
రెండు రోజుల్లో సీఆర్‌డీఏ బిల్లు నిబంధనల నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ) బిల్లుకు సంబంధించిన నిబంధనలకు రెండు రోజుల్లో నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు మున్సిపల్ శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ) బిల్లుకు సంబంధించిన నిబంధనలకు రెండు రోజుల్లో నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు మున్సిపల్ శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు. నోటిఫికేషన్ తర్వాతే భూసమీకరణ పని ప్రారంభిస్తామన్నారు.
సీఆర్‌డీఏ నిబంధనలపై ఏవిధమైన చట్టపరమైన సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అభివృద్ధిని ఓర్పలేకే రాజధాని ప్రాంతంలో పంట పొలాలను దగ్ధం చేశారని మంత్రి ఆరోపించారు.