
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో అన్న ఎన్టీఆర్ క్యాంటీన్‌ల ఏర్పాట్లుపై టీడీపీ ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి చలోక్తులు విసిరారు. శాసనమండలిలో సోమవారం ప్రశ్నోత్తరాల సమయంలో మూర్తి మాట్లాడుతూ ఆరు నెలల క్రితం మంత్రి సునీత క్యాంటిన్‌ల విషయంలో ఏ సమాధానం చెప్పారో.. ప్రస్తుత మంత్రి పుల్లారావు కూడా అదే సమాధానం చెప్పారన్నారు. రోజులు మారుతున్నాయి.. మంత్రులు మారారు గానీ పథకం మాత్రం అమలు కావడం లేదని వ్యాఖ్యానించారు.
పేదల ఆకలిని దృష్టిలో పెట్టుకుని తక్షణమే అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే వైద్య ఆరోగ్య శాఖపై మూర్తి ధ్వజమెత్తారు. ఏపీ రోగాలకు నిలయంగా మారిందని, ప్రసూతి మరణాలలో ఏపీ ప్రథమ స్దానంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో డెంగీ, మలేరియా విజృంభణతో ప్రజల ప్రాణాలు పోతున్నాయని, దయచేసి రాష్టాన్ని వ్యాధుల బారి నుంచి కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు.
Comments
Please login to add a commentAdd a comment