సమైక్య శంఖారావానికి అనుమతి | Police Permits Samaikya Sankharavam | Sakshi
Sakshi News home page

సమైక్య శంఖారావానికి అనుమతి

Published Sat, Oct 19 2013 4:30 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

Police Permits Samaikya Sankharavam

 షరతులతో కూడిన అనుమతి ఇచ్చిన డీసీపీ
 సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని లాల్‌బహదూర్ స్టేడియంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 26న తలపెట్టిన సమైక్య శంఖారావం సభకు పోలీసులు షరతులతో కూడిన అనుమతిని మంజూరు చేశారు. అనుమతి పత్రాలను సెంట్రల్ జోన్ డీసీపీ వీబీ కమలాసన్‌రెడ్డి శుక్రవారం పార్టీ ఐటీ విభాగం రాష్ట్ర కన్వీనర్ చల్లా మధుసూదన్‌రెడ్డికి అందించారు. ఈ నెల 16న హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో.. 26వ తేదీ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు బహిరంగ సభ నిర్వహించుకునేలా అనుమతి ఇస్తున్నట్లు కమలాసన్‌రెడ్డి పేర్కొన్నారు. రెచ్చగొట్టే ప్రసంగాలు చేయరాదని, శాంతిభద్రతలకు భంగం కలిగించరాదనీ, ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించరాదని, సభకు హాజరయ్యే వారు అగ్గిపెట్టెలు, కవర్లు, బ్యాగులు సహా నిషేధిత వస్తువులు తీసుకు రాకూడదనీ, స్టేడియంలో తొక్కిసలాటకు అవకాశం లేకుండా బారికేడ్లు ఏర్పాటు చేసుకోవాలని, నిర్దేశిత ప్రాంతాల్లోనే వాహనాలను పార్కింగ్ చేసుకోవాలని షరతులు విధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement