అపరిశుభ్రమైన నీటితో ప్లేట్లు కడుగుతున్న వైనం!
వీడియో వైరల్
స్పందించిన మంత్రి నారా లోకేష్
పశ్చిమ గోదావరి, సాక్షి: తణుకులోని అన్న క్యాంటీన్‌లో అపరిశుభ్రమైన నీటితో తినేసిన ప్లేట్లు కడుగుతున్నట్లు ఓ వీడియో నిన్నటి నుంచి వైరల్ అవుతోంది. స్థానిక సొసైటీ రోడ్డులోని అన్న క్యాంటీన్‌లో ఈ ఘటన జరిగింది. ఈ నెల 19న జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఒక వ్యక్తి తన సెల్‌ఫోన్ ద్వారా వీడియో తీసినట్లు తెలుస్తోంది.
అన్న క్యాంటీన్‌లో పేదలు ఉదయం టిఫిన్ తిన్న ప్లేట్లను వాష్ బేసిన్‌లో వేసి పూర్తి అపరిశుభ్రంగా ఉన్న నీటిలో కడుగుతున్న విషయం ఆ వీడియోలో ఉంది. తినేసిన ప్లేట్లను చేతులు కడుక్కునే వాష్ బేసిన్‌లో.. నిల్వ ఉన్న మురికి నీటిలో ఉంచి శుభ్రం చేస్తున్న విషయం ఆ వీడియోను చూస్తే అర్థమవుతోంది.
#***Rs 5/- Anna Canteen in Tanuku***#
This is how the KGF Taliban government treats poor People. Dirty water is used to clean the plates . YEllow goons can go now from HYD to check the quality of food ! @India_NHRC #AndhraPradesh #AnnaCanteen pic.twitter.com/gT9aF5b5uL— Howdy @ Murali Reddy ! ( Jagan కుటుంబం) (@Muralipmr) August 26, 2024
పేదలు తింటున్న అన్నం ప్లేట్లు ఎలా కడిగినా.. ఎవరు చూస్తారులే అనుకుంటూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై మున్సిపల్ కమిషనర్ బీవీ రమణను వివరణ కోరగా తినేసిన ప్లేట్లు సాధారణంగా వాష్ బేసిన్‌లో వేస్తుంటారని, అయితే ఆ రోజు ఒకేసారి తాకిడి రావడంతో మిగిలిన వ్యర్థాలు వాష్ బేసిన్‌లో ఉండిపోవడం వల్ల నీరు నిలిచిపోయి ఉండొచ్చని అన్నారు. అక్కడి నుంచి ప్లేట్లు తీసి వేరే చోట కడుగుతారని చెప్పారాయన.
లోకేష్ స్పందన
ఇక తణుకు అన్న క్యాంటీన్ వీడియో వైరల్ కావడంపై ఎక్స్ వేదికగా మంత్రి నారా లోకేష్ స్పందించారు. అది తప్పుడు ప్రచారమని, ఉద్దేశపూర్వకంగా చేసి ఉంటారని ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment