P. Narayana
-
ప్రభుత్వ భూములూ మింగేశారు!
సాక్షి, అమరావతి: మాజీ సీఎం చంద్రబాబు అమరావతిలో సాగించిన భూదోపిడీలో తవ్వుతున్న కొద్దీ కొత్త అక్రమాలు గుట్టలు గుట్టలుగా బయట పడుతున్నాయి. అసైన్డ్ భూములే కాకుండా ప్రభుత్వ భూములనూ వదల్లేదు. చంద్రబాబు, పి.నారాయణ, లోకేశ్ త్రయం బినామీల పేరిట కొల్లగొట్టిన భూముల జాబితా చాంతాడులా సాగుతోంది. అసైన్డ్ రైతులకు ఎలాంటి పరిహారం ఇవ్వకుండానే వారి భూములను రాజధాని కోసం టీడీపీ సర్కారు తీసుకుంటుందని బెదిరించి రూ.3,370 కోట్ల విలువైన 617 ఎకరాలను కొల్లగొట్టిన కుంభకోణాన్ని ‘సాక్షి’ ఇప్పటికే బట్టబయలు చేయడం తెలిసిందే. అయితే అసైన్డ్ రైతులే కాకుండా అమరావతిలోని ప్రభుత్వ భూములను సైతం తమ బినామీల పేరిట నమోదు చేసి చంద్రబాబు బృందం భూదోపిడీకి పాల్పడటం ‘సాక్షి’ పరిశోధనలో వెలుగులోకి వచ్చింది. ఏకంగా 328 ఎకరాల ప్రభుత్వ భూమిని 522 మంది బినామీల పేరిట హస్తగతం చేసుకున్నారు. అనంతరం భూ సమీకరణ ప్యాకేజీ కింద రూ.760.25 కోట్లను కాజేశారు. చంద్రబాబు, నారాయణ, లోకేశ్ అసైన్డ్ భూ దోపిడీలో ఆ అవినీతి పర్వం ఇదిగో ఇలా ఉంది.... రెండు కేటగిరీలుగా వర్గీకరించి.. రాజధాని పేరుతో అమరావతి పరిధిలో సర్వే చేయించిన చంద్రబాబు, నారాయణ దృష్టి ఆ ప్రాంతంలోని ప్రభుత్వ భూములపై పడింది. అసైన్డ్ భూములను 1 నుంచి 4 కేటగిరీల కింద విభజించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతులను బెదిరించి తీసుకోగా ఎవరి ఆధీనంలోనూ లేని ప్రభుత్వ భూములను దక్కించుకునేందుకు మరో పన్నాగం పన్నారు. ఆ ప్రభుత్వ భూములన్నీ గుర్తు తెలియని రైతుల ఆధీనంలో ఉన్నట్లు రికార్డుల్లో చూపించారు. వాటిని అసైన్డ్ భూముల జాబితాలో 5, 6 కేటగిరీల కింద పేర్కొన్నారు. అన్యాక్రాంతమైనప్పటికీ అభ్యంతరాలు లేని భూములను కేటగిరీ 5 కింద, అన్యాక్రాంతమై అభ్యంతరాలున్న భూములను కేటగిరీ 6 కింద చూపిస్తూ జీవో 41 జారీ చేశారు. ఆ భూములకు భూసమీకరణ ప్యాకేజీని ప్రకటించారు. కేటగిరీ 5 కింద భూములకు 500 చ.గజాల నివాస స్థలం, 100 చ.గజాల వాణిజ్య స్థలాన్ని ప్యాకేజీగా పేర్కొన్నారు. కేటగిరీ 6 కింద భూములకు 260 చ.గజాల నివాస స్థలాన్ని ప్యాకేజీగా ఇస్తామని ప్రకటించారు. అంతేకాదు ఎకరా కంటే తక్కువ ఉన్న భూములకు కూడా కనీసం ఎకరా ప్యాకేజీ వర్తిస్తుందని జీవోలో పేర్కొన్నారు. 328 ఎకరాలు... రూ.760.25 కోట్ల ప్యాకేజీ అనంతరం అసలు కథను తెరపైకి తెచ్చారు. అమరావతి పరిధిలో కేటగిరీ 5 కింద 237.60 ఎకరాలను గుర్తించారు. ఆ భూములన్నీ 295 మంది ఆధీనంలో ఉన్నట్టుగా చూపించారు. ఇక కేటగిరీ 6 కింద 90.52 ఎకరాలను చూపించారు. ఆ భూములు 227 మంది స్వాధీనంలో ఉన్నట్టుగా కనికట్టు చేశారు. వాస్తవానికి ఆ రెండు కేటగిరీల భూములు ఎవరి ఆధీనంలోనూ లేవు. కానీ ఆ భూములు 522 మంది తమ బినామీల ఆధీనంలో ఉన్నట్టుగా చూపించి భూసమీకరణ ప్యాకేజీని కొల్లగొట్టారు. అమరావతిలో ప్యాకేజీ ప్రకటించే నాటికి నివాస స్థలం చ.గజం రూ.30 వేలు, వాణిజ్య స్థలం చ.గజం రూ.50 వేలు చొప్పున మార్కెట్ ధర పలికింది. అమరావతి నిర్మాణం పూర్తయితే మార్కెట్ ధర మరింత పెరుగుతుంది. అప్పటి ధరనే తీసుకుంటే కేటగిరీ 5 కింద ఒక్కొక్కరికీ రూ.1.50 కోట్ల విలువైన నివాస స్థలం, రూ.50 లక్షలు విలువైన వాణిజ్య స్థలం వెరసి రూ.2 కోట్లు చొప్పున ప్యాకేజీ దక్కింది. ఆ ప్రకారం కేటగిరీ 5 కింద ఉన్న 295 మంది రూ.590 కోట్ల విలువైన స్థలాలను పొందారు. కేటగిరీ 6 కింద ఒక్కొక్కరికీ రూ.75 లక్షలు విలువైన నివాస స్థలం ఇచ్చారు. ఆ ప్రకారం 227 మందికి రూ.170.25 కోట్ల విలువైన స్థలాలు దక్కాయి. మొత్తం మీద కేటగిరీ 5, 6లలో రైతులుగా చూపించిన తమ బినామీలు 522 మంది ముసుగులో చంద్రబాబు, నారాయణ రూ.760.25 కోట్ల విలువైన స్థలాలను కొల్లగొట్టినట్లు స్పష్టమైంది. ఆ గ్రామాల్లో ఒక్కరూ లేరు అమరావతి భూదోపిడీపై దర్యాప్తు జరుపుతున్న సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) దర్యాప్తులో అసైన్డ్ భూకుంభకోణం ఆధారాలతో సహా వెలుగులోకి వచ్చింది. రెవెన్యూ కార్యాలయాల్లో ఉన్న భూముల రికార్డులు, సీఆర్డీయే భూసమీకరణ ప్యాకేజీ ప్రకటించిన రైతుల జాబితాలను సిట్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కేటగిరీ 5, 6లలో చూపించిన 522 మంది రైతుల్లో ఒక్కరు కూడా అమరావతి గ్రామాల్లోనే లేకపోవడం విస్మయం కలిగిస్తోంది. అంటే ప్రభుత్వ భూములను ఆక్రమించిన రైతులెవరూ లేరు. భూసమీకరణ ప్యాకేజీ కింద రాజధానిలో అత్యంత విలువైన స్థలాలను కాజేసేందుకే చంద్రబాబు ముఠా ఈ పన్నాగానికి పాల్పడిందన్నది ఆధారాలతోసహా నిర్ధారణ అయ్యింది. -
'3 నెలల్లో భూ సమీకరణ పూర్తిచేస్తాం'
మచిలీపట్నం: పోర్టులు, టూరిజం ద్వారానే సింగపూర్ అభివృద్ధి చెందిందని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి పి.నారాయణ అన్నారు. మచిలీపట్నం కలెక్టరేట్లో మచిలీపట్నం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (ఎంఏడీఏ) కార్యాలయాన్ని శనివారం మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణరావుతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి నారాయణ మాట్లాడుతూ రాజధాని అమరావతి తరహాలోనే మచిలీపట్నంలో పోర్టు, పారిశ్రామిక కారిడార్ కోసం 33,177 ఎకరాల భూమిని సమీకరించనున్నట్లు చెప్పారు. మూడు నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. ఎంఏడీఏ కార్యాలయం ప్రారంభించిన రోజే భూసమీకరణ 1370 ఎకరాలను రైతులను ప్రభుత్వానికి అప్పగించడం అభినందనీయమన్నారు. రాష్ట్రంలో 14 పోర్టులను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు. మొదటి ప్రాధాన్యత మచిలీపట్నం పోర్టుకు ఇస్తున్నారన్నారు. సింగపూర్ 720 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోనే ఉందన్నారు. పోర్టుల ద్వారా సరుకులు ఎగుమతులు, దిగుమతులు చేస్తూ అభివృద్ధి చెందిన దేశంగా పేరొందిందన్నారు. జపాన్ జనభా 13 కోట్లు ఉండగా అక్కడ 1020 పోర్టులు ఉన్నాయన్నారు. వీటిలో 106 మేజర్ పోర్టులు, 22 స్పెషల్ మేజర్ పోర్టులు, చైనాలో 2వేల పోర్టులు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ కారణంతోనే ఆ దేశాలు అభివృద్ధి చెందాయన్నారు. మంత్రి దేవినేని ఉమా మాట్లాడుతూ పట్టిసీమను నిర్మిస్తుంటే కొందరు అడ్డుకున్నారని, పోర్టు, పారిశ్రామిక కారిడార్ కోసం భూసమీకరణ చేస్తుంటే ప్రతిపక్ష నాయకులు అడ్డుకుంటున్నారని అయినా పోర్టు నిర్మించి తీరుతామని అన్నారు. మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకులు పోర్టు, పారిశ్రామిక కారిడార్ నిర్మాణాన్ని అడ్డుకోకుండా తమకు సహకరించాలని కోరారు. శాసనసభ డెప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు, ఎమ్మెల్సీ పీతా రవిచంద్ర, ఇన్చార్జ్ కలెక్టర్ గంధం చంద్రుడు, మాజీ మంత్రి నడకుదుటి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. -
నారాయణ లాస్ట్.. పీతల ఫస్ట్
విజయవాడ: పనితీరును, అభివృద్ధి పనులపై అందించిన సమాచారాల ఆధారంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులకు ర్యాంకులు కేటాయించారు. కీలకమైన రాజధాని భూసేకరణ, నిర్మాణ ఒప్పందాలు తదితర వ్యవహారాలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్న మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణకు సీఎం చిట్టచివరి ర్యాంకు కేటాయించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాతకు మొదటి ర్యాంక్ దక్కింది. సోమవారం విజయవాడలో జరిగిన కేబినెట్ భేటీలో సీఎం ఆయా మంత్రులకు ఏయే ర్యాంకులు లభించాయో వెల్లడించినట్లు తెలిసింది. ఇతర మంత్రుల ర్యాంకులు ఈ విధంగా ఉన్నాయి.. దేవినేని ఉమ- 2, పత్తిపాటి పుల్లారావు- 3, కామినేని శ్రీనివాసరావు- 4, పరిటాల సునీత- 5, రావెల కిశోర్ బాబు- 6, అచ్చెన్నాయుడు- 7, గంటా శ్రీనివాసరావు- 8, కొల్లు రవీంద్ర- 9, అయ్యన్నపాత్రుడు- 10, పల్లె రఘునాథరెడ్డి- 11, మృణాళిని 13, పి. నారాయణ- 18వ ర్యాంకు పొందారు. గత ఆగస్టులోనూ ప్రభుత్వ పథకాల అమలు ప్రామాణికంగా టీడీపీ అధినేత మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలకు ర్యాంకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. నాటి ర్యాంకుల్లో సీఎం చంద్రబాబుకు అనూహ్యంగా రాష్ట్రంలో 9వ ర్యాంక్ దక్కింది. -
'రౌడీలా మాట్లాడుతున్నాడు'
హైదరాబాద్ : మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రౌడీలా మాట్లాడుతూ కాపు ఉద్యమాన్ని భ్రష్టుపట్టిస్తున్నడాని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ ఆరోపించారు. ఆదివారం హైదరాబాద్‌లో పి.నారాయణ విలేకరులతో మాట్లాడుతూ... మూడు నిమిషాల్లో చంద్రబాబు ప్రభుత్వాన్ని కూలదోస్తానంటూ ముద్రగడ రౌడిలా మాట్లాడుతున్నరని విమర్శించారు. కాపులను అంతర్జాతీయ స్థాయిలో అప్రతిష్టపాలు చేస్తున్నారని మండిపడ్డారు. కాపులకు టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టుకుందని నారాయణ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఆయన చెప్పినట్లు చంద్రబాబు ప్రభుత్వం నడవదంటూ ముద్రగడను ఎద్దేవా చేశారు. రాజధాని భూముల గురించి ఏం సంబంధం ఉందని మాట్లాడుతున్నారని ముద్రగడను మంత్రి నారాయణ ప్రశ్నించారు. రాజ్యసభ పదవికి ఆశపడి కాపు ఉద్యమాన్ని పక్కదోవపట్టిస్తున్నారని ముద్రగడపై నిప్పులు చెరిగారు. -
త్వరలో సీఎం వద్దకు పంచాయితీ
స్ట్రాంవాటర్ డ్రెయినేజ్ పనులు పబ్లిక్ హెల్త్ విభాగానికి కట్టబెట్టిన మంత్రి నారాయణ! కార్పొరేషన్‌కే అప్పగించాలంటున్న ఎంపీ, ఎమ్మెల్యేలు విజయవాడ : స్ట్రాం వాటర్ డ్రెయినేజ్ (వరద నీరు) నిధులు తెలుగుదేశం పార్టీలో చిచ్చురేపుతున్నాయి. ఎట్టకేలకు నిధుల్ని విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం పనుల్ని పబ్లిక్ హెల్త్ విభాగానికి అప్పగించేందుకు రంగం సిద్ధం చేసింది. మున్సిపల్ మంత్రి పి.నారాయణ ఒత్తిడి వల్లే పబ్లిక్ హెల్త్ విభాగానికి పనుల్ని కట్టబెడుతున్నట్లు సమాచారం. నగరపాలక సంస్థ చేపట్టాల్సిన పనుల్ని పబ్లిక్ హెల్త్ విభాగానికి అప్పగించడంపై స్థానిక ప్రజాప్రతినిధులు గుర్రుగా ఉన్నారు. ఎంపీ కేశినేని నాని, తూర్పు, సెంట్రల్ ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బొండా ఉమా, మేయర్ కోనేరు శ్రీధర్ ఈ విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద పంచాయితీ పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు అత్యంత విశ్వసనీయంగా తెలుస్తోంది. రాకరాక వచ్చిన నిధులు టీడీపీ ప్రజాప్రతినిధుల మధ్య కుమ్ములాటలకు దారితీయడం ఇప్పుడు కార్పొరేషన్లో హాట్ టాపిక్‌గా మారింది. చిన్నబుచ్చుకున్నారు స్ట్రాంవాటర్ డ్రెయిన్ల నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం గత ఏడాది మేలో రూ.461 కోట్లు మంజూరు చేసేందుకు అంగీకరించింది. తొలివిడతగా రూ.110 కోట్లను విడుదల చేసింది. రాజధాని నిర్మాణం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం నిధుల్ని తొక్కిపట్టింది. నిబంధనల నేపథ్యంలో ఎట్టకేలకు ఇటీవలే విడుదల చేసింది. కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో ఎంపీ నాని, మేయర్ శ్రీధర్ చొరవ చూపారు. ఏ దశలోనూ కృషి చేయని మంత్రి నారాయణ ఇప్పుడు పెత్తనం చేయడాన్ని స్థానికనేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. నగరాన్ని ఆరు జోన్లుగా విభజించి డ్రెయిన్ల నిర్మాణం చేపట్టాలని ఇంజినీరింగ్ అధికారులు డిటేల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు (డీపీఆర్)ను ఇంజినీరింగ్ అధికారులు రూపొందించారు. 100 కి.మీ మేర పెద్ద డ్రెయిన్లు, 38 కి.మీ మేర చిన్న డ్రెయిన్ల నిర్మాణం చేపట్టాలని గుర్తించారు. గుంటుతిప్ప, ప్రసాదంపాడు, పుల్లేరు డ్రెయిన్ల వద్ద రోడ్లు విస్తరణకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇప్పుడు పనుల్ని పబ్లిక్‌హెల్త్ విభాగానికి అప్పగించడంతో కార్పొరేషన్ అధికారులు చిన్నబుచ్చుకున్నారు. ఎందుకంత ప్రేమ! రూ.62 చదరపు కి.మీ విస్తీర్ణంలో విస్తరించిన నగరంలో వర్షం వస్తే లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. గంటల కొద్దీ నీరు రోడ్లపై నిలవడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. నగరంలోని 13 డివిజన్ల పరిధిలో 161 ఎకరాల్లో కొండలు విస్తరించి ఉన్నాయి. వీటిపై 40 వేల కుటుంబాలు ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్నాయి. వర్షం వచ్చిన సమయంలో కొండ ప్రాంతాల నుంచి వచ్చే నీటి ధాటికి రోడ్లు అతలాకుతలం అవుతున్నాయి. మురుగునీటి డ్రెయిన్లద్వారానే వర్షపునీరు ప్రవహించాల్సి వస్తోంది. దీనికి ఆ డ్రెయిన్ల సామర్థ్యం చాలక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వన్‌టౌన్, సర్కిల్-3లోని పలు ప్రాంతాల్లో ఈ సమస్యలతో ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. ఈక్రమంలో స్ట్రాంవాటర్ డ్రెయిన్ల నిర్మాణం పకడ్బందీగా నిర్వహించాల్సి ఉంది. పబ్లిక్‌హెల్త్ విభాగంలో సూపరింటెండెంట్ ఇంజినీర్ ఒకరు, ఒక డీఈ, ఇద్దరు ఏఈలు మాత్రమే ఉన్నారు. ఎస్ఈ గుంటూరు జిల్లాలో ఉంటారు. నగరపాలక సంస్థలో చీఫ్ ఇంజినీర్, ఇద్దరు ఎస్ఈలు, 8 మంది ఈఈలు, 21మంది డీఈలు, 40 మంది ఏఈలు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇంతమంది అధికారులు కార్పొరేషన్లో ఉండగా పబ్లిక్‌హెల్త్ విభాగానికి పనుల బాధ్యతల్ని మంత్రి అప్పగించడం అనుమానాలకు తావిస్తోంది. అనుమానమే.. కేంద్రం నిధులతో చేపట్టబోయే పనుల్ని మూడేళ్లలోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. లేకుంటే నిధులు మురిగిపోతాయి. ప్రతి ఆరునెలలకు ఓ సారి నిధుల వినియోగానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదిక పంపాల్సి ఉంటుంది. నిధుల వినియోగంలో తేడా ఉంటే కంట్రోలర్ ఆఫ్ ఆడిట్ జనరల్ (కాగ్) తప్పుబట్టే అవకాశం ఉంది. పబ్లిక్ హెల్త్ విభాగం ఆధ్వర్యంలో సకాలంలో పనులు పూర్తవుతాయనే నమ్మకం తమకు లేదన్నది స్థానిక ప్రజాప్రతినిధుల అభిప్రాయంగా తెలుస్తోంది. -
'గ్లోబల్ టెండర్ల ద్వారా సీడ్ క్యాపిటల్ నిర్మాణం'
విజయవాడ : గ్లోబల్ టెండర్ల ద్వారా సీడ్ క్యాపిటల్ నిర్మాణం చేపడతామని ఏపీ మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి పి.నారాయణ వెల్లడించారు. శనివారం విజయవాడలో పి.నారాయణ మాట్లాడుతూ... సీడ్ క్యాపిటల్ ప్రాంతంలోని మూడు గ్రామాల రైతులకు ఆయా గ్రామాల పరిధిలో భూములిచ్చే అవకాశం లేదని స్పష్టం చేశారు. మరోసారి ల్యాండ్ పూలింగ్ అభ్యంతరాలపై ఫిబ్రవరి1 నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారు. గ్రామాల నుంచి అభ్యంతరాలు వస్తే.. రోడ్లను బైపాస్ చేస్తామని నారాయణ స్పష్టం చేశారు. -
చెప్పిందేంటి... మీరు చేస్తున్నదేంటి...?
-
'పొలాలు ఖాళీ చేయండి'
తాడికొండ: గుంటూరు జిల్లా రైతులు ఏప్రిల్ 15వ తేదీలోగా పొలాలను ఖాళీ చేయాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ అల్టిమేటం జారీ చేశారు. ఖాళీ అయితే రాజధాని అభివృద్ధి పనులకు సన్నాహాలు చేస్తామని స్పష్టం చేశారు. తుళ్లూరు సీఆర్డీఏ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పటి వరకూ 1,100 ఎకరాల భూములిచ్చిన రైతులకు కౌలు చెక్కులు అందజేశామని తెలిపారు. మిగతా వారికి పూర్తి స్థాయిలో రికార్డులు పరిశీలించి, కంప్యూటర్లో పొందుపరచి చెక్కులు అందిస్తామని వివరించారు. పది రోజుల్లో చెక్కుల పంపిణీ ప్రక్రియను పూర్తి చేస్తామని వెల్లడించారు. రాజధాని నిర్మాణ విషయంలో ఈ నెల 29న సీఎంతో సింగపూర్ వెళ్లనున్నట్లు ప్రకటించారు. అలాగే నియోజకవర్గ పరిధిలోని కొండవీటివాగును టూరిజం కింద అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ ప్రతిపాదన మేరకు సీఎం చంద్రబాబు అనంతవరంలోనే ఉగాది వేడుకలు నిర్వహించేందుకు సమ్మతించారని చెప్పారు. సీఎం పర్యటన వివరాలు ముడు రోజుల్లో ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ మాట్లాడుతూ.. అనంతవరంలోనే పూర్తి స్థాయి ఉగాది వేడుకలు నిర్వహించనున్నట్లు చెప్పారు. -
ఆ భూములు అమ్ముకోవచ్చు...
బోరుపాలెం(తుళ్లూరు) : రాజధాని ల్యాండ్ పూలింగ్‌కు అంగీకార పత్రాలు ఇచ్చినా రైతులు ఆ భూములు అమ్ముకోవచ్చని రాష్ట్ర పురపాలక శాఖా మంత్రి పి. నారాయణ వెల్లడించారు. అయితే ఆ విషయాన్ని స్థానిక భూ సమీకృత అధికారి దృష్టికి తీసుకువస్తే ప్రభుత్వం ఇచ్చే ప్రతిఫలాలు భూమి కొన్నవారికి దక్కేలా చర్యలు చేపడతారన్నారు. అలాగే ల్యాండ్ పూలింగ్‌కు ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇవ్వనవసరం లేద న్నారు. ఫొటోస్టాట్ కాపీలు చాలన్నారు. మండలంలో మూడవ ోజు ఆదివారం కూడా భూ సమీకరణ జరిగింది. బోరుపాలెం, ఐనవోలు గ్రామాల్లో ఉదయం వేళ ల్యాండ్ పూలింగ్ గ్రామ సభలు నిర్వహించారు. స్థానిక శాసన సభ్యుడు తెనాలి శ్రావణ్‌కుమార్‌తో కలసి మంత్రి పి. నారాయణ పాల్గొన్న ఈ సభల్లో మొత్తం 116.66 ఎకరాలను సమీకరించారు. బోరుపాలెంలో 71.46, ఐనవోలులో 39, నేలపాడులో 6.2 ఎకరాలను రాజధాని నిర్మాణానికి ఇస్తూ రైతులు తమ అంగీకార పత్రాలను అందజేశారు. ముందుగా జిల్లా కలెక్టర్ కాంతిలాల్‌దండే మాట్లాడుతూ ఈ గ్రామంలో రాజధానికి భూములు ఇచ్చేందుకు అనుకూలంగా ఉన్న రైతులను అనేక అనుమానాలు తొలుస్తున్నాయని చెప్పారు. నిమ్మతోటలకు తగిన ప్రతిఫలం ఇవ్వాలని, జరీబు భూముల ప్యాకేజీ పెంచాలని కోరుతున్నట్లు వేదికపై ఉన్న మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీనికి స్పందించిన మంత్రి నారాయణ రైతులను ఆందోళన పడవద్దన్నారు. మరోమారు సీఎంతో సమావేశం ఏర్పాటు చేసి అనుకూలమైన ప్యాకేజీ ఇప్పించేందుకు తన వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. నెల రోజులపాటు ప్రతి గ్రామంలో రెవెన్యూ బృందాలు రైతుల నుంచి అంగీకార పత్రాలు తీసుకుంటాయన్నారు. ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ మాట్లాడుతూ పట్టాదారు పాస్ పుస్తకాల కోసం రైతులు తహశీల్దార్ కార్యాలయాలకు వెళ్లవలసిన అవసరం లేదన్నారు. ప్రతి గ్రామంలో ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి పాస్‌పుస్తకాలు అందజేయడం జరుగుతుందన్నారు. రైతుల సమస్యలను తక్షణం పరిష్కరించేందుకు ఓ అధికారిని నియమించి, టోల్‌ఫ్రీ ఫోన్ నంబర్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. తహశీల్దార్ సుధీర్‌బాబు మాట్లాడుతూ ఒక్క రూపాయి ఖర్చు కాకుండా రైతులకు పాస్ పుస్తకాలు అందజేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో భాస్కరనాయుడు, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ వడ్లమూడి పూర్ణచంద్రరావు, డిప్యూటీ కలెక్టర్ రమాదేవి, జెడ్పీటీసీ సభ్యుడు బెజవాడ నరేంద్రబాబు, గ్రామ సర్పంచ్ దివ్వెల బాలమ్మ, ఉప సర్పంచ్ నెలకుదిటి నరేంద్రబాబు, నాయకులు బెల్లం కొండ నరసింహారావు, దామినేని శ్రీనివాసరావు, అనుమోలు సత్యనారాయణ, కొమ్మినేని సత్యనారాయణ, వేజండ్ల శివప్రసాద్, నూతలపాటి రామారావు తదితరులు పాల్గొన్నారు. ఐనవోలులో ఐనవోలు గ్రామంలో డిప్యూటీ కలెక్టర్, భూసమీకృతఅధికారి ఎన్. ఏసురత్నం ఆధ్వర్యంలో ల్యాండ్ పూలింగ్ గ్రామ సభ జరిగింది. మండల పరిషత్ ఉపాధ్యక్షుడు పోతురాజు శ్రీనివాసరావు, గ్రామ సర్పంచ్ వలపర్ల జ్ఞానానందం తో పాటు ఉప సర్పంచ్ పాలకాయల అర్జునరావు, పాలకాయల గోపాలరావు, మరో 14 మంది రైతులు 39 ఎకరాల భూములను రాజధాని నిర్మాణానికి ఇస్తూ అంగీకార పత్రాలు సమర్పించారు. మొత్తం భూములు 1,197.97 ఎకరాలకు గ్రామ కంఠం భూమి 24.04 ఎకరాలు పోనూ 1, 173.93 ఎకరాలకు నోటిఫికేషన్ జారీ చేసి భూ సమీకరణ చేస్తున్నట్టు ఏసురత్నం తెలియ జేశారు. స్పందించని అబ్బురాజుపాలెం రైతులు... మండలంలోని బోరుపాలెం, అబ్బురాజుపాలెం గ్రామాలకు కలిపి ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ ఇచ్చారు. బోరుపాలెంలో జరిగిన సభలో ఆ గ్రామ రైతులు మాత్రమే పాల్గొని భూములు ఇచ్చేందుకు అంగీకార పత్రాలు ఇచ్చారు. అబ్బురాజుపాలెం నుంచి ఒక్కరూ ముందుకు రాలేదు. రాజధాని నిర్మాణానికి విరాళాలు... బోరుపాలెం గ్రామంలో జరిగిన సభలో రాజధాని నిర్మాణం కోసం పలువురు తమ విరాళాలు ప్రకటించారు. గ్రామానికి చెందిన కట్టా నరసింహారావు రూ.11 వేలు, కట్టా శ్రీనివాసరావు రూ.10,116, నెలకుదిటి రజిని 11,111 రూపాయలను మంత్రి నారాయణ, ఎంఎల్ఏ శ్రావణ్‌కుమార్‌కు అందజేశారు. -
సింగపూర్ ప్రభుత్వమే నిర్మించే రాజధాని తుళ్లూరు
నేలపాడు(తుళ్లూరు) : పూర్తిస్థాయిలో సింగపూర్ ప్రభుత్వం నిర్మించే రాజధాని నవ్యాంధ్రప్రదేశ్ మాత్రమేనని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి పి. నారాయణ వెల్లడించారు. సీఆర్డీఏ కమిషనర్ ఎన్. శ్రీకాంత్‌తో కలసి శుక్రవారం నేలపాడు వచ్చిన మంత్రి భూ సమీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ఒక్కరోజు 40 మంది రైతులు తమ 106.48 ఎకరాల భూములను రాజధాని నిర్మాణానికి ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేస్తూ మంత్రికి అంగీకార పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ అధ్యక్షత వహించి మాట్లాడారు. నేలపాడులో మొత్తం 1470 ఎకరాల భూమి ఉందన్నారు. దీనిలో 1206 ఎకరాల పట్టాభూమిని మొత్తం 685 మంది రైతులు రాజధానికి ఇచ్చేందుకు ముందుకు వచ్చారని తెలిపారు. మంత్రి నారాయణ మాట్లాడుతూ భూసేకరణ చట్టం ద్వారా భూములు తీసుకుంటే రైతులకు తీవ్ర నష్టం వస్తుందని భావించిన సీఎం ల్యాండ్ పూలింగ్ చేపట్టినట్టు తెలిపారు. నూతన రాజధానిలో మొదటి లబ్ధి ఈ ప్రాంత రైతులకే దక్కుతుందన్నారు. జూన్‌లో సింగపూర్ ప్రభుత్వం మాస్టర్‌ప్లాన్ ఇస్తే వెంటనే మంచి రోజు చూసుకుని రాజధాని నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు.తొలి దశ పనులు మూడేళ్లలో పూర్తి కాగలవని అంచనా వేశామన్నారు. మురుగు నీరు బయటకు వెళ్లే అవకాశం లేని నేలపాడు గ్రామాన్ని ప్రభుత్వం తీసు కోవాలని ఓ రైతు కోరగా ప్రస్తుతం గ్రామాలను కదిలించే ఆలోచన ప్రభుత్వానికి లేదన్నారు. సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు, వివాదాలను పరిష్కరిస్తూ రైతుల నుంచి ల్యాండ్ పూలింగ్ అనుమతి ప్రతాలను తీసుకునేందుకు డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసమూర్తిని భూ సమీకృత అధికారిగా నియమిస్తున్నట్లు చెప్పి ఆయనను రైతులకు పరిచయం చేశారు. అనంతరం మంత్రి, సీఆర్డీఏ కమిషనర్ భూములు ఇచ్చే రైతుల నుంచి అంగీకార పత్రాలు తీసుకుని రశీదులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కాంతిలాల్‌దండే, జేసీ చెరుకూరి శ్రీధర్,ఆర్డీవో భాస్కరనాయుడు, తహశీల్దార్ సుధీర్‌బాబు తదితరులు పాల్గొన్నారు. భూములు ఇచ్చేందుకు అంగీకార పత్రాలు అందజేసిన రైతులు కొమ్మినేని ఆదిలక్ష్మి 3.5 ఎకరాలు, కాటా అప్పారావు ఎకరం, ధనేకుల రామారావు 11 ఎకరాలు, భూక్యా సాలి 80 సెంట్లు, కొమ్మినేని శేషగిరిరావు 5 ఎకరాలు, ఇందుర్తి నాగమల్లేశ్వరరావు 55 సెంట్లు, గుజ్జర్లపూడి తిరుపతిరావు ఎకరం, కణతరపు సాంబశివరావు 4.75 ఎకరాలు, పారా పార్వతి 95 సెంట్లు, ఆలూరి వెంకటేశ్వరరావు 6 ఎకరాలు, మూల్పూరి రాంబాబు 5.75 ఎకరాలు, కె.రాఘవయ్య 5 ఎకరాలు, ఇందుర్తి వెంకటేశ్వరరావు 55 సెంట్లు, యంపరాల నవత 1.50 ఎకరాలు, కొమ్మగూర ఇసాక్ 1.70 ఎకరాలు, కణతరపు శ్రీమన్నారాయణ 3.5 ఎకరాలు. ఇంకా పలువురు ఉన్నారు. తొలిరోజు 106.48 ఎకరాలు నేలపాడులో శుక్రవారం జరిగిన ల్యాండ్ పూలింగ్ కార్యక్రమంలో 106ఎకరాల 48 సెంట్లను ప్రభుత్వానికి ఇచ్చేందుకు 40 మంది రైతులు అంగీకార పత్రాలను సమర్పించారు. మొదటి రోజు కనీసం 500 ఎకరాలకు అంగీకార పత్రాలు తీసుకోవాలనే లక్ష్యంతో అధికారులు, మంత్రి, సీఆర్డీఏ కమిషనర్ గ్రామానికి వచ్చారు. అయితే శుక్రవారం కావడం ఒక కారణమైతే, మరోవైపు భారీ వర్షం కురవడంతో రైతులు ఎవరిదారిన వారు వెళ్లిపోయారు. దీనిపై తహశీల్దార్ సుధీర్‌బాబు మాట్లాడుతూ తొలిరోజు 40 మంది రైతులు ముందుకు రావడం ఆశించదగిన పరిణామం అన్నారు. శనివారం ఎక్కువ మంది రైతులు వచ్చే అవకాశం వుందని అన్నారు. వారంలోపు నేలపాడులో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ పూర్తవుతుందన్నఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. -
రెండు రోజుల్లో సీఆర్డీఏ బిల్లు నిబంధనల నోటిఫికేషన్
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ) బిల్లుకు సంబంధించిన నిబంధనలకు రెండు రోజుల్లో నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు మున్సిపల్ శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు. నోటిఫికేషన్ తర్వాతే భూసమీకరణ పని ప్రారంభిస్తామన్నారు. సీఆర్డీఏ నిబంధనలపై ఏవిధమైన చట్టపరమైన సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అభివృద్ధిని ఓర్పలేకే రాజధాని ప్రాంతంలో పంట పొలాలను దగ్ధం చేశారని మంత్రి ఆరోపించారు. -
'నాని ఆవేదన అర్థమైంది'
విజయవాడ: ఎంపీ కేశినేని నాని ఆవేదన తనకు అర్థమైందని ఏపీ మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి నారాయణ శుక్రవారం విజయవాడలో అన్నారు. తమ మధ్య కొంత సమన్వయలోపం ఉన్న మాట వాస్తవమే అని ఆయన అంగీకరించారు. ఇక ముందు అందరం కలిసి నిర్ణయాలు తీసుకుని పని చేస్తామని నారాయణ చెప్పారు. మంత్రి పి. నారాయణ శుక్రవారం విజయవాడ నగరంలోని ఆటోనగర్‌లో పర్యటించారు. ఈ సందర్బంగా స్థానిక ఎంపీ కేశినేని నాని ఉన్నతాధికారులు అనుసరిస్తున్న వైఖరిపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరంతా భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ చెప్పినట్లు నడుచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఏ అంశంలోనూ దేవినేని ఉమ... తమను సంప్రదించడం లేదని కేశినేని నాని అసంతృప్తి వెలిబుచ్చారు. అలాగే అధికారులు కూడా ఏ విషయాన్ని తమ దృష్టికి తీసుకురావటం లేదని విమర్శించారు. నగరంలో జరిగే ఏ విషయాల్లోనైనా మంత్రిని ఒక్కరినే సంప్రదిస్తే సరిపోదని... నగర ఎమ్మెల్యేలు, ఎంపీలను కూడా కలుపుకొని వెళ్లాలని సూచించారు. కేశినేని నాని వ్యాఖ్యలపై పి.నారాయణ పై విధంగా స్పందించారు. -
ఆదుకోకుండా శాపనార్థాలా?
ఏపీ శాసన మండలిలో పలువురు సభ్యులు ధ్వజం సాక్షి, హైదరాబాద్: ప్రకృతి కోపగిస్తే ఆదుకోవాల్సిన ప్రభుత్వం రైతాంగాన్ని శాపనార్ధాలు పెడితే ఎలా అని ఏపీ శాసనమండలిలో పలువురు సభ్యులు తీవ్రస్థాయిలో ధ్వజ మెత్తారు. ఏపీలో నెలకొన్న కరువు పరిస్థితిపై శాసన మండలిలో శుక్రవారం స్వల్పకాలిక చర్చ జరిగింది. మండలిలో చర్చ ప్రారంభమైనా ప్రకృతి విపత్తుల నిర్వహణ శాఖను పర్యవేక్షిస్తున్న ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, అధికారులు సభలో లేకపోవటంపై మండలి వైస్ చైర్మన్ ఎస్.వి.సతీష్‌కుమార్‌రెడ్డి ఆగ్రహం వ్య క్తం చేశారు. ఆయన సూచనతో పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ వెంటనే అధికారులను రప్పించి చర్చను కొనసాగించారు. బ్యాంకు రుణాలు చెల్లించొద్దంటూ పదేపదే ప్రకటనలు చేసి ప్రభుత్వం రైతులను మోసం చేసిందని కాంగ్రెస్ పక్ష నేత సి.రామచంద్రయ్య పేర్కొన్నారు. పంటలు పండక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే ప్రభుత్వం కనీసం వాటిని నమోదు చేయడానికి కూడా ఇష్టపడటం లేదన్నారు. అనంతపురం జిల్లా రైతులను ఆదుకునేందుకు బీమా విధానంలో మార్పులు తేవాలని టీడీపీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి కోరారు. ఆధార్ కార్డులు లేని వారికి ప్రభుత్వం ఉచిత విద్యుత్ కట్ చేస్తే రైతు ఆత్మహత్యలు మరింత పెరిగే ప్రమాదముందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో రైతులకు బ్యాంకు ల్లో అప్పులు కూడా పుట్టడం లేదన్నారు. ఉపాధి హామీ పని దినాలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని వామపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్సీ చంద్రశేఖర్ ఆరోపించారు. తాగునీటి కోసం చిత్తూరు జిల్లాలో నిర్మించ తలపెట్టిన కండలేరు ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలని కాంగ్రెస్ సభ్యుడు రెడ్డెపరెడ్డి డిమాండ్ చేశారు. -
భవానీ ద్వీపం చూసి ఆశ్చర్యపోయారు
* సింగపూర్ ప్రతినిధుల ఏరియల్ సర్వే అద్భుతంగా సాగింది: మంత్రి నారాయణ * అద్భుతమైన మాస్టర్ ప్లాన్ ఇస్తామన్నారు * రేపు సాయంత్రానికి కార్యాచరణ ప్రణాళిక ఇస్తారు * హెలికాప్టర్ నుంచి కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాలు, కొండలు, పంట పొలాలు, గ్రామాలను పరిశీలించిన సింగపూర్ బృందం * గ్రామాల్లో భారీగా పోలీసు బలగాలు సాక్షి, హైదరాబాద్/ విజయవాడ బ్యూరో: రాజధాని మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో సింగపూర్ ప్రతినిధులతో కలిసి చేసిన ఏరియల్ సర్వే అద్భుతంగా సాగిందని రాజధాని నిర్మాణ సలహా కమిటీ చైర్మన్, రాష్ట్ర మున్సిపల్ మంత్రి నారాయణ చెప్పారు. ఆ ప్రాంత భౌగోళిక పరిస్థితులు, రూపురేఖలను చూసి అద్భుతమైన రాజధాని నిర్మించవచ్చని సింగపూర్ ప్రతినిధులు అభిప్రాయపడ్డట్లు తెలిపారు. రాజధాని ప్రాంతంలో ఏరియల్ సర్వే అనంతరం నారాయణ బుధవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి (వీజీటీఎం) పరిధిలో 200 కిలోమీటర్ల ఏరియల్ సర్వే జరిగిందని తెలిపారు. కృష్ణా నది మధ్యలో ఉన్న భవానీ ద్వీపాన్ని చూసి సింగపూర్ బృందం ఆశ్చర్యపోయిందని చెప్పారు. తాము ఇటువంటి ద్వీపాలను కృత్రిమంగా నిర్మించామని, ఇక్కడ సహజసిద్ధమైనవి ఉన్నాయని అన్నారని తెలిపారు. ఆ ప్రాంతంలో ఉన్న నదీ పరీవాహకం, కొండ ప్రాంతాలను చూసి అచ్చెరువొందారన్నారు. గొప్ప మాస్టర్‌ప్లాన్ ఇస్తామని వారు చెప్పారన్నారు. గురువారం ఉదయం మున్సిపల్, పట్టణాభివృద్ధి, రవాణా, విద్యుత్ తదితర శాఖల అధికారులతో సింగపూర్ ప్రతినిధులతో కలిసి సుదీర్ఘ సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. బుధవారం రాత్రికే మాస్టర్ ప్లాన్ డిజైన్‌కు సంబంధించి కార్యాచరణ ప్రణాళిక ఇస్తామని సింగపూర్ ప్రతినిధులు చెప్పారన్నారు. పంట పొలాలు, గ్రామాల పరిశీలన బుధవారం రాజధాని ప్రాంతంలో సింగపూర్ ప్రతినిధులు జరిపిన ఏరియల్ సర్వేలో కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాలు, కొండలు, పంట పొలాలు, గ్రామాలను పరిశీలించారు. రాష్ట్ర మంత్రి నారాయణ నేతృత్వంలో సింగపూర్ ప్రతినిధులు టన్ సూన్ కిం, జులియన్ గో, లిమ్స్వీ కెంగ్, ఫ్రాన్సిస్ చోంగ్, లిక్సియా ఒంగ్, కూ తెంగ్ చెయ్ హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో వచ్చి ఏరియల్ సర్వే చేశారు. అమరావతి, తుళ్లూరు, మంగళగిరి మండలాల్లోని గ్రామాలు, సాగులో ఉన్న పంటలను పరిశీలించారు. అనంతరం గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి హైదరాబాద్‌కు వెళ్లారు. ముందుగా రాజధాని ప్రాంతంలో సింగపూర్ బృందం పర్యటనకు ఏర్పాట్లు చేశారు. అయితే, రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఏరియల్ సర్వేతో సరిపెట్టారు. సింగపూర్ బృందాన్ని అడ్డుకుంటామని రైతులు హెచ్చరించడంతో ఆ గ్రామాల్లో రెండు రోజులుగా పోలీసులు భారీ ఎత్తున బలగాలను మోహరించారు. డిజైనింగ్ వరకే ఈ ఎంఓయూ రాజధాని మాస్టర్‌ప్లాన్‌పై సింగపూర్ సంస్థలతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాలపై వచ్చిన విమర్శలకు మంత్రి నారాయణ వివరణ ఇచ్చారు. ఈ అవగాహన ఒప్పందం రాజధాని డిజైన్‌కే పరిమితమని చెప్పారు. భవిష్యత్‌లో జరిగే నిర్మాణ లేదా ఇతరత్రా పనుల నిర్వహణకు ఈ సంస్థలే కొనసాగవచ్చు లేదా వేరే సంస్థలు రావచ్చునని తెలిపారు. ఎంఓయూ కుదుర్చుకున్న రెండు సంస్థలూ అక్కడి ప్రభుత్వం ఆధ్వర్యంలోనే పనిచేస్తున్నాయని చెప్పారు. ఇక్కడి ఇన్కాప్ చైర్మన్, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సాంబశివరావు, అక్కడి సంస్థ సీఈవో ఒప్పందంపై సంతకాలు చేశారని తెలిపారు. ఒప్పందంపై అనుమానాలు అక్కర్లేదని అన్నారు. -
'జపాన్‌తోనూ రాజధాని నిర్మాణంపై చర్చిస్తాం'
హైదరాబాద్: రైతుల డిమాండ్లపై పరిశీలన చేస్తానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పినట్టు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ పేర్కొన్నారు. రాజధాని ప్రాంతంలో నియమ నిబంధనలపై అధికారులతో తాము చర్చించామని ఆయన అన్నారు. ఈ విషయమై వారం రోజుల్లో ఖరారుచేస్తామని అధికారులు చెప్పినట్టు తెలిపారు. సీఆర్డీఏకు కేబినెట్ ఆమోదం తెలిపిందని, సీఆర్డీఏపై ఆర్డినెన్స్ ఆలోచన చేస్తున్నామన్నారు. సింగపూర్‌లో రాజధానిపై ప్రత్యేక చర్చ చేశామన్నారు. రాజధాని డిజైన్‌ను ఇవ్వాలని సింగపూర్‌ను చంద్రబాబు కోరినట్టు మంత్రి నారాయణ చెప్పారు. రాజధానిపై సింగపూర్ చాలా పాజిటివ్‌గా ఉందన్నారు. జపాన్ పర్యటనలో భాగంగా అక్కడ కూడా రాజధాని నిర్మాణం అంశాన్ని చర్చిస్తామన్నారు. జపాన్‌తో కలిసి పనిచేయడానికి సింగపూర్ కూడా ఆస్తకి చూపిందని ఆయన తెలిపారు. రాజధాని పరిధిలో మొత్తం మూడు రింగ్స్ వస్తాయని చెప్పారు. మొదటి రింగ్ 75కిలోమీటర్లు, రెండో రింగ్ 125 కిలోమీటర్లు, మూడో రింగ్ 225 కిలీమీటర్లు ఉంటుందని మంత్రి నారాయణ పేర్కొన్నారు. -
నవంబర్‌లో అన్న క్యాంటీన్లు
మంత్రి నారాయణ వెల్లడి నెల్లూరు: తమిళనాడు తరహాలో ఏర్పాటు చేస్తున్న అన్న క్యాంటీన్లు రాష్ట్రంలో నవంబరు నుంచి ప్రారంభమవుతాయని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పురపాలక మంత్రి పి.నారాయణ వెల్లడించారు. ఇతర రాష్ట్రాల్లోని మంచి పథకాల గురించి వాక బు చేసి, అటువంటి వాటిని మన రాష్ట్రంలోనూ అమలు చేస్తున్నామన్నారు. అందు లో భాగంగానే తమిళనాడులోని అమ్మ క్యాంటీన్లను పరిశీలించి, ఆ తరహాలో రాష్ట్రంలో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆయన మంగళవారం నెల్లూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు వినూత్నమైన పథకాలను రాష్ట్రానికి తీసుకురావాలని ఆశిస్తున్నారని తెలిపారు. అన్న క్యాంటీన్లు నవంబర్‌లో ప్రారంభిస్తామన్నారు. అక్టోబరు 2న వెయ్యి రూపాయల పింఛన్ అమలు మొదలుపెట్టడంతో పా టు, ఎన్టీఆర్ సుజల పథకాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలను గుర్తించేందుకు పింఛన్ పరిశీలన కమిటీలను ఏర్పాటుచేశామని, ఆధార్ అనుసంధానం కూడా అందుకేనని మంత్రి అన్నారు. -
నవంబర్ లో అన్నా క్యాంటీన్లు ప్రారంభం
హైదరాబాద్:నవంబర్ లో అన్నా క్యాంటీన్లు ప్రారంభించనున్నట్లు మంత్రి పి.నారాయణ స్పష్టం చేశారు. ఈ అన్నా క్యాంటీన్లలో ఒక రూపాయికే సాంబారు ఇడ్లీ సరఫరా చేస్తామన్నారు. ఐదు రూపాయలకే లెమన్, పెరుగు, సాంబారు రైస్ ను సరఫరా చేస్తామన్నారు. అంతేకాకుండా మరో ఐదు రూపాయలకే రెండు చపాతీలను సరఫరా చేస్తామన్నారు. అక్టోబర్ 2 వ తేదీన 222 ఎన్టీఆర్ సుజల ప్లాంట్లను మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేస్తామన్నారు. వారం రోజుల్లో అన్ని మున్సిపాలిటీల్లో ఆన్ లైన్ ప్రజా ఫిర్యాదుల విభాగం ఏర్పాటు చేస్తామన్నారు. ఇందులో ప్రజల అవసరాలు ఏమున్నా ఫోటో తీసి ఆన్ లైన్ లో ఫిర్యాదు చేయవచ్చన్నారు. వాటిని పరిష్కరించి తిరిగి ప్రజలకు ఫోటో పంపిస్తామన్నారు. పట్టణాభివృద్ధి మిషన్ ను నూటికి నూరుశాతం అమలు చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు. -
రాజధాని కోసం ప్రత్యేక అథారిటీ
పురపాలక శాఖ మంత్రి డాక్టర్ నారాయణ వెల్లడి హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో నూతన రాజధాని నిర్మాణానికి ప్రత్యేక అథారిటీని నియమిస్తున్నట్టు పురపాలకశాఖ మంత్రి డాక్టర్ పి. నారాయణ తెలిపారు. కలెక్టర్లు, మున్సిపాలిటీ అధికారులతో సంబంధం లేకుండా ఈ అథారిటీకి ప్రత్యేకాధికారిగా ఐఏఎస్ అధికారిని నియమిస్తున్నట్టు చెప్పారు. గత మూడు రోజులుగా వివిధ రాజధాని నగరాలను పరిశీలించి వచ్చిన నేపథ్యంలో మంత్రి నారాయణ శనివారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. తొలి దశలో నిర్మాణంలో భాగంగా సచివాలయం, అసెంబ్లీ, కొన్ని పరిపాలనా భవనాలు మూడేళ్లలో పూర్తిచేస్తామన్నారు. రాజధాని చుట్టూ (గుంటూరు-తెనాలి-గన్నవరం-ఇబ్రహీంపట్నం) 185 కిలోమీటర్లతో రింగ్‌రోడ్డు నిర్మించనున్నామని, ఈ రింగురోడ్డు పరిధిలో (ఇన్నర్ సర్కిల్లో) 6 లక్షల ఎకరాల్లో నగరం ఉంటుందని నారాయణ అన్నారు. చండీగఢ్, నయా రాయ్‌పూర్, గాంధీనగర్ నగరాలను పరిశీలించామని, అక్కడి స్థలాల సేకరణ, ల్యాండ్ పూలింగ్ పద్ధతులు పరిశీలించామని, వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకునే ఇక్కడ కూడా భూముల సేకరణ చేస్తామని మంత్రి అన్నారు. చండీగఢ్ బావుంది.. ప్రస్తుతం రాజధాని సలహా కమిటీ పరిశీలించి వచ్చిన అన్ని నగరాలకంటే చండీగఢ్ నగరం అద్భుతంగా ఉందని మంత్రి నారాయణ అన్నారు. ఇది రెండు రాష్ట్రాలకు రాజధాని అయినందున అభివృద్ధి వేగంగా జరిగిందన్నారు. గాంధీనగర్ నిర్మాణంలో అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించారని, నయా రాయ్‌పూర్ కూడా చక్కటి రహదారులతో పాటు గ్రీన్‌సిటీ రూపకల్పన అద్భుతంగా జరిగిందన్నారు. 22 తర్వాత సింగపూర్, పుత్రజయలలో పర్యటన ఈ నెల 22 తర్వాత సింగపూర్, పుత్రజయలలో పర్యటించనున్నామని, వచ్చేనెల 5 తర్వాత చైనాలో షాంఘై, ఉత్తర కొరియాలలో బృందం పర్యటిస్తామని మంత్రి తెలిపారు. ఈ నగరాల పర్యటన అనంతరం రాజధాని సలహా కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇస్తుందని, ఆ తర్వాత ముఖ్యమంత్రి పలువురితో చర్చించి నిర్ణయిస్తారన్నారు. -
ఏపీ మంత్రి నారాయణ ఎమ్మెల్సీగా నామినేషన్
హైదరాబాద్: ఏపీ ఎమ్మెల్సీ స్థానానికి రాష్ట్ర మున్సిపల్ శాఖా మంత్రి పి. నారాయణ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యే కోటాలో ఒక ఎమ్మెల్సీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలో నారాయణ రెండు సెట్ల నామినేషన్ పత్రాలను ఏపీ శాసనసభ ఇన్చార్జి కార్యదర్శి కె. సత్యనారాయణకు అందజేశారు. ఎన్నిక ఏక గ్రీవం!: శాసన మండలి సభ్యుడిగా మంత్రి నారాయణ ఎన్నిక ఏకగీవ్రం కానుంది. సోమవారం గడువు ముగిసే సమయానికి నారాయణ నామినేషన్ మాత్రమే దాఖలైంది. బుధవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగి సిన అనంతరం.. నారాయణ ఏకగీవ్రంగా ఎన్నికైనట్లు అసెంబ్లీ కార్యదర్శి, ఎన్నికల రిటర్నింగ్ అధికారి అధికారికంగా ప్రకటిస్తారు. ఆస్తి 185 కోట్లు.. అయినా సొంత కారు లేదు! స్వయంగా రూ. 185.24 కోట్ల ఆస్తులు సంపాదించిన ఏపీ పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణకు సొంత కారు లేదు! ఆయనకు పూర్వీకుల నుంచి రూ. 71.5 లక్షల ఆస్తి సంక్రమించింది. భార్య రమాదేవి పేరుతో రూ. 253.12 కోట్ల ఆస్తి ఉంది. కుమార్తె శరణి పేరుతో రూ. రెండు కోట్ల ఆస్తి ఉంది. సోమవారం నామినేషన్ దాఖలు చేసిన నారాయణ.. తన ఆస్తులు, అప్పుల వివరాలను అఫిడవిట్లో పేర్కొన్నారు. ఈ వివరాల ప్రకా రం ఆయనకు సొంతగా కారు లేకపోవడం గమనార్హం. ఆయన పేరిట బ్యాంకుల్లోని 7 అకౌంట్ల లో రూ. 14 కోట్ల 36 లక్షల 63 వేల 390 నగదు ఉంది. -
ఎమ్మెల్సీగా నేడు మంత్రి నారాయణ నామినేషన్
హైదరాబాద్: శాసనమండలిలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ స్థానానికి జరగనున్న ఎన్నికకు ఆంధ్రప్రదేశ్ మంత్రి డాక్టర్ పి.నారాయణ సోమవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ కావడంతో నారాయణ ఉదయం 11 గంటలకు తన నామినేషన్‌ను అసెంబ్లీ ఇన్చార్జి కార్యదర్శి, రిటర్నింగ్ అధికారి సత్యనారాయణకు అందించనున్నారు. కోలగట్ల వీరభద్రస్వామి రాజీనామాతో ఖాళీ అయిన ఈ స్థానానికి ఈనెల 21న ఎన్నిక జరగనుంది. ఆదివారం వరకూ ఒక్క నామినేషనూ దాఖలు కాలేదు. 12న నామినేషన్ల పరిశీలన, 14న ఉపసంహరణ ఉంది. -
కార్పోరేషన్ అధికారులపై మండిపడ్డ నారాయణ
నెల్లూరు: రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్‌లోని మున్సిపాలటీల ఆర్థిక పరిస్థితి కుంటుపడిందని మున్సిపల్, పట్టాణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు. కేంద్రం ప్రభుత్వం అందించే ఆర్దిక సహాయంతో ఆ పరిస్థితిని అధిగమిస్తామని చెప్పారు. ఆదివారం నెల్లూరు నగరంలో నారాయణ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నగరంలో పారిశుద్ధ్యం, రోడ్డులు అపరిశుభ్రంగా ఉండటంతో ఆయన కార్పోరేషన్ అధికారులుపై మండిపడ్డారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు చేపట్టాని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. నగరంలో సరఫరా అవుతున్న తాగునీటిని ఈ సందర్భంగా పరిశీలించారు. నగరంలో ఎక్కడ తాగునీటి సమస్యలు లేకుండా చూడాలని ఆయన అధికారులను సూచించారు. -
'ఏపీలో స్మార్ట్ సిటీలు ఏర్పాటు చేస్తాం'
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏర్పాటు చేసిన ప్రొ.శివరామకృష్ణన్ కమిటీ వచ్చే నెలాఖరులోగా తన నివేదికను అందజేస్తుందని ఆ రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ వెల్లడించారు. బుధవారం హైదరాబాద్‌లో నారాయణ విలేకర్లతో మాట్లాడుతూ... రాజధానితోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని ఇతర ప్రాంతాల అభివృద్ధిపై కూడా కమిటీ సూచనలు చేస్తుందని తెలిపారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలను పారిశ్రామికంగా అభివృద్ది చేస్తామన్ని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్మార్ట్ సిటీలను ఏర్పాటు చేస్తామని నారాయణ వెల్లడించారు. -
'ఏపీ రాజధాని కోసం సింగపూర్ వెళ్తున్నాం'
కృష్ణా - గుంటూరు జిల్లాల మధ్యే ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పాటు చేసే అవకాశాలు అధికంగా ఉన్నాయని ఆ రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లో మంత్రి పి.నారాయణ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ప్రపంచస్థాయిలో నిర్మించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావిస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో రాజధాని నిర్మాణానికి డిజైన్‌ను రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఆ డిజైన్ ఆరు నెలలో పూర్తవుతుందని చెప్పారు. రాజధానిపై అధ్యాయనం కోసం ఈ నెలాఖరులో సింగపూర్ పయనమవుతున్నట్లు నారాయణ వెల్లడించారు. రాజధాని నిర్మాణం నేపథ్యంలో తమ నగరాన్ని పరిశీలించాలని సింగపూర్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆహ్వానించిందని ఆయన ఈ సందర్బంగా గుర్తు చేశారు. అందులోభాగంగా సింగపూర్ నగరాన్ని పరిశీలించేందుకు ఈ నెలాఖరులో పయనమవుతున్నట్లు నారాయణ చెప్పారు. సాధారణ రాజధాని నిర్మాణానికి రూ. 94 వేల కోట్లు... అదే ప్రపంచస్థాయి రాజధాని నిర్మాణానికి రూ. లక్షా యాభై వేల కోట్లు అవసరమవుతాయని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజధానికి 184 కిలోమీటర్ల పరిధిలో ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు నారాయణ పేర్కొన్నారు. In English AP govt team set to visit Singapore for AP capital -
సర్పంచ్ కూడా కాని వ్యక్తికి మంత్రి పదవా ?
తన విద్యా వ్యాపారాన్ని విస్తరించుకునే క్రమంలో ప్రభుత్వ పాఠశాలలను కనుమరుగు చేయడానికి రాష్ట్ర మంత్రి పి.నారాయణ ప్రయత్నిస్తున్నారని భారత విద్యార్థి సమైక్య (ఎస్ఎఫ్ఐ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి నూర్ మహ్మద్ ఆరోపించారు. బుధవారం అనంతపురంలో విలేకర్ల సమావేశంలో నూర్ మహ్మద్ మాట్లాడారు. రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పదవి చేపట్టిన నారాయణ గ్రామ సర్పంచ్ పదవికి అనర్హుడు ఆయన ఎద్దేవా చేశారు. అలాంటి వ్యక్తికి రాష్ట్ర మంత్రి పదవి ఎలా ఇస్తారంటూ ఆయన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. పాఠశాలలో అధిక ఫీజులతో విద్యార్థుల తల్లిదండ్రుల జేబులు కత్తిరిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. మంత్రి నారాయణ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యా సంస్థలన్నీ అసౌకర్యాల మధ్య నడుస్తున్నాయని నూర్ మహ్మద్ ఆరోపించారు. -
'నారా'యణ మంత్రం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తారక మంత్రాన్ని తత్కాలికంగా పక్కనపెట్టి... నారాయణ మంత్రాన్ని జపిస్తున్నారు. అటు శాసనసభలో, ఇటు శాసన మండలిలో సభ్యుడు కానీ ప్రముఖ విద్యాసంస్థల అధినేత పి. నారాయణను చంద్రబాబు ఏకంగా తన కేబినెట్లోకి తీసుకున్నారు. అంతేనా ప్రభుత్వశాఖలలో అత్యంత ముఖ్యమైన శాఖ మున్సిపల్, పట్టణాభివృధ్దిని నారాయణకు అప్పగించేశారు. టీడీపీ స్థాపించిన నాటి నుంచి పార్టీలో ఉన్న తమకు రాకుండా ఏ సభలో సభ్యుడు కానీ నారాయణ పార్టీలోకి ఇలా వచ్చి అలా మంత్రి పదవి ఎలా ఎగరేసుకుపోయాడా అని తెలుగు తమ్ముళ్లు తెగ బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారని సమాచారం. అసలు విషయానికి వస్తే.... 90వ దశకంలో క్రియటీవ్ డైరెక్టర్ దర్శకత్వంలో వచ్చిన ఓ చిత్రంలో చేపల కృష్ణలా ఏదో చట్ట సభలో అధ్యక్ష అని పిలిపించుకోవాలని ఎన్నాళ్ల నుంచో నారాయణ ఎంతో ఆశగా ఉన్నారు. ఇటీవల జరిగిన పెద్దల సభ ఎన్నికల్లో పోటీ చేసి అధ్యక్ష అనిపించుకోని తన ముచ్చట తీర్చుకోవాలని నారాయణ ఆశించారు. అంతే ఇంకా ఆలస్యం చేయకుండా తాను రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగితానంటూ చంద్రబాబు చెవిలో ఊదారు. సామదానభేదోపాయలు ఉపయోగించి అయినా గెలుస్తానని చెప్పుకొచ్చారు. అయితే నారాయణ అధ్యక్ష ఆశలపై.... అప్పట్లో బాబు నీళ్లు చల్లారు. దాంతో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలో టీడీపీని గెలిపిస్తే ఏ సభలో సభ్యుడు కాకపోయినా మంత్రి పదవి కట్టబెడతానంటూ నారాయణకు చంద్రబాబు హామీ ఇచ్చారు. అంతే నారాయణ రంగంలోకి దిగారు. నారాయణమంత్రంతో... ఉత్తరాంధ్రలోని మొత్తం 34 అసెంబ్లీ స్థానాలకు గాను 24 అసెంబ్లీ స్థానాలు టీడీపీ కైవసం చేసుకుంది. అంతేకాకుండా విశాఖపట్నం,అనకాపల్లి, శ్రీకాకుళం, విజయనగరం పార్లమెంట్ సీట్లు సైతం ఆ పార్టీ కైవసం చేసుకుంది. దాంతో నారాయణకు చంద్రబాబు తన కేబినెట్లో మంత్రి పదవి కట్టబెట్టారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఓ దశలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పదవికి నారాయణను చంద్రబాబు ఎంపిక చేశారంటూ పుకార్లు షికారు చేసిన సంగతి తెలిసిందే. -
ఆంధ్ర డిప్యూటీ సీఎంగా నారాయణ!
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇద్దరు ఉపముఖ్యమంత్రులను నియమిస్తానని చెప్పిన టీడీపీ అధినేత చంద్రబాబు అందులో ఒకరు నారాయణ విద్యాసంస్థల యజమాని పి.నారాయణ పేరును ఖరారు చేసినట్టు తెలిసింది. ఈ విషయాన్ని చంద్రబాబు సన్నిహితులు ధ్రువీకరించారు. బాబు సన్నిహితుల్లో ఒకరైన నారాయణ ప్రస్తుతం ఏ సభలోనూ సభ్యుడు కారు. కాపు సామాజికవర్గానికి చెందిన ఆయన ఇటీవలి ఎన్నికల్లో పార్టీ తరపున ఉత్తరాంధ్ర జిల్లాల బాధ్యతను తీసుకున్నారు. కానీ, ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఏ సభలో సభ్యుడు కాని వ్యక్తి సీఎం, డిప్యూటీ సీఎం లేదా మంత్రి బాధ్యతలు చేపడితే ఆరు నెలల్లోగా ఎగువ, దిగువ సభల్లో ఏదో ఒక దానిలో సభ్యుడు కావాలి. దీంతో ఆయన్ను గవర్నర్ కోటాలో లేదంటే స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా పంపే అవకాశముంది.