గీతం మూర్తిని పరామర్శిస్తున్న ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఎమ్మెల్సీ, గీతం వర్సిటీ అధినేత ఎంవీవీఎస్ మూర్తి కోలుకుంటున్నారు. అనారోగ్యంతో కలెక్టరేట్ సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. అయితే గీతం కార్పొరేట్ ఆస్పత్రికి అధినేతగా ఉన్న ఆయన.. పెద్దగా పేరు ప్రఖ్యాతులు లేని ఓ చిన్న ఆస్పత్రిలో చికిత్స చేయించుకోవడం చర్చనీయాంశమైంది. గీతం యూనివర్సిటీకి అనుబంధంగా ప్రారంభమైన గీతం ఆస్పత్రిని కార్పొరేట్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు ధీటుగా అభివృద్ధి చేశామని ఎప్పటికప్పుడు ప్రచారం చేస్తుంటారు.
రెండు వేల పడకలు, కీళ్ల మార్పిడి, ప్లాస్టిక్ సర్జరీ, లాప్రోస్కోపిక్ తదితర అన్ని అధునాతన శస్త్ర చికిత్స సౌకర్యాలు, 350 మంది వైద్యుల సేవలు తమ ఆస్పత్రిలో అందుబాటులో ఉంటాయని గీతం నిర్వాహకులు విస్తృత ప్రచారం చేసుకుంటుంటారు. అటువంటి ఆస్పత్రికి అధినేతగా ఉన్న గీతం మూర్తికి అనారోగ్యం చేస్తే ఇప్పటివరకు పెద్దగా ఎవరికీ తెలియనిఓ చిన్న ఆస్పత్రిలో చికిత్స చేయించడమే చర్చకు తెరలేపింది.
ఉమ్మారెడ్డి పరామర్శ : కాగా ఆస్పత్రిలో ఉన్న ఎమ్మెల్సీ మూర్తిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనమండలి ఉపనేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పార్టీ రాష్ట్ర అదనపు కార్యదర్శి పక్కి దివాకర్ తదితరులు బుధవారం పరామర్శించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment