Umma reddy Venkateswarlu
-
ప్రజల దృష్టిని మళ్లించేందుకు బాబు కుట్ర
-
ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు అస్వస్థత
-
వైఎస్సార్సీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు అస్వస్థత
సాక్షి, గుంటూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అస్వస్థతకు గురయ్యారు. గుంటూరు కలెక్టరేట్ వద్ద మీడియా సమావేశంలో మాట్లాడుతున్న సమయంలో వాంతులు కావడంతో అక్కడి వారు వెంటనే ఆస్పత్రికి తరలించారు. కలెక్టర్ కార్యాలయం వద్ద రీలే నిరాహార దీక్షలు చేస్తోన్న ఎంపీఇవోలతో చర్చించేందుకు బుధవారం ఉదయం ఆయన అక్కడికి చేరుకున్నారు. వారితో మాట్లాడుతూ.. సమస్యలన్నీ సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చి.. మీడియాతో మాట్లాడుతున్న సమయంలో అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయనకు ఆస్పత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. -
మండలి చీఫ్ విప్‌గా ఉమ్మారెడ్డి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చీఫ్ విప్‌గా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు నిమితులయ్యారు. విప్‌గా గంగుల ప్రభాకర్‌రెడ్డి ఎన్నికయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. కాగా మండలిలో వైఎస్సార్సీపీ పక్ష నేతగా, ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ నిమితులైన విషయం తెలిసిందే. అలాగే మండలిలో టీడీపీ పక్ష నేతగా యనమల రామకృష్ణుడును ఖరారు చేస్తూ.. మండలి చైర్మన్ షరీష్ అహ్మద్ సభలో ప్రకటించారు. -
కౌంటింగ్ ఏజెంట్లకు విధులు, బాధ్యతలపై ట్రైనింగ్ ఇచ్చాం
-
తొలి ఓటు నుంచి చివరి ఓటు లెక్కింపు వరకూ..
సాక్షి, విజయవాడ : తొలి ఓటు నుంచి చివరి ఓటు లెక్కింపు వరకు ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సూచించారు. విజయవాడలోని ఏ1 కన్వెన్షన్‌లో గురువారం వైఎస్సార్ సీపీ అసెంబ్లీ అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థులు, చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లకు కౌంటింగ్‌పై శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్సాఆర్ సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మాజీ సీఎస్ అజయ్ కల్లాం, రిటైర్డ్ ఐఏఎస్ శామ్యూల్ తదితరులు హాజరయ్యారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచనల మేరకు ఈ శిక్షణా కార్యక్రమం నిర్వహించామన్నారు. కౌంటింగ్ ఏజెంట్ల విధులు, బాధ్యతల గురించి ట్రైనింగ్ ఇచ్చామాన్నారు. శిక్షణా కార్యక్రమంలో భాగంగా 175 మంది అసెంబ్లీ అభ్యర్థులకు, 25 మంది ఎంపీ అభ్యర్థులతో పాటు చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లతో సహా మొత్తం 400 మందికి శిక్షణ ఇచ్చామన్నారు. ఏజెంట్లు, రిజర్వ్ ఏజెంట్లు ఎంత మంది ఉండాలి.. వారికి ఉండాల్సిన అర్హతల గురించి వివరించామన్నారు. రౌండ్స్ వారిగా తీసుకోవాల్సిన చర్యలు.. రీకౌంటింగ్ ఏ సందర్భంలో కోరవచ్చో తెలియజేశామన్నారు. ఉద్దేశపూర్వకంగా కౌంటింగ్ నిలుపుదల చేస్తే.. తక్షణమే రీకౌంటింగ్ నిర్వహించేలా ఎన్నికల సంఘం పని చేస్తుందని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్లు ఎన్ని వచ్చాయో క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని చెప్పామన్నారు. కౌంటింగ్ హాల్లోకి వెళ్లిన తరువాత ఫోన్లు వాడకూడదని సూచించమన్నారు. ఎన్నికల కమిషన్ ప్రింట్ చేసి ఇచ్చిన మాన్యువల్ కూడా అందరికీ ఒక కాపీ అందజేశామన్నారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : కౌంటింగ్ ఏజెంట్లకు విధులు, బాధ్యతలపై ట్రైనింగ్ ఇచ్చాం -
మాకు ఏ పార్టీతోనూ పోటీలేదు: వైఎస్ జగన్
సాక్షి, హైదరాబాద్: పార్టీ మేనిఫెస్టోలో చేసే వాగ్దాలన్నీ నిజాయితీగా చేస్తామని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి స్పష్టంచేశారు. మేనిఫెస్టో కమిటితో బుధవారం లోటస్‌పాండ్‌లో వైఎస్ జగన్ భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాగ్దానాలు చేయడంలో తమకు ఏ పార్టీతోనూ పోటీలేదని అన్నారు. అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను పరిగణలోకి తీసుకుంటామని, పాదయాత్రలో ప్రజలకిచ్చిన హామీలన్నింటినీ మేనిఫెస్టోలో పొందుపరుస్తామని పేర్కొన్నారు. తమ పార్టీ మేనిఫెస్టో సంక్షిప్తంగా అందరికీ అర్థమయ్యేలా ఉంటుందని వెల్లడించారు. రాష్ట్రంలోని కౌలురైతులకు న్యాయం చేసేలా తమపథకాలను రూపొందిస్తున్నారని వైఎస్ జగన్ తెలిపారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు ఆయన పలు సూచనలు చేశారు. -
వదంతులు నమ్మాల్సిన అవసరం లేదు
విజయవాడ: వైఎస్సార్సీపీ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ తొలి సమావేశంలో అందరి విలువైన సూచనలు తీసుకున్నామని వైఎస్సార్సీపీ అగ్రనేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యాలయంలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విలేకరులతో మాట్లాడారు. వైఎస్ జగన్ పాదయాత్రలో ఇచ్చిన వాగ్దానాలు, నవరత్నాలన్నీ మేనిఫెస్టోలో ఉంటాయన్నారు. మేనిఫెస్టోలో సూచనలు, సలహాలు మెయిల్ఐడీకి పంపాలని కోరారు. అన్ని వర్గాల సమస్యలకు పరిష్కారాలు మా మేనిఫెస్టోలో ఉంటాయని స్పష్టం చేశారు. రాజధాని అమరావతిని మార్చుతారన్న వదంతులు నమ్మాల్సిన అవసరం లేదన్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు, వ్యవసాయం, సాగునీరు, మహిళలు, సంక్షేమం, విద్య, ఉపాధి, యువత సంబంధిత అంశాలు, వైద్యం, ఉద్యోగం, పెన్షనర్లు, ఎక్స్ సర్వీస్మేన్, హౌసింగ్, పరిశ్రమలు, ఎన్నారైల సమస్యలన్నీ మేనిఫెస్టోలో ఉంటాయన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతిహామీని అమలు చేస్తామని, మార్చి 6న మేనిఫెస్టో కమిటీ మరోసారి భేటి అవుతుందని వెల్లడించారు. -
వదంతులు నమ్మాల్సిన అవసరం లేదు
-
వైఎస్సార్సీపీ మేనిఫెస్టో కమిటీ
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పనకు 31 మంది సభ్యులతో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కమిటీని నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేసింది. కమిటీకి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అధ్యక్షుడిగా వ్యవహరిస్తారని పేర్కొంది. మేకపాటి రాజమోహన్‌రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, కొలుసు పార్థసారథి, పిల్లి సుభాష్‌చంద్రబోస్, బుగ్గన రాజేంద్రనాథ్, మోపిదేవి వెంకటరమణ, కొడాలి నాని, రాజన్నదొర, అంజద్ బాషా, పుష్పవాణి, ఆదిమూలపు సురేష్, దువ్వూరి కృష్ణ, సాంబశివారెడ్డి, కురసాల కన్నబాబు, ఇక్బాల్, వెలంపల్లి శ్రీనివాస్, ముదునూరి ప్రసాదరాజు, మేరుగ నాగార్జున, మర్రి రాజశేఖర్, నాగిరెడ్డి, సంజీవ్‌కుమార్, రంగయ్య, కిష్టప్ప, సుచరిత, నందిగం సురేష్, జంగా కృష్ణమూర్తి, తమ్మినేని సీతారాం, సజ్జల రామకృష్ణారెడ్డి మేనిఫెస్టో కమిటీలో సభ్యులుగా కొనసాగుతారని పార్టీ పేర్కొంది. ఈ కమిటీ 26వ తేదీన విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సమావేశమవుతుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. -
వ్యవసాయాభివృద్ధితోనే గ్రామాల్లో వెలుగులు
గ్రామీణ సమాజంలో వెలుగులు పూయించాల ంటే వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలి. వ్యవసాయదారులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీల సంక్షేమమే వ్యవసాయాభివృద్ధికి కొలబద్ద. దీనిని పరిగణనలోకి తీసుకోకుండా.. అధికారంలో ఉన్న వారు వ్యవసాయ అనుబంధ రంగాలైన చేపలు, ఆక్వారంగంలో అభివృద్ధిని వ్యవసాయరంగ ఆదాయంలో జోడించి వ్యవసాయరంగం రెండంకెల అభివృద్ధి సాధించిందని చెప్పుకోవడం రైతాంగాన్ని వంచించడమే. కారణం ఆక్వా ఆదాయం రాష్ట్రంలో కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమితం. 2011 గణాంకాల ప్రకారం దేశంలో 55.49% జనాభా వ్యవసాయంపై ఆధారపడగా అందులో 33.6% వ్యవసాయ కార్మికులు. మిగతావారు వ్యవ సాయదారులు, కౌలు రైతులు. సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీ (సిఎస్పిఎస్) నివేదిక ప్రకారం 76% మంది రైతులు వ్యవసాయాన్ని మానుకుని ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాల్లోకి మరలాలని భావిస్తున్నారు. కానీ, ప్రత్యామ్నాయ మార్గాలు లేకనే.. నష్టాల్ని, కష్టాల్ని భరిస్తూ విధిలేక వ్యవసాయం చేస్తు న్నారనే నగ్నసత్యాన్ని పాలకులు మరవకూడదు. ప్రముఖ వ్యవసాయ శాస్త్రజ్ఞుడు డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ నేతృత్వంలోని కమిషన్ 2007లోనే ఓ సమగ్రమైన నివేదిక అప్పటి కేంద్ర ప్రభుత్వానికి అందించింది. ఆ నివేదికలో విలువైన సూచనలు ఉన్నాయి. ఇదికాక, ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక ప్లానింగ్ కమిషన్ స్థానంలో ఏర్పాటయిన నీతి ఆయోగ్ వ్యవసాయరంగంపై ఓ సమగ్ర విధాన పత్రాన్ని అందించింది. ‘ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోపరేషన్ అండ్ డెవలప్మెంట్’ (ఒఇసిడి) తాజా గణాంకాల ప్రకారం గత 5 ఏళ్లల్లో వివిధ పంటలు చేతికొచ్చాక.. మార్కెట్‌కు చేరేలోపు జరిగిన నష్టం (పోస్ట్ హార్వెస్ట్ నష్టాలు) 4% నుంచి 16%కు పెరిగాయి. వీటిలో ఎక్కువగా పండ్లు, కూరగాయలు లాంటివి ప్రధానమైనవి. రైతులకు హెక్టారుకు ఏడు వేల రూపాయలు సబ్సిడీ అందించి ఎరువులపై నియంత్రణ ఎత్తివేయాలని సలహా సంఘం సూచించినప్పటికీ దానిని కేంద్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. అలాగే, గోధుమ, వరి, బియ్యంలాంటి వాటిని ఎఫ్‌సీఐ ద్వారా సేకరించడం మానుకుని, ఆ బాధ్యతను రాష్ట్రాలకు వదిలి పెట్టాలన్న సూచన సత్ఫలితాలను సాధించకపోవడం. ముఖ్యంగా.. గత ఐదేళ్లల్లో విత్తనోత్పత్తిలో అధునాతన పద్ధతులేమీ పాటించకపోవడం వల్ల అధిక దిగుబడి ఇచ్చే వంగడాలు అందుబాటులోకి రాలేదనే వాస్తవాన్ని నీతిఆయోగ్ ఎత్తిచూపింది. తెలంగాణ ప్రభుత్వం గత ఏడాదికాలంగా ఎకరాకు రూ. 4,000 నగదు నేరుగా రైతు ఖాతాలో వేసే పథకాన్ని అమలు చేస్తున్నది. రెండవసారి అధికారంలోకి వచ్చాక ఎకరాకు రూ. 5,000 చొప్పున ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ పథకం కాకుండా పంట నష్టపోయే రైతులను ఆదుకోవడానికి సమగ్ర బీమా పథకం అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తున్నది. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయరంగంలో అమలు చేస్తున్న పథకాల పట్ల కేంద్రంతోపాటు పలు రాష్ట్రాలు ఆసక్తిగా గమనిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం నేతృత్వం లోని ప్రభుత్వం.. గత ఐదేళ్లుగా వ్యవసాయ రంగానికి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశ పెడుతున్నప్పటికీ.. రైతులకు కలిగిన ప్రయోజనం శూన్యమనే చెప్పాలి. పదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం అధినేత రైతాంగం సంక్షేమం కోసం రెండుసార్లు ఆమరణ నిరాహార దీక్షల పేరుతో హడావుడి చేశారు. ఇక, 2014 ఎన్నికలముందయితే.. అధికారంలోకి రాగానే బేషరతుగా రైతుల రుణాలను మాఫీ చేస్తామని నమ్మబలికారు. తీరా అధికారంలోకి వచ్చాక.. టీడీపీ ప్రభుత్వం రైతాంగాన్ని ఏవిధంగా వంచించిందో అందరూ గమనించారు. ఒక్కసారి కూడా చంద్రబాబు డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని కేంద్రంపై ఒత్తిడి తేలేదు. కనీస మద్దతు ధరలు పెంచితే వినియోగదారుడిపై భారం పడుతుంది కనుక స్వామినాథన్ కమిషన్ సిఫార్సు లను అమలు చేయలేమని సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిడ్ దాఖలు చేసినా.. బాబు పెదవి విప్పలేదు. ప్రధాన కారణం కేంద్రంలోని మోదీ ప్రభుత్వంతో మైత్రీ బంధం ఉంది గనుక. దక్షిణాదిన కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు ఇస్తున్నట్లు కనీసం బోనస్ కూడా ప్రకటించలేదు. ఇక, రైతు రుణమాఫీని ఓ ఫార్సుగా చేశారు. 2014 ఎన్నికల ముందు బాబు రైతుల రుణమాఫీ వాగ్దానం చేసే నాటికి రాష్ట్రంలో రైతుల అప్పులు రూ.87,612 కోట్లు. తరచూ రుణ మాఫీకి కటాఫ్ డేట్లు మార్చారు. కోటయ్య కమిటీ వేసి లక్షరూపాయల రుణం కంటే తక్కువ మొత్తాలకు మాత్రమే రుణమాఫీ అన్నారు. రుణభారం కేవలం రూ. 24,000 కోట్లుగా లెక్క తేల్చి... దానిని ఐదేళ్ల పాటు దఫాలవారీగా ఇస్తామని చెప్పి.. కేవలం 13,000 కోట్లు చెల్లించి, ఇప్పటికీ ఇంకా రూ. 11,000 కోట్లు చెల్లించలేదు. ప్రభుత్వం చేసిన రుణమాఫీ మొత్తం వడ్డీలకే సరిపోయిందని రైతులు గగ్గోలు పెట్టారు. ఆకర్షణీయమైన నినాదాలు తప్ప టీడీపీ రైతుల సంక్షేమానికి నిర్దిష్టంగా చేసిన మేలు మచ్చుకైనా కనపడదు. మరోపక్క.. అనంతపురం జిల్లాలో ‘కరువే మనలను చూసి భయపడి పారిపోయేలా చేస్తాం’ అంటూ ఆర్భాటంగా వందల కోట్లతో రెయిన్ గన్లు కొని.. నీళ్లు లేక వాటిని మూలన పెట్టేశారు. ఈ ఏడాది 30.55 లక్షల ఎకరాల్లో వరిసాగు జరగాల్సి ఉండగా.. వివిధ ఎత్తిపోతల పథకాల కింది ఆయకట్టుకు నీరు అందించలేకపోవడంతో కేవలం ఆరుతడి పంటలకు మాత్రమే నీరివ్వాలనే ప్రభుత్వ నిర్ణయం రైతుల పాలిట శాపంగా పరిణమించింది. నాలుగున్నరేళ్లల్లో సంభవించిన కరువు, తుపాన్లతో భారీగా జరిగిన పంట నష్టానికి రైతులు కోలుకోలేని దైన్యస్థితిలో పడిపోయారు. దేశవ్యాప్తంగా అన్నదాతల ఆందోళనలు మిన్నంటుతున్నాయి. ఢిల్లీని ఇటీవల 35,000 మంది రైతులు ముట్టడించి కేంద్రానికి చెమటలు పట్టించారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తమిళనాడు.. ఇలా పలు రాష్ట్రాలకు చెందిన రైతులు రోడ్ల మీదకు వస్తున్నారు. మోదీ గద్దె దిగాలని కొన్నిరాజకీయ పార్టీలు నినదిస్తున్నాయి. కానీ, అధికారంలోకి ఎవరొచ్చినా వ్యవసాయరంగ పరిస్థితిలో మార్పురావడంలేదు. అధిక ఆదాయం చేకూర్చే రంగంగా వ్యవసాయాన్ని తీర్చిదిద్దడం అసాధ్యమేమీ కాదు. గ్రామీణ ప్రాంతం లోని యువత శక్తిసామర్థ్యాలను ఉపయోగించుకోవాలి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయడానికి.. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల్ని మెరుగుపర్చాలి. విద్య, వైద్య సదుపాయాలు, మంచినీరు, డ్రైనేజీ వ్యవస్థలను విస్తృతపర్చాలి. ఈ చర్యలు చేపడితే వ్యవసాయరంగంలో వెలుగులు పూయించడం సాధ్యపడుతుంది. వ్యాసకర్త శాసన మండలి ప్రతిపక్ష నాయకులు, కేంద్ర మాజీ మంత్రి డా‘‘ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు -
రాష్ట్ర వ్యాప్తంగా 52 లక్షల దొంగ ఓట్లు: ఉమ్మారెడ్డి
సాక్షి, గుంటూరు: జిల్లాలోని గురజాల నియోజకవర్గంలో ఓట్ల గల్లంతుపై విషయంపై వైఎస్సార్సీపీ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, కాసు మహేష్ రెడ్డి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అనంతరం ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో టీడీపీ నేతలు ఉద్దేశ పూర్వకంగా ఓట్లు తొలగిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎన్నికల జాబితాలో అక్రమాలకు పాల్పడుతోందని, టీడీపీ అనుకూల ఓట్లను ఉంచి, వ్యతిరేక ఓట్లను తొలగిస్తున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్ర వ్యాప్తంగా 52లక్షల దొంగ ఓట్లు ఉన్నాయని అన్నారు. గతంలో నరసరావుపేటలో 43 వేల ఓట్లు టీడీపీ నేతులు తొలగించారు. అధికార నేతల ఒత్తిడి తట్టుకోలేక ఎన్నికల అధికారులు సెలవులపై వెళ్లిపోతున్నారని చెప్పారు. ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరిగేలా చూడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందని అన్నారు. కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతూ... గురజాల నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి దొంగ ఓట్లతో గెలవాలని చూస్తున్నారని ఆరోపించారు. రాజకీయ ఒత్తిడి వల్లనే మాచవరం ఎమ్మార్వో సెలవుపై వెళ్లిపోయారని తెలిపారు. వచ్చే జనవరి 18 వరకు చూస్తామని, న్యాయం జరగకపోతే హైకోర్టును ఆశ్రయిస్తామని అన్నారు. గురజాల నియోజక వర్గం పిడుగు రాళ్ళలో కొత్తగా 8వేల దొంగ ఓట్లు చేర్పించారని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శించారు. -
నాకు ధైర్యం చెప్పిన సంగతి మర్చిపోలేను
హైదరాబాద్: నాకు రోడ్డు ప్రమాదం జరిగినపుడు అటల్ బిహారీ వాజ్‌పేయి, ఎయిమ్స్‌కు వచ్చి నాకు ధైర్యం చెప్పిన సంగతి మర్చిపోలేని అంశమని మాజీ కేంద్ర మంత్రి, వైఎస్సార్సీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గుర్తు చేసుకున్నారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి మృతి దేశానికి తీరని లోటు అని వ్యాఖ్యానించారు. కేంద్రమంత్రిగా పనిచేసినపుడు వాజ్‌పేయితో మంచి అనుబంధం ఉండేదని తెలిపారు. రాజ్యాంగాన్ని గెలిపించడం కోసం ప్రధాని పదవిని కూడా వదులుకున్న గొప్ప విలువలున్న నాయకుడు వాజ్‌పేయి అని కొనియాడారు. ఢిల్లీ వెళ్లనున్న వైఎస్సార్సీపీ నేతలు ఇదిలా ఉండగా రేపు(శుక్రవారం) వైఎస్ఆర్సీపీ నేతలు ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. వాజ్‌పేయి పార్ధివదేహానికి నివాళులర్పించేందుకు వైఎస్సార్సీపీ రాజ్యసభ ఎంపీలు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, తిరుపతి మాజీ ఎంపీ వరప్రసాద్‌లు వెళ్లనున్నారు. -
ఉభయ రాష్ట్రాలు అన్ని రంగాల్లో ముందుండాలి
-
‘చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోవాలి’
సాక్షి, హైదరాబాద్ : దేశం కోసం ఎంతోమంది వీరులు ప్రాణాలు అర్పించారని, వారి చరిత్రను చూసి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరముందని ఏపీ శాసనమండలి ప్రతిపక్షనేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. దేశ 72వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ జనాభాకు అనుగుణంగా ఆర్థిక వనరులు పెరగాలని, ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరగాలని అన్నారు. ‘మహిళలపై అత్యాచారాలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కక్షలు పెరిగిపోతున్నాయి. దేశ సంపద కొంత మంది చేతిలోనే ఉండిపోతోంది. స్వాతంత్ర ఫలాలు అందరికి చేరాలి. దోపిడిలు, దుర్మార్గాలు ఎక్కువయ్యాయి. రాజకీయ వ్యవస్థకు నూతన నిర్వచనాలు ఇస్తున్నారు. పార్టీ ఫిరాయింపుల దగ్గర నుంచి అన్నీ రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. పేదలను పట్టించుకోవడం లేదు. ఆరోగ్యం, విద్యకు మహానేత వైఎస్సార్ చాలా ప్రాధాన్యత ఇచ్చారు. వైఎస్సార్ పాదయాత్ర చారిత్రాత్మకమైనది. జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతంగా సాగాలి. ఉభయ రాష్ట్రాలు అన్ని రంగాల్లో ముందుండాలి’ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలు వాసిరెడ్డి పద్మ, రెహమాన్, గట్టు శ్రీకాంత్ రెడ్డి, పుత్త ప్రతాప్ రెడ్డి, లక్ష్మీ పార్వతి తదితరులు పాల్గొన్నారు. స్వతంత్ర సంగ్రామంలో కృష్ణా జిల్లా కీలక భూమిక దేశ స్వాతంత్ర్ర్య దినోత్సవ వేడుకలు సందర్భంగా విజయవాడలోని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నేతలు జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్వాతంత్రం వచ్చినప్పటికీ ఆ ఫలాలు అందరికీ అందడంలేదని పార్టీ నేత పార్థసారథి అన్నారు. 72 ఏళ్లు నిండినప్పటికి ఈ పరిస్థితి ఉండడం బాధకరమని వ్యాఖ్యానించారు. స్వాతంత్ర్య సంగ్రామంలో కృష్ణా జిల్లా, విజయవాడ కీలక భూమిక పోషించాయని, మహాత్ముని స్ఫూర్తితో వైఎస్సార్సీపీ ముందుకెళుతుందని మల్లాది విఘ్ణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీనేతలు పైలా సోమినాయుడు, బొప్పన భవన కుమార్, ఎమ్వీఆర్ చౌదరి, జానారెడ్డి, పుల్లారావు, పలువురు స్థానిక నేతలు పాల్గొన్నారు. -
జమిలి ఎన్నికలకు సిద్ధమే
సాక్షి, న్యూఢిల్లీ: దేశ, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా లోక్‌సభ, శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే ప్రతిపాదనకు తాము మద్దతు ఇస్తున్నట్టు వైఎస్సార్ సీపీ ప్రకటించింది. ఈ మేరకు పార్టీ రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి, మండలిలో ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మంగళవారం ఢిల్లీలో లా కమిషన్ చైర్మన్ జస్టిస్ బీఎస్ చౌహాన్‌ను కలసి జమిలి ఎన్నికలపై వైఎస్సార్ సీపీ అభిప్రాయాన్ని తెలియచేస్తూ 10 పేజీల లేఖను అందజేశారు. 1951 నుంచి 1967 వరకు దేశంలో జమిలి ఎన్నికలు జరిగాయని, మధ్యలో కొన్ని రాజకీయ సమీకరణాల వల్ల అది కుదరలేదని అందులో పేర్కొన్నారు. జమిలి ఎన్నికలపై మళ్లీ ఇప్పుడు లా కమిషన్ అన్ని వర్గాల నుంచి అభిప్రాయ సేకరణ ప్రారంభించడాన్ని వైఎస్సార్ సీపీ అభినందించింది. తరచూ ఎన్నికలతో అభివృద్ధికి ఆటంకాలు 2014లో సాధారణ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం, ఒడిశా రాష్ట్రాలతో పాటు జరగగా అనంతరం ఇప్పటి వరకు నాలుగేళ్లలో 15 రాష్ట్రాలకు ఎన్నికలు జరిగాయన్నారు. ఇలా ఏటా ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరగడం వల్ల దేశాభివృద్ధికి ఆటంకం ఏర్పడుతోందని వైఎస్సార్ సీపీ పేర్కొంది. ఎన్నికల కోడ్ వల్ల సంక్షేమ పథకాల అమలుకు ఆటంకం కలగడంతోపాటు అధికార యంత్రాంగం అంతా పాలనాపరమైన అంశాలను పక్కనపెట్టి ఎన్నికల పనుల్లో నిమగ్నమవుతోందని, దీనివల్ల ప్రభుత్వాలు అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయలేకపోతున్నాయని పార్టీ వివరించింది. లోక్‌సభ, అసెంబ్లీలకు వేరువేరుగా ఎన్నికల నిర్వహణ వల్ల వ్యయం భారీగా పెరుగుతోందని తెలిపింది. కేంద్ర ఎన్నికల సంఘానికి 2009 ఎన్నికల నిర్వహణకు రూ. 1,100 కోట్లు, 2014 ఎన్నికలకు రూ. 4 వేల కోట్లు ఖర్చు కాగా ఇక 2019 ఎన్నికలకు ఎంత ఖర్చు అవుతుందో ఊహించుకోవచ్చని లేఖలో పేర్కొంది. ఓటుకు కోట్లు కేసులు తగ్గుతాయి.. జమిలి ఎన్నికల వల్ల ఖర్చులు తగ్గిపోవడమే కాకుండా అవినీతి తగ్గుతుందని, ఓటుకు కోట్లు లాంటి కేసులు తగ్గిపోతాయని, సమాజాన్ని విడగొట్టే కుల సమీకరణాలు తగ్గిపోతాయని, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కీలక నేతల ఏటా ఎన్నికల ప్రచారాలకు రాష్ట్రాల్లో తిరగాల్సిన అవసరం లేకుండా అభివృద్ధి పనులపై దృష్టి పెట్టవచ్చని వైఎస్సార్ సీపీ లేఖలో పేర్కొంది. 1999లోనే జస్టిస్ జీవన్‌రెడ్డి నేతృత్వంలోని లా కమిషన్ తన 170వ రిపోర్టులో దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణకు సిఫార్సు చేసిందని గుర్తు చేసింది. 2015లో పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చిందని పేర్కొంది. ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలి.. మరోవైపు జమిలి ఎన్నికల వల్ల కొన్ని సమస్యలు కూడా ఉన్నాయని వైఎస్సార్ సీపీ తెలిపింది. దీనివల్ల రాష్ట్రాల ఎన్నికలు, ప్రాంతీయ పార్టీలకు ప్రాధాన్యం తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. ఎన్నికల కమిషన్‌కు ఎన్నికల నిర్వహణ వ్యయం తగ్గినా రాజకీయ పార్టీల ఖర్చులు తగ్గుతాయన్న దానిపై హామీ లేదని, పార్టీలు ఒకేసారి మొత్తం నిధులు ఖర్చు పెట్టే అవకాశం ఉందని తెలిపింది. జమిలి విధానంలో ఐదేళ్లకు ఒకసారే ఎన్నికలు జరగడం వల్ల ప్రభుత్వాల పనితీరుపై ప్రజలు మధ్యలో తీర్పు చెప్పే అవకాశం తగ్గిపోతుందని పేర్కొంది. ఆర్టికల్ 83(2), 172 ప్రకారం ఏదైనా ప్రభుత్వానికి ఐదేళ్లు పాలించే అధికారం ఉంటుందని, కానీ జమిలి ఎన్నికల వల్ల ఆ విధానాన్ని విస్మరించే అవకాశం ఉందని, ఇంకా కాలపరిమితి ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలను జమిలి ఎన్నికలకు ఎలా ఒప్పిస్తారు? జమిలి ఎన్నికల తరువాత ఒకవేళ అవిశ్వాసం వల్ల ఏదైనా ప్రభుత్వం రద్దై ఇతర పార్టీలు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం లేకపోతే రాజకీయ అనిశ్చితి తలెత్తకుండా ఎలాంటి ప్రత్యామ్నాయాలు తీసుకుంటారని ప్రశ్నించింది. ఈ విషయాల్లో రాజ్యాంగ సవరణ అవసరమని, అది అంత సులువైనది కాదని పేర్కొంది. దీనిపై లా కమిషన్ అన్ని రాజకీయ పార్టీలతో చర్చించి అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలని కోరింది. ఈ నేపథ్యంలో జమిలి ఎన్నికల వల్ల తలెత్తే సమస్యలన్నింటిని పరిష్కరించి ఈ విషయంలో ముందుకెళ్లాలని, లేకుంటే ప్రతికూల ఫలితాలు తప్పవని పేర్కొంది. ఏదైనా కారణాల వల్ల కేంద్రం, రాష్ట్రాల్లో ప్రభుత్వాలు రద్దు అయితే అప్పుడు పరిస్థితి ఏమిటని ప్రశ్నించగా.. రాజ్యసభకు ఎలాగైతే ఆరేళ్ల కాలపరిమితితో మధ్యలో ఖాళీ అయితే మిగిలిన సమయానికి మాత్రమే ఏ రకంగా ఎన్నిక జరుగుతుందో అలాగే ఎన్నికలు జరిగేలా సిఫార్సు చేస్తామని లా కమిషన్ చెప్పినట్టు ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాకు తెలిపారు. 30 రోజుల్లో చర్యలు తీసుకోవాలి ఒక పార్టీ గుర్తు మీద గెలిచి ఇతర పార్టీల్లోకి ఫిరాయించే సభ్యులపై 30 రోజుల్లోగా వారి సభ్యత్వాలు రద్దయ్యేలా చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ కోరింది. ఈ అధికారాన్ని స్పీకర్లకు కాకుండా ఎన్నికల కమిషన్‌కే అప్పగించాలని సిఫార్సు చేసింది. ప్రస్తుతం అధికారాలు స్పీకర్ల వద్ద ఉండటంతో అధికార పార్టీల వల్ల అవి దుర్వినియోగం అవుతున్నాయని పేర్కొంది. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాజ్యాంగంలో ఈ సవరణలు అత్యవసరం అని వైఎస్సార్ సీపీ అభిప్రాయపడింది. -
కేవలం 14 పంటలపై ధర పెంచటం దారుణం
-
పెట్రో మంటకు సామాన్యులే సమిధలు
‘‘కొందర్ని కొన్నిసార్లే మోసగించగలం, అందర్నీ అన్నిసార్లు మోసపుచ్చడం కష్టం!’’ అన్నది ఓ పాత నానుడి. అందర్నీ అన్ని వేళలా మోసపుచ్చవచ్చని నరేంద్ర మోదీ ప్రభుత్వం నిరూపించే సాహసం చేస్తోంది. యూపీఏ హయాంలో ముడి చమురు ధర బ్యారెల్‌కు 100–140 డాలర్ల మధ్య ఊగిసలాడినపుడు భారతీయులు లీటర్ పెట్రోలుకు చెల్లించిన ధర రూ. 70 నుంచి రూ. 75 మధ్యనే ఉంది. 2014 మేలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక అంతర్జాతీ యంగా క్రూడాయిల్ ధరలు గణనీయంగా పతనమయ్యాయి. ధరలు తగ్గించకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదాయం మరింత పెంచుకున్నాయి. క్రూడాయిల్ బ్యారెల్ ధర 40 డాలర్ల కనిష్ట స్థాయికి దిగినప్పుడు కూడా వినియోగదారులు లీటర్ పెట్రోల్‌కు రూ. 70 చెల్లించాల్సి వచ్చింది. ప్రస్తుతం రూ. 80 దాటిపోయింది. డీజిల్ ధర రూ. 75కి పైనే. 2014 మేలో అంతర్జాతీయ విపణిలో బ్యారెల్ చమురు ధర.105 డాలర్లు ఉండగా 2018 మే చివరి వారానికి రూ.74 డాలర్లకు తగ్గింది. అయినా, చమురు ధరలు 2014 నాటికన్నా ఎందుకు ఎక్కువగా ఉన్నాయన్నది అంతుబట్టని రహస్యం. దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోల్చితే ఆంధ్రప్రదేశ్‌లోనే పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువ. రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న వ్యాట్ ఎక్కడా లేనంతగా 34 శాతం ఉంది. దీనికి అదనంగా ప్రత్యేక పన్ను రూపంలో లీటర్‌కు నాలుగు రూపాయలు వసూలు చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉండగా బాబు పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు నిర్వహించారు. తాము అధికారంలోకి వస్తే వ్యాట్ తగ్గిస్తామని, డీజిల్‌పై రాయితీలు ఇస్తామని ప్రకటిం చారు. ఆయన ప్రకటనలు, హామీలు అసెంబ్లీ రికార్డుల్లో పదిలంగా ఉన్నాయి తప్ప కార్యరూపం దాల్చ లేదు. ఢిల్లీ, బొంబాయి, బెంగుళూరు చివరకు హైదరాబాద్‌లో కంటే ఏపీలోని ప్రధాన నగరాల్లో అమ్ముతున్న పెట్రో ధరలు లీటర్‌కు రూ.5 కంటే ఎక్కువ. తెలుగు రాష్ట్రాల్లో పెట్రో ఉత్పత్తులపై వ్యాట్‌ను గరిష్టంగా 34 శాతం వడ్డిస్తుండగా, హిమాచల్‌ప్రదేశ్‌లో 18 శాతం మాత్రమే. ఈ ఏడాది మే ఒకటి నాటికి దేశంలో వివిధ రాష్ట్రాలు పెట్రో ఉత్పత్తులపై విధిస్తున్న సేల్స్ టాక్స్/వ్యాట్ పరిశీలిస్తే పెట్రోలుపై మహారాష్ట్ర 39.79 శాతంతో మొదటి స్థానంలో నిలిస్తే, 36.06 శాతంతో ఏపీ రెండో స్థానంలో నిలిచింది. డీజిల్‌పై పన్ను విషయంలో ఏపీ 28.47 శాతంతో ప్ర«థమ స్థానంలో ఉంది. అంతర్జాతీయంగా బ్యారల్ ధర ఒక డాలర్ పెరి గితే రాష్ట్రాలన్నింటికి కలిపి అదనంగా రూ.18,728 కోట్లు ఆదాయం పెరుగుతోందని ఎస్.బి.ఐ. నివేదిక వెల్లడించింది. పెట్రో ఉత్పత్తుల ధరలను జీఎస్టీ పరి ధిలోకి తేకుంటే దేశ ఆర్థికాభివృద్ధికి తీవ్ర ముప్పు వాటిల్లుతుందని పలు వాణిజ్య పారిశ్రామిక మండళ్ల సమాఖ్యలు చేస్తున్న హెచ్చరికలను కేంద్ర ప్రభుత్వం ఖాతరు చేయడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నిన పద్మవ్యూహంలో సామాన్యులే సమిధలై విలవిల్లాడుతున్నారు. డీజిల్ ధరల పెరుగుదలతో తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ సంస్థలకు సగటున రూ. 680 కోట్లు అదనపు భారం పడినట్లు అంచనా. సామాన్యులపై పెట్రో ఉత్పత్తుల భారాన్ని తగ్గించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ముందు అనేక ప్రత్యామ్నాయాలున్నాయి. 2004–2009 మధ్య కాలంలో ఏపీ సీఎంగా ఉన్న వైఎస్ రాజ శేఖరరెడ్డి వంటగ్యాస్ ధర పెరిగినపుడు ఆ భారం పేద, మధ్య తరగతి వర్గాలపై పడకుండా సిలిండర్‌కు రూ. 50 మేర పెరిగిన ధరను సబ్సిడీ రూపంలో అందించారు. నాలుగేళ్ల పాలన పూర్తి చేసుకున్నప్పుడైనా మోదీ చమురు ధరల విషయంలో ఏదైనా తీపికబురు చెబుతారేమోనని ఎదురు చూసినవారికి నిరాశే మిగిలింది. ఈ నాలుగేళ్లల్లోనే కేంద్రం కేవలం ఎక్సైజ్ సుంకం పెంపు ద్వారా రూ.10 లక్షల కోట్లకు పైగా ఆర్జించిందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వ్యాట్ గరిష్టంగా వసూలు చేస్తున్న రాష్ట్రాలు కూడా ఆదాయాన్ని గణనీయంగా పెంచుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర సర్కార్లు వ్యాట్‌ను తగ్గించాలని కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని ఆఖరుకు బీజేపీ పాలిత రాష్ట్రాలు సైతం ఖాతరు చేయలేదు. ‘పెంచడం రూపాయల్లో... తగ్గిం చడం పైసల్లో’ అనే విధానాన్ని ప్రభుత్వాలు అనుసరిస్తూ ప్రజాభిప్రాయాన్ని అపహాస్యం చేస్తున్నాయి. వ్యాసకర్త ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నాయకులు డా‘‘ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మొబైల్ : 99890 24579 -
‘గీతం’ మూర్తికి చిన్నాస్పత్రిలో చికిత్సా?!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఎమ్మెల్సీ, గీతం వర్సిటీ అధినేత ఎంవీవీఎస్ మూర్తి కోలుకుంటున్నారు. అనారోగ్యంతో కలెక్టరేట్ సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. అయితే గీతం కార్పొరేట్ ఆస్పత్రికి అధినేతగా ఉన్న ఆయన.. పెద్దగా పేరు ప్రఖ్యాతులు లేని ఓ చిన్న ఆస్పత్రిలో చికిత్స చేయించుకోవడం చర్చనీయాంశమైంది. గీతం యూనివర్సిటీకి అనుబంధంగా ప్రారంభమైన గీతం ఆస్పత్రిని కార్పొరేట్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు ధీటుగా అభివృద్ధి చేశామని ఎప్పటికప్పుడు ప్రచారం చేస్తుంటారు. రెండు వేల పడకలు, కీళ్ల మార్పిడి, ప్లాస్టిక్ సర్జరీ, లాప్రోస్కోపిక్ తదితర అన్ని అధునాతన శస్త్ర చికిత్స సౌకర్యాలు, 350 మంది వైద్యుల సేవలు తమ ఆస్పత్రిలో అందుబాటులో ఉంటాయని గీతం నిర్వాహకులు విస్తృత ప్రచారం చేసుకుంటుంటారు. అటువంటి ఆస్పత్రికి అధినేతగా ఉన్న గీతం మూర్తికి అనారోగ్యం చేస్తే ఇప్పటివరకు పెద్దగా ఎవరికీ తెలియనిఓ చిన్న ఆస్పత్రిలో చికిత్స చేయించడమే చర్చకు తెరలేపింది. ఉమ్మారెడ్డి పరామర్శ : కాగా ఆస్పత్రిలో ఉన్న ఎమ్మెల్సీ మూర్తిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనమండలి ఉపనేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పార్టీ రాష్ట్ర అదనపు కార్యదర్శి పక్కి దివాకర్ తదితరులు బుధవారం పరామర్శించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. -
‘గెలుపుకోసం లక్షలాది కుటుంబాలు ఎదురుచుస్తున్నాయి’
సాక్షి, ప్రకాశం: గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఓడిపోలేదని, కేవలం వ్యక్తులు మాత్రమే ఓడిపోయారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ, పార్టీ సీనియర్ నాయకులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. ఒంగోలులో జరుగుతున్న వైఎస్సార్సీపీ రాజకీయ శిక్షణ తరగతుల్లో ఉమ్మారెడ్డి మాట్లాడుతూ... పోలింగ్ బూత్ మేనేజ్మెంట్లో మొదటి భాగం ఓటర్లును సమాయత్తం చేసుకోవడం, రెండోది పోలింగ్ వరకూ తీసుకెళ్లడమని పేర్కొన్నారు. ‘పార్టీ మొత్తంలో ఏ కమిటీకి లేని ప్రాధాన్యత బూత్ కమిటీకి ఉంది. పార్టీ గెలుపు కోసం లక్షలాది కుటుంబాలు ఎదురుచుస్తున్నాయి. అధికార పార్టీ పెట్టిన కేసులతో అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. బూత్ కమిటీ సభ్యులు అంతా సంఘటితంగా ఉండండి. ఓటు లేని వారికి ఓటు హక్కును కల్పించండి. ఎన్నికల్లో ఒక్క ఓటు కూడా విలువైనదే. ఒక్క ఓటు తేడాతో ఓడిపోయి సీఎం కుర్చీకి దూరమైన నేతలు మనదేశంలో చాలా మంది వున్నారు. పోల్ మేనేజ్మెంట్లో నిర్లక్ష్యం చేయకూడదు’ అని అన్నారు. -
వైఎస్సార్సీపీ నేతలతో బ్రిటిష్ హై కమిషనర్ భేటీ
హైదరాబాద్: వైఎస్ఆర్సీసీ నేతలు ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిలను బ్రిటిష్ హైకమిషనర్ డామినిక్ యాస్క్విత్ మర్యాదపూర్వకంగా కలిశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బ్రిటిష్ హైకమిషనర్ బృందం బుధవారం వైఎస్సార్ సీపీ నేతలను కలిసినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక పరిస్థితులు, భవిష్యత్‌లో వ్యాపార అవకాశాలు, కొత్త రాజధాని తదితర అంశాలపై బ్రిటిష్ బృందం చర్చించింది. ఆంధ్రప్రదేశ్‌లోని పరిస్థితులను బ్రిటిష్ బృందానికి వివరించినట్టు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. -
'ఏపీ మంత్రుల మధ్యనే పొంతన లేదు'
గుంటూరు: రాజకీయ స్వప్రయోజనాలకు ఏపీ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాకట్టు పెట్టారని వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో ఏపీ మంత్రుల మధ్యనే పొంతన లేదని దుయ్యబట్టారు. గోదావరి పుష్కరాలకు 14 వందల కోట్లు, 30 మంది ప్రాణాలను ఖర్చు పెట్టారని మండిపడ్డారు. మతిస్థిమితం లేని వ్యక్తిలాగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఎద్దేవా చేశారు. -
ఏమిటీ పతనం?
పార్లమెంటు సమావేశాల కాలాన్ని కుదించడం క్రమంగా ఓ దుష్ట సంప్రదాయంగా మారిపోతోంది. 1950వ దశకంలో ఏటా పార్లమెంటు సమావేశాల వ్యవధి 130 రోజులు. ప్రస్తుతం 50 నుండి 55 రోజులకు తగ్గింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 68 సంవత్సరాలు గడిచింది. ఈ సందర్భంలో మన పార్ల మెంటరీ ప్రజాస్వామ్యంలో చోటు చేసుకుంటున్న అవ లక్ష ణాల గురించి మళ్లీ చర్చ మొ దలైంది. అసలు భారత్‌లో ప్రజాస్వామ్యం మనుగడ సా ద్యపడుతుందా? అని ఆదిలో శంకించిన మేధావుల అభిప్రాయాలను పూర్వపక్షం చేస్తూ ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక దేశంగా అవతరించింది. స్వాతంత్య్రం ఇవ్వక తప్పని పరిస్థితులు ఎదురైన ప్పుడు బ్రిటిష్ వారు భారత్‌కు అమెరికా తరహా ప్రజా స్వామ్య పాలన కావాలా, బ్రిటిష తరహా ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం కావాలా? అనే చర్చ లేవనెత్తారు. గాం ధీజీ, నెహ్రూజీ, డా॥బాబూ రాజేంద్రప్ర సాద్ వంటి మహానుభావులు నిర్ద్వంద్వంగా ప్రాతినిధ్య ప్రజాస్వామ్యమే సరైనదనీ, ఆదర్శప్రాయమనీ తేల్చా రు. చట్టసభలు- పార్లమెంట్ అయినా రాష్ట్రాల్లోని శాసనసభలైనా ’టెంపుల్స్ ఆఫ్ డెమోక్రసీ‘గా స్థానం పొందాయి. అంతటి పవ్రితత వాటికి ఉంది. ప్రజల ప్రయోజనాలకు భిన్నంగా ప్రభుత్వాలు చట్టాల రూపక ల్పనకు ఉపక్రమించినప్పుడు ప్రతిపక్షాలు అడ్డుపడి, సవరణలు ప్రతిపాదించి ప్రజలకు మేలు చేసేవి. ప్రజ లు పన్నుల రూపంలో చెల్లించే డబ్బుతోనే చట్టసభలు నడుస్తున్నాయన్న స్పృహ, తమకు జీతభత్యాలు లభిస్తు న్నాయన్న స్పృహ ప్రతి సభ్యునిలో కనిపించేది. అధికా రం ఉన్నంత మాత్రాన పాలకపక్షం ఏకపక్షంగా చట్టసభ ల్ని నడుపుకున్న వైఖరి చాలా ఏళ్ల పాటు కనిపించలేదు. ‘అధికార పక్షం సహనంతో ఎదుటి పక్షాలు చెప్పే విషయాలను వినడానికి సిద్ధంగా ఉన్నప్పుడే ప్రజాస్వా మ్యం పరిఢవిల్లడం సాధ్యమవుతుంది’ అన్నారు మహా త్మాగాంధీ. పార్లమెంటును అధికార పార్టీ శాసించకుం డా ఉండేందుకు స్పీకర్ వ్యవస్థ రాజకీయాలకు అతీ తంగా ఉండాలని లోక్‌సభ తొలి స్పీకర్ జి.వి.మవలాం కర్ ప్రతిపాదించారు. స్పీకర్ పదవికి ఎన్నికయ్యే వ్యక్తి ఏ రాజకీయ పార్టీ తరఫున పోటీ చేయకుండా ఉం డాల న్నారు. అయితే... తొలి ప్రధాని నెహ్రూజీ మవలాంకర్ ప్రతిపాదనలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని... స్పీకర్ తటస్థంగా ఉండే సంప్రదాయాన్ని కొనసాగించడం మంచిదని పేర్కొన్నారు. చాలా ఏళ్లు అలాంటి ఉన్నత సంప్రదాయాలే కొనసాగాయి. ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య సఖ్యత, సౌహార్ద్రం వెల్లివిరిసిన కారణంగానే... భారత పార్లమెంటరీ ప్రజా స్వామిక వ్యవస్థను అనేక దేశాలు అబ్బురంతో చూశా యి. కానీ అన్ని వ్యవస్థలకు ఆదర్శంగా ఉండాల్సిన రాజకీయ వ్యవస్థలో విలువల పతనం శీఘ్రంగా జరగ డంతో పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ వేగంగా దిగ జారుతోంది. ప్రముఖ రాజ్యాంగ నిపుణుడు నానీ పాల్కీవాలా అన్నట్లు మన రాజ్యాంగ వ్యవస్థను తూట్లు పొడిచారు. ఎప్పుడైతే రాజ్యాంగ స్ఫూర్తి రాజకీయ పార్టీల్లో లోపించిందో అప్పట్నుంచి చట్టసభల తీరు మారిపోయింది. పార్లమెంటు సమావేశాల వ్యవధిని నిర్ణయిస్తూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతిని శాసించడంపై మాధవ్ గాడ్బోలే ‘ఇండియా పార్లమెంటరీ డెమోక్రసీ ఆన్ ట్రయిల్’ అనే పుస్తకంలో ‘మన రాజ్యాంగకర్తలు అప్ప ట్లో కేంద్ర ప్రభుత్వాలు ఈ అధికారాన్ని ఇంతగా దుర్వి నియోగం చేస్తాయని ఊహించలేదు’ అని రాశారు. మన పార్లమెంటు సమావేశాల కాలాన్ని కుదించడం క్రమంగా ఓ దుష్ట సంప్రదాయంగా మారిపోతోంది. 1950వ దశకంలో ఏటా పార్లమెంటు సమావేశాల వ్యవధి 130 రోజులు. ప్రస్తుతం 50 నుండి 55 రోజు లకు తగ్గింది. కావాలని సమావేశాలను అడ్డుకోవడం ఎక్కువైంది. ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కొన్ని తీవ్రమైన వాదనలు వినిపిస్తున్నాయి. రాష్ట్రం విడివడింది కనుక శాసనసభ సమావేశ కాలపరిమితిని తగ్గిస్తున్నామని కొందరు మంత్రులు చెప్పుకొస్తున్నారు. రాష్ట్ర భౌగోళిక స్వరూపం మారితే... ప్రజల సమస్యలు తగ్గిపోతాయి? ఎంతో అనుభవజ్ఞులైన అమాత్యులది అమాయకత్వం అనుకోవాలా? అజ్ఞానం అని భావించాలా? ఎప్పుడైతే ఆదర్శంగా ఉండాల్సిన పార్లమెంటు, శాసన సభల్లో ప్రభుత్వాలు పలాయనవాదం చిత్తగిస్తున్నాయో, ఆ బాటలోనే కిందిస్థాయి ప్రజాసంస్థలు ప్రయాణించడం చూస్తున్నాం. ఇక చట్టాలను రూపకల్పన చేసే వారే స్వయంగా చట్టాల్ని ఉల్లంఘించే దృశ్యాలు పార్లమెంటు మొదలు మునిసిపల్ కౌన్సిల్ వరకు సర్వసాధారణం. చర్చలు లేకుండానే బడ్జెట్ పద్దులు గిలెటిన్ కావ డం చాలా సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది. ఇక ‘కాగ్’ లాంటి స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థలు వెల్ల డించే అంశాలపై చర్చించడం అరుదైన విషయంగా మారింది. జనాభా ప్రాతిపదికన మహిళలకు, మైనార్టీ లకు, బడుగు బలహీన వర్గాలకు చట్టసభల్లో ప్రాతి నిధ్యం లేకపోవడం ఒక ప్రధాన లోపం. ఆశ్చర్యం ఏమిటంటే కొందరు మంత్రుల సమర్థ తను వారి పనితీరును అనుసరించే కాక ప్రతిపక్షం నోరు మూయించడంలో చూపే నైపుణ్యాన్ని అనుసరించి లెక్క వేస్తున్నారు. చట్టసభల పనితీరును మెరుగుపర్చడా నికి, సంస్కరణలు ప్రవేశపెట్టడానికి సూచనలు చేస్తూ వచ్చిన ఎన్నో నివేదికలు ప్రభుత్వాల వద్ద మూలుగుతు న్నాయి. ‘లా కమిషన్’ సూచనలు ఉన్నాయి. కానీ ఎవరు అమలు చేస్తారు? ఈ ఏడాది జూలై ఆఖరు నుంచి ఆగస్టు 13 వరకు 17 రోజుల పాటు జరిగిన పార్లమెంటు సమావేశాలలో రాజ్యసభ 48 గంటలు పని చేయవలసి ఉండగా కేవలం 9 శాతం సమయం మేరకే కార్యకలాపాలు జరిగాయి. ఒక్క బిల్లు మాత్రమే ఆమోదం పొందడం (91 శాతం సమయం వృథా) చూస్తే ఏ మేరకు మన పార్లమెంటు పని చేయగలిగిందో అర్ధమవుతోంది. ఇంతకంటే అథ మసూచిక... 2010లో జరిగిన శీతాకాల సమావేశాలలో రెండంటే రెండు (2) శాతం సమయం మాత్రమే సమా వేశాలు జరిగాయి. ప్రఖ్యాత రాజనీతిజ్ఞుడు హూగ్సె గాల్ పార్లమెంట్ వ్యవస్థను గురించి ’'Government come and Government go, but the institution of Parliament is one of those frame works that must endure and must never be taken for granted.' అన్నాడు. దీనికి అంతం ఎప్పుడు? పార్ల మెంటరీ ప్రజాస్వామ్యం ఎప్పుడు పరిఢవిల్లుతుంది? ఈ దేశంలో ఎన్నో విప్లవాత్మక మార్పులను తెచ్చిన వా రు సామాన్యప్రజలే! వారే సంఘటితమై భారత పార్ల మెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను పరిరక్షించుకోవాలి! (వ్యాసకర్త: ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు.. ఎమ్మెల్సీ, కేంద్ర మాజీ మంత్రివర్యులు, మొబైల్: 99890 24579) -
అరాచక ప్రభుత్వం రాజ్యమేలుతోంది
ఉమ్మారెడ్డి అభినందన సభలో మాజీ మంత్రి బొత్స సాక్షి, గుంటూరు: రాష్ట్రంలో అరాచక ప్రభుత్వం రాజ్యమేలుతోందని, చంద్రబాబు దెబ్బకు రాష్ట్రం ఎటువైపు వెళుతుందోనని ఆందోళన కలుగుతోందని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీనేత బొత్స సత్యనారాయణ అన్నారు. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఎమ్మెల్సీగా ఎన్నికైన నేపథ్యంలో గుంటూరులో ఆదివారం నిర్వహించిన అభినందన సభలో ఆయన మాట్లాడారు. చట్టంపైన, ప్రజాస్వామ్యంపైన గౌరవం లేని ప్రభుత్వం రాష్ట్రంలో పాలన సాగిస్తోందని మండిపడ్డారు. ఒంగోలు ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బలం లేకపోయినా కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో అభ్యర్థులను పోటీకి నిలిపి టీడీపీ నీచ రాజకీయాల కు కంకణం కట్టుకుందన్నారు.రైతుల పక్షాన వైఎస్సార్సీపీ 25న అన్ని కలెక్టరేట్ల వద్ద ఆందోళన కార్యక్రమాలు చేపట్టనుందని తెలిపారు. ప్రజల్ని మేనేజ్ చేయలేరు: అంబటి వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికారప్రతినిధి అంబటి రాంబాబు మాట్లాడుతూ చంద్రబాబు కేసీఆర్, కేంద్రం పెద్దల కాళ్లు పట్టుకునో, కేసు నుంచి బయటపడగలరేమోగా నీ ప్రజలను మేనేజ్ చేయడం ఆయన వల్ల కాదన్నారు. పార్టీ నేతలు వాసిరెడ్డి పద్మ, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ లు కూడా మాట్లాడారు. బాబు వల్లే వ్యవసాయం నాశనం: ఉమ్మారెడ్డి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని ధ్వజమెత్తారు. చంద్రబాబు వల్ల రైతులు శాశ్వత రుణగ్రస్తులయ్యారన్నారు. వ్యవసాయ రంగాన్ని సర్వనాశనం చేసిన ఘనుడిగా చంద్రబాబు చరిత్రలో మిగులుతారన్నారు. స్థానికసంస్థల ప్రజాప్రతినిధుల హక్కులను కాపాడుకునేందుకు పెద్దఎత్తున ఉద్యమం రాబోతోందని పేర్కొన్నారు. -
ఉమ్మారెడ్డి చరిత్ర సృష్టించారు..
పట్నంబజారు(గుంటూరు) : జిల్లా చరిత్రలోనే తొలిసారిగా ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికై ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చరిత్ర సృష్టించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ కొనియాడారు. ఉమ్మారెడ్డి సన్మానసభలో ఆయన మాట్లాడుతూ శాసనమండలిలో ప్రజా సమస్యల పరిష్కారానికి పాటు పడతారన్నారు. ఈ నెల 25న జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నా కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరు కావాలని కోరారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఉమ్మారెడ్డి ఎన్నికతో శాసన మండలికే శోభ వచ్చిందన్నారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ టీడీపీ నేతలు గెలవలేమని భయపడే రెండో అభ్యర్థిని నిలపలేదన్నారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే షేక్ మొహమ్మద్ ముస్తఫా మాట్లాడుతూ సుధీర్ఘ రాజకీయ ప్రస్థానంలో మచ్చ లేని వ్యక్తి ఉమ్మారెడ్డి అని కొనియాడారు. గన్నవరం పార్టీ సమన్వయకర్త దుట్టా రామచంద్రరావు మాట్లాడుతూ ఉమ్మారెడ్డి ఎన్నిక పార్టీని మరింత బలోపేతం చేస్తుందని తెలిపారు. గుంటూరు నగరాధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ నగర విభాగం ఆధ్వర్యంలో కూడా ఉమ్మారెడ్డిని ఘనంగా సన్మానిస్తామని తెలిపారు. పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త రావి వెంకటరమణ మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సరైన నిర్ణయం తీసుకుని ఉమ్మారెడ్డి లాంటి అనుభవశాలికి పట్టం కట్టారన్నారు. రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షుడు ఆతూకూరి ఆంజనేయులు మాట్లాడుతూ ఏకగ్రీవ ఎంపికతో టీడీపీ మూటాముల్లె సర్దుకుందని ఎద్దేవా చేశారు.తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ ఉమ్మారెడ్డి కార్యదక్షతను ప్రతి నాయకుడు తెలుసుకోవాలన్నారు. వినుకొండ సమన్వయకర్త బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ టీడీపీ నేతల దురాగతాలను శాసనమండలిలో ఎండగట్టాలని కోరారు. రాష్ట్ర కార్యదర్శి రాతంశెట్టి రామాంజనేయులు (లాలుపురం రాము) మాట్లాడుతూ టీడీపీ నేతలు అధికార జులుం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. సన్మానం సందర్భంగా కొత్తా చిన్నపరెడ్డి బహూకరించిన పూల బాణాన్ని ఉమ్మారెడ్డి ఎక్కుపెట్టారు.