crda bill
-
ఏఎంఆర్డీఏను నోటిఫై చేస్తూ ఉత్తర్వులు జారీ
-
మూడు రాజధానులు: రాష్ట్రమంతా సంబరాలు
కర్నూలు: ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల బిల్లును గవర్నర్ ఆమోదించిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. సంబరాలు జరుపుకుంటూ హర్షాతిరేకాలు ప్రకటిస్తున్నారు. మూడు ప్రాంతాల ప్రజలు పాలనా వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల అభివృద్ధికి వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. పశ్చిమగోదావరి: ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ పెద్ద ఎత్తున సంబరాలను నిర్వహించింది. రాజధాని వికేంద్రీకరణ బిల్లును గవర్నర్ ఆమోదించడంతో సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి, స్వీట్లు పంచుకుని, బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. కర్నూలు జిల్లా: పాలన వికేంద్రీకరణతో మూడు ప్రాంతాల అభివృద్ధికి బాటలు వేస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి కర్నూలు జిల్లా పత్తికొండ ఎమ్మెల్యే చెరుకులపాడు శ్రీదేవి, వైఎస్సార్సీపీ నేత ప్రదీప్ రెడ్డి పాలాభిషేకం చేశారు. ►జిల్లాలోని నందికొట్కూరులో పటేల్ కూడలి వద్ద వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నాయకులు, లాయర్ బార్ అసోసియేషన్ సభ్యులు బాణా సంచా పేల్చి, స్వీట్లు పంచుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. ►కర్నూలును జ్యుడిషియల్ క్యాపిటల్‌గా ప్రకటించినందుకు ఆదోని బార్ అసోసియేషన్ సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపింది. ఇది కర్నూలు న్యాయవాదుల, ప్రజల చిరకాల కోరిక. మా ఆందోళనకు సహకరించిన అన్ని సంఘాల సంఘ ప్రజలకు, అన్ని పార్టీ ప్రజలకు మా కృతజ్ఞతలు అంటూ ఆదోని బార్ అసోసియేషన్ మూడు రాజధానులను స్వాగతించింది. ►రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడంతో ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి ఆళ్ళగడ్డ నాలుగు రోడ్ల కూడలిలో టపాకాయలు కాల్చి హర్షం వ్యక్తం చేశారు. అనంతరం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వైఎస్సార్ జిల్లా: మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదంపై కడపలో వైఎస్సార్సీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. రాజధాని వికేంద్రీకరణ బిల్లును గవర్నర్ ఆమోదించడాన్ని స్వాగతిస్తూ వైసీపీ కడప పార్లమెంటు అధ్యక్షులు సురేష్ బాబు అధ్యక్షతన నగరంలో కేక్ కట్ చేసి ఆనందాన్ని వ్యక్తం చేశారు. -
మూడు రాజధానులకు రాజముద్ర పడిందిలా..
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల అంశాన్ని ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలో సుదీర్ఘ వాదనలు, కోర్టు కేసులు, శాసనమండలిలో నాటకీయ పరిణామాల అనంతరం సీఆర్డీఏ రద్దు, పరిపాలన వికేంద్రీకరణ బిల్లుకు శుక్రవారం రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఆమోద ముద్ర వేశారు. మూడు రాజధానులకు తొలినుంచీ వ్యతిరేకంగా కుట్రలు పన్నిన ప్రతిపక్ష టీడీపీకి ఈ పరిణామం కంటగింపులాంటిదే. మండలిలో బిల్లును అడ్డుకోవడం, కోర్టుల్లో కేసుల వేయడం వంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను పాల్పడ్డ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బిల్లుకు గవర్నర్ చేత ఆమోదం లభించకుండా ఉండేందుకు చివరి వరకూ ప్రయత్నాలు చేశారు. (మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదం) ప్రభుత్వ నిర్ణయానికే ఓటు.. అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం మేరకు ప్రజా ఆమోదం కలిగిన శాసనసభ రెండుసార్లు ఆమోందించిన బిల్లును వెనక్కిపంపడం భావ్యం కాదని భావించిన గవర్నర్ హరిచందన్ ప్రభుత్వ నిర్ణయానికే ఓటు వేశారు. అనేక వివాదాలు నెలకొన్న నేపథ్యంలో మూడు వారాల పాటు బిల్లును పూర్తిగా పరిశీలించిన అనంతరమే మూడు రాజధానులకు రాజముద్ర వేశారు. శాసనసభ ఆమోందించిన వెంటనే తన నిర్ణయం చెప్పని గవర్నర్ వికేంద్రీకరణ బిల్లుపై సమగ్ర పరిశీలన జరిపారు. బిల్లుకు సంబంధించి పలు అంశాలపై విస్తృత పరిశీలన చేశారు. కోర్టు కేసుల నేపథ్యంలో న్యాయ నిపుణుల అభిప్రాయాలు సైతం తీసుకున్నారు. (పరిపాలన రాజధానికి త్వరలోనే శంకుస్థాపన) బిల్లు తీసుకురావడంలో శాసనసభ అనుసరించిన విధానాన్ని పరిశీలించారు. అంతేకాకుండా హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసుల అంశాన్నికూడా గవర్నర్ పరిగణలోకి తీసుకుని తన నిర్ణయాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు పెండింగ్‌లో ఉన్న కేసులు.. బిల్లుల ఆమోదంపై ప్రభావితం చూపుతాయా? అన్న అంశంపై న్యాయ నిపుణలతో చర్చించి, పరిశీలించారు. పునర్విభజన చట్టానికి అనుగుణంగా ఉందా? అనే అంశంపై సైతం ఆరా తీశారు. శాసన మండలిలో జరిగిన సంఘటనలపై.. శాసనసభ కార్యదర్శి నుంచి నివేదిక తెప్పించుకుని అధ్యాయం చేశారు. చంద్రబాబు, కన్నా, శైలజానాద్‌లో హైకోర్టులో దాఖలు చేసిన వివిధ పిటిషన్లను పరిశీలించి 3 వారాల విస్తృత పరిశీలన, సంప్రదింపుల తర్వాత మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపారు. (గవర్నర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం) -
'అజ్ఞాతవాసి ఇకనైనా కళ్లు తెరువు'
సాక్షి, ఏలూరు: మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మూడు రాజధానులు బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడంపై భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. సీఆర్డీఏ రద్దు, పరిపాలన వికేంద్రీకరణ బిల్లును అడ్డుకోవాలన్న చంద్రబాబు కుట్రలను సమాధి చేసిన శుభదినం. రాజధాని ఎప్పటికీ మారదు మారదు అంటూ చంద్రబాబుకు వంత పాడిన పవన్ కల్యాణ్‌కి ఇది దుర్దినం. ప్రజలకు శుభదినం. మూడు రాజధానులు ప్రజల కోరిక. మూడు ప్రాంతాల అభివృద్ధి విజ్ఞులు ఆలోచన. ఇకనైనా అజ్ఞాతవాసి ట్విట్టర్ నివాసి పవన్ కల్యాణ్ కళ్లు తెరువు అని గ్రంధి శ్రీనివాస్ హితువు పలికారు. రాష్ట్ర ప్రజల విజయం: కొట్టు సత్యనారాయణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆకాంక్ష పరిపాలన వికేంద్రీకరణగా మూడు రాజధానులు బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపటం ఎంతో శుభసూచకమని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ అన్నారు. గత ముఖ్యమంత్రి చంద్రబాబు దురుద్దేశంతో దోపిడీ చేయాలనే ఆలోచనతో ప్రవేశపెట్టిన సీఆర్డీఏ బిల్లును రద్దు చేయడం ఎంతో ఆనందదాయకం. అన్ని ప్రాంతాలకు సమగ్రమైన అభివృద్ధి కావాలనే ఉద్దేశ్యంతో చేపట్టిన ఈ యజ్ఞం విజయవంతం కావటం రాష్ట్ర ప్రజల విజయంగా భావిస్తున్నారు. ప్రజలందరికీ జగన్మోహన్ రెడ్డిపై పూర్తి నమ్మకం ఉందని ఈ రోజు గవర్నర్ నిర్ణయాలే తెలియజేస్తున్నాయి. సీఎం వైఎస్ జగన్ ఆంధ్ర రాష్ట్రాన్ని భారతదేశంలోనే ప్రముఖమైన రాష్ట్రంగా తీర్చిదిద్దుతారనడంలో ఎలాంటి సందేహం లేదని కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. రాష్టానికి శుభదాయకం: ఎంపీ భరత్ అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదంపై రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ మాట్లాడుతూ.. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానులతో పాటు.. రెండు రాజధానుల నడుమ ఉన్న గోదావరి జిల్లాలు కూడా అభివృద్ధి అయ్యేందుకు అవకాశం ఏర్పడుతుంది. వెనుకబడిన 3 ఉత్తరాంధ్ర జిల్లాలతోపాటు 4 రాయలసీమ జిల్లాలు కూడా రాజధాని వికేంద్రీకరణతో అభివృద్ధి చేయడానికి వీలు కలుగుతుంది. శ్రావణ శుక్రవారం రోజు ఈ నిర్ణయం వెలువడటం రాష్టానికి శుభదాయకం అని మార్గాని భరత్ తెలిపారు. కృష్ణా: పరిపాలన వికేంద్రీకరణ బిల్లు ఆమోదంపై ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను హర్షం వ్యక్తం చేశారు. పరిపాలన వికేంద్రీకరణను దృష్టిలో ఉంచుకుని మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారని తెలిపారు. పరిపాలనా రాజధానిగా విశాఖ, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు గుర్తింపు పొందునునట్లు ఉదయభాను వివరించారు. -
యనమల ఏమైనా గవర్నర్‌కు సలహాదారా?
సాక్షి, విజయవాడ: మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలపడం పట్ల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనమండలి చీప్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు హర్షం వ్యక్తం చేశారు. ఉమ్మారెడ్డి విజయవాడలో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. 'అసెంబ్లీలో రెండు సార్లు ఆమోదం పొందితే నిబంధనలు ప్రకారం ఆ బిల్లును గవర్నర్ ఆమోదిస్తారన్నది సత్యం. ఈ దశలో కూడా గవర్నర్‌ను ప్రతిపక్షనేత యనమల తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేశారు. బిల్లులను రాష్ట్రపతికి పంపించమని లేఖ రాయడం వెనుక అంతర్యం ఏమిటి? యనమల ఏమైనా గవర్నర్‌కు సలహాదారా' అంటూ ప్రశ్నించారు. (మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదం) 'నారాయణ కమిటీ నివేదికతో అమరావతిని రాజధానిగా ఎంపిక చేసి, శివరామకృష్ణన్ కమిటీ చెప్పిందంటూ యనమల తన లేఖలో రాశారు. ఇది శివరామకృష్ణన్ కమిటీని కూడా అవమానపరచడమే అవుతుంది. ఏది ఏమైనా ఈ రోజు గవర్నర్ వికేంద్రీకరణ, సీఆర్డీడీయే రద్దు బిల్లులు రెండింటినీ ఆమోదించారు. ఇప్పటికైనా విపక్ష తెలుగుదేశం నేతలు చెంపలు వేసుకుని గవర్నర్ నిర్ణయానికి మద్ధతు పలకాలి. రాజ్యాంగబద్ద నిర్ణయాలకు గౌరవం ఇవ్వాలి' అన్నారు. సీఆర్డీఏ-2014 రద్దు, వికేంద్రీకరణ-ప్రాంతీయ సమానాభివృద్ధి బిల్లు, పాలనా వికేంద్రీకరణ బిల్లులకు గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ శుక్రవారం ఆమోదం తెలిపారు. రాష్ట్ర శాసనసభను ఆమోదం తెలిపి బిల్లును పరిశీలించిన గవర్నర్.. తన ఆమోద ముద్రవేశారు. తాజా నిర్ణయంతో ఇకపై పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు గుర్తింపు పొందనున్నాయి. -
గవర్నర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: బీజేపీ
సాక్షి, న్యూఢిల్లీ : సీఆర్డీఏ రద్దు, పరిపాలన వికేంద్రీకరణ బిల్లుకు ఆమోదం తెలుపుతూ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ స్వాగతిస్తోందని ఆ పార్టీ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తెలిపారు. రాజ్యాంగానికి లోబడే గవర్నర్ నిర్ణయం ఉందని పేర్కొన్నారు. శుక్రవారం ఢిల్లీలో మాట్లాడిన జీవీఎల్ గవర్నర్ వ్యవస్థపై తమకు నమ్మకం ఉందని స్పష్టం చేశారు. రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వ పాత్ర లేదన్న విషయాన్ని తాము పార్లమెంటులోనే చెప్పామని గుర్తుచేశారు. రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోనిది.. కేంద్రానికి సంబంధం లేదని చెప్పారు. రాయలసీమలో హైకోర్టు పెట్టాలని తాము మేనిఫెస్టోలో పెట్టామన్నారు. రాజధాని రైతులకు న్యాయం జరగాలన్నదే బీజేపీ వైఖరిని పేర్కొన్నారు. గవర్నర్ నిర్ణయానికి కేంద్రంతో సంబంధం లేదని స్పష్టం చేశారు. (మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదం) ‘అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా గవర్నర్ వ్యవస్థపై మాట్లాడే పార్టీలు ఉన్నాయి. స్వార్థ రాజకీయాల కోసం అమరావతిని రాజధానిగా టీడీపీ ఎంచుకుంది. చంద్రబాబు అనేక పిచ్చి నిర్ణయాలు తీసుకున్నారు. రాజ్యాంగం తనకు అనుకూలంగా పనిచేయాలనుకోవడం చంద్రబాబుకు సరికాదు. నాడు రాజధానిపై చర్చ సందర్భంగా అమరావతి తాత్కాలిక భవనాలు మాత్రమే కట్టాడమని కేంద్రం చెప్పింది. కేంద్రంపై టీడీపీ ఇకనైనా దుష్ప్రచారం చేయడం మానుకోవాలి. సీబీఐని రాష్ట్రంలోకి రానివ్వకుండా బాబు మూర్ఖంగా వ్యవహరించారు. ఫెడరల్ స్ఫూర్తితో పని చేస్తున్నాం.’ అని జీవీఎల్ పేర్కొన్నారు. -
నెరవేరిన ఆరు దశాబ్దాల కల
సాక్షి, కర్నూలు : మూడు రాజధానులు బిల్లుకు గవర్నర్ బిశ్వభూషన హరిచందన్ ఆమోదం తెలపడంపై రాష్ట్ర వ్యాప్తంగా పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. న్యాయ రాజధాని కర్నూలు ప్రజలు, ప్రజాప్రతినిధులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బిల్లుకు ఆమోదం తెలిపిన సందర్భంగా కర్నూలు నడిబొడ్డున గల కొండారెడ్డి బురుజు వద్ద సంబరాలు జరపుకున్నారు. ఎన్నో ఏళ్లుగా చేస్తున్న పారాటానికి నేడు ప్రతిఫలం లభించిందని ఆ జిల్లా ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. సీఆర్డీఏ-2014 రద్దు, పాలనా వికేంద్రీకరణ బిల్లులకు గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ శుక్రవారం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. దీనిపై స్థానిక ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ మాట్లాడుతూ.. కర్నూలును న్యాయ రాజధానిగా ఎంపిక చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడమే సీఎం జగన్ లక్ష్యమన్నారు. కర్నూలులో న్యాయ రాజధానిని స్వాగతిస్తున్నామన్నారు. న్యాయ రాజధాని కర్నూలుకు రావాలన్నది మా కలఅని, 6 దశాబ్దాల మా కల ఇన్నాళ్లకు నెరవేరిందని పేర్కొన్నారు. మా కలను నెరవేర్చిన సీఎం జగన్‌కు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ కృతజ్ఞతలు తెలిపారు. (మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదం) హైకోర్టు ఏర్పాటు వల్ల సీమకు న్యాయం మూడు రాజధానుల బిల్లుకు ఆమోదం తెలిపిన గవర్నర్ నిర్ణయంపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు ఆలూరు రామిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రాయలసీమలో జ్యూడిషియల్ క్యాపిటల్ స్వాగతిస్తున్నామన్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు వల్ల రాయలసీమకు న్యాయం జరుగుతుందని, మూడు రాజధానుల వల్ల ప్రాంతీయ అసమానతలు ఉండవని అభిప్రాయపడ్డారు. ఈరోజు చారిత్రాత్మకమైన రోజుని ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అన్నారు. పాలనా వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందడాన్ని అందరూ స్వాగతిస్తున్నారు. చంద్రబాబు కుట్రలన్నీ విఫలమయ్యాయి. రియల్ ఎస్టేట్ కోసం చంద్రబాబు కుట్రలు పన్నితే... అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం సీఎం జగన్ ఆలోచన చేశారు’ అని అన్నారు. -
అసెంబ్లీ ముందుకు CRDA సవరణ బిల్లు
-
ఎవరు అడ్డొచ్చినా.. రెండో పంట వేసి తీరతాం!
-
'మా భూములు ఇవ్వం' అంటూ.. ఫ్లెక్సీలు!!
-
అసలీ ప్రభుత్వానికి సిగ్గుందా?
హైదరాబాద్: ఏపీ మంత్రులు అలీబాబా దొంగల ముఠాలా వ్యవహరిస్తున్నారని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. హైదరాబాద్ లో శనివారం ఆమె మాట్లాడుతూ సీఆర్డీఏ బిల్లును మెకన్సీ అనే బ్రిటిష్ సంస్థకు అప్పగించడం దారుణమన్నారు. మెకన్సీ రూపొందించిన బిల్లును అసెంబ్లీలో ఆమోదింపజేసిన ప్రభుత్వానికి సిగ్గుందా అంటూ ప్రశ్నించారు. రాజధాని బిల్లును కూడా రూపొందించలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నామా అని ఆమె ఎద్దేవా చేశారు . చంద్రబాబు ఏపీని దేశానికి గేట్వేగా మార్చడం కాదని.. ప్రైవేటు సంస్థల దోపిడీకి గేట్ వేగా మారుస్తున్నారంటూ ఆమె ధ్వజమెత్తారు. సింగపూర్ బృందం బందిపోట్లలా అర్ధరాత్రి పర్యటించడమేంటని, ఇది ప్రజాస్వామ్యమా లేక బ్రిటిష్ పాలనా అని ప్రశ్నించారు. ప్రపంచం అంతా భారత్ వైపు చూస్తుంటే చంద్రబాబు మాత్రం విదేశాల వైపు చూస్తున్నారంటూ విమర్శించారు. బిల్లును విదేశీ సంస్థకు అప్పగించడంపై న్యాయ విచారణ జరిపించాలని పద్మ డిమాండ్ చేశారు. రాజధాని నిర్మాణం పేరుతో విదేశాలతో చంద్రబాబు చేసుకున్న ఒప్పందాలను బయటపెట్టాలన్నారు. -
భూముల వివరాలను వెల్లడిస్తూ నోటీసులు
గుంటూరు : రాజధాని ప్రతిపాదిన గ్రామాల్లో భూ సమీకరణకు నోటిఫికేషన్లు జారీ అవటంతో 27 గ్రామాల్లో భూముల వివరాలను వెల్లడిస్తూ పంచాయతీ కార్యాలయాల్లో అధికారులు నోటీసులు పెట్టారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు అన్ని గ్రామాలకు ప్రత్యేక బృందాలు చేరుకోనున్నాయి. స్వచ్ఛందంగా వచ్చి భూములు ఇచ్చే రైతులకు అధికారులు రశీదులు ఇవ్వనున్నారు. రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ) ద్వారా రాష్ట్ర రాజధాని నిర్మాణానికి అవసరమైన భూములను సమీకరించడంలో అనుసరించాల్సిన నిబంధనలను వెల్లడిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా భూ సమీకరణకు ఒక్కసారి సమ్మతి పత్రాలు ఇస్తే సమీప భవిష్యత్తులో ఇక ఎలాంటి అదనపు పరిహారం కోరేందుకు రైతులకు వీలు లేకుండా నిబంధనలు విధించారు. భూములు కోల్పోయిన రైతులు నిరసనలకు దిగడం, కోర్టులకు వెళ్లడం చేయరాదు. భూములపై ఏవైనా బకాయిలు ఉంటే పరిహారంలో ఆ మొత్తాన్ని మినహాయించుకుని మిగతా సొమ్మును మాత్రమే రైతులకు ప్రభుత్వం ఇస్తుంది. భూములిచ్చే రైతులు ఆస్తి పన్ను చెల్లింపు రశీదులతో సహా యాజమాన్య ధ్రువీకరణ పత్రాలన్నీ (ఒరిజినల్) ప్రభుత్వానికి సమర్పించాలి. భూములిచ్చే రైతులు వాటిపై వివాదాలు, లోపాలు ఉంటే వారే బాధ్యత వహించాలి. -
రూల్స్ ఖరారు..
* విమర్శల జడితో భూ సమీకరణ నిబంధనలపై అధికారుల హడావుడి * రాజధానికి భూములు ఇచ్చే రైతులకు తక్షణమే అధికారిక రశీదు * భూములు ఇవ్వని రైతుల వివరాలు సీఆర్డీఏ కమిషనర్‌కు నివేదిక * భూ సమీకరణ పూర్తయ్యాక లాటరీ పద్ధతిలో రైతులకు ప్లాట్లు * భూ అభివృద్ధి ప్రణాళికను బట్టి 5 కి.మీ. లోపునే రైతులకు ప్లాట్లు * రైతులకు ప్లాట్లు ఇవ్వగా మిగిలిన భూమి మొత్తం సీఆర్డీఏకే * తుది నోటిఫికేషన్ తర్వాత మూడేళ్లలో సదుపాయాల కల్పన * భూములు లేని కుటుంబాలకు పదేళ్ల పాటు నెలకు రూ. 2,500 * గ్రామాల్లో రైతులకు ప్రభుత్వం నివాస అర్హతా పత్రాలు ఇస్తుంది * నిబంధనలు లేకుండానే భూసమీకరణకు వెళ్లడంపై విమర్శలు వెల్లువెత్తడంతో ఆగమేఘాలపై నిబంధనలతో సర్కారు జీవో జారీ ఒక్కసారి ఒప్పందం చేసుకుంటే... భూ సమీకరణకు ఒక్కసారి సమ్మతి పత్రాలు ఇస్తే సమీప భవిష్యత్తులో ఇక ఎలాంటి అదనపు పరిహారం కోరేందుకు రైతులకు వీలులేకుండా నిబంధనలు విధించారు. భూములు కోల్పోయిన రైతులు నిరసనలకు దిగడం, కోర్టులకు వెళ్లడం చేయరాదు. భూములపై ఏవైనా బకాయిలు ఉంటే పరిహారంలో ఆ మొత్తాన్ని మినహాయించుకుని మిగతా సొమ్మును మాత్రమే రైతులకు ప్రభుత్వం ఇస్తుంది. భూములిచ్చే రైతులు ఆస్తి పన్ను చెల్లింపు రశీదులతో సహా యాజమాన్య ధ్రువీకరణ పత్రాలన్నీ (ఒరిజినల్) ప్రభుత్వానికి సమర్పించాలి. భూములిచ్చే రైతులు వాటిపై వివాదాలు, లోపాలు ఉంటే వారే బాధ్యత వహించాలి. సాక్షి, హైదరాబాద్: రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ) ద్వారా రాష్ట్ర రాజధాని నిర్మాణానికి అవసరమైన భూములను సమీకరించడంలో అనుసరించాల్సిన నిబంధనలను వెల్లడిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ‘ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం భూ సమీకరణ పథకం (రూపకల్పన, అమలు) నిబంధనలు 2015’ పేరుతో ఈ ఉత్తర్వులిచ్చారు. నిజానికి శుక్రవారం జరిగే మంత్రిమండలి సమావేశంలో చర్చించి నిర్ణయించాలని భావించినప్పటికీ విధివిధానాలు ఖరారు కాకుండానే భూ సమీకరణ ప్రక్రియ ప్రారంభించడంపై విమర్శలు వెల్లువెత్తడంతో గురువారం నాడు ఆగమేఘాలపై ఈ ఉత్తర్వులను జారీ చేశారు. ఇందులో రైతులకు ఇచ్చే పరిహారం, ఎన్ని రోజుల్లో చెలించాలి, మెట్ట, జరీబు, అసైన్డ్ భూములకు ఎంత చెల్లించాలి అనే వివరాలు పొందుపరిచారు. రాజధాని ప్రాంతంలో రోడ్లు, ఉద్యానవనాలు, బలహీన వర్గాలకు ఎంత మేరకు స్థలాలు కేటాయించిందీ సూచించారు. భూసమీకరణకు తుది నోటిఫికేషన్ ఇవ్వడం, రైతుల నుంచి అభ్యంతరాల స్వీకరణ తదితర విషయాలు వెల్లడించారు. భూసమీకరణకు అంగీకరించని యజమానుల వివరాలు సేకరించి సీఆర్డీఏ కమిషనర్‌కు నివేదిక రూపంలో ఇవ్వాలని నిబంధనల్లో పేర్కొన్నారు. నోటిఫికేషన్ జారీ చేసిన 180 రోజుల్లోగా భూ యజమానులతో సంప్రథించి ఏ విధానంలో భూ సమీకరణ చేస్తున్నారన్న విధానాన్ని ప్రకటించాలి. గతంలో ప్రకటించినట్టే మెట్ట, జరీబు, అసైన్డ్ భూములకు నివాస, వాణిజ్య స్థలాలను ఎంతమేరకు ఇవ్వాలి, పరిహారం ఎంత ఇవ్వాలనేది నిబంధనల్లో స్పష్టం చేశారు. ఉత్తర్వులు, నిబంధనల్లోని ముఖ్యాంశాలివీ... * భూసేకరణ చేస్తే వాస్తవ ధర కంటే తక్కువ పరిహారం వస్తుందని రైతులు అసంతృప్తి వ్యక్తంచేయడంతో... రాజధాని అభివృద్ధిలో నిర్వాసితులనూ భాగస్వాములను చేయడానికి భూ సమీకరణ పథకాన్ని ప్రభుత్వం ప్రకటించింది. * భూములు లేని కుటుంబాలకు నెలకు రూ. 2,500 చొప్పున పది సంవత్సరాల పాటు ఇవ్వాలి. * భూ సేకరణ పథకం కింద తీసుకున్న భూమి వినియోగం తీరు.. రాజధాని అవసరాలకు అనుగుణంగా రూపొందనున్న మాస్టర్ ప్లాన్‌లో ఉన్న విధంగా ఆటోమేటిక్‌గా మారుతుంది. * సేకరించిన భూములను విభజించి లేదా కలిపి.. అవసరాలకు అనుగుణంగా మార్చి అభివృద్ధి చేసుకొనే హక్కు సీఆర్డీఏకు ఉంటుంది. ప్రస్తుతం ఉన్న రహదారులను వాడుకోవడానికి వీలుగా సేకరించిన భూమిని అవిచ్ఛిన్న భాగాలుగా మారుస్తారు. * మౌలిక సదుపాయాల కల్పన, ఇతర సౌకర్యాల కల్పనకు, భూ సమీకరణ పథకానికి అయ్యే వ్యయం సీఆర్డీఏ చట్టంలో పేర్కొన్న 44-47 సెక్షన్ల ఆధారంగా ఉంటుంది. * భూ సమీకరణ ప్రక్రియను పూర్తిగా లేదా పాక్షికంగా సీఆర్డీఏ స్వయంగా చేపట్టనుంది. ప్రభుత్వం నియమించిన అధికారులు, స్థానిక సంస్థలకు కూడా భూ సేకరణ బాధ్యత అప్పగించడానికి అవకాశం ఉంది. * భూ సమీకరణకు నోటిఫికేషన్ ఇచ్చిన 15 రోజుల్లోగా భూమిని ఎందుకోసం వినియోగిస్తున్నామనే విషయాన్ని పేర్కొంటూ బహిరంగ ప్రకటన విడుదల చేయాలి. భూ యజమానుల నుంచి అభ్యంతరాలు, సలహాలను 15 రోజుల్లో స్వీకరిస్తారు. నోటిఫికేషన్ వెలువడిన 7 రోజుల తర్వాతే భూ యజమానులతో సంప్రతింపులు ఆరంభించాలి. * భూ సమీకరణ పథకం అసలు లక్ష్యం, పథకం అమలు, సీఆర్డీఏ పాత్ర, దాని బాధ్యతలు, భూమి సర్వే నంబర్లు, విస్తీర్ణం, యాజమాన్య వివరాలు.. సమగ్ర వివరాలు నోటిఫికేషన్లో ఉండాలి. భూ యజమానులకు ఇవ్వనున్న ప్యాకేజీలు, పరిహారం, భూములు లేని కుటుంబాలకు కల్పించనున్న లబ్ధి.. తదితర వివరాలనూ పేర్కొనాలి. జిల్లా గెజిట్, రెండు ప్రముఖ దినపత్రికల్లో (కనీసం ఒక తెలుగు పత్రికలో) ప్రచురించడంతో పాటు గ్రామ పంచాయతీ మొదలు కలెక్టర్ కార్యాలయం వరకు అన్ని రెవెన్యూ కార్యాలయాల్లో నోటిఫికేషన్ ప్రముఖంగా కనిపించే విధంగా ఏర్పాటు చేయాలి. వెబ్సైట్లోనూ పెట్టాలి. * అభ్యంతరాలు, సూచనలు స్వీకరించిన తర్వాత 15 రోజుల్లో తుది నోటిఫికేషన్ జారీ చేయాలి. భూ యాజమాన్యానికి సంబంధించిన అభ్యంతరాలపై 30 రోజుల్లో పరిశీలన జరిపి తుది నిర్ణయం తీసుకోవాలి. * భూ సమీకరణలో పాల్గొనడానికి సమ్మతించిన రైతుల నుంచి దరఖాస్తులు తీసుకోవడంతో పాటు వారికి అధికారికంగా సీఆర్డీఏ రసీదులు ఇస్తుంది. * భూ సమీకరణకు నిరాకరించిన రైతులు, భూముల జాబితాను అధికారులు సేకరించి పూర్తి వివరాలతో సీఆర్డీఏ కమిషనర్‌కు నివేదిక ఇవ్వాలి. * భూ యాజమాన్య హక్కులను పరిశీలించి నిర్ధారించిన తర్వాత ఆయా భూముల యజమానులతో సదరు భూమి సరిహద్దులు మార్చకుండా, ఇతర మార్పులు చేయకుండా సీఆర్డీఏ ఒప్పందం చేసుకుంటుంది. * యాజమాన్య హక్కుల విషయంలో అపరిష్కృతంగా ఉన్న కేసులను సంబంధిత కోర్టుకు నివేదించి, భూ సమీకరణ పరిధి నుంచి మినహాయింపు రాకుండా సీఆర్డీఏ చర్యలు తీసుకుంటుంది. భూ సమీకరణ లక్ష్యాన్ని ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ చేసిన 180 రోజుల్లోగా భూ యజమానులతో సంప్రదించి భూ సమీకరణ పథకం ముసాయిదాను రూపొందించాలి. భూ సేకరణ చట్టం 2013 కింద సేకరించే భూముల వివరాలనూ ముసాయిదాలో చేర్చాలి. * సమీకరించిన మొత్తం భూమిని సెక్టార్లుగా విభజించడం, వివిధ అవసరాలకు రిజర్వు చేయడం జరుగుతుంది. * తుది నోటిఫికేషన్ జారీ చేసిన 60 రోజుల్లోగా రహదారుల నమూనాను ప్రకటించి, రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లను గుర్తించాలి. భూ అభివృద్ధి ప్రణాళికను బట్టి 5 కిలోమీటర్ల పరిధిలోనే రైతులకు ప్లాట్లను కేటాయించాలి. * ప్లాట్ల గుర్తింపు పూర్తయిన 30 రోజుల్లోగా లాటరీ పద్ధతిలో రైతులకు కేటాయించాలి. లాటరీ తీసే ప్రక్రియను వీడియో తీయాలి. కనీసం మూడో వంతు రైతులు లాటరీ ప్రక్రియను నేరుగా పరిశీలించాలి. * లాటరీ తీసిన 30 రోజుల్లోగా యాజమాన్య ధ్రువీకరణ పత్రాలను రైతులకు అందజేయాలి. భూ అభివృద్ధి రుసుము, రిజిస్ట్రేషన్ల ఖర్చను రైతుల నుంచి తీసుకోకూడదు. రైతులకు ఇవ్వగా మిగిలిన మొత్తం భూమి సీఆర్డీఏకు చెందుతుంది. అందులో పార్కులు, ఆటస్థలాలు, చౌక గృహ నిర్మాణం, రోడ్లతో పాటు సామాజిక అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలి. * తుది నోటిఫికేషన్ వెలువరించిన ఏడాదిలోగా మౌలిక వసుతులైన రోడ్లు, ప్లాట్ల పూర్తిస్థాయి విభజన పనులు పూర్తి చేయాలి. వెంటనే రైతులకు వారికి కేటాయించిన ప్లాట్లను స్వాధీనపరచాలి. * తుది నోటిఫికేషన్ ఇచ్చిన మూడేళ్లలోగా దశల వారీగా మౌలిక సదుపాయాలను పూర్తిస్థాయిలో కల్పించాలి. * అభివృద్ధి పనులు పూర్తయినట్లు సీఆర్డీఏ ప్రకటించిన తర్వాత.. ప్రభుత్వం విధించే అన్ని రకాల పౌర సేవలు, ఇతర వసతుల కల్పన రుసుములను ప్లాట్ల యజమానులే భరించాల్సి ఉంటుంది. * గ్రామాల్లో రైతులకు నివాస అర్హతా పత్రాలను ప్రభుత్వం ఇవ్వనుంది. తద్వారా ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు అవకాశం ఉంటుంది. అభివృద్ధి ప్రణాళికలో భాగంగా ఇళ్లు కోల్పోతే, వారికి పునరావాసం కల్పించడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. రూ. 25 లక్షల వరకు పేదలకు స్వయం ఉపాధి కల్పనకు వడ్డీలేని రుణాలు అందించనుంది. * పార్కులు, ఆటస్థలాలు, ఉద్యానవనాలకు 10 శాతం, రహదారులకు 30 శాతం, సామాజిక అవసరాలకు 5 శాతం, పేదలకు చౌకగా గృహాలు నిర్మించడానికి 5 శాతం భూమిని వినియోగించనున్నారు. * ప్రతి వెయ్యి ఎకరాల సేకరణను ఒక డిప్యూటీ కలెక్టర్ నేతృత్వంలో అధికార బృందం పర్యవేక్షిస్తుంది. -
రూల్స్ లేవ్..!
భూ సమీకరణపై అసెంబ్లీ వేదికగా ఏపీ సర్కారు అబద్ధాలు సీఆర్డీఏ బిల్లు సమయంలో.. రూల్స్‌ను తర్వాత ప్రకటిస్తామన్న చంద్రబాబు రైతులు, కౌలు రైతులు, ఆ భూములపై ఆధారపడ్డ వ్యవసాయ కూలీలు, ఇతర చేతివృత్తిదారులకు ప్రత్యామ్నాయ జీవనోపాధి, పరిహారం ఊసే లేదు రూల్స్ రూపొందించి, వాటిపై అసెంబ్లీలో చర్చించి, ఆమోదించక ముందే.. విధివిధానాలేవీ లేకుండానే సంక్రాంతి లోగా సమీకరణ పూర్తిచేసే తాపత్రయం సాక్షి, హైదరాబాద్: శాసనసభ సాక్షిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అబద్ధాలు చెప్పింది. రాజధానికి అవసరమైన భూములను సమీకరించడానికి నియమ నిబంధనలు (రూల్స్) ప్రకటించకుం డానే ప్రభుత్వం భూ సమీకరణకు శ్రీకారం చుట్టింది. రాజధాని ప్రాంత రైతుల్లో భయాందోళనలు సృష్టిస్తూ.. వారికి ఎలాంటి హామీ లేకుండానే సమీకరణకు తెగబడింది. ఇటీవలి కాలం లో జరిగిన అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో రాజ ధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ) బిల్లు కు చట్టబద్ధత కల్పించే క్రమంలో ఇచ్చిన హామీని ప్రభుత్వం తుంగలో తొక్కింది. సీఆర్డీఏ చట్టానికి అనుగుణంగా రూల్స్ (నియమాలు) వెల్లడించిన తర్వాత వాటిపై తిరిగి అసెంబ్లీలో చర్చిస్తామని అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. సీఆర్డీఏ బిల్లును పురపాలక శాఖ మంత్రి శాసనసభలో ప్రవేశపెట్టినప్పుడు ప్రతిపక్ష నాయకుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. భూములు ఇచ్చే రైతులు, కౌలు రైతులు, రైతు కూలీలు, ఇతరత్రా ఆ ప్రాంతాల్లో జీవనం సాగి స్తున్న ప్రజలకు ఎలాంటి ప్యాకేజీ, పరిహారం చెల్లిస్తారన్న వివరాలు బిల్లులో లేకుండా ఎలా ఆమోదిస్తారని సూటిగా ప్రశ్నించారు. దానిపై సీఎం చంద్రబాబు, ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు జోక్యం చేసుకుని.. ముందు బిల్లు తయారవుతుందని, ఆ తర్వాత విడిగా రూల్స్ (నియమాలు) ఖరారు చేస్తామని, ఆ రూల్స్ మళ్లీ అసెంబ్లీ ముందు చర్చకు కూడా వస్తాయ ని, వాటిపై అభ్యంతరాలుంటే ఆ సమయంలో తెలియజేయాలని చాలా స్పష్టంగా చెప్పారు. సీఆర్డీఏ చట్టం-2014 లోని తొలి చాప్టర్లో గల సెక్షన్ 38 లోనూ రూల్స్ విషయంలో ప్రత్యేకంగా వివరణ ఇచ్చారు. ఈ చట్టానికి అనుగుణంగా మార్గదర్శకాలు తయారు చేసి తిరిగి అసెంబ్లీ ముందుకు వస్తుందని స్పష్టంగా పేర్కొన్నారు. ఆ మేరకు మూజువాణి ఓటుతో సీఆర్డీఏకు చట్టబద్ధత కల్పించుకున్న ప్రభుత్వం ఇప్పుడు ఆ విషయాలను దాటవేసింది. ఉపాధి, పరిహారం ఊసు లేకుండానే... సీఆర్డీఏపై మంగళవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. రైతుల నుంచి భూములు సమీకరించినప్పుడు వారికి నష్టపరిహారాన్ని ఏ విధంగా ఇస్తారు? కౌలు రైతులకు ఇచ్చే ప్యాకేజీ ఏంటి? వ్యవసాయ కూలీలు, ప్రస్తుతం ప్రకటించిన రాజధాని ప్రాంతంలో ఇతర మార్గాల్లో ఉపాధిపై ఆధారపడి ఉన్న కుటుంబాలకు ఎలాంటి పరిహారం చెల్లిస్తారన్నది అధికారికంగా ప్రకటించకుండా.. తయారు చేసిన రూల్స్‌పై మళ్లీ అసెంబ్లీలో చర్చించి ఆమోదించకుండానే అధికారులు రాజధాని ప్రాంతాల్లో భూ సమీకరణపై హడావుడి చేస్తూ రైతులను ఒప్పించే ప్రయత్నం చేయడం ప్రారంభించారు. ఈ నెల 2న జరగనున్న మంత్రిమండలి సమావేశంలో సీఆర్డీఏ రూల్స్‌ను ఖరారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఖరారు చేశాక ఆ మార్గదర్శకాలపై అసెంబ్లీలో చర్చకు పెట్టాలి. అదేమీ లేకుండానే సీఆర్డీఏపై గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన క్షణం నుంచే భూ సేకరణను ప్రారంభించడం విడ్డూరం. అదీ సంక్రాంతిలోగా భూ అంగీకార పత్రాల సేకరణ కూడా పూర్తి చేయాలని లక్ష్యం గా నిర్దేశించడం విస్మయం గొలుపుతోంది. 27 బృందాలు... 300 మంది సిబ్బంది.. సీఆర్డీఏ చట్టం - 2014పై గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన వెంటనే ప్రభుత్వం రైతుల నుంచి భూములను తీసుకోవడానికి ప్రత్యేకంగా 27 బృందాలను ఏర్పాటు చేసింది. దాదాపు 300 మంది అధికారులను ఇందుకోసం ప్రత్యేకంగా నియమించింది. వీటికి తోడు రాజధానికి ఎంపిక చేసిన గ్రామాల్లో రెవెన్యూ సిబ్బంది బృందాలు ప్రవేశించడమే కాకుండా ఆగమేఘాల మీద రైతులను హడావుడి పెట్టారు. ఈ 27 రెవెన్యూ బృం దాలపై పర్యవేక్షణకు 34 మంది డిప్యూటీ కలెక్టర్లను నియమిస్తూ ప్రభుత్వం బుధవా రం జీవో జారీ చేసింది.అలాగే 300 మంది సిబ్బందిని కూడా ఎంపిక చేసింది. భూ సమీకరణకు అధికారం ఎవరిచ్చారు? జస్టిస్ లక్ష్మణరెడ్డి, రిటైర్డ్ హైకోర్టు జడ్జి సీఆర్డీఏ చట్టమైంది కాబట్టి దాని తర్వాత రూల్స్ (నిబంధనలు) రూపొందించాలి. వాటిని అసెంబ్లీకి తీసుకురావాలి. అక్కడ ఆమోదం పొందాక మిగతా కార్యక్రమాలు చేయాలి. ఇటీవల జరిగిన అసెంబ్లీలో ముఖ్యమంత్రి, ఆర్థికమంత్రి కూడా ఇదే చెప్పారు. అయితే ఆయా గ్రామాలకు అధికారులు వెళ్లి ల్యాండ్ పూలింగ్ చేయనున్నామని, తమను ప్రభుత్వం ఆదేశించిందని చెప్పినట్టు ఆయా గ్రామాల ప్రజలు వెల్లడిస్తున్నారు. సెక్షన్ 10 (ఎ) ప్రకారం ప్రభుత్వ అధికారులు ఆయా గ్రామాలకు వెళ్లి భూములు సర్వే చేసుకోవచ్చు. జనాభా లెక్కలు, భూసమీకరణలో ఎన్ని మండలాలు ఉంటాయి, ఎన్ని గ్రామాలు ఉంటాయి, ఇలా అన్నిటిపైనా సర్వే చేసుకోవచ్చు గానీ.. భూసేకరణ చేస్తామంటూ ఏ అధికారంతో వెళతారు?దీనిపై కలెక్టర్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూసేకరణ సవరణ ఆర్డినెన్స్ విజయవాడలో భూసమీకరణకు కూడా వర్తిస్తుందని కొందరు ప్రభుత్వాధికారులు ప్రచారం చేస్తున్నారు. ఇది పట్టణీకరణ విషయంలో వర్తించదు. పాత చట్టమే వర్తిస్తుంది. గ్రామాల్లో మౌలిక వసతులు, ప్రాజెక్టుల నిర్మాణంవంటి వాటికే ఆర్డినెన్స్ తప్పా రాజధాని భూ సమీకరణకు ఇది వర్తించదు. వర్తించదు. పథకం ప్రకారమే సర్కారు వ్యాపారం... బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, శాసనసభ్యుడు, వైఎస్సార్సీపీ సీఆర్డీఏ చట్టంలో రైతులు, రైతు కూలీలు, కౌలు రైతుల ప్రస్తావన ఎందుకు తీసుకురాలేదని అసెంబ్లీ సాక్షిగా నేను, మా పార్టీ అధ్యక్షుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించాం. దీనికి సీఎం, ఆర్థికమంత్రి బదులిస్తూ ముందు చట్టం వస్తుంది ఆ తర్వాత రూల్స్ తెస్తామన్నారు. ఇప్పుడేమో రూల్స్ తేకుండానే ల్యాండ్ పూలింగ్‌కు వెళుతున్నారు. మీరు తేబోతున్న రూల్సేమిటో ఒక్క రైతుకైనా వివరించారా? రోడ్లకు, బలహీన వర్గాలకు, అభివృద్ధి కార్యక్రమాలకు ఎంత స్థలాలు ఇస్తున్నదీ చెప్పిన మీరు, రైతులకు ఎంత ఇస్తున్నది ఎందుకు చెప్పలేకపోయారు? ఎక్కడైనా ఒక చట్టం వచ్చాకే ఎంఓయూ చేసుకుంటారు. కానీ చట్టం ఇంకా అమల్లోకి రాకముందే సింగపూర్ పార్టీతో మీరు ఎలా ఒప్పందం చేసుకుంటారు?. ఒక చిన్న ఉద్యోగానికైనా నిబంధనలు రూపొందించాకే నియామకం చేస్తారు. కానీ 30 వేల ఎకరాల భూములు మీరు లాక్కుంటున్నప్పుడు రైతులకు సమాధానం చెప్పకుండా, ఎలా తీసుకుంటున్నదీ వివరించకుండా చేస్తున్నారంటే మీది వ్యాపారం కాక మరేమనుకోవాలి? రూల్స్ రూపొందించాక,ల్యాండ్ పూలింగ్‌కు వెళితే ప్రభుత్వానికి వచ్చే నష్టమేముంది? దీనివెనుక మతలబు ఉంది కాబట్టే హడావిడిగా అన్నీ చేసేస్తున్నారు. -
రెండు రోజుల్లో సీఆర్డీఏ బిల్లు నిబంధనల నోటిఫికేషన్
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ) బిల్లుకు సంబంధించిన నిబంధనలకు రెండు రోజుల్లో నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు మున్సిపల్ శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు. నోటిఫికేషన్ తర్వాతే భూసమీకరణ పని ప్రారంభిస్తామన్నారు. సీఆర్డీఏ నిబంధనలపై ఏవిధమైన చట్టపరమైన సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అభివృద్ధిని ఓర్పలేకే రాజధాని ప్రాంతంలో పంట పొలాలను దగ్ధం చేశారని మంత్రి ఆరోపించారు. -
సీఆర్డీఏ బిల్లుకు గవర్నర్ ఆమోదం
హైదరాబాద్: ఏపీ రాజధాని ప్రాంతానికి సంబంధించిన కాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ(సీఆర్డీఏ) బిల్లుపై గవర్నర్ నరసింహన్ ఆమోదం లభించింది. ఈ బిల్లుపై ఆయన సంతకం చేశారు. ఏపీ ప్రభుత్వం ఇంగ్రీష్, తెలుగు, ఉర్దూ భాషలలో గజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. 17 చాప్టర్లు, 117 పేజీలతో రూపొందించిన ఈ బిల్లును ఈనెల 22న శాసనసభలో ఆమోదించారు. ఈ బిల్లుపై సుదీర్ఘ చర్చ జరిగిన అనంతరం మూజువాణి ఓటుతో ఆమోదించారు. బిల్లులోని రైతు వ్యతిరేక విధానాలను, భూములు అదనంగా తీసుకోవడాన్ని వైఎస్ఆర్ సీపీ వ్యతిరేకించింది. గుంటూరు జిల్లా తుళ్లూరు, మంగళగిరి మండలాల పరిధిలో ఏపీ కొత్త రాజధానిని నిర్మించనున్న విషయం తెలిసిందే. ఈ రెండు మండలాలలోని 29 గ్రామాలలో ల్యాండ్ పూలింగ్ ద్వారా భూమిని సేకరిస్తారు. -
CRDA బిల్లులో మార్పులు తేవాలి: బివి రాఘవులు
-
భూ సేకరణే రైతులకు లాభం
* రైతు చైతన్యయాత్రలో హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి * సీఆర్డీఏ బిల్లును చూసి అన్నదాతలెవరూ భయపడొద్దు * డబ్బుల్లేకుండా వరల్డ్ క్లాస్ సిటీ ఎందుకట? * బడాబాబులకు దోచిపెట్టేందుకు సర్కారు కుట్ర * రైతులకు న్యాయ సహాయానికి తుళ్లూరు కేంద్రంగా త్వరలో లీగల్ సెల్ సాక్షి, విజయవాడ బ్యూరో: భూ సమీకరణకంటే భూ సేకరణే రాజధాని రైతులకు ప్రయోజనకరమని హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పి. లక్ష్మణ్‌రెడ్డి చెప్పారు. సీఆర్డీఏ బిల్లును చూసి ఎవరూ భయపడాల్సిన పని లేదని రైతులకు ధైర్యం చె ప్పారు. సమీకరణ, సేకరణల్లోని తేడాలను రైతులకు వివరించి వారిని చైతన్యపరిచేం దుకే రాజధాని గ్రామాల్లో చైతన్య యాత్ర నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి నేతృత్వంలోని ఓ బృందం శుక్రవారం రాజ ధాని ప్రాంతంలోని పలు గ్రామాల్లో పర్యటిం చింది. ఉండవల్లి నుంచి బయల్దేరిన ఈ బృందం పెనుమాక, వెంకటపాలెం, మందడం, లింగాయపాలెం, ఉద్దండ్రాయునిపాలెం, తుళ్లూరు, రాయపూడి, నవులూరు గ్రామాల్లోని పొలాలను పరిశీలించింది. రైతులతో మాట్లాడింది. సర్కారుకు భూమలివ్వబోమని అక్కడి రైతులు స్పష్టం చేశారు. అనంతరం రైతు నాయకులు అనుమో లు గాంధీ అధ్యక్షతన మందడంలో రైతులతో జరిగిన సమావేశంలో జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి ప్రసంగించారు. రైతులు ఇష్టపడితేనే ప్రభుత్వం భూ సమీకరణ జరపాల్సి ఉంటుందని చెప్పారు. ఒక వేళ భూ సేకరణ జరిపినా రైతులకు లాభమేనని తెలిపారు. భూ సేకరణ చట్టం ప్రకారం ప్రభుత్వం సేకరించిన భూమిని మూడో వ్యక్తి అమ్మితే ఆ రోజు ధర ఎంత వస్తుందో.., ఆ ధరకు, మొదట రైతుకు చెల్లించిన రేటుకు మధ్య ఉన్న వ్యత్యాసంలో 40 శాతాన్ని రైతులకు చెల్లించాలని తెలిపారు. భూములిచ్చిన ప్రతి కుటుంబానికీ ఉద్యోగమివ్వాల్సిన బాధ్యత కూడా సర్కారుపై ఉందన్నారు. ఈ విషయాలను రైతులకు చెప్పకుండా ప్రభుత్వం భూ సమీకరణ పేరిట బడాబాబులకు ఏజెంటుగా వ్యవహరించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అస లు డబ్బుల్లేకుండా వరల్డ్ క్లాస్ సిటీ ఎందుకని ప్రశ్నించారు. రియల్టర్లు, డెవలపర్ల కోసం ఎందుకు ఏజెంటుగా వ్యవహరించాలని పరోక్షంగా సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. రైతులకు న్యాయపరమైన సలహాలి చ్చేందుకు త్వరలో తుళ్లూరు కేంద్రంగా లీగల్ సెల్‌ను ప్రారంభిస్తామని చెప్పారు. భూ సమీకరణ, భూ సేకరణల్లోని తేడాలపై త్వరలో విస్తృత ప్రచారం చేస్తామని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్ష్యుడు వి.లక్ష్మణ్‌రెడ్డి చెప్పారు. ప్రభుత్వ కుట్రను ఎదుర్కొనేందుకు పార్టీలకు అతీతంగా రైతులంతా ఐక్యంగా ఉద్యమించాలని బీజేపీ కిసాన్ సంఘ్ రాష్ట్ర కార్యదర్శి కుమారస్వామి పిలుపునిచ్చారు. హైకోర్టు న్యాయవాదులు జగన్మోహన్రెడ్డి, శ్యామసుందరి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతులతో ముఖాముఖి జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి మందడం, లింగాయపాలెం, వెంకటపాలెం రైతులతో ముఖాముఖి నిర్వహించారు. రైతులకు కోర్టులపరంగా లభించే న్యాయాన్ని వివరించారు. ఏ సమస్యకు ఏ విధంగా కోర్టును ఆశ్రయించాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో చెప్పారు. ఈ సందర్భంగా లింగాయపాలెం వాసి అనుమోలు హరి లేచి ఎక్కువ మంది భూములివ్వడానికి సుముఖంగా ఉన్నామ ని, తామేం చేయాలో చెప్పాలని ప్రశ్నించా రు. దీంతో అక్కడున్న రైతులు హరిపై మం డిపడ్డారు. రైతులందరి పక్షాన భూములిస్తామని చెప్పడానికి నువ్వెవరంటూ నిలదీశారు. దీంతో గందరగోళం ఏర్పడింది. -
3 నెలల్లో ల్యాండ్ పూలింగ్
* గవర్నర్‌కు చేరిన సీఆర్డీఏ బిల్లు * జనవరి తొలి వారంలో నోటిఫికేషన్ * రైతులు కోర్టుకు వెళ్లకుండా కేవియెట్! సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ) బిల్లుకు రాష్ట్ర శాసనసభ ఆమోదముద్ర వేయడంతో భూ సమీకరణకు ప్రభుత్వం చకచకా పావులు కదుపుతోంది. సీఆర్డీఏ బిల్లు మంగళవారం రాత్రి రాజ్‌భవన్‌కు చేరింది. గవర్నర్ ఆమోద ముద్ర వేయడం లాంఛనమే కావడంతో సాధ్యమైనంత త్వరగా ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను ప్రారంభించి మూడు నెలల్లో పూర్తి చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉంది. రాజధాని నిర్మాణానికి మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు ఆర్నెల్ల గడువు ఉండటంతో ఈలోగా భూ సమీకరణను పూర్తి చేయాలని యోచిస్తోంది. గవర్నర్ ఆమోదం పొందిన వెంటనే జనవరి మొదటి వారంలో భూ సమీకరణకు నోటిఫికేషన్ జారీ చేయాలని సన్నాహాలు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత భూ సమీకరణకు ముందుకు వచ్చే రైతులతో ఒప్పందాలు చేసుకునేందుకు సీఆర్డీఏకు అంతర్గత ఆదేశాలు జారీ అయినట్లు సమాచారం. ఒప్పంద పత్రాలు కూడా వెంటనే రైతులకిచ్చే విధంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇందుకోసం సీఆర్డీఏకు అవసరమైన అధికారుల నియామకాలు చేపడుతున్నారు. మరోవైపు భూ సమీకరణకు విముఖంగా ఉన్న రైతులతోనూ చర్చలు కొనసాగించే ఆలోచన ఉన్నట్లు సమాచారం. ల్యాండ్‌పూలింగ్‌ను వ్యతిరేకించే రైతులు న్యాయస్థానాల్ని ఆశ్రయించే అవకాశం ఉన్నందున ఎలాంటి న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకెళుతోంది. భూ సమీకరణకు నోటిఫికేషన్ జారీ చేసిన వెంటనే ప్రభుత్వమే హైకోర్టులో కేవియెట్ దాఖలు చేయనున్నట్లు ఉన్నత వర్గాల సమాచారం. ప్రభుత్వం హైకోర్టులో కేవియెట్ దాఖలు చేస్తే రైతులు కోర్టుకు వెళ్లినా ప్రభుత్వాన్ని సంప్రదించకుండా కోర్టు ఎటువంటి స్టే ఇచ్చే అవకాశం ఉండదు. న్యాయపరమైన చిక్కులు అధిగమించేందుకు రాజధాని ప్రతిపాదిత ప్రాంతంలోనే లీగల్ అథారిటీని ఏర్పాటు చేసి ప్రభుత్వ న్యాయవాదుల్ని నియమించేందుకు గుంటూరు జిల్లా కలెక్టరును ప్రభుత్వం ప్రతిపాదనలు కోరింది. రాజధాని ప్రతిపాదిత 29 గ్రామాల్లోనూ రెవెన్యూ రికార్డులు, హక్కులు, హద్దులపై ఎలాంటి వివాదాలు లేకుండా పక్కాగా రెవెన్యూ రికార్డులను సిద్ధం చేయడానికి 62 మంది రెవెన్యూ అధికారులను పంపుతోంది. మొత్తమ్మీద సీఆర్డీఏ బిల్లు ఆమోదం తర్వాత సర్కారు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. సింగపూర్‌తో సంప్రదింపులకు 2 కమిటీలు రాజధాని నిర్మాణంపై సింగపూర్ ప్రభుత్వం, అక్కడ ప్రైవేట్ కంపెనీలతో సంప్రదింపులకు రెండు కమిటీలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేశారు. ఈ ఉన్నతస్థాయి కమిటీలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణతోపాటు ప్రణాళికా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్పీ టక్కర్ ఉన్నారు. అలాగే మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎ. గిరిధర్ నేతృత్వంలో వర్కింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. వర్కింగ్ కమిటీలో సీఆర్ డీఏ కమిషనర్ ఎన్.శ్రీకాంత్, టౌన్ ప్లానింగ్ డెరైక్టర్ ఉంటారు. సింగపూర్ కంపెనీలతో రాజధాని మాస్టర్ ప్రణాళిక రూపకల్పనపై కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం మేరకు ఆ కంపెనీలతో సంప్రదింపులను గిరిధర్ నేతృత్వంలోని వర్కింగ్ కమిటీ చేయనుంది. వర్కింగ్ కమిటీ ఎప్పటికప్పుడు సింగపూర్ కంపెనీలు, ప్రభుత్వంతో సమన్వయం చేయనుంది. సింగపూర్ కంపెనీలు అడిగే వివరాలను అందజేయడంతోపాటు మాస్టర్ ప్రణాళిక రూపకల్పనలో వర్కింగ్ కమిటీ సహకరించనుంది. సీఎం నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ సింగపూర్ కంపెనీలు, ప్రభుత్వానికి సంబంధించిన విధానపరమైన నిర్ణయాల గురించి సంప్రదింపులు జరపనుందని అధికార వర్గాలు తెలిపాయి. సీఆర్డీఏకు తుడా టౌన్ ప్లానింగ్ అధికారి సీఆర్డీఏ (రాజధాని ప్రాధికార సంస్థ)కు ఉద్యోగుల డిప్యుటేషన్ల పరంపర మొదలైంది. సీఆర్డీఏకు ఎన్.శ్రీకాంత్ కమిషనర్‌గా ఉన్నారు. ఇప్పుడు కిందిస్థాయి ఉద్యోగుల నియామక ప్రక్రియ మొదలైంది. తాజాగా తుడా (తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ)లో పట్టణ ప్రణాళికాధికారిగా ఉన్న రామకృష్ణారావును నియమిస్తూ మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎ.గిరిధర్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. ఆయన ప్రస్తుతం హెచ్ఎండీఏ (హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ) లో డిప్యుటేషన్‌పై కొనసాగుతున్నారు. తక్షణమే ఈయనను రిలీవ్ చెయ్యాలని, తుడా వైఎస్ చైర్మన్, హెచ్ఎండీఏ కమిషనర్లను కోరారు. ఈయన ఈ పదవిలో రెండేళ్లు కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
సీఆర్డీఏకు ఓకే
* విపక్ష నిరసనల మధ్య బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం * రాజధాని సంస్థ బిల్లుపై అసెంబ్లీలో వాడివేడి చర్చ * రైతులకు మేలు జరుగుతుందనే ల్యాండ్ పూలింగ్ తెచ్చాం * రైతులకు లాటరీ పద్ధతిలో భూములిస్తాం * మొత్తం 27 అంశాలతో నిబంధనలను రూపొందిస్తాం * విపక్ష నేతల మాటలను రైతులెవరూ వినొద్దు: సీఎం చంద్రబాబు * విపక్ష సభ్యుల నిరసనల మధ్య మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందినట్లు స్పీకర్ ప్రకటన * రైతుల భూములతో ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం * టీడీపీ బినామీలు, దళారుల కోసమే ఈ బిల్లు.. * భూ సేకరణ చట్టం ద్వారా సాధ్యం కాదనే ‘ల్యాండ్ ఫూలింగ్’ * రైతులు, కౌలు రైతులు, రైతు కూలీల హక్కులు హరించారు * రైతుల భూముల అభివృద్ధి బాధ్యతను రైతులకు అప్పజెప్పాలి * ఈ బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం: జగన్ రైతుల భూములను బలవంతంగా తీసుకుని వాళ్ల భూములతోనే ప్రభుత్వం నిస్సిగ్గుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోంది. సీఆర్డీఏ బిల్లును పూర్తిగా టీడీపీ బినామీలు, దళారుల కోసమే తెచ్చారు. రైతుల భూములను లాక్కుని, వాళ్లకు ముష్టి పడేసినట్టు కాకుండా అభివృద్ధి బాధ్యతను రైతులకు అప్పచెప్పాలి. -ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ రాజధాని నిర్మాణంపై ప్రతిపక్ష పార్టీ రాజకీయాలు చేస్తోంది. రాజధాని నిర్మాణం జరిగితే టీడీపీకి ఎక్కడ మంచి పేరు వస్తుందోనన్న ఈర్ష్యతో ప్రతిపక్షం రైతుల్లో అపోహలు సృష్టిస్తోంది. భూములిచ్చిన రైతులకు 9 నెలల్లోనే చట్టబద్ధత కలిగిన యాజమాన్య ధ్రువపత్రాలు ఇస్తాం. మూడేళ్లలో అభివృద్ధి చేసిన భూములిస్తాం. - ఏపీ సీఎం చంద్రబాబు సాక్షి, హైదరాబాద్: రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ) బిల్లుకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆమోదం తెలిపింది. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల నిరసన మధ్య.. సీఆర్డీఏ బిల్లు మూజువాణి ఓటుతో ఆమోదం పొందినట్టు సభాపతి కోడెల శివప్రసాదరావు ప్రకటించారు. ఈ బిల్లుకు స్పీకర్ సభ ఆమోదం కోరినప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు పలువురు ఈ బిల్లు రైతులకు ఏమాత్రం ప్రయోజనకరంగా లేదంటూ దాని ప్రతులను చించి సభలో నిరసన తెలిపారు. సోమవారం సాయంత్రం శాసనసభ సమావేశమైనప్పుడు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ సభలో సీఆర్డీఏ బిల్లును ఆమోదించాల్సిందిగా కోరారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిదిన్నర వరకు బిల్లుపై చర్చ అనంతరం మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందింది. అధికార తెలుగుదేశం పార్టీతో పాటు, భాగస్వామి పార్టీగా ఉన్న బీజేపీ ఈ బిల్లుకు మద్దతు ప్రకటించగా.. బిల్లులో పొందుపరిచిన అంశాలు రైతులకు నష్టం చేసేలా ఉన్నాయంటూ, బిల్లును తాము వ్యతిరేకిస్తున్నామని ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. బిల్లు ప్రభుత్వం, భూ అభివృద్ధికి ఉద్దేశించిన వారి హక్కులను మాత్రమే కాపాడేలా ఉందని, అందులో రైతుల ప్రయోజనాలను పూర్తిగా విస్మరించారని ఆ పార్టీ విమర్శించింది. అంతకుముందు అధికార, ప్రతిపక్షాల మధ్య బిల్లుపై వాడివేడి చర్చ జరిగింది. సీఆర్డీఏ పేరుతో ప్రభుత్వం పూర్తిగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని వైఎస్సార్ సీపీ మండిపడింది. చర్చలో పాల్గొన్న వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు బిల్లులో పేర్కొన్న అంశాలు అనుమానాస్పదంగా ఉన్నాయని, నయా పైసా పెట్టుబడి లేకుండా రైతుల నుంచి వేలాది ఎకరాలు కైంకర్యం చేస్తున్నారని విమర్శించింది. విపక్షం మాటలు వినొద్దని అధికార పక్షం కోరింది. సుదీర్ఘ చర్చపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చివరగా సమాధానమిచ్చారు. విపక్ష నేత జగన్ చేసిన పలు సూచనలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోకుండానే బిల్లును ఆమోదించాలని సభను కోరింది. రాజకీయాలు చేస్తున్నారు: బాబు రాజధాని నిర్మాణంపై ప్రతిపక్ష పార్టీ రాజకీయాలు చేస్తోందని, రాజధాని నిర్మాణం జరిగితే తెలుగుదేశం పార్టీకి ఎక్కడ మంచి పేరు వస్తుందోనన్న ఈర్ష్యతో ప్రతిపక్షం రైతుల్లో అపోహలు సృష్టిస్తోందని సీఎం చంద్రబాబు విమర్శించారు. వైఎస్సార్ కాం గ్రెస్ పార్టీకి రాజధానిపై స్పష్టత లేదన్నారు. ‘‘విభజన సమయానికి రూ. 16 వేల కోట్ల లోటులో రాష్ట్రం ఉంది, క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాం, ఈ పరిస్థితుల్లో అందరూ సహకరించాలి’’ అని పేర్కొన్నారు. ల్యాండ్ పూలిం గ్ విధానం ద్వారా రైతులకు మేలు జరుగుతుందనే ఉద్దేశంతోనే ఈ విధానాన్ని తీసుకొచ్చినట్టు చెప్పారు. త్వరలోనే రైతులందరి భూములను నోటిఫై చేసి, ఆ వెంటనే ఏ రైతు భూమి ఎంతో ప్రకటించి, సమీకరణకు వెళతామన్నారు. రైతులకు, కౌలుదారులకు, రైతుకూలీలకు మేలు జరగాలనే ఉద్దేశంతోనే అందరికీ నచ్చే ప్యాకేజీని ఇచ్చామని సమర్థించుకున్నారు. మెట్ట ప్రాంతానికి ఎకరాకు వెయ్యి గజాలు నివాస స్థలం, 200 గజాలు వాణిజ్య స్థలం ఇచ్చామని, జరీబు భూమికి 1000 గజాలు నివాస స్థలం, 300 గజాలు వాణిజ్య స్థలంలో ఇచ్చామని, అసైన్డ్ భూములకు 800 గజాలు నివాస స్థలం, 300 గజాలు వాణిజ్య సముదాయంలో ఇస్తున్నామని పేర్కొన్నారు. భూములిచ్చిన రైతులకు 9 నెలల్లోనే చట్టబద్ధత కలిగిన యాజమాన్య ధృవపత్రాలు ఇస్తామని, మూడేళ్లలో అభివృద్ధి చేసిన భూములు ఇస్తామని చెప్పారు. భూములిచ్చి న రైతులకు స్టాంపు, నాలా, రిజిస్ట్రేషన్ల విషయంలో వన్‌టైమ్ పద్ధతిన మినహాయింపు ఇస్తామన్నారు. భూమిలేని కుటుంబాలు 12 వేలకు పైగా ఉన్నాయని, వారికి కూడా నెలకు రూ. 2,500 చొప్పున పదేళ్ల పాటు వేతనం ఇస్తామని పేర్కొన్నారు. దేవాదాయ భూములకు చెందిన భూముల పరిహారం ఆయా దేవాలయాలకే ఇస్తామన్నారు. అభివృద్ధి చేసిన భూముల్లో రైతులు గ్రూపులుగా వచ్చినా, విడివిడిగా ఇచ్చినా వారికి లాటరీ పద్ధతిలో పారదర్శకంగా భూములిస్తామన్నారు. సీఆర్డీఏ పరిధిలో ఉన్న భూములను కొనుగోలు, అమ్మకాలకు ఎలాంటి ఇబ్బందీ రాకుండా రిజిస్ట్రేషన్లు యథావిధిగా కొనసాగిస్తామన్నారు. మొత్తం 27 అంశాలతో నిబంధనలను రూపొం దించనున్నామని, చట్టం చేశాక రూల్స్ అసెంబ్లీ ఆమోదానికి వస్తాయని పేర్కొన్నారు. రాజధాని నిర్మాణానికి రూ. 5 లక్షల కోట్లు అవసరమవుతుందని, ప్రపంచస్థాయి నగరాన్ని నిర్మించనున్నామని చెప్పారు. ధైర్యముంటే ఇక్కడ రాజధాని ప్రాంతం వద్దని చెప్పాలని విపక్షాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష పార్టీ నేతల మాటలు రైతులెవరూ వినవద్దని, రైతులందరికీ తాను అండగా ఉంటానని, సొంత ఇళ్లు నిర్మిస్తున్నట్టు భావించి రాజధాని నిర్మాణానికి అందరూ సహకరించాలని ఆయన కోరారు. దళారుల కోసమే పూలింగ్ విధానం: జగన్ రైతుల భూములను బలవంతంగా తీసుకుని వాళ్ల భూములతోనే ప్రభుత్వం నిస్సిగ్గుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని ప్రతిపక్ష నాయకుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి తీవ్రంగా ఆక్షేపించారు. సీఆర్డీఏ బిల్లును పూర్తిగా తెలుగుదేశం పార్టీ బినామీలు, దళారుల కోసమే ఏర్పాటు చేశారని ఘాటుగా విమర్శించారు. ల్యాండ్ పూలింగ్ విధానాన్ని అనుసరించడంలో చంద్రబాబుకు రైతులపై ప్రేమతో కాదని, భూసేకరణ చట్టం ద్వారా అయితే, రైతులకు ఎక్కువ మొత్తం చెల్లించాల్సి వస్తుందని, అందులోనూ ఆ భూములన్నీ ఏడాదికి మూడు పైర్లు పండే సారవంతమైన భూములు కాబట్టి ఈ పరిస్థితుల్లో భూములు తీసుకోలేకనే ల్యాండ్ పూలింగ్ విధానాన్ని తీసుకొచ్చారని ఆయన ఎండగట్టారు. ల్యాండ్ పూలింగ్ విధానమంటూ బాబు రైతులపై కథ బ్రహ్మాండంగా చెప్పుకొచ్చారని ఎద్దేవా చేశారు. ఇందులో రైతులకు, కౌలు రైతులకు, రైతు కూలీలకు ఎలాంటి హక్కులు లేకుండా చేసి, సర్వాధికారాలు ప్రభుత్వం చేతుల్లో ఉండేలా చేశారంటే రైతుల పరిస్థితి ఏమిటనేది ఊహించుకోవచ్చునన్నారు. రైతులకు 12,500 ఎకరాలేనా? రాజధాని ప్రాంతంలో రైతుల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి ఇంతకన్నా ఉదాహరణ మరొకటి ఉండదని జగన్ ధ్వజమెత్తారు. 50 వేల ఎకరాల భూములు సేకరిస్తుంటే అందులో 25 వేల ఎకరాలు రోడ్లు, పార్కులు, స్కూలు, బలహీన వర్గాలకు తదితర వాటికి కేటాయిస్తుంటే మిగిలిన 25 వేల ఎకరాల్లో రైతులకు ఇస్తున్నది 12,500 ఎకరాలేనన్నారు. అంటే మిగతా 12,500 ఎకరాలను ప్రభుత్వం లాక్కుని వ్యాపారం చేస్తున్నట్టు కాదా అని ప్రశ్నించారు. రైతులు తమ భూములను ఏ డెవలపర్‌కు ఇచ్చినా అభివృద్ధికి మినహాయించి 70 శాతం భూముని ఇస్తారని, కానీ ప్రభుత్వం చేస్తున్నదేమిటని నిలదీశారు. ‘‘రైతులకు రావాల్సిన భూమిని తక్కువగా ఇచ్చి.. మీరు, మీ బినామీలు తీసుకునేందుకే ఇదంతా చేస్తున్నారు. ఇది ల్యాండ్ పూలింగ్ కాదు.. ‘ల్యాండ్ ఫూలింగ్’’ అని ధ్వజమెత్తారు. అభివృద్ధి బాధ్యత రైతులకే అప్పజెప్పండి రైతుల భూములు ప్రభుత్వం లాక్కుని, వాళ్లకు ముష్టి పడేసినట్టు కాకుండా అభివృద్ధి బాధ్యతను రైతులకు అప్పజెప్పాలని జగన్మోహన్రెడ్డి ప్రభుత్వానికి సూచించారు. రోడ్లు తదితర అభివృద్ధి మేరకు ప్రభుత్వం చేపట్టి, మిగతా భూములను రైతులకిస్తే ఆ అభివృద్ధి వారే చేసి చూపించగలరనిఆయన పేర్కొన్నారు. రాజధానిని ఎప్పుడూ వ్యతిరేకించలేదు విజయవాడ పరిసరాల్లో రాజధాని నిర్మాణం చేపట్టడాన్ని తానెప్పుడూ వ్యతిరేకించలేదని, కానీ ప్రభుత్వం చేపట్టిన విధానాలనే తప్పు పడుతున్నామని జగన్ పునరుద్ఘాటించారు. మంగళగిరిలో 10 వేల ఎకరాలు, వినుకొండలో 11 వేల ఎకరాలు ప్రభుత్వ భూములున్నట్టు తమ శాసనసభ్యులు చెప్పారని, అలాంటి ప్రభుత్వ భూములను వినియోగించుకుని రాజధాని నిర్మాణం చెయ్యకుండా.. మూడు పైర్లు పండే భూములను తీసుకుని ఎందుకు వ్యాపారం చేయదల్చుకుంటున్నారని ప్రశ్నించారు. ఈ బిల్లును తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్టు జగన్మోహన్రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. -
సిఆర్డిఏ బిల్లుని ఆమోదించిన ఏపీ శాసనసభ
హైదరాబాద్: కాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ(సీఆర్డీఏ) బిల్లును ఈరోజు శాసనసభలో ఆమోదించారు. ఈ బిల్లుపై సుదీర్ఘ చర్చ జరిగిన అనంతరం మూజువాణి ఓటుతో ఆమోదించారు. బిల్లులోని రైతు వ్యతిరేక విధానాలను, భూములు అదనంగా తీసుకోవడాన్ని వైఎస్ఆర్ సీపీ వ్యతిరేకించింది. గుంటూరు జిల్లా తుళ్లూరు, మంగళగిరి మండలాల పరిధిలో ఏపీ కొత్త రాజధానిని నిర్మించనున్న విషయం తెలిసిందే. ఈ రెండు మండలాలలోని 29 గ్రామాలలో ల్యాండ్ పూలింగ్ ద్వారా భూమిని సేకరిస్తారు. 17 చాప్టర్లు, 117 పేజీలతో సీఆర్డీఏ బిల్లును రూపొందించారు. -
సిఆర్ డిఏ బిల్లుని ఆమోదించిన ఏపీ అసెంబ్లీ!
-
సిఆర్డిఏ బిల్లుకు మాత్రమే వ్యతిరేకం.., రాజధానికి కాదు!
-
'ప్రతిపక్షం సలహాలిస్తే పరిశీలిస్తాం'
హైదరాబాద్: ప్రభుత్వంలోని ప్రతిపక్షం సలహాలిస్తే.. పరిశీలిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. సోమవారం సీఆర్డీఏ బిల్లు చర్చ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు.. ఏపీలో ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైఎస్సార్ సీపీ సలహాలిస్తే తాము తప్పకుండా పరిశీలిస్తామన్నారు. చట్టాలను జనరల్ గా చేస్తారని.. తరువాత దానికి సంబంధించిన రూల్స్ ఫ్రేమ్ చేస్తారన్నారు. మంత్రి నారాయణ సీఆర్డీఏ బిల్లును ప్రవేశపెట్టిన అంశాలు ప్రభుత్వం చెప్పిన వాటిలో లేవని జగన్ స్పష్టం చేయగా.. చంద్రబాబు తన అసహనం వ్యక్తం చేశారు. ఎవరైనా మాట్లాడితే రూల్స్ తెలుసుకుని మాట్లాడాలన్నారు. మంత్రి నారాయణ ఏదో నేరం చేసినట్లు మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. మంత్రి చెప్పినవన్నీ రూల్స్ పరిధిలోకి వస్తాయని బాబు తెలిపారు. -
'ప్రభుత్వం చెప్పినవన్నీ సీఆర్డీఏ బిల్లులో లేవు'
హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పినవన్నీ సీఆర్డీఏ బిల్లులో లేవని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం శాసససభలో మంత్రి నారాయణ సీఆర్డీఏ బిల్లును ప్రవేశపెట్టిన అనంతరం జగన్ మాట్లాడారు. బిల్లులో ఒకటి.. మాటల్లో ఒకటి ఉంటే అర్ధం ఏమిటని ఆయన ప్రశ్నించారు. అసలు మంత్రి నారాయణ చెప్పినవన్నీ సీఆర్డీఏ బిల్లులో లేవని జగన్ తెలిపారు. వైఎస్సార్ సీపీ సభ్యులకు ఇచ్చిన డాక్యుమెంట్ లో ఏ విషయమూ లేదన్నారు. ఏ విషయమూ లేకుండా చర్చలో ఎలా పాల్గొనాలని జగన్ ప్రభుత్వాన్ని నిలదీశారు. రైతులకు ఏమిస్తున్నారో ఎమ్మెల్యేలకు ఇచ్చిన 120 డాక్యుమెంట్లలో అయితే లేవని జగన్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. -
ఇది లక్ష కోట్ల కబ్జా!
-
ఇది లక్ష కోట్ల కబ్జా!
* రాజధాని పేరుతో రైతుల నిలువు దోపిడీకి సర్కారు స్కెచ్ * పైసా పెట్టుబడి లేకుండా 10 వేల ఎకరాల భూముల కైవసం * రైతుల నుంచి తీసుకున్న భూముల అభివృద్ధి పేరుతో 50 శాతం లాగేసుకుంటున్న ప్రభుత్వం * ఎక్కడైనా అభివృద్ధికి తీసుకునేది 40 శాతమే.. అదనంగా 10% భూములు తీసుకుంటున్న సర్కారు * ఇలా 50 వేల ఎకరాల భూమిలో పది శాతమంటే ఐదు వేల ఎకరాల భూమి చంద్రబాబు సర్కారు గుప్పిట్లోకి * ఇక అభివృద్ధి చేసిన తర్వాత మిగిలిన భూమిలో యజమానికి 70 శాతం, డెవలపర్‌కు 30 శాతం వాటా దక్కాలి * రాజధాని ప్రాంతంలో యజమానికి 50 శాతం, డెవలపర్‌కు 50 శాతం అంటూ కైవసం చేసుకుంటున్న సర్కారు * ఇలా రైతుల వాటాలోంచి మరో ఐదు వేల ఎకరాల భూమిని తానే సొంతం చేసుకునేలా చట్టంలో నిబంధనలు * అభివృద్ధి చేసిన భూమిలో 10,000 ఎకరాలు సర్కారుకు * మొత్తం 4.84 కోట్ల గజాల భూమి.. గజం రూ. 25 వేల ధర చొప్పున లెక్కించినా లక్షా ఇరవై వేల కోట్ల రూపాయల పైనే * ఈ భూముల్లో అభివృద్ధి పనుల కాంట్రాక్టులన్నీ అయిన వారికీ, బినామీలకు కట్టబెట్టేందుకు చట్టంలోనే ఏర్పాట్లు సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రాజధాని నిర్మించే పేరుతో లక్ష కోట్ల రూపాయలకు పైగా భూ దోపిడీకి రంగం సిద్ధమైంది. ఈ దోపిడీకి అవసరమైన సాంకేతిక ఏర్పాట్లన్నిటినీ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ) బిల్లులో చంద్రబాబు సర్కారు పొందుపరిచింది. రైతుల నుంచి ‘సమీకరించిన’ భూమిలో సగం భూమిని అభివృద్ధి పేరుతో లాగేసుకోవటమే కాక.. మిగిలిన సగం భూమి లో భూముల యజమానులైన రైతుల వాటా కింద సగం మాత్రమే ఇస్తామని స్పష్టం చేసింది. అంటే.. రాజధాని కోసం తీసుకుంటున్న 50 వేల ఎకరాల భూముల్లో వాటి యజమానులైన రైతుల వాటా కింద వారికి దక్కేది పావు వంతు.. అంటే కేవలం 12,500 ఎకరాలు మాత్రమే. మరి.. ప్రభుత్వం చేజిక్కించుకునే భూమి.. 22,500 ఎకరాలుగా లెక్క తేలుతోంది. భూమిని తీసుకుని అభివృద్ధి చేసే ఎంత పెద్ద డెవలపర్లయినా న్యాయంగా తీసుకునే వాటాకన్నా.. 10 వేల ఎకరాలు ఎక్కువ. అంటే.. పూర్తిగా అభివృద్ధి చేసిన పది వేల ఎకరాల భూమి.. మొత్తం 4.84 కోట్ల గజాల భూమి.. ప్రభుత్వం పైసా పెట్టుబడి లేకుండా కబ్జా చేయబోతోంది. ఈ భూమికి కనిష్టంగా గజం రూ. 25,000 చొప్పున ధర చొప్పున లెక్కించినా కూడా లక్ష కోట్ల రూపాయలు దాటిపోతుంది. అంతేకాదు.. రాజధాని ప్రాంతంలో ఏ పని చేపట్టాలన్నా, ఏ కంపెనీ పెట్టాలన్నీ అనుమతి తీసుకోవాల్సింది సీఆర్డీఏ నుంచే. సీఆర్డీఏ తలచుకుంటే ఏ కంపెనీనైనా రంగంలోకి దించగలదు. ఈ విధంగా అప్పనంగా పది వేల ఎకరాల భూములు చేజిక్కుంచుకోవటమే కాకుండా.. వాటిపై సర్వాధికారాలూ తన సారథ్యంలోని సీఆర్డీఏకే కట్టబెట్టటం ద్వారా.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన అనుయాయులు, తన బినామీలు, తనకు కావలసిన అందరినీ రంగంలోకి దించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. సర్కారు రైతుల నుంచి అన్యాయంగా లాగేసుకుంటున్న భూముల అభివృద్ధి విషయంలో బిల్లులో ఎలాంటి నియమ నిబంధనలు పెట్టకపోవడమే అందుకు నిదర్శనం. మామూలు డెవలపర్ నుంచి పేరుమోసిన డెవలపర్లు సైతం ఎక్కడా ఇలాంటి మోసాలకు పాల్పడిన దాఖలాలు లేవు. అభివృద్ధి పేరుతో ఐదు వేల ఎకరాలు కబ్జా... ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన సీఆర్డీఏ బిల్లును ఆసాంతం పరిశీలిస్తే రైతులు దారుణంగా దోపిడీకి గురవుతున్నారన్న విషయం స్పష్టమవుతోంది. రాజధాని పేరుతో మరోవైపు పైసా పెట్టుబడి లేకుండా వేలాది ఎకరాల రైతుల భూములను సర్కారు కబ్జా చేయనుంది. మామూలు రియల్ ఎస్టేట్ వ్యాపారులు చేసుకునే ఒప్పందాలైనా, డెరైక్టరేట్ ఆఫ్ కంట్రీ అండ్ టౌన్ ప్లానింగ్ (డీటీసీపీ) నిబంధనల మేరకైనా.. అభివృద్ధి కోసం ఇచ్చిన భూమిలో 40 శాతం డెవలప్మెంట్ (రోడ్లు, డ్రైనేజీ, పార్కులు వగైరా) కోసం ప్రభుత్వానికి వదిలేస్తారు. అయితే రాజధాని కోసం దాదాపు 50 వేల ఎకరాలను సమీకరించడానికి సన్నద్ధమవుతున్న చంద్రబాబు ప్రభుత్వం మాత్రం అభివృద్ధి పేరుతో ఏకంగా 50 శాతం భూములను లాగేసుకుంటుంది. ఈ 50 వేల ఎకరాల్లో అదనంగా పది శాతమంటే 5 వేల ఎకరాలు. ఎకరాకు 4,840 గజాల చొప్పున 2,42,00,000 గజాల భూమిని అన్యాయంగా లాగేసుకుంటోంది. వాటాలో కోతతో మరో ఐదు వేల ఎకరాలు కైవసం... అలాగే డెవలప్ చేసిన తర్వాత మిగిలిన భూముల్లో సర్వసాధారణంగా దేశమంతా నడుస్తున్న పద్ధతిలో అయితే భూ యజమానికి 70 శాతం ఇవ్వాల్సి ఉంటుంది. మిగిలిన 30 శాతం మాత్రమే డెవలపర్ ఆ భూములను డెవలప్ చేసినందుకు గాను తీసుకుంటారు. కానీ రాజధాని పేరుతో ప్రభుత్వం అడ్డగోలు వ్యవహారానికి తెరలేపింది. రైతులకు 70 శాతం కాకుండా 50 శాతం మాత్రమే ఇస్తామని సీఆర్డీఏ బిల్లులో పెట్టింది. డెవపల్‌మెంట్ పేరుతో 10 శాతం భూములను ముందుగానే లాగేసుకుంటున్న ప్రభుత్వం మిగిలిన భూముల్లోనూ దోపిడీకి దిగింది. 50 వేల ఎకరాల్లో అభివృద్ధికి 50 శాతం పేరుతో తీసివేయగా మిగిలిన 25 వేల ఎకరాల్లో న్యాయంగా (70 శాతం) అయితే రైతులకు 17,500 ఎకరాలు ఇవ్వాలి. మిగిలిన (30 శాతం) 7,500 ఎకరాలు మాత్రమే అభివృద్ధి చేసినందుకుగాను డెవలపర్‌గా ప్రభుత్వం తీసుకోవాలి. కానీ ఇక్కడా 50:50 నిష్పత్తిలో రైతాంగానికి అన్యాయమే చేస్తున్నారు. రైతులకు 12,500 ఎకరాలు ప్రభుత్వానికి 12,500 ఎకరాల చొప్పున కేటాయిస్తామని సీఆర్డీఏ బిల్లులో స్పష్టంగా పేర్కొన్నారు. పైసా ఖర్చు లేకుండా పది వేల ఎకరాలు సొంతం... భూముల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన కోసమంటూ అదనంగా ఐదు వేల ఎకరాలు లాగేసుకుంటున్న ప్రభుత్వం.. ఆ తర్వాత ఆ సౌకర్యాలు కల్పించిన భాగస్వామిగా మరో ఐదు వేల ఎకరాలు అప్పనంగా రైతుల నుంచి కైవసం చేసుకుంటోంది. ఈ లెక్కన మొత్తంగా పది వేల ఎకరాల భూమి.. అంటే 4.84 కోట్ల గజాల భూమిని.. పైసా పెట్టుబడి లేకుండా ప్రభుత్వం కాజేస్తోంది. రాజధాని ప్రాంతంలో ప్రభుత్వం చెబుతున్న ధర మేరకు గజానికి 25 వేల లెక్క చూసుకున్నా లక్షా ఇరవై వేల కోట్ల విలువైన భూములు అన్యాయంగా అదనంగా ప్రభుత్వం కాజేస్తోంది. ఇలా భారీ కుంభకోణానికి పూర్వరంగం సిద్ధం చేసుకుంది. కార్పొరేట్లకు కట్టబెట్టే అవకాశం... భూ సమీకరణలో భూముల అభివృద్ధి పనులు చేపట్టడానికి లెసైన్స్ పొందిన ఏదైనా జాతీయ, అంతర్జాతీయ ఏజెన్సీకి కట్టబెట్టడానికి సీఆర్డీఏ బిల్లులో వె సులుబాటు కల్పించారు. ఇప్పటికే సింగపూర్ లాంటి దేశాలకు చెందిన సంస్థలతో మాస్టర్ ప్రణాళిక సిద్ధం చేయిస్తున్న ప్రభుత్వం రేపటి రోజున అభివృద్ధి పేరుతో ‘జాతీయ, అంతర్జాతీయ’ కార్పొరేట్ సంస్థలకు ద్వారాలు తెరవడానికి ఈ బిల్లు అవకాశం కల్పిస్తోంది. రాజధాని ప్రాంతంలో భూములు అభివృద్ధి చేయడానికి ఆయా సంస్థలు సీఆర్డీఏకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. ఇక్కడే ప్రభుత్వం తన యుక్తిని ప్రదర్శించి తనకు కావాల్సిన వారికి డెవలప్మెంటు బాధ్యతలు అప్పగించే విధంగా సీఆర్డీఏ బిల్లు తొమ్మిదో చాప్టర్లోని 54వ సెక్షన్లో పొందుపరిచింది. డెవలప్మెంటు సంస్థ దరఖాస్తు చేసుకునే ముందే సీఆర్డీఏ కమిషనర్ నుంచి లెసైన్సు పొందాలనే నిబంధన ‘సొంత ప్రయోజనాల’ పరిరక్షణకేనని కచ్చితంగా తెలుస్తోంది. ప్రజలపై చట్టాల ప్రయోగం... రాజధానికి ఎంపిక చేసిన ప్రాంతంలో ఎలాంటి స్థిర, చరాస్తులైనా సేకరించే అధికారాన్ని సీఆర్డీఏకు కట్టబెట్టారు. ఈ విషయంలో రైతులకు ప్రశ్నించే అధికారాలు లేవు. రేపటి రోజున రైతులు, ఆ ప్రాంత పరిధిలో నివశించే అందరూ ప్రతి విషయంలోనూ ప్రభుత్వ అనుమతి తీసుకోవడం తప్పనిసరి చేశారు. అలాగే ప్రభుత్వం అభివృద్ధి పరిచిన ప్రాంతంలో రైతులు, అక్కడ నివాసం ఉండే వారిపై భారీ స్థాయిలో లెసైన్స్ ఫీజులు, యూజర్ చార్జీల భారం వేయనున్నారు. ఆంక్షలు, పరిమితులు, అనుమతుల పేరుతో ఒకరకంగా ఆ ప్రాంత ప్రజలంతా ప్రభుత్వ అనుమతి లేనిదే ఒక్క అడుగు కూడా ముందుకు వేయని ఒకరకమైన ఎమర్జెన్సీ పరిస్థితులకు ఈ బిల్లు వీలు కల్పిస్తోంది. సీఆర్డీఏ కమిషనర్‌కు బిల్లులో విశేష అధికారాలను కల్పించారు. కమిషనర్ తీసుకునే నిర్ణయాలు, జారీ చేసే ఉత్తర్వులపై ఎవరూ కూడా ఏ న్యాయస్థానంలోను అప్పీల్ చేయరాదని బిల్లులో పేర్కొన్నారు. సీఆర్డీఏ కమిషనర్ అనుమతి లేనిదే రాజధాని ప్రాంతంలో ఏదీ చేయరాదు. సొంత ఇళ్లు, భవనాల్లో గానీ ఎటువంటి మార్పులు చేయరాదు. సొంత భూమిలో ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టరాదు. కమిషనర్ అనుమతికి విరుద్ధంగా ఎవరైనా అభివృద్ధి పనులను చేపడితే మూడేళ్ల పాటు జైలు శిక్షతో పాటు ఆ భూమి విలువలో 20 శాతం జురిమానా విధిస్తారు. చట్టం ప్రకారం నిర్ధారించిన వ్యక్తిని భూమి, భవనాల్లోకి అనుమతించకుండా అడ్డంకులు సృష్టిస్తే అలాంటి వారికి ఆరు నెలల పాటు జైలు శిక్షతో పాటు పది వేల రూపాయలు జరిమానా విధిస్తారు. -
రైతులతో 'సీఆర్డీఏ' క్రీడ: చర్చ
-
'ఆహార భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం'
హైదరాబాద్:జాతీయ భూసేకరణ చట్టానికి విరుద్ధంగా సీఆర్డీఏ బిల్లును రూపొందించారని ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి విమర్శించారు.ఆ బిల్లు వ్యవహారంలో చంద్రబాబు సర్కార్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రాజధాని వెయ్యి ఎకరాలు సరిపోతాయని.. 35 వేల ఎకరాలు అవసరం లేదని ఈ సందర్భంగా రఘువీరా స్పష్టం చేశారు. ఏటా వెయ్యి కోట్ల విలువైన మూడు పంటలు పండే ప్రభుత్వం లాక్కుంటే ఆహారభద్రతకు ముప్పు వాటిల్లుతుందన్నారు. ప్రభుత్వం సేకరించాలనుకుంటున్న భూముల్లో బహుళ అంతస్థులు నిర్మించడం సరికాదనేది నిపుణుల అభిప్రాయంగా రఘువీరా పేర్కొన్నారు. ఒకవేళ అలా నిర్మిస్తే అక్కడ భూకంపాలు వచ్చే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు శివరామకృష్ణన్ కమిటీ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ బిల్లును సమగ్రంగా చర్చించాకే ఆమోదించాలని రఘువీరా సూచించారు. ఏటా వెయ్యి కోట్ల పంటలు పండే భూములను ప్రభుత్వం లాక్కుంటే ఆహారభద్రతకు ముప్పువాటిల్లే ప్రమాదముందన్నారు. రైతుల భూమిని లాక్కునే హక్కు ప్రభుత్వానికి లేదని ఆయన అన్నారు. భవిష్యత్ తరాలకు సంబందించి రాజధాని అంశంపై జాగ్రత్తగా వ్యవహరించకపోతే ప్రస్తుత ఎమ్మెల్యేలను ప్రజలు తప్పుబడతారన్నారు. ప్రభుత్వ భూములుండగా మరలా రైతుల నుంచి లాక్కోవడం ఎందుకని ప్రశ్నించారు. రైతులు భూములు ఇవ్వకపోతే ఆ భూములను గ్రీన్ బెల్ట్ గా ప్రకటిస్తామనడం బ్లాక్ మెయిల్ చేయడమే అవుతుందన్నారు. -
రాజధాని బిల్లులోని ప్రధానాంశాలివే!
-
సీఆర్డీఎ బిల్లును ప్రవేశ పెట్టిన ప్రభుత్వం
-
'మార్చిలోగా ప్రత్యేక హోదాపై తెలిసిపోతుంది'
హైదరాబాద్: రాష్ట్ర రాజధానికి సంబంధించిన సీఆర్డీఎ బిల్లు సభలో ప్రవేశపెట్టామని ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు శనివారం అసెంబ్లీలో తెలిపారు. ఈ బిల్లు సభ ఆమోదం పొందాక గవర్నర్ దగ్గరకు వెళ్తుందని అన్నారు. గవర్నర్ ఆమోదం పొందాక భూసేకరణకు నోటిఫికేషన్ ఇస్తామని వెల్లడించారు. భూసేకరణ సమయంలో భూములు ఇస్తున్నట్లు రైతుల నుంచి అఫిడవిట్లు తీసుకుంటామన్నారు. వీజీటీఎం పరిధిలోని ఆస్తులు, అప్పులు సీఆర్డీఏ పరిధిలోకి వస్తాయని చెప్పారు. ప్రత్యేక హోదాపై కేంద్ర నిర్ణయం వచ్చే ఏడాది మార్చిలోపు తెలిసిపోతుందని యనమల తెలిపారు. -
సీఆర్డీఏ బిల్లులో సవరణలకు ఆమోదం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ముగిసింది. బుధవారం సాయంత్రం నాలుగు గంటల పాటు జరిగిన సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. సీఆర్డీఏ బిల్లులో సవరణలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. యూనివర్సిటీ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62 పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మార్కెట్ యార్డులలో సభ్యుల సంఖ్య 19 పెంచాలని కూడా నిర్ణయించింది. అటవీ చట్టంలో సవరణలకూ మంత్రిమండలి ఆమోదం తెలిపింది. పంటల రుణమాఫీ, అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సమావేశంలో చర్చించారు.