MVVS Murthy
-
కబ్జాల నుంచి.. విశాఖకు విముక్తి
ఈ ఫొటోల్లో కనిపిస్తున్న ఆక్రమణల తొలగింపు కార్యక్రమం 2020, అక్టోబర్ 24 నాటిది. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తి రుషికొండ ప్రాంతంలో 42.51 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జాచేశారు. గీతం యూనివర్సిటీకి సమీపంలో ఉన్న ఈ స్థలాన్ని ఆక్రమించుకుని ఇందులోని రెండెకరాల్లో కళాశాల భవన నిర్మాణాలు చేపట్టారు. మిగిలిన స్థలానికి కాంపౌండ్ వాల్ నిర్మించారు. సుమారు రూ.500 కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిని దశాబ్దాల పాటు కబ్జా చేసినప్పటికీ.. తెలుగుదేశం నేత కావడంతో ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గీతం యూనివర్సిటీ ప్రహరీ గోడను తొలగించి కబ్జాలో ఉన్న 42.51 ఎకరాలను స్వాధీనం చేసుకుంది. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖ అంటే అందమైన నగరం.. మరో పేరు చెప్పమంటే ప్రశాంత తీరం.. అటువంటి మహానగరంలో అవకాశమున్న ప్రతీచోటా రూ.వేల కోట్లు విలువచేసే ప్రభుత్వ భూములను కబ్జాకోరులు చెరపట్టేశారు. వీరిలో అత్యధికులు తెలుగుదేశం పార్టీకి చెందిన వారే. ఇప్పుడు వీరి ఆగడాలకు రాష్ట్ర ప్రభుత్వం కళ్లెంవేస్తూ వారి భరతం పడుతోంది. ఆక్రమణలకు గురైన భూములను విడిపిస్తూ విశాఖ నగరానికి విముక్తి కల్పిస్తోంది. ఇలా ఇప్పటివరకు రూ.5,080 కోట్ల విలువైన సర్కారు భూములను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఏళ్లుగా కబ్జాల్లో ఉండి.. ప్రభుత్వ కార్యాలయాల్లో మూలనపడిన భూ రికార్డుల దుమ్ముదులిపి ఈ భూముల లెక్కతేలుస్తున్నారు. బినామీ పేర్లతో టీడీపీ నేతల భూదాహం గతంలో అధికారంలో ఉన్న టీడీపీ నేతలు బినామీ పేర్లతో విశాఖ జిల్లా భూములపై తెగబడ్డారు. ఆర్థిక రాజధానిగా వెలుగొందుతున్న విశాఖ, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా రూ.వేల కోట్లు ఖరీదుచేసే భూములను చెరపట్టేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే.. టీడీపీ పెంచి పోషించిన భూబకాసురుల ఆక్రమణలపై ప్రభుత్వాధికారులు ఉక్కుపాదం మోపారు. భూ రాబందుల నుంచి రూ.2,600 కోట్లకు పైగా విలువైన 430.81 ఎకరాల భూములను వారి చెర నుంచి విడిపించారు. వీటి మార్కెట్ విలువ ఏకంగా రూ.5 వేల కోట్లకు పైమాటే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ప్రత్యేక దర్యాప్తు బృందాలతో.. నిజానికి.. విశాఖ నగరంతో పాటు చుట్టుపక్కల మండలాల్లో ఆక్రమణలకు గురైన కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూముల సంరక్షణ కోసం జిల్లా రెవెన్యూ అధికారులు మూడేళ్లుగా చర్యలకు ఉపక్రమిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటుచేసి.. రికార్డుల ఆధారంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు చేపడుతున్నారు. మొత్తం 270 ప్రాంతాల్లో ఆక్రమణలకు గురైన 430.81 ఎకరాల భూములను స్వాధీనం చేసుకున్నారు. వీటి ప్రభుత్వ విలువ రూ.2,638 కోట్లు కాగా.. మార్కెట్ విలువ రూ.5 వేల కోట్లకు పైగా ఉంటుందని అంచనా. పదేపదే ప్రభుత్వ భూముల ఆక్రమణలకు పాల్పడిన వారిపైనా క్రిమినల్ కేసులు సైతం నమోదు చేస్తున్నారు. పీఠాలు కదులుతున్నాయ్.. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ వేల కోట్లు రూపాయల విలువ చేసే భూములను దోచుకున్న టీడీపీ నేతల భూభాగోతం బట్టబయలైంది. జిల్లా అధికారులు స్వాధీనం చేసుకున్న భూముల్లో సింహభాగం టీడీపీ కబ్జాకోరుల కబంధ హస్తాల్లోనివే కావడం గమనార్హం. గయాలు, పోరంబోకు, గోర్జి, కొండ పోరంబోకు, వాగులు, కాలువలు, గెడ్డలు, రాస్తాలు, గుట్టలు, ఇనాం, జిరాయితీ, గ్రామకంఠాలు, చెరువులు.. ఇలా కాదేదీ కబ్జాకు అనర్హం అన్నట్లుగా అందినకాడికి తమ గుప్పిట బంధించేశారు. ఇప్పుడు వీరి పీఠాలు కదులుతున్నాయి. 430 ఎకరాలకుపైగా స్వాధీనం జిల్లాలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను రక్షించే చర్యలను చేపడుతున్నాం. గత మూడేళ్లల్లో జిల్లావ్యాప్తంగా 430 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని రక్షించాం. వీని బేసిక్ విలువ రూ.2,638 కోట్లకు పైగా ఉందని తేలింది. మార్కెట్ ధరలతో లెక్కిస్తే రూ.5 వేల కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. ప్రభుత్వ ఆదేశాల మేరకు సర్కారు భూములను రక్షించేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నాం. – వేణుగోపాల్ రెడ్డి, జేసీ, విశాఖపట్నం జిల్లా -
తాత తప్పులే.. చురకత్తులై..!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఎంవీవీఎస్ మూర్తి.. మొదట్లో గోల్డ్‌స్పాట్ మూర్తిగా విశాఖకు పరిచయమైన ఈయన గీతం ప్రైవేటు కళాశాలను పెట్టి.. ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని తూట్లు పొడిచి.. గీతంను డీమ్డ్ వర్శిటీగా విస్తరించి.. చివరికి దేశంలోనే ప్రతిష్టాత్మక ఏయూను దెయ్యాల కొంపగా అభివర్ణించిన పెద్ద మనిషి.. సరే పోయినోళ్లందరూ మంచోళ్లే కాబట్టే.. ఆయన ప్రస్తావన వదిలేద్దామనుకున్నా.. ఆయన చేసిన తప్పులు, అక్రమాలు మాత్రం ఆయన మనుమడు, టీడీపీ ఎంపీ అభ్యర్ధి, బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీ భరత్‌ను వీడటం లేదు. రెండుసార్లు విశాఖ ఎంపీగా పని చేసిన మూర్తి, ఆ పదేళ్ల కాలంలో కేవలం సొంత గీతం కళాశాలకు, రక్తసంబంధీకులైన బంధుగణానికి తప్పించి విశాఖ నగరానికి ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు తెచ్చాను.. అని చెప్పుకొనే స్థాయిలో ఒక్క పనికూడా చేయలేదంటే నమ్మశక్యం కాకున్నా.. పచ్చి నిజం. పైగా తెలుగుదేశం పాలనలో గీతం సంస్థ పేరిట చేసిన భూ ఆక్రమణలు, ఆ వివాదాలు ఇప్పటికీ కోర్టుల్లో నలుగుతున్నాయి. జిల్లాలో కలెక్టర్లుగా పనిచేసిన ఎందరో ఐఏఎస్ అధికారులు.. గీతం ఫైళ్లు.. అనగానే అమ్మో... మేం సంతకం పెట్టలేమంటూ ఇక్కడి నుంచి బదిలీ చేయించుకుని వెళ్ళిపోయారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ఈ ఐదేళ్ల కాలంలోనే ఇక్కడ పనిచేసిన ఓ ఐఏఎస్ అధికారి గీతం ఆక్రమణల క్రమబద్ధీకరణకు సిఫార్సు చేయలేనని తెగేసి చెప్పి.. ఇక్కడి నుంచి కేంద్ర సర్వీసుకు బదిలీ చేయించుకుని వెళ్లిన విషయం ఐఏఎస్ వర్గాలకే కాదు.. అధికారవర్గాలందరికీ తెలిసిన సత్యం. ఇప్పటికీ గీతం ఆక్రమణలోప్రభుత్వ భూములువాటి విలువరూ.500 కోట్లకుపైమాటే ‘ఎల్కేజీ నుంచి పీజీ వరకు కోర్సులున్న శ్రీలంక యూనివర్సిటీ 25 ఎకరాల్లోనే ఉంది. కానీ విశాఖలోని గీతం(గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్) యూనివర్సిటీకి వందల ఎకరాలు కావాలా? అని రాష్ట్ర ఆర్ అండ్ బీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఒక సందర్భంలో చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర దుమారం రేపాయి. దేశంలోనే అత్యంత ఖరీదైన విద్యాసంస్థల్లో ఒకటైన గీతం యూనివర్సిటీకి నిజంగానే ఘన చరిత్ర ఉంది. తొలుత పాతిక ఎకరాల్లో ఏర్పాటైన ఈ విద్యాసంస్థ క్రమక్రమంగా ప్రభుత్వ భూములను కబ్జా చేసుకుంటూ 110 ఎకరాల విస్తీర్ణంలో డీమ్డ్ వర్సిటీ స్థాయికి చేరింది. ప్రభుత్వ భూములు కబ్జా చేయడం.. ఆనక ఎలియనేషన్ చేయించుకుని వాటిని సొంతం చేసుకోవడం అప్పట్లో గీతం మూర్తికే చెల్లింది. నేటికీ ఈ సంస్థ అధీనంలో ఉన్న ప్రభుత్వ భూముల వ్యవహారంపై కోర్టుల్లో వివాదం నడుస్తోంది. సంస్థ అధీనంలో ఉన్న 35 ఎకరాల భూములను లీగల్‌గా కైవసం చేసుకునేందుకు అప్పటి కలెక్టర్ ఆరోఖ్యరాజ్ ద్వారా 2012 మే 28న ఎలియనేషన్ ప్రతిపాదనలు పంపించారు. అయితే ఈ ప్రతిపాదనను రెండేళ్ల పాటు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగులో పెట్టింది. అప్పట్లో సీసీఎల్ఎ కార్యదర్శిగా ఉన్న ఐవైఆర్ కృష్ణారావు ఈ ప్రతిపాదనను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. ఎండాడ, రుషికొండ గ్రామాల పరిధిలో ఉన్న ఈ భూములను వివిధ అవసరాల నిమిత్తం ఆరు ప్రభుత్వ శాఖలకు కేటాయిస్తూ 2014 ఫిబ్రవరి 26న ఐవైఆర్ కృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. దళిత విద్యార్థుల కళాశాల, పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ నిర్మాణం, బలహీనవర్గాల గృహనిర్మాణం, అధికారులకు క్వార్టర్లు, ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ ప్రాంతీయ కేంద్రం.. ఇలా వివిధ ప్రభుత్వ అవసరాలకు ఈ భూములు కేటాయించారు. అయినా గీతం మూర్తి వాటిని వదల్లేదు. అప్పటికే తమ అధీనంలో ఉన్న మరో 7.52 ఎకరాలను కూడా కలిపి మొత్తం భూములను తమ సంస్థకు కేటాయించాలని, ఈ మేరకు సిఫార్సు చేయాలని 2016లో జిల్లా కలెక్టర్ యువరాజ్‌పై ఒత్తిడి తెచ్చారు. యువరాజ్ బదిలీ అయిన తర్వాత గత కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ ద్వారా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈ ప్రతిపాదనలు రావడమే తరువాయి.. వివిధ శాఖలకు కేటాయిస్తూ గత సీఎస్ తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేసి మరీ ఆ భూములను గీతం కట్టబెట్టేందుకు వీలుగా రాష్ట్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఇక్కడ గజం రూ.25వేల నుంచి రూ.30వేల వరకు పలుకుతుంది. ఈ లెక్కన ఎలియనేషన్ ప్రతిపాదనలు పంపిన 42.52 ఎకరాల భూముల విలువ అక్షరాల రూ.514 కోట్ల పైమాటే. కేబినెట్ ఆదేశాలు, కోర్టు ఉత్తర్వులు ఎలా ఉన్నప్పటికీ ఈ భూములు ఇప్పటికీ గీతం ఆధీనంలోనే ఉండటం గమనార్హం. రాజకీయంగానూ.. రాజకీయంగా కూడా తెలుగుదేశం పార్టీలో గీతం మూర్తి వల్ల లాభపడిన, ప్రయోజనం పొందిన నేతలు కాదు కదా.. కనీసం కార్యకర్తలు కూడా లేరు. కేవలం అధినేత చంద్రబాబునాయుడుకు అత్యంత సన్నిహితుడు, ఆ తర్వాత బంధువు, ఉత్తరాంధ్రలో టీడీపీ మాదే అని భావించే ఓ సామాజిక ‘వర్గ’ పెద్దగా ఓ వెలుగు వెలిగిన గీతం మూర్తి చేసిన సంస్థాగత తప్పులు ఇప్పుడు ఆయన మనుమడిని వెంటాడుతున్నాయనే చెప్పాలి. పార్టీ నాయకులకు కూడా మినహాయింపులేకుండా వారి పిల్లల సీట్లకు ముక్కుపిండి డబ్బులు వసూలు చేసిన ఘనత ఆయనదే. ఆయన వల్ల నష్టపోయిన నేతలు ఇప్పుడు తెరవెనుక పావులు కదుపుతున్నారు. అవన్నీ భరత్‌కు మైనస్‌గా మారుతున్నాయి. కొసమెరుపు ఈ తప్పులు, వ్యవహారాలు, దందాలేవీ భరత్‌కు తెలియకపోవచ్చు. వాటితో తనకు సంబంధం లేదని ఆయన చెప్పుకోవచ్చు కూడా.. కానీ తాత వ్యాపార సామ్రాజ్యాన్ని, రాజకీయాన్ని వారసత్వం పొందిన మనవడు భరత్.. తాతా చేసిన తప్పులనుంచి మాత్రం ఎలా తప్పించుకోగలుగుతారు. ఆస్తులతోపాటు అపఖ్యాతిలోనూ వాటా తీసుకోవాల్సిందే.. ఏమంటారు? -
బాలయ్య చిన్నల్లుడికి బాబు ఝలక్!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: బాలయ్య చిన్నల్లుడికి చంద్రబాబు ఝలక్ ఇచ్చాడు. బాలకృష్ణ పెద్దల్లుడు, సీఎం చంద్రబాబు కుమారుడు నారా లోకేష్‌కు మంగళగిరి టికెట్ కేటాయించినా చిన్నల్లుడు శ్రీ భరత్ మాత్రం తన టికెట్ తెచ్చుకోలేకపోయాడు. ఆయన ఆశిస్తున్న విశాఖ లోక్‌సభ టికెట్ ఇవ్వలేమని చంద్రబాబు శనివారం తేల్చి చెప్పడంతో భరత్ అమరావతి నుంచి విశాఖకు తిరుగుముఖం పట్టారు. దీంతో ఆయన అభిమానులు విశాఖలో ఆందోళన చేపట్టారు. చివరి నిమిషం వరకు టికెట్ కోసం ప్రయత్నిస్తామని, రాని పక్షంలో ఏం చేయాలో ఆలోచిస్తామమని అంటున్నారు. విశాఖ లోక్‌సభ సీటుకు గాజువాక సిట్టింగ్ ఎమ్మెల్యే పల్లా శ్రీను పేరును తెరపైకి తెచ్చి భరత్‌కు మొండిచేయి చూపించారు. మామ బాలకృష్ణ సహా కుటుంబ సభ్యులతో ఒత్తిడి చేయించినా... చివరాఖరుకు లోకేష్ మంత్రాంగమే ఫలించి తనను పక్కనపెట్టేశారని భరత్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భరత్ మాత్రం టికెట్‌పై ఇంకా ఆశలతోనే ఉన్నట్లున్నారు. ‘ఏమో, ఇంకా నాకే రావొచ్చని అనుకుంటున్నా’నని వ్యాఖ్యానించారు. ఐదేళ్లలో నాలుగు పార్టీలు.. పశ్చిమగోదావరి జిల్లా రాజకీయాల్లో కొత్తపల్లి సుబ్బారాయుడు సీనియర్ నేత. 2009 –2014 మధ్యకాలంలో ఆయన నాలుగు పార్టీలు మారారు. 2009 వరకూ తెదేపాలో ఉన్న కొత్తపల్లి మంత్రిగాను, ఎంపీగాను, కొన్నాళ్లు టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. ప్రజారాజ్యం ఏర్పాటుతో 2009లో ఆ పార్టీ తరఫున నర్సాపురం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ సమయంలో పీఆర్పీ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం పీఆర్పీని కాంగ్రెస్‌లో విలీనం చేయడంతో 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం డీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 2014లో వైఎస్సార్సీపీలో చేరారు. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో నర్సాపురం నుంచి వైఎస్సార్సీపీ తరఫున పోటీచేసి ఓటమి చెందారు. టీడీపీ, కాంగ్రెస్, పీఆర్పీ పార్టీల జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన ఘనత ఆయనదే. ఎంపీ, ఎమ్మెల్యేగా భార్యాభర్తలు టి. అంజయ్య టి. మణెమ్మ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా పనిచేసిన టి.అంజయ్య, ఆయన సతీమణి మణెమ్మలు ఎమ్మెల్యే, ఎంపీలుగా పనిచేసిన ఘనత దక్కించుకున్నారు. టి.అంజయ్య 1962, 67, 72లో ముషీరాబాద్ నుంచి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందగా, 1978లో అదే స్థానం నుంచి జనతా పార్టీ అభ్యర్థి నాయిని నర్సింహరెడ్డి చేతిలో ఓడిపోయారు. 1984లో సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుంచి గెలిచి కేంద్రంలో కార్మిక శాఖ మంత్రి అయ్యారు. ఎంపీగా పనిచేస్తుండగా ఆయన చనిపోవడంతో 1987లో సికింద్రాబాద్ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. అప్పుడు మణెమ్మ పోటీచేసి గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి బండారు దత్తాత్రేయపై ఆమె విజయం సాధించారు. 2008లో జరిగిన ముషిరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి నాయిని నర్సింహరెడ్డిపై గెలిచారు. తన భర్తను ఓడించిన నాయినిని ఆమె ఓడించడం విశేషం. చిరంజీవికి 754 ఓట్లు 2009 అసెంబ్లీ ఎన్నికల్లో తిరుపతి స్థానంలో చిరంజీవికి 754 ఓట్లు వచ్చాయి. అదేంటి అక్కడి నుంచి ఆయన గెలుపొందితే అంత తక్కువ ఓట్లు రావడమేంటని అంటారా.. అయితే ఆయన పీఆర్పీ అధినేత చిరంజీవి కాదు. ఆ ఎన్నికల్లో చిరంజీవి పేరును పోలిన టి.చిరంజీవి అనే వ్యక్తిని కాంగ్రెస్ బరిలోకి దింపింది. అతనికి 754 ఓట్లు వచ్చాయి. పీఆర్పీ కూడా కాంగ్రెస్ అభ్యర్థి పి.కరుణాకర రెడ్డికి పేరున్న వ్యక్తిని పోటీలో నిలబెట్టగా ఆయనకు 197 ఓట్లు పోలయ్యాయి. ఓటర్లను తికమకపెట్టేందుకు ఇరు పార్టీలు అదే పేరున్న వ్యక్తుల్ని బరిలో దింపడంతో వారికి కూడా ఓట్లు పడ్డాయి. -
విద్యాప్రదాతకు అశ్రు నివాళి
ఆరిలోవ/బీచ్‌రోడ్డు(విశాఖ తూర్పు)/గోపాల పట్నం(విశాఖ పశ్చిమ): గీతం వర్సిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తికి అభిమానులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, అధ్యాపకులు కన్నీటి నివాళి అర్పించారు. ఆయన నివాసం, టీడీపీ కార్యాలయం, గీతం వర్సిటీలో మూర్తి భౌతిక కాయానికి శ్రద్ధాంజలి ఘటించారు. తమ గురువు కడసారి చూపుల కోసం శిష్యులు తరలివచ్చారు. కాగా.. మూర్తి అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో ఆదివా రం జరిగాయి. గీతం విద్యా సంస్థల వెనుక భాగంలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఆయ న పెద్ద కుమారుడు రామారావు శాస్త్రోక్తంగా మూర్తి చితికి నిప్పంటించి దహన సంస్కారాలు పూర్తి చేశారు. అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మూర్తి దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. ఆదివారం ఉదయం 7.30 గంటల సమయంలో విశాఖ విమానాశ్రయానికి ఆయన భౌతిక కాయాన్ని తీసుకువచ్చారు. మంత్రి గంటా శ్రీనివాసరావు, పలువురు ఎమ్మెల్యేలు అక్కడ∙మూర్తి మృతదేహానికి శ్రద్ధాంజలి ఘటించారు. అక్కడ నుంచి ఊరేగింపుగా సిరిపురంలోని వాల్తేరు అప్‌ల్యాండ్‌లోని ఆయన నివాసానికి మృతదేహాన్ని తీసుకొచ్చారు. ప్రజలు, కుటుంబ సభ్యులు సందర్శనార్థం మధ్యాహ్నం 2 గంటల వరకు అక్కడే ఉంచారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సీఎం చంద్రబాబు నాయుడు, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తదితరులు నివాళులర్పించారు. అనంతరం మూర్తి మృతదేహాన్ని పార్టీ కార్యాలయానికి తరలించి కాసేపు అక్కడ ఉంచారు. పలువురు పార్టీ నాయకులు అంజలి ఘటించారు. అక్కడ నుంచి గీతం విద్యా సంస్థల వరకు అంతిమయాత్ర కొనసాగింది. వర్సిటీ ప్రధాన ద్వారం నుంచి లోపలకు తీసుకెళ్లి వెనుక ద్వారం నుంచి అంత్యక్రియలు నిర్వహించే స్థలానికి తరలించారు. విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది నివాళులర్పించారు. అంతిమయాత్రలో ముఖ్యమంత్రి చంద్రబాబు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళావెంకటరావు, ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, మంత్రులు సీహెచ్ అయ్యన్న పాత్రుడు, నారా లోకేష్, ఎంపీలు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, కె.హరిబాబు, మాజీ మంత్రి కావూరి సాంబశివరావు, కంభంపాటి రామ్మోహనరావు, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి, ఎమ్మెల్సీ మాధవ్, ఎమ్మెల్యేలు బాలకృష్ణ, వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబు, బండారు సత్యనారాయణమూర్తి, విష్ణుకుమార్‌రాజు, పంచకర్ల రమేష్‌బాబు, మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో పోలీసులు గౌరవ సూచికంగా గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపాక మూర్తి పెద్ద కుమారుడు రామారావు తండ్రి చితికి నిప్పంటించారు. చిన్న కుమారుడు లక్ష్మణరావు, కుమార్తె భారతి, కుటుంబసభ్యులు నివాళులర్పించారు. కలెక్టర్ ప్రవీణ్ కుమార్, రెవెన్యూ, పోలీస్ అధికారులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. రాష్ట్ర మంత్రులు పత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామాహేశ్వరరావు, కింజరపు అచ్చెన్నాయుడు, నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి, మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురందరేశ్వరి, ఆమె భర్త వెంకటేశ్వరావు, బాలకృష్ణ సతీమణి వసుంధర, నిర్మాత దగ్గుపాటి సురేష్, సినీ నటుడు తొట్టెంపూడి వేణు, ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు, ఎమ్మెల్యేలు అనిత, వాసుపల్లి గణేష్‌కుమార్, పీలా గోవింద్, మాజీ మంత్రులు దాడి వీరభద్రరావు, కొండ్రు మురళీ, వైఎస్సార్సీపీ నాయకులు ఎంవీవీ సత్యనారాయణ, వంశీకష్ణ శ్రీనివాస్, కరణం ధర్మశ్రీ, నాగిరెడ్డి, కొయ్య ప్రసాద్‌రెడ్డి, జేసీ సృజన, పోర్టు ట్రస్ట్ చైర్మన్ కృష్ణబాబు, వుడా వీసీ బసంత్ కుమార్, ఏయూ వీసీ నాగేశ్వరరావు, సెంచూరియన్ వీసీ జీఎస్ఎన్ రాజు, వీజేఎఫ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు, ఈపీడీసీఎల్ సీఎండీ దొర, నందమూరి రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సీహెచ్ నర్సింగరావు, ఎంఎస్ రామయ్య కన్స్ట్రక్షన్స్ ఎండీ మొగ్గా సీతారామయ్య, సీనియర్ నేత లాలంభాస్కరరావు, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు హర్షవర్ధన్కుమార్, పీసీసీ కార్యదర్శి సోడదాసు సుధాకర్ తదితరులు మూర్తికి నివాళులర్పించిన వారిలో ఉన్నారు. మూర్తితో పాటు మరణించిన వీవీఎస్ చౌదరి మృతదేహాన్ని ఆయన స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా జొన్నాడకు పంపించారు. -
గీతం మూర్తికి డల్లాస్‌లో ఘననివాళి
డల్లాస్ (టెక్సాస్) : ‘గీతం విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థుల సంఘం’ (గానం) ఆధ్వర్యంలో డల్లాస్‌లో జరిగిన సంతాప సభలో ఇటీవల అమెరికాలో మరణించిన గీతం విశ్వవిద్యాలయ వ్యవస్థాపకులు, ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు డాక్టర్ ఎం.వి.వి.ఎస్ మూర్తి, గీతం పాలక మండలి సభ్యులు వెలువోలు బసవపున్నయ్య, గీతం హైదరాబాద్ క్యాంపస్‌లో అధికారిగా పని చేస్తున్న వి. పి. ఆర్ చౌదరి (చిన్నా), గీతం విశ్వవిద్యాలయ పూర్వ ఆచార్యులు వీరమాచినేని శివ ప్రసాద్‌లకు ప్రవాసాంధ్రులు ఘన నివాళులర్పించారు. గీతం విశ్వవిద్యాలయంలో చదువుకొని ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ అర్లింగ్టన్లో పని చేస్తున్న ప్రొఫెసర్ ఆనంద్ పుప్పాల తన విద్యార్థి జీవితాన్ని నెమరవేసుకుంటూ గీతం తన భవిష్యత్తుకి చక్కని మార్గాన్ని చూపిందని, తాను ఇప్పుడు అనేక మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చి దిద్దే అవకాశం కల్పించిందని, ప్రత్యేకంగా తనకు ఎం.వి.వి.ఎస్ మూర్తితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. గీతం విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్ధులు ప్రసాద్ రెడ్డి గుజ్జు, చినసత్యం వీర్నపు మాట్లాడుతూ గీతం వల్లే ఈ రోజు తమలాంటి వేలాది మంది ప్రపంచ వ్యాప్తంగా వివిధ రంగాల్లో స్థిరపడ్డారని, చదువు చెప్పిన గీతం విశ్వవిద్యాలయానికి, దాన్ని స్థాపించిన డాక్టర్. ఎం.వి.వి.ఎస్ మూర్తికి జీవితాంతం ఋణపడి ఉంటామని పేర్కొన్నారు. 25 సంవత్సరాలకు పైగా తాను చేస్తున్న నిస్వార్ధ సేవకు గుర్తింపుగా గీతం విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ అందుకున్న తొలి ప్రవాస భారతీయుడు డాక్టర్. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ ఎం.వి.వి.ఎస్ మూర్తి పారిశ్రామిక వేత్తగా, రాజకీయ నాయకుడిగా ఉన్నత శిఖరాలను అధిరోహిoచినప్పటికీ విద్యావేత్త గానే ఆయన ఎక్కువగా గుర్తింపు పొందడం, విద్య పై ఆయనకున్న మమకారాన్ని తెలియజేస్తుందన్నారు. అకుంఠిత దీక్ష, కఠోర శ్రమతో గీతం విశ్వవిద్యాలయాన్ని భారతదేశంలోనే ఒక ఉన్నత ప్రమాణాలు కలిగిన విద్యావ్యవస్థగా మూర్తి తీర్చిదిద్దిన తీరు ఆదర్శప్రాయమన్నారు. ప్రతి సంవత్సరం ఇరవై రెండు వేల మంది విద్యార్థులు విశాఖపట్నం, హైదరాబాద్, బెంగళూరు క్యాంపస్‌లలో విద్యాభ్యాసం చేయడం గొప్ప విషయం అన్నారు. అంతే గాక ప్రతి సంవత్సరం అనేక వందల మంది విద్యార్థులు గీతం విశ్వవిద్యాలయం నుండి దేశ, విదేశాలల్లో కార్పొరేట్ రంగంలో అత్యధిక వేతనాలతో ఉద్యోగాలు సంపాదిస్తున్నారని పేర్కొన్నారు. ఒక గొప్ప మానవతావాదిని, దార్శనికుడిని కోల్పోవడం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ తీరని లోటు అని తోటకూర ప్రసాద్ తెలిపారు. అలస్కా రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వారి ఆత్మలకు శాంతి కలగాలని, అదే ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కడియాల వెంకటరత్నం (గాంధీ) త్వరలో కోలుకోవాలని ఆశించారు. ఇంకా ఈ సంతాప సభలో డాక్టర్. ఉరిమిండి నరసింహా రెడ్డి, జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, శేషారావు బొడ్డు, విజయమోహన్ కాకర్ల మొదలైన వారు తమ ప్రసంగాల్లో మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. -
రేపు విశాఖ చేరనున్న మూర్తి భౌతిక కాయం
సాగర్‌నగర్(విశాఖ తూర్పు): అమెరికాలో దుర్మరణం పాలైన శాసనమండలి సభ్యుడు, గీతం విద్యాసంస్థల అధినేత డాక్టర్ ఎం.వి.వి.ఎస్. మూర్తి భౌతిక కాయాన్ని ఆదివారం ప్రత్యేక విమానంలో విశాఖ తీసుకురానున్నారు. గీతం పూర్వ విద్యార్థుల సమావేశంలో పాల్గొనడానికి అమెరికా వెళ్లిన మూర్తి రోడ్డు ప్రమాదంలో చిక్కుకొని బుధవారం మరణించిన విషయం తెలిసిందే. 7వ తేదీ ఉదయం విశాఖ చేరుకోనున్న మూర్తి పార్థివ దేహాన్ని తొలుత విమానాశ్రయం నుంచి సిరిపురం వద్ద గల ఆయన స్వగృహానికి తీసుకువస్తారు. అనంతరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అభిమానుల కడసారి చూపునకు కొద్ది సమయం ఉంచుతారు. అక్కడ అందరూ నివాళులు అర్పించిన అనంతరం రుషికొండలోని గీతం విశ్వవిద్యాలయం వరకు అంతిమ యాత్ర నిర్వహించి.. అక్కడ అంతక్రియలు చేయాలని నిర్ణయించినట్టు మూర్తి బంధువులు తెలిపారు. -
విశోక గీతం
విద్యార్థిగా ఇక్కడే చదువుకున్నారు.. న్యాయవాదిగా హైకోర్టుకు వెళ్లినా.. కొన్నాళ్లకే తిరిగొచ్చారు. స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా అయినా.. విశాఖనే సొంతూరుగా మార్చుకున్నారు.. తన భవిష్యత్తుకు పునాదులు వేసుకున్నారు. వ్యాపార రంగంపై మక్కువతో అక్కడ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. గోల్డ్‌స్పాట్ శీతలపానీయాల డిస్ట్రిబ్యూటర్‌గా ఆ రంగంలో అడుగుపెట్టి గోల్డ్‌స్పాట్ మూర్తిగా విశాఖ ప్రజలకు చిరపరిచితుడిగా మారిన ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి అమెరికాలోని అలస్కా ప్రాంతంలో దుర్మరణం పాలవ్వడం విశాఖను విషాదంలో నింపింది. 80లలో గీతం కళాశాల స్థాపించి దాన్ని డీమ్డ్ యూనివర్సిటీ స్థాయికి తీసుకెళ్లిన ఆయన దానికి అనుబంధం గీతం వైద్య, దంత వైద్య కళాశాలలను కూడా స్థాపించి విద్యాసంస్థల అధినేతగా.. గీతం మూర్తిగా సుప్రసిద్ధులయ్యారు. 1984లో రాజకీయాల్లో ప్రవేశించి రెండుసార్లు విశాఖ ఎంపీగా ఎన్నిక కావడంతోపాటు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. విశాఖ నగరంతోపాటు ఎదుగుతూ తన సంస్థల ద్వారా కొన్నివేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించిన మూర్తిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించిందని.. ఆయన ఇక లేరని తెలుసుకొని వేలా ది మంది ఆయన సిబ్బంది, ఆప్తులు, సన్నిహితులు కన్నీటిపర్యంతమయ్యారు. ఆయన మృతికి సంతాప సూచకంగా గీతం విద్యాసంస్థలను మూసివేసి నివాళులర్పించారు. సాగర్‌నగర్(విశాఖతూర్పు): ఎమ్మెల్సీ ఎంవీ వీఎస్ మూర్తి విశాఖ వాసులకు గీతం మూర్తిగా సుపరిచితులు. ఈనెల 6న కాలిఫోర్ని యాలో గీతం విద్యాసంస్థల పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొనేందుకు వెళ్లిన మూర్తి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పొందారు. తాను అభిమానించే గాంధీ జయంతి రోజే అనంత లోకా లకు వెళ్లడం యాదృశ్చికంగా జరిగినా విశేషమని సన్నిహితులు అభిప్రాయపడుతున్నారు. మూర్తి ప్రస్థానం ఇలా.. మూర్తి 1938లో తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి మండలం ఎస్.మూలపాలెంలో మతుకుమిల్లి పట్టాభిరామయ్య, మాణిక్యాంబ దంపతులకు జన్మించారు. ఆయనకు సోదరి వీరరాఘవమ్మ. భార్య సావిత్రిదేవి, వీరికి కుమారులు రామారావు, లక్ష్మణరావు, కుమార్తె భారతి ఉన్నారు. వీరు ప్రారిశ్రామిక రంగంలో పనిచేస్తున్నారు. సావిత్రిదేవి 2009లో కాలం చేశారు. మూర్తి మనవుడు భరత్‌కు సినీనటుడు బాలకృష్ణ చిన కుమార్తె తేజస్వితో వివాహం చేశారు. మూర్తికి దివంగత లోకసభ స్పీకర్ బాలయోగి, మాజీ ముఖ్య మంత్రులు ఎన్టీఆర్, నాదేండ్ల భాస్కరరావు, ప్రస్తుత ముఖ్య మంత్రి చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. విద్యాభ్యాసం సాగిందిలా.. అయినవిల్లి మండలం ఎస్.మూలపాలెంలో మూడో తరగతి వరకు మూర్తి చదివారు. కపిలేశ్వరపురంలో ఎస్ఎస్ఎల్సీ, కాకినాడ పీఆర్ కళాశాలలో ఇంటర్, డిగ్రీ పూర్తి చేశారు. ఆంధ్రా యూనివర్సిటీలో లా చదివారు.డిగ్రీలో ఏయూ నుంచి బంగారు పతకం సాధించారు. ఆర్ధికశాస్త్రంలో పీహెచ్డీ డిగ్రీ పొందారు. మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు, అల్లాడి భాస్కరరావు, నల్లా సత్యనారాయణ, పిల్లా సూర్యనారాయణలతో కలిసి లా ప్రాక్టీస్ చేశారు. 1965లో లక్ష్మీ ఎంటర్ప్రైజెస్ పేరిట వ్యాపారం ప్రారంభించి జిల్లాలోని కాకినాడ, మండపేట, రాజమండ్రి తదితర ప్రాంతాల్లో వ్యాపారాన్ని విస్తరించారు. 1968లో వైజాగ్ బాట్లింగ్ కంపెనీ స్థాపించారు. (గోల్డ్‌స్పాట్ కంపెనీ) అప్పటి నుంచి గోల్డ్ స్పాట్ మూర్తి గా పేరొచ్చింది. 1971 టెక్నో సంచుల ఫ్యాక్టరీ ప్రా రంభించారు. 1978లో టూత్ఫెస్టు ట్రస్టులో చురు కైన పాత్ర పోషించారు. 1980లో గీతమ్ ఇంజినీరింగ్ కళాశాల స్థాపించారు. 2013లో గీతమ్ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించారు. గీతంను ప్రగతి పథాన నడిపించి గోల్డ్‌స్పాట్ నుంచి గీతం మూర్తిగా మారిపోయారు. రాజకీయ వేత్తగా.. 1991, 1999లో వైజాగ్ ఎంపీగా చేశారు. ఉత్తమ పార్లమెంటేరియన్‌గా ఆయన అవార్డు అందుకున్నారు.ఎన్టీఆర్ సమయంలో వుడా చైర్మన్‌గా పనిచేశారు. విస్తరించిన విద్యాసంస్థలు కేవలం ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో గీతం వర్సిటీ క్యాంప్‌లను అభివృద్ధి చేసి నైపుణ్యంతో కూడిన అంతర్జాతీయ విద్యా ప్రమాణాలు అభివృద్ధి పరిచారు. పుస్తక పఠనం, పుస్తకాలంటే మూర్తికి ఎంతో ఇష్టం. ఇది మూర్తిలోని పట్టుదలకు నిదర్శనమని మూర్తి బంధువులు చెబుతున్నారు. మూర్తికి ఇష్టులైన మహాత్మ గాంధీ, మదర్ థెరిస్సా వంటి మహోన్నుతులు అంటే చాలా ఇష్టం. మహాత్మ గాంధీ పేరుతో గీతంలో ఒక స్టడీ సెంటర్ నెలకొల్పి ఆయనపై పరిశోధన అంశాలను నెలక్పొడం విశేషం. మూర్తి మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. మహాత్మగాంధీ అంటే ఎంతో ఇష్టం డాక్టర్ ఎంవీవీఎస్ మూర్తికి మహాత్మగాంధీ అంటే ఎంతో అభిమానం. ఆయన తన విద్యా సంస్థలకు జాతిపిత పేరు పెట్టుకున్నారు. గీతం విద్యాసంస్థలను గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ పేరుతో ఆయన 1980లో నగర శివారు రుషికొండలో ప్రారంభించారు. నాలుగు దశాబ్దాలుగా గీతం విశ్వవిద్యాలయం, తర్వాత డీమ్డ్ విశ్వవిద్యాలయం వరకు ఎదిగింది. మృత్యువులోనూ వీడని బంధం సాగర్‌నగర్ (విశాఖ తూర్పు): అమెరికాలోని జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో గీతం అధ్యక్షుడు డాక్టర్ మూర్తితోపాటు ఆయన చిరకాల మిత్రుడు వెలువోలు బసవపున్నయ్య కూడా కన్నుమూశారు. పున్నయ్య జర్నలిస్టు, సామాజిక సేవారంగంలో ఉన్నారు. వెలువోలు ట్రస్టు పేరుతో ఆయన అనేక సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. డాక్టర్ ఎంవీవీఎస్ మూర్తికి ఎంతో సన్నిహింగా ఉంటూనే రాజ్యసభ సభ్యుడు టి. సుబ్బరామిరెడ్డితోనూ ఉండటం విశేషం. బసవపున్నయ్య మృతి పట్ల విశాఖలోని జర్నలిస్టు సంఘాలు తమ సంతాపాన్ని ప్రకటించాయి. -
‘గీతం’ అధినేత మూర్తి దుర్మరణం
సాక్షి, విశాఖపట్నం: శాసన మండలి సభ్యుడు, మాజీ ఎంపీ, గీతం విద్యాసంస్థల అధినేత ఎంవీవీఎస్ మూర్తి(80) అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఆయనతోపాటు ప్రయాణిస్తున్న మరో ముగ్గురు సన్నిహితులు కూడా మృత్యువాత పడ్డారు. మూర్తి ఆత్మీయులు, స్నేహితులు అందించిన సమాచారం ప్రకారం.. అమెరికాలోని ఆంకరేజి సిటీ వద్ద ఉన్న వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని సందర్శించేందుకు మూర్తితోపాటు ఆయన మిత్రులు నలుగురు కాలిఫోర్నియా నుంచి పయనమయ్యారు. స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో అలస్కా సిటీ వద్ద డాడ్జ్ వ్యాన్‌లో మూర్తి, ఆయన సన్నిహితులు వెలువోలు బసవపున్నయ్య(78), వీరమాచినేని శివప్రసాద్, వీవీఆర్ చౌదరి(చిన్న), కడియాల వెంకటరత్నం(గాంధీ) వెళ్తున్నారు. వీరు ప్రయాణిస్తున్న వ్యాన్ ముందు వెళ్తున్న ఫోర్డ్ ఎఫ్–150 అనే ట్రక్కును తప్పించబోతుండగా దాన్ని ఢీకొని అదుపుతప్పి పక్కన లోతుగా ఉన్న ప్రాంతంలో బోల్తాపడింది. దీంతో అందులో ఉన్న మూర్తి, బసవపున్నయ్య, శివప్రసాద్, చౌదరిలు చనిపోయారు. తీవ్ర గాయాలపాలైన గాంధీ అలస్కా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వ్యాన్‌ను కొల్గిన్ కొస్కీ అనే యువకుడు నడుపుతుండగా పక్కన 21 ఏళ్ల యువతి, రెండేళ్ల బాలుడు కూడా ఉన్నట్టు తెలిసింది. డ్రైవర్ పక్కన శివప్రసాద్ కూర్చోగా మిగిలిన వారు వెనక సీట్లలో కూర్చున్నారు. ‘గీతం’ పూర్వ విద్యార్థుల సమ్మేళనం కోసం.. ఎంవీవీఎస్ మూర్తి తన సన్నిహితులు వీవీఆర్ చౌదరి, గాంధీలను వెట్టబెట్టుకుని సెప్టెంబర్ 13న విశాఖ నుంచి అమెరికా పర్యటనకు Ððవెళ్లారు. అప్పటికే అమెరికాలో ఉన్న శివప్రసాద్, బసవపున్నయ్యలు మూర్తిని కలిశారు. అక్కడ గీతం పూర్వ విద్యార్థులతో ఈ నెల 6న జరిగే సమ్మేళనంలో మూర్తి ముఖ్య అతిథిగా పాల్గొనాల్సి ఉంది. ఇంతలోనే ఆయన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారన్న వార్త బుధవారం తెల్లారేసరికే తెలియడంతో విశాఖ నగరం నిర్ఘాంతపోయింది. ఎంవీవీఎస్ మూర్తికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కొన్నేళ్ల క్రితం ఆయన భార్య సావిత్రి అనారోగ్యంతో మరణించారు. కుమారులు రామారావు, లక్ష్మణరావు వ్యాపారంలో స్థిరపడ్డారు. కుమార్తె బెంగళూరులో ఉంటున్నారు. ‘గోల్డ్‌స్పాట్’ మూర్తి తూర్పు గోదావరి జిల్లా అయినవిల్లి మండలం మూలపాలెం మూర్తి స్వస్థలం. వ్యాపార నిమిత్తం 1970 దశకంలో విశాఖపట్నానికి వచ్చి స్థిరపడ్డారు. గోల్డ్‌స్పాట్ శీతల పానీయాల కంపెనీని స్థాపించి గోల్డ్‌స్పాట్ మూర్తిగా పేరుగాంచారు. 1984లో టీడీపీలో చేరిన ఆయన అప్పట్నుంచి ఆ పార్టీలోనే కొనసాగుతున్నారు. రెండు పర్యాయాలు విశాఖపట్నం నుంచి లోక్‌సభ సభ్యునిగా గెలిచారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. 1980లో గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్(గీతం) కళాశాలను స్థాపించారు. అనంతరం అది డీమ్డ్ యూనివర్సిటీ స్థాయికి ఎదిగింది. బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో గీతం క్యాంపస్‌లు ఏర్పాటు చేశారు. కలగానే మిగిలిన మంత్రి పదవి మంత్రి పదవి చేపట్టాలన్న చిరకాల కోరిక తీరకుండానే మూర్తి కన్నుమూశారు. రెండు దశాబ్దాల నుంచి ఆయన మంత్రి పదవి దక్కించుకోవాలని ఆరాటపడుతున్నారు. కానీ, మంత్రి పదవి దక్కాలంటే ఎమ్మెల్యే కావాలి. కానీ ఏనాడూ ఆయనకు ఎమ్మెల్యే అయ్యే అవకాశం రాలేదు. 2015లో ఎమ్మెల్సీగా నామినేట్ చేసినప్పుడు ఆయనలో మళ్లీ మంత్రిపై ఆశలు రేకెత్తాయి. కానీ చంద్రబాబు మంత్రివర్గంలో చోటు కల్పించలేదు. సీఎం చంద్రబాబుతో బంధుత్వం ఎంవీవీఎస్ మూర్తికి ముఖ్యమంత్రి చంద్రబాబుతో సన్నిహిత బంధుత్వం ఉంది. ముఖ్యమంత్రి వియ్యంకుడు, సినీనటుడు నందమూరి బాలకృష్ణ రెండో కుమార్తెను మూర్తి మనవడు భరత్‌కు ఇచ్చి వివాహం చేశారు. అలాగే మాజీ ఎంపీ కావూరి సాంబశివరావుకు కూడా మూర్తి వియ్యంకుడే. మూర్తి మృతదేహం వద్దకు మనవడు మూర్తి సన్నిహితుడు, విశాఖకు చెందిన దాసరి వెంకటేశ్వరరావు డెట్రాయిట్లో ఉంటున్నారు. ఆయన బుధవారం రాత్రి ‘సాక్షి’కి ఫోన్లో అక్కడి పరిస్థితిని వివరించారు. ‘‘షికాగోలో ఉన్న మూర్తి మనవడు (చిన్న కుమారుడు లక్ష్మణరావు కొడుకు) ప్రమాద వార్త తెలియగానే అలాస్కాకు బయలుదేరాడు. అక్కడి ఆస్పత్రిలో వీరి మృతదేహాలను ఉంచారు. అమెరికా నిబంధనల ప్రకారం మృతదేహాలను వారి బంధువులు గుర్తించాల్సి ఉంటుంది. మూర్తి మనవడు ఆస్పత్రికి వెళ్లి గుర్తించాక పోస్టుమార్టం చేస్తారు. అనంతరం మృతదేహాలను భారత్‌కు పంపుతారు’’ అని తెలిపారు. భౌతికకాయం 7న విశాఖకు! ఎంవీవీఎస్ మూర్తి భౌతికకాయాన్ని ఈ నెల 7న విశాఖ నగరానికి తీసుకొచ్చే అవకాశం ఉంది. పోస్టుమార్టం అనంతరం భారత్‌కు పంపే ప్రక్రియ పూర్తి కావడానికి మరో రెండు రోజులు పట్టనుంది. దీన్నిబట్టి ఈ నెల 7న ఆదివారం నాటికి ఆయన పార్థివదేహం రావచ్చని భావిస్తున్నారు. మూర్తి విశాఖ నగరంలోని సిరిపురంలో నివాసం ఉంటున్నారు. బుధవారం ఉదయం మూర్తి దుర్మరణం వార్త తెలియగానే ఆయన కుమారులు రామారావు, లక్ష్మణరావులు హుటాహుటీన ఆయన ఇంటికి వచ్చారు. పలువురు ప్రజాప్రతినిధులు, అభిమానులు, అధికారులు అక్కడికి చేరుకున్నారు. అమృతలూరులో విషాదఛాయలు అమృతలూరు(వేమూరు): అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎంవీవీఎస్ మూర్తితోపాటు మృతిచెందిన వెలువోలు బసవపున్నయ్య(78) స్వగ్రామం గుంటూరు జిల్లాలోని అమృతలూరు. బసవపున్నయ్య మరణవార్త తెలియగానే అమృతలూరులో విషాదఛాయలు అలుముకున్నాయి. బసవపున్నయ్య తల్లిదండ్రులు వెలువోలు సుబ్బమ్మ, వెంకట సూర్యనారాయణ. ఆయన సాంఘిక సంక్షేమ శాఖలో ఉద్యోగ విరమణ అనంతరం విశాఖపట్నంలో స్థిరపడ్డారు. గీతమ్స్ సంస్థ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. వెలువోలు ట్రస్ట్‌ను స్థాపించి, స్వగ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. -
రెండు సార్లు ఎంపీగా పనిచేసిన మూర్తి
సాక్షి, హైదరాబాద్ : అమెరికా రోడ్డు ప్రమాదంలో గీతం వర్సిటీ అధినేత, టీడీపీ ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన 1938 జూలై 3న తూర్పుగోదావరి జిల్లా మూలపొలం గ్రామంలో జన్మించారు. ఆర్థికశాస్త్రంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ పొందిన ఎంవీవీఎస్ మూర్తి గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ (గీతం) విద్యాసంస్థలను ప్రారంభించారు. ఆయన మరణంతో మూలపొలం గ్రామంలో విషాదం నెలకొంది. న్యాయవాదిగా, పారిశ్రామికవేత్తగా, విద్యావేత్తగా గుర్తింపు పొందిన ఆయన రెండుసార్లు ఎంపీగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. టీడీపీ ఆవిర్భావం నుంచి మూర్తి ఆ పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు. ఆ పార్టీ నుంచి తొలిసారి 1989లో విశాఖపట్నం లోక్‌సభ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం 1991లో జరిగిన ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్‌కు చెందిన ఉమాగజపతిరాజుపై గెలుపొందారు. 1999లో కూడా మరోసారి అదే నియోజకవర్గం నుంచి గెలుపొందారు. తరువాత 2004 ఎన్నికల్లో నేదురుమల్లి జనార్థన్‌రెడ్డిపై ఓడిపోయారు. 2009 ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. 2014 ఎన్నికల్లో విశాఖపట్నం సీటును బీజేపీకి కేటాయించడంతో.. ‘మూర్తి'ని ఎమ్మెల్సీగా సీఎం చంద్రబాబు నామినేటెడ్ చేశారు. (చదవండి: గీతం యూనివర్సిటీ అధినేత హఠాన్మరణం) సంతాపం తెలిపిన వైఎస్ జగన్ గీతం వర్సిటీ అధినేత ఎంవీవీఎస్ మూర్తి మృతి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం తెలిపారు. అలాగే ఆయన కుటుంబసభ్యలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. -
గీతం యూనివర్సిటీ అధినేత హఠాన్మరణం
సాక్షి, హైదరాబాద్ : అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ప్రముఖ విద్యావేత్త, గీతం వర్సిటీ అధినేత, ఎమ్మెల్సీ డాక్టర్ ఎంవీవీఎస్ మూర్తి మృతిచెందారు. అమెరికాలోని అలస్కాలోని ఆంకరేజ్ సిటీ వద్ద మూర్తి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. దీంతో మూర్తితో పాటు కారులో ప్రయాణిస్తున్న వెలువోలు బసవపున్నయ్య , వీరమాచినేని శివ ప్రసాద్, వి. బి ఆర్ చౌదరి (చిన్న) మృతి చెందినట్టు సమాచారం. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కడియాల వెంకటరత్నం (గాంధీ) అలాస్కా ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. ఆంకరేజ్ సిటీ వద్ద గల వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని సందర్శించేందుకు వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో పోలీసులు, సహాయక సిబ్బంది అక్టోబర్ 6న కాలిఫోర్నియాలో గీతం పూర్వ విద్యార్థి సమావేశంలో ఎంవీవీఎస్ మూర్తి ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించవలసి ఉంది. ఇంతలోనే ఈ దుర్మరణం వార్త అందరిని కలచివేసింది. వీరు ప్రయాణిస్తున్న 2017 డాడ్జ్ వ్యాన్ ఎదురుగా వస్తున్న ఫోర్డ్ ట్రక్కును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. తీవ్ర గాయాలతో ఇద్దరు ఘటనాస్థలంలోనే మృతి చెందగా మరో ఇద్దరు హెలికాప్టర్ లో ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా మార్గ మధ్యలో ప్రాణాలు విడిచారు. అమరావతి: డాక్టర్ ఎంవీవీఎస్ మూర్తి ఆకస్మిక మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మూర్తి ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నానని తెలిపారు. మూర్తి కుటుంబ సభ్యులకు చంద్రబాబు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఏపీ మంత్రులు నారా లోకేష్, యనమల రామకృష్ణుడు, గంటా శ్రీనివాస్‌రావులు ఎంవీవీఎస్ మూర్తి హఠాన్మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మూర్తి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అమెరికా పర్యటనలో స్నేహితులతో ఎంవీవీఎస్ మూర్తి సంతాపం ఎంవీవీఎస్ మూర్తి మృతి పట్ల తానా అధ్యక్షుడు సతీష్ వేమన, మాజీ అధ్యక్షుడు ప్రసాద్ తోటకూర సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. -
‘గీతం’ మూర్తికి చిన్నాస్పత్రిలో చికిత్సా?!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఎమ్మెల్సీ, గీతం వర్సిటీ అధినేత ఎంవీవీఎస్ మూర్తి కోలుకుంటున్నారు. అనారోగ్యంతో కలెక్టరేట్ సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. అయితే గీతం కార్పొరేట్ ఆస్పత్రికి అధినేతగా ఉన్న ఆయన.. పెద్దగా పేరు ప్రఖ్యాతులు లేని ఓ చిన్న ఆస్పత్రిలో చికిత్స చేయించుకోవడం చర్చనీయాంశమైంది. గీతం యూనివర్సిటీకి అనుబంధంగా ప్రారంభమైన గీతం ఆస్పత్రిని కార్పొరేట్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు ధీటుగా అభివృద్ధి చేశామని ఎప్పటికప్పుడు ప్రచారం చేస్తుంటారు. రెండు వేల పడకలు, కీళ్ల మార్పిడి, ప్లాస్టిక్ సర్జరీ, లాప్రోస్కోపిక్ తదితర అన్ని అధునాతన శస్త్ర చికిత్స సౌకర్యాలు, 350 మంది వైద్యుల సేవలు తమ ఆస్పత్రిలో అందుబాటులో ఉంటాయని గీతం నిర్వాహకులు విస్తృత ప్రచారం చేసుకుంటుంటారు. అటువంటి ఆస్పత్రికి అధినేతగా ఉన్న గీతం మూర్తికి అనారోగ్యం చేస్తే ఇప్పటివరకు పెద్దగా ఎవరికీ తెలియనిఓ చిన్న ఆస్పత్రిలో చికిత్స చేయించడమే చర్చకు తెరలేపింది. ఉమ్మారెడ్డి పరామర్శ : కాగా ఆస్పత్రిలో ఉన్న ఎమ్మెల్సీ మూర్తిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనమండలి ఉపనేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పార్టీ రాష్ట్ర అదనపు కార్యదర్శి పక్కి దివాకర్ తదితరులు బుధవారం పరామర్శించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. -
'ఎన్టీఆర్ క్యాంటీన్లు' పై టీడీపీ ఎమ్మెల్సీ సెటైర్లు
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో అన్న ఎన్టీఆర్ క్యాంటీన్ల ఏర్పాట్లుపై టీడీపీ ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి చలోక్తులు విసిరారు. శాసనమండలిలో సోమవారం ప్రశ్నోత్తరాల సమయంలో మూర్తి మాట్లాడుతూ ఆరు నెలల క్రితం మంత్రి సునీత క్యాంటిన్ల విషయంలో ఏ సమాధానం చెప్పారో.. ప్రస్తుత మంత్రి పుల్లారావు కూడా అదే సమాధానం చెప్పారన్నారు. రోజులు మారుతున్నాయి.. మంత్రులు మారారు గానీ పథకం మాత్రం అమలు కావడం లేదని వ్యాఖ్యానించారు. పేదల ఆకలిని దృష్టిలో పెట్టుకుని తక్షణమే అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే వైద్య ఆరోగ్య శాఖపై మూర్తి ధ్వజమెత్తారు. ఏపీ రోగాలకు నిలయంగా మారిందని, ప్రసూతి మరణాలలో ఏపీ ప్రథమ స్దానంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో డెంగీ, మలేరియా విజృంభణతో ప్రజల ప్రాణాలు పోతున్నాయని, దయచేసి రాష్టాన్ని వ్యాధుల బారి నుంచి కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. -
నేననలేదు.. మీడియా సృష్టే
మీడియాతో టీడీపీ ఎమ్మెల్సీ మూర్తి సాక్షి, విశాఖపట్నం: ఏయూ ఓ దెయ్యాల కొంప.. అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి తాను అలా వ్యాఖ్యానించకపోయినా మీడియా తనపై బురద జల్లుతోందంటూ అక్కసు వెళ్లగక్కారు. శుక్రవారం మహానాడు వేదిక వద్ద మీడియా ప్రతినిధులను ఎగతాళిగా మాట్లాడుతూ ఇదంతా కావాలనే మీరే చేశారంటూ ఒంటికాలిపై లేచారు. ప్రతిదాన్ని భూతద్దంలో చూడడం అలవాటైపోయందని, ఏమీ లేకపోయినా ప్రతిపక్షం కావాలనే రాద్ధాంతం చేస్తోందని చెప్పారు. మీడియాతో పాటు ఒక పార్టీ కావాలనే ఈ విషయాన్ని రాద్దాంతం చేస్తోందే తప్ప తన తప్పిదం ఎక్కడా లేదని సమర్థించుకున్నారు. ఏయూపై తాను వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదన్నారు. మహానాడు జరగకుండా చెయ్యాలని కొన్ని శక్తులు కుట్ర చేస్తున్నాయని, అందులో భాగమే ఈ విమర్శలని ఆరోపించారు. -
ఏయూ దెయ్యాల కొంప
-
ఏయూ దెయ్యాల కొంప
ఎమ్మెల్సీ మూర్తి వ్యాఖ్య.. పెల్లుబికిన నిరసన ► వైఎస్సార్ సీపీ ధర్నా, మూర్తి దిష్టిబొమ్మ దహనం ► బహిరంగ క్షమాపణకు డిమాండ్ ► ఏయూపై వ్యాఖ్యలు దారుణం: మంత్రి గంటా సాక్షి, విశాఖపట్నం: టీడీపీ ఎమ్మెల్సీ, గీతం విశ్వవిద్యాలయం అధినేత ఎంవీవీఎస్ మూర్తి ఆంధ్ర యూనివర్సిటీని దెయ్యాల కొంపగా అభివర్ణించడంపై వర్సిటీ భగ్గుమంది. గురువారం విద్యార్థి, అధ్యాపక, ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర, రాజకీయవర్గాల్లో తీవ్ర వ్యతిరేకత పెల్లుబికింది. సోషల్ మీడియాలోనూ మూర్తి వ్యాఖ్యలపై నిరసనలు వెల్లువెత్తాయి. సొంతపార్టీ నేతలు కూడా మూర్తి వ్యాఖ్యల్ని తప్పుపట్టారు. విశాఖలో బుధవారం టీడీపీ మహానాడు పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మూర్తి మాట్లాడుతూ ‘ఏయూ ఓ దెయ్యాల కొంప. అక్కడి గ్రౌండ్స్‌లో ఆడేవాళ్లే లేరు. దుమ్ము దులిపేవాళ్లే లేరు. మహానాడు పేరుతో బాగుచేస్తుంటే ఏమిటీ రాద్దాంతం..’ అంటూ వ్యాఖ్యానించారు. మూర్తి చేసిన ఈ వ్యాఖ్యలు ‘ఏయూ దెయ్యాల కొంప’ శీర్షికన గురువారం సాక్షి టాబ్లాయిడ్లో ప్రచురితమయ్యాయి. దీనిపై ఏయూ ప్రవేశద్వారం వద్ద గురువారం వైఎస్సార్ సీపీ జిల్లా అ«ధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ నేతృత్వంలో ఆ పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. ఏయూపై చేసిన వ్యాఖ్యలను మూర్తి వెనక్కి తీసుకోవాలంటూ రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. 24 గంటల్లో క్షణాపణ చెప్పకపోతే మూర్తి ఇంటిపై దాడిచేస్తామని విద్యార్థి సంఘాల నేతలు హెచ్చరించారు. సొంత యూనివర్సిటీ కోసమే.. ఏయూ దెయ్యాల కొంప అయితే మహానాడు ఎందుకు పెడుతున్నారని పలు వర్గాల వారు నిలదీశారు. ఆయన ఏయూ పరువును దిగజార్చి తన గీతం యూనివర్సిటీ ఖ్యాతిని పెంచుకోవాలనే కుత్సితభావంతో ఉన్నారని విమర్శించారు. ఏయూ ఇచ్చిన డాక్టరేట్‌ను మూర్తి వెనక్కి ఇవ్వాలని ఏయూ టీచింగ్ స్టాఫ్ అసోసియేషన్ అధ్యక్షుడు జాలాది రవి, నాన్ టీచింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు రవికుమార్ డిమాండ్ చేశారు. ఆయన శుక్రవారంలోగా బహిరంగ క్షమాపణ చెప్పకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, ఇందుకు టీచింగ్, నాన్‌టీచింగ్, ఏయూ కో ఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీలు జేఏసీగా ఏర్పడ్డాయని చెప్పారు. విశాఖ వాసులు అసహ్యించుకుంటున్నారు బతుకుదెరువు కోసం విశాఖ వచ్చిన మూర్తి ఏయూను దెయ్యాల కొంపగా అభివర్ణించడాన్ని విశాఖవాసులు అసహ్యించుకుంటున్నారని వైఎస్సార్ సీపీ జిల్లా అ«ధ్యక్షుడు అమర్నాథ్ చెప్పారు. మూర్తి వ్యాఖ్యలకు నిరసనగా నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ టీడీపీ నేతలు దెయ్యాల్లా పడి ఏయూలో మహానాడు జరుపుతూ వర్సిటీ పవిత్రతను పాడుచేస్తున్నారని దుయ్యబట్టారు. మూర్తి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి, విశాఖ తూర్పు సమన్వయకర్త వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ మూర్తి క్షమాపణ చెప్పకపోతే మహానాడును అడ్డుకుంటామన్నారు. ఆయన్ని వెంటనే తెలుగుదేశం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. మూర్తి డౌన్‌డౌన్ అంటూ వైఎస్సార్ సీపీ నాయకులు నినాదాలు చేశారు. అనంతరం మూర్తి దిష్టిబొమ్మను దహనం చేశారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాదరెడ్డి, విశాఖ దక్షిణ, భీమిలి సమన్వయకర్తలు కోలా గురువులు, అక్కరమాని నిర్మల, రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి రవిరెడ్డి, మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీలా వెంకటలక్ష్మి, నగర అధ్యక్షురాలు పసుపులేటి ఉషాకిరణ్, బీసీడీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు పక్కి దివాకర్, విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.కాంతారావు, మైనార్టీ విభాగం అధ్యక్షుడు ఫరూఖీ, జిల్లా అధికార ప్రతినిధి మూర్తియాదవ్ తదితరులు పాల్గొన్నారు. కాగా, ప్రతిష్టాత్మకమైన ఏయూను దెయ్యాల కొంపతో పోల్చడం దారుణమని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఆ వ్యాఖ్యలను ఖండిస్తున్నానని, మూర్తి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మూర్తి వ్యాఖ్యలను ఖండించిన పాలకమండలి సభ్యులు విశాఖసిటీ: ఆంధ్ర విశ్వవిద్యాలయంపై ఎమ్మెల్సీ మూర్తి చేసిన వ్యాఖ్యలు గర్హనీయమని ఏయూ పాలకమండలి సభ్యులు ఆచార్య ఎం.ప్రసాదరావు, డాక్టర్ పి.సోమనాథరావు, డాక్టర్ ఎస్.విజయ ఒక ప్రకటనలో ఖండించారు. -
ఆంధ్రా యూనివర్శిటీ దెయ్యాల కొంపా?
-
ఆంధ్రా యూనివర్శిటీ దెయ్యాల కొంపా?
విశాఖ : ప్రతిష్టాత్మక ఆంధ్రా యూనివర్శిటీపై టీడీపీ ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అవుతున్నాయి. ఆంధ్రా వర్శిటీని ఓ దెయ్యాల కొంప, బందుల దొడ్డి అంటూ ఆయన ఓ సమావేశంలో వ్యాఖ్యలు చేశారు. అసలు ఇక్కడేముంది దెయ్యాల కొంప, బందుల దొడ్డి అంటూ నోటికి వచ్చినట్లు మాట్లాడారు. ‘ఏయూలో మహానాడు పెడితే తప్పేంటి.. రూములు తీసుకుంటున్నారు. శుభ్రంగా తుడుస్తున్నారు...బాగు చేస్తున్నారు.. పెయింట్లు గీయింట్లు వేయిస్తున్నారు. ట్యాప్‌లు కూడా బాగు చేస్తున్నారు. ఇదంతా యూనివర్శిటీకి ఉపయోగమా...నష్టమా? ఏయూ వాళ్లు ఎటూ బాగు చేయడం లేదు. వీళ్లు బాగు చేసి అందులో ఉంటామంటే ఇవ్వాలి..దెయ్యాల కొంపను ఇవ్వడానికి అడ్డుపడటం ఎందుకు’ అని అన్నారు. తన వ్యాఖ్యలపై దుమారం రేగడంతో ఎంవీవీఎస్ మూర్తి తాను చేసిన తప్పును కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఏయూలో టీడీపీ మహానాడును నిర్వహించడం ద్వారా వర్శిటీ ప్రతిష్ట ప్రపంచవ్యాప్తంగా తెలుస్తుందని చెప్పుకొచ్చారు. విశాఖలో మహానాడు సందర్భంగా ఆంధ్రా యూనివర్శిటీ ప్రాంగణాన్ని టిడిపి వేదికగా చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఎంవీవీఎస్ మూర్తి వ్యాఖ్యలను ఏయూ విద్యార్థులు తీవ్రంగా ఖండించారు. ఆయన తక్షణమే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే మహానాడును అడ్డుకుంటామని విద్యార్థులు హెచ్చరించారు. మరోవైపు ఎమ్మెల్సీ వ్యాఖ్యలను ఆంధ్రా యూనివర్శిటీ టీచింగ్, నాన్ టీచింగ్ అసోసియేషన్ తప్పుపట్టింది. ఎంవీవీఎస్ మూర్తి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడతామన్నారు. ఎంతోమంది ప్రముఖులు ఏయూలోనే చదువుకుని ఉన్నత పదవులు అధిరోహించారని, అలాంటి వర్శిటీపై అనుచితంగా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. కాగా విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా ఎంవీవీఎస్ మూర్తి వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఆంధ్రా యూనివర్శిటీకి గొప్ప చరిత్ర ఉందని, ఏ ఉద్దేశ్యంతో మూర్తి ఈ వ్యాఖ్యలు చేశారో తనకు తెలియదని అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలు సరికాదని గంటా అభిప్రాయపడ్డారు. అలాగే ఆంధ్రా యూనివర్శిటీలో టీడీపీ మహానాడు నిర్వహణను సవాల్ చేస్తూ హైకోర్టులో గురువారం పిటిషన్ దాఖలైంది. ఏయూ రీసెర్చ్ స్కాలర్ ఇవాళ లంచ్ మెషన్ పిల్ వేయగా, కోర్టు విచారణకు స్వీకరించింది. తీర్పును రేపటికి వాయిదా వేసింది. -
భారత్ అభివృద్ధిలో భాగస్వాములు కండి
‘గీతం’ విద్యార్థులకు ఎంవీవీఎస్ మూర్తి పిలుపు సాక్షి, విశాఖపట్నం: ఉద్యోగం కోసం ఏ దేశానికి వెళ్లినా అక్కడి టెక్నాలజీని ఆకళింపుజేసుకొని సొంతగడ్డకు తీసుకురావాలని, ఇక్కడి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని గీతం వర్సిటీ విద్యార్థులకు సంస్థ చైర్మన్ ఎంవీవీఎస్ మూర్తి పిలుపునిచ్చారు. క్యాంపస్ ఇంటర్వ్యూల్లో వివిధ ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించిన 2,527 మంది గీతం విద్యార్థులకు ఆయన చేతుల మీదుగా ఆయా సంస్థల తరపున నియామకపత్రాలు అందజేశారు. మంగళవారం గీతం వర్సిటీలో నిర్వహించిన ఎచీవర్స్ డే ఇందుకు వేదికైంది. ఈ సందర్భంగా మూర్తి మాట్లాడుతూ సెబీ ఆదేశాల ప్రకారం ప్రతి కంపెనీ డెరైక్టర్లలో మూడో వంతు మహిళలను నియమించాల్సి ఉందని, విద్యార్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఒక సరికొత్త ఆలోచనతో బిజినెస్ లీడర్లు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో గీతం వైస్‌చాన్సలర్ ప్రొఫెసర్ జి.సుబ్రహ్మణ్యం, ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ ఎం.గంగాధరరావు, ప్రొ వైస్‌చాన్సలర్ ప్రొఫెసర్ డి.హరినారాయణ, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం.పోతరాజు, ప్లేస్మెంట్ అధికారులు పాల్గొన్నారు. ఎచీవ్మెంట్ సాధించిన విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా హాజరుకావడంతో వేదిక స్నాతకోత్సవాన్ని తలపించింది. -
గంటా ఎత్తు.. బీసీ చిత్తు
విశాఖపట్నం, న్యూస్‌లైన్: విశాఖ తూర్పు, ఉత్తర, దక్షిణ, భీమిలి నియోజకవర్గాల నుంచి నలుగురు ఓసీ అభ్యర్థులను రంగంలోకి దించడం ద్వారా మాజీ మంత్రి గంటా ఎన్నికల వ్యయాన్ని తగ్గించుకోవాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఆయా నియోజకవర్గాల్లో సామాజిక వర్గ పరంగా బలంగా తమను దెబ్బతీసేందుకు గంటా కుయుక్తులు పన్నుతున్నట్లు ఆ పార్టీ బీసీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఈమేరకు ఎంవీవీ ఎస్ మూర్తి, నారాయణ విద్యా సంస్థల అధినేత నారాయణలతో గంటా లోపాయికారి ఒప్పం దం కుదుర్చుకొని జాబితాను రూపొందించారని తెలిసింది. ఉత్తరం, దక్షిణం, భీమిలి నియోజకవర్గాల నుంచి ఎక్కువమంది బీసీ అభ్యర్థులు టికెట్లు ఆశిస్తున్నారని, వీరిలో ఏ ఒక్కరికి టికెట్ కేటాయించిన మిగిలిన వారు వ్యతిరేకంగా పనిచేసే అవకాశముందనే సాకుతో ఓసీలకు కేటాయిస్తే ఇబ్బందులు తలెత్తకుండా పార్టీ విజయానికి మేలు జరుగుతుందని చంద్రబాబును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని బీసీ నేతలే బాహాటంగా అంటున్నారు. దీనిపై బీసీ నేతలు గంటా తీరుపై గరంగరంగా ఉన్నారు. ఉత్తరంలో పంచకర్లకు టికెట్ ఇప్పించే క్రమంలో బీసీ సామాజికవర్గ నేతలైన భరణికాన, పైలా ముత్యాల నాయుడులకు ప్రాతినిథ్యం దక్కకుండా పావులు కదుపుతున్నారని భోగట్టా. అలాగే దక్షిణ ంలో వాసుపల్లికి బీజేపీ పొత్తును సాకుగా చూపి ఓసీ అభ్యర్థి సీమాంధ్ర బీజేపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబును, లేని పక్షంలో చివరగా ఎంవీవీ ఎస్ మూర్తిని గాని పోటీ లో నిలిపేందుకు రంగాన్ని సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. బీసీ నేతల మధ్య అనైక్యతను చూపుతూ భీమిలి నుంచి తన సామాజిక వర్గానికి చెందిన ధనబలమున్న అవంతి శ్రీనివాస్‌ను, తూర్పు నుంచి వెలగపూడి రామకృష్ణబాబులకు టికెట్లు ఖరారు చేసేందుకు ప్రణాళికను రూపొందించినట్లు తెలిసింది. లోక్‌సభ పరిధిలోని పశ్చిమం, గాజువాక, పెందుర్తి, ఎస్.కోట నియోజకవర్గాల్లో కూడా ఒకటి రెండు చోట్ల ఆర్థిక స్తోమత ఉన్న ఓసీలకు సీట్లు ఇప్పించేందుకు ఈ మాజీమంత్రి యత్నిస్తున్నట్లు తెలిసింది. -
చంద్రబాబు వైఖరి స్పష్టం చేయాలి
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర విభజనపై ముఖ్యంగా హైదరాబాద్‌పై చంద్రబాబునాయుడు నుంచి మరింత స్పష్టత రావలసిన అవసరముందని తెలుగుదేశం నాయకుడు, మాజీ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తి వ్యాఖ్యానించారు. విభజనపై ప్రజలు లేవనెత్తిన సందేహాలకు జవాబు ఇవ్వాలని ప్రధానికి లేఖ రాసిన బాబు.. ముందు తన వైఖరి స్పష్టంగా వెల్లడించాలన్నారు. శనివారం విశాఖలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విభజన వలన కలిగే నష్టాలపై మాట్లాడిన సీఎం కిరణ్‌ను అభినందించాలని చెప్పారు. సీఎం బహిరంగంగా మాట్లాడిన తర్వాతే చంద్రబాబుకు ధైర్యం వచ్చిందని,అందుకే ప్రధానికి లేఖ రాశారని తెలిపారు. రాష్ట్ర విభజనపై దిగ్విజయ్‌సింగ్ అసలు ఏ హోదాలో మాట్లాడుతున్నారని? అసలు ఆయన ఎవరని ప్రశ్నించారు. తక్షణం రాష్ట్ర బాధ్యతల నుంచి ఆయన్ను తప్పించాలని డిమాండ్ చేశారు. సీమాంధ్రుల అభ్యంతరాలను వినడానికి ఏర్పాటు చేసిన ఆంటోని కమిటీతో ప్రజలెవరూ మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. విభజన కోరుకునేవాళ్లే కొత్త రాజధానిని వెతుక్కోవాలన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని, అసెంబ్లీ తీర్మానం లేకుండా ముక్కలుచేస్తే రక్తపాతం జరుగుతుందని హెచ్చరించారు. తక్షణం ప్రధాని జోక్యం చేసుకుని దేశాన్ని ముక్కలు చేసే అరాచక ప్రయత్నాలను ఆపాలని కోరారు.