ఏయూ ఓ దెయ్యాల కొంప.. అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి తాను అలా వ్యాఖ్యానించకపోయినా మీడియా తనపై బురద జల్లుతోందంటూ అక్కసు వెళ్లగక్కారు.
మీడియాతో టీడీపీ ఎమ్మెల్సీ మూర్తి
సాక్షి, విశాఖపట్నం:
ఏయూ ఓ దెయ్యాల కొంప.. అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి తాను అలా వ్యాఖ్యానించకపోయినా మీడియా తనపై బురద జల్లుతోందంటూ అక్కసు వెళ్లగక్కారు. శుక్రవారం మహానాడు వేదిక వద్ద మీడియా ప్రతినిధులను ఎగతాళిగా మాట్లాడుతూ ఇదంతా కావాలనే మీరే చేశారంటూ ఒంటికాలిపై లేచారు. ప్రతిదాన్ని భూతద్దంలో చూడడం అలవాటైపోయందని, ఏమీ లేకపోయినా ప్రతిపక్షం కావాలనే రాద్ధాంతం చేస్తోందని చెప్పారు.
మీడియాతో పాటు ఒక పార్టీ కావాలనే ఈ విషయాన్ని రాద్దాంతం చేస్తోందే తప్ప తన తప్పిదం ఎక్కడా లేదని సమర్థించుకున్నారు. ఏయూపై తాను వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదన్నారు. మహానాడు జరగకుండా చెయ్యాలని కొన్ని శక్తులు కుట్ర చేస్తున్నాయని, అందులో భాగమే ఈ విమర్శలని ఆరోపించారు.