![Gas Cylinder Blast In Anna Canteen At Kadapa](/styles/webp/s3/article_images/2024/10/30/Anna-Cantene.jpg.webp?itok=b5eR0BjW)
సాక్షి, వైఎస్సార్: అన్నా క్యాంటీన్ తయారీ వంటశాలలో భారీ పేలుడు ఘటన సంభవించింది. పేలుడు థాటికి వంటశాల షెడ్ పూర్తిగా ధ్వంసమైంది. భారీ పేలుడుతో కార్మికులు, సిబ్బంది ఉలిక్కిపడ్డారు. అయితే, పేలుడు ఘటన బయటకు రాకుండా పచ్చ మీడియా కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తోంది.
వివరాల ప్రకారం.. కడపలో అన్నా క్యాంటీన్ తయారీ వంటశాలలో భారీ పేలుడు ఘటన చోటుచేసుకుంది. మార్కెట్ యార్డు సమీపంలోని అన్నా క్యాంటీన్ వంటశాలలో బుధవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో పేలుడు సంభవించింది. వంట గదిలో గ్యాస్ లీక్ కావడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో పేలుడు థాటికి వంటశాల షెడ్ ధ్వంసమైంది. 200 అడుగుల మేరా ఎగిరిపడ్డ బాయిలర్, వస్తువులు చెల్లాచెదురుగా పడిపోయాయి.
పేలుడు రాత్రి సమయంలో సంభవించడంతో ప్రాణ నష్టం తప్పింది. వంటలు వండకపోవడం.. సిబ్బంది బాయిలర్ వద్ద లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇక, భారీ పేలుడుతో కార్మికులు, సిబ్బంది ఉలిక్కిపడ్డారు. పేలుడు ఘటనను ఎవరి కంట పడకుండా పచ్చ నేతలు కప్పి ఫుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, సిబ్బంది నిర్లక్ష్యంగా కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు.
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/29_11.png)
Comments
Please login to add a commentAdd a comment