పర్యటించి సహచర నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఇన్నాళ్లుగా కాంగ్రెస్‌లో తనతో పనిచేసిన ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ పరమైన పదవుల్లో ఉన్న నేతలు, ఇతరులను భారీగా సమీకరించారు. ఆయనతోపాటు ఇతర కాంగ్రెస్ నేతలెవరూ వైఎస్ఆర్ కాంగ్రెస్‌లో చేరకుండా చూసేందుకు కేంద్ర, రాష్ట్ర మంత్రులు కృపారాణి, కోండ్రు మురళిలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదనే చెప్పొచ్చు. మొత్తంమ్మీద వై.ఎస్.జగన్మోహన్రెడ్డి జిల్లా పర్యటన అటు సమైక్యాంధ్ర నినాదాన్ని ప్రతిధ్వనించనుండటంతోపాటు, ఇటు ధర్మాన చేరికతో జిల్లా రాజకీయ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చివేయనుంది. భవిష్యత్ రాజకీయ పరిణామాలకు సంకేతంగా నిలవనుండటంతో అందరి చూపు శ్రీకాకుళం బహిరంగ సభపై కేంద్రీకృతమైంది. భారీగా తరలిరండి: ధర్మాన కృష్ణదాస్ వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పాల్గొననున్న సమైక్య శంఖారావం బహిరంగ సభను విజయవంత చేయాలని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. శ్రీకాకుళంలో ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించనున్న ఈ సభకు జిల్లావ్యాప్తంగా పార్టీ శ్రేణులు, ప్రజలు భారీగా తరలిరావాలని కోరారు. సమైక్యాంధ్రను కాంక్షించే యావత్ ప్రజానీకం జగన్మోహన్రెడ్డికి బాసటగా నిలవాలన్నారు. పార్టీలో ఇప్పటికే ఉన్న , కొత్తగా చేరనున్న నేతలు, కార్యకర్తలు భారీగా తరలిరావాలన్నారు. అందరికీ పార్టీలో సముచిత స్థానం, గుర్తింపు దక్కుతాయని ఆయన చెప్పారు. సమైక్యాంధ్రను పరిరక్షించే వై.ఎస్.జగన్మోహన్రెడ్డిని సీఎం చేయడమే లక్ష్యంగా ఉద్యమపథంలో సాగాలని అన్నారు. -
మీలో ఒక్కడిగా ఉంటా
-
మళ్లీ వస్తా..
గూడూరు, న్యూస్‌లైన్: సమైక్య శంఖారావం యాత్రలో భాగంగా జిల్లాకు వచ్చిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం సాయంత్రం కడపకు వెళ్లారు. శుక్రవారం రాత్రి ఆయన గూడూరులోని పార్టీ సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి నివాసంలో బస చేశారు. శనివారం పార్టీ ముఖ్యులతో సమావేశమయ్యారు. ఈ క్రమంలో ఆయనను చూసేందుకు పెద్దసంఖ్యలో మహిళలు, వృద్ధులతో పాటు అన్ని వర్గాల ప్రజలు గోపాల్‌రెడ్డి నివాసం వద్దకు చేరుకున్నారు. జగన్ కోసం మండుటెండను సైతం లెక్కచేయకుండా ఎదురుచూశారు. బయటకు వచ్చిన జగన్మోహన్రెడ్డి అందరికీ అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. ఆయనతో కరచాలనం చేసేందుకు మహిళలు పోటీపడ్డారు. అనంతరం సైదాపురం, రాపూరు మీదుగా ఆయన కడపకు బయలుదేరారు. సైదాపురంలో పోటెత్తిన జనం సైదాపురం: జననేత జగన్మోహన్రెడ్డి సైదాపురం మీదుగా వెళతారని తెలుసుకున్న పలు గ్రామాల ప్రజలు శనివారం మధ్యాహ్నం నుంచే సైదాపురం చేరుకున్నారు. జగన్‌ను పలకరించేందుకు వైఎస్సార్సీపీ నేత బండి సుబ్బారెడ్డి, సర్పంచ్ బండి వెంకటేశ్వర్లురెడ్డి అధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు, విద్యార్థులు ఎదురుచూశారు. అనంతరం సైదాపురం మీదుగా వెళ్లిన జగన్మోహన్రెడ్డికి నీరాజనం పలికారు. సైదాపురం బస్టాండ్ సెంటర్లో జగన్ కాన్వాయ్‌ను ఆపి ప్రజలను పలకరించారు. వారికి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఆయనకు అభివాదం చేసేందుకు ప్రజలు పెద్దసంఖ్యలో పోటీపడ్డారు. అభిమాన నేతపై ప్రజలు పూలవర్షం కురిపించారు. భారీ ఎత్తున బాణసంచా కాల్చారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ కృష్ణారెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటి సభ్యుడు శంకరరాజు, యూత్ అధ్యక్షుడు చెముర్తి జనార్దన్‌రాజు, బీసీ సంఘం మండల కన్వీనర్ బీఎస్యాదవ్, నాయకులు సురేష్‌రెడ్డి, రవికుమార్, రాఘవరెడ్డి, తిరుపాల్, శ్రీనివాసులు, శివారెడ్డి, చంద్రారెడ్డి పాల్గొన్నారు. -
నేటి నుంచి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమైక్యశంఖారావం
సాక్షి, నెల్లూరు : సమైక్యాంధ్ర సాధనే ధ్యేయంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన సమైక్య శంఖారావం యాత్ర శుక్రవారం జిల్లాలో ప్రారంభం కానుంది. నాల్గో విడతలో చిత్తూరు జిల్లాలో 11 రోజుల పాటు కొనసాగిన శంఖారావం యాత్రకు అపూర్వ స్పందన లభించింది. 12వ రోజు శుక్రవారం ఉదయం జిల్లాలోని సూళ్లూరుపేట మండలం పెళ్లకూరు నుంచి యాత్ర ప్రారంభమవుతుంది. ఈ యాత్ర రెండురోజుల పాటు జిల్లాలో సూళ్లూరుపేట, సర్వేపల్లి, గూడూరు, వెంకటగిరి, ఆత్మకూరు నియోజకవర్గాల పరిధిలోని 13 మండలాలు, 108 గ్రామాల మీదుగా కొనసాగుతుంది. జగన్మోహన్రెడ్డి శంఖారావం యాత్రకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. చిత్తూరు జిల్లా కంటే యాత్రను రెట్టింపు విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు, జిల్లా ప్రజలు సమైక్యోత్సాహంతో ఉన్నారు. జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున తరలి రానున్నారు. తొలిరోజు శంఖారావం యాత్ర వివరాలు శుక్రవారం ఉదయం సూళ్లూరుపేట మండలంలోని పెళ్లకూరు నుంచి యాత్ర ప్రారంభమవుతుందని పార్టీ ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్ తెలిపారు. ఉదయం 10 గంటలకు నాయుడుపేటలో జరిగే బహిరంగసభలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు మనుబోలులో నిర్వహించే సభలో జగన్ ప్రసంగిస్తారు. సాయంత్రం 5 గంటలకు గూడూరు సభలో ప్రసంగిస్తారు. రాత్రి గూడూరులో బస చేస్తారు. రెండోరోజు యాత్ర వివరాలు శనివారం ఉదయం 10 గంటలకు వెంకటగిరి బహిరంగసభలో జగన్ ప్రసంగిస్తారు. సాయంత్రం 5 గంటలకు ఆత్మకూరు బహిరంగసభలో ప్రసంగిస్తారు. -
వారిద్దరినీ చెత్తబుట్టలో విసిరేయాలి
సమైక్య శంఖారావం యాత్రలో కిరణ్, చంద్రబాబుపై జగన్ మండిపాటు కొడుకును ప్రధాని కుర్చీలో కూర్చోబెట్టేందుకే సోనియా రాష్ట్రాన్ని విభజిస్తున్నారు దీనికి ప్రతిపక్ష నేత, సీఎం సహకరిస్తున్నారు చంద్రబాబు నోట సమైక్యం అన్న మాట రాదేం? సమైక్యం అంటున్న సీఎం అసెంబ్లీలో ఆ మేరకు ఎందుకు తీర్మానం చేయలేదు? 30 ఎంపీ సీట్లు గెల్చుకుని వీళ్లకు బుద్ధి చెబుదాం సమైక్య శంఖారావం నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘ఓట్లు, సీట్ల కోసం.. తన కొడుకును ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోబెట్టడం కోసం సోనియాగాంధీ రాష్ట్రాన్ని నిలువునా చీల్చేందుకు సిద్ధపడితే.. అందుకు ప్రతిపక్ష నేత చంద్రబాబు, సీఎం కిరణ్ వంత పాడుతున్నారు. ఢిల్లీ అహంకారానికి, తెలుగు జాతి ఆత్మాభిమానానికి నడుమ జరుగుతున్న ఈ సమరంలో.. విలువలు, విశ్వసనీయత లేని కిరణ్, చంద్రబాబులను చెత్తబుట్టలో విసిరేయాల్సిందే’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నిప్పులు చెరిగారు. విభజన కుట్రదారులైన సోనియా, కిరణ్, చంద్రబాబులకు బుద్ధి వచ్చేలా వచ్చే ఎన్నికల్లో 30 ఎంపీ స్థానాలను మనమే గెల్చుకుందామని ప్రజలకు పిలుపునిచ్చారు. జగన్ చేపట్టిన ‘సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్ర’ నాలుగో విడత మూడోరోజున బుధవారం చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో సాగింది. కొత్తపల్లిమిట్ట కూడలిలో జరిగిన బహిరంగ సభలో జగన్ ప్రసంగించారు. ప్రసంగ సారాంశం ఆయన మాటల్లోనే.. బాబూ.. నువ్వు నాయకుడివేనా? వైఎస్ మరణం తర్వాత ఒక్క రాజకీయ నాయకుడికి కూడా‘విశ్వసనీయత’ అన్న పదానికి అర్థం తెలియకుండా పోయింది. రాజకీయాలను ఎత్తులు, పైఎత్తుల చదరంగంగా మార్చేశారు. ఓట్ల కోసం, సీట్ల కోసం రాష్ట్రాన్ని ఎలా విభజించాలా అని చూస్తున్నారు. ఈరోజు రాజకీయాలు ఎంతగా దిగజారిపోయాయో చూడాలంటే.. టీవీ ఆన్ చేసి అసెంబ్లీ సమావేశాల ప్రసారం చూస్తే తెలుస్తుంది. ప్రతిపక్ష నేత చంద్రబాబు సభలో కూర్చొని ఆయన పార్టీకి చెందిన సీమాంధ్ర ఎమ్మెల్యేలతో సమైక్యాంధ్ర అనిపిస్తారు. మరోవైపు తెలంగాణ నేతలతో విభజన డిమాండ్ చేయిస్తారు. అసలు మీరు ఒక నాయకుడేనా అని ప్రశ్నిస్తున్నా. మీకు చిత్తశుద్ధి ఉంటే రెండో మాట లేకుండా సమైక్య రాష్ట్రం కావాలని డిమాండ్ చేయవచ్చు కదా? గతంలో ఇచ్చిన లేఖను వెనక్కు తీసుకోవచ్చు కదా? అది చేయకుండా పార్టీ నేతలతో రెండు రకాలుగా మాట్లాడించే మిమ్మల్ని ఏమనాలి? సమైక్య ముసుగులో కిరణ్..: సోనియా రచించిన విభజన నాటకాన్ని సమైక్యవాది ముసుగులో కిరణ్ రక్తి కట్టిస్తున్నారు. రాష్ట్రంలో 70 శాతం మంది ప్రజలు సమైక్య రాష్ట్రాన్ని కోరుకుంటుంటే.. సీఎంగా కిరణ్ చేస్తున్నదేమిటి? రంగురంగుల టీవీ ప్రకటనల్లో తనను తాను గొప్ప సమైక్యవాదిగా ప్రచారం చేసుకుంటున్నారు. మరోవైపు సోనియా గీసిన గీత దాటకుండా రాష్ట్ర విభజనకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూస్తున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న ఉద్దేశం కిరణ్‌కు ఉంటే.. అసెంబ్లీలో ఎప్పుడో ‘సమైక్య’ తీర్మానం చేసి ఉండేవారు.’’ మూడో రోజు యాత్ర సాగిందిలా: నెలవాయి గ్రామంలో ఉదయం సమైక్య శంఖారావం యాత్ర ప్రారంభమైంది. అక్కడ్నుంచి క్షీరసముద్రం, నాయుడుపల్లె, ఎస్ఆర్పురం క్రాస్, పుల్లూరు క్రాస్, శూలగిల్లు మీదుగా తెల్లగుండ్లపల్లె జగన్ చేరుకున్నారు. అక్కడ పోతగంటి నరసయ్య కుటుంబాన్ని పరామర్శించారు. తర్వాత కొత్తపల్లి మిట్ట చేరుకుని సభలో ప్రసంగించి, వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం అక్కినేని భౌతిక కాయానికి శ్రద్ధాంజలి ఘటించేం దుకు హైదరాబాద్‌కు వెళ్లారు. యాత్రలో మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు అమర్నాథ్రెడ్డి, గాంధీ, వైఎస్సార్సీపీ నేత పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గురువారం యాత్ర యథాతథంగా కొనసాగనుంది. వైఎస్ విగ్రహానికి నాలుగడుగుల స్థలం ఇవ్వరా? ఈ కూడలి (కొత్తపల్లిమిట్ట) పక్కనే దివంగత నేత వైఎస్ విగ్రహం ఉంది. అయితే ఆవిష్కరణ ఆగిపోయింది. కారణం ఆ విగ్రహానికి అనుమతి లేదట. వైఎస్సే లేకపోతే అసలు వీళ్ల ప్రభుత్వం ఉండేదా? మండుతున్న ఎండలో పాదయాత్ర చేసి కాంగ్రెస్‌ను బతికించిన నేత విగ్రహం పెట్టడం కోసం నాలుగడుగుల స్థలానికి అనుమతి ఇవ్వని ఈ పాలకులను ఏమనాలి? -వైఎస్ జగన్ -
మన గడ్డమీద పుట్టి మనల్నే మోసం చేస్తున్నారు : జగన్
చిత్తూరు: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇద్దరూ మన గడ్డ మీద పుట్టి మనల్నే మోసం చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సమైక్య శంఖారావం యాత్రలో భాగంగా ఈరోజు ఆయన ఇక్కడకు వచ్చారు. గాంధీ సర్కిల్ వద్ద జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు సమైక్యమే వినిపిస్తుందని చెప్పారు. చిత్తూరు నగరంలో బిందె నీళ్లు 2 రూపాయలకు కొనాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. మహానేత వైఎస్ఆర్ మరణించాక రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరిగా మార్చారన్నారు. సీఎం పదవి కోసం కిరణ్ సోనియా గీసిన గీత దాటడం లేదని చెప్పారు. మొదటగా అసెంబ్లీ తీర్మానం చేయాల్సిందిపోయి మనల్నే చర్చించుకోమంటున్నారని విమర్శించారు. కేంద్రం దారుణంగా వ్యవహరించడానికి కారణం చంద్రబాబు నోట సమైక్యమనే మాట రాకపోవడమేనన్నారు. రాష్ట్ర విభజనకు తోడ్పడుతున్న కిరణ్, చంద్రబాబులకు సమైక్యత కోరుకునే 70 శాతం మంది ఉసురుతగులుతుందని హెచ్చరించారు. 30 ఎంపీ స్థానాలను గెలుచుకుని సమైక్యమన్న వారినే ప్రధాని కుర్చీలో కూర్చోబెడదామన్నారు. అంతకు ముందు దర్గా సెంటర్లో జగన్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. -
జనాభిమానం
-
మీకు కొంచెమైనా సిగ్గుందా ?: వైఎస్ జగన్
* సీఎం కిరణ్, ప్రతిపక్ష నేత చంద్రబాబుపై వైఎస్ జగన్ ధ్వజం * కేంద్రం అడ్డగోలుగా విభజన నిర్ణయం తీసుకుని రాష్ట్రానికి బిల్లు పంపింది * ఆ బిల్లు మాకొద్దని వెనక్కి పంపాల్సిన కిరణ్, బాబు నిస్సిగ్గుగా బిల్లుపై చర్చ జరిపిస్తున్నారు * బిల్లుపై చర్చ జరిగితే విభజనకు ఒప్పుకున్నట్టే * కిరణ్, బాబులతో మాట్లాడి గులాంనబీ ఆజాద్ బిల్లుపై చర్చ జరిగేలా చేస్తున్నారు * ఓటింగ్ కోసం పట్టుబట్టిన వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేశారు ‘సమైక్య శంఖారావం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజిస్తూ నిర్ణయం తీసుకొని ఆ బిల్లు మనకు పంపించారు. ఈ బిల్లు మాకు వద్దు అని చెప్పి వెనక్కి పంపించాల్సిన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నిస్సిగ్గుగా బిల్లు మీద ఇవాళ చర్చ జరిపిస్తున్నారు. బిల్లు మీద చర్చ జరిగితే విభజన చేయడానికి కేంద్రానికి అనుమతిచ్చినట్టే అవుతుంది.. అందుకోసమే చర్చ జరగనే వద్దని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా పట్టుపడుతోంది. కానీ కాంగ్రెస్ పార్టీ, చంద్రబాబు నాయుడు కుమ్మక్కై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదే తప్పని వేలెత్తి చూపించే సిగ్గుమాలిన పనికి ప్రయత్నిస్తున్నారు’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్రెడ్డి విమర్శించారు. తాపీగా విభజన కార్యక్రమం పూర్తి చేసేందుకే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారని అన్నారు. ఈ గడ్డ మీద పుట్టిన ఈ ముఖ్యమంత్రికి, ప్రతిపక్ష నాయకుడికి ఇంతకంటే సిగ్గు ఏమైనా ఉందా? అని నిలదీశారు. ‘‘బీహార్‌లో కూడా ఇటువంటి పరిస్థితి ఎదురైనపుడు అక్కడి ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ గట్టిగా నిలబడి ఎదుర్కొన్నారు. మీరెవరు మా రాష్ట్రాన్ని విడగొట్టడానికి? ఆ అధికారం మీకు ఎవరిచ్చారు? అని ఆ బిల్లును లాలూ ప్రసాద్ యాదవ్ వెనక్కి పంపించారు. మళ్లీ లాలూను ఒప్పించిన తరువాతే బీహార్‌ను విడగొట్టారు. మన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆ పని ఎందుకు చేయలేకపోతున్నారు?’’ అని ప్రశ్నించారు. ఓట్ల కోసం, సీట్ల కోసం రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించటాన్ని నిరసిస్తూ జగన్మోహన్రెడ్డి కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా తలపెట్టిన ‘సమైక్య శంఖారావం’ యాత్ర చిత్తూరు జిల్లాలో మూడో విడత, ఐదో రోజు గురువారం ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పీలేరులోను,చంద్రగిరి, పుంగనూరు నియోజకవర్గాల్లోనూ కొనసాగింది. సదుం, కల్లూరుల్లో వైఎస్ విగ్రహాలను ఆవిష్కరించారు. సదుం మండల కేంద్రం, పీలేరు నియోజకవర్గ కేంద్రం, కల్లూరు, మాదలచెరువు గ్రామాల్లో జరిగిన బహిరంగ సభలకు పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి జగన్ ప్రసంగించారు. ఈ ప్రసంగాల సారాంశం ఆయన మాటల్లోనే.. చర్చ అంటూ పట్టపగలు ప్రజల్ని మోసం చేస్తున్నారు ‘‘ఈ రోజు టీవీ ఆన్ చేస్తే మనకు అసెంబ్లీ సమావేశాలే కనిపిస్తున్నాయి. కానీ వాటిలో చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డి మాత్రం కనపడరు. ఇద్దరూ మోసగాళ్లే. ఇవాళ అసెంబ్లీ జరుగుతున్న తీరు చూస్తుంటే దేశ చరిత్రలో ఇంత అన్యాయం ఎక్కడా జరగలేదేమో అనిపిస్తోంది. ఏ రాష్ట్రాన్నైనా విభజించాలని అనుకుంటే మొదట ఆ శాసన సభలో తీర్మానం చేయాలి. శాసన సభ్యులంతా అనుకూలమే అని చెబితే తప్ప విభజించడానికి వీలు లేదు. ఇవాళ రాష్ట్రంలో 70 శాతం మంది ప్రజలు సమైక్యాన్ని కోరుకుంటున్నారు. శాసన సభలో మెజార్టీ ఎమ్మెల్యేలు రాష్ట్రాన్ని విడగొట్టొద్దని చెప్తున్నారు. కానీ యూపీఏ ప్రభుత్వం మాత్రం ఎటువంటి తీర్మానం లేకుండా బిల్లును అసెంబ్లీకి పంపి ఇక విభజన అయిపోయింది, చర్చించుకోండి అని చెప్తోంది. ఇటువంటి అన్యాయం ఎక్కడైనా ఉందా? బిల్లు మీద చర్చ పెట్టి, పట్టపగలు రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారు. సమైక్యాంధ్ర కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరాహార దీక్షలు చేసింది. పార్టీ మొత్తం ఒక్కతాటి మీద నిలబడి, రాష్ట్రపతి దగ్గరకు వెళ్లి అఫిడవిట్లు ఇచ్చి సమైక్యాంధ్ర కోసం నిలబడింది. చర్చ జరిగితే విభజనకు ఒప్పుకున్నట్టే అని, చర్చ కాదు ఓటింగ్ జరపండి అని పట్టుబట్టిన వైఎస్సార్ సీపీ శాసన సభ్యులను ప్రభుత్వం ఈ రోజు శాసనసభ నుంచి సస్పెండ్ చేయించింది. ఇవాళ పేపర్లో చదివా.. కేంద్ర మంత్రి గులాంనబీ ఆజాద్ మన రాష్ట్రానికి వచ్చారట. చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డితో మాట్లాడి వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయించి చర్చ సాగిస్తున్నారట. నిజంగా మీరు చేస్తున్న దిక్కుమాలిన రాజకీయాలు, రాక్షస పాలన అంతమయ్యే రోజులు త్వరలోనే వస్తాయి. విభజన కోసం చర్చ ఎందుకు? రాష్ట్రాన్ని విభజించడానికి మీరు అసెంబ్లీలో చర్చ ప్రారంభించారు. విభజన కోసం చర్చ ఎందుకు అని అడుగుతున్నా. ఒక్కరోజు శాసన సభ్యులందరినీ అసెంబ్లీకి పిలవండి, పిలిచి ఈ రాష్ట్ర విభజనకు మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరా అని అడగండి. వాళ్లు చెప్పిన దాన్నే తీర్మానంగా చేయండి. అది చేస్తే సరిపోదా? అని అడుగుతున్నా. ఆ కార్యక్రమం చేయాలంటే మీకు మనసు రాదు. ఒక్కసారి ప్రజల వద్దకు రండి, ఆ ప్రజలను అడగండి. వాళ్లు ఏం చెప్తే అది చేయండి. నేను దారి వెంట వస్తూ చాలా మంది ప్రజలను అడిగా.. పీలేరు నియోజకవర్గ ప్రజలను కూడా అడిగా! ‘గ్యాస్ సబ్సిడీ ఇంత వరకు అందలేదన్నా.. రూ.1,300 పెట్టి గ్యాస్ కొనుక్కుంటున్నాం’ అని చాలామంది అక్కా చెల్లెమ్మలు చెప్పారు. వ్యవసాయానికి ఎన్నిగంటలు కరెంటు ఇస్తున్నారని రైతన్నలను అడిగితే.. 3-4 గంటలకు మించి ఇవ్వలేదన్నారు. పీలేరులో తాగటానికి నీళ్లు లేవని అక్కాచెల్లెమ్మలు చెప్తున్నా రు, బిందెడు నీళ్లు రూ.3 నుంచి రూ. 5 పెట్టి కొనుక్కుంటున్నాం అని చెప్తున్నారు. ఈ సమస్యల మీద చర్చించకుండా రాష్ట్రాన్ని ఎలా విభజించాలని చర్చిస్తారట. కిరణ్.. ఎవరు ఆపుతున్నారు మిమ్మల్ని? అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరు చూస్తే గుండె తరుక్కుపోతోంది. ఎప్పుడో జూలై 30న సీడబ్ల్యూసీ మీటింగ్‌లో సోనియాగాంధీ రాష్ట్రాన్ని విభజిస్తామని చెప్పారు. కిరణ్‌కుమార్‌రెడ్డిని నేను అడుగుతున్నా. ఎవరు ఆపుతున్నారయ్యా నిన్ను? ముఖ్యమంత్రి హోదాలో వెంటనే అసెంబ్లీని సమావేశపరిచి విభజనకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని చెప్పి మేం అంతా కోరినా కూడా మీరు ఎందుకు తీర్మానం చేయలేదు? అంతెందుకు కనీసం ఇప్పుడైనా తీర్మానం చేయండి అంటే వెనకడుగు వేస్తున్నారు. సోనియా గాంధీ ప్రత్యేక విమానంలో బిల్లును పంపించారు. ఆ బిల్లు డ్రాఫ్టు అందిన 17 గంటలలోపే సంతకం చేసి దాన్ని అసెంబ్లీకి ఎందుకు పంపించారు? రాష్ట్రమంతటా సమైక్య ఉద్యమాలు జరుగుతున్నాయి. ఉద్యోగస్తులు దీక్షలు చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు. అటువంటి ఉద్యోగులను ఎందుకు కిరణ్‌కుమార్‌రెడ్డి భయపెట్టి దీక్షలు, ధర్నాలను విరమింపజేశారు? సోనియా గాంధీ విభజన చేయాలని చెప్తుంటే ముఖ్యమంత్రిగా నువ్వు మీ అధికారులకు చెప్పి ప్రతి అడుగులోనూ ఎందుకు సహకారం అందిస్తున్నావు?’’ జగన్ వెంట యాత్రలో పాల్గొన్న వారిలో జిల్లా పార్టీ కన్వీనర్ నారాయణస్వామి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, అమర్నాథ్రెడ్డి, పార్టీ నాయకులు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, రోజా, డాక్టర్ సునీల్‌కుమార్ తదితరులు ఉన్నారు. సమైక్యం కోసం మీరు ఏం చేశారు? ‘‘రాష్ట్రాన్ని విడగొట్టడానికిగాను బిల్లుపై చర్చ జరిపించేందుకు ఉత్సాహం చూపిస్తున్న నాయకులందరినీ నేను అడగదలుచుకున్నా. ఈ రాష్ట్రాన్ని విడగొట్టకూడదని ఏ రోజైనా మీరు నిరాహార దీక్షలు చేశారా? రాష్ట్రాన్ని విడగొట్టవద్దని ఎప్పుడైనా రాష్ట్రపతి వద్దకు వెళ్లి అఫిడవిట్లు ఇచ్చారా? రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలి అని కనీసం ఒక్క లేఖైనా ఇచ్చారా? అని అడుగుతున్నా. ఏ ఒక్కటీ కూడా వీళ్లు చేయలేదు. వీళ్లు చేస్తున్నదంతా ముసుగులో దొంగాట. వీళ్లంతా కుమ్మక్కై ఈ రాష్ట్రాన్ని విడగొట్టడానికి సిద్ధమయ్యారు. మీరు చేస్తున్న మోసాలను పై నుంచి దేవుడు చూస్తున్నాడు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరం ఒక్కటవుతాం. ఒక్కటైనప్పుడు ఉప్పెన లేస్తుంది. రాష్ట్రాన్ని విభజించాలని ఉబలాటపడుతున్న సోనియాగాంధీ, ఆమె గీచిన గీత దాటకుండా ప్రజలను మోసం చేస్తున్న కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్యాకేజీలు అడుగుతున్న చంద్రబాబు.. వీళ్లంతా ఆ ఉప్పెనలో కొట్టుకుపోతారు. వీళ్లంతా ఎన్ని కుట్రలు పన్నినా.. మరో నాలుగు నెలల్లో ఎన్నికలు వస్తాయి. ఆ ఎన్నికలు ఢిల్లీ అహంకారానికి, తెలుగువారి ఆత్మగౌరవానికి మధ్య జరుగుతాయి. వాటిలో మనందరం ఒక్కటవుదాం. ఒక్కటై 30 ఎంపీ స్థానాలను మనంతట మనమే తెచ్చుకుందాం. ఎవరైతే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతారో వారినే ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోబెడదాం.’’ -
బాబు, కిరణ్ కాలర్ పట్టుకుంటే ఏం చేస్తారు?
చిత్తూరు: చంద్రబాబు ఏసీ రూమ్‌లో కూర్చుని సీమాంద్ర, తెలంగాణ అంటూ విభిన్న వాదనలు చేయిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆరోపించారు. సమైక్య శంఖారావంలో భాగంగా చిత్తూరు జిల్లా సాదుంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని జగన్ ఆవిష్కరించి, అనంతరం బహిరంగం సభలో మాట్లాడారు. రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి సీఎం కిరణ్, చంద్రబాబు సహకరిస్తున్నారని ఆరోపించారు. అసెంబ్లీలో చంద్రబాబు, కిరణ్‌లు ఎందుకు కనిపించడం లేదని ఆయన ప్రశ్నించారు. మోజార్టీ ఎమ్మెల్యేలు విభజన వద్దంటున్నా వినడం లేదన్నారు. వచ్చిన బిల్లును వెనక్కి పంపకుండా చర్చకు పెట్టడం ఎంతవరకు సమంజసమన్నారు. చర్చకు ఉత్సాహపడుతున్న నేతలు ఏనాడైనా ఆమరణదీక్షలు చేశారా, అఫిడవిట్లు ఇచ్చారా అని నిలదీశారు. విభజనకు వ్యతిరేకంగా కనీసం ఒక్క లేఖ అయినా ఇచ్చారా అంటూ ప్రశ్నించారు. విభజన జరగకుండానే హైదరాబాద్ వదిలి వెళ్లమంటున్నారని వాపోయారు. ఉద్యోగం కోసం ఎక్కడికి పోవాలంటూ యువత బాబు, కిరణ్ కాలర్ పట్టుకుంటే ఏం చేస్తారని జగన్ అన్నారు. విభజనకు వ్యతిరేకంగా రాష్ట్రం అంతా ఒక్కటౌతుందని త్వరలోనే ఉప్పెన లేస్తుందన్నారు. ఆ ఉప్పెనలో విభజనవాదులు కొట్టుకుపోతారన్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో 30ఎంపీలు స్థానాలు గెలుచుకుందాం, రాష్ట్రాన్ని ఎవరు విభజిస్తారో చూద్దామని జగన్ అన్నారు. -
చంద్రబాబుకు చాలెంజ్
ప్రజల్లోకి వెళ్లి నీ పాలన మళ్లీ తెస్తానని చెప్పగలవా? టీడీపీ అధినేతకు వైఎస్ జగన్మోహన్రెడ్డి సవాల్ నువ్వు రూపాయి ఇస్తానన్నా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఎందుకంటే తొమ్మిదేళ్ల పాలనలో నువ్వు ప్రజలకు పది పైసల మేలు కూడా చేయలేదు అదే జగన్ రూ.50 ఇస్తానన్నా ప్రజలు నమ్ముతారు.. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా ఎన్టీఆర్ హామీలనూ తుంగలో తొక్కిన ఘనత బాబుదే ఇప్పుడు అదే చంద్రబాబు అన్నీ ఉచితమంటూ సునాయాసంగా హామీలిస్తున్నారు రాష్ట్రంలో ప్రతి గొంతూ ‘జై సమైక్యాంధ్ర’ అని నినదిస్తోంది.. అయినా బాబుకు, కిరణ్‌కుమార్‌రెడ్డికి అర్థం కావటం లేదు దమ్ము, ధైర్యం ఉంటే రండి ఎన్నికలకు పోదాం.. ‘సమైక్యశంఖారావం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల కోసం ప్రజలను తప్పుదోవ పట్టించే మాటలు మాట్లాడుతున్నారు. రకరకాల ఎన్నికల హామీలు ఇస్తున్నారు. ఇదే చంద్రబాబును చాలెంజ్ చేస్తున్నాను. ప్రజల్లోకి వెళ్లి నీ తొమ్మిదేళ్ల పాలన తిరిగి తెస్తానని ప్రజలకు చెప్పగలవా?’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగ న్మోహన్రెడ్డి సవాల్ విసిరారు. నాడు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా.. ఎన్టీఆర్ పథకాలను కూడా తుంగలో తొక్కిన ఘనత చంద్రబాబుదేనని విమర్శించారు. 2014లో తాను అధికారంలోకి వచ్చిన తరువాత దివంగత నేత, ప్రియతమ నాయకుడు వైఎస్సార్ సువర్ణ యుగాన్ని మళ్లీ తీసుకొని వస్తానని జగన్మోహన్రెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు. ఆ సువర్ణయుగం 30 ఏళ్ల పాటు కొనసాగుతుందని, ఆ రాజన్న రాజ్యంలో ప్రతి పేదవాని గుండె చప్పుడు వింటానని, ప్రతి పేదవాని మనసు ఎరుగుతానని భరోసా ఇచ్చారు. ‘‘నేను చనిపోయిన తరువాత కూడా ప్రతిపేదవాడి ఇంట్లో నాన్నగారి ఫొటో పక్కన నా ఫొటో కూడా పెట్టుకునేంతలా పేదవాడి కోసం కృషి చేస్తాను’’ అని ఉద్వేగంగా వ్యాఖ్యానించారు. ఓట్ల కోసం, సీట్ల కోసం రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించటాన్ని నిరసిస్తూ జగన్ కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా తలపెట్టిన ‘సమైక్య శంఖారావం’ యాత్ర మలిదశ నాలుగో రోజు మంగళవారం చిత్తూరు జిల్లా మదనపల్లె నియోజకవర్గంలో కొనసాగింది. మదనపల్లె నియోజకవర్గ కేంద్రంలో జరిగిన బహిరంగ సభలకు ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. వారిని ఉద్దేశించి జగన్ ప్రసంగించారు. సమైక్య నినాదాల మధ్య సాగిన జగన్ ప్రసంగ సారాంశం ఆయన మాటల్లోనే.. ఆ మాట.. జై సమైక్యాంధ్ర.. ఇవాళ ప్రతి గొంతు ఒకే ఒక మాట మాట్లాడుతోంది. ప్రతి మనసు ఒకే ఒక ఆలోచనతో ఉద్యమ బాట పట్టింది. ఆ ఒకే ఒక్క మాట ఏమిటీ అని అంటే.. ‘జై సమైక్యాంధ్ర’. అయినా కూడా మన ఖర్మ ఏమిటంటే ఈ గడ్డ మీద పుట్టిన చంద్రబాబుకు, కిరణ్‌కుమార్‌రెడ్డికి మాత్రం అర్థం కావట్లేదు. సోనియాగాంధీకి మన భాష రాదు, మన దేశం గురించి కూడా సరిగా తెలియదు కాబట్టి ఆవిడ గురించి నేను చెప్పవలసిన అవసరం లేదు. సోనియాగాంధీ తన కొడుకును ప్రధానమంత్రి సీట్లో కూర్చోబెట్టుకోవడం కోసం ఇవాళ మన పిల్లల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది.. తెలియని వారికి ఏదైనా చెప్పొచ్చని. కానీ కళ్లుండి కూడా కబోదుల్లా నాటకం ఆడుతున్న వీళ్లకు ఎలా చెప్పాలి? చంద్రబాబూ నీకు, కిరణ్‌కుమార్‌రెడ్డికి, సోనియాగాంధీకి.. మీకు దమ్ము, ధైర్యం ఉంటే రండి ఎన్నికలకు పోదాం. సమైక్య నినాదంతో నేను యావత్తు రాష్ట్రం తిరుగుతాను.. 30 ఎంపీ స్థానాలు గెలుచుకొని వస్తాను. గెలుచుకోవడమే కాదు ఎవరైతే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతారో వారినే ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోబెడతాం. ప్రజల్లోకి రావడానికి మీకు దమ్ము, ధైర్యం ఉందా? ఇలా బస్సులో మీరు ఈ పక్కనుంచి వెళ్తే మీ మీద కోడి గుడ్ల దగ్గర నుంచి టమాటాల వరకు అన్నీ పడతాయనే సంగతి మీకు మాత్రం తెలియదా? చంద్రబాబు సభలకు జనం రాకున్నా.. వచ్చినట్లు.. ఆ దివంగత నేత వైఎస్సార్ బతికి ఉన్నప్పుడు ఒక సువర్ణయుగాన్ని చూపించారు. ఆ సువర్ణయుగంలో ఎవ్వరు కూడా విడిపోదాం అని అడగని పరిస్థితుల్లో వైఎస్సార్ రాష్ట్రాన్ని నడిపించారు. ఆయన చనిపోయిన తరువాత రాష్ట్రంలో రాజకీయ వ్యవస్థ ఎలా తయారైపోయిందంటే.. నిజాయితీ కరువైంది. ఎంతలా కరువై పోయిందంటే సమైక్యంగా ఉండాలని రాష్ర్టమంతటా ఉద్యమ బాట పడుతుంటే చంద్రబాబు మొన్న తిరుపతికి వచ్చి ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించేలా మాట్లాడిన మాటలు వింటే ఆయన ఒక నాయకుడా? అని పిస్తోంది. ఇవాళ ‘ఈనాడు’ దినపత్రికలో చంద్రబాబు నాయుడుకు సంబంధించి ఒంగోలులో జరిగిన ఒక మీటింగ్ ఫొటో వేశారు. ఆశ్చర్యం ఏమిటంటే ఆ ఫొటోలో వేసిన దాని ప్రకారం కనీసం మదనపల్లిలో ఈ రోజు ఇక్కడ ఉన్న జనాభా కూడా అక్కడ ఉన్నట్టు కనిపించలేదు. 10 వేల మంది జనాభా కూడా లేకపోయినా కుర్చీలు వేశారు.. కుర్చీలు వేసి జనాలు ఎక్కువగా ఉన్నట్టు చూపించుకునే కుయుక్తులు పన్నుతున్నారు. నాడు హామీలిచ్చి.. ఏం చేశావ్ బాబూ? చంద్రబాబు ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు రకరకాల హామీలు ఇస్తూ పోతున్నారు. తొమ్మిది సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు 8 సార్లు కరెంటు చార్జీలు పెంచిన చంద్రబాబు.. ఇవాళ కరెంటు చార్జీలు తగ్గిస్తారట. మీ మామ ఎన్టీఆర్ గారు రూ.2కే కిలో బియ్యం ఇస్తే దాన్ని రూ 5.25 చేసింది నువ్వు కాదా? మద్యపానాన్ని నిషేధిస్తామని ఎన్నికలకు వెళ్లి.. ఎన్నికలయ్యాక మాట మార్చలేదా? గ్రామగ్రామాన బెల్టు షాపులు పెట్టించలేదా? ఇదీ చంద్రబాబు విశ్వసనీయత. ఆ వేళ రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. ఉచిత కరెంటు ఇవ్వాలని ప్రతిపక్షాలు అడిగితే.. ఉచిత కరెంటు ఇస్తే ఈ తీగలు మీద బట్టలు ఆరేసుకోవాల్సి వస్తుందని చంద్రబాబు వెటకారం చేశారు. ఇప్పుడు ఇదే చంద్రబాబు అన్నీ ఉచితంగా ఇస్తామని చాలా సునాయాసంగా చెప్తున్నారు. అదీ సువర్ణయుగం అంటే.. ఇదేచంద్రబాబు అవ్వాతాతల పెన్షన్ గురించి మాట్లాడుతారు. నాకు బాగా గుర్తింది ఆ వేళ.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అవ్వాతాతలకు ముష్టి వేసినట్లు కేవలం రూ. 70 మాత్రమే పెన్షన్లు ఇచ్చేవారు. అది కూడా గ్రామంలో 20-30 మంది కంటే ఎక్కువ మందికి పెన్షన్లు ఉండే వి కాదు. ఊళ్లో ఎవరైనా ఒకరు చనిపోతేగాని మరొకరికి పెన్షన్ ఇవ్వని దుస్థితి. చంద్రబాబు హయాంలో పెన్షన్ల సంఖ్య కేవలం 16 ల క్షలు మాత్రమే. ఆ తరువాత ప్రియతమ నాయకుడు వైఎస్సార్ ముఖ్యమంత్రి స్థానంలోకి వచ్చారు. 16 లక్షలు ఉన్న పెన్షన్లను ఏకంగా 71 లక్షలకు తీసుకొని పోయారు. రూ. 70 ఇచ్చే పెన్షన్‌ను రూ. 200 పెంచి ఆ అవ్వాతాతల గుండెల్లో కొలువయ్యాడు. అదీ రామరాజ్యం అంటే..సువర్ణయుగమంటే.’’ జగన్ వెంట యాత్రలో.. జగన్ వెంట యాత్రలో పాల్గొన్న నేతల్లో జిల్లా పార్టీ కన్వీనర్ నారాయణస్వామి, మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే భూమన, ఎమ్మెల్సీ దేశాయి తిప్పారెడ్డి, తాజా మాజీ ఎమ్మెల్యేలు అమరనాథ్‌రెడ్డి, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, పార్టీ కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం, పార్టీ నాయకులు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మిథున్‌రెడ్డి, షమీం అస్లాం, డి.ఉదయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. బాబు రూపాయి ఇస్తానన్నా ప్రజలు నమ్మరు.. ‘‘ఇదే చంద్రబాబు మైకులు పట్టుకొని నిన్న మాట్లాడుతూ... కాపు కులస్తులకు రిజర్వేషన్లు ఇస్తానని వాగ్దానం చేశారు. 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నావు కదయ్యా... ఆ రోజు కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని నీకు తట్టిందా? లేదు. విశ్వసనీయత గురించి ఇంకొక మాట చెప్పాలి. చంద్రబాబు ప్రజలకు ఒక్క రూపాయి ఇస్తానంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. అదే జగన్మోహన్రెడ్డి ప్రజలకు రూ. 50 ఇస్తానని చెప్పినా కూడా ప్రజలంతా హర్షధ్వానాలతో నమ్మే పరిస్థితి ఉంది. కారణం చంద్రబాబు 9 ఏళ్లు పరిపాలన చేసినపుడు రూపాయి ఇస్తానని వాగ్దానం చేసినప్పుడు కనీసం 10 పైసలు కూడా ప్రజలకు మేలు చేసిన దాఖలాలు లేవు.’’ జగన్‌కు జనం బ్రహ్మరథం సాక్షి ప్రతినిధి, తిరుపతి: ‘సమైక్య శంఖారావం’ యాత్ర చిత్తూరు జిల్లాలో మంగళవారం ఉత్సాహంగా సాగింది. పుంగనూరు నియోజకవర్గం నుంచి మంగళవారం ప్రారంభమైన యాత్రకు మదనపల్లె వరకూ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. సుగాలిమిట్టలో జగన్ వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. రాంపల్లె, ఈడుగపల్లె, 150 మైలు, వలసపల్లె, మొలకలదిన్నె, బసినికొండ, నిమ్మనపల్లె క్రాస్ మీదుగా యాత్ర చేశారు. మధ్యలో వలసపల్లెలో వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. మదనపల్లెలోని చిత్తూరు బస్టాండ్ మీదుగా, బెంగళూరు బస్టాండ్ చేరుకుని అక్కడ జంక్షన్లో భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. ముగిసిన రెండో విడత: చిత్తూరు జిల్లాలో రెండో విడత సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్ర మంగళవారంతో ముగిసింది. మదనపల్లె బహిరంగ సభలో ప్రసంగించిన జగన్ రోడ్డు మార్గంలో నేరుగా బెంగళూరు విమానాశ్రయానికి వె ళ్లిపోయారు. అక్కడి నుంచి విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు యాత్ర ఏడు రోజులు కొనసాగింది. మొదటి విడతలో రెండు కుటుంబాలను, రెండవ విడతలో ఐదు కుటుంబాలను మొత్తం ఏడు కుటుంబాలను జగన్ ఓదార్చినట్లు వైఎస్సార్ సీపీ నేత తలశిల రఘురాం తెలిపారు. రెండో విడత యాత్ర నాలుగు రోజులు కొనసాగింది. ఈ నెల 28న అనంతపురం జిల్లా కొత్తచెర్వు వద్ద జరిగిన నాందేడ్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాద బాధితులను పరామర్శించారు. 4 నుంచి తిరిగి యాత్ర ప్రారంభమవుతుంది. -
జనం గుండెచప్పుడు
-
బాబు, కిరణ్‌ల కాలర్ పట్టుకోండి
* సమైక్య శంఖారావంలో రైతులకు, విద్యార్థులకు వైఎస్ జగన్ పిలుపు * నీళ్ల కోసం ఎక్కడికెళ్లాలంటూ బాబును నిలదీయండి * ఉద్యోగాల కోసం ఎక్కడికెళ్లాలంటూ కిరణ్‌ను అడగండి * వాళ్లు నాయకులని చెప్పుకోవడానికి నోరు కూడా రాదు * మనందరం కలిసి వీళ్లను బంగాళాఖాతంలో పడేద్దాం * రాష్ట్రపతిని సమైక్యం కోరలేదేం చంద్రబాబూ? * సమైక్యానికి అనుకూలంగా లేఖయినా ఇవ్వలేదేం? * ఢిల్లీ అహంకారానికి, తెలుగు ఆత్మగౌరవానికి యుద్ధమిది * 30 ఎంపీ సీట్లు గెలుచుకుని ఢిల్లీని మనమే శాసిద్దాం * సోనియాను, బాబును, కిరణ్‌ను క్షమించొద్దంటూ జన నినాదం.. ఢిల్లీ పీఠం దద్దరిల్లేలా చెప్పండంటూ ఉత్సాహపరిచిన జన నేత చంద్రబాబు ఇక్కడికి వచ్చినప్పుడు ప్రతి రైతన్నా ఆయన కాలర్ పట్టుకుని ఒక మాట అడగండి. ‘నీళ్ల కోసం మేమెక్కడికి వెళ్లాలి చంద్రబాబు నాయుడు గారూ?’ అని నిలదీయాలి. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా తక్కువ తినలేదు. ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు, చదువుకున్న ప్రతి పేద పిల్లాడు కూడా ‘ఉద్యోగాల కోసం మేమెక్కడికి వెళ్లాలి?’ అని ఆయన కాలర్ పట్టుకుని అడగండి. విడగొడితే రాష్ట్రం ఎడారవుతుందనే విషయాన్ని కూడా వీరు పక్కన పెట్టారు. చదువుకున్న విద్యార్థులు ఉద్యోగాల కోసం ఎక్కడికి వెళ్లాలనే పరిస్థితిని కూడా పక్కన పెట్టారు. ఓట్ల కోసం, సీట్ల కోసం ఏం చేయడానికైనా వెనకాడని ఇటువంటి నాయకులను చూస్తున్నప్పుడు బాధనిపిస్తుంది. - పలమనేరు నియోజకవర్గ సమైఖ్య శంఖారావంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి సమైక్య శంఖారావం నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘రాష్ట్రపతిని కలవడానికి వెళ్లిన చంద్రబాబు గారు, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిందిగా ఆయనను ఎందుకు కోరలేదు? సమైక్య రాష్ట్రానికి అనుకూలంగా రాష్ట్రపతికి ఆయన లేఖ ఎందుకు ఇవ్వలేదు?’’ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలదీశారు. బాబు నోట ఒక్కసారంటే ఒక్కసారి కూడా సమైక్యమనే మాట కూడా ఎందుకు రావడం లేదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో జరుగుతున్నది ఢిల్లీ అహంకారానికి, తెలుగువాడి ఆత్మగౌరవానికి మధ్య యుద్ధమని అభివర్ణించారు. ‘త్వరలో సాధారణ ఎన్నిక లు రాబోతున్నాయి. మనందరం ఒక్కతాటి మీదకు వచ్చి 30 ఎంపీ స్థానాలను తెచ్చుకుందాం. ఢిల్లీ కోటను మనమే కట్టుకుందాం’ అంటూ పిలుపునిచ్చారు. ఈ రాష్ట్రాన్ని ఎవరు నిలబెడతారో అప్పుడు తెలుస్తుందన్నారు. ‘‘రాష్ట్రంలో నాలుగు నెలల్లో ఎన్నికలొస్తాయి. మీకు దమ్మూ ధైర్యముంటే ఆ ఎన్నికలకు పోదాం పదండి’ అంటూ సోనియాగాంధీకి, చంద్రబాబుకు సవాలు విసిరారు. ‘‘వాళ్లకు నేను చాలెంజ్ కూడా విసురుతున్నా. నాకు దమ్మూ ధైర్యం ఉన్నాయి. ఆ ఎన్నికల్లో 30 ఎంపీ స్థానాలను మేం గెలుచుకుంటామని చెప్తున్నాం. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేవారినే ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోబెడతామని చెప్తున్నాం’’ అన్నారు. ‘‘రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ రాష్ట్రం నలుమూలలకు వెళ్లి చెప్పే ధైర్యం, దమ్ము నాకున్నాయి. మీకున్నాయా?’’ అని వారిని ప్రశ్నించారు. ఓట్ల కోసం, సీట్ల కోసం రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించడాన్ని నిరసిస్తూ కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా జగన్ తలపెట్టిన ‘సమైక్య శంఖారావం’ యాత్ర రెండో దశ శుక్రవారం చిత్తూరు జిల్లా పలమనేరు అసెంబ్లీ నియోజకవర్గంలో కొనసాగింది. ఈ సందర్భంగా పత్తికొండ, అప్పినపల్లె గ్రామాల్లో జరిగిన బహిరంగ సభలకు భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలనుద్దేశించి జగన్ ఉద్వేగపూరితంగా ప్రసంగించారు. జగన్ ప్రసంగాల సారాంశం ఆయన మాటల్లోనే... నీ నోట ‘సమైక్యమే’ రాదేం బాబూ? చంద్రబాబు గారూ! రాష్ట్రం మొత్తం ఒక్కటిగా ఉండాలనే మాట, సమైక్యం అన్న పదం నీ నోట్లో నుంచి ఎందుకు రావడం లేదూ అని అడగదలుచుకున్నా. రాష్ట్రపతిని కలవడానికి వెళ్లినప్పుడు, ‘ఈ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచండి’ అని ఎందుకు చెప్పలేదు? సమైక్యానికి అనుకూలంగా లేఖ ఎందుకు ఇవ్వలేదు? టీడీపీ ఎంపీలు రాష్ట్ర్రాన్ని సమైక్యంగా ఉంచండని కనీసం పార్లమెంటులో కూడా అడగరు. కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా ఆంధ్ర రాష్ట్రమంతా సమైక్యంగా ఉండాలంటూ నినదిస్తోంది. చిత్తూరు జిల్లాలోని 45 లక్షల మంది నోటా సమైక్యాంధ్ర అనే ఒకే ఒక్క మాట వినిపిస్తోంది. కానీ మన ఖర్మ ఏమిటంటే మన కిరణ్‌కుమార్‌రెడ్డికి, చంద్రబాబుకు మాత్రమే మన ఘోష, మన మాట వినపడని పరిస్థితి కనిపిస్తోంది. వీళ్లకసలు మన బాధల గురించి ఆలోచన ఉందా అని ఒక్కొక్కసారి నాకనిపిస్తుంది. రాష్ట్రాన్ని ఒకసారి విడగొడితే నీళ్ల కోసం మనమెక్కడికి వెళ్లాలి అనే అవగాహన వీళ్లకుందా అని అడ గదలుచుకున్నా. కిరణ్‌వి మోసపూరిత రాజకీయాలు. రాజకీయ వ్యవస్థలోకి నిజాయితీని తీసుకురావాలి. మనమంతా ఒక్కతాటిపైకి వచ్చినపుడే అది సాధ్యం. వీళ్లా నాయకులు! ఆ దివంగత నేత (వైఎస్) మా నాయకుడని చెప్పుకోవడానికి గర్వంగా ఉంటుంది. ఆ దివంగత నేత మన మధ్య నుంచి వెళ్లిపోయాక ఒక్కసారి రాష్ట్ర రాజకీయాలను చూస్తే బాధగా ఉంది. ఇవాళ రాష్ట్రంలో రాజకీయాలు ఎంతగా చెడిపోయి ఉన్నాయంటే, ఇచ్చిన మాట అంటే, రాజకీయాల్లో నిజాయితీ అంటే అర్థం కూడా తెలియని పరిస్థితుల్లో ఈ నాయకులు కనిపిస్తున్నారు. ఫలాన వాడు మా నాయకుడని సగర్వంగా చెపుకునేటట్టు ఉండాలి. కానీ చంద్రబాబును, కిరణ్‌ను చూస్తున్నప్పుడు మాత్రం, వీళ్లు నాయకులని చెప్పడానికి నోరు కూడా రాదు. చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థ మారాలి. ఈ వ్యవస్థలోకి నిజాయితీని తీసుకురావాలి. మనందరం కూడా కలిసికట్టుగా ఒక్కటై వీళ్లందరినీ బంగాళాఖాతంలో పడేయాలి. రాష్ట్రం సమైక్యంగా ఉంచాలని కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా ఒకే ఒక గొంతు వినపడుతోంది. రాష్ట్రాన్ని విడగొట్టండంటూ ఇచ్చిన లేఖ వెనక్కు తీసుకుని, సమైక్య రాష్ట్రానికి అనుకూలంగా లేఖ ఇవ్వండంటూ ఎన్జీవోలంతా చంద్రబాబు వద్దకు వెళ్లి ప్రాధేయపడ్డారు. కానీ బాబు ఏమన్నారు? ‘మన పిల్లలు చెన్నైలో బతకడం లేదా? కర్ణాటకలో బతకడం లేదా? అదే విధంగా బతుకుతారులే’ అని చెప్పాడు. నేను బాబును అడగదలచుకున్నా. చంద్రబాబు గారూ! ఒక్కసారి చెన్నై వెళ్లండి. అక్కడ ఏపీ రిజిస్ట్రేషన్ నంబర్ కనిపిస్తే వాళ్లు మనల్ని ఏ రకంగా చూస్తారో ఒక్కసారి చూడండి. చెన్నై గానీ, కర్ణాటక గానీ వెళ్లి తెలుగులో మాట్లాడితే అక్కడి వాళ్లు మనలను ఎలా చూస్తారో ఒక్కసారి ఆలోచన చేయాలని బాబుకు చెప్తున్నా. మన రాష్ట్రం మనకుండాలి. మన మహానగరం ఉండాలి. మన పిల్లలు ఉద్యోగం కోసం గర్వంగా తలెత్తుకొని అక్కడికి వెళ్లేలా ఉండాలి. కానీ బాబుకు మాత్రం చదువుకునే పిల్లల గురించి ఆలోచన చేసే పరిస్థితే లేదు. ఇవాళ మన ప్రాంతంలోనే 1,000 అడుగుల లోతుకు బోరు వేసినా నీళ్లు కూడా పడని పరిస్థితి. హంద్రీనీవా పూర్తి కాలేదు. గాలేరునగరి పూర్తి కాలేదు. నీటి కోసం ఎక్కడికెళాల్లో అర్థం కాని పరిస్థితిలో ఇవాళ రైతన్న ఉన్నాడు. కానీ బాబు ఏం చేస్తున్నాడు? రాష్ట్రాన్ని విడగొడతామని ఢిల్లీ పెద్దలు చెప్తుంటే అడ్డుకోవాల్సింది పోయి, విడగొడితే విడగొట్టండని చెప్తున్నాడు. వీళ్లా నాయకులు! సోనియా తన కొడుకును ప్రధాన మంత్రి కుర్చీలో కూర్చోబెట్టడం కోసం మన పిల్లల ఉద్యోగాలతో చెలగాటమాడుతున్నారు. నాయకుడనే వాడు ఎలా ఉండాలి? ఏదైనా ప్రదేశంలో బాగా లేని పరిస్థితులుంటే అక్కడికి వెళ్లి, ‘నేను బాగు చేస్తాను, నా మీద నమ్మకం ఉంచండి’ అని చెప్పాలి. కానీ ఇవాళ ఈ నాయకులు మాత్రం, ‘కొట్టుకుని చావండి’ అని చెప్పే పరిస్థితుల్లో ఉన్నారు! జగన్ ప్రశ్నలు.. జనం జవాబులు ‘‘ఇవాళ నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను. ఢిల్లీ పీఠం దద్దరిల్లేలా, సోనియాగాంధీ గుండెలదిరేలా, చంద్రబాబు, కిరణ్‌ల గుండెలదిరేలా గట్టిగా సమాధానాలు చెప్పండి. కనీసం అప్పుడైనా ఈ నాయకుల్లో మార్పు వస్తుందేమో!’’ అంటూ సమైక్య శంఖారావంలో జగన్ వేసిన ప్రతి ప్రశ్నకూ ప్రజలు విశేషంగా స్పందించారు. ‘వాళ్లు రాష్ట్రాన్ని విభజిస్తామంటే మనం ఒప్పుకుందామా?’ అని ప్రశ్నించగా, ‘ఒప్పుకోం, ఒప్పుకోం’ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు. ‘రెండు చేతులు పెకైత్తాలి. ఒప్పుకోబోమని గట్టిగా చెప్పాలి. తెలుగు జాతిని వాళ్లు విడగొడతామంటే మనం ఒప్పుకుందామా అని నేను అడుగుతున్నాను’ అని జగన్ అంటే, ‘ఒప్పుకోం, ఒప్పుకోం అంటూ అంతా రెండు చేతులూ పెకైత్తి మరీ చెప్పారు. ‘ఢిల్లీ వాళ్లకు తెలుగు సరిగా అర్థం కాదు. సోనియాకు, కాంగ్రెస్ వాళ్లకు కాస్త చెవుడు కూడా ఉంది. కాబట్టి ‘నో’ అని ఇంగ్లిష్‌లో గట్టిగా చెప్పాలి’ అని జగన్ సూచించారు. ‘మన నీటి కోసం మనమే తన్నుకొని చావాలా? మన హైదరాబాద్ కోసం మనమే తన్నుకొని చావాలా?’ అన్న ప్రశ్నలకు ‘నో, నో’ అంటూ ప్రజలంతా మూకుమ్మడిగా బదులిచ్చారు. రాష్ట్రాన్ని విడగొడుతున్న సోనియాను, ప్యాకేజీలు అడుగుతున్న బాబును, మోసం చేస్తున్న కిరణ్‌ను... ఈ ముగ్గురినీ క్షమించాలా అని జగన్ ప్రశ్నించగా, ‘క్షమించొద్దు, క్షమించొద్దు’ అంటూ వారు ముక్త కంఠంతో చెప్పారు. కనీసం ఇప్పటికైనా వాళ్లకు అర్థమవుతుందేమోనన్నదే మన తాపత్రయమని జగన్ అన్నారు. ‘ఒక్కటైతే చెప్తున్నా. వీళ్లకు అర్థమైనా, కాకపోయినా తెలుగువాడు పడుతున్న ఈ బాధను పై నుంచి దేవుడైతే చూస్తున్నాడని వీళ్లందరికీ కచ్చితంగా చెప్తున్నా. నీళ్లు కూడా ఇవ్వకుండా వీళ్లు మోసగిస్తున్న రైతన్న కోసం, ఉద్యోగాల కోసం ఎక్కడికెళ్లాలో అర్థంకాక కొట్టుమిట్టాడుతున్న పిల్లల భవిష్యత్తు కోసం మనందరం ఒక్కటవుదాం. పై నుంచి దేవుడు ఆశీర్వదిస్తాడు. వీళ్లకు గట్టిగా బుద్ధొచ్చేలా ‘జై సమైక్యాంధ్ర’ నినాదాన్ని విన్పించ ండి’ అని పిలుపునిచ్చారు. అప్పటికైనా వీరికి బుద్ధొస్తుందని ఆశిస్తున్నానన్నారు. రోడ్లన్నీ జనసంద్రం.. సాక్షి ప్రతినిధి, తిరుపతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత కోసం చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలోని పల్లెలన్నీ పరుగులు తీశాయి. జననేత తిరిగినంత దూరం రహదారులన్నీ జనసంద్రంగా మారాయి. ఎక్కడ చూసినా ఉరుకులు, పరుగుల మీద తరలివస్తున్న జనమే. పిల్లా పాపలు, యువకులు, వృద్ధులు అన్న తేడా లేకుండా అంతా రోడ్లపైకి వచ్చి మరీ వైఎస్ జగన్మోహన్రెడ్డికి జేజేలు పలికారు. పలమనేరు నియోజకవర్గంలో శుక్రవారం జగన్ ప్రారంభించిన రెండో విడత సమైక్య శంఖారావానికి ప్రజలు నీరాజనం పట్టారు. పలమనేరులో ఇప్పటిదాకా ఏ నేతను చూసేందుకు రానంతమంది జనం జగన్‌ను చూసేందుకు రావడం, గంటల తరబడి ఆయన కోసం వేచి ఉండటం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఒక్కో గ్రామంలో పది పన్నెండు చోట్ల జనం గుంపులు గుంపులుగా నిలబడి జగన్‌కు హారతులిచ్చారు. తిలకం దిద్దారు. డప్పులు, నృత్యాలు, పూలమాలలతో స్వాగతం పలికారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిందిగా విన్నవించారు. జగన్ పర్యటించిన గంగవరం, పలమనేరు, పెద్దపంజాణి మండలాల్లో ప్రజలు పనులన్నీ మానుకుని, గంటల తరబడి రోడ్లపైనే నిలిచి మనసారా స్వాగతం పలికారు. జనమంతా రోడ్ల మీదకు రావడంతో కొన్ని గ్రామాలను దాటేందుకు జగన్‌కు గంటకు పైగా పట్టింది! బెంగళూరు నుంచి శుక్రవారం ఉదయం రోడ్డు మార్గంలో శంఖారావానికి బయల్దేరిన జగన్‌కు సరిహద్దులోని కర్ణాటక గ్రామాల ప్రజలు కూడా ఘనస్వాగతం పలికారు. నంగిలి గ్రామంలోని 1,000 మందికి పైగా తెలుగువారు సమైక్య రాష్ట్రాన్ని కాంక్షిస్తూ కొన్ని గంటల పాటు వేచి ఉండి మరీ ఆయనను స్వాగతించారు. ఉదయం 11 గంటలకు జంగాలపల్లి వద్ద రాష్ట్రంలోకి ప్రవేశించిన జగన్‌కు ఘన స్వాగతం పలికారు. ఆయన్ను చూసేందుకు విద్యార్థులు, ఉద్యోగులు, ముస్లింలు భారీగా తరలివచ్చారు. రాష్ట్ర విభజన పాపం చిత్తూరు జిల్లాకే చెందిన చంద్రబాబు, కిరణ్లదేనంటూ విమర్శించినప్పుడు వారి నుంచి మంచి స్పందన వచ్చింది. శుక్రవారం రాత్రి పెద్దవెలగటూరులోని వైఎస్సార్సీపీ నేత జయరామిరెడ్డి ఇంట్లో జగన్ బస చేశారు. శనివారం కూడా యాత్ర పలమనేరు నియోజకవర్గంలోనే జరగనుంది. -
27 నుంచి సమైక్య శంఖారావం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ‘సమైక్య శంఖారావం’ యాత్ర ఈనెల 27వతేదీన చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం నుంచి పున:ప్రారంభం కానుంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను కూడా ఈ సందర్భంగా జగన్ ఓదార్చనున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే డిమాండ్‌తో జగన్ గత నెల 30న చిత్తూరు జిల్లా కుప్పంలో ‘సమైక్య శంఖారావం’ యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. మధ్యలో పార్లమెంట్ సమావేశాలు జరగటం, ఆర్టికల్ 3 సవరించాలని, రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించాలని కోరుతూ జగన్ జాతీయ స్థాయిలో వివిధ రాజకీయ పార్టీల నేతలను కలిసి మద్దతు కూడగట్టేందుకు సమైక్య శంఖారావం యాత్రకు తాత్కాలిక విరామం ఇచ్చారు. జగన్ డిసెంబర్ 27న మధ్యాహ్నం 12 గంటలకు పలమనేరు నియోజకవర్గంలోని 4వ రోడ్ క్రాస్ చేరుకుని సమైక్య శంఖారావం యాత్రను కొనసాగిస్తారని పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ తలశిల రఘురామ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పలమనేరు నియోజకవర్గం పత్తికొండలో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారన్నారు. నక్కపల్లిలో కూడా వైఎస్సార్ విగ్రహావిష్కరణతోపాటు బహిరంగసభ జరుగుతుంది. అనంతరం అప్పినపల్లిలో వైఎస్ మరణాన్ని తట్టుకోలేక మృతి చెందిన కుటుంబాన్ని జగన్ ఓదార్చనున్నారని తెలిపారు. పులివెందులకు జగన్ వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం రాత్రి కుటుంబసమేతంగా పులివెందులకు బయలుదేరి వెళ్లారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా మూడు రోజులపాటు ఆయన పులివెందులలోనే ఉంటారు. -
అదే హోరు.. అదే జోరు
సాక్షి ప్రతినిధి, తిరుపతి: కుప్పంలోనే కాదు పలమనేరులోనూ అదే జోరు. అడుగడుగునా అపూర్వ స్వాగతం. సమైక్య శంఖారావం యాత్రలో భాగంగా సోమవారం పలమనేరు నియోజకవర్గం పరిధిలోని వి.కోట, బెరైడ్డిపల్లె మండలాల్లో పర్యటించిన జగన్‌కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అడుగడుగునా జనం పోటెత్తడంతో వి.కోట మండలంలోని పట్రాపల్లె నుంచి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న బెరైడ్డిపల్లెకు చేరుకునేందుకు రోజంతా పట్టింది. సోమవారం ఉదయం వి.కోట నుంచి యాత్ర ప్రారంభమైంది. ఆ ఊరు దాటేందుకే 4 గంటల సమయం పట్టింది. వి.కోట రహదారులు జనమయమయ్యాయి. అక్కడ్నుంచి జగన్ దొడ్డిపల్లె, నార్నేపల్లె, దానమయ్యగారిపల్లె, మర్లదొడ్డి, కృష్ణాపురం, కైగల్ మీదుగా బెరైడ్డిపల్లెకు చేరుకున్నారు. మార్గమధ్యంలో శృంగవరపుకోట మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబు నేతృత్వంలో విశాఖ జిల్లా అరకు నుంచి 140 మంది సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ మాజీ సభ్యులు జగన్‌ను కలసి సమైక్య శంఖారావానికి మద్దతు తెలిపారు. సాయంత్రం 6 గంటలకు చిత్తూరు జిల్లా బెరైడ్డిపల్లెలో తొలివిడత పర్యటనను ముగించుకున్న జగన్ అక్కడ్నుంచి నేరుగా రోడ్డు మార్గంలో బెంగళూరు చేరుకున్నారు. అక్కడి నుంచి విమానంలో హైదరాబాద్ వెళ్లారు. సోమవారం యాత్రలో జగన్ వెంట పార్టీ చిత్తూరు జిల్లా కన్వీనర్ నారాయణస్వామి, ఎమ్మెల్యేలు భూమన కరుణాకరరెడ్డి, తాజా మాజీ ఎమ్మెల్యేలు ఎన్.అమరనాథ్‌రెడ్డి, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ దేశాయి తిప్పారెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సమన్వయకర్త తలశిల రఘురాం, ఎస్.కోటా మాజీ ఎమ్మెల్యే రవిబాబు, పార్టీ నాయకులు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఎం.సుబ్రమణ్యంరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, రోజా తదితరులు పాల్గొన్నారు. -
కాలర్ పట్టి అడిగితే ఏం చెబుతావ్?
నీళ్ల కోసం రైతులు, ఉద్యోగాల కోసంయువత నిలదీస్తే ఏం సమాధానం ఇస్తావు? సమైక్య శంఖారావంలో చంద్రబాబుపై జగన్ నిప్పులు రాష్టం కలసి ఉన్నప్పుడే పై రాష్ట్రాల నుంచి చుక్కనీరు రావడం లేదు ఇక మధ్యలో ఇంకో రాష్ట్రం వస్తే కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా సముద్రం నీరే మనదేశం కానివారంతా వారి దేశాలకు వెళ్లిపోవాలంటే సోనియా వెళ్తారా? 30 ఏళ్లకే మీకంత వ్యామోహముంటే 60 ఏళ్లుగా కలిసున్న మమ్మల్నెలా విడదీస్తారు? హైదరాబాద్‌లో ప్రతి ఊరి నుంచి కనీసం 100 మంది ఉంటున్నారు చిరు ఉద్యోగాలు చేస్తూ.. లోన్లు తీసుకుని ఫ్లాట్లు కొనుక్కున్నారు, ఇళ్లు కట్టుకున్నారు.. విభజన తర్వాత వాటి విలువ పడిపోతే ఆ నష్టాన్ని సోనియా భర్తీ చేస్తారా? రాష్ట్ర సమైక్యాన్ని కోరుతూ ఢిల్లీకి లేఖ రాయవెందుకు చంద్రబాబూ? డ్రామాలాడుతున్న కిరణ్‌కుమార్‌రెడ్డి.. అసెంబ్లీని సమావేశపరిచి సమైక్య తీర్మానం ఎందుకు చేయడం లేదు? కుప్పం నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘రాష్ట్రం సమైక్యంగా ఉన్నప్పుడే పై రాష్ట్రాల నుంచి మనకు చుక్కనీరు రాని పరిస్థితి ఉంది. ఇక మధ్యలో ఇంకో రాష్ట్రం వస్తే కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా సముద్రం నీరు తప్ప మంచినీరు ఎక్కడుంటుంది? చంద్రబాబూ.. రాష్ట్రం విడిపోతే మా పంటలకు నీరు ఎక్కడ్నుంచి వస్తుందని రైతులు నీ కాలర్ పట్టుకొని అడిగితే ఏం సమాధానం చెబుతావ్? గాలేరు-నగరి, నెట్టెంపాడు, హంద్రీ-నీవా, బీమా, కోయిల్‌సాగర్ లాంటి ప్రాజెక్టులకు నీళ్లెలా వస్తాయని నిలదీస్తే ఏం సమాధానం చెబుతావ్? పదేళ్లలో హైదరాబాద్‌ను వదిలి వె ళ్లిపొమ్మంటున్నారు.. అదే జరిగితే ఉద్యోగాల కోసం ఎక్కడికి వెళ్లాలని యువత అడిగితే ఏం సమాధానం చెబుతావ్?’’ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు. ఓట్లు, సీట్ల కోసం, తన కుమారుడిని ప్రధానిని చేయడం కోసం రాష్ట్ర విభజనకు పూనుకున్న కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి, ప్యాకేజీలు అడుగుతున్న చంద్రబాబుకు, సమైక్యం పేరుతో డ్రామాలాడుతున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి జనం ఘోష వినిపించడం లేదా? అని నిలదీశారు. ప్రజలంతా రాష్ట్రం కలిసే ఉండాలని కోరుకుంటే చంద్రబాబు నోటి వెంట ‘సమైక్యం’ అన్న మాట కూడా ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించటాన్ని నిరసిస్తూ వైఎస్ జగన్మోహన్రెడ్డి తలపెట్టిన సమైక్య శంఖారావం యాత్ర ఆదివారం రెండోరోజు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుంచి మొదలై పలమనేరు నియోజకవర్గం వరకు సాగింది. జగన్ వస్తే ప్రజలంతా తలుపులు మూసుకొని ఇళ్లలోనే ఉండి నిరసన తెలపాలని ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు పిలుపును పక్కనపెట్టి ప్రజలు తమ గుండె వాకిళ్లు తెరుచుకొని జననేతకు స్వాగతం పలికారు. గ్రామాలకు గ్రామాలు కదిలి రోడ్లపైకి వచ్చాయి. కడపల్లి, శాంతిపురం, కనుమలదొడ్డి గ్రామాల ప్రజలు మంగళ హారతులతో జగన్‌కు స్వాగతం పలకగా.. రామకుప్పం గ్రామస్థులు పట్టుబట్టి జగన్‌ను తమ ఊరికి తీసుకువెళ్లారు. ప్రజలు అడుగడుగునా అభిమానం చూపడంతో పలమనేరు నియోజకవర్గం వి.కోట మండల కేంద్రంలో బహిరంగ సభ 6 గంటలు ఆలస్యంగా జరిగింది. ఇక్కడికి తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి జగన్ ప్రసంగించారు. ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. ప్రజల గుండె చప్పుడు తెలుసుకోలేరా? ‘పాలకులు ప్రజల మనోభావాలకు అనుగుణంగా పరిపాలన చేయాలి. ఓటు కావాలంటే ప్రజల్లోకి వెళ్లి ప్రతి పేదవాని గుండె చప్పుడు వినాలి. ప్రతి పేదవాని మనసెరిగి పనిచేయాలి. కానీ ఈరోజు రాజకీయాలు ఎలా చేస్తున్నారంటే.. ప్రజల జీవితాలతో చదరంగం ఆడుతున్నారు. ఇలా చేస్తే ఎన్ని ఓట్లు వస్తాయి.. ఇలా విభజిస్తే ఎన్ని సీట్లు వస్తాయి.. ఒక మనిషిని తీసుకొనిపోయి జైల్లో పెడితే ఇంకెన్ని ఓట్లు వస్తాయని ఈ పాలకులు ఆలోచన చేస్తున్నారు. రాష్ట్రాన్ని విభజిస్తే ప్రజలకు జరుగబోయే నష్టాలు వీళ్లకు తెలుసా? ఒకవేళ తెలిసినా కళ్లున్న కబోదుల్లాగా ఉంటున్నారా? ఒక్కసారి కృష్ణా నదినే చూడండి. ఈరోజు రాష్ట్రం సమైక్యంగా ఉన్నప్పుడే చుక్కనీరు రావడం లేదు. మహారాష్ట్ర అవసరాలు తీరిన తర్వాత కర్ణాటకలోని ఆలమట్టి, నారాయణపూర్ డ్యాంలు నిండితేనే గానీ కిందికి నీళ్లు వదలని పరిస్థితి ఉంది. ట్రిబ్యునళ్లు, బోర్డులు ఉన్నా పై రాష్ట్రాలు మన కు చుక్కనీరు వదలని పరిస్థితి ఉంటే ఇక మధ్యలో ఇంకో రాష్ట్రాన్ని పెడితే కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా సముద్రపు నీళ్లు తప్ప మంచినీరు ఎక్కడుంటుంది? రాష్ట్రం విడిపోతుందనే ఊహాగానాల మధ్య బ్రిజేష్ కుమార్ టిబ్యునల్ తీర్పు చెప్పింది. రాష్ట్రం విడిపోతుందనే సంకేతాలు వస్తున్నాయి, ఇక అడిగే వారే లేర ని కృష్ణాలో మిగులు జలాల మీద మనకున్న హక్కులను పొరుగు రాష్ట్రాలకు పంచేసింది. నికర జలాల్లో వాళ్ల కోటాను పెంచింది. పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే ఈ పాలకులు, బాబు.. సోనియాగాంధీని ఏమీ అనరు! చనిపోయిన దివంగత నేత వైఎస్సార్ మీద బురదజల్లటానికి ప్రయత్నం చేస్తారు. మిగులు జలాలు అందకపోతే హంద్రీ-నీవాకు, గాలేరు న గరి, నెట్టెంపాడు, బీమా, కోయిల్‌సాగర్‌కు ఎక్కడ్నుంచి నీళ్లు వస్తాయని అడగాల్సింది పోయి ఈ చంద్రబాబు.. ప్యాకేజీలు తీసుకుంటే సరిపోతుందంటున్నారు. వారికి జరిగే నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారు? హైదరాబాద్‌ను పదేళ్లలో వదిలి వెళ్లిపొమ్మని శాసిస్తున్నారు. ప్రజలంతా 60 ఏళ్లుగా కలిసి నిర్మించుకున్న హైదరాబాద్ నుంచి ఇప్పటికిప్పుడు వెళ్లిపొమ్మంటే చదువుకున్న ప్రతి పిల్లవాడు ఉద్యోగం కోసం ఎక్కడికి వెళ్లాలని సోనియాగాంధీని, కిరణ్‌కుమార్‌రెడ్డిని, చంద్రబాబును అడుగుతున్నా. అభివృద్ధిలో హైదరాబాద్ ఎప్పుడూ మూడు,, నాలుగో స్థానంలో ఉండేది. వైఎస్సార్ బతికున్న రోజుల్లో కంపెనీలు హైదరాబాద్‌కు క్యూ కట్టేవి. ఏడాదికి 57 వేల మంది విద్యార్థులకు క్యాంపస్ ఉద్యోగాలు దక్కేవి. గత మూడేళ్లుగా క్యాంపస్ రిక్రూట్మెంట్లు 57 వేల నుంచి 25 వేలకు తగ్గిపోయింది. ఎక్కడైనా రాష్ట్రం బాగుపడాలంటే ఎయిర్‌పోర్టులు, సీ పోర్టులు, సముద్ర తీరాలు అన్నీ కలిసి ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది. కానీ తీరప్రాంతాన్ని ఒకరికి, రాజధానిని ఒకరికి ఇచ్చేస్తే అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది? ఈరోజు ప్రతి గ్రామం నుంచి కనీసం 100 మందికి తక్కువ కాకుండా హైదరాబాద్ వెళ్లి అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. అప్పులు చేసి, బ్యాంకుల్లో లోన్లు తీసుకొని ప్లాట్లు కొనుకున్నారు. ఇళ్లు కట్టుకున్నారు. విభజన చేస్తే వాళ్లు కొనుక్కున్న ఇళ్లకు, ప్లాట్లకు విలువలు పడిపోతే ఆ నష్టాన్ని సోనియాగాంధీ భర్తీ చేస్తారా? సమైక్య డ్రామాలాడుతున్న కిరణ్, ప్యాకేజీలు అడుగుతున్న చంద్రబాబు భర్తీ చేస్తారా? రాష్ర్ట్ర ఆదాయంలో 55 నుంచి 60 శాతం ఒక్క హైదరాబాద్ నుంచే వస్తుంది. ఆ ఆదాయం రాకపోతే ఉద్యోగుల జీతాలకు డబ్బులు ఎక్కడ్నుంచి తెచ్చిస్తారు? బిల్లు పెడితే సోనియాగాంధీ వెళ్లిపోతారా? సోనియాగాంధీ 1968 ముందు ఎవరో? ఎక్కడున్నారో ఎవరికి తెలియదు. రాజీవ్‌గాంధీని పెళ్లి చేసుకున్న తర్వాత 1983వ సంవత్సరంలో దేశ పౌరసత్వం తీసుకున్నారు. ఇప్పటికి 30 సంవత్సరాలుగా మనలో ఒక్కరిగా, భారతీయురాలిగా కలిసిపోయారు. ఇవాళ ఎవరైనా పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టి, మన దేశం కానీవాళ్లందరూ తిరిగి వెళ్లిపోవాలంటే మీకు ఎలా ఉంటుంది? అలా అంటే కాంగ్రెస్ నేతలంతా కల్లు తాగిన కోతుల్లా రెచ్చిపోరా? 30 ఏళ్లకే మీకు ఇంత వ్యామోహం ఉంటే.. 60 ఏళ్లుగా కలిసి బతుకుతున్న మమ్ముల్ని వేరు చేస్తామంటే మాకెలా ఉంటుంది? మద్దతిస్తుంది బాబు.. పోరాటం చేస్తుంది జగన్.. 1955లో తెలుగు జాతిని ఒక్కటి చేయడానికి హైదరాబాద్ స్టేట్‌కు చెందిన బూర్గుల రామకృష్ణారావు గారు తన ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేశారు. ఆవేళ 177 మంది ఎమ్మెల్యేలలో 147 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరై 103 మంది విశాలాంధ్రకు అనుకూలంగా ఓటేశారు. ఇటు ఆంధ్రరాష్ట్రఅసెంబ్లీలో కూడా విశాలాంధ్ర కోరుతూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ చరిత్రను మరిచిపోయి ఈరోజు ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని విభజిస్తున్నారు. ప్రజలంతా ముక్తకంఠంతో సమైక్యాన్ని కోరుకుంటే చంద్రబాబూ.. మీరు సమైక్యాంధ్రకు అనుకూలంగా ఎందుకు లేఖ ఇవ్వడం లేదు. కనీసం సమైక్యం అన్న మాట కూడా మీ నోటి నుంచి ఎందుకు పలకరు? ఓవైపు రాష్ట్రాన్ని విభజిస్తున్న సోనియాగాంధీకి మద్దతు తెలుపుతూనే మరోవైపు నేను కుమ్మక్కయ్యానని నిందలు వేస్తారు. ఎవరు ఎవరితో కుమ్మక్కయ్యారు? రాష్ట్ర విభజనలో సోనియాకు మద్దతిస్తున్నది మీరు కాదా? ఆ సోనియాగాంధీతో పోరాటం చేస్తుంది జగన్మోహన్రెడ్డి కాదా? వైఎస్సార్ చనిపోయిన 18 నెలల తర్వాత కాంగ్రెస్ నేతలతో కలిసి కోర్టుల దాకా వెళ్లి నాపై కేసులు వేసింది మీరు కాదా? ఎఫ్‌డీఐ ఓటింగ్ సందర్భంగా రాజ్యసభలో మీ ఎంపీలను గైర్హాజరు పరిచి కాంగ్రెస్‌కు మద్దతిచ్చింది మీరు కాదా? మొన్న అసెంబ్లీలో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అవిశ్వాసం పెడితే.. విప్ జారీ చేసి మరీ సర్కారును కాపాడింది మీరు కాదా? అసెంబ్లీలో ఎందుకు తీర్మానం చేయరు? సమైక్యం అంటూ సీఎం గొప్పగా డ్రామాలు ఆడుతారు. రాష్ట్రాన్ని విభజించాలంటే చాలు అధికారులందరినీ పంపించి సోనియా ఆదేశాల మేరకు సహకరిస్తావు. చంద్రబాబు విభజించండి.. అని ఢిల్లీకి వెళ్లి దీక్షలు చేస్తే.. మీరు ఢిల్లీ నుంచి వచ్చి ఉద్యోగులను భయపెట్టించి సమ్మెను విరమింపజేస్తారు. సమైక్యాన్ని కోరితే అసెంబ్లీని వెంటనే ఎందుకు సమావేశపర్చడం లేదు? అసెంబ్లీలో సమైక్యాంధ్రకు అనుకూలంగా ఎందుకు తీర్మానం చేయడం లేదు? తెలుగువాడు కన్నెర్ర చేస్తే.. ఇది తెలుగువారి ఆత్మగౌరవానికి, ఢిల్లీ పౌరుషానికి మధ్య జరుగుతున్న పోరాటం. తెలుగువాడు కన్నెర్ర చేస్తే ఎలా ఉంటుందో ఢిల్లీకి తెలియాలి. వచ్చే ఎన్నికల్లో 30 పైచిలుకు ఎంపీ స్థానాలను గెలుచుకొని రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేవారినే ప్రధానిని చేద్దాం. ఢిల్లీ పెద్దలకు కాస్త చెవుడు.. నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను వాటికి గట్టిగా సమాధానాలు చెప్పాలి. తెలుగు జాతిని విడదీస్తామంటే ఒప్పుకుంటారా... (లేదు.. లేదు అంటూ జన స్పందన). ఢిల్లీవారికి తెలుగులో చెబితే అర్థం కాదు.. ఇంగ్లిషులో ‘నో’ అని చెప్పండి.. (నో.. నో అంటూ జనం). నీటి కోసం మనలో మనమే కొట్టుకొని చావాలా? (జనం: నో..నో..). మన హైదరాబాద్ కోసం మనమే తన్నుకొని చావాలా? (జనం: నో.. నో..). రాష్ట్రాన్ని విభజిస్తున్న సోనియాను, అందుకు సహకరిస్తున్న కిరణ్‌ను, చంద్రబాబును క్షమించాలా? (నో.. నో.. అంటూ పెద్ద పెట్టున జనం నినాదాలు). ఇప్పటికైనా వారికి బుద్ధి రావాలి. జై సమైక్యాంధ్ర.. జై తెలుగుతల్లీ.. జై వైఎస్సార్!!’ -
సమన్యాయం కోసమే జగన్ పోరాటం
ఇబ్రహీంపట్నం రూరల్, న్యూస్‌లైన్: రాష్ట్ర ప్రజలకు సమన్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి నగరంలో శనివారం చేట్టిన ‘సమైక్య శంఖారావ’ బహిరంగ సభకు ఇబ్రహీంపట్నం నుంచి పార్టీ శ్రేణులు తరలివెళ్లాయి. ఇబ్రహీంపట్నం నియోజకవర్గ సమన్వయకర్త ఈసీ శేఖర్‌గౌడ్ ఆధ్వర్యంలో వందలాది మంది కార్యకర్తలు సభకు వెళ్లారు. నియోజకవర్గ వ్యాప్తంగా నాయకులను, కార్యకర్తలను ఏకీకృతం చేసి శనివారం ఉదయం బొంగ్లూర్ ఔటర్ రింగ్‌రోడ్డు నుంచి ర్యాలీగా తరలివెళ్లారు. ఈ సందర్భంగా ఈసీ శేఖర్‌గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు సమన్యాయం చేసేందుకు తమ అధినేత ఉద్యమం చేస్తున్నారన్నారు. ఇరు ప్రాంత ప్రజలకు న్యాయం చేయకుండా అడ్డగోలుగా రాష్ట్ర విభజన చేయడం తగదన్నారు. కాంగ్రెస్ అధినాయకత్వం తమ స్వార్థ ప్రయోజ నాల కోసం విభజనకు సానుకూలంగా నిర్ణయం తీసుకుందే తప్ప ఈ ప్రాంత ప్రజల మీద ప్రేమతో కాదనేది ప్రజలు గుర్తించాలన్నారు. వరద బీభత్సంతో రాష్ట్రం అల్లకల్లోలమవుతున్నా నష్ట నివారణ చర్యల్లో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోందని శేఖర్‌గౌడ్ మండిపడ్డారు. అటు ప్రజలకోసమే తన పార్టీ అని చెప్పుకునే చంద్రబాబు ప్రజల సమస్యలపై కాకుండా పార్టీ సమస్యలకే పెద్దపీట వేస్తున్నారని దుయ్యబ ట్టారు. ఒకవైపు టీటీడీపీ నేతలతో, ఇంకోవైపు సీమాంధ్ర టీడీపీ నేతలతో గిమ్మిక్కులు చేస్తూ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. ప్రజా సమస్యలెరుగుని ఈ ప్రభుత్వానికి పాలించే హక్కులేదు.. రైతాంగం దండగ అన్న చంద్రబాబుకు వ్యవసాయం పేరెత్తే అర్హత లేదన్నారు. రాష్ట్రంలో రైతాంగం సుభిక్షంగా ఉండాలంటే మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల్ని సాకారం చేయాలన్నారు. అలా చేయడం కేవలం వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్రెడ్డితోనే సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఇబ్రహీం పట్నం, మంచాల, యాచారం, హయత్‌నగర్ మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
‘శంఖారావా’నికి తరలిన జిల్లా జనం
సంగారెడ్డి డివిజన్, న్యూస్‌లైన్: వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన ‘సమైక్య శంఖారావం’ సభకు పార్టీ నాయకులు జిల్లా నుంచి భారీగా జనాన్ని సమీకరించారు. సంగారెడ్డి, పటాన్చెరు, జహీరాబాద్, మెదక్, నర్సాపూర్, అందోలు తదితర నియోజకవర్గాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలతోపాటు ప్రజలు హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియానికి బయలుదేరి వెళ్లారు. మెదక్ నియోజకవర్గం నుంచి పార్టీ జిల్లా కన్వీనర్ బట్టి జగపతి, సంగారెడ్డి నియోజకవర్గం నుంచి పార్టీ యువత విభాగం జిల్లా అధ్యక్షులు గౌరిరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు. జి.శ్రీధర్‌రెడ్డి సుమారు వంద వాహనాల్లో కార్యకర్తలు, ప్రజలను శంఖారావానికి తీసుకెళ్లారు. జిల్లా నాయకుడు పి.మనోజ్‌రెడ్డి, నియోజకవర్గ పరిశీలకులు నారాయణరెడ్డి ఆధ్వర్యంలోనూ సంగారెడ్డి మండలం పోతిరెడ్డిపల్లి నుంచి వాహనాల్లో భారీగా వెళ్లారు. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు, పటాన్ చెరు నియోజకవర్గ సమన్వయకర్త గూడెం మహీపాల్‌రెడ్డి, కార్మిక విభాగం జిల్లా నేత నర్రా భిక్షపతి, అందోలు నుంచి బీసీ సెల్ కన్వీనర్ డీబీ మల్లయ్య, జహీరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి మాణిక్‌రావు నేతృత్వంలో జహీరాబాద్ నియోజకవర్గం నుంచి 25 వాహనాల్లో, నర్సాపూర్ నియోజకవర్గంలోని దౌల్తాబాద్ నుంచి పార్టీ నాయకుడు హబీబ్ ఆధ్వర్యంలో ప్రజలు, కార్యకర్తలు సభకు తరలివెళ్లారు. -
'తెలుగువారికి ఒకే రాష్ట్రం మహాత్ముడు ఇచ్చిన మాట'
హైదరాబాద్: స్వతంత్ర ఉద్యమం కాలంలోనే తెలుగు వారందరికీ ఒకే రాష్ట్రం ఉండాలని మహాత్మాగాంధీ మాట ఇచ్చారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్ర రావు తెలిపారు. ఎల్బి స్టేడియంలో జరుగుతున్న సమైక్య శంఖారావం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ సమైక్య రాష్ట్రానికి 102 సంవత్సరాల పోరాటం చరిత్ర ఉందన్నారు. మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ సమైక్య రాష్ట్రాన్నే కోరుకున్నారని తెలిపారు. వారి కంటే సోనియా గాంధీ గొప్పేవారమీ కాదన్నారు. సమైక్య శంఖారావం 23 జిల్లాలదని చెప్పారు. సమైక్యమనేది 2 ప్రాంతాల మధ్య ఘర్షణ కాదని, రెండు వాదనల మధ్య ఘర్షణ అని వివరించారు. విభజన వల్ల తెలంగాణలో భూస్వామ్య వ్యవస్థ మళ్లీ తలెత్తుతుందని హెచ్చరించారు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ఆర్ 40 వేల కోట్ల రూపాయలతో ప్రారంభించిన తెలంగాణ ప్రాజెక్ట్‌లన్నీ నష్టపోతాయని చెప్పారు. -
సమైక్య శంఖారావం సభను జయప్రదం చేయండి
ఒంగోలు, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర సాధన కోసమే హైదరాబాద్‌లో ఈ నెల 26న సమైక్య శంఖారావం సభ నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ డాక్టర్ నూకసాని బాలాజీ చెప్పారు. రాష్ట్ర కమిటీ ముద్రించిన సమైక ్యశంఖారావం వాల్‌పోస్టర్‌ను స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన మంగళవారం ఉదయం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ సమైక్య శంఖారావం సభకు ప్రజలు పార్టీలకతీతంగా హాజరు కావాలని కోరారు. సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమన్నారు. విడిపోతే అభివృద్ధి జరుగుతుందని కొంతమంది చేసే ప్రచారంలో వాస్తవం లేదన్నారు. సమైక్య రాష్ట్రం కోసం పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ వైఎస్సార్సీపీయేనని, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి వల్లే సమైక్యాంధ్ర సాధ్యమవుతుందన్నారు. మహానేత వైఎస్ఆర్ మరణం తరువాత సంక్షేమ పథకాలు పేదల దరి చేరడం లేదని, ఆ సంక్షేమ పథకాలన్నీ ప్రజానీకానికి అందాలంటే జగన్మోహన్రెడ్డి సీఎం కావాలని చెప్పారు. రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని యూపీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అత్యంత దారుణమన్నారు. రాష్ట్ర విభజనతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని తెలంగాణలోని కొంతమంది రాజకీయ నాయకులు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీతో జగన్మోహన్రెడ్డి కుమ్మక్కయ్యారంటూ జిల్లాకు చెందిన కొందరు నాయకులు దుష్ర్పచారం చేయడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు. సమైక్య శంఖారావం సభ ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణలోని అన్ని ప్రాంతాల ప్రజానీకానికి సంబంధించిందన్నారు. సభకు అన్ని ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున జనం హాజరై రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా నినదించనున్నట్లు చెప్పారు. ‘రాష్ర్టం మొత్తం సమైక్యంగా ఉంటేనే ఢిల్లీతో పోరాడగలుగుతాం. కావాల్సింది సాధించుకోగలుగుతాం. విడిపోతే నష్టమే. స్వార్థపరుల మాటలు విని మోసపోవద్దు’ అని బాలాజీ విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, యువజన విభాగం జిల్లా కన్వీనర్ కేవీ రమణారెడ్డి, గిద్దలూరు నియోజకవర్గ సమన్వయకర్త వై.వెంకటేశ్వరరావు, నగర కన్వీనర్ కుప్పం ప్రసాద్, ట్రేడ్ యూనియన్ జిల్లా కన్వీనర్ కేవీ ప్రసాద్, మహిళా విభాగం జిల్లా కన్వీనర్ పోకల అనూరాధ, ప్రచార విభాగం జిల్లా కన్వీనర్ వేమూరి బుజ్జి, మహిళా విభాగం నగర కన్వీనర్ కావూరి సుశీల, నగర స్టీరింగ్ కమిటీ సభ్యుడు వల్లెపు మురళి పాల్గొన్నారు. -
సమైక్య శంఖారావానికి ప్రయివేటు విద్యాసంస్థల మద్దతు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ విభజించరాదని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 26వ తేదీన హైదరాబాద్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించ తలపెట్టిన సమైక్య శంఖారావం సభకు రాష్ట్రంలోని ప్రయివేటు విద్యాసంస్థల కరెస్పాండెంట్లు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం సమావేశమైన కరెస్పాండెంట్లు సభను విజయవంతం చేయడానికి తమ వంతు సహాయ సహకారాలు అంద జేయడానికి ముందుకు వచ్చారు. పేద విద్యార్థులందరూ ఉన్నత విద్యను అభ్యసించాలనే ఆశయంతో దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రవేశ పెట్టిన ఫీజు ఈయింబర్స్మెంట్ పథకం వల్ల ఎంతో మంది ప్రయోజనం పొందారని సమావేశంలో అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజన జరిగితే పేద విద్యార్థులకు ఉన్నత విద్య అందించ లేక నిధుల కొరత ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఉపాధి అవకాశాలు కూడా దెబ్బ తింటాయనే ఆవేదన కూడా సమావేశంలో వ్యక్తం అయింది. ఈ సమావేశానికి పార్టీ శాసనసభాపక్షం ఉప నాయకురాలు భూమా శోభానాగిరెడ్డి హాజరయ్యారు. ప్రయివేటు విద్యాసంస్థల నుంచి పి.మదన్‌మోహన్‌రెడ్డి, బి.ప్రసాదరాజు, హరిప్రసాద్, వెంకటేష్‌నాయుడు, గంగిరెడ్డి, జయచంద్రారెడ్డితో సహా పలువురు హాజరయ్యారు. -
ఢిల్లీ కదిలేలా సమైక్య శంఖారావం
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ పీఠం కదిలేలా సమైక్య శంఖారావాన్ని పూరిద్దామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమన్వయకర్త కొణతాల రామకృష్ణ పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే డిమాండ్‌తో ఈ నెల 26న హైదరాబాద్‌లోని ఎల్బీస్టేడియంలో నిర్వహించనున్న సమైక్య శంఖారావం సభను విజయవంతం చేద్దామని సమైక్యవాదులకు ఆయన పిలుపునిచ్చారు. సమైక్యవాదులంతా ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందని కొణతాల పేర్కొన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలుగుజాతిని రక్షించుకోవడానికి రాజకీయ పార్టీలన్నీ కలిసి రావాల్సిన అవసరముందని, పార్టీలకు అతీతంగా అందరూ కలిసి రాజకీయ సంక్షోభం సృష్టిస్తేనే విభజన ఆగుతుందని అన్నారు. ఇప్పటికైనా మించిపోయింది లేదని, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అసెంబ్లీని తక్షణం సమావేశపరిచి సమైక్య తీర్మానం చేయాలని, అదే విధంగా టీడీపీ అధినేత చంద్రబాబు విభజన లేఖను ఉపసంహరించుకోవాలని కొణతాల కోరారు. సోనియా డెరైక్షన్‌లో కాంగ్రెస్, టీడీపీ.. రాష్ట్రంలో సుమారు 80 రోజులకుపైగా ఉద్యమం జరుగుతున్నప్పటికి కూడా.. ఆందోళన కార్యక్రమాలను మరింత పెంచేలాగానే కేంద్రమంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ప్రవర్తిస్తున్నారని కొణతాల అన్నారు. విభజన బిల్లు అసెంబ్లీకి వస్తే అడ్డుకుంటామంటూనే, మరోపక్క విభజన అనివార్యమంటూ అందుకు కావాల్సిన సహాయ సహకారాలను కేంద్రానికి అందించేందుకు జీవోఎం(మంత్రుల బృందానికి)కు ప్రతిపాదనలు పంపుతున్నారని దుయ్యబట్టారు. తాము మొదటి నుంచీ చెబుతున్నట్లుగా.. సోనియాగాంధీ డెరైక్షన్‌లో రాష్ట్రంలోని కాంగ్రెస్‌తో కలిసి టీడీపీ అధినేత చంద్రబాబు ఒక పథకం ప్రకారం ముందుకెళ్తున్నారన్నారు. వారి డ్రామాలు ఒక్కొక్కటిగా రుజువవుతున్నాయని పేర్కొన్నారు. సమైక్యంగా ఉన్నప్పుడే అభివృద్ధి.. కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగిన తెలుగుజాతి సమైక్యంగా ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యమైందని కొణతాల అన్నారు. 1969, 72లో వచ్చిన ఉద్యమాల తర్వాత అన్ని ప్రాంతాల ప్రజలు సోదరభావంతో రాష్ట్ర అభివృద్ధికి కృషి చేశారని వివరించారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించినప్పటికీ.. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? లేదా అనే పరిస్థితిలో కూడా నాడు వైఎస్ చేపట్టిన కార్యక్రమాల వల్ల అభివృద్ధి కుంటుపడలేదన్నారు. జీఎస్టీలో రూ.8 లక్షల కోట్లతో దేశంలోనే మన రాష్ట్రం మూడవ స్థానంలో ఉందని వెల్లడించారు. దేశంలో మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ తర్వాత అత్యంత అభివృద్ధి కలిగిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందన్నారు. రాజశేఖరరెడ్డి తన హయాంలో ప్రతి ఒక్కరికీ రాజ్యాంగ హక్కు మాదిరిగా తిండి, గూడు, ఆరోగ్యం ఇలా ప్రతిదీ సంతృప్తికర స్థాయిలో పథకాలు అందించారని వివరించారు. అభివృద్ధితో వేర్పాటువాదాన్ని మరిపించగలిగారన్నారు. వైఎస్ ఆశయ సాధన కోసం ఏర్పడిన తమ పార్టీకి రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందనే దృఢమైన విశ్వాసం ఉందని చెప్పారు. ప్రజల ఆలోచనకు విరుద్ధమైన నిర్ణయం.. రాష్ట్రాన్ని విభజించాలని యూపీఏ ప్రభుత్వం నిర్ణయించడం ప్రజల ఆకాంక్షకు పూర్తి విరుద్ధమైనదని కొణతాల వ్యాఖ్యానించారు. రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం లేకుండా విభజించడం దారుణమన్నారు. ఈ విషయమై గతంలో కేంద్ర హోంమంత్రిగా ఎల్కే అద్వానీ పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలను గుర్తుచేశారు. ‘ఆగస్టు 1, 2000న పార్లమెంటులో కేంద్ర హోంమంత్రిగా ఎల్కే అద్వానీ మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు అక్కడి అసెంబ్లీ తీర్మానం చేయాలన్నారు. అంతేకాదు 26-2-2002న 377 నిబంధన కింద తెలంగాణ రాష్ట్రం కోరుతూ ఆలె నరేంద్ర అడిగిన ప్రశ్నకు కూడా ఇదే సమాధానం ఇచ్చారు’ అని వివరించారు. ఇందుకు సంబంధించిన పత్రాన్ని మీడియాకు అందజేశారు. డిసెంబర్ 9, 2009న కేంద్రహోంమంత్రిగా చిదంబరం మాట్లాడుతూ.. రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేయాలని చెప్పిన ప్రకటనను కూడా యూపీఏ ప్రభుత్వం పూర్తిగా విస్మరించి ఏకపక్షంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. -
సమైక్య శంఖారావానికి అనుమతి
షరతులతో కూడిన అనుమతి ఇచ్చిన డీసీపీ సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని లాల్‌బహదూర్ స్టేడియంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 26న తలపెట్టిన సమైక్య శంఖారావం సభకు పోలీసులు షరతులతో కూడిన అనుమతిని మంజూరు చేశారు. అనుమతి పత్రాలను సెంట్రల్ జోన్ డీసీపీ వీబీ కమలాసన్‌రెడ్డి శుక్రవారం పార్టీ ఐటీ విభాగం రాష్ట్ర కన్వీనర్ చల్లా మధుసూదన్‌రెడ్డికి అందించారు. ఈ నెల 16న హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో.. 26వ తేదీ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు బహిరంగ సభ నిర్వహించుకునేలా అనుమతి ఇస్తున్నట్లు కమలాసన్‌రెడ్డి పేర్కొన్నారు. రెచ్చగొట్టే ప్రసంగాలు చేయరాదని, శాంతిభద్రతలకు భంగం కలిగించరాదనీ, ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించరాదని, సభకు హాజరయ్యే వారు అగ్గిపెట్టెలు, కవర్లు, బ్యాగులు సహా నిషేధిత వస్తువులు తీసుకు రాకూడదనీ, స్టేడియంలో తొక్కిసలాటకు అవకాశం లేకుండా బారికేడ్లు ఏర్పాటు చేసుకోవాలని, నిర్దేశిత ప్రాంతాల్లోనే వాహనాలను పార్కింగ్ చేసుకోవాలని షరతులు విధించారు.