ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
హైదరాబాద్: నాకు రోడ్డు ప్రమాదం జరిగినపుడు అటల్ బిహారీ వాజ్‌పేయి, ఎయిమ్స్‌కు వచ్చి నాకు ధైర్యం చెప్పిన సంగతి మర్చిపోలేని అంశమని మాజీ కేంద్ర మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గుర్తు చేసుకున్నారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి మృతి దేశానికి తీరని లోటు అని వ్యాఖ్యానించారు. కేంద్రమంత్రిగా పనిచేసినపుడు వాజ్‌పేయితో మంచి అనుబంధం ఉండేదని తెలిపారు. రాజ్యాంగాన్ని గెలిపించడం కోసం ప్రధాని పదవిని కూడా వదులుకున్న గొప్ప విలువలున్న నాయకుడు వాజ్‌పేయి అని కొనియాడారు.
ఢిల్లీ వెళ్లనున్న వైఎస్సార్‌సీపీ నేతలు
ఇదిలా ఉండగా రేపు(శుక్రవారం) వైఎస్‌ఆర్‌సీపీ నేతలు ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. వాజ్‌పేయి పార్ధివదేహానికి నివాళులర్పించేందుకు వైఎస్సార్‌సీపీ రాజ్యసభ ఎంపీలు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, తిరుపతి మాజీ ఎంపీ వరప్రసాద్‌లు వెళ్లనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment