
డాక్టర్ మూర్తి పార్థివ దేహం
సాగర్‌నగర్(విశాఖ తూర్పు): అమెరికాలో దుర్మరణం పాలైన శాసనమండలి సభ్యుడు, గీతం విద్యాసంస్థల అధినేత డాక్టర్ ఎం.వి.వి.ఎస్. మూర్తి భౌతిక కాయాన్ని ఆదివారం ప్రత్యేక విమానంలో విశాఖ తీసుకురానున్నారు. గీతం పూర్వ విద్యార్థుల సమావేశంలో పాల్గొనడానికి అమెరికా వెళ్లిన మూర్తి రోడ్డు ప్రమాదంలో చిక్కుకొని బుధవారం మరణించిన విషయం తెలిసిందే.
7వ తేదీ ఉదయం విశాఖ చేరుకోనున్న మూర్తి పార్థివ దేహాన్ని తొలుత విమానాశ్రయం నుంచి సిరిపురం వద్ద గల ఆయన స్వగృహానికి తీసుకువస్తారు. అనంతరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అభిమానుల కడసారి చూపునకు కొద్ది సమయం ఉంచుతారు. అక్కడ అందరూ నివాళులు అర్పించిన అనంతరం రుషికొండలోని గీతం విశ్వవిద్యాలయం వరకు అంతిమ యాత్ర నిర్వహించి.. అక్కడ అంతక్రియలు చేయాలని నిర్ణయించినట్టు మూర్తి బంధువులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment