Anna Canteen
-
కడప అన్నా క్యాంటీన్ లో భారీ పేలుడు
-
అన్నా క్యాంటీన్లో భారీ పేలుడు..
సాక్షి, వైఎస్సార్: అన్నా క్యాంటీన్ తయారీ వంటశాలలో భారీ పేలుడు ఘటన సంభవించింది. పేలుడు థాటికి వంటశాల షెడ్ పూర్తిగా ధ్వంసమైంది. భారీ పేలుడుతో కార్మికులు, సిబ్బంది ఉలిక్కిపడ్డారు. అయితే, పేలుడు ఘటన బయటకు రాకుండా పచ్చ మీడియా కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తోంది.వివరాల ప్రకారం.. కడపలో అన్నా క్యాంటీన్ తయారీ వంటశాలలో భారీ పేలుడు ఘటన చోటుచేసుకుంది. మార్కెట్ యార్డు సమీపంలోని అన్నా క్యాంటీన్ వంటశాలలో బుధవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో పేలుడు సంభవించింది. వంట గదిలో గ్యాస్ లీక్ కావడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో పేలుడు థాటికి వంటశాల షెడ్ ధ్వంసమైంది. 200 అడుగుల మేరా ఎగిరిపడ్డ బాయిలర్, వస్తువులు చెల్లాచెదురుగా పడిపోయాయి.పేలుడు రాత్రి సమయంలో సంభవించడంతో ప్రాణ నష్టం తప్పింది. వంటలు వండకపోవడం.. సిబ్బంది బాయిలర్ వద్ద లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇక, భారీ పేలుడుతో కార్మికులు, సిబ్బంది ఉలిక్కిపడ్డారు. పేలుడు ఘటనను ఎవరి కంట పడకుండా పచ్చ నేతలు కప్పి ఫుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, సిబ్బంది నిర్లక్ష్యంగా కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు. -
అన్నా క్యాంటీన్లకు టీడీపీ రంగులు
-
అన్న క్యాంటీన్లో అపరిశుభ్రత.. వీడియో వైరల్!
పశ్చిమ గోదావరి, సాక్షి: తణుకులోని అన్న క్యాంటీన్లో అపరిశుభ్రమైన నీటితో తినేసిన ప్లేట్లు కడుగుతున్నట్లు ఓ వీడియో నిన్నటి నుంచి వైరల్ అవుతోంది. స్థానిక సొసైటీ రోడ్డులోని అన్న క్యాంటీన్లో ఈ ఘటన జరిగింది. ఈ నెల 19న జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఒక వ్యక్తి తన సెల్‌ఫోన్ ద్వారా వీడియో తీసినట్లు తెలుస్తోంది. అన్న క్యాంటీన్లో పేదలు ఉదయం టిఫిన్ తిన్న ప్లేట్లను వాష్ బేసిన్లో వేసి పూర్తి అపరిశుభ్రంగా ఉన్న నీటిలో కడుగుతున్న విషయం ఆ వీడియోలో ఉంది. తినేసిన ప్లేట్లను చేతులు కడుక్కునే వాష్ బేసిన్లో.. నిల్వ ఉన్న మురికి నీటిలో ఉంచి శుభ్రం చేస్తున్న విషయం ఆ వీడియోను చూస్తే అర్థమవుతోంది. #***Rs 5/- Anna Canteen in Tanuku***#This is how the KGF Taliban government treats poor People. Dirty water is used to clean the plates . YEllow goons can go now from HYD to check the quality of food ! @India_NHRC #AndhraPradesh #AnnaCanteen pic.twitter.com/gT9aF5b5uL— Howdy @ Murali Reddy ! ( Jagan కుటుంబం) (@Muralipmr) August 26, 2024 పేదలు తింటున్న అన్నం ప్లేట్లు ఎలా కడిగినా.. ఎవరు చూస్తారులే అనుకుంటూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై మున్సిపల్ కమిషనర్ బీవీ రమణను వివరణ కోరగా తినేసిన ప్లేట్లు సాధారణంగా వాష్ బేసిన్లో వేస్తుంటారని, అయితే ఆ రోజు ఒకేసారి తాకిడి రావడంతో మిగిలిన వ్యర్థాలు వాష్ బేసిన్లో ఉండిపోవడం వల్ల నీరు నిలిచిపోయి ఉండొచ్చని అన్నారు. అక్కడి నుంచి ప్లేట్లు తీసి వేరే చోట కడుగుతారని చెప్పారాయన. లోకేష్ స్పందనఇక తణుకు అన్న క్యాంటీన్ వీడియో వైరల్ కావడంపై ఎక్స్ వేదికగా మంత్రి నారా లోకేష్ స్పందించారు. అది తప్పుడు ప్రచారమని, ఉద్దేశపూర్వకంగా చేసి ఉంటారని ట్వీట్ చేశారు. -
అన్నా క్యాంటీన్ మోసాన్ని బయటపెట్టిన పెద్దాయన
-
గట్టి ఇడ్లీలు... నూనె కారుతున్న పూరీలు
మదనపల్లె: రాళ్ల లాంటి గట్టి ఇడ్లీలు... నూనె కారుతూ, పచ్చిగా ఉన్నటువంటి పూరీలు.. రుచి పచీ లేని సాంబార్. ఇదీ తొలిరోజు అన్నమయ్య జిల్లా మదనపల్లె అన్నా క్యాంటీన్లో వడ్డించిన టిఫిన్ మెనూలోని పదార్థాల నాణ్యత. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక..ఎన్నికల హామీ నిలబెట్టుకునే క్రమంలో ఆగస్టు 16 నుంచి ప్రారంభించిన అన్నా క్యాంటీన్లు తొలిరోజే ప్రజలను నిరాశపరిచాయి. రూ.5కే ఇడ్లీ, పూరీ తినవచ్చని ఆశగా వెళ్లినవారు పదార్థాల నాణ్యత, రుచిని చూసి పెదవి విరిచారు. వడ్డించిన పదార్థాల్లో కేసరి స్వీట్ మాత్రమే బాగుందని, మిగిలిన పదార్థాలు చల్లగా ఉండటంతో ఎప్పుడు తయారుచేశారో అని అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయమై అన్నా క్యాంటీన్ సూపర్వైజర్ని అడిగితే...తమకు ఆహారపదార్థాలు 115 కిలోమీటర్ల దూరంలోని చిత్తూరుజిల్లా కుప్పం నుంచి వస్తున్నాయన్నారు. అక్కడి నుంచి ఇక్కడకు వచ్చేందుకు కనీసం మూడు గంటల సమయమైనా పడుతుందని చెప్పుకొచ్చారు. భోజనం తినేందుకు ఎంతో ఆశగా, ఆకలితో వచ్చిన పేదలు...ఎర్రటి ఎండలో ముప్పావుగంటకు పైగా క్యూలో నిల్చుని ఎదురుచూశారు. తొలిరోజు అన్నా క్యాంటీన్లో ఆహారపదార్థాల నాణ్యతపై మున్సిపల్ ఆర్డీ పీ.వి.వి.ఎస్.మూర్తి, రాజంపేట పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షులు చమర్తి జగన్మోహన్రాజు పరిశీలించారు.అన్నమే రాలేదుగతంలో 12 గంటలకే మధ్యాహ్న భోజనం పెట్టేవారు. ఇప్పుడు 1 గంట అయినా అన్నం రాలేదు. ఆకలిగా ఉంది. అందుకే వెళ్లిపోతున్నాం. – కృష్ణానాయక్, అనంతపురం -
అన్న క్యాంటీన్లకు పసుపు రంగులు దిద్దిన టీడీపీ
-
అన్నా క్యాంటీన్ కోసం 100 ఏళ్ల వేప చెట్టు నరికేశారు
-
కుప్పంలో టీడీపీ మరో డ్రామా
-
Kuppam: కుప్పంలో టీడీపీ మరో డ్రామా
సాక్షి, చిత్తూరు: చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో టీడీపీ మరో నాటకానికి తెరలేపింది. కుప్పం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఆ పార్టీ నేతలు తాత్కాలిక టెంట్లో అన్నా క్యాంటీన్‌ను ఏర్పాటు చేశారు. అయితే గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి ఆ తాత్కాలిక టెంట్ ఓ వైపు ఒరిగిపోయింది. కూలిపోయిన టెంట్‌తో ఆర్టీసీ ప్రయాణికులకు ఇబ్బందిగా మారింది. దీంతో మున్సిపల్ సిబ్బంది కూలిపోయిన టెంట్‌ను ఉదయాన్నే తొలగించారు. దీన్ని కూడా టీడీపీ తమ రాజకీయ ప్రయోజనాలకోసం వాడుకోవాలని చూస్తోంది. ఆ టెంపరరీ టెంట్ వర్షంతో కూలిపోవడంతో దాన్ని తొలగించినటు మున్సిపల్ అధికారులు స్పష్టం చేశారు. చదవండి: (Shashi Tharoor: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి రేసులో ఎంపీ శశిథరూర్!) -
తమాషా చేస్తే ఇంటికొచ్చి కొడతా
సాక్షి, చిత్తూరు: ‘‘ఏం తమషా చేస్తున్నారా? మీ ఇంటికే వచ్చి కొడతా? వైసీపీ రౌడీలకు ఎక్స్పైరీ డేట్లు అయిపోయాయి. మగాళ్లైతే ఇప్పుడు రండి. రౌడీలు, గూండాలు, ముఠాలు, అణచివేసిన పార్టీ టీడీపీ. నేనూ రోడ్డు మీదకి వస్తా, ఎవరు వస్తారో చూస్తా’’.. అని ప్రతిపక్ష నేత చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కుప్పం బస్టాండ్ ప్రాంతంలోని అన్న క్యాంటీన్ వద్ద గురువారం ఆయన రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. అన్న క్యాంటీన్‌పై దాడిచేయడం పేదలపై దాడి చేయడమేనన్నారు. తన హయాంలో శాంతిభద్రతలకు ప్రాధాన్యత ఇచ్చానని.. వ్యవస్థ సక్రమంగా పనిచేయాలని పోలీసులకు సూచించారు. దాడులు చేసిన వారిని పోలీస్‌స్టేషన్‌కు కాకుండా ఇంటికి పంపడం దారుణమన్నారు. కుప్పంలో జరిగింది ఏమిటో డీజీపీ వచ్చి చూడాలని డిమాండ్ చేశారు. కొల్లుపల్లిలో తన మీటింగ్ దగ్గరికి వచ్చి జెండాలు ఎగరేస్తారా? ఎంత కొవ్వు, ఎంత కండకావరం? అని చంద్రబాబు మండిపడ్డారు. తన ఇంటి గేటుకు తాళాలు వేసి, తాళ్లు కట్టారని, ఎయిర్‌పోర్టులోనూ అడ్డుకున్నారని, కోర్టు నిలదీస్తే డీజీపీ తలదించుకున్నారని తెలిపారు. మరోవైపు.. తన ఇంటికొచ్చిన రౌడీలకు ప్రమోషన్ ఇచ్చి మంత్రులు చేశారని ఆయన చెప్పారు. 40 ఏళ్లల్లో ఎందరినో చూశానని.. కరుడుకట్టిన నేరస్తుడు సీఎం అయ్యారంటే తప్పు వ్యవస్థదా, ప్రజాస్వామ్యానిదా? అని ప్రశ్నించారు. రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా పోరాడతామని ఆయన చెప్పారు. టీడీపీ వారికి ఏమైనా అయితే అది పోలీసుల హత్యేనన్నారు. కొట్టినా, కేసులు పెట్టినా భయపడేది లేదని, వెనక్కిపోయే సమస్యేలేదన్నారు. ప్రజలే ముందుకు రావాలి.. ఇక తనను కుప్పానికి రాకుండా కుట్రలు పన్నుతున్నారని.. తాను సంకల్పం చేస్తే ప్రాణాలను సైతం లెక్కచేయనని చంద్రబాబు అన్నారు. ప్రాణాలు, ఆస్తులు, మానాలు కాపాడుకోవాలంటే ప్రజలే ముందుకు రావాలని పిలుపునిచ్చారు. తమ వాళ్ల జోలికొస్తే వారి ఇంటికి వేల మందితో తాను వస్తానన్నారు. ధైర్యంగా ఉండండని, ప్రైవేటు కేసులు వేస్తామని పార్టీ శ్రేణులకు చంద్రబాబు భరోసా ఇచ్చారు. ఏ రోజు ఎవరిని కొడతారో తాడోపేడో తేల్చుకోవడానికే ఇక్కడకు వచ్చానని.. తాను పిలుపిస్తే కుప్పానికి రెండు లక్షల మంది వస్తారన్నారు. -
'ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు'
సాక్షి, తూర్పుగోదావరి : శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ప్రభుత్వ విప్, తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా హెచ్చరించారు. తునిలో శుక్రవారం జరిగిన ఆందోళనకారుల దాడిలో అన్నక్యాంటీన్ ద్వంసమైన సంగతి తెలిసిందే. చంద్రబాబు హయాంలో ఏర్పడ్డ అన్నక్యాంటీన్లు అవినీతిమయంగా మారాయని, టీడీపీకి చేందిన వారే క్యాంటీన్లను ద్వంసం చేసి దానిని ప్రభుత్వం మీదకు నెట్టివేస్తున్నారని ఆరోపించారు. -
‘నువ్వు తిన్న అవినీతి సొమ్ము కక్కిస్తాం’
సాక్షి, పశ్చిమ గోదావరి : రూ. 10 లక్షలు ఖర్చు అయ్యే అన్నా క్యాంటీన్ల వ్యయాన్ని రూ. 35 లక్షలకు పెంచి టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు దోచేశాడని రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం ప్రధాన కార్యదర్శి యడ్ల తాతాజీ ఆరోపించారు. ‘‘నువ్వ తిన్న అవినీతి సొమ్ము మొత్తాన్ని కక్కిస్తాం’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని విమర్శించే నైతిక అర్హత రామానాయుడుకు లేదంటూ మండిపడ్డారు. ఆరు నెలలు అన్నా క్యాంటీన్ డబ్బులు చెల్లించకుండా గత టీడీపీ ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు. -
రాష్ట్రంలో 183 అన్నాక్యాంటీన్లు ఉన్నాయి
-
టీడీపీ వాళ్లు ప్రచారానికి వాడుకున్నారు
-
అవును.. ఆయనేం పట్టించుకోరు..!
సాక్షి, సింగరాయకొండ (ప్రకాశం): ఎన్నికల సమయంలో కాలికి బలపం కట్టుకొని ఊరూరా తిరుగుతున్న ఎమ్మెల్యే స్వామి.. ఈ ఐదేళ్లలో ఆయన దగ్గరకు వచ్చిన ఏ సమస్యను పట్టించుకున్న దాఖలాలు లేవు. సమస్యను పరిష్కరించాలని ఆయన చుట్టూ ప్రదిక్షణలు చేసినా ఫలితం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితారామయ్య శ్రేష్టి సత్రంపై అంతులేని నిర్లక్ష్యం.. సింగరాయకొండలో అయితారామయ్య శ్రేష్టి అనే ఆర్యవైశ్యుడు యాత్రికుల కోసం పట్టణ నడిబొడ్డులో సుమారు 1.50 ఎకరా స్థలంలో సత్రం, వ్యాపార సముదాయాన్ని నిర్మించి వాటిపై వచ్చే ఆదాయంతో యాత్రికులకు వసతులు కల్పించే ఏర్పాటు చేశాడు. తరువాత ఈ సత్రం ఎండోమెంటు శాఖ పరమైంది. సత్రం స్థలంలో ఉన్న దుకాణదారులకు, ఎండోమెంట్ శాఖకు మధ్య అద్దె విషయంలో వివాదం చెలరేగింది. దీంతో ఎండోమెంట్ శాఖ 2013 ఏప్రిల్‌లో సత్రం స్థలంలోని వ్యాపార సముదాయాన్ని కూల్చేశారు. అప్పటివరకు వ్యాపార కూడలికి నిలయంగా మారిన ఆ సత్రం ప్రస్తుతం మల మూత్ర విసర్జనకు నిలయంగా మారింది. దీంతో ఏటా లక్షలాది రూపాయలను అద్దెల రూపంలో నష్టపోతున్నారు. ఈ సత్రం విషయమై న్యాయం చేయాలని ఆర్యవైశ్యులు కాళ్లు అరిగేటట్లు తిరగ్గా న్యాయం చేస్తానన్న ఎమ్మెల్యే ఐదేళ్లు కాలయాపన చేశారు. గతంలో ఈ సత్రం స్థలంలో 42 దుకాణాలు ఉండగా మరో 24 దుకాణాలకు 2013 సంవత్సరం వేలం పాటలు నిర్వహించారు. తరువాత వివాదం కారణంగా వేలంపాటలు రద్దయ్యాయి. సత్రం శిథిలావస్థకు చేరిందన్న నెపంతో అందులోని షాపులను దేవాదాయ శాఖ అధికారులు కూల్చేశారు. అయితే దుకాణదారులు 24 మంది తరువాత మాకు న్యాయం కావాలంటూ కోర్టును ఆశ్రయించారు. వీరికి న్యాయం చేస్తారన్న ఆశతో ఆర్యవైశ్యులు ఎమ్మెల్యే చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఐదేళ్లు గడిచినా ఎటువంటి ప్రయోజనం లేదు. పెరిగిన షాపుల బాడుగలు.. సత్రం స్థలంలోని వ్యాపారసముదాయాన్ని కూల్చేయడంతో గ్రామంలో షాపులకు డిమాండ్ ఏర్పడింది. దీంతో అప్పటి వరకు రూ.3 వేలు ఉన్న షాపుల అద్దెలు ఒక్కసారిగా రూ.8వేల నుంచి రూ.10 వేల వరకు పెరిగాయి. దీనికితోడు సత్రం స్థలం ఆక్రమణకు గురయ్యే ప్రమాదం ఉందన్న సాకుతో సుమారు 9 నెలల క్రితం సత్రం స్థలం చుట్టూ సుమారు రూ.30 వేల అంచనా వ్యయంతో దేవస్థాన అధికారులు ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేశారు. లక్షలాది రూపాయలు నష్టపోతున్న దేవాదాయశాఖ.. గ్రామ నడిబొడ్డున ఉన్న ఈ సత్రానికి ఒక పరిష్కారం చూపించి అందులో దుకాణాలు నిర్మిస్తే దేవాదాయశాఖకు ఇప్పటి వరకు షాపుకు సరాసరి 6 వేల రూపాయలు అద్దె వచ్చినా సుమారు రూ.2.60 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందని ప్రజలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ సత్రం స్థలంలో దుకాణాలు నిర్మించినట్లయితే అటు దేవాదాయశాఖకు ఇటు ప్రజలకు ఉపాధి లభించేదని, కానీ ప్రస్తుతం రెంటికి చెడ్డ రేవడిగా ఎవరికి ఉపయోగం లేకుండా నిరుపయోగంగా మారాయని ప్రజలు అటు దేవాదాయశాఖ, ఇటు నాయకుల పనితీరును విమర్శిస్తున్నారు. అడ్డగోలుగా అన్నా క్యాంటీన్ నిర్మాణం.. కందుకూరు రోడ్డు సెంటర్లో విలువైన స్థలాలను ఆర్యవైశ్యులు కొనుగోలు చేశారు. వారు తమ స్థలంలో షాపులు నిర్మించుకుంటున్నారు. ఈ స్థలం ముందు ఆర్‌అండ్‌బీకి చెందిన స్థలం ఉంది. ఈ స్థలంలో అన్నా క్యాంటీన్ నిర్మాణానికి శ్రీకారం చుట్టాడు. దీనిపై ఆర్యవైశ్యులు ఎంత వేడుకున్నా ప్రయోజనం లేదు. చివరికి ఎన్నికల తేది ప్రకటించడంతో తాత్కాలికంగా అన్నా క్యాంటిన్ నిర్మాణం ఆపేశారు. పార్కును కూల్చేశారు.. స్థానిక రైల్వేస్టేషన్ రోడ్డులో బాలికల ఉన్నత పాఠశాల వద్ద ఉన్న పంచాయతీ స్థలంలో శికాకొల్లు సుబ్బారావు అనే పారిశ్రామికవేత్త ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని పార్కును నిర్మించాడు. తరువాత ఈ పార్కును తొలగించి అందులో షాపులు నిర్మిద్దామని ఎమ్మెల్యే స్వామిపై పంచాయతీ అధికారులు ఒత్తిడి తెచ్చారు. కానీ మొదట్లో ససేమిరా అన్నాడు. తరువాత ఏమైందో ఏమో గానీ రోడ్ల అభివృద్ధి పేరుతో పార్కును తొలగించి ఆ స్థలంలో బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులకు సైకిల్ స్టాండు నిర్మించారు. ఈ పార్కు వల్ల బాటసారులకు ఉపయోగంగా ఉండటమే కాక పండగ సమయంలో ఆర్యవైశ్యులు ఉత్సవాలు నిర్వహించుకునేందుకు ఎంతో ఉపయోగంగా ఉండేది. మండలంలో రూర్బన్ నిధులతో లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి పార్కులు నిర్మిస్తుండగా ఈ విధంగా దాతల సహాయంతో నిర్మించిన పార్కును పడగొట్టడమేందని ప్రశ్నిస్తున్నారు. -
అన్నదానం కాదు..
సాక్షి, శ్రీకాకుళం : ఈ ఫొటోలో మీకు కన్పించేంది అన్నదాన కార్యక్రమమో.. శుభకార్యంలో ఏర్పాటు చేసిన భోజనాలు అనుకుంటే మనం పొరపడినట్లే. ఎన్నికలు సమీపించడంతో ప్రభుత్వం పలుచోట్ల అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసింది. అయితే అక్కడ ఎటువంటి సౌకర్యాలు కల్పించలేదు. శ్రీకాకుళం జిల్లాలోని పొందూరులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ పరిస్థితి ఇలా ఉంది. దీంతో తినడానికి వచ్చిన వారు ఇబ్బందులు పడుతున్నారు. -
రచ్చకెక్కిన టీడీపీ విభేదాలు
పశ్చిమగోదావరి , జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెంలో అన్న క్యాంటిన్ ప్రారంభోత్సవం కార్యక్రమం బుధవారం రసాభాసగా మారింది. స్థానిక వారపుసంత సమీపంలో నగర పంచాయతీ కార్యాలయ నూతన భవన సమీపంలో అన్నక్యాంటిన్ భవన నిర్మాణం చేపట్టినా ఇంకా పూర్తికాలేదు. అయితే ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల షెడ్యూల్ గురువారం వస్తుందని భావించిన టీడీపీ నేతలు హడావుడిగా అన్నక్యాంటిన్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు. పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల షెడ్యూల్, వెనువెంటనే సాధారణ ఎన్నికల షెడ్యూల్ వస్తుందని భావించిన నేతలు ఇక అన్న క్యాంటిన్ తమ హయాంలో ప్రారంభించే అవకాశం లేదని భవన నిర్మాణం పూర్తికాకపోయినా హడావుడిగా శిలాఫలకాన్ని ఏర్పాటుచేశారు. ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే పీతల సుజాత హాజరయ్యారు. అయితే శిలాఫలకంపై ఒక్క కౌన్సిలర్ పేరు మాత్రమే ఉండటంతో మిగిలిన టీడీపీ కౌన్సిలర్లు ఆగ్రహించి ప్రారంభోత్సవానికి ముందే శిలాఫలకాన్ని తొలగించారు. తమ పేర్లు లేకుండా అన్న క్యాంటిన్ ప్రారంభించేది లేదని భీష్మించారు. దీంతో ఎమ్మెల్యే సుజాత స్వపక్ష కౌన్సిలర్లను శాంతింపచేసే ప్రయత్నాలు చేశారు. చివరకు కౌన్సిలర్లు పెకిలించిన శిలాఫలకాన్ని యుద్ధప్రాతిపదికన పునరుద్ధరింపచేసి రాత్రి సమయంలో హడావుడిగా ప్రారంభోత్సవం చేసేశారు. -
‘అన్నా’ ఇదేం క్యాంటీన్?
తూర్పుగోదావరి , కొత్తపల్లి (పిఠాపురం): ప్రభుత్వ స్థలానికి బదులు పేదలకు కేటాయించిన స్థలంలో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసేందుకు అధికారులు చేసిన ప్రయత్నం ఉప్పాడలో ఉద్రిక్తతకు దారి తీసింది. ఉప్పాడలోని చంద్రబాబు ఫిషర్మెన్ కమిటీ భవనం వద్ద ఎరిపల్లి తాతారావు, ఎరిపల్లి లక్ష్మణరావు, ఎరిపల్లి రాంబాబులకు 2002 జనవరి 8న ఒక్కొక్కరికి మూడు సెంట్ల చొప్పున రెవెన్యూ అధికారులు పట్టాలు మంజూరు చేశారు. ఈ స్థలంలో అన్న క్యాంటీన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు అధికారులు ఆదివారం ప్రయత్నించారు. వారిని పట్టాదారులు అడ్డుకున్నారు. ఒక దశలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడంతో పోలీసులు ఆందోళన చేస్తున్నవారిని చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. పోలీసులు, అధికారుల తీరును నిరసిస్తూ గ్రామ మాజీ సర్పంచ్, లబ్ధిదారుల తల్లి అప్పలకొండ కుటుంబ సభ్యులతో కలిసి కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకొనేందుకు ప్రయత్నించింది. వారికి వైఎస్సార్ కాంగ్రెస్, జనసేన నాయకులు, కార్యకర్తలు మద్దతు పలికారు. ప్రభుత్వానికి, ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి రావు చిన్నారావు మాట్లాడుతూ, ప్రైవేటు స్థలంలో అన్న క్యాంటీన్ ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. పంచాయతీలోని ప్రధాన కూడళ్లలో ప్రభుత్వ స్థలాలుండగా, పట్టాలిచ్చిన స్థలంలో నిర్మాణం చేపట్టేందుకు ప్రయత్నించడం అధికార పార్టీ అహంకారానికి నిదర్శనమని అన్నారు. ఇప్పటికైనా అధికార పార్టీ తన ప్రయత్నాలు మానుకోవాలన్నారు. పట్టాదారులకు అన్యాయం చేస్తే సహించేది లేదన్నారు. బాధితులకు మద్దతు తెలిపిన వారిలో వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు ఆనాల సుదర్శన్, ఎంపీటీసీ సభ్యులు తోటకూర మారెమ్మ, ఉమ్మిడి జాన్, తొమ్మండ్ర సురేష్, సీహెచ్ ప్రసాద్, జనసేన నాయకులు తెలగంశెట్టి వెంకటేశ్వరరావు, శేషుకుమారి తదితరులున్నారు. -
ఏపీ అధికారుల అత్యుత్సాహం..!!
సాక్షి, వైఎస్సార్ కడప : అధికార పార్టీ అండతో ఏపీ ప్రభుత్వాధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ప్రొద్దుటూరు బస్టాండ్‌లోని దుకాణాలను కూల్చి అన్నా క్యాంటీన్ నిర్మించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. కాగా, ప్రొద్దుటూరు బస్టాండ్‌లో అన్నా క్యాంటీన్ నిర్మాణం చేపట్టొద్దంటూ మున్సిపల్ కౌన్సిల్ గతంలోనే తీర్మానం చేసింది. దుకాణాలు కూల్చి క్యాంటీన్ నిర్మించడంపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఈ విషయంపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆందోళన కూడా చేపట్టారు. దీంతో క్యాంటీన్ నిర్మాణంపై వెనక్కి తగ్గిన అధికారులు టీడీపీ నేతల ఒత్తిడితో మరోమారు క్యాంటీన్ నిర్మించేందుకు సమాయత్తం కావడం చర్చనీయాంశమైంది. -
అన్నా క్యాంటీన్లో వ్యభిచార బాగోతం!
సాక్షి, హిందూపురం : అనంతపురం జిల్లా హిందూపురంలోని అన్నా క్యాంటీన్లో వ్యభిచార బాగోతం బట్టబయలు అయ్యింది. హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న అన్నా క్యాంటీన్లో రాత్రి వేళల్లో వ్యభిచారం జరుగుతోందన్న ఆరోపణలు చాలా రోజుల నుంచి వినిపిస్తున్నాయి. కాగా శనివారం రాత్రి వాచ్మెన్ జయరాం ఓ మహిళతో రాసలీలలు జరుపుతుండగా స్థానికులు పట్టుకున్నారు. అనంతరం మీడియాకు సమాచారమిచ్చారు. అన్నా క్యాంటీన్ మేనేజర్ కృష్ణా, వాచ్మెన్ జయరాంలను మీడియా ప్రతినిధులు నిలదీయటంతో వారు పొంతనలేని సమాధానాలు ఇవ్వటం పలు అనుమానాలకు తావిస్తోంది. చివరకు పోలీసులకు సమాచారం ఇచ్చినా కనీసం విచారించకుండానే అందర్నీ వదిలేయటం చర్చనీయాంశంగా మారింది. -
నిమ్మల X అంగర
సాక్షి ప్రతినిధి,పశ్చిమగోదావరి, ఏలూరు: పాలకొల్లు తెలుగుదేశం పార్టీలో విభేదాలు రోడ్డెక్కాయి. పార్టీ సీనియర్ నేత తొండెపు దశరథ జనార్దన్ సాక్షిగా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ అంగర రామమోహనరావు బూతులు తిట్టుకున్నారు. నీ బతుకు నాకు తెల్సంటే... నీ బతుకు నాకు తెల్స ని దూషించుకున్నారు. నీ సొంత ఊర్లో వంద ఓట్లు కూడా వేయించలేవు. నీకు రెండోసారి ఎమ్మెల్సీ ఇవ్వడమే దండుగ అంటూ ఎమ్మెల్సీ అంగర రామమోహనరావుపై నిమ్మల రామానాయుడు విరుచుకుపడ్డారు. ఈ వివాదానికి పాలకొల్లులోని అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవం వేదికగా మారింది. దీంతో టీడీ జనార్ధన్ ఇరువురిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్న విషయానికి రోడ్డెక్కడం ఏంటని, రేపు మాట్లాడుకుందామని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. వివరాల్లోకి వెళ్తే... పాలకొల్లు పట్టణంలో శుక్రవారం సాయంత్రంఅన్న క్యాంటీన్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా టీడీపీ ఎమ్మెల్సీ, పార్టీ సీనియర్ నేత టి.డి జనార్ధన్ హాజరయ్యారు. ముందుగా క్యాంటీన్ వద్ద రోడ్డుపై సమావేశం ఏర్పాటుచేశారు. సమావేశం అనంతరం టి.డి జనార్ధన్ వెళ్లి పోతుండగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఆయన్ను సాగనంపేందుకు కూడా వెళ్లారు. జనార్ధన్ కారు ఎక్కుతుండగా ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ వెళ్లి పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడిపై ఫిర్యాదు చేశారు. పాలకొల్లులో తాను కట్టించిన ఫ్లెక్సీలను తీయించి వేశారని, ఇదేం పద్ధతని చెబుతుండగా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు జోక్యం చేసుకోవడంతో ఇరువురి మధ్య వివాదం ముదిరింది. తాను ముందు నుంచి పార్టీలో ఉంటున్నానని అంగర చెబుతుండగా అయితే ఏంటి నేను ఇక్కడ ఎమ్మెల్యేని అని నిమ్మల సమాధానం ఇచ్చారు. దీంతో నీ బతుకు నాకు తెలుసు, నీ అంత బోకు లేడంటూ ఒకరిపై మరొకరు అసభ్య పదజాలంతో దూషించుకున్నారు. ఎమ్మెల్యే నియోజకవర్గంలో వందల కోట్లు అవినీతి చేశాడని ఎమ్మెల్సీ అంగర ఆరోపించగా, గత ఎన్నికల్లో నువ్వు ఎవరికి పనిచేశావో తెలుసులే, నీ సొంత ఊర్లో వంద ఓట్లు వేయించడం చేతకాలేదంటూ ఎమ్మెల్యే ప్రత్యారోపణ చేశారు. ఒకదశలో అసభ్య పదజాలంతో దూషించుకోవడంతో జనార్ధన్ జోక్యం చేసుకుని ఇరువురిపై ఆగ్రహం వ్యక్తం చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఫ్లెక్సీల తొలగింపే కారణం అధికార పార్టీలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మధ్య వివాదానికి ఫ్లెక్సీల తొలగింపు కారణంగా మారిందని సమాచారం. ప్రచారానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే ప్రజాప్రతినిధుల్లో జిల్లాలో నిమ్మలదే పైచేయి. బీసీ నాయకుడిగా, వరుసగా జిల్లాలో రెండవసారి ఎమ్మెల్సీ అయిన అంగర రామమోహన్ వివాదరహితునిగా ఉంటారు. టీడీ జనార్ధన్ పాలకొల్లు వస్తున్న సందర్భంగా ఎమ్మెల్సీ అంగర పట్టణంలో మండల పరిషత్ కార్యాలయం వద్ద, లాకు సెంటర్ వద్ద రెండు భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మున్సిపల్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసి దగ్గరుండి అ రెండు ఫ్లెక్సీలను ఎమ్మెల్యే నిమ్మల తొలగించారని అంగర వర్గం ఆరోపిస్తోంది. వివాదాలకు దూరంగా ఉండే ఎమ్మెల్సీ అంగర తాను ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించడంపై ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. ఎమ్మెల్యే తీరుతో విసుగు చెందిన ఎమ్మెల్సీ అన్న క్యాంటీన్ సమావేశం తర్వాత తన ఆవేశాన్ని, ఆవేదనను వెళ్లగక్కారు. ఈ సమావేశంలో కూడా ఆయన అసహనంగా, అంటీముట్టనట్లుగా వ్యవహరించారు. -
అన్న క్యాంటీన్లో...భోజనం ఇంతేనా!
విజయనగరం రూరల్: తెలుగుదేశం ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన అన్న క్యాంటీన్ పథకంలో ప్రజలకు చాలీచాలని భోజనం వడ్డిస్తున్నారు. కార్మికులు, రోజూ కూలీలు, పట్టణాలకు వివిధ అవసరాల మీద వచ్చే ప్రజలు ఈ క్యాంటీన్లలో భోజనం చేద్దామని వెళ్తే కడుపు నింపని భోజనంతో పథక నిర్వహణపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రూ. 5లకే భోజనం అందిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వ పెద్దలు వారి ఇంట్లో సొమ్ము ఏమైనా తీసుకువచ్చి పెడుతున్నారా? అని ప్రజలు మండిపడుతున్నారు. కడుపు నింపని భోజనం పెట్టే బదులు పూర్తిగా పెట్టకుండా ఉంటే బాగుంటుందని పేర్కొంటున్నారు. విజయనగరం పట్టణంలో నెల రోజుల కిందట అన్న క్యాంటీన్లు ప్రారంభించారు. పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా, మున్సిపల్ కార్యాలయం సమీపం ప్రకాశం పార్కు వద్ద వీటిని నిర్వహిస్తున్నారు. ఘోషా ఆసుపత్రి వద్ద మరో క్యాంటీన్ ప్రారంభించాల్సి ఉంది. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనం వడ్డించాల్సి ఉంటుంది. మధ్యాహ్నం, రాత్రి భోజనంలో నాలుగు వందల గ్రాముల భోజనం వడ్డీంచాల్సి ఉండగా అతి తక్కువుగా వడ్డిస్తున్నారని ప్రజలు పేర్కొంటున్నారు. పెరుగు 75 గ్రాములు అందించాల్సి ఉండగా మజ్జిగకు ఎక్కువ, పెరుగుకు తక్కువుగా ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా చాలీచాలని అన్నం పెట్టి అర్థాకలితో సరిపెట్టేస్తున్నారని కార్మికులు, ప్రజలు పేర్కొంటున్నారు. ఉదయం అంతా పనిచేసుకుని వచ్చి కప్పు అన్నం ఏమి సరిపోతుందని ప్రశ్నిస్తే మీరిచ్చే రూ.5లకు అదే ఎక్కువని సిబ్బంది కసురుకుంటున్నారని వారు వాపోతున్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఏదో చేసేస్తున్నామన్న ప్రచారం కోసమే క్యాంటీన్లు నిర్వహిస్తున్నారని ప్రజలు ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. ప్రజల సొమ్ముతో నిర్వహించే పథకానికి కడుపునిండా అన్నం పెట్టకపోతే ఎందుకని వారు ప్రశ్నిస్తున్నారు. చాలీచాలని భోజనానికి గంటల తరబడి వరుస నిలబడాల్సి వస్తుందని పేద, కార్మికులు పేర్కొంటున్నారు. నేలపైనే భోజనాలు రోజుకు కేవలం మూడు వందల మందికే భోజనాలు అందించే అన్న క్యాంటీన్లు వద్ద భోజనం చేసేందుకు సరిపడా కుర్చీలు, బల్లలు లేకపోవడంతో భోజనం చేసేవారు నేలపై అపరిశుభ్ర వాతావరణంలో భోజనాలు చేస్తున్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న అన్న క్యాంటీన్ వద్ద ఆరుబయట స్థలం ఎక్కువుగా బెంచీలు ఏర్పాటు చేసుంటే బాగుంటుందని పేర్కొంటున్నారు. -
అన్న క్యాంటీన్లో అరకొర భోజనం
కర్నూలు (టౌన్): ఐదు రూపాయలకే కడుపు నిండా నాణ్యమైన భోజనం అందిస్తామంటూ టీడీపీ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రవేశపెట్టిన అన్న క్యాంటీన్లు అందరి ఆకలి తీర్చడం లేదు. అసలు భోజనం టోకెన్ పట్టాలంటేనే గంటకుపైగా నిరీక్షించాల్సిన పరిస్థితి. అప్పటికీ అందరికీ టోకెన్లు ఇస్తారన్న గ్యారంటీ లేదు. దీంతో చాలా మంది క్యూలో నిల్చొని కూడా టోకెన్ అందక వెనక్కు వెళ్తున్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు టీడీపీ ప్రభుత్వం అన్న క్యాంటీన్లు ప్రారంభించింది. అధికారం చేపట్టిన తర్వాత నాలుగేళ్లు పట్టించుకోకుండా ఉండి ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఎట్టకేలకు పథకాన్ని పట్టాలెక్కించింది. అయితే డిమాండ్ మేరకు కాకుండా ప్రచారం కోసమే అన్నట్లు కొనసాగిస్తుండడం గమనార్హం. అందరికీ కాకుండా కొద్ది మందికి మాత్రమే టోకెన్లు ఇచ్చి మిగతా వారిని వెనక్కు పంపుతున్నారు. దీంతో అందరికీ కడుపు నిండా భోజనం అంటే ఇదేనా అని జనం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎనిమిది అన్నారు.. నాల్గింటితో సరిపెట్టారు.. కర్నూలు మున్సిపాల్టీకి 8 అన్న క్యాంటీన్లు మంజూరు చేసిన ప్రభుత్వం నాల్గింటిని మాత్రమే గత జూన్‌లో ప్రారంభించింది. ఉల్చాల రోడ్డు, కల్లూరు ఇండస్ట్రియల్ ఏరియా, పాతబస్టాండ్, కలెక్టరేట్ వద్ద క్యాంటీన్లు నడుస్తున్నాయి. తక్కువ ధరకే భోజనం కావడంతో తినేందుకు జనం క్యూ కడుతున్నా నిర్వాహకులు కొందరికి మాత్రమే టోకెన్లు ఇచ్చి అయిపోయాయంటూ వెనక్కు పంపుతుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టోకెన్లు ఇచ్చిన వారికి కూడా మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని తెలుస్తోంది. టిఫిన్‌కు ఇడ్లి తప్ప ఏమీ ఉండడం లేదు. మూడొందల మందికే టోకెన్లు.. అన్న క్యాంటీన్లలో డిమాండ్‌కు తగ్గట్టు టిఫిన్ కానీ, భోజనం కాని అందడం లేదనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. పాతబస్టాండ్, కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన క్యాంటీన్లకు పేదల నుంచి డిమాండ్ అధికంగా ఉంది. అందరికీ టోకన్లు అందుతాయన్న గ్యారంటీ లేకపోవడంతో పేదలు గంట ముందే వచ్చి క్యూ కడుతున్నారు. అయితే క్యూలైన్లో నిలిచి ఉన్నా అందరికీ టోకెన్లు రావడం లేదు. దీంతో గంటలకొద్ది క్యూలో నిల్చున్న వారు చివరకు టోకెన్ అందక వెనక్కు వెళ్తుండడం గమనార్హం. అన్నం చాల్లేదు.. బంధువులు ఆసుపత్రిలో ఉంటే చూసేందుకు వచ్చిన. మధ్యాహ్నం రూ.5 ఇచ్చి భోజనం చేసిన. అన్నం తక్కువగా పెట్టడంతో కడుపు నిండలేదు. –సరోజమ్మ, బుధవారపేట గంటకు పైగా నిల్చున్నా.. కలెక్టరేట్లో పని ఉండి వచ్చిన. రూ. 5కే భోజనం పెడతారంటే మధ్యాహ్నం 12 గంటల నుంచి క్యూలో నిల్చున్న. టోకెన్ తీసుకుని కూర్చుంటే కొంచెం అన్నం, కొంచెం పప్పు, అరస్పూన్ చట్నీ, కూరగాయ ఇస్తున్నారు. రెండు టోకెన్లు ఇస్తే కానీ అన్నం కడుపు నిండదు. – రాముడు, ఎమ్మిగనూరు టోకెన్లు ఇవ్వడం ఆలస్యమవుతోంది.. ప్రతి ఒక్కరినీ కంప్యూటర్లో ఫొటో తీసి టోకెన్ ఇస్తున్నారు. దీంతో ఆలస్యమవుతోంది. మధ్యాహ్నం గంటకు పైగా క్యూలో ఉండాల్సి వస్తోంది. వృద్ధులు, మహిళలు అంతసేపు నిల్చోలేకపోతున్నారు. మరొకరిని నియమించి టోకెన్లు త్వరగా ఇస్తే పడిగాపులు కాయాల్సిన అవసరం ఉండదు. –నాగరాజు, నందికొట్కూరు -
టోపీ ఉంటే టోకెన్ ఇవ్వం
నరసరావుపేట టౌన్: ‘నారా హమారా–టీడీపీ హమారా’ పేరుతో ఎన్నికల వేళ ఓట్ల కోసం సభలు నిర్వహిస్తున్న చంద్రబాబు సర్కారు నిజ స్వరూపం తేటతెల్లమైంది. ఆయన పాలనలో ముస్లింలు ఎదుర్కొంటున్న వివక్ష మరోసారి బయటపడింది. నమాజ్ చేసే టోపీ ధరిస్తే అన్న క్యాంటీన్లో భోజనం పెట్టబోమంటూ వృద్ధుడైన ఓ నిరుపేద ముస్లింను గెంటివేయడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఐదు పూటలా నమాజ్ చేస్తానన్న గాలిబ్.. గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం పెదతురకపాలెం గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త గాలిబ్‌సాహెబ్ రెండు రోజుల క్రితం భోజనం చేసేందుకు సత్తెనపల్లి రోడ్డులోని కోడెల స్టేడియం వద్ద ఉన్న అన్నక్యాంటీన్కు వెళ్లాడు. టోకెన్ కోసం క్యూలో నిలబడగా తలపై ఉన్న టోపీని తొలగించాలని కౌంటర్లో ఉన్న సిబ్బంది పేర్కొన్నారు. గాలిబ్‌సాహెబ్ ఇందుకు నిరాకరిస్తూ తాను నిత్యం అల్లాను స్మరిస్తూ ఐదు పూటలా నమాజ్ చేస్తానని, టోపీ తీయడం సరికాదని బదులిచ్చాడు. సెల్ నంబరు చెప్పాలని సిబ్బంది సూచించగా తాను 70 ఏళ్ల వయసులో రోజువారీ కూలీకి అరటికాయల వ్యాపారం చేస్తుంటానని, తనకు సెల్ లేదని, అది ఎలా వాడాలో కూడా తెలియదని తెలిపాడు. అయితే భోజనం టోకెన్ ఇచ్చేది లేదంటూ బయటకు వెళ్లాలని క్యాంటీన్ నిర్వాహకులు ఆయన్ను ఆదేశించారు. తాను 1983 నుంచి టీడీపీ కార్యకర్తనని, ప్రభుత్వం పేదల కోసం అన్న క్యాంటీన్ నిర్వహిస్తుంటే భోజనం పెట్టకుండా ఇబ్బంది పెట్టడం ఏమిటంటూ గాలిబ్ సాహెబ్ అభ్యంతరం తెలపడంతో సెక్యూరిటీ గార్డును పిలిచి బలవంతంగా గెంటేశారు. గాలిబ్‌సాహెబ్ తనకు జరిగిన ఈ అవమానం గురించి విలేకరులకు చెప్పి ఆవేదన వ్యక్తం చేశారు.