
నవంబర్ లో అన్నా క్యాంటీన్లు ప్రారంభం
హైదరాబాద్:నవంబర్ లో అన్నా క్యాంటీన్లు ప్రారంభించనున్నట్లు మంత్రి పి.నారాయణ స్పష్టం చేశారు. ఈ అన్నా క్యాంటీన్లలో ఒక రూపాయికే సాంబారు ఇడ్లీ సరఫరా చేస్తామన్నారు. ఐదు రూపాయలకే లెమన్, పెరుగు, సాంబారు రైస్ ను సరఫరా చేస్తామన్నారు. అంతేకాకుండా మరో ఐదు రూపాయలకే రెండు చపాతీలను సరఫరా చేస్తామన్నారు. అక్టోబర్ 2 వ తేదీన 222 ఎన్టీఆర్ సుజల ప్లాంట్లను మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేస్తామన్నారు. వారం రోజుల్లో అన్ని మున్సిపాలిటీల్లో ఆన్ లైన్ ప్రజా ఫిర్యాదుల విభాగం ఏర్పాటు చేస్తామన్నారు.
ఇందులో ప్రజల అవసరాలు ఏమున్నా ఫోటో తీసి ఆన్ లైన్ లో ఫిర్యాదు చేయవచ్చన్నారు. వాటిని పరిష్కరించి తిరిగి ప్రజలకు ఫోటో పంపిస్తామన్నారు. పట్టణాభివృద్ధి మిషన్ ను నూటికి నూరుశాతం అమలు చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు.